Beetroot
-
బీట్రూట్తో వెరైటీగా: ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
బీట్రూట్తో ఎన్నో ఆరోగ్య ప్రయెజనాలు లభిస్తాయి. పచ్చిగా తినవచ్చు. లేదా కూర చేసుకొని తినవచ్చు. ఇంకా బీట్రూట్తో జ్యూస్ చేసుకొని తాగవచ్చు. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చక్కటి పరిష్కారం. అలాగే మలబద్దకానికి మంచి మందు. వెరైటీగా బీట్రూట్తో వఫెల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం!కావలసినవి: ఓట్స్ –100 గ్రాములు; శనగపిండి లేదా ఉప్మా రవ్వ– 25 గ్రాములు; బీట్రూట్– చిన్న దుంప; పచ్చిమిర్చి –2; అల్లం– అంగుళం ముక్క; ఉప్పు పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ఆమ్చూర్ పౌడర్– అర టీ స్పూన్ ; జీలకర్ర పొడి– అర టీ స్పూన్; నెయ్యి– టీ స్పూన్.తయారీ: ఓట్స్‌ను మెత్తగా పొడి అయ్యే వరకు మిక్సీలో గ్రైండ్ చేయాలి. పొడి అయిన తర్వాత అందులో శనగపిండి లేదా రవ్వ వేసి గ్రైండ్ చేయాలి. అందులోనే ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిసే వరకు ఒకసారి తిప్పి ఒక పాత్రలో వేసి పక్కన ఉంచాలి మిక్సీ జార్లో బీట్రూట్, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఓట్స్– శనగపిండి మిశ్రమంలో పోసి కలపాలి. మరీ గట్టిగా అనిపిస్తే తగినంత నీటిని చేర్చి ఉండలు లేకుండా కలపాలి వఫెల్స్ చేసే ఇనుప పాత్రకు నెయ్యి రాసి వేడి చేసి అందులో పైన కలుపుకున్న ఓట్స్– బీట్‌రూమ్ మిశ్రమాన్ని పోసి సమంగా సర్ది మూత పెట్టి మీడియం మంట మీద కాలనివ్వాలి. మూత తీసి చూసుకుని పిండి చక్కగా కాలిన తర్వాత దించేయాలి. ఈ వఫెల్స్కి పుదీన చట్నీ లేదా సూప్, చీజ్ మంచి కాంబినేషన్. -
ఆలియా భట్ ఆరోగ్య వంటకాలు, తినరా మైమరిచి అంటారు!
ఆలియా భట్ కేవలం నటి మాత్రమే కాదు. ఫిట్నెస్, పోషకాహారానికి సంబంధించిన వెల్నెస్ ఐకాన్ కూడా. ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలితో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుంది. 2020లో సోషల్‌మీడియా ద్వారా అలియా తన వంటగదిలోకి అభిమానులను తీసుకు వెళ్లింది. శరీరానికి ఇంధనంగా, ఫిట్‌గా ఉండేలా సులభమైన, పోషకాహార వంటకాలను ఎంచుకుంటుంది. వాటిలో బీట్రూట్ సలాడ్, సొరకాయ సబ్జీ, చియా పుడ్డింగ్.. పరిచయం చేస్తోంది. బీట్రూట్ సలాడ్కావలసినవి: తురిమిన బీట్రూట్, పెరుగు, నల్ల మిరియాలు, చాట్ మసాలా, కొత్తిమీర, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర. తయారీ: ఒక గిన్నెలో పై పదార్థాలన్నీ వేసి కలపాలి. మూకుడులో టీ స్పూన్ నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీనిని బీట్రూట్ మిశ్రమంలో వేసి కలిపి, సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: బీట్రూట్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. జీర్ణక్రియను, మెదడు, ఎముక, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే బరువు నిర్వహణలో కూడా సహాయపడతాయి.సొరకాయ సబ్జీకావలసినవి: సొరకాయ, నూనె, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి సోపు పొడి ఆమ్చూర్ పొడి, ధనియాలు, తురిమిన కొబ్బరి.తయారీ: మూకుడులో టేబుల్‌స్పూన్ నూనె వేడి చేసి ఇంగువ, కరివేపాకు, కారం వేసి పోపు సిద్ధం చేయాలి. అందులో తురిమిన సొరకాయ, ఉప్పు వేసి కలపాలి. n 2–3 నిమిషాలు అలాగే ఉంచి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ ΄పొడి సోపు పొడి వేసి కలపాలి. n చివరిగా కొబ్బరి తురుము, తాజా కొత్తిమీర ఆకులు చల్లాలి. వేడి వేడిగా వడ్డించాలి.ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, పటిష్టమైన రోగనిరోధక వ్యవస్థ, బరువు నిర్వహణకు మద్దతు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చియా పుడ్డింగ్ కావలసినవి: చియా గింజలు, పాలు, ప్రొటీన్ , పౌడర్, రుచికి స్టేవియా. తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, పాలు, ప్రొటీన్ , పౌడర్ కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్ ΄ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.కావలసినవి: చియా గింజలు, పాలు, ప్రొటీన్ ΄ పౌడర్, రుచికి స్టేవియా. తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, ΄ పాలు, ప్రొటీన్ ΄పౌడర్, కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. -
తెల్లజుట్టు నల్లగా, స్మూత్ అండ్ షైనీగా : సహజమైన బీట్రూట్ మాస్క్
చిన్న వయసులోనే తెల్లగా మెరిసిన జుట్టును నల్లగా మార్చుకోవడం ఒకపెద్ద సవాల్. మార్కెట్లోదొరికే రసాయనాలు కలిపిన హెయిర్డైలను వాడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు జుట్టుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరమనీ, ప్రమాదకరమైన కెమికల్స్ వల్ల కేన్సర్ ముప్పు పొంచి వుందని వైద్యులు కూడా చెబుతున్న మాట. హానికరమైన రసాయనాలు లేకుండా సహజంగా, ఇంట్లోనే దొరికే వాటితో జుట్టు రంగు మార్చు కోవడం ఎలా? ఈ విషయంలో బీట్ రూట్ బాగా ఉపయోగపడుతుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.బీట్ రూట్లో పొటాషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ సీ, ఏ,ఈ పుష్కలంగా లభిస్తాయి. కెరోటిన్‌తో కూడిన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అలాగే ప్రోటీన్, మెగ్నీషియం , కాల్షియంకూడా అందుతాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మం , జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి. ఇంకా ఇందులో రెటినోల్, ఆస్కార్బిక్ యాసిడ్, బీ కాంప్లెక్స్ లాంటి జుట్టు, చర్మానికి మేలు చేసే విటమిన్లు కూడా ఉన్నాయి. కొబ్బరి నూనె బీట్రూట్ రసం హెయిర్ మాస్క్కొబ్బరి నూనెను బీట్రూట్ రసంలో కలిపి జుట్టుకు రాసుకుంటే సహజమైన రంగు సంతరించు కుంటుంది. అంతేకాదు జుట్టును తేమగా ఉంచుతుంది. కురులు మృదువుగా మారతాయి. బీట్రూట్ రసంలో కొబ్బరినూనె కలిపిన పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసిన తర్వాత 2 గంటల పాటు అలాగే ఉంచి తర్వాత సాధారణ నీటితో జుట్టును కడగాలి. క్రమంగా తప్పకుండా ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారి, నిగనిగలాడుతుంది.క్యారెట్, బీట్రూట్ మాస్క్: ఈ మిక్స్డ్ జ్యూస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచింది. క్యారెట్,బీట్ రూట్ రసాన్ని తీసి, శుభ్రంగా వడకట్టి జుట్టుకు అప్లై చేయాలి. దీని వల్ల జుట్టు మృదువుగా చక్కటి రంగులో మెరిసిపోవడం కాదే, చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.బీట్రూట్ రసం బ్లాక్ కాఫీ హెయిర్ మాస్క్ జుట్టు రంగును మార్చడంలో బ్లాక్‌టీ, కాఫీ బాగా పనిచేస్తాయి. ఒక కప్పు బీట్రూట్ రసంలో, ఒకటిన్నర కప్పుల బ్లాక్ టీ లేదా కాఫీ (కాఫీ లేదా టీ పౌడర్‌ను నీటిలో బాగా మరగించి వడబోసుకోవాలి) కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. దీన్ని కుదుళ్లుకు పట్టేలాబాగా పట్టించాలి. ఒక గంట తర్వాత జుట్టును కడిగేసుకోవాలి. చిక్కులు రాకుండా, జుట్టు తెగిపోకుండా సున్నితంగా దువ్వుకోవాలి.బీట్రూట్, హెన్నాజుట్టు సంరక్షణలో మరో సహజమైంది హెన్నా.దీనికి బీట్ రూట్ రసంజోడిస్తే ఫలితం బావుంటుంది. బీట్ రూట్ రసం, హెన్నా పౌడర్, కొద్దిగా బ్లాక్‌టీని వేసి బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. మంచి ఫలితం రావాలంటే కనీసం రెండు మూడు వారాలకొకసారి పైన చెప్పిన మాస్క్‌లను ప్రయత్నించాలి. అలాగే ఈ మాస్క్ వేసుకున్నపుడు షాంపూని వాడకూడదు. -
బీట్రూట్ వయాగ్రాలా పనిచేస్తుందా? మార్కెట్లో దొరకడం లేదట!?
బీట్రూట్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో సందేహంలేదు. ఈ దుంపకూరలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. దీన్ని ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. బీట్రూట్ తింటే మూత్రం ఎరుపు లేదా ఊదా రంగులో (బీటూరియా) వస్తుంది. కానీ ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు. బీట్రూట్ వల్లన పెద్దగా దుష్ప్రభావాలు పెద్దగా ఏమీలేవు. అయితే ఇటీవల ఒక న్యూస్ వైరల్‌గా మారింది. స్త్రీ పురుషుల లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంపొందిస్తుందనే వార్త వైరల్ అయింది. వయాగ్రాలా పనిచేస్తుందని వార్తలొచ్చాయి. దీంతో డిమాండ్ బాగా పెరిగింది. ఆస్ట్రేలియన్ సూపర్ మార్కెట్ బీట్రూట్ కొరత ఏర్పడింది. ఒక సమయంలో, ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఈబేలో ఎక్కువ ధరకు అమ్ముడైందిట. అయితే దీనిపై యూకే టీవీ డాక్టర్ మైఖేల్ స్పందించారు.ఇది వయాగ్రాలా పనిచేస్తుందనడానికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేశారు. కాని ఇది సహజ సిద్ధంగా లభించే సూపర్ ఫుడ్ అని ముఖ్యంగా విటమిన్ బీ, సీ, మినరల్స్, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. రక్త ప్రసరణకు బాగా ఉపయోగపడుతుందన్నారు. అయితే రోమన్లు బీట్రూట్ , దాని రసాన్ని కామోద్దీపనగా ఉపయోగించారని చెబుతారు.బీట్రూట్ తిన్నప్పుడు, బ్యాక్టరియా ఎంజైమ్లతో కూడిన రసాయన ప్రతిచర్యలు బీట్రూట్లోని నైట్రేట్‌ను నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తాయి ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. పలు అధయనాల ప్రకారం ఫుడ్ ఆధారిత నైట్రిక్ ఆక్సైడ్ పురుషులలో లైంగిక జీవితానికి అవసరమైన టెస్టోస్టెరాన్ హార్మోన్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా బీట్రూట్లోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే సామర్థ్యం గుండె, రక్తనాళాల ప్రసరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది దీన్ని జ్యూస్ చేసుకుని తాగినా, కూర చేసుకుని తిన్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి బీట్ రూట్ ఒక వరం లాంటిది. శరీరానికి అవసరమయిన నీటి శాతాన్ని బీట్రూట్ అందిస్తుంది. -
బీట్రూట్- మిల్క్ ప్యాక్: మచ్చలు మాయం, గ్లోయింగ్ స్కిన్
ఎండాకాలంలో ముఖం, చర్మం సూర్యరశ్మికి గురికావడం వల్ల చాలా సమస్యలొస్తాయి.మొటిమలు ఎక్కువగా వస్తాయి. చర్మం నల్లబడుతుంది. సూర్యరశ్మికి ఎక్కువగా తిరగడం వల్ల చర్మ రంగు మారుతుంది. ఈ సమస్యని దూరం చేయాలంటే బీట్రూట్ క్రీమ్, ప్యాక్ హెల్ప్ చాలా సహాయ పడుతుంది. బీట్ రూట్ క్రీమ్ తొక్కతీసిన అరకప్పు బీట్రూట్ ముక్కలను గిన్నెలో వేసి అరగ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి బీట్రూట్ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పది నిమిషాలు నానబెట్టాలి. పది నిమిషాల తరువాత బీట్రూట్ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈ నీటిలో టీస్పూను రోజ్ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు నిల్వ ఉండే ఈ క్రీమ్‌ను రోజూ ఉదయం పూట రాసుకుంటే.. ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పట్టి ప్రకాశవంతముగా కనిపిస్తుంది. బీట్రూట్ ఫేస్ ప్యాక్ స్కిన్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసి చర్మ రంగుని మెరుగ్గా చేస్తుంది. బీట్రూట్ తొక్క తీసేసి ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలకు పాలు కలిపి గ్రైండ్ చేయాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా అప్లయ్ చేయాలి. అలా మెడమీద కూడా రాసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ దూరమవుతాయి. మురికిని దూరం చేసి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. పాలు కలుపుతాం కాబట్టి, చర్మం మృదువుగా, మెరుస్తుంటుంది. చర్మ సమస్యల్ని దూరం చేసి టోన్ చేయడంలో బీట్రూట్ హెల్ప్ చేస్తుంది. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే బీట్రూట్లో నేచురల్ కలర్ ఉంటుంది. ఇందులోని బీటా లైన్ ఫెయిర్ స్కిన్‌టోన్‌ని అందిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి చర్మంలోని సమస్యల్ని దూరం చేసి ముడతలు పడకుండా చేస్తుంది. -
బీట్రూట్ ఖర్జూరం హల్వా మీకోసమే..
కావలసినవి: బీట్రూట్ రసం – 1 కప్పు, ఖర్జూరం – 10 (వేడి నీళ్లల్లో కడిగి.. కాసేపు నానబెట్టి, గుజ్జులా చేసుకోవాలి) పంచదార – పావు కప్పుపైనే (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) నెయ్యి – పావు కప్పు, ఏలకులు – 2 జీడిపప్పు – 15 పైనే ఫుడ్ కలర్ – కొద్దిగా (బీట్రూట్ కలర్) తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. మంట చిన్నగా పెట్టుకోవాలి. కళాయి వేడికాగానే.. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. అందులో జీడిపప్పు దోరగా వేయించుకుని, పక్కన పెట్టుకోవాలి. అనంతరం కళాయిలో ఇంకాస్త నెయ్యి వేసి.. ఖర్జూరం గుజ్జు వేసుకుని తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా కలపాలి. తర్వాత సరిపడా పంచదార, బీట్రూట్ రసం, ఫుడ్ కలర్ వేసుకుని చిన్నగా గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. మళ్లీ కొద్దిగా నెయ్యి వేసుకుని.. తిప్పాలి. ఏలకులు, జీడిపప్పు వేసుకుని కలపాలి. మిగిలిన నెయ్యి మొత్తం వేసుకుని.. తిప్పుతూ దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లోపలంతా నెయ్యి రాసి.. ఆ మొత్తం మిశ్రమాన్ని.. దానిలోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చదవండి: మీరెప్పుడైనా బొప్పాయి బన్స్ ట్రై చేసారా..! -
బీట్రూట్తో హెల్తీగా చీజ్ కేక్.. టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు
బీట్రూట్ చీజ్ కేక్ తయారీకి కావల్సినవి: వాల్నట్స్ – 150 గ్రాములు ఎండు అంజీరాలు – 8, దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్ ఉప్పు – చిటికెడు, బీట్రూట్ తురుము – 300 గ్రాములు కోకోనట్ చీజ్ – 200 గ్రాములు కోకో పౌడర్, కొబ్బరి నూనె, నెయ్యి, మేపుల్ సిరప్ (మార్కెట్లో దొరుకుతుంది) – 4 టేబుల్ స్పూన్ల చొప్పున బాదం పాలు – 2 టేబుల్ స్పూన్లు, పిస్తా పొడి – 3 టేబుల్ స్పూన్లు తయారీ విధానమిలా: ముందుగా వాల్నట్స్ని మిక్సీ పట్టుకోవాలి. అందులో ఎండు అంజీరాలు, దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని.. నెయ్యి కలిపి, పక్కన పెట్టుకోవాలి. అనంతరం బీట్ రూట్ తురుము, కోకోనట్ చీజ్, బాదం పాలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల మేపుల్ సిరప్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కేక్ ట్రేలో ముందు వాల్నట్ మిశ్రమాన్ని .. దానిపైన బీట్రూట్ మిశ్రమాన్ని పరచి.. కాస్త ఆరి, గట్టిపడిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు.. మిగిలిన కోకో పౌడర్, కొబ్బరి నూనె, మేపుల్ సిరప్ వేసుకుని బాగా కలిపి.. కోన్ మాదిరి కవర్లో చుట్టి.. నచ్చిన డిజైన్‌లో కేక్ ముక్కలపై గార్నిష్ చేసుకుని.. వాటిపై పిస్తా పొడిని జల్లుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
ఇలాంటి స్వీట్ చేస్తే ఎవరైనా బీట్రూట్ని ఇష్టంగా తింటారు
బీట్రూట్ – మిల్క్ సందేశ్ తయారీకి కావల్సినవి: బీట్రూట్ – 2 (ముక్కలు కట్ చేసుకుని మెత్తటి గుజ్జులా చేసుకోవాలి) పాల పొడి – పావు కప్పు నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పంచదార పొడి – ముప్పావు కప్పు తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ మంటను సిమ్‌లో పెట్టుకుని.. పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. అందులో బీట్రూట్ గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడుతున్న సమయంలో పాలపొడి, పంచదార పొడి వేసుకుని.. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. రెండు మూడు నిమిషాలకొకసారి కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ దగ్గర పడేదాకా అలానే ఉండికించాలి. దగ్గర పడిన తర్వాత ఒక పాత్రకు నెయ్యి రాసి.. దానిలో వేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత చిన్నచిన్న ఉండలుగా తీసుకుంటూ.. వాటిని నచ్చిన షేప్‌లోకి మలిచి సర్వ్ చేసుకోవాలి. -
కడుపునిండా తిన్నా బరువు తగ్గించే పరోటా రెసిపి
బరువు పెరగకుండా ఉండేందుకు, పెరిగిన బరువు తగ్గించుకునేందుకు తిండి మానేస్తుంటారు. కానీ తింటూనే బరువు తగ్గాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే కడుపునిండా తింటూ బరువుని తగ్గించుకునే వంటకాలతో ఈ వారం వంటిల్లు... ఓట్స్ బీట్రూట్ పన్నీర్ పరాటా తయారీకి కావల్సినవి: వేయించిన ఓట్స్ – కప్పు; బీట్రూట్ ప్యూరీ – కప్పు; పన్నీర్ తరుగు – అరకప్పు; గోధుమ పిండి – అరకప్పు ; జీలకర్ర – అరటీస్పూను; వాము – అరటీస్పూను; కారం – అరటీస్పూను; ఉప్పు – అరటీస్పూను ; నూనె – రెండు టీస్పూను. తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో ఓట్స్, బీట్రూట్ ప్యూరీ, పనీర్ తరుగు, గోధుమ పిండి, జీలకర్ర, వాము, కారం, ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ పరాటా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దను ఉండలుగా చేసుకుని పరాటాల్లా వత్తుకోవాలి. పరాటాలను రెండువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కాల్చుకుంటే పరాటా రెడీ.పెరుగు లేదా చట్నీతో సర్వ్‌చేసుకోవాలి. -
కాంతి వంతమైన ముఖం కోసం..బీట్రూట్తో ఇలా ట్రై చేయండి!
మన ఇంట్లో ఉండే వాటితోటే చక్కటి మేని సౌందర్యాన్ని, కురులు అందాన్ని పెంపొందించుకోవచ్చు. వాటి ముందు మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కూడా పనికిరావనే చెప్పాలి. కాస్త ఓపికతో చేసుకుంటే ఇంట్లో వంటి వాటితోటే సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఆ ఇంటి చిట్కాలు ఏంటో చూద్దాం! అందులో ముందుగా మనం జ్యూస్‌గానూ, కూరగాను ఉపయోగించే కాయగూర అయిన బీట్రూట్ ముఖ్య సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. బీట్రూట్లో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అందం దృష్ట్యా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మంచి యాంజీ ఏజింగ్‌గా ఉంటుంది. ఇది మచ్చలను తగ్గించడంలో సహయపడుతుంది కూడా చర్మానికి రోజీ గ్లో ఇస్తుంది. మెరిసే మేని కాంతి కోసం బీట్రూట్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం! తొక్కతీసిన అరకప్పు బీట్రూట్ ముక్కలను గిన్నెలో వేసి అరగ్లాసు నీళ్లుపోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి బీట్రూట్ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పదినిమిషాలు నానబెట్టాలి. పదినిమిషాల తరువాత బీట్రూట్ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈనీటిలో టీస్పూను రోజ్ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు నిల్వ ఉండే ఈ క్రీమ్‌ను రోజూ ఉదయం పూట రాసుకుంటే.. ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పట్టి ప్రకాశవంతముగా కనిపిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీళ్లు కలిపి, తలస్నానం చేసిన జుట్టుకు కుదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తల స్నానం చేసిన తరువాత కూడా జుట్టుకు పట్టి ఉండే జిడ్డు వదులుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయాలి. (చదవండి: మీ ముఖం తెల్లగా కాంతివంతంగా ఉండాలంటే..జీలకర్రతో..) -
మనసు దోచే మైసూరు పాకం బీట్రూట్తో.. ఇలా చేసుకోండి
ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్స్‌లో మన మైసూర్ పాక్ కూడా ఒకటి. ఎంతోమంది మనసులు గెలుచుకున్న మైసూర్ పాక్‌ను మరింత వైవిధ్యంగా కూడా చేయొచ్చు. అందుకే విభిన్న మైసూర్΄ాక్లతో మీ ముందుకొచ్చింది.ఈ వారం వంటిల్లు... బీట్రూట్ మైసూర్ పాక్ తయారీకి కావల్సినవి: బీట్ రూట్ జ్యూస్ – అరకప్పు; శనగపిండి – కప్పు; నెయ్యి – ఒకటిన్నర కప్పులు; చక్కెర – కప్పు. తయారీ విధానమిలా.. శనగపిండిని సన్నని మంట మీద పచ్చివాసన పోయేంతవరకు వేయించి దించేయాలి ∙వేగిన పిండి జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టాలి మందపాటి బాణలిలో పంచదార, బీట్రూట్ జ్యూస్ వేసి సన్నని మంటమీద తిప్పుతూ తీగపాకం రానివ్వాలి పాకం వచ్చిన తరువాత కలిపిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేస్తూ కలుపుకోవాలి. చక్కగా కలిపాక అరకప్పు నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి.నెయ్యి మొత్తం మిశ్రమంలో ఇగిరిపోయి , చిక్కబడిన తరువాత దించేసి, నెయ్యి రాసిన ప్లేటులో పోయాలి. గంట ఆరాక ముక్కలు కోసుకుని సర్వ్‌చేసుకోవాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ మైసూర్ పాక్ రెడీ. -
బీట్రూట్ జ్యూస్ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్ వల్ల..
ఎండలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. చిటపటా చినుకులు పడుతున్నాయి. రుతు సంధి కారణంగా అంటే సీజనల్ మార్పుల వల్ల ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు రావడం సహజం. ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి వాటిలో బీట్రూట్ ఉత్తమమైనది. ప్రోటీన్లు విటమిన్లు పుష్కలంగా ఉండే బీట్రూట్తో తయారు చేసిన ఆహారాలను ప్రతిరోజు తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి లోపం సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్లో ఏయే పోషకాలుంటాయి? బీట్రూట్లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని సలాడ్‌లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.. ఇది కణాల పెరుగుదలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బీట్రూట్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల రక్తహీనత, రోగ నిరోధక శక్తి సమస్యలనుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. బీట్రూట్లో అధిక మోతాదులో లభించే నైట్రేట్ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా రక్తంలో గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా రక్తప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే బీట్రూట్ శరీరంలో శక్తి స్థాయులను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తరచు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. బీట్రూట్ ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఫోలేట్, ఫైబర్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. బీట్రూట్ రసాన్ని తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు బీట్రూట్ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. (చదవండి: ఇలా చేస్తే ముఖంపై మొటిమలు మాయం! చక్కటి నిగారింపు మీ సొంతం) -
Summer Care: టొమాటో జ్యూస్, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే!
వేసవి వచ్చేసింది. చలికాలంలో లాగే వేసవిలో కూడా చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎందుకంటే, వేసవిలో చర్మం ట్యానింగ్, నిగారింపు కోల్పోవడం, పొడిగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే రోజూ ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోవల్సిందే. వీటివల్ల చర్మకాంతి పెరిగి యౌవనంగా కనిపిస్తారు. ఆరెంజ్ జ్యూస్ చర్మకాంతిని పెంచే విటిమిన్ సి సమృద్ధిగా ఉండేవాటిలో నారింజ లేదా కమలా పండ్లు ముందుంటాయి. నారింజ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది కాబట్టి క్రమం తప్పకుండా ఆరంజ్ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. టొమాటో జ్యూస్ టొమాటోలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధకత శక్తిని కలిగిస్తాయి. రోజూ టొమాటో జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం యౌవనంగా, కాంతిమంతంగా ఉంటుంది. టొమాటోను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి అద్భుత ఔషధం బీట్రూట్ జ్యూస్. ప్రతిరోజూ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు సమృద్ధిగా ఉండేది దానిమ్మలోనే. అందువల్ల రోజూ దానిమ్మ జ్యూస్ సేవించడం ద్వారా చర్మంలో నిగారింపు వస్తుంది. ముఖంలో కాంతి వస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్థులు కూడా దానిమ్మ జ్యూస్ తీసుకోవచ్చు. అయితే అందులో రుచికి పంచదార కలుపుకోకూడదు. గ్రీన్ టీ కేవలం బరువు తగ్గించేందుకే కాకుండా చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్ టీ. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. చదవండి: ఒత్తిడికి దూరంగా ఉండాలంటే..? -
Recipe: బీట్రూట్, డ్రై ఫ్రూట్స్‌తో కేక్ తయారు చేసుకోండిలా!
రొటీన్‌గా కాకుండా ఇలా బీట్రూట్ చీజ్ కేక్ తయారు చేసుకోండి! ఇంట్లోనే కొత్త రుచులు ఆస్వాదించండి! కావలసినవి: ►వాల్నట్స్ – 150 గ్రాములు ►ఎండు అంజీరాలు – 8 ►దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్ ►ఉప్పు – చిటికెడు ►బీట్రూట్ తురుము – 300 గ్రాములు ►కోకోనట్ చీజ్ – 200 గ్రాములు ►కోకో పౌడర్, కొబ్బరి నూనె, నెయ్యి, మేపుల్ సిరప్ (మార్కెట్లో దొరుకుతుంది) – 4 టేబుల్ స్పూన్ల చొప్పున ►బాదం పాలు – 2 టేబుల్ స్పూన్లు ►పిస్తా పొడి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ►ముందుగా వాల్నట్స్ని మిక్సీ పట్టుకోవాలి. ►అందులో ఎండు అంజీరాలు, దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని.. నెయ్యి కలిపి, పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం బీట్ రూట్ తురుము, కోకోనట్ చీజ్, బాదం పాలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల మేపుల్ సిరప్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. ►తర్వాత ఒక కేక్ ట్రేలో ముందు వాల్నట్ మిశ్రమాన్ని .. దానిపైన బీట్రూట్ మిశ్రమాన్ని పరచాలి ►కాస్త ఆరి, గట్టిపడిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ►సర్వ్ చేసుకునే ముందు.. మిగిలిన కోకో పౌడర్, కొబ్బరి నూనె, మేపుల్ సిరప్ వేసుకుని బాగా కలిపి.. కోన్ మాదిరి కవర్లో చుట్టాలి. ►నచ్చిన డిజైన్‌లో కేక్ ముక్కలపై గార్నిష్ చేసుకుని.. వాటిపై పిస్తా పొడిని జల్లుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: Keema Ragi Ponganalu: కీమా – రాగి పొంగనాలు తయారు చేసుకోండిలా! Udupi Sambar: రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్ తయారీ ఇలా -
Health: మలబద్ధకం నివారణ... మరికొన్ని ప్రయోజనాలు!! ఇవి తరచుగా తింటే..
Health Tips In Telugu- Constipation (Malabaddakam): మలబద్ధకం అన్నది ఉదయాన్నే చాలామందిని బాధపెడుతుంది. సాఫీగా విరేచనం జరగకపోతే పొద్దున్నే లేచింది మొదలు రోజంతా ఇబ్బందికరంగానే గడుస్తుంది. అయితే మన రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని, కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటుంటే మల బద్ధకం సమస్య చాలా సులువుగానే దూరమవుతుంది. అయితే ఈ మార్గాలతో కేవలం మలబద్ధకం నివారణ మాత్రమే కాకుండా అనేక అదనపు ప్రయోజనాలూ ఒనగూరతాయి. జీర్ణాశయం మార్గం శుభ్రంగా పీచు మోతాదు ఎక్కువగా ఉండే ఆహారాలు, పండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మలబద్ధకం సమస్య దరిచేరదన్న విషయం తెలిసిందే. ఆ ఆహారాలు కేవలం మలబద్ధకాన్ని నివారించడం మాత్రమే కాదు... పూర్తి జీర్ణాశయం మార్గాన్నీ శుభ్రంగా ఉంచుతాయి. ఇందుకోసం భోజనంలో ఎక్కువమొత్తంలో ఆకుకూరలు, కాయగూరలు, ఫైబర్ ఎక్కువగా ఉండే కాయధాన్యాలు తీసుకోవాలి. చక్కెర మోతాదులు నియంత్రణలో వీటితో పాటు పీచు మోతాదులు పుష్కలంగా ఉండే పుచ్చకాయలు, బొప్పాయి, నారింజ వంటి పండ్లు తీసుకోవాలి. వీటితో మరో అదనపు ప్రయోజనం ఏమిటంటే... అవి తేలిగ్గా విరేచనమయ్యేలా చేయడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్‌నూ, చక్కెర మోతాదుల్ని నియంత్రణలో ఉంచడానికీ తోడ్పడతాయి. సలాడ్స్ రూపంలో.. చిక్కుడు కాయల వంటి కూరల్లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువే. చిక్కుళ్లు కండరాల రిపేర్లకూ, శక్తికీ, ఆరోగ్యకరమైన కండరాలకూ దోహదపడతాయి. అలాగే వాటిలోని పీచుపదార్థాలూ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. క్యారట్, బీట్రూట్ వంటి వాటిల్లోనూ ఫైబర్ ఎక్కువే. వీటిని కూరలుగా తీసుకోవచ్చు. అయితే కొంతమందికి అవి కూరలుగా అంతగా నచ్చకపోవచ్చు. అలాంటివారు సలాడ్స్ రూపంలో లేదా సూప్‌గానూ తీసుకోవచ్చు. చర్మ నిగారింపునకై పీచుపదార్థాలుండే ఆహారాలతో పాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా విరేచనం సాఫీగా అవుతుంది. జీర్ణ వ్యవస్థ మార్గమూ శుభ్రపడుతుంది. దేహం హైడ్రేటెడ్‌గానూ ఉంటుంది. ఫలితంగా మలబద్ధక నివారణే కాదు చర్మానికి మంచి నిగారింపుతో కూడిన మెరుపును ఇవ్వడంతో పాటు మరెన్నో జబ్బుల నివారణకూ ఈ అంశం తోడ్పడుతుంది మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇక్కడ పేర్కొన్న మార్గాలు కేవలం మలబద్ధకం నివారణ కోసం మాత్రమే కాకుండా... దాదాపు ప్రతి ఒక్కటి మన వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, జీర్ణవ్యవస్థలోని పిండి పదార్థాలను (కార్బోహైడ్రేట్స్‌ను) రక్తంలోకి ఆలస్యంగా వెలువడేలా చేయడం ద్వారా మధుమేహాన్ని నివారించడం, మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పించడం వంటి పనులూ చేస్తాయి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. చదవండి: రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే.. తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే.. -
మొటిమలు, మచ్చల నివారణ.. ఈ ప్యాక్స్ ప్రయత్నించండి
బీట్రూట్ ఆరోగ్య పరిరక్షణకే కాదు, మంచి సౌందర్య సాధనంగా కూడా ఉపకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, జింక్ పింపుల్స్, వాటి మచ్చలను తొలగించడానికి చాలా సమర్థంగా పనిచేస్తాయి. మీకు పింపుల్స్ సమస్య ఉంటే.. ఈ ప్యాక్స్ ప్రయత్నించి చూడండి. రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. పింపుల్స్, వాటి తాలూకూ మచ్చలు తొలగుతాయి. బీట్రూట్ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. అరంగటపాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది. (క్లిక్ చేయండి: రోజూ తలస్నానం చేస్తున్నారా? కీర దోస జ్యూస్‌తో లాభాలివే!) -
Beauty Tips: బీట్రూట్ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే..
బీట్రూట్ అలోవెరా జెల్‌తో తయారు చేసిన క్రీమ్‌ను ముఖానికి రాసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉండడమేగాక, అందంగా కనిపిస్తుంది. మార్కెట్లో దొరికే క్రీమ్ కంటే ఇంట్లో తయారు చేసినది మరింత బాగా పనిచేస్తుంది. ►రెండు టీస్పూన్ల బీట్రూట్ రసంలో రెండు టీస్పూన్ల అలోవెరా జెల్‌ను వేసి జెల్లా చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని గాలిచొరబడని కంటైనర్‌లో వేసి నిల్వ చేసుకోవాలి. ►ముఖాన్ని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడవాలి. ►ఇప్పుడు బీట్రూట్ క్రీమ్‌ను ముఖానికి రాసి మర్దన చేయాలి. ►ఈ క్రీమ్ రాసిన తరవాత ఇతర క్రీములుగానీ, జెల్స్గానీ రాయకూడదు. ►రోజూ క్రమం తప్పకుండా ఈ క్రీమ్ అప్లై చేయడం వల్ల ముఖం మీద మొటిమలు, చిన్నచిన్న పొక్కులు, మచ్చలు తగ్గిపోతాయి. ►అలోవెరా జెల్లో తొంభై శాతం నీరు ఉండడం వల్ల చర్మానికి మాయిశ్చర్ అందుతుంది. ►ఈ క్రీమ్‌లోని విటమిన్స్, ఖనిజపోషకాలు, సాల్సిలిక్ ఆమ్లం, లిగ్నిన్, సపోనిన్, ఎమినో యాసిడ్స్ చర్మసమస్యలను తగ్గిస్తాయి. చదవండి: Beauty Tips: వేప, తేనె, పాలు.. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే! Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే! -
Recipe: బీట్రూట్ రైస్ బాల్స్ ఇలా తయారు చేసుకోండి!
ఆరోగ్యకరమైన బీట్రూట్ రైస్ బాల్స్ ఇలా తయారు చేసుకోండి! బీట్రూట్ రైస్ బాల్స్ తయారీకి కావలసినవి: ►బీట్రూట్ జ్యూస్ – ముప్పావు కప్పు ►రైస్ పౌడర్ – అర కప్పు ►►జొన్నపిండి – 1 టేబుల్ స్పూన్ ఉప్పు – తగినంత బీట్రూట్ రైస్ బాల్స్ తయారీ విధానం: ►ముందుగా బీట్రూట్ జ్యూస్‌లో కొద్దిగా ఉప్పు వేసుకుని.. చిన్న మంట మీద మరిగించాలి. ►అనంతరం రైస్ పౌడర్ వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►దగ్గర పడే సమయంలో మళ్లీ జొన్నపిండి వేసి తిప్పుతూ ఉండాలి. ►బాగా దగ్గర పడిన తర్వాత చల్లార్చి.. చేతులకు నూనె రాసుకుని.. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ►వాటిని ఆవిరిపై బాగా ఉడికించుకుని.. కారంగా కావాలంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, ఆవాలు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. ►తీపిగా కావాలంటే.. కొబ్బరికోరు, బెల్లంకోరు బాగా కలుపుకుని.. అందులో ఈ ఉండలను వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇవి కూడా ట్రై చేయండి: Sesame Crusted Chicken: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్ చికెన్! Maggi Vada: మ్యాగీ వడ.. ఇలా తయారు చేసుకోండి! -
Health: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో ఒక్కటే కాదు గుమ్మడి, గోధుమ గడ్డి..
Super Foods To Increase Platelet Count: ప్రస్తుత కాలంలో డెంగ్యూ జ్వరాలు, వైరల్ ఫీవర్ల మూలాన ప్లేట్లెట్ల కౌంట్ విపరీతంగా పడిపోతూ రోగులను, వారి సంబంధీకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, ప్లేట్లెట్ల కౌంట్ పడిపోయిన తర్వాత చేయగలిగిందేమీ లేదు, దాతలనుంచి సేకరించిన ప్లేట్లెట్లను రోగులకు ఎక్కించడం మినహా. అలా కాకుండా, మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధకతను పెంచే ఆహారం ఏమిటో తెలుసుకుందాం. రక్తాన్ని పెంచే క్యారట్.. ప్లేట్లెట్ కౌంట్‌ని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందారని సర్వేలో తేలింది. క్యారెట్‌ని నేరుగానైనా, సలాడ్ రూపంలోనైనా ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది. గుమ్మడికాయ.. ఎక్కువగా వంటల్లో ఉపయోగించే గుమ్మడిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అంతేనా.. ఇందులో ప్లేట్లెట్లని పెంచడమే కాదు, వాటి సంఖ్యను అదుపులో ఉంచే లక్షణాలు కూడా ఉన్నాయి. దీన్ని క్రమబద్ధంగా తీసుకోవడం వల్ల కణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ప్రోటీన్ ఉత్పత్తి అవడమంటే ప్లేట్లెట్స్కౌంట్ పెరిగినట్లే. బొప్పాయి బొప్పాయి పండు ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చాలా మంచిదని తెలుసు. అయితే, కేవలం పండులో మాత్రమే కాదు.. ఈ ఆకుల్లోనూ బోలెడు ఆరోగ్యానికి సంబంధించిన గుణాలున్నాయి. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్స్, అల్కాలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల 24 గంటల్లోనే ప్లేట్లెట్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ ఆకు రుచి మాత్రం కాస్త చేదుగానే ఉంటుంది. కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోకతప్పదు. గోధుమగడ్డి.. ఈ మధ్యకాలంలో చాలామందికి ఆరోగ్యంపై పెరిగిన అవగాహన కారణంగా.. గోధుమగడ్డి గురించి అందరూ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇందులోని ఎన్నో ప్రత్యేక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి.. ఈ గడ్డిని రసంగా చేసుకుని వడపోసి అందులో కాస్త నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ సులభంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బీ 12 ఫుడ్.. ►పాలు, గుడ్లు, చీజ్‌లో బీ 12 ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పెరుగుతుందని తేలింది. ►బీట్ రూట్.. ఎరుపు రంగులో ఉండే బీట్రూట్.. శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది. దీనిని ఎలా తీసుకున్నా మంచిదే. దీని వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. ►క్యారట్, బీట్రూట్ని కలిపి జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితమే ఉంటుంది. విటమిన్ కె ఫుడ్.. విటమిన్ కె ఉన్న ఫుడ్ కూడా ప్లేట్లెట్స్ సంఖ్యని పెంచుతుందని తేలింది. కేల్, గుడ్లు, ఆకుకూరలు, లివర్, మాంసం, క్యాబేజీ తినడం వల్ల కూడా ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. విటమిన్ సి ఫుడ్.. ►ఆరోగ్యానికి విటమిన్ సి చాలా అవసరం. ►విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీ, టమాట, అడవి ఉసిరి, కాలీఫ్లవర్ తినడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని తేలింది. ►ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి కౌంట్‌ని పెంచడంలో ఈ ఆహారపదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ►ప్లేట్లెట్స్ పడిపోయిన వారు సమస్యని పరిష్కరించుకునేందుకు వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ►ఒకవేళ తినడం కష్టం అనుకుంటే వీటితో సలాడ్ చేసి భోజనానికి ముందుగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక కమలాఫలాల్ని జ్యూస్‌లా చేసుకోని ►తాగేయొచ్చు. ►ముఖ్య విషయం ఏమిటంటే.. పైన చెప్పిన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం ప్లేట్లెట్స్ సంఖ్య ఒక్కటే పెరగదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిలో వ్యాధి నిరోధకత ఒకటి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. -
Health Tips: క్యారెట్లు, బీట్రూట్ తరచుగా తింటున్నారా? డేంజర్!
Health Reasons Not to Eat These Vegetables Too Much: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రకాల కూరగాయల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎలాంటి కూరగాయలను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన కూర అయినప్పటికీ ఇది అందరికీ పడదు. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీనివల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కాలీఫ్లవర్‌ను ఎప్పుడూ పచ్చిగా తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని పచ్చిగా తినడం వల్ల కడుపు నొప్పి రావడంతోపాటు పొట్టలో దీర్ఘకాలిక సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి. పుట్టగొడుగులు పుట్టగొడుగులు శరీరానికి మంచి పోషకాహారం అయినప్పటికీ దీనిని అతిగా తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. అలెర్జీ సమస్యలు వస్తాయి. అందువల్ల వీటిని తీసుకున్నప్పుడు ఏవైనా తేడాగా అనిపిస్తే దానికి దూరంగా ఉండటం మేలు. వండుకునేటప్పుడు కూడా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. క్యారట్లు క్యారట్లలో బాడీకి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. కానీ వీటిని పచ్చిగా తింటే.. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తినేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీటిని అతిగా తీసుకుంటే.. చర్మం రంగు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. బీట్రూట్ బీట్రూట్స్ను సలాడ్లలో ఎక్కువగా వినియోగిస్తారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలున్నా.. అతిగా తీసుకుంటే శరీరానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. అందువల్ల ఎవరైనా సరే, వీటిని పరిమిత పరిమాణంలో తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. చదవండి: Hypothyroidism During Pregnancy: రెండో నెల.. హైపో థైరాయిడ్! డైట్‌తో కంట్రోల్ చెయ్యొచ్చా? Bone Pain: ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకున్నారంటే! -
Recipe: బీట్రూట్ బజ్జీ ఇలా తయారు చేసుకోండి!
వర్షాకాలంలో బీట్రూట్ బజ్జీ ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని ఎంచక్కా తినేయండి! బీట్రూట్ బజ్జీ తయారీకి కావలసినవి: ►బీట్రూట్ – 3 (పెద్దవి, పైతొక్క తొలగించి.. గుండ్రటి చక్రాల్లా కట్ చేసుకోవాలి) ►శనగపిండి – 1 కప్పు, ఉప్పు, కారం – సరిపడా, కార్న్ పౌడర్ – పావు కప్పు ►బేకింగ్ సోడా – కొద్దిగా, నీళ్లు – కావాల్సినన్ని ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా బీట్రూట్ బజ్జీ తయారీ: ►ముందుగా ఒక బౌల్లో శనగపిండి, కార్న్ పౌడర్, ఉప్పు, కారం, గరం మసాలా, బేకింగ్ సోడా వేసుకోవాలి. ►కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ తోపులా చేసుకోవాలి. ►అందులో బీట్రూట్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ముంచి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ►ఈ బజ్జీలను వేడి వేడిగా ఉన్నప్పుడే సాస్ లేదా చట్నీల్లో నంజుకుని తింటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Corn Palak Pakoda Recipe: స్వీట్ కార్న్, పాలకూర.. కార్న్ పాలక్ పకోడి Idiyappam Pulihora Recipe: బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి.. ఇడియప్పం పులిహోర -
Beauty Tips: బీట్రూట్ రసం, కార్న్ ఫ్లోర్.. గులాబీ రేకుల్లాంటి పెదాలు!
పెదాలు ఆకర్షణీయమైన గులాబీ రంగులో ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారు ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి! బ్రష్‌తో ఇలా ►ఉదయాన్నే బ్రష్ చేసిన తరువాత.. బ్రష్ మీద కొద్దిగా తేనె వేసి రెండు పెదవులపైన గుండ్రంగా ఐదు నిమిషాలపాటు రుద్దాలి. ►ఇలా రోజూ చేయడం వల్ల పెదాలపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. ►పెదాలకు మర్ధన జరిగి రక్తప్రసరణ సక్రమంగా అందుతుంది. ►పెదవులు మృదువుగా మారతాయి. బీట్రూట్ రసంతో.. ►ఉదయం బ్రష్‌తో మర్ధన చేసాక, రాత్రి పడుకునేముందు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాయాలి. ►ఇందుకోసం.. కొద్దిగా బీట్రూట్ రసాన్ని వేడి చేయాలి. ►అలా వేడిచేసిన రసంలో అరటీస్పూను కార్న్‌ప్లోర్ వేసి ఐదు నిమిషాలు కలియబెట్టి తర్వాత దించేయాలి. ►చల్లారిన తరువాత ఈ మిశ్రమంలో అరటీస్పూను గ్లిజరిన్, పావు టీస్పూను కొబ్బరి నూనె కలిపి ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వచేయాలి. ►ఈ మిశ్రమం గట్టిపడిన తరువాత పెదవులకు రాసి మర్ధన చేసి పడుకోవాలి. ►ఉదయం నీటితో కడిగేయాలి. ►ఈ రెండింటిని ఒకదాని తరువాత ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తే పెదవులు గులాబిరేకుల్లా కోమలంగా పింక్ కలర్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చదవండి: Apple Cider Vinegar Benefits: యాపిల్ సైడర్ వెనిగర్‌తో లాభాలెన్నో! మచ్చలు, చుండ్రు మాయం! Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు.. -
Health Tips: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! నిర్లక్ష్యం వద్దు! ఇవి తింటే...
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. అదే విధంగా.. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పొటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పొటాషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి. పొటాషియం లోపిస్తే మన శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. ►కండరాలు బలహీనంగా మారుతాయి. ►కండరాలు పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. ►అలసట, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం, ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, హైపోకలేమియా, వాంతులు, విరేచనాలు అవుతుండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►కొందరికి మలంలో రక్తం కూడా వస్తుంది. ►అందువల్ల శరీరంలో పొటాషియం లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. ►సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది. మనం తినే ఆహారాల నుంచే మనకు పొటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు. పొటాషియం ఎందులో లభిస్తుందంటే(Potassium Rich Foods).. ►కోడిగుడ్లు ►టమాటాలు ►చిలగడ దుంపలు ►విత్తనాలు ►నట్స్ ►అరటి పండ్లు ►యాప్రికాట్స్ ►చేపలు ►తృణ ధాన్యాలు ►పెరుగు ►పాలు ►మాంసం ►తర్బూజా ►క్యారెట్ ►నారింజ ►కివీ ►కొబ్బరినీళ్లు బీట్రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం విరివిగా లభిస్తుంది కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా ఉంటుంది. చదవండి: Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే.. 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! -
క్యాన్సర్‌తో బాధపడుతున్నారా.. బీట్రూట్ తిన్నారంటే..!
బీట్రూట్ క్యాన్సర్‌ను మూడు విధాలుగా నివారిస్తుంది. 1) బీట్రూట్లో బిటాలెయిన్స్ అనే పోషకం ఉంటుంది. బీట్రూట్కు ఎర్రటి రంగునిచ్చేది ఇదే. ఇదో శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్. అంతేకాదు... బీట్రూట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. క్యాన్సర్‌ను నివారించడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీలక భూమిక పోషిస్తాయి. బీటాలెయిన్స్లో ఉన్న యాంటీక్యాన్సరస్ గుణాల సహాయంతో అది క్యాన్సర్‌ను నివారిస్తుంది. 2) బీట్రూట్లో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్–సి వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుందన్న విషయం తెలిసిందే. బీట్రూట్ వాడటం వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ బలోపేతమౌతుంది. అది క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. 3) బీట్రూట్ రక్తంలోని హీమోగ్లోబిన్ను పెంచడం ద్వారా అన్ని కణాలకూ ఆక్సిజన్‌ను పెంచడానికి దోహదపడుతుంది. ఆక్సిజన్‌కు క్యాన్సర్‌ను తుదముట్టింటే శక్తి ఉంటుంది. పెరిగిన హీమోగ్లోబిన్ వల్ల, బీట్రూట్లోని పోషకాల వల్ల ఎక్కువ సేపు, మరింత స్టామినాతో వ్యాయామం చేసే సామర్థమూ పెరుగుతుంది. దాంతో కణాలకు ఆక్సిజన్ సప్లై మరింత పెరుగుతుంది. ఈ అంశం కూడా క్యాన్సర్ నివారణకు తోడ్పడేదే. వెరసి... ఇలా ఈ మూడంశాల ముప్పేట దాడితో క్యాన్సర్‌ను బీట్రూట్ సమర్థంగా నివారిస్తుంది. చదవండి: Cancer Prevention: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..! -
Health: పైల్స్‌తో బాధపడుతున్నారా? వీటిని తగ్గించండి! ఇవి తింటే మేలు!
Diet Tips For Control Piles: కొందరికి నిద్రలేవగానే టాయిలెట్‌కి వెళ్లాలంటే నరకమే. పైల్స్ మూలాన తీవ్ర రక్తస్రావం. నొప్పితో బాధపడుతుంటారు. అయితే పైల్స్ ఉన్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం లేదా బాగా తగ్గించి తినడం వల్ల కొంత మేలు జరుగుతుంది. అవేమిటో చూద్దాం... ►పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు మొదలైనవి. ►ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసాలు. ఎందుకంటే వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. మలబద్దకానికి దారితీసి, ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ►వేయించిన ఆహారం: ఇది మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది కాబట్టి ఫ్రై చేసిన వాటికి దూరంగా ఉండటం మంచిది. ►ఉప్పు అధికంగా తినొద్దు. ►కారంగా ఉండే ఆహారాలు: ఫైబర్ తక్కువగా ఉండకూడదు, కారంగా ఉండే ఆహారం నొప్పిని పెంచుతుంది. ►కెఫిన్ ఉన్న ఆహార పానీయాలు: ముఖ్యంగా కాఫీ, టీల వల్ల పైల్స్ సమస్య పెరుగుతుంది. అందువల్ల వాటిని వీలయినంత వరకు తగ్గించడం మేలు. ►ఆల్కహాల్: కెఫిన్ పానీయాల మాదిరిగా, ఆల్కహాల్‌తో కూడిన పానీయాలు మలాన్ని గట్టిగా ఉండేలా చేస్తాయి. తద్వారా మోషన్‌కి వెళ్లేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకని పైల్స్ సమస్య మరింత పెరగకుండా ఉండేందుకు ఆల్కహాల్ మానుకోవడం మంచిది. వీటిని తినండి.. ►బార్లీ ►క్వినోవా ►బ్రౌన్ రైస్ ►వోట్స్ ►చిక్కుళ్ళు వంటి అధిక ఫైబర్ ఉన్న వాటిని మీ ఆహారంలో తీసుకోండి. ►క్యారట్ ►బీట్రూట్ ►బ్రోకలీ ►కాలీఫ్లవర్ ►కాలే ►క్యాబేజీ ►గుమ్మడికాయ ►బెల్ పెప్పర్స్ ►దోసకాయ ► జామపండు ►బొప్పాయి వంటి పండ్లు కూరగాయలు తినండి. చదవండి: ఔషధాల ఖజానా పుదీనా Urinary Incontinence: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్మెంట్ ఉందా? -
Beetroot: ముఖం మీది మొటిమలు, మృత కణాలు ఇట్టే మాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న బీట్రూట్ అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మొటిమలను వదిలించడంలో ఇవి రెండూ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక వీటికి జింక్, యాంటీబయోటిక్స్ తోడైతే మొటిమలు త్వరగా తగ్గుతాయి. అందువల్ల మొటిమలతో బాధపడుతున్నవారు బీట్రూట్ ప్యాక్‌ను ప్రయత్నిస్తే మంచి ఫలితం వస్తుంది. బీట్రూట్ ప్యాక్ తయారీ: ►రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనివ్వాలి. ►తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల ముఖం మీది మొటిమలు, వాటి తాలుకూ మచ్చలు పోయి ముఖం కాంతిమంతమవుతుంది. ►వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఫలితం త్వరగా కనిపిస్తుంది. ►అదే విధంగా రోజూ ముఖానికి బీట్రూట్ రసం రాసి పది నిమిషాలపాటు మర్దన చేస్తే ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగి పోతాయి. చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల... -
స్వీట్ కార్న్ లాలీపాప్స్, చికెన్ బీట్రూట్ సమోసా తయారీ ఇలా..
వెరైటీగా ఈ వంటకాలు ట్రై చేయండి. మీ కుటుంబానికి కొత్త రుచులు పరిచయం చేయండి. స్వీట్ కార్న్ లాలీపాప్స్ కావలసిన పదార్థాలు చిల్లీ ఫ్లేక్ మిరియాల పొడి జీలకర్ర ధనియాలు – అర టీ స్పూన్ చొప్పున పచ్చిమిర్చి – 2 స్వీట్ కార్న్ – ఒకటిన్నర కప్పులు ఉప్పు – తగినంత కార్న్ ఫ్లేక్స్ – ముప్పావు కప్పు (మరీ మెత్తడి పొడిలా కాకుండా.. చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి) బంగాళ దుంప తురుము – అర కప్పు మొక్కజొన్న పిండి – 2 టీ స్పూన్లు మైదా పిండి – 1 టీ స్పూన్ నీళ్లు – కొద్దిగా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. చిన్న మంటపైన జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ వేసుకుని బాగా వేయించాలి. అందులో చిల్లీ ఫ్లేక్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అవన్నీ మిక్సీలో వేసుకుని మిక్సీపట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని, అందులో బంగాళదుంప తురుము, అర కప్పు కార్న్ ఫ్లేక్స్ వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకుని, చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో మైదా పిండి, మొక్కజొన్న పిండి వేసుకుని నీళ్లతో కాస్త పలచగా కలపాలి. ఆ మిశ్రమంలో బాల్స్ ముంచి, మిగిలిన కార్న్ ఫ్లేక్స్ ముక్కలని పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ లాలీపాప్స్. చికెన్ బీట్రూట్ సమోసా కావలసిన పదార్థాలు బోన్‌లెస్ చికెన్ – పావు కప్పు (ఉప్పు, కారం, పసుపుతో పాటు మసాలా వేసి, మెత్తగా ఉడికించి, తురుములా చేసుకోవాలి) బీట్రూట్ తురుము – 4 టేబుల్ స్పూన్లు సోయా సాస్, టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – 1 కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్ బీట్రూట్ రసం – సరిపడా (చపాతీ ముద్ద కోసం నీళ్లకు బదులుగా బీట్రూట్ రసం కలుపుకోవాలి) ఉప్పు – సరిపడా నూనె – తగినంత తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో బీట్రూట్ తురుము, మిరియాల పొడి, చికెన్ తురుము, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, కొద్దికొద్దిగా బీట్రూట్ రసం పోసుకుంటూ, ఉప్పు వేసి చపాతీ ముద్దలా చేసుకోవాలి. దానిపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా వత్తి, సమోసాలా చుట్టి అందులో చికెన్ మిశ్రమాన్ని వేసి ఫోల్డ్ చెయ్యాలి. వాటిని నూనెలో వేయించి తీస్తే.. సరిపోతుంది. చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
బీట్రూట్ పాప్ కార్న్ ఎప్పుడైనా తిన్నారా? మరీ బెల్గావి స్వీట్.. ఇంట్లోనే ఈజీగా
ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ ఆరోగ్యానికి మేలు చేయడమేకాకుండా డబ్బును ఆదా చేస్తుంది. వెరయిటీగా ఈ వంటకాల తయారీని ప్రయత్నించి చూద్దాం.. బెల్గావి స్వీట్ చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు. కావల్సిన పదార్థాలు ►వెన్నతీయని పాలు – కప్పు ►పంచదార – అర కప్పు ►కోవా – ముప్పావు కప్పు ►పెరుగు – టేబుల్ స్పూను ►జీడిపప్పు పలుకులు – నాలుగు టేబుల్ స్పూన్లు ►యాలకుల పొడి – అరటీస్పూను. తయారీ విధానం ►స్టవ్ మీద నాన్‌స్టిక్ బాణలి పెట్టి పంచదార వేయాలి. ►మీడియం మంట మీద పంచదార బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ►రంగు మారగానే మంట తగ్గించి పాలు పోయాలి. ►ఇప్పుడు మీడియం మంట మీద పాలు కాగనివ్వాలి. పాలుకాగాక, పెరుగు వేసి తిప్పాలి. పాలు విరిగినట్లుగా అవుతాయి. అప్పుడు కోవా వేసి బాగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలపాటు ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరి దగ్గర పడుతున్నప్పుడు జీడిపప్పు, యాలకుల పొడి వేసి తిప్పితే బెల్గావి రెడీ. బీట్రూట్ పాప్ కార్న్ కావల్సిన పదార్థాలు ►బీట్రూట్ – 1 (ముక్కలు కట్ చేసుకుని, ఒక గ్లాసు వాటర్ కలిపి, మిక్సీ పట్టి, వడకట్టుకుని రసం తీసుకోవాలి) ►పంచదార – అర కప్పు ►మొక్కజొన్న గింజలు – 1 కప్పు ►యాలకుల పొడి – కొద్దిగా ►రెయిన్బో స్ప్రింకిల్స్ – 1 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి) ►నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, పాత్రలో పంచదార, బీట్రూట్ జ్యూస్ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈలోపు మరో స్టవ్ మీద కుకర్‌లో నూనె వేసుకుని, మొక్కజొన్న గింజలు వేసుకుని పాప్‌కార్న్ చేసుకోవాలి. తర్వాత అందులో పంచదార, బీట్ రూట్ జ్యూస్ మిశ్రమాన్ని వేసి, పాప్ కార్న్‌కి బాగా పట్టించాలి. చివరిగా రెయిన్బో స్ప్రింకిల్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
భలే రుచిగా బీట్రూట్ రొయ్యల కబాబ్స్.. ఎలా చేయాలంటే..
బీట్రూట్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక రొయ్యలు సంగతి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ఈ రెండింటి కాంబినేషన్లో రుచి కరమైన కబాబ్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు: ►పెద్ద రొయ్యలు – అర కప్పు (శుభ్రం చేసి, ఉప్పు, కారం, పసుపు పట్టించి కుకర్‌లో 3 విజిల్స్ వేయించి పెట్టుకోవాలి) ►కిడ్నీ బీన్స్ (రాజ్మాగింజలు) – 1 కప్పు (నానబెట్టి, మిక్సీ పట్టుకోవాలి) ►బీట్రూట్ ముక్కలు – అర కప్పు (ముక్కలు కట్ చేసుకుని, మిక్సీ పట్టుకోవాలి) ►అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ చొప్పున, మిరియాల పొడి – కొద్దిగా, ఉప్పు – తగినంత, శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు ►ఆల్మండ్ పొడి – 1 టేబుల్ స్పూన్ ►కారం – 2 టీ స్పూన్లు, బంగాళదుంప – 1 (ఉడికించి గుజ్జులా చేసుకోవాలి) ►రోజ్ వాటర్ – 1 టీ స్పూన్, నువ్వులు – గార్నిష్‌కి ►చీజ్ – పావు కప్పు(ముక్కలుగా) ►నూనె – సరిపడా తయారీ విధానం: ముందుగా ఉడికిన రొయ్యలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. అందులో కిడ్నీ బీన్స్ మిశ్రమం, బీట్రూట్ గుజ్జు వేసుకుని తిప్పుతూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, శనగపిండి, ఆల్మండ్ పొడి, కారం, బంగాళదుంప గుజ్జు, రోజ్ వాటర్ వేసుకుని గరిటెతో బాగా కలపాలి. మూతపెట్టి 20 నిమిషాల పాటు చిన్న మంటపైన మధ్య మధ్యలో తిప్పుతూ మగ్గనివ్వాలి. అనంతరం చల్లారనిచ్చి.. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని, మధ్యలో చిన్న చీజ్ ముక్క పెట్టుకుని మళ్లీ బాల్లా చేసుకుని కట్లెట్ మాదిరి ఒత్తుకుని.. ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి.. కొద్దిగా నూనె పూసిన చేతులతో ప్రతి కట్లెట్కి నువ్వులు అతికించి బేక్ చేసుకుంటే భలే రుచికరంగా ఉంటాయి. చదవండి: నోరూరించే స్వీట్ పాన్ లడ్డూ.. ఇలా తయారు చేసుకోవాలి.. -
బీట్రూట్, క్యారట్, గ్రీన్ టీ.. వీటిని తరచుగా తీసుకుంటే..
శరీరంలో ఏ అవయవానికి జబ్బుచేసినా కష్టమే. ఇప్పటి కరోనా పరిస్థితుల్లో కాలేయం(లివర్) సమస్యలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు తింటే ఏ సమస్యా రాకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.. ►యాంటీ ఆక్సిడెంట్స్.. బీట్ రూట్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అందువల్ల బీట్ రూట్‌ను కూరగా గానీ, సలాడ్‌గా కానీ తీసుకోవాలి. ►క్యారట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువల్ల క్యారట్‌ను నేరుగా గానీ జ్యూస్, సలాడ్, లేదా కూరగా చేసుకుని తింటే మంచిది. ►రోజూ నాలుగైదు సార్లు టీ తాగే అలవాటు ఉన్న వాళ్లు పాలతో చేసిన టీ కాకుండా గ్రీన్ టీ తాగితే లివర్‌కు మంచిది. లివర్‌కు కావాల్సిన పోషకాలు దీనిలో సమృద్ధిగా దొరుకుతాయి. ►కాలేయం చెడిపోకుండా చక్కగా ఉండాలంటే దైనందిన ఆహారంలో తప్పనిసరిగా పాలకూర ఉండేలా చూసుకోవాలి. దీనిలో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు, విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల పాలకూరను సూప్‌గా గానీ, కూరగా గానీ చేసుకుని తీసుకోవాలి. చదవండి: Health Tips In Telugu: రాజ్‌గిరతో ఆరోగ్యం.. పాలతో అరటిపండు కలిపి తింటే -
బీట్రూట్లోని ఏ పోషకం క్యాన్సర్‌ను నివారిస్తుంది?
చూడటానికి బీట్రూట్ ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటుంది. బీట్రూట్లోని ఆ ఎరుపు రంగుకు బిటాలెయిన్స్ అనే పోషకమే కారణం. ఇది ఒక చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. అది ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అలాగే విటమిన్–సి కూడా ఎక్కువే. ఇది కూడా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి క్యాన్సర్ల నివారణకు తోడ్పడటంతో పాటు కొలాజెన్ ఉత్పాదనకు తోడ్పడి... దీర్ఘకాలం చర్మంతో పాటు శరీరం యౌవనంగా ఉండటానికి దోహదం చేస్తుంది. పైగా బీట్రూట్ జ్యూస్ తీసుకునేవారిలో దానివల్ల అలసిపోకుండా చాలాసేపు ఉండగలిగే సామర్థ్యం (స్టామినా) పెంపొందుతుంది. దాంతో ఎంతసేపైనా అలసట లేకుండా వ్యాయామం చేయగలరు. వ్యాయామం క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా పరోక్షంగానూ బీట్రూట్ స్టామినాను పెంచడం ద్వారా కూడా క్యాన్సర్‌ను నివారిస్తుందన్నమాట. -
బీట్రూట్తో బెనిఫిట్స్ ఎన్నో...
ఆరోగ్యాన్ని పెంపొందించే కూరగాయలు ఎన్నో.. కానీ ఇలాంటి పౌష్టికాహారాన్ని ఎక్కువమంది ఇష్టపడరు. అలాంటి వాటిలో బీట్రూట్ కూడా ఒకటి. చూడ్డానికి అందంగా కనిపించని బీట్రూట్ దుంపను తినడానికి పిల్లలైతే మొఖం తిప్పేస్తారు. కానీ బీట్రూట్లో ఆరోగ్యసుగుణాలు మెండుగా ఉన్నాయనేది కాదనలేని సత్యం. బయట వందల రూపాయలు ఖర్చుపెట్టి హెల్త్ డ్రింకులను కొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కన్నా, బీట్ రూట్ లాంటి సహజ సిద్ధ ఆహారాన్ని పచ్చిగా తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా, కూర వండుకుని తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి బీట్రూట్లో ఉండే ప్రయోజనాలపై ఒక లుక్కేద్దాం.. ►బీట్రూట్లో ఫైటోన్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేగాక యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటీస్ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి. ►మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావాలంటే అవసరమయ్యే డైటరీ ఫైబర్(పీచుపదార్థం) బీట్రూట్లో దొరుకుతుంది. ఒక కప్పు బీట్రూట్లో గ్లుటమైన్, ఎమినో యాసిడ్స్, 3.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, మలబద్దకాన్ని నిరోధిస్తాయి. కోలన్ క్యాన్సర్ ముప్పును తొలగిస్తుంది. అంతేగాక జీవక్రియలను మెరుగుపరుస్తాయి. ►బీట్రూట్లో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల తిన్న తరువాత ఎక్కువసేపు ఆకలికూడా వేయదు. ►బీట్రూట్లో ఉన్న నైట్రేట్స్ రక్తప్రసరణను మెరుగు పరిచి మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తాయి. రక్త ప్రసరణ మంచిగా జరిగినప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపీడనం(బీపీ) నియంత్రణలో ఉండడం వల్ల హార్ట్ ఎటాక్స్ వంటి సమస్యలేవి తలెత్తవు. ►బీట్రూట్లో యాంటీ క్యాన్సర్ గుణాలు సమద్ధిగా ఉన్నాయి. తెల్లరక్తకణాల ఉత్పత్తిని బీట్రూట్ ప్రేరేపిస్తుంది. ఫలితంగా అసాధారణంగా జరిగే కణవిభజనను నిరోధిస్తుంది. ఫలితంగా ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా పనిచేస్తుందని చెప్పవచ్చు. ►బీట్రూట్ను రోజూ డైట్లో చేర్చుకుంటే శరీరంలో చెడుకొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రోజూ బీట్రూట్ జ్యూస్‌ను తాగితే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ►డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి బీట్రూట్ ఒక వరంలాంటిది. బీట్రూట్ను జ్యూస్‌రూపంలో డీ హైడ్రేషన్ బాధితులు తీసుకుంటే వారి సమస్య పరిష్కారమవుతుంది. మన శరీరానికి అవసరమైన నీరు బీట్రూట్ నుంచి దొరుకుతుంది. ►రక్తహీనత ఉన్నవారికి బీట్రూట్ ఒక దివ్యౌషధం. బీట్రూట్ను ప్రతిరోజూ తినడం వల్ల రక్త హీనత తగ్గుతుంది. ►విటమిన్ బీ6, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, ఫాస్ఫరస్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సో.. బీట్రూట్ను సలాడ్‌గా గానీ,జ్యూస్ లేదా బీట్రూట్ డిప్గానీ తీసుకోవడం వల్ల దీనిలో పోషకాలన్నీ మీకు అందుతాయి. దైనందిన ఆహారంలో బీట్రూట్ను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో పొందవచ్చు. -
బీట్ రూట్ రసం కాదు.. నదిలోని నీళ్లు..!
సాధారణంగా నది జలాలు నీలిరంగు లేదా తెలుపు రంగులో కనిపిస్తాయి. కానీ ఎప్పుడైనా నదిలో నీళ్లు బీట్రూట్ రంగులోకి మారడం చూశారా.. అవును తెలియని కాలుష్య కారకాలు ఓ నదిని విషతుల్యం చేశాయి. వీటి కారణంగా నదిలోని నీరు నీలి రంగు నుంచి ముదురు గులాబీ (బీట్రూట్) రంగులోకి మారాయి. అయితే ఇది మన దేశంలో నది కాదండోయ్. రష్యాలోని ఇస్కిటిమ్కా నది పరిస్థితి. ఒక ప్రత్యేకమైన కాలుష్య కారకం నదిలో కలిసిన తర్వాతనే నీరు ఇలా నీలి రంగు నుంచి బీట్రూట్ రంగులోకి మారిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ పరిస్థితికి కారణమైన రసాయనాల గురించి అధికారులు పరిశోధనలు కూడా చేస్తున్నారు. ఈ నదిలో నీళ్లు తమ కిమెరోవో పారిశ్రామిక ప్రాంతం వెళుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీట్ రూట్ రంగులో ఉన్న ఈ ఇస్కిటిమ్కా నది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: వైరల్ : నేను వెళ్లనంటూ ట్రంప్ మారాం ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ.. ఇది ప్రస్తుతం నదిలాగా కనిపించడం లేదని, తినే పదార్థం క్రాన్‌బెర్రి జెల్లి మాదిరి కనిపిస్తుందని తెలిపాడు. నది రంగు మారడానికి కారణమైన కాలుష్య కారకం గురించి తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని కెమెరోవో డిప్యూటీ గవర్నర్ ఆండ్రియా పానోవ్ తెలిపారు. నది నీరు ఇలా మారడానికి గల కారకులను తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. త్వరలోనే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఇస్కిటిమ్కా నదియే కాకుండా, పశ్చిమ రష్యాలోని నారో-ఫోమిన్స్క్ లోని మరో నది కూడా పరిశ్రమల నుంచి రసాయనాలు విడుదల తరువాత ఎర్రగా మారింది. చదవండి: గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది! Река Искитимка в Кемерове окрасилась в красный цвет. Причины выясняются. Нихуя сколько борща сварили😳 pic.twitter.com/HkuYnlYJZu — #MDK (@mudakoff) November 6, 2020 Река Искитимка в Кемерове окрасилась в красный цвет. Причины выясняются. Нихуя сколько борща сварили😳 pic.twitter.com/HkuYnlYJZu — #MDK (@mudakoff) November 6, 2020 -
మహిళలకు పగ్గాలిస్తే.. అవినీతి తగ్గుముఖం!
ప్రభుత్వాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగిన కొద్దీ అవినీతి తగ్గుముఖం పడుతుందని అంటున్నారు వర్జీనియా టెక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. జర్నల్ ఆఫ్ ఎకనమిక్ బిహేవియర్ అండ్ ఆర్గనైజేషన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. దాదాపు 125 దేశాల నుంచి సేకరించిన వివరాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అంతేకాకుండా.. అన్నిస్థాయుల్లోనూ మహిళల భాగస్వామ్యం ఉండటం అవసరమని ఈ అధ్యయనం చెబుతోంది. యూరప్ స్థానిక సంస్థల్లో మహిళలు ఎక్కువగా ఉన్న చోట్ల లంచం ఇవ్వాల్సిన అవసరం చాలా తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త చందన్ ఝా, సుదుప్తా సారంగి అంటున్నారు.ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు పురుషుల కంటే భిన్నంగా ఆలోచించడం తక్కువ అవినీతికి కారణం కావచ్చునని వీరు అంచనా వేస్తున్నారు. మహిళా నేతలు కుటుంబం, మహిళల సంరక్షణ తదితర అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారని ఇవి కాస్తా ఆర్థిక, సాంస్కృతిక, వ్యవస్థాగతమైన అంశాలపై ప్రభావం చూపడం వల్ల అవినీతి తక్కువవుతుందని అంచనా. అవినీతి విషయంలో మహిళలకు, పురుషులకు ఉన్న వ్యత్యాసంపై ఇప్పటివరకూ తగిన పరిశోధన జరగకపోయినా మహిళలు ఎక్కువగా ఉన్నచోట అవినీతి తక్కువగా ఉంటుందని గత పరిశోధనలూ చెబుతున్నాయని అంటున్నారు వీరు. గుండె సమస్యలకు నిద్రలేమి కారణం! కౌమార వయసులోని పిల్లలు తగినంత సేపు నిద్రపోకపోయినా.. నాణ్యమైన నిద్ర కాకపోతే... భవిష్యత్తులో వారికి గుండెజబ్బులు లేదంటే అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు మాస్జనరల్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ శాస్త్రవేత్తలు. అంతేకాకుండా ఇలాంటి పిల్లల్లో కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువగా ఉండటమే కాకుండా పొట్ట ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా నిల్వ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. నిద్రకు ఊబకాయానికి సంబంధం ఉందని గతంలోనే కొన్ని పరిశోధనలు స్పష్టం చేయగా ఇతర ఆరోగ్య సమస్యల గురించి తెలిసింది మాత్రం ఇప్పుడే అని శాస్త్రవేత్తలు వివరించారు. 1999 – 2002 మధ్య కాలంలో సేకరించిన కొన్ని వేల మంది పిల్లలను దాదాపు ఇరవై ఏళ్లపాటు పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చినట్లు వివరించారు. పిల్లల సగటు నిద్ర సమయం 441 నిమిషాల నుంచి 7.35 గంటల వరకూ ఉండగా కేవలం 2.2 శాతం మంది అవసరమైన దానికంటే ఎక్కువ సమయం నిద్రపోయినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. కాంక్రీట్‌కు క్యారెట్, బీట్రూట్ శక్తి వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది ఈ వార్త. భవన నిర్మాణానికి మనం వాడే కాంక్రీట్ మరింత దృఢంగా మారేందుకు క్యారెట్లు, బీట్రూట్ బాగా ఉపయోగపడతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ రెండు కాయగూరల నుంచి సేకరించే నానో ప్లేట్లెట్లు జోడిస్తే కాంక్రీట్ మరింత దృఢంగా మారుతుందని బ్రిటన్‌లోని లాంకస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. క్యారెట్, బీట్రూట్ల నారలోని నానోప్లేట్లెట్లు కాంక్రీట్‌లో సిలికేట్ల మోతాదును పెంచడం ద్వారా దృఢత్వానికి దోహదపడిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మహమ్మద్ షఫీ తెలిపారు. కాంక్రీట్‌ను గట్టి పరిచేందుకు ఈ ఏడాదిలో మొదట్లో కొంతమంది శాస్త్రవేత్తలు గ్రాఫీన్‌ను ఉపయోగించారని.. దీంతో పోలిస్తే తాము అభివృద్ధి చేసిన పద్ధతి చాలా చౌక, పర్యావరణానికి హాని కలిగించనిది కూడా అని షఫీ వివరించారు. స్కాట్లాండ్ కంపెనీ సెల్లూకాంప్ ఈ రెండు కాయగూరలను ప్రాసెస్ చేసిన తరువాత వృథాగా పారబోసే వ్యర్థాల నుంచి నానో ప్లేట్లెట్లను వేరు చేసి అందించిందని వివరించారు. కాంక్రీట్‌కు ఈ ప్లేట్లెట్లను కలిపినప్పుడు దృఢత్వం పెరగడం మాత్రమే కాకుండా ప్రతి ఘనపు మీటర్ కాంక్రీట్ తయారీకి అవసరమయ్యే సిమెంట్ మోతాదు 40 కిలోల వరకూ తగ్గిందని వివరించారు. -
పండేది నేల కింద... ఉండేది నాల్క మీద!
దుంప వంటకాల టేస్టే వేరు. ఒక్కసారి గానీ వాటి రుచిమరిగితే మళ్లీ మళ్లీ తినేదాకా దుంపతెంపుతాయవి. క్యారట్‌తో హల్వా చేసినా బిట్రూట్తో కబాబ్ కాల్చినా ముల్లంగి కోఫ్తా, ఆలూగోబీల ఫీస్టును మరవలేక మనసు మళ్లీ మళ్లీ ఆ రుచులనే కోరుతుంది. రుచి మూలాలన్నీ కందమూలాల్లోనే ఉన్నాయన్న వాస్తవం మనందరికీ తొలి టేస్టులోనే తెలిసొస్తుంది. స్వీట్ పొటాటో రబ్డీ కావలసినవి: చిలగడ దుంప (కొద్దిగా పెద్దది) – 1 (ఉడికించి తొక్కతీసి మెత్తగా చేయాలి); పాలు – కప్పు; పంచదార – అర టీ స్పూను; గోరు వెచ్చని నీరు – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; నేతిలో వేయించిన జీడిపప్పులు + కిస్మిస్ + బాదం పప్పులు – 2 టీ స్పూన్లు. తయారి: ఒక గిన్నెలో పాలు పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙పంచదార, ఉడికించిన చిలగడ దుంప ముద్ద జత చేసి, బాగా కలిపి, చిక్కపడేవరకు ఉడికించాలి ∙అర కప్పుడు గోరు వెచ్చని నీటిలో కుంకుమ పువ్వు వేసి, కరిగించి, ఉడుకుతున్న పాల మిశ్రమంలో వేసి కలిపి, మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి ∙ఏలకుల పొడి, నేతిలో వేయించిన జీడిపప్పు మిశ్రమాన్ని జత చేసి బాగా కలిపి దించేయాలి.చల్లారాక ఫ్రిజ్‌లో సుమారు గంట సేపు ఉంచి గ్లాసులలో పోసి, చల్లగా అందించాలి. మూలీ కే కోఫ్తా కావలసినవి: తెల్ల ముల్లంగి – అరకిలో; పచ్చి కొబ్బరి తురుము – టేబుల్ స్పూను; పల్లీలు – అర టేబుల్ స్పూన్; వేయించిన సెనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు; గరం మపాల – టీ స్పూను; ఎండు మిర్చి – 2; పచ్చి మిర్చి – 1 (చిన్న ముక్కలు చేసుకోవాలి); ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి) సన్నగా తరిగిన కొత్తిమీర – టేబుల్ స్పూను; ఉప్పు తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా గ్రేవీ కోసం... ఎండు మిర్చి – 4; వెల్లుల్లి ముద్ద – టీ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; ఉల్లిపాయ ముద్ద – రెండు టేబుల్ స్పూన్లు; నూనె – 100 మిలీ; పెరుగు – కప్పు; గరం మసాల – టీ స్పూను; ఏలకుల పొడి – అర టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; తయారి: ∙ముల్లంగిని శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా తరిగి, తగినన్ని నీళ్ళు జతచేసి మెత్తగా అయ్యే వరకూ ఉడికించి దింపేయాలి ∙చల్లారాక నీళ్ళు ఒంపేసి ఉడికిన ముల్లంగిని మిక్సీలో వేసి మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙కొబ్బరి తురుము, పల్లీలు, వేయించిన సెనగపప్పు, గరం మసాల, ఎండు మిర్చిలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, చిన్న పాత్రలోకి తీసుకోవాలి. ∙మెత్తగా చేసిన ముల్లంగిలో... పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, మెత్తగా చేసిన కొబ్బరి తురుము మిశ్రమం జత చేసి బాగా కలపాలి ∙బాణలిలో నూనె కాగాక, ముల్లంగి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. గ్రేవీ తయారీ: ∙మిక్సీలో ఎండు మిర్చి, ఉప్పు, వెల్లుల్లి, ధనియాల పొడి, పసుపు వేసి మెత్తగా చేయాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి మిశ్రమం వేసి దోరగా వేయించాలి ∙ఉల్లి తరుగు, ఉల్లిపాయ పేస్ట్, జత చేసి సుమారు ఐదు నిమిషాలు వేయించాలి ∙పెరుగు, గరం మసాల, ఏలకుల పొడి, అల్లం తురుము ఒకదాని తరవాత ఒకటి జత చేసి బాగా కలపాలి. కప్పుడు నీళ్లు జత చేసి సుమారు మూడు నిమిషాలు ఉడికించాలి ∙తయారుచేసి ఉంచుకున్న మూలీ కోఫ్తాలు వేసి బాగా ఉడికించి వేడివేడిగా అందించాలి. భర్వాన్ ఆలు గోబీ కావలసినవి: బంగాళదుంపలు – 2 (తొక్కు తీసి ముక్కలు చేయాలి); క్యాలీఫ్లవర్ తరుగు – కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఫిల్లింగ్ కోసం... చీజ్ తురుము – అర కప్పు; కిస్మిస్ – 15; దానిమ్మ గింజలు – 3 లేబుల్స్పూన్లు; సన్నగా తరిగిన జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి కోవా – 4 టేబుల్ స్పూన్లు పిండి కోసం... సెనగ పిండి – 2 కప్పులు; వాము – టేబుల్ స్పూను; వెల్లుల్లి ముద్ద – టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; మిరపపొడి – కొద్దిగా; నీళ్లు – తగినన్ని తయారి: ∙ఒక పాత్రలో నీళ్లు, ఉప్పు, క్యాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కలు, పసుపు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించి పక్కన ఉంచాలి ∙పిండి కోసం తీసుకున్న పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి, తగినన్ని నీళ్లు జత చే సి, పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙ఒక పాత్రలో ఫిల్లింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి బాగా కలపాక, ఉడికించిన బంగాళదుంప ముక్కల మిశ్రమం జత చేసి మరోమారు కలిపి, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక సెనగపిండి మిశ్రమంలో ... బజ్జీల మాదిరిగా ఈ ఉండలను ఒక్కక్కటిగా ముంచుతూ కాగిన నూనెలో వేసి ముదురు గోధుమ రంగులోకి వచ్చాక తీసేయాలి ∙టొమాటో సాస్‌తో వేడివేడిగా అందించాలి. బీట్రూట్ కబాబ్ కావలసినవి: బీట్రూట్ తురుము – కప్పు; పనీర్ తురుము – అర కప్పు; వెల్లుల్లి ముద్ద – అర టేబుల్ స్పూను; ఆమ్చూర్ పొడి – టేబుల్ స్పూను; వేయించిన నువ్వుల పొడి – టేబుల్ స్పూను; చాట్ మసాలా – చిటికెడు; ఉప్పు – తగినంత; సన్నగా తరిగిన జీyì పప్పులు – పావు కప్పు; పొడి చేసిన ఓట్స్ – అర కప్పు; నూనె – తగినంత తయారి: ∙ఒక పాత్రలో బీట్రూట్ తురుము, పనీర్ తురుము, వెల్లుల్లి ముద్ద, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, ఉప్పు, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసి, చేతిలోకి తీసుకుని ఒక్కో ఉండను చేతితో అదమాలి ∙జీడిపప్పు పొడిని మధ్యలో ఉంచి చుట్టూ మూసేయాలి ∙ఓట్స్ పొడిలో దొల్లించి పక్కన ఉంచాలి ∙పాన్ మీద నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న కబాబ్‌లను రెండు వైపులా కాల్చి కొత్తిమీర చట్నీతో అందించాలి. గాజర్ హల్వా కావలసినవి: గాజర్ తురుము – కప్పు; పాలు – అర లీటరు; పంచదార – 3 టేబుల్ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూన్; జీడి పప్పు పలుకులు – టేబుల్ స్పూన్; కిస్మిస్ – టేబుల్ స్పూన్. తయారి: ∙స్టౌ మీద బాణలిలో పాలు పోసి మరిగించాలి ∙బాగా మరిగి సగం అయ్యేవరకూ కలుపుతుండాలి ∙వేరొక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక గాజర్ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి మరిగిన పాలలో వేయాలి ∙బాగా కలుపుతూ, పంచదార జత చేసి సన్నని మంటపై ఉడికించాలి ∙బాణలిలో నెయ్యి వేసి, కరిగాక జీడిపప్పు, కిస్మిస్ వేయించి ఉడికిన గాజర్ హల్వాలో వేయాలి ∙ఏలకుల పొడి జత చేసి, బాగా కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి. -
మతిమరుపు తగ్గించే బెస్ట్ రూట్
చూడటానికి బీట్రూట్ ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటుంది. దాని రంగు ఎంత అందంగా ఉంటుందో తింటే అంతే ఆరోగ్యాన్నీ ఇస్తుంది. బీట్రూట్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని... ♦ బీట్రూట్లోని ఆ చిక్కటి ఎరుపు రంగుకు బిటాలెయిన్స్ అనే నీళ్లలో కరిగే యాంటీఆక్సిడెంట్ ఉంది. అది చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్. అది ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అలాగే విటమిన్–సి కూడా ఎక్కువే. ఇది కూడా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కాబట్టి క్యాన్సర్ల నివారణకు తోడ్పడటంతో పాటు కొలాజెన్ ఉత్పాదనకు తోడ్పడి... దీర్ఘకాలం చర్మంతో పాటు శరీరం యౌవనంగా ఉండటానికి దోహదం చేస్తుంది. ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బీట్రూట్ జ్యూస్ తీసుకునేవారిలో అలసిపోకుండా చాలాసేపు ఉండగలిగే సామర్థ్యం (స్టామినా) ఎంతగానో పెంపొందుతుంది. ♦ బీట్రూట్లో పొటాషియమ్ పుష్కలంగా ఉండటం వల్ల అది నీరసం, నిస్సత్తువ, మజిల్‌క్రాంప్స్‌ను దూరం చేస్తుంది. అధిక రక్తపోటును నివారిస్తుంది. ♦ ఇందులో చాలారకాల ఖనిజలవణాలు ఉన్నాయి. క్యాల్షియమ్, ఐరన్, మాంగనీస్, ఫాస్ఫరస్, సోడియమ్, జింక్, కాపర్, సెలీనియం వంటి ఎన్నో పోషకాలు ఉండటం వల్ల... అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీట్రూట్లోని కాల్షియమ్ ఎముకల, పళ్ల బలాన్ని పెంచుతుంది. ♦ ఫోలేట్ అనే పోషకం పుష్కలంగా ఉండటం వల్ల బీట్రూట్ గర్భిణుల్లో పిండానికి వచ్చే అనేక రకాల వెన్నుపూస సమస్యలను నివారిస్తుంది. గర్భస్రావాల ముప్పును తగ్గిస్తుంది. ♦ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్‌ను తగ్గించి రక్తనాళాల, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ♦ బీట్రూట్ మతిమరపును నివారిస్తుంది. ఈ మేరకు 2011లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. ♦ అన్ని రకాల కండరాలతో పాటు గుండె కండరాన్ని సైతం మరింత బలంగా ఉండేలా చేస్తుంది బీట్రూట్. హార్ట్‌ఫెయిల్ అయిన వారికి క్రమం తప్పకుండా బీట్రూట్ జ్యూస్ ఇవ్వడం వల్ల వారిలోని గుండె కండర సామర్థ్యం పదమూడు రెట్లు పెరిగినట్లు 2015లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. -
రెయిన్బో జ్యూస్
హెల్దీ ట్రీట్ కావలసినవి:బీట్రూట్ – 1 (చిన్నది), క్యారట్లు – 2, టొమాటో – 1, తేనె – 1 టీ స్పూన్ తయారి: బీట్రూట్, క్యారట్ల పై తొక్క తీసి, కట్ చేసుకోవాలి. టొమాటోలను కూడా ముక్కలుగా చేయాలి. ఈ పదార్థాలన్నీ మిక్సర్‌లో వేసి తగినన్ని నీరుపోసి జ్యూస్ చేయాలి. జ్యూస్‌ని గ్లాస్లో పోసి తేనె వేసుకుని తాగాలి. నోట్: యువతీ యువకులు మొటిమల సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. వీళ్లు భోజనానికి గంట ముందు ఈ జ్యూస్ తాగాలి. దీంట్లో ఉప్పు, పంచదార కలపకూడదు. జ్యూస్ తాగిన గంట వరకు ఏమీ తినకూడదు. ఇలా క్రమం తప్పకుండా నెలరోజులు చేస్తే మొటిమలు తగ్గుతాయి, చర్మం కాంతివంతం అవుతుంది, సన్‌బర్న్ బారిన పడదు. క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉన్న ఈ జ్యూస్‌లో క్యాలరీలు తక్కువగా ఉన్నాయి. ఊబకాయం సమస్య ఉన్నవారు ఈ జ్యూస్‌ను తాగడం వల్ల ఫలితం ఉంటుంది. పోషకాలు: క్యాలరీలు – 95.9కె.సి.ఎ. ఎల్, కార్బోహైడ్రేట్లు 20.77 గ్రా., ప్రొటీన్ – 2.21గ్రా., ఫ్యాట్ – 0.35గ్రా., క్యాల్షియం – 113 మి.గ్రా. -
బీట్రూట్ సలాడ్
హెల్దీ కుకింగ్ కావలసినవి: బీట్రూట్ తురుము – ఒక కప్పు టొమాటో తరుగు – రెండు టీ స్పూనులు, కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను, నిమ్మరసం – అర టీ స్పూను ఉప్పు – తగినంత, పోపుకి: నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి... అన్నీ కొద్దికొద్దిగా. తయారి: బీట్రూట్ తురుములో టొమాటో తరుగు, కొత్తిమీర తరుగు వేయాలి. తరవాత నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా వేయించుకున్న పోపు వేసి ఫ్రెష్‌గా తినాలి. ఎప్పటికప్పుడు చేసుకోలేని వాళ్లు రెండు మూడు రోజులకి సరిపడా తయారుచేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. (డయాబెటిక్ పేషెంట్లు దీనిని తినకూడదు) -
ఎర్రయిటీ
బీట్రూట్ అమ్మా! కొరికితే కసక్క్ అంటుంది. కోస్తే రక్తం చిందుతుంది. ఈ ప్రపంచంలో పాన్ తినకుండా ఎర్రటి సోకు చేయాలంటే బీట్రూట్ ఉండాల్సిందే! నాలుక ఎర్రబడుద్ది. ఆ తర్వాత బీట్రూట్ అంటే వెర్రి పుట్టుద్ది. ఒక్క బీట్రూట్తో ఎన్ని వెరైటీలో ఎర్ర ఎర్ర వెరైటీలు!! బెర్రీ బీట్ కావల్సినవి: బాదం పాలు – ముప్పావుకప్పు, నేరేడు పళ్ల గుజ్జు – ముప్పావు కప్పు, బీట్రూట్ తురుము – కప్పు, పుదీనా ఆకులు – పావు కప్పు, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు, సబ్జా గింజలు – 2 టేబుల్ స్పూన్లు (అర కప్పు నీళ్లలో 2 గంటల సేపు నానబెట్టాలి), తేనె – టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు తయారీ: ∙బాదం పాలు, నేరేడు, బీట్రూట్, పుదీనా, నిమ్మరసం, సబ్జా గింజలు, తేనె, ఉప్పు, అర కప్పు ఐస్ కలిపి మిక్సర్‌లో బ్లెండ్ చేయాలి. పుదీనాతో అలంకరించి సర్వ్ చేయాలి. హల్వా కావల్సినవి: బీట్రూట్ తురుము – కప్పు, పాలు – కప్పు, పంచదార – అర కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్లు, యాలకుల పొడి – చిటికెడు, కర్బూజ గింజలు, జీడిపప్పు – అలంకరణకు తయారీ: ∙కడాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో బీట్రూట్ తురుము వేసి కొన్ని నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత దీంట్లో పాలు, పంచదార వేసి కలపాలి. సన్నని మంట మీద ఉడకనివ్వాలి. మధ్య మధ్య కలుపుతుండాలి. కడాయికి పట్టుకోనంతగా ఉడకనిచ్చాక దించాలి. చివరగా జీడిపప్పు, కర్బూజ గింజలతో అలంకరించి, సర్వ్ చేయాలి. సూప్ కావల్సినవి: ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్, జీలకర్ర – టేబుల్ స్పూన్, ఉల్లిపాయ – 1 (తరగాలి), కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్, ఉల్లికాడలు – 1 (సన్నగా తరగాలి), ఉప్పు – తగినంత, నల్లమిరియాల పొడి – చిటికెడు, మజ్జిగ – కప్పు తయారీ: ∙కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో జీలకర్ర, ఉల్లిపాయలు, ఉల్లికాడలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. దీంట్లో ఉప్పు, మిరియాల పొడి వేసి 5–7 నిమిషాల సేపు ఉడికించాలి. దీంట్లో బీట్రూట్ ముక్కలు వేసి రెండున్నర కప్పుల నీళ్లు పోసి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. 15–20 నిమిషాల సేపు ఉడికి, చల్లారిన తర్వాత మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో అర కప్పు మజ్జిగ కలపాలి. కొత్తిమీర ఆకులు, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలపొడి చల్లి అందించాలి. రసం కావల్సినవి: బీట్రూట్ – 1, కందిపప్పు – అర కప్పు (నీళ్లలో నానబెట్టాలి), వెల్లుల్లి రెబ్బలు – 4–6, చింతపండు – నిమ్మకాయంత (నీళ్లలో నానబెట్టి, రసం తీయాలి), రసం పొడి – టీ స్పూన్ (అర టీ స్పూన్ జీలకర్ర – మిరియాలు, చిటికెడు పసుపు కలిపి పొడి చేయాలి), ఉప్పు – తగినంత తాలింపు: నూనె /నెయ్యి – టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, ఇంగువ – చిటికెడు, ఎండుమిర్చి – 1 తయారీ: ∙బీట్రూట్ కడిగి, తొక్కతీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ప్రెజర్ కుకర్‌లో బీట్రూట్ ముక్కలు. వెల్లుల్లిరెబ్బలు, కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి 2 విజిల్స్వచ్చేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత తీసి, మొత్తం మిశ్రమాన్ని గరిటెతోనో లేదా పప్పు గుత్తితోనో మెత్తగా చేయాలి. ఇంకా మెత్తగా కావాలనుకుంటే మిక్సర్‌లో వేసుకోవచ్చు. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె వేసి అందులో ఆవాలు, కరివేపాకు ఎండుమిర్చి, ఇంగువ వేసి కలపాలి. దీంట్లో చింతపండు రసం, బీట్రూట్ పప్పు మిశ్రమం పోయాలి. దీంట్లోనే రసం పొడి, ఉప్పు వేసి కలపాలి. తీపిని ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం లేదా పంచదార వేసుకోవచ్చు. తర్వాత దించి కొత్తిమీర ఆకులు వేసి మూత పెట్టాలి. దీనిని వేడి వేడిగా అన్నంలోకి వడ్డించాలి. చట్నీ కావల్సినవి: బీట్రూట్ – 1, చిన్నది (సాంబార్) ఉల్లిపాయలు – 3,వెల్లుల్లి – 2, కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు, చింతపండు – ఉసిరికాయంత, ఉప్పు – తగినంత వేయించి గ్రైండ్ చేయడానికి: శనగపప్పు – టేబుల్ స్పూన్, మినప్పప్పు – టేబుల్ స్పూన్, ధనియాలు – టీ స్పూన్, ఎండుమిర్చి – 5 తాలింపు: నూనె – టేబుల్‌స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్ కరివేపాకు – రెమ్మ, ఇంగువ – చిటికెడు తయారీ: ∙బీట్రూట్ను శుభ్రపరిచి, పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. పాన్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, చింతపండు, బీట్రూట్ ముక్కలు, కొబ్బరి తురుము వేసి 5–10 నిమిషాలు వేయించాలి. మంట తీసేసి చల్లారనివ్వాలి. మరో పాన్‌లో వేయించే దినుసులు వేసి బంగారు రంగు వచ్చేవరకు కలపాలి.చల్లారాక ఈ దినుసులు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉడికించిన బీట్రూట్ కొబ్బరి మిశ్రమం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమం గిన్నెలోకి తీసుకోవాలి. పాన్‌లో నూనె వేసి తాలింపు దినుసులు వేసి, వేయించి, చట్నీలో కలపాలి. చికెన్ కావల్సినవి: చికెన్ – అర కేజీ (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), బీట్రూట్ – 1 (పెద్దది, తురమాలి), సాంబారు ఉల్లిపాయలు (చిన్నవి) – 10., ఉల్లిపాయలు – 1 (సన్నగా తరగాలి), అల్లం, వెల్లుల్లి – 2 టీ స్పూన్లు, పెరుగు – టేబుల్‌స్పూన్, టొమాటో – 1 (సన్నగా తరగాలి), కారం – 2 టీ స్పూన్లు, ధనియాలపొడి– టీ స్పూన్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, ఉప్పు – తగినంత, నూనె – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ∙చికెన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి 15 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి చికెన్‌ను 10 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. విడిగా కడాయిలో నూనె పోసి వేడయ్యాక దీంట్లో జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు ఉడికాక దీంట్లో బీట్రూట్ తరుగు, టొమాటో వేసి ఉడికించాలి. ఈ మిశ్రమం బాగా ఉడికాక చికెన్‌లో వేసి కలపాలి. చికెన్ గ్రేవీ బాగా చిక్కపడ్డాక కొత్తిమీర ఆకులను చల్లి, మూత పెట్టి మంట తీసేయాలి. గ్రిల్డ్ బీట్ కావల్సినవి: ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు, బీట్రూట్స్ – 4 , నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు తహిని (అర టేబుల్ స్పూన్ నువ్వుల పొడి+ అర టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి చేసినది) – టేబుల్ స్పూన్ వెల్లుల్లి – ఒకటి (సన్నగా తరగాలి), ఉప్పు, మిరియాల పొడి – చిటికెడు తయారీ: ∙కడాయి పొయ్యి మీద పెట్టి వేడయ్యాక నూనె వేయాలి. దీంట్లో బీట్రూట్ ముక్కలు వేసి కలపాలి. ఇది బాగా వేగి, చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మరసం, వెల్లుల్లి, తహిని, ఉప్పు కలపాలి. చివరగా కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి, వేయించిన చిటికెడు నువ్వులు చల్లాలి. దీన్ని బ్రెడ్‌కి కాంబినేషన్‌గా వడ్డించాలి. బీట్రూట్ పోషకాలు బీట్రూట్లో ఫోలిక్ యాసిడ్, ఫైబర్ ఉంటుంది. అలాగే మెగ్నిషియమ్, పొటాషియమ్ అధికంగా లభిస్తాయి. బీట్రూట్ని రోజూ జ్యూస్ లేదా ఆహార రూపంలో తీసుకుంటే చర్మం ముడతలు పడదు. పిగ్మెంటేషన్ సమస్య దరిచేరదు. చర్మం మాయిశ్చరైజర్‌ను కోల్పోదు. వెంట్రుకలు రాలే సమస్య తగ్గుతుంది. లివర్ పనితీరు మెరుగవుతుంది. హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. క్యాన్సర్ నిరోధకారకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా బాడీ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. -
బ్యూటిప్స్
కొన్ని గులాబి రేకులను గంటపాటు పాలలో నానబెట్టాలి. తర్వాత పాలలోంచి తీసేసి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా పాలక్రీమ్, తేనె కలిపి పెదవులకు పూసి... అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. చిట్లిపోయి ఇబ్బంది పెడుతోన్న పెదవులు మళ్లీ అందంగా, ఆరోగ్యంగా అవ్వడానికి ఇది మంచి చిట్కా. {దాక్షపళ్లను మెత్తగా చిదిమి, కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమంతో పెదవులను రుద్దుకుంటే పగుళ్లు పోయి, పెదవులు మృదువుగా తయారవుతాయి. బీట్రూట్ని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో కాసింత క్రీమ్, తేనె, రోజ్‌వాటర్ కలిపి పెదవులకు రాయాలి. గంట తర్వాత కడిగేసి, మాయిశ్చరయిజింగ్ క్రీమ్ రాయాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తే... పెదవులు పొడిబారడం, చిట్లటం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నిమ్మకాయ తొక్కను ఎండబెట్టి పొడి చేయాలి. దీనిలో రోజ్‌వాటర్, తేనె కలిపి... ఆ మిశ్రమంతో పెదవులను బాగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తే వారం రోజుల్లో చిట్లిన పెదవులు మామూలుగా అయిపోతాయి. -
బీట్రూట్తో ఊపిరి
పరిపరి శోధన ఊపిరితిత్తులకు బీట్రూట్తో ఎనలేని మేలు కలుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. తరచు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు ప్రతిరోజూ గ్లాసుడు బీట్రూట్ రసం తీసుకుంటే త్వరగా కోలుకుంటారని బ్రిటన్‌లోని టన్‌బ్రిడ్జ్ జాతీయ ఆరోగ్య సేవల ట్రస్టుకు చెందిన శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ సయ్యద్ హుస్సేన్ చెబుతున్నారు. బీట్రూట్ రసంలోని విటమిన్లు రక్తానికి తగినంత ఆక్సిజన్ అందేలా చేస్తాయని ఆయన చెబుతున్నారు. బీట్రూట్ రసం తీసుకోవడం ద్వారా తరచు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు గురయ్యేవారు తేలికగా ఊపిరి తీసుకోవడమే కాకుండా, త్వరగా కోలుకున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. -
ఫుడ్ కలర్‌గానూ బీట్రూట్
తిండి గోల యూరప్‌లో ఆహార కొరత ఏర్పడినప్పుడు, వ్యాధులు ప్రబలినప్పుడు అక్కడి ప్రజలు బతకడానికి దుంపజాతికి చెందినవాటినే ప్రధానంగా బీట్‌రూట్‌నే జీవనాధారంగా చేసుకున్నారనే వార్తలు ఉన్నాయి. దుంప జాతికి చెందిన బీట్రూట్ స్వస్థలం నార్త్ అమెరికా. మన దగ్గర బంగాళదుంప, చిలగడ దుంప, ముల్లంగి.. వంటి దుంప రకాలు ఉన్నాయి. వాటి జాబితాలోనిదే బీట్రూట్ కూడా! ఇంగ్లిషు రాని వారితో కూడా ఇంగ్లిషులోనే పిలిపించుకునే కూరగాయ ఇదొక్కటే అయి ఉంటుంది. బ్రిటీష్ వారితో పాటు ఇది మన దేశంలో అడుగుపెట్టింది. బీట్రూట్లో రక్తాన్ని వృద్ధి చేసే గుణాలు, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పచ్చిగానే ముక్కలు చేసుకొని, భోజనంలో సైడ్ డిష్‌గా తినడానికి కారణం అదే! డచ్ దేశ స్థుల సంప్రదాయ వంట బీట్రూట్, ఉడికించిన కోడిగుడ్డుతో కలిపి నిల్వపచ్చడి పెట్టడం పోలండ్, ఉక్రెయిన్‌లో సూప్‌లు, శాండ్‌విచ్‌లలో బీట్రూట్ను విరివిగా ఉపయోగిస్తారు. రష్యా వంటకాలలోనూ సైడ్ డిష్‌గా బీట్రూట్ ఉండాల్సిందే! నీటి శాతం తక్కువగా ఉండే ఈ దుంపతో జ్యూస్‌లు బాగా చేస్తారు. వైన్ తయారీలో బీట్రూట్ ఉంటుంది. టొమాటో పేస్ట్, సాస్, డిజెర్ట్, జామ్స్, జెల్లీ, ఐస్‌క్రీమ్, స్వీట్లు...లలో బీట్రూట్ను కలర్‌గా ఉపయోగిస్తారు. -
బీట్రూట్ రసంతో బీపీ దూరం..
బీట్రూట్ తరచుగా వాడే కూరగాయల్లో ఒకటి. దీనిని వండి తినడం కంటే, నేరుగా తినడమే మేలని నిపుణులు చెబుతున్నారు. పచ్చిముక్కలను తినడం కష్టమనుకుంటే, చక్కగా జ్యూస్ తయారు చేసుకొని తాగొచ్చు. బీట్రూట్ రసం తాగడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఎనిమిది ఔన్సుల చొప్పున బీట్రూట్ రసం తాగిన వారిలో రక్తపోటు గణనీయంగా అదుపులోకి వచ్చినట్లు ‘హైపర్ టెన్షన్’ జర్నల్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బీట్రూట్లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయని, వాటి ఫలితంగానే రక్తపోటు క్రమంగా అదుపులోకి వస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. -
ప్యాక్‌ల కన్నా జ్యూస్‌లు మేలు...
చర్మసౌందర్యాన్ని పెంచే ప్యాక్‌లు రెండు రకాలు. ఒకటి- మిశ్రమాన్ని ముఖంపైన పూయడం. రెండు- రకరకాల పండ్లను మరికొన్ని పండ్లతో కలిపి తినడం. ప్రూట్ ప్యాక్ వేసుకుంటే ముఖసౌందర్యం పెరుగుతుందో లేదో గాని పోషకవిలువలు సమృద్ధిగా ఉన్న సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు తినడం వల్ల మాత్రం నూటికి నూరు శాతం చర్మకాంతి పెరుగుతుంది. అవేంటో చూద్దాం... బొప్పాయి చాలావరకు బొప్పాయిని ఫేసియల్ స్క్రబ్‌గా ఉపయోగిస్తుంటారు. కాని తింటున్నారా?! బొప్పాయిలో విటమిన్-ఎ, సి ఉంటుంది. ఇది చర్మంలోని మలినాలను తొలగించడానికి సహాయపడతుంది. చర్మాన్ని కాంతిమంతంగా, బిగుతుగా మారుస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మంపై దద్దుర్లు, ఎరుపుదనం వంటివి తగ్గిస్తుంది. ఇలా చేయండి: బొప్పాయిగుజ్జులో బాదంపాలు, తేనె కలిపి తినాలి. లేదా బొప్పాయి ముక్కలు, క్యారట్ ముక్కలు, చేప ముక్కలను కలిపి సలాడ్‌లా తీసుకోవచ్చు. కొబ్బరి కెఫిర్ కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటామన్న విషయం తెలుసు. హార్మోన్లలో హెచ్చుతగ్గులను నివారించి, చర్మకాంతిని పెంచే గుణాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇలా చేయండి: లేత కొబ్బరినీళ్లు, కెఫిర్ (పెరుగులా ఉంటుంది. మార్కెట్లో లభిస్తుంది) ను కలిపి తయారుచేసిన పానీయాన్ని రోజూ పరగడుపున తాగితే చర్మకాంతి రెట్టింపు అవుతుంది. బీట్రూట్ చర్మంలోని మలినాలను తొలగించడంలో బీట్రూట్ బాగా పనిచేస్తుంది. అంతేకాదు మనం తీసుకునే ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. 400 శాతం రక్తవృద్ధి కలుగుతుంది. ఫలితంగా చర్మకాంతి పెరుగుతుంది. ఇలా చేయండి: 16 ఔన్సుల బీట్రూట్ జ్యూస్ తాగితే 12 గంటల్లో చర్మకాంతి పెరుగుతుంది. పచ్చి బీట్రూట్ను పాలకూర సలాడ్‌తో కలిపి తీసుకోవచ్చు. నిమ్మ నిమ్మరసం తాగడం వల్ల చర్మంలోని టాక్సిన్లు విడుదలవుతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చర్మం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. నోటిలోని బ్యాక్టీరియాను నివారిస్తుంది. యాక్నె సమస్యను పోగొడుతుంది. సౌందర్య ప్రపంచంలో దీనిని మించిన బ్యూటీ టిప్ లేదు. ఇలా చేయండి: ఉదయం అర చెక్క నిమ్మకాయ జ్యూస్‌ను, గ్లాసుడు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్‌తో డ్రెస్సింగ్ చేసిన సలాడ్స్ తీసుకుంటే మరీ మంచిది. రెడ్ క్యాబేజీ దీనిలో ఉండే ఫెటో న్యూట్రియంట్లు చర్మంపై ముడతలను నివారిస్తాయి. పిగ్మెంటేషన్, దద్దుర్లను నివారించే గుణాలు రెడ్ క్యాబేజీలో పుష్కలంగా ఉన్నాయి. ఇలా చేయండి: ప్రతి రోజూ రెడ్ క్యాబేజీ తరుగు, క్యారట్ తరుగు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి సలాడ్ చేసి, తినాలి. ఇలా 21 రోజుల పాటు తింటే పదేళ్ల వయసు తగ్గినట్టు, యవ్వనంగా కనిపిస్తారు. టొమాటో జ్యూస్ రోజును తాజా టొమాటో రసంతో ప్రారంభించండి. టొమాటోలో ఉండే లైకోపిన్ సూర్యరశ్మి నుంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల చర్మానికి కలిగే హానిని నివారిస్తుంది. రోజూ గ్లాస్ టొమాటో జ్యూస్ తాగడం వల్ల నిస్తేజంగా మారిన చర్మానికి జీవం కలిగిస్తుంది. ఇలా చేయండి: రసాయన మందులు వాడకుండా సహజమైన పద్ధతులో పండించిన టొమాటోతో తయారుచేసుకున్న జ్యూస్‌ను సేవించడం మేలు. పుచ్చకాయ టొమాటో జ్యూస్‌లలో సన్ ప్రొటెక్షన్ సుగుణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి వీటిలో ఏ జ్యూస్ అయినా సేవించవచ్చు.