కేశాలంకరణతోనే ముఖంలో ప్రత్యేక కళ వస్తుంది. తీసుకునే ఆహారంలో పోషక లోపాలు, ఒత్తిడి, జుట్టు విషయంలో సరైన శ్రద్ధ లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో చిన్న వయసులోనే చాలామంది బట్టతల బారిన పడుతున్నారు. అలాంటి వారికి ఈ ‘హెయిర్ గ్రోత్ హెల్మెట్‘ చక్కగా ఉపయోగపడుతుంది.
ఇది ఎల్‌ఈడీ రెడ్ లైట్ థెరపీని అందిస్తుంది. దీని నుంచి వచ్చే వైబ్రేషన్స్ తలమీద చర్మానికి, వెంట్రుకల కుదుళ్లకు చక్కటి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఈ లైట్ థెరపీ జుట్టు కుదుళ్లలో శక్తిని పెంచుతుంది. దీనిని వాడటం వల్ల ఎలాంటి నొప్పి, మంట ఉండవు. ఇది డైహైడ్రోటెస్టోస్టిరాన్ స్థాయిని తగ్గించి, తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఈ పరికరం జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా, ఉన్న జుట్టు మరింత ఏపుగా పెరిగేందుకు దోహదపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా వాడినట్లయితే, పన్నెండు వారాల్లోనే 128% జుట్టు పెరుగుతుందని ఈ హెల్మెట్ తయారీదారులు చెబుతున్నారు. దీన్ని ప్రతిరోజూ పది నిమిషాలు, తలకు పెట్టుకుని, స్విచాన్ చేసుకుంటే సరిపోతుంది. జుట్టు రాలిపోయిన ప్రదేశంలో తిరిగి వెంట్రుకలను మొలిపించడంలో ఈ హెల్మెట్ సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ పరీక్షల్లో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment