
చాలామంది తమ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఎక్కువగా రేజర్‌ను వాడుతుంటారు. దాని వల్ల చర్మం మొద్దుబారడం, వెంట్రుకలు బిరుసెక్కడం, మరింత దట్టంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే చిత్రంలోని మెషిన్ ఇలాంటి సమస్యలకు ఇట్టే చెక్ పెడుతుంది.
ఈ హైపవర్ హెయిర్ రిమూవల్ డివైస్ ఎల్‌ఈడీ లైట్ థెరపీని కూడా అందిస్తుంది. ఈ ఎపిలేటర్ మెషిన్ మృదువుగా, నొప్పి తెలియకుండా ట్రీట్‌మెంట్ అందిస్తుంది. వెంట్రుకలను తొలగించే సమయంలో చల్లదనాన్ని అందిస్తుంది. వెంట్రుకలు తొలగిన తర్వాత దురద పుట్టడం, మంట కలగడం వంటి ఇబ్బందులను రానివ్వదు.
ఫ్లాష్, మోడ్, లెవల్స్ వంటి ఆప్షన్స్ అన్నీ డివైస్‌కి ముందువైపు ఉంటాయి. చిత్రంలో చూపిన విధంగా చర్మానికి ఆనించి, వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మెషిన్ సాయంతో వెంట్రుకలు తొలగించుకుంటే గీతలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. కాళ్లు, చేతులు, నడుము, పొట్ట, అండర్ ఆర్మ్స్, బికినీలైన్ ఇలా చర్మంపై పలుభాగాల్లో వెంట్రుకలను సులభంగా తొలగించుకోవచ్చు.
దీని వాడకంతో అవాంఛిత రోమాలున్న చర్మం కాలక్రమేణా మృదువుగా మారుతుంది. రోలర్ అటాచ్‌మెంట్, ఎల్‌ఈడీ అటాచ్‌మెంట్, స్పాట్ అటాచ్‌మెంట్, ఏసీ అడాప్టర్‌తో ఈ మెషిన్ లభిస్తుంది. దాంతో ఇది యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీన్ని సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు.
(చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!)
Comments
Please login to add a commentAdd a comment