ఈ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోవడం ఖాయం | Best Beauty Skin Devices Review: Faceshot Electric Device For Brightening Skin Tone, Check Details - Sakshi
Sakshi News home page

Faceshot Electric Device : ఫేస్‌ డల్‌నెస్‌ని దూరం చేస్తుంది, మీ స్కిన్‌ ప్రాబ్లమ్స్‌ అన్నింటికి ఒక్కటే సొల్యూషన్‌

Published Fri, Sep 15 2023 3:25 PM | Last Updated on Fri, Sep 15 2023 5:12 PM

Faceshot Electric Device For Brightening Skin Tone - Sakshi

ఎప్పుడూ జిడ్డు కారుతూ, మచ్చలతో, వడిలిపోయినట్లు ఉండే చర్మానికి.. ఇట్టే చెక్‌ పెట్టాలా? కోమలమైన, కాంతిమంతమైన సౌందర్యం మీ సొంతం కావాలా? అయితే ఈ ‘ఫేస్‌జిమ్‌ 2 ఇన్‌ 1 మైక్రోనీడ్లింగ్‌ ఎలక్ట్రిక్‌ డివైస్‌’ని వెంట పెట్టుకోవాల్సిందే. దీన్ని ఉపయోగిస్తే ముఖం మిలమిలా మెరిసిపోతుంది. 


పొడి చర్మం, సాధారణ చర్మం, జిడ్డు చర్మం.. ఇలా అన్ని రకాల చర్మాలకు ఇది చక్కటి వైద్యాన్ని అందిస్తుంది. ఈ మెషిన్‌.. ముఖం మీదున్న డార్క్‌ స్పాట్స్, ఫేస్‌ డల్‌నెస్‌ని దూరం చేస్తుంది. అలాగే చర్మంపైన ముడతలు, గుంతలను కూడా పూర్తిగా నయం చేస్తుంది. ఈ డివైస్‌తో పాటు లిక్విడ్‌ విటమిన్‌ రీఫిల్స్‌ లభిస్తాయి. అవసరాన్ని బట్టి వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ లిక్విడ్స్‌లో గ్లైకోలిక్‌ యాసిడ్, విటమిన్‌ ఎఫ్‌ వంటివి మంచి ఫలితాలను అందిస్తాయి.

గ్లైకోలిక్‌ యాసిడ్‌తో ముఖం కాంతిమంతమవుతుంది. విటమిన్‌ ఎఫ్‌తో మచ్చలు, ముడతలు మాయమవుతాయి. ఈ ఫేస్‌షాట్‌ ఎలక్ట్రిక్‌ మైక్రోనీడ్లింగ్‌ మెషిన్‌.. చర్మాన్ని రిజువనేట్‌ చేస్తుంది. దీని సీరం డిస్పెన్సర్‌ ట్రీట్‌మెంట్‌.. ముఖంలోని కండరాలను ఉత్తేజపరచడంలో.. స్కిన్‌ను మృదువుగా, బిగుతుగా మార్చడంలో సహకరిస్తుంది.

మెడికల్‌–గ్రేడ్‌ స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో రూపొందిన ఈ డివైస్‌లో లిక్విడ్స్‌ని ఎలా నింపుకోవాలంటే.. చిత్రంలోని రీఫిల్స్‌ని.. ఇంజెక్షన్‌ బాటిల్‌ మాదిరి పైభాగాన్ని ఓపెన్‌ చేసి.. అందులోని లిక్విడ్‌ని డివైస్‌కి సంబంధించిన టూల్‌లో నింపుకోవాలి. దాన్ని మెషిన్‌ హెడ్‌లోకి జొప్పించి.. మూత బిగించి.. ఫేస్‌కి దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పాడైన చర్మాన్ని ఇది 97 శాతం వరకూ తిరిగి యథాస్థితికి తేగలదు. సరిగ్గా నెల పాటు ఈ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దీని ధర 275 డాలర్లు. అంటే 22 వేల 780 రూపాయలన్న మాట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement