ఒత్తయిన.. ఉంగరాల జుట్టు ఇచ్చే అందం అంతా ఇంతా కాదు. దానికున్న క్రేజే వేరు! కానీ.. మేనేజ్ చేయడమే మహాకష్టం. అయితే చిత్రంలోని డివైస్ కర్లీ హెయిర్ సంరక్షణను మేడ్ ఈజీ చేస్తుంది. ఈ ఆటోమేటిక్ హెయిర్ కర్లర్.. 2 సెకన్ల పాటు పవర్ బటన్‌ను నొక్కిపడితే ఆన్ అవుతుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టుతో పాటు.. ఫెళుసుబారిన జుట్టునూ మృదువుగా మార్చుతూ, అందమైన గిరజాలను సృష్టిస్తుంది.
8 నుంచి 11 సెకన్స్‌లో స్లైట్ కర్ల్స్ ఏర్పడతాయి.12 సెకన్లు దాటి 15 సెకన్స్ వరకూ ఉంచితే సాఫ్ట్ కర్ల్స్ ఏర్పడతాయి. 16 నుంచి 18 సెకన్ల వరకూ ఉంచితే.. టైట్ కర్ల్స్ (పూర్తిస్థాయిలో ఉంగరాలు) ఏర్పడతాయి. డివైస్‌కి ఒకవైపు సన్నని కర్లర్ చాంబర్ ఉంటుంది. దానిలో పాయలు పాయలుగా జుట్టును పెడితే.. అవి ఉంగరాలుగా చుట్టుకుని అందంగా మారుతాయి.
ఇందులో మూడు వందల డిగ్రీల ఫారిన్ హీట్ నుంచి మూడువందల తొంభై డిగ్రీల ఫారిన్ హీట్ వరకు ఆరు స్థాయిల్లో ఉష్ణోగ్రతను పెంచుకునే వీలుంటుంది. డిస్‌ప్లేలో బ్యాటరీ ఇండికేటర్, టైమ్ అండ్ టెంపరేచర్ వివరాలతో పాటు.. కర్లర్ ఎటువైపు తిరుగుతున్నాయో కూడా వివరంగా చూసుకోవచ్చు. లెఫ్ట్, రైట్ అనే ఆప్షన్స్‌తో కర్లర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ మెషిన్‌ని ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకెళ్లొచ్చు. దీని ధర సుమారుగా 1,249 రూపాయలు.
(చదవండి: కరీనాకపూర్ మేకప్ నేచురల్‌గా ఉండటానికి సీక్రేట్ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment