Guava
-
జామపండుతో ఎన్నో వ్యాధులు నివారణ..!
విటమిన్–సి అనేక వ్యాధులను నివారిస్తుందన్న విషయం తెలిసిందే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... చాలామంది అనుకునేదానికి భిన్నంగా నారింజ వంటి పండ్లతో పోలిస్తే జామపండులో ఉండే విటమిన్–సీ మోతాదులు ఇంకా ఎక్కువ. అందుకే జామ అనేక వ్యాధులను సమర్థంగా నివారిస్తుంది. టొమాటోలో ఉన్నట్లుగానే జామపండులోనూ లైకోపిన్ మోతాదులు చాలా ఎక్కువ అనేది యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మాట. ఈ ‘లైకోపిన్’ అనే పోషకం...ప్రోస్టేట్ క్యాన్సర్ తోపాటు చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఉదాహరణకు ఈసోఫేజియల్ క్యాన్సర్, పెద్దపేగు కేన్సర్లను జామపండు సమర్థంగా నివారిస్తుంది. పచ్చికాయ కంటే కాస్తంత ముగ్గిన జామపండులో పీచు (ఫైబర్) మోతాదులు చాలా ఎక్కువ. దాంతో అది మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొద్దున్నే సాఫీగా మల విసర్జన జరగడమనే మంచి శానిటరీ హ్యాబిట్‌తో చాలా రకాల జబ్బులు నివారితమవుతాయన్నది తెలిసిందే. అంతేకాదు జామలో పొటాషియమ్ కూడా ఎక్కువే కావడం వల్ల అది హైబీపీ నివారణకూ తోడ్పడుతుంది. దాదాపు 100 గ్రాముల జామపండులో 300 మి.గ్రా. మేరకు కండర నిర్మాణ సామర్థ్యం ఉండటం వల్ల కండరాలు పెరుగుతూ ఎదిగే వయసు పిల్లలకు ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. ఇలా ఏ రకంగా చూసినా జామపండు ఆరోగ్యాన్నిచ్చే నిధి. ఎన్నో వ్యాధుల నివారణకు పనిచేసే పెన్నిధి. (చదవండి: ∙ -
పచ్చి జామకాయ కంటే కాల్చిందే బెటర్! ఎన్ని ప్రయోజనాలంటే..!
జామపండు ఎలా తింటాం పండింది లేదా కాస్త పచ్చిగా ఉన్నది ఇష్టంగా లాగిస్తాం. కొందరైతే ఉప్పు, కారంతో ఇష్టంగా తింటారు. వేయించిన జామపండు తినడం గురించి విన్నారా..?. వాట్ ఇలా ఎలా తింటాం అని సందేహించకండి. ఎందుకంటే వేయించిన జామపండుతో బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా వేయించడం వల్ల జామపండులోని యాంటీ ఆక్సిడెంట్లు మరింత పుష్కలంగా శరీరానికి అందుతాయట. పైగా ఇది అనేక వ్యాధులను నివారిస్తుందని చెబుతున్నారు. ఎన్ని ప్రయోజనాలంటే..అలెర్జీ నివారణఅలెర్జీ విషయంలో కాల్చిన జామపండు తినడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి హిస్టామిన్ స్థాయిలు పెరిగిన వ్యక్తులలో అలెర్జీ సమస్యలు సర్వసాధారణం (హిస్టమిన్ అనేది మీ శరీరంలో అలెర్జీలు, అనేక పరిస్థితులలో పాత్ర పోషిస్తున్న ఒక రసాయనం, హిస్టామిన్ ట్రిగ్గర్‌లలో అలెర్జీలు, కొన్ని ఆహార ఉత్పత్తులు ఉంటాయి). ఇటువంటి పరిస్థితిలో కాల్చిన జామపండు తినడం వల్ల అలర్జీలు తగ్గుతాయి. అలాగే శరీరంలో రియాక్టివిటీ తగ్గుతుంది. దీనితో పాటు విటమిన్ సికి అలెర్జీ ఉన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కఫం తొలగిపోతుందిదగ్గు విషయంలో కాల్చిన జామపండు తినడం దగ్గును తగ్గించడంలో అలాగే గొంతు సమస్యను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇసినోఫిలియా అంటే అలర్జీ ఉన్నవారికి కూడా జామ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.ఉబ్బరంలో ప్రయోజనకరంగా ఉంటుందిఉబ్బరం సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో కాల్చిన జామపండు తినడం వల్ల పొట్టకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. దీన్ని తినడం వల్ల కడుపులోని ఆమ్ల పిహెచ్ తగ్గుతుంది. ఇది ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది.జలుబు, దగ్గు రాకుండా కాపాడుతుందికాల్చిన జామపండు తింటే జలుబు, దగ్గు సమస్య దరిచేరదు. నిజానికి పాత కాలంలో జామపండు తినడం వల్ల అంటు వ్యాధులు దూరంగా ఉంటాయని నమ్మేవారు. ఇలాంటి పరిస్థితుల్లో జామపండు తినడం వల్ల జలుబు, దగ్గు రాకుండా చూసుకోవచ్చు.(చదవండి: టాబ్లెట్ త్వరగా పనిచేయాలంటే ఇలా చేయండి!) -
వర్షాకాలంలో జాంపండు తినకూడదా? ఏమవుతుంది?
వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం.. సీజన్ ఏదైనా కొన్ని ఆరోగ్య, ఆహార జాగ్రత్తలు తప్పని సరి. తీసుకునే ఆహారం పట్ల అవగాహన, అప్రమత్తత ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే అపోహలు, అవాస్తవాల పట్ల కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాంలో జాంపండు తినకూడదని, జలుబు చేస్తుందనే ఒక అపోహ ఉంది. మరి నిజం ఏంటో తెలుసు కుందామా..!సీజన్ ఏదైనా జామకాయను సులభంగా అందరూ తినవచ్చు. జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, లైకోపీన్, కాల్షియం, మాంగనీస్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కేలరీలు తక్కువ , ఫైబర్ ఎక్కువ. ఎదిగే పిల్లలనుంచి, పెద్దవాళ్ల దాకా ఎవరైనా ఈ పండు తినవచ్చు. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులుఈ పండ్లకు దూరంగా ఉండాలని కొంతమంది భావిస్తారు. జామపండు తినడానికి తియ్యగా ఉన్నప్పటికీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మేలు చేస్తుంది. జామలో ఉండే పీచు రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.జామ పండులో లభించే విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సహాయ పడుతుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేసి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో ప్రతిరోజూ తినవచ్చు.జామకాయలో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జామపండు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ 8 శాతం పెరుగుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక బరువు తగ్గడంలో కూడా జామ అద్భుతంగా పనిచేస్తుంది. క్యాలరీలు తక్కువ. ఇతర పండ్లతో పోలిస్తే జామలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కడుపు నిండుగా ఉంచుతుంది.నోట్ : అలెర్జీ ఉన్నవారు, జామ తిన్నతరువాత వికారం లేదా పొత్తికడుపులో అసౌకర్యం లాంటి లక్షణాలు కనిపించినా తినకూడదు. అలాగే తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారు ఆహారం విషయంలో వైద్యుల సలహాలను తు.చ. తప్పకుండా పాటించాలి. -
జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
జామపండుకు పేదల ఆపిల్ అని పేరు. అయితే పండే కాదు... ఆకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒకటి రెండు జామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్ టీ మాదిరిగా తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలు... ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి.ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది అధిక బరువును తగ్గించడంలో జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. స్త్రీలు నెలసరి సమయంలో కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులతో సతమతం అవుతుంటారు. అలాంటి వారికి జామ ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి.కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ ముప్పు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.యాంటీ స్ట్రెస్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి మంచిది. జామ ఆకులు శరీర మెటబాలిజంను పెంచి కొవ్వును కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. -
యూట్యూబ్ లో చూసి తైవాన్ జామ సాగు చేసిన రైతు
-
ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారిస్తున్న రైతులు
-
జామ సాగు... జామతో లాభాలు
-
నల్ల జామపండ్ల గురించి మీకు తెలసా? వీటిని తినడం వల్ల..
పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ప్రతిరోజూ పండ్లను తినడం వల్ల అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చు. అలాంటి పండ్లలో జామపండ్లు కూడా ఒకటి. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవారి వరకు జామపండ్లను ఇష్టంగా తింటుంటారు. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే జామాపండ్లు గురించి అందరికి తెలుసు.. కానీ నల్ల జామకాయల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సాధారణ జామ పండుతో పోలిస్తే ఈ నల్ల జామ పండులో పోషకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.. ► నల్ల జామపండ్లు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. శరీరానికి కూడా ఇవి చాలా మంచివి. ► ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటివి ఇందులో అధికంగా ఉంటాయి. ► నల్ల జామపండ్లను తరచూ తినడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ► అంతేకాకుండా వీటిని తరచూ తినడం వల్ల మలబద్దకం, పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. ► రక్తహీనతతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ నల్ల జామపండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ► నల్ల జామకాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు. ► యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉండటంతో వృద్ధాప్యాన్ని నివారించటంలో నల్ల జామకాయలు సహాయపడతాయి. ► నల్లజామకాయలు తీసుకోవడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నల్ల జామకాయలు తినాలంటే మాత్రం ఇండియలో దొరకవు. ఈ పండ్లు ఎక్కువగా బ్రెజిల్, సౌత్ అమెరికాలో ఎక్కువగా దొరుకుతాయి. -
అద్దె భూమిలో వ్యవసాయం - కోట్లు సంపాదించేలా..
MBA Graduate Rajeev Bhaskar: నిజానికి సక్సెస్ మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అయితే ఆలాంటి సక్సెస్ రావడానికి నిరంతరం కష్టపడాలి. ఆ కష్టమే మనిషిని విజయపథంలో ముందుకు తీసుకెళుతుంది. వ్యవసాయం చేస్తూ కోట్లు గడిస్తున్న గ్రాడ్యుయేట్స్‌లో ఒకరు రాజీవ్ భాస్కర్. ఇంతకీ ఇతని సక్సెస్ స్టోరీ ఏంటి? దీని కోసం ఎంతలా కష్టపడ్డానే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. విఎన్ఆర్ సీడ్స్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ మెంబర్‌గా పనిచేసిన రాజీవ్ ఇప్పుడు వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. సీడ్స్ కంపెనీలో అతనికి ఏర్పడిన అనుభవమే భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది, అంతే కాకుండా వ్యవసాయం మీద అతనికి ఆసక్తిని ఏర్పరచింది. వ్యవసాయంలో కొత్త పోకడలను తెలుసుకుని కొత్తగా వ్యవసాయం చేయడం మొదలెట్టిన రాజీవ్ థాయ్ జామ రకం పంటలు పండిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. 2017లో తన ఉద్యోగాన్ని వదిలి హర్యానాలోని పంచకులలో ఐదు ఎకరాల భూమిని అద్దెకు తీసుకుని జామ పండించడం ప్రారంభించాడు. రాజీవ్ భాస్కర్ పంటల పెరుగుదలను ప్రోత్సహించడానికి సేంద్రీయ పదార్థాలతో తయారు చేసిన బయోసైడ్లు, బయోఫెర్టిలైజర్లను ఉపయోగించాడు. పంటను పురుగులు, కీటకాల బారి నుంచి రక్షించడానికి మూడు పొరల బ్యాగింగ్ టెక్నిక్ ఉపయోగించాడు. ఇది వ్యవసాయాభివృద్ధికి బాగా దోహదపడింది. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!) తన మొదటి పంట 2017 అక్టోబరు & నవంబర్ మధ్య కాలంలో చేతికొచ్చింది. అప్పుడు అతడు రూ. 20 లక్షల వరకు సంపాదించాడు. ఆ తరువాత కూరగాయల పంటలను కూడా అదే పద్దతిలో పండించడం మొదలుపెట్టాడు. అయితే కూరగాయలను విక్రయించడంలో కొంత వెనుకపడ్డాడు, కానీ జామ పంటను అలాగే ముందుకు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం అతడు 2019లో ముగ్గురు పెట్టుబడిదారులతో పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో సుమారు 55 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు. (ఇదీ చదవండి: Toyota FJ Cruiser: ఈ టయోటా కారు కావాలన్నా కొనలేరు - ఎందుకంటే?) 2019 తరువాత రాజీవ్, అతని బృందం పంజాబ్‌లో 25 ఎకరాల భూమిలో జామ చెట్లను నాటారు. అదే సమయంలో పంచకుల తోటలోని ఐదు ఎకరాలలో కూడా థాయ్ జామపండ్లను పండించడం కొనసాగించారు. రెండు విధాలుగా వర్షాకాలం, చలికాలంలో పంటలు పండిస్తూ భారీగా ఆర్జించడం మొదలుపెట్టారు. రాజీవ్ తన జామ మొక్కల సగటు గరిష్ట దిగుబడిని మొక్కకు 25 కిలోల నుంచి 40 కిలోలకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రసాయనాలు ఉపయోగించే కాలంలో సేంద్రియ వ్యవసాయం కొంత కఠినంగా ఉండనియూచెబుతున్నారు . అయినప్పటికీ అదే పద్దతిని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఉన్న ఉద్యోగం వదిలి వ్యవసాయంలోనే కోట్లు గడిస్తున్న రాజీవ్ ఎంతోమందికి ఆదర్శం అనే చెప్పాలి. -
ఎకరా భూమి..రూ.3.68 లక్షల ఆదాయం
సాక్షి, నల్లగొండ(నేరేడుచర్ల): ఆలోచన ఉంటే ఆదాయ మార్గాలు అనేకం అంటున్నారు.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధి శాంతినగర్‌కు చెందిన బాణావత్ రాజేశ్వరి. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ వివిధ రకాల పంటలను సాగు చేస్తూ ఆదాయం పొందడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు.. ఈ సాధారణ గృహిణి. మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన రాజేశ్వరి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఈమె భర్త పోలీస్ శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తుండగా కుమారుడు హైదరాబాద్‌లో ఉన్నత విద్య (బీటెక్) అభ్యసిస్తున్నాడు. కాలక్షేపానికి మల్లెపూల సాగు రాజేశ్వరి–శ్రీనివాస్ దంపతులకు శాంతినగర్‌లో ఉన్న ఖాళీ స్థలంలో కొంత ఇంటి నిర్మాణానికి పోగా ఎకరా భూమి ఉంది. కుమారుడు హైదరాబాద్‌లో చదువుతుండడంతో పాటు భర్త ఉద్యోగానికి వెళ్తుండడంతో రాజేశ్వరి ఇంట్లో ఒంటరిగా ఉండేది. కాలక్షేపం కోసం రాజేశ్వరి కొన్నేళ్ల క్రితం తమకున్న ఎకరా భూమిలో మల్లెపూల సాగు చేపట్టింది. తైవాన్ జామతో ఏడాదికి రూ.80వేలు అయితే, రాజేశ్వరి అనుకున్న మేరకు ఆదాయం రాకపొవడంతో నాలుగేళ్ల క్రితం మల్లెతోటను తొలగించింది. వాటి స్థానంలో బెంగుళూరు నుంచి తైవాన్ జామ మొక్కలను తీసుకవచ్చి పెంచారు. జామతోట కాపునకు వచ్చి సంవత్సరానికి రెండు కాపుల్లో 80వేల రూపాయల ఆదాయాన్ని పొందుతోంది. అంతరపంటగా ఖర్జూర కాగా, రాజేశ్వరి ఒక్క జామతోటపైనే ఆధారపడకుండా అంతర పంటగా వివిధ రకాలకు చెందిన 100 వరకు ఖర్జూరా మొక్కలు పెంచుతోంది. వీటిలో బరిహి, ఖనిజా, మెట్జోల్, సీసీ, సగాయి. ఆజ్యా, ఆమ్రా వంటి రకాలైన ఖర్జూర మొక్కలను నాలుగేళ్లుగా పెంచుతున్నారు. పంట మరో ఏడాదిలో చేతికి వస్తుంది. మరి కొంతకాలం గడిస్తే వివిధ రకాల ఖర్జూరాలతో ఏడాదికి రూ.5 నుంచి 10లక్షల ఆదాయం వస్తుందని రాజేశ్వరి అంచనా వేస్తున్నారు. తేనెటీగల పెంపకంతో.. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కేవీకేలో తెనే టీగల పెంపకంపై రాజేశ్వరి గత ఏడాది శిక్షణ తీసుకున్నారు. అనంతరం జామ, ఖర్జూర తోటలో అంతర పంటగా తేనే టీగల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాజేశ్వరీ తన ఆలోచనను భర్త శ్రీనివాస్‌కు తెలియజేసింది. ఆయన రాజేశ్వరీ సహాయ సహకారాలతో పాటు ప్రోత్సాహాన్ని అందించారు. తేనెటీగల పెంపకానికి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఒక్కోదానికి 15వేల రూపాయలను వెచ్చించి 14 పెట్టెలను తీసుకవచ్చి పెంచుతున్నారు. తేనె టీగలు బయటకు వెళ్లి పూలలోని మకరందాన్ని ఆస్వాధించేందుకు పెట్టెలు కింది భాగంలో కొంత ఖాళీ స్థలాన్ని వదిలారు. పెట్టెలలోని తేనె టీగలను నియంత్రించేందుకు రాణీ ఈగ ఉంటుంది. తేనె టీగలు ఒక్కసారి పెంపకం మొదలు పెడితే ఒక్కో తేనె టీగ రెండు వేల వరకు గుడ్లు పెడతాయని రాజేశ్వరీ వివరించింది. ఆ గుడ్లు పిల్లలుగా మారి ఎటు వంటి పెట్టుబడి లేకుండా ఫలితాలు ఇస్తాయంటోంది. తేనె టీగల పెంపకం ద్వారా నెలకు 40 కేజీల తేనే ఉత్పత్తి అవుతుందని, కిలో రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు.ప్రస్తుతం జామపై ఏడాదికి రూ.80 వేల ఆదాయంతో పాటు తేనెపై రూ.24 వేల ఆదాయం వస్తుంది.ఖర్జూర పంట చేతికి వస్తే ఆదాయం మూడింతలకు పైగా పెగుతుందని రాజేశ్వరి పేర్కొంటోంది. మంచి లాభాలు గడిస్తున్నా కాలక్షేపానికి తొలుత మల్లెపూల సాగు చేపట్టా. ఆ తర్వాత జామ, ఖర్జూర, తేనెటీగల పెంపకంతో మంచి లాభాలు గడిస్తున్నా. తాము పెంచుతున్న తేనె టీగల ద్వారా ఉత్పత్తి అవుతున్న తేనెను పరిసర ప్రాంతాల ప్రజలు తోట దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో మార్కెంటింగ్ చేయడం కూడా సులువుగా ఉంది. ఖర్జూరా పంట చేతికొస్తే ఆదాయం మూడింతలు పెరగనుంది. – బాణావత్ రాజేశ్వరి, నేరేడుచర్ల -
జామ్ జా‘మనీ’.. ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం.. ఈ పంటకు భలే గిరాకీ!
నిరంతరం కష్టాలు, నష్టాలు చవిచూసే రైతుకు జామ పంట ధీమానిస్తోంది. ఏడాదిలో మూడుసార్లు ఫలసాయాన్నిస్తోంది. జిల్లాలో అధికంగా మామిడి సాగవుతుంటే, పెనుమూరులో మాత్రం జామ పంట భరోసా కల్పిస్తోంది. తెగుళ్ల బెడదను తట్టుకుని నిలబడుతోంది. తరతరాలుగా సాగవుతూ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. మంచి రంగునూ, రుచినీ సొంతం చేసుకుంది. అత్యుత్తమ దిగుబడులతో.. రాష్ట్ర సరిహద్దులను కూడా దాటుతూ రైతుల ‘పంట’ పండిస్తోంది. పెనుమూరు (చిత్తూరు): ప్రజలకు ఆరోగ్యకరమైన జామ పండ్ల సాగుకు పెనుమూరు ప్రసిద్ధి చెందుతోంది. రైతులు ఏడాదిలో మూడు సార్లు దిగుబడులు సాధిస్తున్నారు. అత్యధిక ఫలసాయం, ఆదాయం ఇచ్చే పంట జామ. ఇతర రాష్ట్రాలు, పట్టణాలకు పెనుమూరు నుంచి జామను రవాణా చేస్తున్నారు. రెండు శతాబ్దాల క్రితం దాసరాపల్లెకు చెందిన నాగిరెడ్డి తొలిసారిగా జామ పంట సాగు చేశాడు. ఆయన జామ సాగులో మంచి లాభాలు పొందడం చూసి దాసరాపల్లెలో ఉన్న 50 కుటుంబాలు జామ పంట సాగు చేస్తున్నారు. దాసరాపల్లెను ఆదర్శంగా తీసుకొని కారకాంపల్లె, పెద్దరాజుపల్లె, ఉగ్రాణంపల్లె, చెళంపాళ్యం, రామాపురం, పెనుమూరు గ్రామాల్లో 150 ఎకరాల్లో వివిధ రకాల జామ సాగవుతోంది. జామ సాగుపై ఉన్న మక్కువతో వారసత్వంగా కూడా రైతులు సాగు చేస్తున్నారు. తొలుత రసాయన ఎరువుల వినియోగంతో జామ సాగు చేశారు. పెట్టుబడి పెరగడంతో కష్టాలు, నష్టాలు చవి చూశారు. మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా జామ సాగు చేస్తున్నారు. ఏడాదిలో మూడు పంటలు సాధారణంగా జామలో ఏడాదికి రెండు పంటలు మాత్రమే దిగుబడి సాధించవచ్చు. అయితే శాస్త్రీయ పద్ధతులతో ‘‘చందన మాధురి’’ రకంతో మూడు పంటలు అందుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఘన జీవామృతం, ధ్రవ జీవామృతం, పంచగవ్య భీజామృతం, పళ్ల ద్రావణం, వేప కషాయం, వానపాముల ఎరువుల వినియోగంతో జామ సాగు చేస్తున్నారు. రైతులు జామ తోటల్లో కోళ్లు, పొట్టేళ్లు పెంచుతూ భూమిని సారవంతం చేస్తున్నారు. వీటితో పాటూ మూడు పర్యాయాలు పచ్చిరొట్ట పైర్లు సాగు చేస్తూ సేంద్రియ ఎరువులు సహజంగా అందిస్తున్నారు. ఏటా భూసార పరీక్షలు చేస్తూ సూక్ష్మపోషకాలు అందిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు మార్కెటింగ్ మెలకువలు స్థానికంగా జామ కాయలు విక్రయించడం వల్ల ఆదాయం ఆశాజనకంగా లేదు. దీంతో మార్కెట్ మెలకువలపై రైతులు దృష్టి సారించారు. పల్లెల్లో కన్నా పట్టణాల్లో జామ కాయల ధర, డిమాండ్ ఉండడాన్ని గుర్తించారు. సేంద్రియ ఉత్పత్తులు కొనే సంస్థలను, వ్యాపారులను సంప్రదించి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు రవాణా చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. స్థానికంగా ఒక కిలో జామ కాయలు రూ.20 ఉండగా పట్టణాల్లో రూ.80 నుంచి 100 వరకు పలుకుతోంది. వీటితో పాటూ డయాబెటిక్ సెంటర్లకు ప్రత్యేక ప్యాకింగ్‌తో సరఫరా చేస్తున్నారు. అంతే కాకుండా వివిధ పట్టణాల్లో నిర్వహించే ఆర్గానిక్, కిసాన్ మేళాల్లో ఈ దిగుబడులు విక్రయిస్తున్నారు. ఎకరాకు రూ.3 లక్షలు ఉద్యానవన పంటల్లో ప్రస్తుతం జామ సాగు మంచి ఆదాయాన్నిస్తోంది. పైగా ఈ పంటకు తెగుళ్ల బెడద పెద్దగా ఉండదు. పెట్టుబడులు కూడా తక్కువే. మార్కెట్లో విక్రయించుకోవడం సులభంగా ఉంది. అదీకాక ఏడాదికి మూడు పంటలు ఇవ్వడంతో మంచి ఆదాయం పెరుగుతోంది. జామను సేంద్రియ పద్ధతులతో సాగుచేయడం, మార్కెట్ మెలకువలతో అమ్ముకోవడం ద్వారా ఎకరా పంటకు ఏడాదిలో రూ.3లక్షల వరకు నికర ఆదాయం వస్తోంది. కాయలతో పాటూ మొక్కలు అంటుకట్టి కొందరు రైతులు మరింత ఆదాయం పొందుతున్నారు. మూడు తరాలుగా ఇదే పంట మా గ్రామంలో సుమారు రెండు శతాబ్దాలకుపైగా జామ తోటలు సాగవుతున్నాయి. మా కుటుంబానికి మూడు తరాలుగా జామ తోటలు సాగు చేయడం వారసత్వంగా వస్తోంది. ప్రస్తుతం మూడు ఎకరాలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన జామ పండ్లు పండిస్తున్నాం. ఏడాదిలో మూడు పర్యాయాలు దిగుబడులు సాధిస్తున్నాం. – పి.హేమావతి, జామరైతు, దాసరాపల్లె జామతోనే బతుకుతున్నాం పండ్ల తోటల పెంపకంలో ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే పంట జామ. దీనికి చీడపీడలు కూడా అంతగా ఉండవు. జామ పండ్లను ఎక్కడైనా, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. పేదవాడి ఆపిల్‌గా పేరు పొందిన జామ పంట సాగు చేసి సంతోషంగా బతుకుతున్నాం. ఐదు ఎకరాల్లో జామ సాగు చేసి ఇద్దరు పిల్లలను విద్యా వంతులను చేశాం. రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఆదాయం పొందుతున్నాం. – కె.జ్యోతి, పెనుమూరు మండలం సంతల్లోనూ అమ్మకం పెనుమూరు జామకు ప్రసిద్ధి చెందింది. అందుకే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల నుంచి జామ పండ్ల కొనుగోలుకు వ్యాపారులు వస్తున్నారు. కొందరు రైతులు స్వయంగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పుత్తూరు పట్టణాల్లో వ్యాపారులకు హోల్ సేల్‌గా జామ కాయలు విక్రయిస్తున్నాం. చాలామంది రైతులు స్వయంగా వారపు సంతల్లో కాయలు విక్రయిస్తున్నారు. ఆదాయం కూడా బాగానే ఉంది. – ధరణి వేణి, దాసరాపల్లె, పెనుమూరు మండలం -
Health: పైల్స్‌తో బాధపడుతున్నారా? వీటిని తగ్గించండి! ఇవి తింటే మేలు!
Diet Tips For Control Piles: కొందరికి నిద్రలేవగానే టాయిలెట్‌కి వెళ్లాలంటే నరకమే. పైల్స్ మూలాన తీవ్ర రక్తస్రావం. నొప్పితో బాధపడుతుంటారు. అయితే పైల్స్ ఉన్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం లేదా బాగా తగ్గించి తినడం వల్ల కొంత మేలు జరుగుతుంది. అవేమిటో చూద్దాం... ►పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు మొదలైనవి. ►ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసాలు. ఎందుకంటే వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. మలబద్దకానికి దారితీసి, ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ►వేయించిన ఆహారం: ఇది మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది కాబట్టి ఫ్రై చేసిన వాటికి దూరంగా ఉండటం మంచిది. ►ఉప్పు అధికంగా తినొద్దు. ►కారంగా ఉండే ఆహారాలు: ఫైబర్ తక్కువగా ఉండకూడదు, కారంగా ఉండే ఆహారం నొప్పిని పెంచుతుంది. ►కెఫిన్ ఉన్న ఆహార పానీయాలు: ముఖ్యంగా కాఫీ, టీల వల్ల పైల్స్ సమస్య పెరుగుతుంది. అందువల్ల వాటిని వీలయినంత వరకు తగ్గించడం మేలు. ►ఆల్కహాల్: కెఫిన్ పానీయాల మాదిరిగా, ఆల్కహాల్‌తో కూడిన పానీయాలు మలాన్ని గట్టిగా ఉండేలా చేస్తాయి. తద్వారా మోషన్‌కి వెళ్లేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకని పైల్స్ సమస్య మరింత పెరగకుండా ఉండేందుకు ఆల్కహాల్ మానుకోవడం మంచిది. వీటిని తినండి.. ►బార్లీ ►క్వినోవా ►బ్రౌన్ రైస్ ►వోట్స్ ►చిక్కుళ్ళు వంటి అధిక ఫైబర్ ఉన్న వాటిని మీ ఆహారంలో తీసుకోండి. ►క్యారట్ ►బీట్రూట్ ►బ్రోకలీ ►కాలీఫ్లవర్ ►కాలే ►క్యాబేజీ ►గుమ్మడికాయ ►బెల్ పెప్పర్స్ ►దోసకాయ ► జామపండు ►బొప్పాయి వంటి పండ్లు కూరగాయలు తినండి. చదవండి: ఔషధాల ఖజానా పుదీనా Urinary Incontinence: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్మెంట్ ఉందా? -
Belly Fat: క్యారెట్, మెంతులు, జామ, బెర్రీస్.. కొవ్వు, బరువు రెండూ తగ్గుతాయి!
Belly Fat: పొట్ట, బరువు తగ్గి, చక్కగా స్లిమ్‌గా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అలా తగ్గేవారు మాత్రం తక్కువే. కారణం... తగ్గడానికి సరైన ఆహారాన్ని ఎంచుకోకపోవడం, ఒకవేళ ఎంచుకున్నా, ఆ నియమాలను పాటించకపోవడం. కొన్ని వ్యాయామాలు పొట్టలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి, కానీ కేవలం వ్యాయామం మాత్రమే చేయడం వల్ల లేదా కేవలం ఆహార నియమాలు మాత్రమే పాటించడం వల్ల పొట్ట తగ్గదు. ఆహార నియమాలతోపాటు వ్యాయామాలు కూడా చేయాలి. అప్పుడే ప్రయత్నంలో సఫలమవుతాం. ఆ మార్గాలేమిటో చూద్దాం. చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి. కఠిన వ్యాయామాలతో శరీరాన్ని శిక్షించడానికి మనసు ఒప్పుకోదు. అలాగే ఈ శీతాకాలంలో ఫ్రైలు, మసాలాలు, కరకరలాడే చిరుతిళ్లు తినాలని మనసు తహతహలాడుతుంది. అయితే బరువు తగ్గాలన్నా, పొట్ట తగ్గి ఫిట్‌గా కనిపించాలన్నా వీటికి బదులుగా పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ఉదయానే నిద్రలేవడం: కొన్ని అధ్యయనాల ప్రకారం తేలిందేమంటే ఆలస్యంగా నిద్ర లేవడం బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు తొందరగా నిద్ర లేవడం మంచిది. రన్నింగ్ : రోజూ ఉదయమే రన్నింగ్ చేయడం చాలా మంచిది. దీని వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. త్వరగా కొవ్వు తగ్గడానికి రన్నింగ్ బాగా ఉపయోగపడుతుంది. రన్నింగ్ చేయలేకపోతే కనీసం వేగంగా నడవడం మంచిది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు. క్యారెట్: క్యారెట్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కాబట్టి వాటిని స్మూతీ, సలాడ్, జ్యూస్‌గా తినవచ్చు. మీ డైట్ చార్ట్‌లో క్యారెట్లను చేర్చండి, ఇది మీ బరువును సమర్థవంతంగా తగ్గిస్తుంది. మెంతులు: సహజంగా రక్తంలో చక్కెర స్థాయులను మెరుగుపరచడంలో మెంతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఔషధం. ఈ ప్రత్యేక ఔషధ గుణాలు మీ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఆహార పానీయాలలో మొలకెత్తిన మెంతులను ఉపయోగించడం మంచి ఫలితాలనిస్తుంది. జామ: పేదల యాపిల్‌గా పేరుగాంచిన జామకాయకు అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. ఇది చలికాలంలో పుష్కలంగా లభించే పండు. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది. అలాగే, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బెర్రీస్: బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. బెర్రీలు తినడం ద్వారా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది. బెర్రీల్లో చాలా రకాలుంటాయి. అన్నిరకాల బెర్రీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి వాటిని ఉదయం లేచిన వెంటనే తినడం మంచిది. వేపుళ్లు, పాక్డ్ ఫుడ్ వద్దు: ఆయిల్‌తో డీప్ ఫ్రై చేసి తయారు చేసే ఆహారపదార్థాలను తినకండి. ఆయిల్‌తో తయారు చేసే పదార్థాలను తినడం వల్ల కొవ్వు పేరుకు పోతుంది. అలాగే గుండె జబ్బులకు గురవుతారు. అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల ఆయిల్స్‌తో తయారు చేసిన ఆహారపదార్థాలను తినకండి. వివిధ ధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్: మనకు మార్కెట్లో తెల్లగా నిగనిగలాడే బ్రెడ్ దొరుకుతూ ఉంటుంది. అయితే దాన్ని తినకపోవడం మంచిది. కొన్ని రకాల బ్రెడ్ లు గోధుమ రంగులో ఉంటాయి. అలాంటి బ్రెడ్ తినడం మంచిది. వీటిలో న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది. మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడానికి, అసలు కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఈ బ్రెడ్ ఉపయోగపడుతుంది. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
జామపండు.. ఆరోగ్య ఖజానా!!
Health Benefits of Guava fruit: వ్యాధినిరోధకతను సమకూర్చే ప్రాథమిక పోషకం ‘విటమిన్–సి’ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అది కావాలంటే మనందరికీ గుర్తొచ్చే పండ్లు నిమ్మజాతికి చెందిన ఒకింత పుల్లటి–తియ్యటి పండ్లు. కానీ... నారింజలో ఉండే విటమిన్–సి కంటే కూడా జామ లో ఉండే ‘విటమిన్–సి’ యే ఎక్కువ. అందుకే జామపండు ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. ఇందులో పొటాషియమ్ కూడా ఎక్కువ కాబట్టి రక్తపోటునూ సమర్థంగా నివారిస్తుంది. అంతేకాదు... టొమాటోలో ఉన్నట్లే జామలోనూ లైకోపిన్ మోతాదులు చాలా ఎక్కువేనంటూ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పేర్కొంది. ‘లైకోపిన్’ అనే అద్భుత పోషకం... ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అంటే... లైకోపిన్ ఉన్నందున ఈసోఫేజియల్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లను నివారించడంలో జామ దోహదపడుతుంది. కాస్తంత ముగ్గిన జామపండులో పీచు (ఫైబర్) చాలా ఎక్కువ. దానివల్ల మలబద్దకం తేలిగ్గా నివారితమవుతుంది. అలా వేళకు విసర్జన జరిగే ఈ ఒక్క జీవనశైలి మంచి అలవాటు కారణం గా ఎన్నెన్నో రకాల జబ్బులు నివారితమవుతాయి. ఉజ్జాయింపుగా చూస్తే 100 గ్రాముల జామపండులో 300 మి.గ్రా. కండర నిర్మాణ సామర్థ్యం ఉంటుంది. ఇలా చూసినప్పుడు ఎదిగే పిల్లలకూ ఇది చాలా మంచిది. ఇలాంటి అనేక గుణాలున్నందున దీన్ని ఆరోగ్యానికి ఖజానాగా పిలిచినా అది అతిశయోక్తి కాబోదు. -
లింఫోమా అంటే ఏంటి?.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
Lymphoma disease Precautions: లింఫోమా అనేది రక్త సంబంధిత క్యాన్సర్లలో ఒకటి. తెల్ల రక్తకణాల్లో ఒక రకం కణాలైన లింఫోసైట్స్ ఉత్పత్తి చేసి, నిల్వ చేసి, ఆ తర్వాత వాటిని తరలించుకు వెళ్లే కణజాలాల్లో వచ్చే క్యాన్సర్ ఇది. దీనిలో ప్రాథమికంగా రెండు రకాలు ఉంటాయి. అవి... 1) హాడ్జ్కిన్స్ లింఫోమా 2) నాన్–హాడ్జ్కిన్స్ లింఫోమా. లక్షణాలు : ∙మెడలో, చంకలో, గజ్జల్లో వాపు వస్తుంది. ఆ వాపు నొప్పి లేకుండానే వస్తుంటుంది. ►ప్లీహం (స్ప్లీన్) పెరుగుతుంది. పొట్టలో నొప్పితో పాటు అసౌకర్యంగా ఉంటుంది. ►జ్వరంతో చలిగా అనిపించడం లేదా రాత్రిళ్లు చెమటలు పట్టడం, విపరీతమైన నిస్సత్తువ కనిపిస్తుంది. నిర్ధారణ పరీక్షలు : ∙రక్త పరీక్షలు ∙బయాప్సీ ∙ఎముక మూలుగ పరీక్ష ∙సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్స్ పరీక్ష ∙మాలిక్యులార్ రోగ నిర్ధారణ పరీక్షలు ∙ఎక్స్‌రే, సీటీ స్కాన్, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు చేయించాలి. వాటిని వైద్యులు క్షుణ్ణంగా పరీక్షించి, లింఫోమా ఉందా, ఉంటే అది ఏ దశలో ఉందనే విషయాన్ని తెలుసుకుంటారు. చికిత్స : ఒకసారి లింఫోమా ఉందని నిర్ధారణ అయ్యాక ఎలాంటి చికిత్స అందించాలన్న విషయం మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ►బాధితుడికి ఉన్నది ఏ రకమైన లింఫోమా ∙దాని దశ (అంటే... లింఫోమా కారణంగా ఏయే అవయవాలు ప్రభావితమయ్యాయి) ∙బాధితుడి సాధారణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది... అన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తారు. లింఫోమా తర్వాత... చికిత్స తీసుకుంటూనే బాధితులు కొన్ని జాగ్రత్తలతో వ్యాధి అనంతర జీవితాన్ని సాధ్యమైనంత ఆరోగ్యంగానే జీవించవచ్చు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. ►పుష్టికరమైన సమతులాహారం తీసుకోవాలి. అయితే అది ఒకేసారి ఎక్కువ పరిమాణంలో కాకుండా... సాధ్యమైనంత తక్కువ మోతాదుల్లో వీలైనన్ని ఎక్కువసార్లు తింటుండాలి. నోట్లో పుండులాంటిది ఏదైనా ఉంటే దాన్ని గాయపరచని రీతిలో మెత్తటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలాలనూ, బత్తాయిరసాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలి. అయితే మిగతా ద్రవాహారాలను పుష్కలంగా తీసుకోవడమే మంచిది. డాక్టర్ సలహా మేరకు తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలతో పాటు, శరీరానికి శ్రమ కలగని రీతిలో కొద్ది పాటి నడక వంటి ఎక్సర్సైజ్లు చేయాలి. ∙తగినంత విశ్రాంతి తీసుకుంటూ, కంటి నిండా నిద్రపోవాలి తాజా గాలి పీల్చాలి. ∙కుంగుబాటు (డిప్రెషన్)ను దరిచేరనివ్వకూడదు ఒకవేళ డిప్రెషన్‌తో బాధపడుతుంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. ఒకసారి లింఫోమా ఉందని తేలాక బాధితులు ఆపైన... లిపిడ్లను, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాల పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. అవి మాత్రమే కాదు... డాక్టర్ సూచన మేరకు మరికొన్ని పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. -
మామూలు రైతు కాదు... ఆర్గానిక్ రైతు.. మోదీకి లేఖ
ఇవాళ రేపు పదో తరగతి విద్యార్థులంటే ఆన్లైన్ చదువులు ముగిశాక స్నేహితులతో కబుర్లు, ఓటిటిలో సినిమాలు, ఫోన్లో కాలక్షేపం వీడియోలు.... కాని జయలక్ష్మి అవేం చేయదు. చదువు ముగిసిన వెంటనే ఇంటి వెనుక ఉన్న పెరటి తోటకు వెళుతుంది. అక్కడ తాను పెంచుతున్న కాయగూరల చెట్లను చూసుకుంటుంది. వాటి బాగోగులలో నిమగ్నమైపోతుంది. ‘పెద్దయ్యాక నువ్వేమవుతావు’ అనంటే ఇంజనీరో డాక్టరో అని చెప్పడం స్టీరియోటైప్ జవాబు. జయలక్ష్మి గొప్ప రైతుని కావాలని అనుకుంటోంది. మామూలు రైతు కాదు... ఆర్గానిక్ రైతు. (చదవండి: ఆ ఒక్క కామెంట్ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది..!) పూల నుంచి పంట వరకు కేరళలోని పథానంతిట్ట జిల్లాలోని పండలం అనే చిన్న పల్లె జయలక్ష్మిది. తండ్రి బెంగళూరులో ప్రయివేటు ఉద్యోగం చేస్తాడు. తల్లి పాలిటెక్నిక్ లెక్చరర్. వాళ్లది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కాని జయలక్ష్మికి చిన్నప్పటి నుంచి పూలంటే ఇష్టం. పూల మొక్కలు ఎక్కడ ఉన్నా ఆగి చూసేది. ఇంటికి తెచ్చి వేసేది. కాని పదో క్లాసు వచ్చేసరికి ఈ ఆసక్తి ఆమెకు సేంద్రియ పద్ధతిలో పెరటి సేద్యం చేసేలాగా పురిగొల్పింది. విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగించేందుకు కేరళ ప్రభుత్వం ‘కర్షక తిలక’ అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. అక్కడి ప్రభుత్వ బడులలో కూడా ఆకుకూరలు, కూరగాయలు పండించేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఇవన్నీ జయలక్ష్మికి ఉత్సాహం ఇచ్చాయి. ఇంట్లో తన సొంత పంటను మొదలెట్టింది. అన్ని రకాల కాయగూరలను కేవలం సేంద్రీయ పద్థతిలో పండించసాగింది. అన్నీ తెలుసు అయితే అందరిలా ఏవో ఒక మొక్కలు ఏదో ఒక పద్ధతిలో జయలక్ష్మి పెంచలేదు. ఆమె వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో తనకు కావలసిన పరిజ్ఞానం పొందింది. ఏ కాయగూర ఎన్నాళ్లకు పూతకొస్తుందో ఏ ఆకుకూర ఏ సీజన్లో వేయాలో ఆమె దగ్గర కచ్చితమైన టైంటేబుల్ ఉంది. మట్టి, ఎరువు, నీరు... అన్నీ ఆమెకు ఏ పాళ్లో తెలుసు. అందుకే 2018లో ఆమె పెరటి పంటను మొదలుపెడితే రెండేళ్లలో ఆమె వల్ల ఇంటికి కావాల్సిన కూరగాయల బాధ తప్పడమే కాక బయటకు అమ్మి రాబడి సాధించేంతగా పంట ఎదిగింది. అంతే కాదు ‘కర్షక తిలక’ అవార్డు కూడా సొంతం చేసుకుంది. (చదవండి: లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వస్తాయా?!) ప్రధాని మోదీకి లేఖ జయలక్ష్మి ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాసింది. ‘మన్ కీ బాత్’లో సేంద్రియ వ్యవసాయం పట్ల యువతకు పిలుపు ఇవ్వాలని, సేంద్రియ వ్యవసాయానికి మద్దతు ప్రకటించి రైతులను ఉత్సాహపరచాలని ఆ లేఖలో కోరింది. దానికి జవాబుగా మోదీ.. జయలక్ష్మి కృషిని ప్రశంసిస్తూ ఒక లేఖను కేరళ రాజ్యసభ సభ్యుడు, నటుడు సురేశ్‌గోపి ద్వారా పంపారు. ఇది ఒక్క పక్క జరిగితే మొన్నటి సోమవారం పథానం తిట్టకు వచ్చిన సురేశ్ గోపిని కలిసి జయలక్ష్మి తాను పెంచిన జామ మొక్కను బహూకరించింది. ‘అమ్మా.. ఇది నా దగ్గర కాదు.. ఏకంగా ప్రధాని నివాసంలోనే పెరగాలి. నేను దీనిని ప్రధానికి బహూకరిస్తాను’ అన్నాడు సురేశ్ గోపి. గురువారం (సెప్టెంబర్ 2) ఢిల్లీలో ప్రధానికి ఆ మొక్కను బహూకరించాడు కూడా. ఈ సంగతి తెలిసి జయలక్ష్మి ఎంతో సంతోషపడుతోంది. సాటి విద్యార్థులు కూడా ఆమెను చాలా స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. చదువుతో పాటు ఈ దేశపు మట్టి గురించి, పంట గురించి, కనీసం నాలుగైదు మొక్కలు పెంచాల్సిన పరిజ్ఞానం గురించి కూడా నవతరం ఎరుక తెచ్చుకోవాల్సి ఉంది. అందుకు జయలక్ష్మి వంటి వారు ఒక కేటలిస్ట్ అవుతారు తప్పక. జయలక్ష్మీ జిందాబాద్. -
రూపాయికో పండు : అయినా దిక్కులేదు
కోల్‌కతా : పండ్ల విక్రేతలు, రైతులనూ కరోనా మహమ్మారి వెంటాడుతోంది. కారుచౌకగా లభించే పండ్లనూ కొనేవారు లేక అయినకాడికి అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో.. పోషక విలువల్లో మేటిగా పేరొందిన జామపండు రూపాయికి ఒకటి లభిస్తున్నా కొనేవారు లేక రైతులు, పండ్ల విక్రేతలు ఆవేదన చెందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు ఏడెనిమిది రూపాయలు పలికిన ఒక్కో జామ ఇప్పుడు కేవలం రూపాయికే అందుబాటులో ఉంది. రూపాయికి ఒక జామపండును అందిస్తున్నా ఎవరూ కొనకపోవడంతో ఒక్కోసారి పండ్లను రోడ్డుపైనే పారబోస్తున్నామని పండ్ల విక్రేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గిరాకీ లేక అరకొర రేటుకే పండ్లను తెగనమ్ముతున్నా ఆ ధరకూ ఏ ఒక్కరూ కొనకపోవడంతో జామ రైతులకు నష్టాలు ఎదురవుతున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన విమల్ సర్ధార్ (52) గత ఏడాది తనకున్న ఎకరం తోటలో జామ పంటను సాగుచేసి మంచి దిగుబడి సాధించాడు. జామ పండ్లను విక్రయించగా వచ్చిన డబ్బుతో రూ 60,000 అప్పు తీర్చాడు. ఈ ఏడాది కరోనా వైరస్‌తో పాటు తుపాను బీభత్సంతో పరిస్థితి తారుమారైందని అప్పు ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదని వాపోయారు. తమకు ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పండ్ల రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. లాక్డౌన్, ఆంఫన్ తుపాన్‌తో పశ్చిమ బెంగాల్లో జామ సాగుదారులు, హోల్‌సేలర్లు తీవ్రంగా నష్టపోయారు. అన్‌లాక్ దశలో అడుగుపెట్టినా లోకల్ ట్రైన్స్‌ను అనుమతించపోవడంతో పండ్ల సరఫరాలూ దెబ్బతిన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్లో జామ పండ్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు. చదవండి : ‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’ -
జామకాయలు తీసుకురాలేదని.. ఛాతిలో గుద్ది
లక్నో : జామకాయలు కొనుక్కుని రాలేదని ఓ విద్యార్థిని తోటి విద్యార్ధులు తీవ్రంగా కొట్టి చంపారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్‌నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫర్మాన్ ఖురేషి అనే విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం పాఠశాల ముగిసిన తర్వాత జామకాయ విషయంలో ముగ్గురు స్నేహితులతో గొడవ ఏర్పడింది. అనంతరం తమకు సోమవారం జామకాయలు కొనుక్కొని రావాలని ముగ్గురు విద్యార్థులు ఫర్మాన్‌ను డిమాండ్ చేశారు. దీనికి ఫర్మాన్ నిరాకరించాడు. మరుసటి రోజు తమ బంధువు తైహిద్తో కలిసి పాఠశాలకు వచ్చిన ఫర్మాన్ జామకాయలు తీసుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు కోపానికి గురై విద్యార్థిపై తీవ్రంగా దాడి చేశారు. విద్యార్థిని కింద పడేసి అతనిపై కూర్చొని ఛాతిపై కొట్టారు. ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులలకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఖురేషి తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302(హత్య) కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా వుండగా తాము ఉద్దేశ్యపూర్వకంగా విద్యార్థిని చంపలేదని కేవలం కడుపులో మాత్రమే కొట్టామని నిందితుల్లోని ఓ విద్యార్థి తెలిపాడు. కాగా ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. నిందితుల్లో ఒకరు మాత్రమే మృతిడిని కొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు అనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముగ్గురు నిందితులను జువైనల్ హోంకు తరలించామని తదుపరి విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు -
ఓహో జామ! అయ్యో రామ!
రామతీర్థం గ్రామంలో సింగరాజుగారి దివాణం వెనుక తోటలో అనేక రకాల చెట్లు ఉన్నాయి. ఆ తోట అంతటికీ ముఖ్య ఆకర్షణ మధ్యలోనున్న జామచెట్టు. దాని చిన్న పిందె దగ్గర నుంచి పండు దాకా మహా తీపి! అది ప్రతిసారీ విరగకాసేది. దాంతో పాటుగా ఒడ్డున ఉన్న పనస, దానిమ్మ, సీతాఫలం, బత్తాయి వంటి పండ్ల జాతులు సైతం ఏపుగా ఎదిగాయి. అయితే తోటలోని మిగతా చెట్లపై చిన్నచూపు ఉండేది జామచెట్టుకి. తనకున్న ప్రాధాన్యత మిగతా వాటికి లేదనే భావం బాగా పాతుకుపోయింది.ఒకసారి జామచెట్టు ఒడ్డునున్న చెట్లను చూసి ఫక్కున నవ్వి, ‘‘చూశారా! నా విలువ! ఇన్ని చెట్లు తోటలో ఉన్నా జనాల కన్ను నావైపే! తియ్యని నా కాయలు, పండ్లు తిని మెచ్చుకోనివారు లేరు. అంతేకాదు, రామచిలుకలకు ఆవాసంగా ఉన్నాను. అవి నాపైన వాలి పళ్లు తింటుంటే ఎంత అందంగా ఉంటుందో చూసేవాళ్లకు! మిగతా పక్షులన్నిటికీ కూడా ఆహారంగా పనికి వస్తాను. మీరూ ఉన్నారు పనికిరాకుండా’’ అని గేలి చేసింది.అది విన్న పనస చెట్టుకు కోపమొచ్చింది. ‘‘అదేంటి! ఎవరి గొప్ప వారికి ఉంటుంది. నువ్వు గప్పాలు కొట్టుకోవడం తగదు’’ అంది. ‘‘ఆ! చెప్పొచ్చావులే. నీలో ఏం గొప్ప ఉంది గనుక? ఏనుగులా పెరుగుతావు గాని, నీ కాయలు బండల్లా అంతలేసి. అయినా సరే వాటిని తినలాంటే మనుషులు నానా అవస్థలు పడాల్సిందే! నీ చర్మం ఒలిచి అందులో తొనలు బయటకు తీయడానికి తట్టెడు నూనె పూసుకోవాలి. ఎంతో శ్రమ పడితే తప్ప నీ తొనలను తినే యోగం లేదు. అదైనా పిందె నుంచి పండుదాకా అవడానికి యుగాలు పడుతుంది’’ అని ఎకసెక్కంగా అంది జామచెట్టు. ఆ మాటలు విన్న సీతాఫలం చెట్టుకి మండిపోయింది. ‘‘ఏం కూస్తున్నావో తెలుసా? నీకేం తెలుసు పనస విలువ? హద్దులు మీరితే బాగుండదు’’ అని హెచ్చరించింది. ‘‘ఓహో! నువ్వా నీతులు చెబుతున్నది? నీకు మాత్రం ఏముంది గనుక? నీ పండ్లు బయటకు గుడ్లగూబల్లా కళ్లున్నట్లు ఉంటాయి గాని పైనున్న తొక్కంతా తీసి పారేస్తే గాని గుజ్జు కనబడదు. తీరా తిందామంటే కడుపులో నల్లని కాటుకలాంటి పిక్కలు అడ్డుతుంటాయి. మరి నీ పండు తినడానికి ఎంత కష్టపడాలి?’’ అని వికటంగా నవ్వింది జామ.ఆ మాటలకు దానిమ్మకు చిర్రెత్తింది. ‘‘ఏం జామా! జోరు మీదున్నావు? నువ్వొక్కత్తెవే గొప్పదానిలా మాట్లాడుతున్నావేంటి? మిగిలిన పండ్ల జాతులు నీ దృష్టిలో పనికిరానివా?’’ అని గద్దించింది.‘‘నువ్వు కూడా సీతాఫలానికి ఏమీ తీసిపోవు! ఎందుకంటే నీ కాయలు చూడటానికి ఒకేలా ఉన్నా, ఏది తీపో, ఏది పులుపో తినేదాక తెలియని అగమ్యం. చేత్తో ఒలిచి తినే సౌలభ్యమూ లేదు. నీ పండు తినాలంటే తిప్పలు పడాల్సిందే! అందువల్ల నన్ను నిలదీసే అర్హత నీక్కూడా లేదు’’ అంది వేలెత్తి చూపుతూ.జామ మాటలకు చెట్లన్నీ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాయి. ఏం జవాబు చెప్పాలో వాటికి అర్థం కాలేదు.‘‘చూశారా! మీకు నన్న ఎదిరించే దమ్ము లేదు. చూడండి నా ప్రత్యేకత ఏ పండ్ల జాతిలోనూ లేదు. ఎందుకో చెప్పనా? వినండి. ఏ పండైనా తొక్క ఒలవందే తినడానికి వీలవదు. మరి నన్ను చూడండి. చెట్లు మీంచి కాయి కోసుకుని హాయిగా నమిలెయ్యొచ్చు. వెంటనే రుచి చూసి లొట్టలేయొచ్చు. పక్షులన్నిటికీ నేను తిండి పెడుతున్నట్లే లెక్క! మిమ్మల్ని అసలు ఏ పక్షి అయినా నేరుగా తినగలదా? బిక్కమొహాలేసుకోవడం కాదు. చెప్పండి!’’ అంటూ హుంకరించింది.జామ చెప్పిన మాటల్లో నిజం ఉన్నప్పటికీ దాని అహాన్ని మాత్రం సహించలేకపోయాయి మిగిలిన చెట్లన్నీ. ఈ వ్యవహారమంతా గమనిస్తున్న తుమ్మచెట్టు తోటి చెట్లకు వత్తాసు పలుకుతూ... ‘‘నీ ప్రవర్తన సబబుగా లేదు. నీ మిడిసిపాటు ఎన్నాళ్లో సాగదు. దేనికైనా కాలమే గుణపాఠం చెబుతుంది. ఎవరి విలువ వారికి ఉంటుంది. నా కాయలు తినడానికి ఏమాత్రం ఉపయోగపడవు. కాని నా ముళ్లు తోట చుట్టూ కాపలాగా పనికొస్తాయి. దేముడు ప్రతిదానికి ఒక విలువ ఇచ్చాడు. అది గుర్తుంచుకో!’’ అంది ఎదురుదాడి చేస్తూ. ‘‘ఓహో! తోటి మిత్రులకు తోడుగా నువ్వు కూడా రంగంలోకి దిగావన్న మాట! అసలు నీ రూపం ఒక్కసారైనా చూసుకున్నావా? ఏమీ బాగులేని వారిని తుమ్మమొద్దులా ఉన్నావంటారు. నీ ముల్లు గుచ్చుకుంటే జనం గగ్గోలు పెట్టి తిట్టుకుంటారు.’’ అని చులకనగా మాట్లాడింది జామ.మరింక దాంతో తలపడలేక మౌనం వహించాయి చెట్లన్నీ. బత్తాయి, సపోటా, నేరేడు చెట్లు ఏదో అనబోతే వారించింది పనసచెట్టు. ‘‘చూశారా! మీరెవ్వరూ నాతో సాల్లేకపోయారు. అసలు నా విలువ మీ అన్నింటికంటే ఎక్కువ కాబట్టి నన్ను తోట మధ్య పాతి మిమ్మల్నందరినీ పనికిరానట్టు ఒడ్డున పడేశాడు యజమాని’’ అంటూ వికటంగా నవ్వింది జామచెట్టు.ఇది జరిగిన రెండు రోజుల తర్వాత యజమాని సింగరాజు కొందరు వడ్రంగులను వెంటబెట్టుకొచ్చి పనసచెట్టును చూపించాడు. వాళ్లు రంపాలతో దాని లావైన కొమ్మలను కోయడం చూసి, ‘‘చూశావా పనసా! నీ పనయ్యింది’’ అని హేళనగా అంది జామ. కాని వాళ్లు అదే చెట్టు కింద కూర్చొని ఆ కలపతో చిన్న చిన్న బొమ్మలు చేయడం మొదలుపెట్టారు. ఆ సన్నివేశం చూసిన జామచెట్టు ఆశ్చర్యపోవడం గమనించిన తుమ్మచెట్టు ‘‘ఎప్పుడూ పరాయివాళ్లను నిందించడమే పనిగా పెట్టుకోకు. పనస విలువ తెలిసిందా?’’ అని సూటిగా అడిగింది. అయినప్పటికీ జామకు ఏమాత్రం అహం తగ్గలేదు. సూటిపోటి మాటలు అంటూనే ఉండేది. ఇలా ఉండగా, ఒకరోజు తోట యజమాని సింగరాజు కొందరు వ్యక్తులతో తోటలోకి వచ్చాడు. వాళ్లు ఏయే చెట్లకు ఏయే తెగులు పడుతుందో చెప్పి, దానికి విరుగుడుకి కూడా సలహాలు చెబుతూ ‘‘ఈ జామచెట్టు చూస్తే బయటకు బాగానే కనిపిస్తున్నా, దీని కాండం భాగంలో తెగులు సోకింది. పైగా ఇది తోట మధ్యలో ఉండటం మూలంగా జనమంతా దాని పళ్ల కోసం మీ తోటలోకి దూకి మరీ చొరబడుతున్నారు. దాని వల్ల మీ తోట మొత్తం ధ్వంసం కావడానికి కారణమవుతోంది. దీనికున్న చీడ మిగిలిన చెట్లకు పాకక ముందే దీన్ని ఇక్కడి నుంచి వెంటనే తొలగించండి.’’ అని చెప్పడం విన్న జామచెట్టు ఒక్కసారిగా బావురుమన్నది. తప్పనిసరి పరిస్థితిలో ఆ జామచెట్టును కూకటివేళ్లతో తీసేయాల్సి వచ్చింది. అది చూసిన మిగతా చెట్లు తన అహంకారమే జామచెట్టును అంతం చేసిందని అనుకున్నాయి. - కె.కె.రఘునందన -
జామకాయల సాకుతో...
నేరేడ్మెట్: జామ కాయలు కోసుకుంటామని చెప్పి ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం, దోపిడీకి పాల్పడిన బాలనేరస్తుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ వివరాలు వెల్లడించారు. చత్తీష్‌గడ్‌కు చెందిన కమలేష్‌వర్మ, ఉషావర్మ(28) దంపతులు జవహర్‌నగర్ ఠాణా, అరుంధతి నగర్లో నివాసం ఉంటున్నారు. కమలేష్‌వర్మ కాంట్రాక్టర్‌గా పని చేసేవాడు. వారి ఇంటి ఎదురుగా ప్రైవేట్ ఉద్యో గం చేస్తున్న కొత్త రాహుల్ అలియాస్ నాని(19) కుటుంబం నివాసం ఉంటోంది. ఈనెల 4న రాహుల్ తన సోదరుడు (బాలనేరస్తుడు)తో కలిసి పథకం ప్రకారం కమలేష్‌వర్మ ప్రహరీ దూకి పెరట్లోకి ప్రవేశించారు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన కమలేష్ భార్య ఉషావర్మ వారిని ఎందుకు వచ్చారని ప్రశ్నించగా జామ కాయలు కోసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఆమెను మాటల్లో పెట్టి ఇల్లు చూస్తా మని ఆమెతో పాటు లోపలికి వెళ్లారు. పథకం ప్రకారం తమ్ముడు ఇంటి మెయిన్ డోర్ మూసి వేయగా రాహులు ఉషావర్మ జుట్టుపట్టుకుని తలను గోడ కేసి బాదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె కుప్పకూలింది. అనంతరం ఆమె ఒంటిపైన ఉన్న బంగారు పుస్తెల తాడు, చెవి కమ్మలు, వెండి పట్టాలు తీసుకున్నారు. ఇంట్లోని తాడుతో ఆమె కాళ్లు, మెడకు బిగించి కప్ బోర్డులోని కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె మృతి చెందినట్లు భావించి వారు అక్కడినుంచి పరారయ్యారు. కొద్దిసేపటికి స్పృహాలోకి వచ్చిన ఉషావర్మ భర్తకు ఫోన్ చేసింది. భర్త తన స్నేహితులకు సమాచారం అందించడంతో వారు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. తమ ఎదురింట్లో ఉంటున్న రాహుల్, అతని సోదరుడు తనపై హత్యాయత్నం చేసి, నగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీసీపీ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రషీద్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నవీన్, సీఐ సైదులు చోరీసొత్తును రాహు ల్ తనకు వరుసకు సోదరుడు, అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న పవన్ కళ్యాణ్ వద్ద దాచినట్లు గుర్తించారు. పవన్ కూడా గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు డీసీపీ తెలిపారు. సోమవారం బాలాజీ నగర్లో రాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, చోరీ సొ త్తుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన ఏసీపీ, డీఐ, సీఐలను ఆయన అభినందించారు. -
థైరాయిడ్‌కీ మెడిసినే!
జామలో రుచికి రుచి ఎలాగూ ఉండనే ఉంటుంది. దాంతో పాటు ఎన్నో వ్యాధులను ఎదుర్కొనే వ్యాధి నిరోధకశక్తి పుష్కలంగా ఉంది. జామ పండుతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని. ►జామపండులో విటమిన్–ఏ చాలా ఎక్కువ. ఇది కంటిచూపును చాలాకాలం పాటు పదిలంగా కాపాడుతుంది. క్యాటరాక్ట్, మాక్యులార్ డీజనరేషన్ వంటి అనేక కంటి వ్యాధులను జామ నివారిస్తుంది. ►జామలో చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందుకే జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ముఖ్యంగా ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. ►జామపండులో పీచు పదార్థాలు ఎక్కువ, చక్కెర పాళ్లు తక్కువ. అందుకే స్వాభావికంగా బరువు నియంత్రించడానికి ఇదెంతో మంచిది. అందుకే క్రమం తప్పకుండా జామ పండు తినేవారి బరువు చక్కటి నియంత్రణలో ఉంటుంది. ►జామలో విటమిన్–సి పాళ్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది విటమిన్–సి లోపించడం వల్ల వచ్చే స్కర్వీతో పాటు అనేక వ్యాధులనుంచి శరీరాన్ని రక్షించుకుంటుంది. ►జామతో చాలా థైరాయిడ్ సంబంధిత వ్యాధులు నివారితమవుతాయి. ►జామపండు తినేవారి మెదడు చురుగ్గా ఉంటుంది. ఇందులోని విటమిన్–బి6, విటమిన్ బి3 వంటి పోషకాలే దీనికి కారణం. మెదడులోని న్యూరాన్ల సమర్థమైన పనితీరుకు పై విటమిన్లు అవసరం. దాంతో మెదడుకు చురుకుదనం సమకూరడంతో పాటు డిమెన్షియా, అలై్జమర్స్ వంటి వ్యాధులు సైతం నివారితమవుతాయి. ►రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించడానికి జామ ఉపకరిస్తుంది. అంతేకాదు... ఇది అధిక రక్తపోటును నివారిస్తుంది. -
జబ్బులను నివారణకు జామ!
జామపండులో ‘విటమిన్–సి’తో పాటు రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఉంది. ఇంకా అనేక పోషకాలు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా జామపండు ఎన్నో జబ్బులను అవి రాకముందే నిరోధిస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. ∙జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. జామలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇందుకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా ప్రోస్టేట్, రొమ్ముక్యాన్సర్ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. జామపండు డిమెన్షియా, అలై్జమర్స్ వంటి జబ్బులను నివారించడంలో తోడ్పడుతుంది. ∙రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లను జామపండు తగ్గిస్తుంది. అలాగే అధిక రక్తపోటును నివారిస్తుంది. ∙జామపండ్లను తినేవారిలో చిగుర్లు, పంటి వ్యాధులు చాలా తక్కువగా కనిపిస్తాయి. -
జామకాయ.. ఆయువు తీసింది
సాక్షి, అన్నానగర్: జామకాయ.. పిల్లలకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన తమిళనాడులోని ఆనైమలైలో జరిగింది. స్థానిక మొయిదిన్‌ఖాన్ వీధికి చెందిన సిరాకోవిన్ కుమారుడు అన్సాద్ (14) ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తూ క్లాసులో తినేందుకు జామకాయతోపాటు చిన్న కత్తిని వెంట తీసుకెళ్లాడు. ఉదయం 10.15 గంటలకు మొదటి క్లాస్ ముగియగానే ఉపాధ్యాయిని తరగతి నుండి బయటకు వెళ్లింది. ఆ విరామ సమయంలో అన్సాద్ తాను తెచ్చిన జామకాయను తొడమీద ఉంచుకుని కత్తితో చిన్నముక్కలుగా చేస్తున్నాడు. ఇంతలో కత్తి హఠాత్తుగా ఎడమ తొడను చీల్చింది. దీంతో తొడ నుండి గుండెకు వెళ్లే ముఖ్యమైన నరం తెగిపోగా అతడు రక్తపుమడుగులో స్పృహతప్పి పడిపోయాడు. ఇది గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి అన్సాద్ మార్గం మధ్యలోనే మృతిచెందాడని నిర్ధారించారు. సమాచారం అందుకున్న జాయింట్ పోలీసు సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి తోటి విద్యార్థులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జామపండు ఫేషియల్ ప్యాక్
బ్యూటిప్స్ బాగా పండిన జామ పండును తీసుకుని రెండు భాగాలుగా చేయాలి. మధ్యలో ఉండే గింజలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలకు రెండు లేదా మూడు జామాకులను కలపి పేస్ట్ చేసుకోవాలి. ఒక స్పూను పేస్ట్‌ను చిన్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పేస్ట్‌లో రెండు స్పూన్లు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జిడ్డు చర్మం వాళ్ళు అర స్పూను ఉప్పును వేసుకోవాలి. ముందుగా ముఖాన్ని నీటితో కడిగి క్లెన్సింగ్ చేయాలి. పేస్ట్‌ను ముఖంపై వలయాకారంలో రబ్ చేయాలి. పది నిమిషాలపాటు మసాజ్ చేసి తడి కాటన్ బాల్స్‌తో ముఖాన్ని క్లీన్ చేయాలి. ఫేషియల్ ప్యాక్‌ను తీసుకుని ముఖానికి పొరలు పొరలుగా అప్లై చేసుకుని పావుగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికోసారి చేస్తే యాక్నే సమస్య రాకుండా ఉంటుంది. చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. -
చర్మానికి రక్షణ కవచం
జామపండు పలు రకాల వ్యాధుల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. జీలకర్రలో ఉండే యాంటీ సెప్టిక్ కారకాలు జలుబు, ఫ్లూ వంటి వాటిని దూరంగా ఉంచుతాయి. జలుబు చేసినప్పుడు నీటిలో జీలకర్ర, అల్లం, తేనె, తులసి ఆకులు వేసి కషాయం కాచి తాగితే మంచి ఫలితం ఉంటుంది.{పొటీనులు ఎక్కువగా, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే నువ్వులు... శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. కుంకుమపువ్వుకి డిప్రెషన్‌ను దూరం చేసే శక్తి ఉందని పలు పరిశోధనలు తేల్చాయి.