Shampoo
-
తలకు షాంపూ.. ఇలా ఐతే మంచిది!
ఆధునిక జీవనశైలి, వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారాల వల్ల చాలా మందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. కొంతమందికి జుట్టు తొందరగా జిడ్డుపట్టే తత్త్వం ఉంటుంది. వీటినుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వాడుతున్నారు. వీటిని వాడడం వల్ల మంచి ఫలితాల మాట ఎలా ఉన్నా, కొన్ని రోజుల తర్వాత జుట్టు చెడిపోతుంది. అయితే షాంపూ చేయడానికి ముందు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది. తలకు నూనె పట్టించడం షాంపూ చేయడానికి ముందు జుట్టుకు తప్పకుండా నూనెను అప్లై చేయాలి. తలకు నూనెను పట్టించిన రెండు గంటల తర్వాత జుట్టును శుభ్రం చేయడం మంచిది. తల దువ్వుకోవడం షాంపూ చేయడానికి ముందు జుట్టును బాగా దువ్వాలి. దువ్విన తర్వాత షాంపూను అప్లై చేయడం వల్ల జుట్టు చిట్లకుండా ఉంటుంది. జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. సల్ఫేట్ రహిత షాంపూలు సో బెటర్ ప్రస్తుతం చాలా మంది బాగా గాఢంగా ఉండే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా మైల్డ్‌గా.. సల్ఫేట్ రహితంగా ఉండే షాంపూలను వినియోగించడం మంచిది. తలకు చన్నీరే మంచిది జుట్టు సమస్యలతో బాధపడేవారు తలస్నానం చేసే సమయంలో చల్లని లేదా గోరువెచ్చటి నీటితో మాత్రమే చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టు మొదళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. (చదవండి: అగ్గిపుల్లతో ఇలా చేస్తే..మొక్కలు పూలతో కళకళలాడతాయి!) -
వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్!
సాక్షి, ముంబై: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. త్వరలోనే క్లీనింగ్ ప్రొడక్ట్స్ ధరలు మోత మోగనున్నాయి. ముఖ్యంగా ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్ (ఎస్ఎఫ్ఏ)’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో రాబోయే నెలల్లో సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. (MG Comet EV: ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!) సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్ల తయారీలో వినియోగించే కీలక ముడిపదార్థమైన ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనకు కనున కేంద్రం ఆమోదం లభిస్తే ధరలు భారం తప్పదు. ఎస్ఎఫ్ఏ అనేది సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల తయారీలో కీలకమైంది. అలాగే ఈ పన్ను పెంపు ద్వారా ఇతర పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే సోడియం లారెత్ సల్ఫేట్ (SLS) ఉత్పత్తిదారుపై ప్రభావాన్ని చూపుతాయని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే) ఇండియాకుశాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్స్ ఇండోనేషియా, మలేషియా, థాయిల్యాండ్ దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దీంతో అధిక యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీ విధించాలని రెండు నెలల క్రితం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ కేంద్రానికి సూచించింది. దీంతో ఇప్పటికే మన దేశంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నందున ఇది మరింత ధరల పెరుగుదలకు దారి తీస్తుందనే ఆందోళన ఉంది. ప్రతిపాదిత సుంకం సరుకు ఖర్చు, బీమా, సరుకువిలువలో 3 శాతం నుండి 30 శాతం వరకు ఉంటుందని అంచనా. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) మరోవైపు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది కొత్త టారిఫ్ నిర్మాణాన్ని వర్తింపజేయవద్దని ఇండియన్ సర్ఫ్యాక్టెంట్ గ్రూప్ (ఐఎస్జీ) కన్వీనర్, మనోజ్ ఝా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఈ చర్యతో దిగువ ఉత్పత్తుల దిగుమతుల ధరలు పెరుగుతాయని, కంపెనీల లాభ దాయకతపై కూడా ప్రభావం చూపుతుందని, ఇది తదుపరి ఉద్యోగాల కోతకు దారితీయవచ్చని పేర్కొన్నారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) -
Hair Care: ఉంగరాల జుట్టుతో ‘చిక్కులు’! సోంపు ఆకులను ఇలా వాడితే..
Hair Care Tips In Telugu: ఉంగరాల జుట్టు ఉండటం అందానికి చిహ్నంగా చెప్తారు. కొంతమంది స్టైల్ కోసం కూడా జుట్టును ఉంగరాలుగా మలుచుకుంటారు. అయితే ఉంగరాల జుట్టు వారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య జుట్టు చిక్కులు పడటం. ఈ జుట్టు కుదుళ్ల దగ్గర జిడ్డుగా ఉండి చివర్లు పొడిబారినట్లుగా ఉంటాయి. ఉంగరాల జుట్టు కలవారు వారానికి మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. అలాగే జుట్టుకి పోషణను అందించే షాంపూలు, బాదం, అవకాడో గుణాలు కలిగిన షాంపూలు, సల్ఫేట్ రహిత షాంపూలు వాడటం ఉత్తమం. కొంచెం రింగులు తక్కువ ఉండి, అలలలాగా జుట్టు ఉండేవారికి కూడా ఇదే వర్తిస్తుంది. అయితే వీరు సల్ఫేట్ రహిత షాంపూ లేదా నురగతో శుభ్రపరుచుకోవడం చేసుకుంటే ప్రయోజనాలుంటాయి. ఒత్తైన కేశాల కోసం సోంపు ఆకులు ►సోంపు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మృదుత్వం సంతరించుకుంటాయి. ►రెండు లీటర్ల నీటిలో రెండు గుప్పెళ్ల సోంపు ఆకులను వేసి మరిగించి దించాక కొంచెం సేపు కదిలించకుండా అలాగే ఉంచాలి. ►నీరు ఆకులలోని సుగుణాలను ఇముడ్చుకుంటుంది. ►ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను కలిపి తలస్నానం పూర్తయ్యాక జుట్టుకంతటికీ పట్టేటట్లు పోయాలి. చదవండి: Hair Care Tips: జుట్టు ఆరోగ్యంగా, సిల్కీగా ఉండాలంటే.. ఇంట్లోనే ఇలా షాంపూ తయారు చేసుకోండి! Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్ అదే! -
డవ్ షాంపూ వాడే వాళ్ళకి షాక్... రీకాల్ చేసిన కంపెనీ
-
అణుయుద్ధం జరిగినప్పుడూ... జుట్టుకి కండీషనర్ వద్దు ఎందుకంటే?...
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. అదీగాక గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ సేనలు పుంజుకుంటూ రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాలన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకుంటూ విజయ ఢంకా మోగించనుంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌కి అడ్డుకట్టేవేసేలా... రష్యా అధ్యక్షుడు పుతిన్ పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను సమీకరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఒక వేళ రష్యా ఓడిపోతానన్న అనుమానం తలెత్తిన వెంటనే అణుదాడులకు దిగుతుందని ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అణుయుద్ధం జరిగేటప్పుడూ జుట్టుకి కండిషనర్‌ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని స్వయంగా పుతిన్ చెప్పినట్లు అమెరికా చెబుతుంది. ఈ మేరకు అమెరికా తన పౌరులకు అలాంటి విపత్కర సమయాల్లో చేయాల్సినవి, చేయకూడనవి విషయాలు గురించి వివరించింది. అణు యుద్ధం సమయంలో హెయిర్ కండీషనర్ వినియోగించటం ప్రాణాంతకమని పేర్కొంది. అంతేగాదు అణుబాంబు పేలితే రేడియోధార్మిక ధూళిని మేఘాలు గాల్లోకి నెట్టేస్తాయి. అలాంటి సమయాల్లో వీలైనంత త్వరగా షాంపుతో తల స్నానం చేయాలని సూచించింది. దీనివల్ల సురక్షితంగా ఉండే అవకాశాలు ఎక్కువ శాతమని తెలిపింది. తలస్నానం చేసిన వెంటనే కండీషనర్‌ని మాత్రం వినియోగించొద్దు అని సలహ ఇచ్చింది. షాంపూ జుట్టుని శుభ్రపరిస్తే..కండీషనర్‌లోని సర్ఫ్యాక్టెంట్లు నీటీని, నూనెను ఆకర్షిస్తాయని చెప్పింది. ఈ కండీషనర్, మీ జుట్టుకి రేడియోధార్మిక వంటి పదార్థాల మధ్య జిగురులా పని చేస్తుంది. దీంతో ఈ రేడియోథార్మిక పదార్థాలు జుట్టును గట్టిగా అంటిపెట్టుకుని ఉండిపోతాయని, దీంతో ప్రాణాంతకంగా మారుతోందని అమెరికా హెచ్చరించింది. అలాగే ఇలాంటి అణు విస్పోటనం జరిగినప్పుడూ...రేడియేషన్‌ని నివారించటానికి ఇటుక లేదా కాంక్రీట్ భవనంలో ఆశ్రయం పొందాలని, కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకకూడదని సూచించింది. (చదవండి: ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ.. పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్) -
జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ వాడుతున్నారా?
జైపూర్ : అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ మాత్రమే కాదు బేబీ షాంపూ కూడా ప్రమాదకరమైనదేనని తాజా పరీక్షల్లో తేలింది. రాజస్థాన్‌లో జరిపిన నాణ్యతా పరీక్షల్లో జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూ భారత ప్రమాణాలను అందుకోలేకపోయింది. ఈ మేరకు రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జాన్సన్ అండ్ జాన్సన్‌కు మార్చి 5వ తేదీని నోటీసులు జారీ చేసింది. కంపెనీ బేబీ షాంపూ రెండు బ్యాచ్‌ల నమూనాల పరీక్షల్లో షాంపూలో హాని కారక పదార్థాలు ఉన్నాయని తెలిపింది. ఈ శాంపిల్స్‌లో ప్రమాదకర ఫార్మల్ డిహైడ్ ఉన్నట్లు తేలిందని పేర్కొంది. ఈ ఫార్మల్డిహైడ్ను భవన నిర్మాణ సామగ్రి (కార్సినోజెన్) తయారీలో ఉపయోగిస్తారని వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ అంశాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధి తిరస్కరించారు. తమ కంపెనీకి చెందిన ఎస్యూరెన్స్ ప్రాసెస్ ప్రపంచంలోనే అత్యంత కఠినంగా ఉంటుందనీ అత్యంత సురక్షితంగా తమ ఉత్పత్తులను ఉంచుతామంటూ ఈ ఆరోపణలను తిరస్కరించారు. ఈ ఫలితాలు ఏకపక్షమైనవనీ, వీటిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమన్నారు. కాగా జే అండ్ జే బేబీ పౌడర్‌లో ప్రమాదకర క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఇప్పటికే తేలింది. అలాగే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై ప్రపంచ వ్యాప్తంగా వేలాది కేసులు విచారణలో ఉన్నాయి. పలు కేసులో భారీ నష్టపరిహారం చెల్లించాలని సంబంధిత కోర్టులు సంస్థను అదేశించిన సంగతి తెలిసిందే. -
ఒంటి దుర్వాసనతో కుంగి పోతున్నాను
హెయిర్ అండ్ స్కిన్ కౌన్సెలింగ్ నాకు చాలా ఎక్కువగా చెమట పడుతుంటుంది. చెమట దుర్వాసన కూడా ఎక్కువేనని ఫ్రెండ్స్ అంటున్నారు. ఈ సమస్య నన్ను చాలా వేధిస్తోంది. నలుగురిలో కలవలేక మానసికంగానూ కుంగిపోయేలా చేస్తోంది. నా సమస్యకు పరిష్కారం సూచించండి. – ఆర్. వేణుప్రసాద్, రాజమండ్రి చెమట పట్టడంతో ఒంటి నుంచి దుర్వాసన రావడం అన్నది కొందరిలో సాధారణం కంటే మరింత ఎక్కువ. ఇలా చెమట కారణంగా ఒంటి నుంచి దుర్వాసన రావడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. ఉదాహరణకు... ∙ఇక స్థూలకాయంతో ఉన్నవారు, ఇతర చర్మ సమస్యలు / ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి దుర్వాసన సమస్య అధికం. ముఖ్యంగా ఇంటెర్ట్రిగో, ట్రైకోమైసోసిస్, ఎరిత్మా సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య మరీ ఎక్కువ. ∙ఇక కొందరిలో దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం, గౌట్, మూత్రపిండాలు, కాలేయం సమస్యలు, టైఫాయిడ్ ఉన్నప్పుడు కూడా వారి నుంచి చెడువాసన వస్తుంటుంది. అలాగే శుభ్రత విషయంలో బద్దకంగా ఉండేవారిలోనూ, మద్యం సేవించేవారి దగ్గర్నుంచి, పెన్సిలిన్, బ్రోమైడ్స్ వంటి మందుల వాడకం వల్ల కూడా మేని నుంచి దుర్గంధం వెలువడటం అనే సమస్య తలెత్తవచ్చు. ఆహారం వల్ల... కొందరు తీసుకునే ఆహారంలో వేపుళ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, కొన్ని రకాల ఆకుకూరలు, కెఫిన్ ఉన్న పానీయాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. దుర్వాసన తొలగించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు ముందుగా తమకు ఏ కారణం చేత ఒంటి నుంచి దుర్వాసన వస్తోందో తెలుసుకోవాలి. సాధారణంగా ఆ సమస్య (అండర్లైయింగ్ ప్రాబ్లమ్)ను పరిష్కరించుకుంటే మేని దుర్వాసన సమస్య ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. ఇక అందరూ పాటించదగ్గ సూచనలు ఇవి... ∙ప్రతిరోజూ రెండుసార్లు స్నానం చేయడం ∙ బాహుమూలాలను సబ్బుతో బాగా శుభ్రం చేసుకోవడం ∙చెమట అధికంగా పట్టే ప్రదేశాలను పొడిగా, శుభ్రంగా ఉంచుకోవడం ∙తొడుక్కునే దుస్తులు చెమటను పీల్చుకునేవి, శుభ్రమైనవి, పొడిగా ఉండేవి ధరించడం ∙బాక్టీరియా సంఖ్యను తగ్గించేది, చర్మతత్వానికి సరిపడే డియోడరెంట్స్ వాడటం ∙అలాగే వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా వాసనకు కారణమయ్యే బాహుమూలాల్లోని వెంట్రుకలను తొలగించుకోవాలి. యాంటీసెప్టిక్ సబ్బులను స్నానానికి ఉపయోగించాలి. శరీర దుర్వాసనను పెంచే ఆహారపదార్థాలైన ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలి ∙తాజా ఆహారం తీసుకోవడం, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కేవలం ఒంటి దుర్వాసన సమస్యే కాకుండా, ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. శరీరానికి పూసే లేపనాలతో... సాధారణంగా చెమటలు పట్టేవారు యాంటీపెర్స్పిరెంట్స్, డియోడరెంట్స్ అనే శరీరానికి పూసే లేపనాలతో తమ శరీర దుర్వాసనను తగ్గించుకుంటుంటారు. యాంటీ పెర్స్పిరెంట్స్ అన్నవి పేరును బట్టి చెమట పట్టడాన్ని తగ్గించవు. కానీ ఇందులో ఉండే అల్యూమినియమ్ క్లోరోహైడ్రేట్, అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియమ్ ఫీనాల్ సల్ఫొనేట్, అల్యూమినియమ్ సల్ఫేట్, జిర్కోనియమ్ క్లోరో హైడ్రేట్స్ వంటి లవణాలు ఉంటాయి. ఇవి చెమటగ్రంథి ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేసి, చెమట తక్కువగా పట్టేలా చేస్తాయి. వాటి ప్రభావం తగ్గాక మళ్లీ చెమటపడుతుంది. ఇలా తాత్కాలికంగా చెమటగ్రంథిని మూసేస్తుంది కాబట్టి దీన్ని యాంటీపెర్స్పిరెంట్స్ అంటారు. అందుకే యాంటీపెర్స్పిరెంట్స్ను శరీరంలో చెమట ఎక్కువగా స్రవించే ప్రాంతాల్లో పూస్తారు. ఇక డియోడరెంట్స్ విషయానికి వస్తే వీటిని అటు బాహుమూలాలతో పాటు చర్మంపైన ఏ ప్రాంతంలోనైనా పూయవచ్చు. డియోడరెంట్స్‌లో ఉండే అమోనియమ్ అలమ్, పొటాషియమ్ అలమ్ తాత్కాలికంగా చెమటలోని వాసన కలిగించే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. వాటి ప్రభావం తొలిగాక ఆ బ్యాక్టీరియా మళ్లీ పుడుతూనే ఉంటుంది. ఎలాంటి షాంపూ వాడితే మేలు? మార్కెట్లో చాలారకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి కదా. వాటిలో ఏది ఎంచుకోవాలా అనే అంశంపై మాకు కొంచెం అయోమయంగా ఉంది. సాధారణంగా మంచి షాంపూను ఎంచుకోవడానికి ఎలాంటి మార్గదర్శకాలు పాటించవచ్చో వివరించండి. – డి. మాధవీలత, హైదరాబాద్ సాధారణంగా అందరి వెంట్రుకలూ ఒక్కలా ఉండవు కాబట్టే... అందరి షాంపూ అవసరాలూ ఒకేలా ఉంటాయని చెప్పలేం. మన అవసరాలను బట్టి మార్కెట్లోకి రకరకాల షాంపూలు అందుబాటులోకి వచ్చాయి.ఇంకా వస్తున్నాయి. మన అవసరాలను బట్టి మనం ఎలాంటి షాంపూలను ఎంచుకోవచ్చో చూద్దాం. అందరూ వాడదగ్గవి: ఇందులో శుభ్రపరిచే సామర్థ్యం (క్లెన్సింగ్ ఎబిలిటీ) నార్మల్‌గా ఉంటుంది. నార్మల్ హెయిర్ కోసం వాడాల్సిన ఈ షాంపూలు సాధారణంగా లారిల్ సల్ఫేట్ అనే నురగవచ్చే పదార్థంతో తయారవుతాయి. ఇందులో ఆ రసాయనంతో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు ఉత్పత్తిదారులు రకరకాల సుగంధ ద్రవ్యాలను చేర్చి వాటిని మంచి సువాసన వచ్చేలా రూపొందిస్తారు. ఇవి ఎవరైనా వాడవచ్చు. కాబట్టి మార్కెట్లో ఉన్న రకరకాల బ్రాండ్స్‌ను వాడుతూ (ట్రై చేస్తూ) మీకు ఏది అనువైనదో, సౌకర్యమో అది వాడుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఛాయిస్ షాంపూను మీ సంతృప్తి మేరకు కొనసాగించవచ్చు. పొడి వెంట్రుకలు ఉండేవారికి: వెంట్రుకలు చాలా పొడిగా ఉండేవారికోసం తయారయ్యే షాంపూల్లో రోమాన్ని శుభ్రపరిచే రసాయనాలు మరీ తీవ్రంగా లేకుండా చూస్తారు. అంటే మైల్డ్ క్లెనింగ్ ఏజెంట్స్‌ను ఉపయోగించి చేస్తారు. దాంతో పాటు వెంట్రుక కండిషనింగ్ కోసం అందులో సిలికోన్ వంటి ఏజెంట్స్, కెటాయినిక్ పాలిమర్స్‌ను కలుపుతారు. వాటిని ఉపయోగించాక ఆ సిలికోన్ పొడి వెంట్రుకల మీద సమంగా విస్తరించి ఒక కోటింగ్‌లా ఏర్పడుతుంది. కాబట్టి పొడి వెంట్రుకలు ఉన్నవారికి సిలికోన్, కెటాయినిక్ పాలిమర్స్ ఇంటి ఇన్‌గ్రేడియెంట్స్ ఉన్నవి మంచి షాంపూలుగా పరిగణించవచ్చు. మీరు పొడి వెంట్రుకలు కలవారేతే... పేన చెప్పిన ఇన్‌గ్రేడియెంట్స్ షాంపూలో ఉన్నాయో లేవో చూసి తీసుకోవచ్చు. జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి: ఇక జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి అవసరమైన షాంపూలను మాడుపైన, వెంట్రుకపైన ఉన్న అదనపు సీబమ్‌ను తొలగించేలా డిజైన్ చేస్తారు. ఇందులో క్లెన్సింగ్ ఏజెంట్‌గా లారిల్ సల్ఫేట్‌తో పాటు అదనపు నూనెవంటి స్రావాలను తొలగించడానికి సల్ఫోసక్సినేట్ వంటి రసాయనాలు ఉండేలా తయారు చేస్తారు. అయితే జిడ్డు కురులు ఉన్నవారికి రూపొందించే షాంపూలలో కండిషనింగ్ తక్కువగా ఉండేలా చూస్తారు. కాబట్టి పైన పేర్కొన్న కాంబినేషన్స్ ఉన్నవి జిడ్డు కురుల వారు ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే కురులు మరీ నిర్జీవంగా మారిపోతాయి. పీచులా కనిపించే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ఎంత తరచుగా వాడాలన్నది కేవలం మీ విచక్షణ (డిస్క్రిషన్) మేరకే ఉంటుంది. డాక్టర్ స్వప్నప్రియ డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పట్టులాంటి జుట్టు కోసం
♦ ఒక పాత్రలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ♦ తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. ∙వారంలో ఒక్కసారయినా టీ డికాషన్ తో జుట్టుని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ∙పెరుగు కుదుళ్ల నుండి జుట్టుకంతటికీ పట్టించి పది నిమిషాలయ్యాక తల స్నానం చేస్తే పట్టులా మేరుస్తుంది. -
పట్టులాంటి జుట్టు కోసం
♦ ఒక పాత్రలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ♦ తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. ♦ వారంలో ఒక్కసారయినా టీ డికాషన్ తో జుట్టుని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ♦ పెరుగు కుదుళ్ల నుండి జుట్టుకంతటికీ పట్టించి పది నిమిషాలయ్యాక తల స్నానం చేస్తే పట్టులా Ðð‡ురుస్తుంది. -
ఏ షాంపూ... ఏకండిషనర్!
ఆనందం చన్నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లు మెత్తబడతాయి. కేశాలను గట్టిగా పట్టుకుంటాయి. టీ డికాక్షన్ను జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే కేశాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. అలాగే జుట్టు తత్త్వాన్ని బట్టి షాంపూ ఎంపిక చేసుకోవాలి. పొడిబారి నిర్జీవంగా ఉండే జుట్టుకు ఎగ్షాంపూ వాడితే మంచిది. నార్మల్ హెయిర్ అయితే ఎక్కువ గాఢతలేని షాంపూ వాడాలి. జిడ్డుబారిన జుట్టయితే షాంపూతోపాటు నిమ్మరసం కూడా వాడాలి. తలస్నానానికి అరగంట ముందు నిమ్మరసం పట్టించవచ్చు లేదా తలస్నానం పూర్తయిన తర్వాత చివరగా ఒక మగ్గు నీటిలో నిమ్మరసం పిండి జుట్టంతా తడిసేలా తలమీద పోసుకోవాలి. కండిషనింగ్ ఇలా షాంపూ చేయడం పూర్తయిన తర్వాత జుట్టుకున్న నీటిని పిండేయాలి. వేళ్లతో దువ్వి చిక్కులు విడదీయాలి. కండిషనర్ చేతిలోకి తీసుకుని జుట్టుకు పట్టించాలి. కండిషనర్ను జుట్టు కుదుళ్లకు, మాడుకి (చర్మానికి) పట్టించకూడదు. కేశాలకు మాత్రమే పట్టించి ఐదు నిమిషాల తర్వాత మెల్లగా మర్దన చేయాలి. చివరగా డ్రైయర్‌తో ఆరబెడితే జుట్టు పూల రెక్కల్లా మృదువుగా ఉంటుంది. ఏ రకానికి ఏ కండిషనర్ చిట్లి పోయి జీవం కోల్పోయినట్లున్న జుట్టుకు ప్రొటీన్ కండిషనర్ వాడాలి. పొడి జుట్టుకు మాయిశ్చరైజింగ్ లేదా ఇన్టెన్సివ్ కండిషనర్, జిడ్డుగా ఉండే జుట్టుకు నార్మల్ లేదా ఆయిల్ ఫ్రీ కండిషనర్ వాడాలి. -
కేశాలకు ప్రొటీన్ ప్యాక్
బ్యూటిప్స్ ఒక బౌల్లోకి అర కప్పు పెసరపిండి తీసుకుని దానిలో కీరా ముక్కల తురుము, ఆరెంజ్ జ్యూస్, ఒక కోడిగుడ్డు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను నిలవ ఉంచకుండా తాజాగా ఉన్నప్పుడే ఉపయోగించాలి. ముందు రోజు సాయంత్రం షాంపూతో తలస్నానం చేసి, మర్నాడు ఉదయం ఈ ప్యాక్‌ను జుట్టు మొత్తం పట్టించాలి. 20 నిమిషాల పాటు ప్యాక్‌ను ఆరనిచ్చి, తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టుకు పోషణ లభించి, ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. -
బంగాళదుంపతో నిగనిగలు
బంగాళదుంప తొక్క తీసి, నీటిలో వేసి, 20 నిమిషాలు ఉడికించాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత బంగాళదుంప నీటితో జుట్టును కడగాలి. తల స్నానం చేసిన ప్రతీసారీ ఇలా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు ఎరుపురంగులోకి మారుతుంది. • బంగాళదుంపను తురిమి, పిండి, నీటిని తీయాలి. ఈ బంగాళదుంప రసం, గుడ్డులోని తెల్లసొన, పెరుగు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత వెచ్చని నీటిని ఉపయోగిస్తూ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా 20 రోజుల పాటు చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. • జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటే.. 3 టీస్పూన్ల బంగాళదుంప రసం, 3 టీ స్పూన్ల అలొవెరా రసం, 2 టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 2 గంటలు వదిలేయాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది. -
జుట్టు పెరగాలంటే...
బ్యూటిప్స్ జుట్టు రాలడం ఓ సమస్య అయితే, పెరుగుదల లేకపోవడం మరో సమస్య. వంటింటి పదార్థాలతో జుట్టురాలడాన్ని నివారించడంతో పాటు పెరుగుదలకు కావల్సిన కిటుకులేంటో చూద్దాం.. ఉల్లిరసం వెంట్రుకల పెరుగుదలకు ఇది చాలా ప్రాచీనమైన వంటింటి చిట్కా. రెండు ఉల్లిపాయల పై పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటిని మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. రసం తీసి, వెంట్రుక కుదుళ్లకు పట్టించాలి. 15 నిమిషాలు తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఉల్లిపాయ రసాన్ని మాడుకు పట్టిస్తే చాలు. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ శాతం ఎక్కువ. ఇది కొలాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కణాలు రక్తప్రసరణను మెరుగుపరచి వెంట్రుక పెరగడానికి దోహదం చేస్తాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ తలస్నానం చేసిన తర్వాత అలాగే వదిలేయకుండా 3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను లీటర్ గోరువెచ్చని నీళ్లలో కలిపి, ఈ నీటిని తలకు బాగా పట్టించాలి. 10 నిమిషాల తర్వాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసిన ప్రతీసారీ ఇలా చేస్తూ ఉండాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ జట్టు కుదుళ్లలోని పీహెచ్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేసి వెంట్రుక పెరడగానికి తోడ్పడుతుంది. గుడ్డు మాస్క్ సల్ఫర్, జింక్, ఐరన్, సెలీనియమ్, ఫాస్ఫరస్, ఐడన్, ప్రొటీన్లు, విటమిన్లు తదితర పోషక విలువలు సమృద్ధిగా ఉన్న గుడ్డులోని తెల్లసొన, తేనె కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత కొన్ని నీళ్లలో షాంపూ కలిపి తల రుద్ది, కడిగేయాలి. వారం రోజులకు ఒకసారైనా ఇలా చేయడం వల్ల శిరోజాలకు తగినంత మృదుత్వం లభిస్తుంది. -
నిగనిగల శిరోజాలకు...
బ్యూటిప్స్ ఎండకాలం శిరోజాల సంరక్షణ సమస్యగా ఉంటుంది. నిస్తేజంగా లేదంటే జిడ్డుగా మారిన శిరోజాలను ఆరోగ్యంగా నిగనిగలాడేలా చేయాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జిడ్డుగా ఉన్న జుట్టుకు కోడిగుడ్డు తెల్ల సొన పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత తలస్నానం చేయాలి. జిడ్డు వదులుతుంది. అదే పొడిబారిన జుట్టు గుడ్డులోని పచ్చసొన మాడుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. నెలకు ఒకసారి ఈ విధంగా చేస్తే చాలు. తెల్లసొనను రెండు వారాలకు ఒకసారి అప్లై చేయాలి. జీవం లేకుండా వెంట్రుకలు చిట్లి ఉన్న జుట్టుకు అర కప్పు పెరుగును పట్టించి, 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే శిరోజాలకు జీవకళ వస్తుంది. మాడు బాగా దురదగా ఉండి, పొట్టులా వస్తుంటే మీరు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేవని గుర్తించాలి. గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌ను తలకు మర్దనా చేసి, 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ప్రతి వారం ఇలా చేస్తుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఎండ తగిలి నిస్తేజంగా మారిన శిరోజాలకు ఆలివ్ ఆయిల్లో తేనె కలిపి పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. శిరోజాలకు తగినంత ప్రోటీన్లు అంది పూర్వపు కళ వస్తుంది. -
2 స్పూన్లు టీ ... 2 కప్పుల నీళ్లు...
వెంట్రుకల చివర్లు చిట్లడం, పొడిబారడం, జీవం లేనట్టుగా కనిపించడం.. ఇలాంటి శిరోజాల సమస్యలు చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. పరిష్కారం... వారానికి ఒకసారి 2 కప్పుల నీళ్లు.. 2 స్పూన్ల టీ.తేయాకును నీళ్లలో వేసి పది నిమిషాలు మరిగించి, చల్లారనివ్వాలి. షాంపూతో తలస్నానం చేశాక, నీళ్లన్నీ పోయేలా తుడవాలి. తర్వాత టీ నీళ్లతో జుట్టు అంతా తడి చేయాలి చివర్లతో సహా!10 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగేయాలి. తేయాకులో ఉండే ఔషధ గుణాలు వెంట్రుక కుదుళ్లకు బలాన్నిచ్చి, మంచి కండిషనర్‌లా ఉపయోగపడి మెరుపు వస్తుంది. జుట్టు రాలే సమస్యా తగ్గుతుంది. -
షాంపూని కనిపెట్టింది మనమే!
ఫ్లాష్ బ్యాక్ సౌందర్య పోషణలో తలకట్టుదే పెమైట్టు. శిరసున కేశసంపద అలరారుతున్నప్పుడే సౌందర్యం ఇనుమడిస్తుంది. మన పూర్వీకులకు ఈ సంగతి ముందే తెలుసు. అందుకే వాళ్లు కేశ సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిచ్చేవారు. శిరోజాలను శుభ్ర పరచుకోవడానికి వేల ఏళ్ల కిందటే షీకాయ, కుంకుడు కాయలు వంటి వాటిని మన దేశంలో విరివిగా వాడేవారు. తడి నెత్తికి పట్టిస్తే, నురగనిచ్చే ఈ పదార్థాలు 18వ శతాబ్ది వరకు పాశ్చాత్యులకు తెలియనే తెలియవు. వాస్తవానికి హిందీలోని ‘చాంపో’ పదమే ఇంగ్లిష్‌లోని ‘షాంపూ’పదానికి మూలం. క్రీస్తుశకం 1762లో ఇది ఇంగ్లిష్ వారికి పరిచయమైంది. అయితే, ఇరవయ్యో శతాబ్ది వరకు ‘షాంపూ’ జన సామాన్యానికి అందుబాటులోకి రాలేదు. అంతకు ముందు బ్రిటన్ సహా పలు యూరోప్ దేశాలలో షేవింగ్ కోసం ఉపయోగించే సబ్బును మరి గించిన నీటిలో వేసి, దాని ద్వారా వచ్చే నురగతో తలలు శుభ్రం చేసుకునేవారు. అమెరికాలోని హెచ్.ఎస్.పీటర్సన్ అండ్ కంపెనీ ‘కాంత్రాక్స్’ పేరిట 1914లో షాంపూను అందుబాటులోకి తెచ్చింది. పత్రికల్లో విరివిగా ప్రకటనలు గుప్పించింది. టిన్ డబ్బాల్లో అమ్మే ఈ షాంపూ... పొడిగా ఘనరూపంలో ఉండేది. ఆ తర్వాత 1926లో జర్మన్ పరిశోధకుడు హాన్స్ స్క్వార్జ్కాఫ్ చిక్కని ద్రవరూపంలో షాంపూను తయారు చేశాడు. ఇది అందుబాటులోకి వచ్చాక, చాలా దేశాలు ఇదే పద్ధతిలో వివిధ పరిమళాలతో షాంపూలను తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇక అప్పటి నుంచి కేశ సంరక్షణలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి. ఇప్పుడు మార్కెట్ నిండా రకరకాలు ఆక్రమించాయి. -
పేలనాశిని
తలకు పేలు పట్టాయంటే ఆ బాధ వర్ణనాతీతం. ఎక్కువగా చిన్నపిల్లలకు తరచు తలలో పేలు పెరుగుతుంటాయి. అక్కడక్కడా పెద్దలకూ ఈ సమస్య ఉంటుంది. పేలను వదలగొట్టడానికి ఘాటైన రసాయనాలతో కూడిన షాంపూలను వాడాల్సి వస్తుంది. అయితే, పేలను సమూలంగా నాశనం చేసి పారేసే హైటెక్ దువ్వెనను జర్మన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. జర్మనీకి చెందిన ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్ ఫర్ సర్ఫేస్ ఇంజనీరింగ్ అండ్ థిన్ ఫిల్మ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ దువ్వెన తయారీలో శీతలీకరించిన ప్లాస్మాను ఉపయోగించారు. ఈ దువ్వెనలోని పళ్లను ఎలక్ట్రోడ్లుగా ఉపయోగపడేలా తయారు చేశారు. దీంతో ఈ దువ్వెనతో దువ్వినప్పుడు దాని పళ్ల మధ్య ఖాళీ జాగాలోని గాలి ఆ పళ్లను అయొనైజ్ చేసి, స్వల్పంగా విద్యుత్తు పుట్టేలా చేస్తుంది. ఫలితంగా దువ్వగానే ఇందులోని ప్లాస్మా విడుదలై, దాని ద్వారా వెలువడే షాక్ ప్రభావానికి తలలోని పేలు, ఈపులు వంటివన్నీ చచ్చి ఊరుకుంటాయి. అయితే, ఈ దువ్వెన ద్వారా వెలువడే షాక్ అత్యంత స్వల్పం కావడంతో దీని ప్రభావం మనుషులపై ఏమాత్రం ఉండదని దీని రూపకర్తలు చెబుతున్నారు. జర్మనీలోని కొన్ని పిల్లల ఆస్పత్రిలో ఈ దువ్వెనను ఇప్పటికే వాడుతున్నారు. త్వరలోనే ఇది మార్కెట్లోకి విడుదల కానుందని చెబుతున్నారు. -
షాంపూలతో క్యాన్సర్ ముప్పు!
న్యూయార్క్: షాంపూలో ఉపయోగించే రసాయనాలతో క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలలో ఈ విషయం వెల్లడయింది. వినియోగదారులు విరివిగా ఉపయోగించే షాంపూలు, కాస్మొటిక్ పదార్దాలు, బాడీ లోషన్ల తయారీలో ఉపయోగించే రసాయనాల ద్వారా మహిళల్లో 'రొమ్ము క్యాన్సర్' వచ్చే అవకాశం పెరుగుతుందని ఈ పరిశోధనలో తేలింది. దీనితో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధుల భారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. పరిశోధనకు సంబంధించిన వివరాలను కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డేల్ లీట్మెన్ వెల్లడిస్తూ.. 'తక్కువ పరిమాణంలో వాడుతున్నప్పటికీ నిలువ కొరకు వాడే రసాయనాలు క్యాన్సర్ వ్యాధికి కారకాలవుతున్నాయి. శరీరంలో ఈస్ట్రోజన్‌ను పోలినటువంటి రసాయనాలయిన పారాబీన్స్ను షాంపూలు, కాస్మొటిక్స్‌లలో స్వల్ప మోతాదులో వాడుతున్నారు. వీటి వాడకం వలన క్యాన్సర్‌తో పాటు మహిళల్లో అనేక రుగ్మతలు తలెత్తుతాయి' అని తెలిపారు. వివిధ ఉత్పత్తుల తయారీలో విరివిగా ఉపయోగించే పారాబీన్స్కు సంబంధించి, అవెంతవరకు సురక్షితం అన్న దానిపై విస్తృత పరిశోధన జరగాలని శాస్త్రవేత్తలు తెలిపారు. -
కురులకు టాల్కమ్ పౌడర్!
బ్యూటిప్స్ - షాంపూతో తలస్నానం చేశాక జుట్టు బాగా చిక్కు పడుతుంది. అలాగే దువ్వితే జుట్టు రాలడం అధికమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే చిక్కు ఉన్న చోట బేబీ టాల్కమ్ పౌడర్ రాసుకొని దువ్వితే సులువుగా దువ్వుకోవచ్చు. - కొబ్బరి నూనెలాగే కొబ్బరి పాలు కూడా కురుల సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పాలను తలకు ఉపయోగించడం కూడా మంచి చిట్కా. షాంపూతో తలస్నానం చేసే ముందు కొబ్బరి పాలతో మాడును బాగా మర్దన చేసుకోవాలి. ఈ పాలను తలస్నానం చేశాక కూడా నూనెలా రాసుకోవచ్చు. జిడ్డుతనం ఉండదు కాబట్టి ఇది మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతుంది. జుట్టు త్వరగా చిక్కులు పడదు. - ప్రతిరోజూ ఉద్యోగాలకంటూ బయటివెళ్లే మహిళలకు ఫేస్‌స్క్రబ్ తప్పక ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు మార్కెట్లో దొరికే ప్రాడక్టులు వాడేకంటే ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరం. రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండికి నాలుగు టీస్పూన్ల తేనె, పేస్ట్‌లా తయారు చేసుకోవడానికి కావాల్సినంత రోజ్‌వాటర్ తీసుకోవాలి. ఆ మిశ్రమంతో స్క్రబ్ చేసుకుంటే ముఖంపై అంటుకున్న దుమ్ము, ధూళిని తరిమి శుభ్రంగా ఉంచుతుంది. - గుమ్మడికాయతో కూర వండుకోవచ్చు, వడియాలు పెట్టుకోవచ్చు ఇవే మనకు తెలిసిన విషయాలు. కానీ ఈ గుమ్మడికాయ గుజ్జు ముఖ సౌందర్యాన్ని పెంచుతున్న అంశం కొత్తగా ఉంది కదూ. గుమ్మడికాయ గుజ్జులో ఒక గుడ్డు తెల్ల సొన, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలను కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖంపై ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు మటుమాయమై కాంతిమంతంగా నిగారిస్తుంది. -
జుట్టు పొడిబారకుండా...
బ్యూటిప్స్ వర్షంలో ఎక్కువగా తడవడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు లాంటివి వెంటాడతాయి. ఆడవాళ్ల కురుల సంరక్షణకు ఇంటి చిట్కాలు.. శనగ పిండి ముఖానికే కాదు జుట్టుకూ మెరుపునిస్తుంది. ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల శనగపిండి, గుడ్డు తెల్లసొన, టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. వాటిని బాగా కలిపి ఓ పది నిమిషాలు నానబెట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టుకు, మాడుకు రాసుకొవాలి. అది పూర్తిగా ఆరాక చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఈ వర్షాకాలంలో వారానికోసారి ఇలా చేస్తే జుట్టు పొడిబారకుండా నిగనిగలాడుతుంది. {పతిరోజూ తలస్నానం చేసేవారు ఇంట్లోనే షాంపూ కోసం.. కుంకుడుకాయలు, షీకాకాయ్, ఎండు ఉసిరికాయలను సమపాళ్లలో తీసుకోవాలి. వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయమే వాటిని రోట్లో లేదా మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమాన్ని తలకు రాసుకొని వెంటనే తలంటుస్నానం చేయాలి. మార్కెట్లో లభించే షాంపూలాగా ఎక్కువ నురుగు రాకపోయినా తలను శుభ్రం చేయడంలో దీని ప్రత్యేకతే వేరు. -
శిరోజాలకు కండిషనర్...
పొడిగా మారిన వెంట్రుకల చివర్లు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పరిష్కారం.. * బాగా మగ్గిన అరటిపండును గుజ్జులా చేసి, దాంట్లో గుడ్డు సొన వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 15-30 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం కురులకు సహజసిద్ధమైన కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. * పావు కప్పు ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కప్పు నీటిలో కలపాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఆ నీటితో వెంట్రుకలను తడపాలి. ఈ మిశ్రమం జుట్టుకు మంచి కండిషన్‌ని ఇస్తుంది. -
సహజంగా మెరుపు..
ఇంట్లోనే! చర్మం పొడిబారడం, వెంట్రుకలు పెళుసుబారడం.. ఇవన్నీ చలికాలం ఇబ్బంది పెట్టే సమస్యలు. ఇటీవల మారుతున్న ఉష్ణోగ్రతలు చర్మంపై, శిరోజాలపై చెడు ప్రభావం చూపుతున్నాయి. వీటికి ఇంట్లోనే సరైన చికిత్స చేసుకోవచ్చు... శిరోజాలకు అలొవెరా! షాంపూలు, కాలుష్యం, గాలిలో తేమ తగ్గడం.. వంటి వాటి వల్ల ఈ కాలం వెంట్రుకలు త్వరగా పొడిబారడం, చిట్లడం వంటివి సహజంగా జరుగు తుంటాయి. వీటి వల్ల జుట్టు నిస్తేజంగా కనిపిస్తుంది. అలొవెరా ఆకులను పేస్ట్ చేసి, షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. 15-20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలొవెరా రసం జుట్ట్టుకు కావలసినంత కండిషన్ లభించేలా చేస్తుంది. దీంతో జుట్టు మెత్తగా, నిగ నిగలాడుతూ ఉంటుంది. గోళ్లు విరిగిపోతుంటే... గోళ్లు పొడవుగా పెంచుకొని, మంచి షేప్ చేయించుకోవాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. కానీ కొందరిలో గోళ్ల పెరుగుదల అంతగా ఉండదు. పైగా కొద్దిగా పెరిగినా త్వరగా విరిగిపోతుంటాయి. దీనికి కారణం... క్యాల్షియం, ఐరన్ లోపం. అందుకని తీసుకునే ఆహారంలో క్యాల్షియం, ఐరన్ పాళ్లు ఎక్కువ ఉన్న పదార్థాలను చేర్చాలి. పాలు, పాల ఉత్పత్తులలో క్యాల్షియం మోతాదు అధికంగా ఉంటుంది. తాజా ఆకుకూరలు, నువ్వులు, పల్లీలు, బెల్లం.. మొదలైన వాటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చడంతో పాటు రోజూ రాత్రి పడుకునే ముందు నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో కలిపి గోరు మీద రాసి, మసాజ్ చేయాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే గోళ్ల పెరుగుదల బాగుంటుంది. త్వరగా విరిగిపోవు. నెల రోజులకోసారి ఇంట్లోనే మేనిక్యూర్ (గోళ్ల శుభ్రత) చేసుకుంటే అందంగా ఉంటాయి. నలుపు తగ్గాలంటే... మోచేతులు, మెకాళ్లు, మెడ వద్ద నలుపు ఏర్పడితే ఎంతకీ తగ్గదు. ఇలాంటప్పుడు... స్పూన్ బంగాళదుంప తురుములో టీ స్పూన్ తేనె కలిపి, ఈ మిశ్రమంతో నలుపు ఉన్న భాగంలో రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే, నలుపు తగ్గుతుంది. - గీతాంజలి ప్రియ, బ్యూటీషియన్ మీ సౌందర్య సమస్యలకు పరిష్కారాల కోసం రాయవలసిన చిరునామా: సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34. ఈ-మెయిల్: sakshi.features@gmail.com -
హెయిర్ సీరమ్ ఎందుకంటే..?
కాలుష్యం పెరుగుతోంది. బయట తిరిగే సమయాలూ పెరుగుతున్నాయి. ఎండ, దుమ్ము, రసాయనాల బారి నుంచి శిరోజాలను కాపాడుకోవాలంటే ఒక రక్షణ పొర అవసరం. జుట్టు రక్షణ ఇచ్చే పొర పేరు ‘సీరమ్!’ పొడిబారడం, కాంతిని కోల్పోవడం, చిట్లిన వెంట్రుకలు అధికమవడం... ఇవన్నీ జుట్టును నిర్జీవంగా మారుస్తున్నాయి. రకరకాల షాంపూలు, బ్లో డ్రయ్యర్లు, స్ట్రెయిటనింగ్ మెషీన్లు, స్టైల్ కోసం ఉపయోగించే జెల్స్.. జుట్టుపై మరింత ప్రభావం చూపుతున్నాయి. వీటన్నింటి నుంచి కేశాలను కాపాడే సుగుణం సీరమ్‌కు ఉంటుంది. అయితే నాణ్యత గల హెయిర్ సీరమ్కే ప్రాధాన్యం ఇవ్వాలి. నోట్:1 డెర్మటాలజిస్ట్ లేదా ట్రైకాలజిస్ట్‌ను సంప్రదించి మీ శిరోజాల తత్త్వాన్ని తెలుసుకొని, తగిన హెయిర్ సీరమ్‌ను ఎంపిక చేసుకోవాలి. నోట్:2 హెయిర్ సీరమ్ ఒకసారి వాడిన తర్వాత తలను శుభ్రపరుచుకున్నాకే మళ్ళీ వాడాలి. పదే పదే సీరమ్‌ని ఉపయోగించకూడదు. నోట్:3 హెయిర్ సీరమ్‌ను కొద్దిగా వేళ్లకు అద్దుకొని జుట్టుకు రాసుకుని, దువ్వెనతో కుదుళ్ల దగ్గర నుంచి చివరల వరకు దువ్వాలి. అంతేకాని నూనెతో మసాజ్ చేసినట్టు సీరమ్‌ను మాడుకు పట్టించకూడదు. -
ఆవిష్కరణం: షాంపూ మనదే!
టీవీలో అనునిత్యం షాంపూ కంపెనీల యాడ్స్ హోరెత్తుతుంటాయి. హీరోలు, హీరోయిన్లు వివిధ షాంపూ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వాడమని చెబుతుంటారు. వాడితే మీ జుట్టుకు పోషణ అందుతుందని, బలపడుతుందని, చుండ్రు ఉండదని చెబుతుంటారు. మరి ఇన్ని లక్షణాలున్న షాంపూను కొనగొన్నదెవరు? ఇది ఎలా విస్తృతంగా వాడకంలోకి వచ్చింది.. అనే విషయాన్ని పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న షాంపూల్లో ఎక్కువ భాగం విదేశాలవే. అయితే షాంపూను కనుగొన్నది, తొలిసారి వాడినది, దాన్నొక అలవాటుగా మార్చుకొన్నది, తొలి సారి మార్కెట్ చేసిందీ భారతీయులు! మధ్యయుగం నుంచే భారతీయులకు శిరోజ సంరక్షణ కోసం షాంపూను వాడటం అలవాటు చేసుకున్నారు. అసలు ‘షాంపూ’ అనే మాట కూడా భారతీయులదే. హిందీ, మరి కొన్ని ఉత్తరభారతదేశ భాషల్లో ’ఛాంపో’ అంటే ‘మాలిష్’ అనే అర్థం వస్తుంది. ఈస్టిండియా కంపెనీ వాళ్లు బెంగాల్లో స్థిరపడ్డాక షేక్దీన్ మొహమ్మద్ అనే ఒక బెంగాలీ వ్యాపారీ బ్రిటిషర్లకు షాంపూ గురించి పరిచయం చేసి, బ్రిటన్‌కు ఎగుమతిప్రారంభించాడు. శిరోజాలను శుభ్రం చేయడంతో పాటు సుగంధాన్ని అద్దే షాంపూ పట్ల బ్రిటిషర్లు మక్కువ పెంచుకున్నారు. అలా షాంపూ భారతదేశ తీరాలను దాటింది. ఆ తర్వాత ఫార్ములాను తెలుసుకుని పాశ్చాత్యులు అనేక మార్పు చేర్పులతో షాంపూలను మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. అదే క్రమంగా వేల కోట్ల రూపాయల పరిశ్రమగా మారింది.