జుట్టు పొడిబారకుండా...
బ్యూటిప్స్
వర్షంలో ఎక్కువగా తడవడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు లాంటివి వెంటాడతాయి. ఆడవాళ్ల కురుల సంరక్షణకు ఇంటి చిట్కాలు.. శనగ పిండి ముఖానికే కాదు జుట్టుకూ మెరుపునిస్తుంది. ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల శనగపిండి, గుడ్డు తెల్లసొన, టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. వాటిని బాగా కలిపి ఓ పది నిమిషాలు నానబెట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టుకు, మాడుకు రాసుకొవాలి. అది పూర్తిగా ఆరాక చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఈ వర్షాకాలంలో వారానికోసారి ఇలా చేస్తే జుట్టు పొడిబారకుండా నిగనిగలాడుతుంది.
{పతిరోజూ తలస్నానం చేసేవారు ఇంట్లోనే షాంపూ కోసం.. కుంకుడుకాయలు, షీకాకాయ్, ఎండు ఉసిరికాయలను సమపాళ్లలో తీసుకోవాలి. వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయమే వాటిని రోట్లో లేదా మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమాన్ని తలకు రాసుకొని వెంటనే తలంటుస్నానం చేయాలి. మార్కెట్‌లో లభించే షాంపూలాగా ఎక్కువ నురుగు రాకపోయినా తలను శుభ్రం చేయడంలో దీని ప్రత్యేకతే వేరు.