గతేడాది బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ , ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో మెరిసింది షాలిని పాసి. అందులో ఆమె చెప్పే అందమైన డైలాగులతో జెన్ జెడ్‌కి చేరువైందని చెప్పొచ్చు. అలాగే ఫాష్యన్ పరంగానూ ఆమెకి సాటిలేరెవ్వరూ అనేలా స్టైలిష్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె కురులు కాటుక నలుపులా మెరుస్తుంటాయి. ఈ రోజుల్లో అందరికి జుట్టు నెరిసిపోతుంటుంది. అలాంటిది ఈమె కురులు మాత్రం దృఢంగా కుచ్చులా ఉంటాయి. దీని వెనుకున్న సీక్రెట్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆ అందమైన కురుల రహస్యం ఏంటంటే..
షాలిని పాసీ ఖరీదైన షాంపులేమి ఉపయోగించదట. తన కురుల సంరక్షణ కోసం ఇంట్లో తయారు చేసిన షాంపూనే ఉపయోగిస్తుందట. జర్నీల సమయంలోనే బ్రాండెండ్ షాంపులు ఉపయోగిస్తుందట. ఆమె ఇంట్లోనే ఉసిరికాయ, కుంకుడుకాయలతో చేసిన షాంపూని ఉపయోగిస్తుంట. ఈ రెండింటిని వేడినీటిలో నానబెట్టి మిక్స్ చేస్తే సహజమైన షాంపూలాగా పనిచేస్తుందట.
ఇది జుట్టుని చక్కగా శ్రుభపరచడమే గాక, దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ లక్షణాలు మలినాలు లేకుండా చేస్తుది. ఇది జుట్టు పెరుగదలను ప్రోత్సహించడమే గాక కుర్రులు నల్లగా నిగనిగలాడుతుండేలా చేస్తాయట. అలాగే తాను తరుచుగా జుట్టుకి కొబ్బరినూనె తప్ప ఏ ఇతర హెయిర్ ఉత్పత్తులు ఉపయోగించనని చెప్పారు. ఇది జుట్టు రాలు సమస్యని అరికడుతుందని తెలిపింది షాలిని. ఇంకెందుకు ఆలస్యం ఆమె చెప్పిన ఈ అమూల్యమైన చిట్కాలను ట్రై చేయండి మరీ..!.
(చదవండి: సొట్ట బుగ్గల సుందరి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment