డిజిటల్‌ యాడ్‌లో మెరిసిన సిద్ధార్థ్‌, అదితీ | L'Oreal Paris unveils new digital campaign with Aditi Rao Hydari and Siddharth | Sakshi
Sakshi News home page

కొత్త డిజిటల్‌ యాడ్‌లో మెరిసిన సిద్ధార్థ్‌, అదితీ

Published Thu, Mar 6 2025 5:36 PM | Last Updated on Thu, Mar 6 2025 6:56 PM

L'Oreal Paris unveils new digital campaign with Aditi Rao Hydari and Siddharth

ప్రపంచపు నంబర్ 1 బ్యూటీ బ్రాండ్ లోరియల్ ప్యారిస్ (L'Oréal Paris) తమ కొత్త డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ జంట అదితి రావు హైదరీ, సిద్ధార్థ్‌ నటించారు. తొలి క్యాంపెయిన్ విజయవంతమైన నేపథ్యంలో అదితి రావు హైదరీ, సిద్ధార్థ్‌ నటించిన  కొత్త డిజిటల్ క్యాంపెయిన్ లోరియల్ ప్యారిస్ ఆవిష్కరించింది.

ఇందులో 2003 క్లాసిక్ సినిమా ‘బాయ్స్‌​’ను  గుర్తు చేసేలా ఫన్‌రీల్‌తో సిద్ధార్థ్ ఇన్‌స్టాగ్రాంలో కనిపిస్తారు. దుమ్మూ, చెమట లాంటి కారణంగా తలపై నూనె పేరుకుపోవడం, జిడ్డుగా మారడంలాంటి జుట్టు కష్టాల గురించి సిద్ధార్థ్ సరదాగా ముచ్చటిస్తారు. సరిగ్గా ఈ టైంలో సిద్ధార్థ్‌ స్వీట్‌హార్ట్‌ అదితి ఎంట్రీ ఇచ్చి లోరియల్ ప్యారిస్ హయాలురోన్ ప్యూర్ షాంపూను అందించి, అందులోని కీలకాంశాలైన శాలిసిలిక్ యాసిడ్, హయాలురోనిక్ యాసిడ్‌ ప్రయోజనాల గురించి ముచ్చటిస్తుంది. 

సరదాగా సాగే మాటల మధ్యలో, తాను ఈ ప్రొడక్ట్‌కి ఫ్యాన్‌నే అయినప్పటికీ, అదితినే అధికారిక బ్రాండ్ అంబాసిడర్ అని సిద్ధార్థ్ గుర్తు చేస్తాడు ఈ డిజిటల్‌ ఫిలింకి  భారీ స్పందన లభించడం విశేషం.  విడుదలైన  కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వీక్షణలను సాధించింది. ఆన్-స్క్రీన్‌పై సిద్ధార్థ్, అదితి జంట కెమిస్ట్రీకి అభిమానుల ప్రశంసలు దక్కడంతో ఈ క్యాంపెయిన్, సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది.

ఈ సందర్భంగా  లోరియల్ ప్యారిస్ కుటుంబానికి తోడ్పాటు అందిస్తున్న, సిద్ధార్థ్‌ అదితి రావు హైదరీకి లోరియల్ ప్యారిస్ ఇండియా జనరల్ మేనేజర్ డేరియో జిజ్జీ (Dario Zizzi) కూడా ధన్యవాదాలు తెలిపారు. సౌందర్యాన్ని మెరుగుపర్చే వినూత్న ఉత్పత్తులను ఆవిష్క రించేందుకు లోరియల్ ప్యారిస్ కట్టుబడి ఉందన్నారు. లోరియాల్ ప్యారిస్ హయాలురోన్ ప్యూర్ షాంపూ తల మీద నూనె పేరుకుపోవడాన్ని నివారించి, జుట్టు తేలికగా, పరిశుభ్రంగా, తాజాగా ఉంచుతుందని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement