ప్రతీకాత్మక చిత్రం
Diet Tips For Control Piles: కొందరికి నిద్రలేవగానే టాయిలెట్‌కి వెళ్లాలంటే నరకమే. పైల్స్ మూలాన తీవ్ర రక్తస్రావం. నొప్పితో బాధపడుతుంటారు. అయితే పైల్స్ ఉన్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం లేదా బాగా తగ్గించి తినడం వల్ల కొంత మేలు జరుగుతుంది.
అవేమిటో చూద్దాం...
►పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు మొదలైనవి.
►ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసాలు. ఎందుకంటే వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. మలబద్దకానికి దారితీసి, ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది.
►వేయించిన ఆహారం:
ఇది మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది కాబట్టి ఫ్రై చేసిన వాటికి దూరంగా ఉండటం మంచిది.
►ఉప్పు అధికంగా తినొద్దు.
►కారంగా ఉండే ఆహారాలు:
ఫైబర్ తక్కువగా ఉండకూడదు, కారంగా ఉండే ఆహారం నొప్పిని పెంచుతుంది.
►కెఫిన్ ఉన్న ఆహార పానీయాలు:
ముఖ్యంగా కాఫీ, టీల వల్ల పైల్స్ సమస్య పెరుగుతుంది. అందువల్ల వాటిని వీలయినంత వరకు తగ్గించడం మేలు.
►ఆల్కహాల్: కెఫిన్ పానీయాల మాదిరిగా, ఆల్కహాల్‌తో కూడిన పానీయాలు మలాన్ని గట్టిగా ఉండేలా చేస్తాయి. తద్వారా మోషన్‌కి వెళ్లేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకని పైల్స్ సమస్య మరింత పెరగకుండా ఉండేందుకు ఆల్కహాల్ మానుకోవడం మంచిది.
వీటిని తినండి..
►బార్లీ
►క్వినోవా
►బ్రౌన్ రైస్
►వోట్స్
►చిక్కుళ్ళు వంటి అధిక ఫైబర్ ఉన్న వాటిని మీ ఆహారంలో తీసుకోండి.
►క్యారట్
►బీట్రూట్
►బ్రోకలీ
►కాలీఫ్లవర్
►కాలే
►క్యాబేజీ
►గుమ్మడికాయ
►బెల్ పెప్పర్స్
►దోసకాయ
► జామపండు
►బొప్పాయి వంటి పండ్లు కూరగాయలు తినండి.
చదవండి: ఔషధాల ఖజానా పుదీనా
Urinary Incontinence: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్‌మెంట్ ఉందా?
Comments
Please login to add a commentAdd a comment