చలికాలం చర్మ ఆరోగ్యాన్నే కాదు శిరోజాల సహజత్వాన్ని కాపాడుకోవాలి. లేదంటే వెంట్రుకలు పొడిబారడం, చిట్లడం, చుండ్రు సమస్య తలెత్తడం వంటివి చూస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారంగా...
అలెవెరాతో కండిషనింగ్
షాంపులు, కాలుష్యం, గాలిలో తేమ తగ్గడం.. వంటి వాటి వల్ల ఈ కాలంలో వెంట్రుకలు త్వరగా పొడిబారడం, చిట్లడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. వీటి వల్ల జుట్టు నిస్తేజంగా కనిపిస్తుంది. రసాయనాల గాఢత తక్కువగా ఉండే షాంపూ(Shampooing:)తో తలస్నానం చేసిన తర్వాత అలోవెరా జెల్‌ను జుట్టుకు పట్టించాలి. 15–20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలోవెరా రసం జుట్టుకు కావలసినంత కండిషన్(Conditioning) లభించేలా చేస్తుంది.
ఉసిరితో మృదుత్వం
ఉసిరి, మందారపువ్వులు మరిగించిన కొబ్బరినూనెతో మాడుకు, వెంట్రుక లకు రాసి, మర్దనా చేయాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే వెంట్రుకలు చిట్లడం(Hair Damage) సమస్య తగ్గుతుంది. కురుల మృదుత్వం పెరుగుతుంది.
తప్పనిసరిగా చేయాల్సినవి..
జుట్టు(Hair)ను వేడి చేసే పరికరాలను ఉపయోగించకపోవడమే శ్రేయస్కరం. ఒకవేళ హెయిర్ డ్రైయర్స్, స్ట్రెయిట్నర్స్ వంటి హీటింగ్ పరికరాలను ఉపయోగించినా.. చాలా తక్కువ హీట్ తో ఉపయోగించండి. ఒకవేళ కచ్చితంగా వినియోగించాల్సి వస్తే.. మీరు ముందుగా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేని ఉపయోగించవచ్చు
తలస్నానం(Head Bath) రోజూ చేసే అలవాటు కొందరిలో కనిపిస్తుంది. కానీ, కనీసం మూడు రోజులకోసారి చేయడం బెటర్. జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహజ నూనెలు అనేవి విడుదల అవుతుంటాయి. అందుకే కనీసం మూడు రోజులు మధ్యలో విరామం ఇవ్వడం వల్ల ఆ నూనెలు శిరోజాల రక్షణకు ఉపయోపడతాయి.
శిరోజాల్లో తగినంత తేమ ఎప్పుడూ ఉండడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి. మంచి కండిషనర్ ను స్వయంగా మనమే చేసుకోవచ్చు. గుడ్డు సొన, పెరుగు కలిపి కురుల మొదళ్లలో పట్టించాలి. 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
పొడిబారిన జుట్టు, దెబ్బతిన్న శిరోజాలకు బాదం నూనె చక్కగా పనిచేస్తుంది. ఓ పాత్రలో కొంచెం బాదం నూనె వేసుకుని, దాన్ని 40 సెకండ్ల పాటు వేడి చేయాలి. ఆ తర్వాత తల వెంట్రుకలకు రాసుకోవాలి. 30 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. చల్లటి నీటితోనే చేయాలి. అలాగే కండిషనర్ కుడా అప్లయ్ చేయాలి.
అర కప్పు తేనె, రెండు చెంచాల ఆలివ్ ఆయిల్, రెండు చెంచాల గుడ్డులోని పచ్చసొన మిశ్రమాన్ని తల వెంట్రుకలకు పట్టించి 20 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. ఆ తర్వాత వేడి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే కెరాటిన్ ప్రొటీన్ బాండ్స్ తిరిగి భర్తీ అవుతాయి.
మహిళలు జుట్టుని గట్టిగా చుట్టేసి పెట్టడం చేస్తుంటారు. పెళుసుబారిన జుట్టు చిట్లిపోకుండా నివారించేందుకు జుట్టుని గట్టిగా ముడేయకుండా, ఎటువంటి బ్యాండ్లను పెట్టకుండా ఉండడమే బెటర్.
వెంట్రుకల చివర్లో చిట్లకుండా ఉండేందుకు వెడల్పాటి పళ్లున్న దువ్వెనలను వాడాలి. తరచూ హెయిర్ స్టయిల్ చేయించుకోవద్దు. నైలాన్ బ్రిస్టల్స్ ఉన్న దువ్వెనలను వాడాలి. తగినంత నీరు తాగాలి.
ఉల్లిగడ్డ రసం జుట్టురాలిపోయే సమస్యను నివారించడంతోపాటు, హెయిర్ ఫాలికుల్స్ కు రక్త సరఫరా జరిగేలా చూస్తుంది.
పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలిపోతుంటే అందుకు బీట్ రూట్ రసం చక్కని పరిష్కారం
శిరోజాలు తిరిగి జీవం పోసుకోవడానికి, జుట్టు పెరుగుదల మెరుగుపడడానికి గ్రీన్ టీ మంచిగా తోడ్పడుతుంది. శరీరంలో జీవ క్రియలను గ్రీన్ టీ మెరుగు పరుస్తుంది.
అరటి పండు గుజ్జుకు, కొంత తేనె, పాలు కలిపి వెంట్రుకలకు మాస్క్ లా వేసుకోవాలి. గంట తర్వాత కడిగేసుకోవాలి. మెంతులను పేస్ట్ లా చేసుకుని దాన్ని ప్యాక్ లా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత కడిగేయడం వల్ల సిల్క్ గా జుట్టు కనిపిస్తుంది.
చివరగా జుట్టు ఆరోగ్యం(Healthy Hair) కోసం తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్, బయోటిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
(చదవండి: ఏం పెట్టారబ్బా ముగ్గు..? చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..!)
Comments
Please login to add a commentAdd a comment