ప్యాక్‌ల కన్నా జ్యూస్‌లు మేలు...
చర్మసౌందర్యాన్ని పెంచే ప్యాక్‌లు రెండు రకాలు. ఒకటి- మిశ్రమాన్ని ముఖంపైన పూయడం. రెండు- రకరకాల పండ్లను మరికొన్ని పండ్లతో కలిపి తినడం. ప్రూట్ ప్యాక్ వేసుకుంటే ముఖసౌందర్యం పెరుగుతుందో లేదో గాని పోషకవిలువలు సమృద్ధిగా ఉన్న సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు తినడం వల్ల మాత్రం నూటికి నూరు శాతం చర్మకాంతి పెరుగుతుంది. అవేంటో చూద్దాం...
బొప్పాయి
చాలావరకు బొప్పాయిని ఫేసియల్ స్క్రబ్‌గా ఉపయోగిస్తుంటారు. కాని తింటున్నారా?! బొప్పాయిలో విటమిన్-ఎ, సి ఉంటుంది. ఇది చర్మంలోని మలినాలను తొలగించడానికి సహాయపడతుంది. చర్మాన్ని కాంతిమంతంగా, బిగుతుగా మారుస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మంపై దద్దుర్లు, ఎరుపుదనం వంటివి తగ్గిస్తుంది.
ఇలా చేయండి: బొప్పాయిగుజ్జులో బాదంపాలు, తేనె కలిపి తినాలి. లేదా బొప్పాయి ముక్కలు, క్యారట్ ముక్కలు, చేప ముక్కలను కలిపి సలాడ్‌లా తీసుకోవచ్చు.
కొబ్బరి కెఫిర్
కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటామన్న విషయం తెలుసు. హార్మోన్లలో హెచ్చుతగ్గులను నివారించి, చర్మకాంతిని పెంచే గుణాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి.
ఇలా చేయండి: లేత కొబ్బరినీళ్లు, కెఫిర్ (పెరుగులా ఉంటుంది. మార్కెట్లో లభిస్తుంది) ను కలిపి తయారుచేసిన పానీయాన్ని రోజూ పరగడుపున తాగితే చర్మకాంతి రెట్టింపు అవుతుంది.
బీట్‌రూట్
చర్మంలోని మలినాలను తొలగించడంలో బీట్‌రూట్ బాగా పనిచేస్తుంది. అంతేకాదు మనం తీసుకునే ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. 400 శాతం రక్తవృద్ధి కలుగుతుంది. ఫలితంగా చర్మకాంతి పెరుగుతుంది.
ఇలా చేయండి: 16 ఔన్సుల బీట్‌రూట్ జ్యూస్ తాగితే 12 గంటల్లో చర్మకాంతి పెరుగుతుంది. పచ్చి బీట్‌రూట్‌ను పాలకూర సలాడ్‌తో కలిపి తీసుకోవచ్చు.
నిమ్మ
నిమ్మరసం తాగడం వల్ల చర్మంలోని టాక్సిన్లు విడుదలవుతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చర్మం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. నోటిలోని బ్యాక్టీరియాను నివారిస్తుంది. యాక్నె సమస్యను పోగొడుతుంది. సౌందర్య ప్రపంచంలో దీనిని మించిన బ్యూటీ టిప్ లేదు.
ఇలా చేయండి: ఉదయం అర చెక్క నిమ్మకాయ జ్యూస్‌ను, గ్లాసుడు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్‌తో డ్రెస్సింగ్ చేసిన సలాడ్స్ తీసుకుంటే మరీ మంచిది.
రెడ్ క్యాబేజీ
దీనిలో ఉండే ఫెటో న్యూట్రియంట్లు చర్మంపై ముడతలను నివారిస్తాయి. పిగ్మెంటేషన్, దద్దుర్లను నివారించే గుణాలు రెడ్ క్యాబేజీలో పుష్కలంగా ఉన్నాయి.
ఇలా చేయండి: ప్రతి రోజూ రెడ్ క్యాబేజీ తరుగు, క్యారట్ తరుగు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి సలాడ్ చేసి, తినాలి. ఇలా 21 రోజుల పాటు తింటే పదేళ్ల వయసు తగ్గినట్టు, యవ్వనంగా కనిపిస్తారు.
టొమాటో జ్యూస్
రోజును తాజా టొమాటో రసంతో ప్రారంభించండి. టొమాటోలో ఉండే లైకోపిన్ సూర్యరశ్మి నుంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల చర్మానికి కలిగే హానిని నివారిస్తుంది. రోజూ గ్లాస్ టొమాటో జ్యూస్ తాగడం వల్ల నిస్తేజంగా మారిన చర్మానికి జీవం కలిగిస్తుంది.
ఇలా చేయండి: రసాయన మందులు వాడకుండా సహజమైన పద్ధతులో పండించిన టొమాటోతో తయారుచేసుకున్న జ్యూస్‌ను సేవించడం మేలు. పుచ్చకాయ టొమాటో జ్యూస్‌లలో సన్ ప్రొటెక్షన్ సుగుణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి వీటిలో ఏ జ్యూస్ అయినా సేవించవచ్చు.