unwanted
-
ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్‌తో అవాంఛిత రోమాలకు చెక్..!
చాలామంది తమ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఎక్కువగా రేజర్‌ను వాడుతుంటారు. దాని వల్ల చర్మం మొద్దుబారడం, వెంట్రుకలు బిరుసెక్కడం, మరింత దట్టంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే చిత్రంలోని మెషిన్ ఇలాంటి సమస్యలకు ఇట్టే చెక్ పెడుతుంది.ఈ హైపవర్ హెయిర్ రిమూవల్ డివైస్ ఎల్ఈడీ లైట్ థెరపీని కూడా అందిస్తుంది. ఈ ఎపిలేటర్ మెషిన్ మృదువుగా, నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ అందిస్తుంది. వెంట్రుకలను తొలగించే సమయంలో చల్లదనాన్ని అందిస్తుంది. వెంట్రుకలు తొలగిన తర్వాత దురద పుట్టడం, మంట కలగడం వంటి ఇబ్బందులను రానివ్వదు. ఫ్లాష్, మోడ్, లెవల్స్ వంటి ఆప్షన్స్ అన్నీ డివైస్‌కి ముందువైపు ఉంటాయి. చిత్రంలో చూపిన విధంగా చర్మానికి ఆనించి, వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మెషిన్ సాయంతో వెంట్రుకలు తొలగించుకుంటే గీతలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. కాళ్లు, చేతులు, నడుము, పొట్ట, అండర్ ఆర్మ్స్, బికినీలైన్ ఇలా చర్మంపై పలుభాగాల్లో వెంట్రుకలను సులభంగా తొలగించుకోవచ్చు. దీని వాడకంతో అవాంఛిత రోమాలున్న చర్మం కాలక్రమేణా మృదువుగా మారుతుంది. రోలర్ అటాచ్మెంట్, ఎల్ఈడీ అటాచ్మెంట్, స్పాట్ అటాచ్మెంట్, ఏసీ అడాప్టర్‌తో ఈ మెషిన్ లభిస్తుంది. దాంతో ఇది యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీన్ని సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!) -
అవాంఛిత కాల్స్‌పై టెల్కోలతో ట్రాయ్ భేటీ
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేసే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం ’వ్యాపారపరమైన అవాంఛిత కమ్యూనికేషన్ (యూసీసీ) డిటెక్ట్’ విధానాన్ని అభివృద్ధి చేయడం, అమలు చేయడానికి సంబంధించి మార్చి 27న టెల్కోలతో సమావేశం కానుంది. (ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?) డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ) ప్లాట్‌ఫాంపై అవాంఛిత సందేశాలను టెల్కోలు గుర్తించడం, వాటిని పంపే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం, కృత్రిమ మేథ ఆధారిత యాంటీ–ఫిషింగ్ సిస్టమ్‌ను వినియోగించడం తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. సాంకేతిక సొల్యూషన్స్, నియంత్రణ, ఆదేశాలు, నిశిత పర్యవేక్షణ వంటి బహుముఖ వ్యూహాలతో అవాంఛిత కాల్స్, మెసేజీల సమస్యను పరిష్కరించే దిశగా టెల్కోలతో సమావేశం ఉండనున్నట్లు ట్రాయ్ పేర్కొంది. (మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం) -
సగం అవాంఛిత గర్భాలే
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ఏటా దాలుస్తున్న గర్భాల్లో దాదాపు సగం వరకు అంటే..12.1 కోట్ల గర్భాలు అవాంఛితాలేనని ఐక్యరాజ్యసమితికి చెందిన పాపులేషన్ ఫండ్ తెలిపింది. తీవ్రమైన ఈ సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ మేరకు బుధవారం వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్–2022 విడుదల చేసింది. అవాంఛిత గర్భం దాల్చిన వారిలో 60% వరకు అబార్షన్ చేయించుకుంటున్నారని తెలిపింది. ఇందులో సుమారు 45% సురక్షితం కాని అబార్షన్లు కాగా, అబార్షన్ల సమయంలో 5%–13% వరకు మరణాలు కూడా సంభవిస్తున్నాయని పేర్కొంది. ‘1990–2019 మధ్య 15–49 ఏళ్ల గ్రూపులో ప్రతి వెయ్యి మంది మహిళల్లో అవాంఛిత గర్భాలు 79 నుంచి 64కు తగ్గటం కొంత ఊరట కలిగించే విషయం. అయితే, గత 30 ఏళ్లలో అవాంఛిత గర్భం దాల్చిన మహిళల సంఖ్య 13% మేర పెరిగింది. జనాభా పెరుగుదలే ఇందుకు కారణం’ అని నివేదిక పేర్కొంది. ‘ప్రపంచవ్యాప్తంగా 25.7 కోట్ల మంది గర్భం వద్దనుకునే మహిళలు సురక్షితమైన, ఆధునిక గర్భ నిరోధక సాధనాలను వాడటం లేదు. మొత్తంగా 47 దేశాలకు చెందిన లైంగిక చర్యలో చురుకుగా పాల్గొనే మహిళల్లో 40% మంది ఎలాంటి గర్భనిరోధక పద్ధతులను పాటించడం లేదు’ అని తెలిపింది. ‘సంతాన సామర్థ్యం ఉన్న 64 దేశాల్లోని మహిళలపై చేపట్టిన సర్వేలో..23% మంది సెక్స్‌కు అభ్యంతరం చెప్పలేకపోతున్నారు. తమ ఆరోగ్యం గురించి 24% మంది, గర్భనిరోధకాల వాడకం విషయంలో 8% మంది సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మొత్తమ్మీద 57% మంది మహిళలు మాత్రమే తమ లైంగిక, సంతాన సంబంధ విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు’ అని వెల్లడైనట్లు ఆ నివేదిక తెలిపింది. -
స్నేహితుడే హంతకుడు
తాగిన మైకంలో డబ్బు కోసం వేధిస్తుండటంతో విసుగు చెందిన స్నేహితుడు పథకం ప్రకారం అతడిని హత్య చేశాడు. గుర్తుపట్టకుండా పెట్రోలు పోసి తగులబెట్టడంతో కేసు మిస్టరీగా మారింది. ఏడేళ్ల తర్వాత పోలీసులు కేసును ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం:ఉప్పరపల్లి గ్రామ పొలాల్లో 2011లో జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో ఐదుగురు నిందితులను ఇటుకలపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్, సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన వారిలో కట్ల శ్రీకాంత్, వసంతం బ్రహ్మయ్య (అనంతసాగర్ కాలనీ), జూటూరు మహేష్, సాకే సంజీవరాయుడు (విజయనగర్ కాలనీ), కుంచపు రాజు (భగత్‌సింగ్ కాలనీ) ఉన్నారు. హత్య నేపథ్యం.. నగరంలోని అనంత సాగర్ కాలనీకు చెందిన కట్ల శ్రీకాంత్ అలియాస్ç పడ అటో డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. మున్నానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ బోయ బంగి రవితో స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి మద్యం తాగేవారు. తాగిన సమయంలో డబ్బులు ఇవ్వాలంటూ శ్రీకాంత్‌ను రవి కొట్టేవాడు. దీంతో విసిగి పోయిన శ్రీకాంత్ స్నేహితుడి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. 2011 జూన్ 22న హౌసింగ్‌బోర్డులో ఇద్దరూ పూటుగా మద్యం తాగారు. శ్రీకాంత్ తన స్నేహితుడు మహేష్ సహాయంతో జాకీరాడ్‌తో బోయ రవి తలపై బాదాడు. కింద పడిన రవిని ఆటోలో వేసుకుని పండమేరు వద్ద ఉన్న వీర నారాయణమ్మ గుడి వద్ద వేశారు. జరిగిన విషయాన్ని శ్రీకాంత్ తన స్నేహితులు బ్రహ్మయ్య, సాకే సంజీవరాయుడు, కుంచపు రాజు, కర్రి రాజులకు సమాచారం ఇచ్చి పిలిపించుకుని, వారి సహాయంతో రవి శవాన్ని ఆటోలో వేసుకుని ఉప్పర పల్లి సమీపంలోని పొలాల్లో కంప చెట్ల మధ్య పడేసి, పెట్రోలు పోసి తగులబెట్టారు. స్నేహితుల సమాచారంతో కదిలిన డొంక.. పాత కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశించిన నేపథ్యంలో డీఎస్పీ వెంకట్రావ్, సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌లు మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు. అప్పట్లో బోయ రవి, రాజా, ముస్తఫా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. రాజా, ముస్తఫా కేసులు ట్రేస్ అయ్యాయని డీఎస్పీతెలిపారు. బోయ రవి కేసులో అతని స్నేహితులు ఇచ్చిన సమాచారం ద్వారా మిస్టరీని ఛేదించామన్నారు. ఐదుగురు నిందితులనూ అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరచిన సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, వరప్రసాద్, గిరి, రాజగోపాల్, రమణ, మారుతీ ప్రసన్నలను డీఎస్పీ అభినందించారు. -
అనవసరం రాద్ధాంతం నాకు నచ్చదు
న్యూఢిల్లీ: రచయతలు, సినీ దర్శకులు, చరిత్రకారులు తీసుకున్న నిర్ణయంపై వ్యాఖ్యానించేందుకు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తిరస్కరించారు. అవసరమైన వ్యాఖ్యానాలు చేసి లేనిపోని వివాదాలు సృష్టించడం తనకు ఇష్టంలేదన్నారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీగాగా పేరున్న అమితాబ్.. సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని సూచించారు. సెలబ్రిటీ వీడియో బ్లాగింగ్ అప్లికేషన్ వాకౌను గురువారం లాంచ్ చేసిన అమితాబ్ అవార్డులను వెనక్కి ఇస్తున్న వైనం స్పందించాలని మీడియా కోరినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ''అది ఒక ప్రత్యేక పరిస్థితి. ఆచితూచి మాట్లాడాల్సిన సమయం. సెల్రబిటీలు విచక్షణ మర్చిపోయి వ్యాఖ్యానిస్తే పరిస్థితి విషమించే అవకాశం ఉంది'' అని ఆయన కామెంట్ చేశారు. కొంతమంది సెల్రబిటీలు మనసుకు తోచిన అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారన్నారు. రెండో ఆలోచన లేకుండా ఇలా చేస్తున్నారని, నిజంగా వాళ్ల ధైర్యానికి మెచ్చుకోవాలంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాస్పద అంశాలపై మాట్లాడేటపుడు సంయమనాన్ని పాటిస్తానని చెప్పుకొచ్చారు. వివాదాన్ని సృష్టించడం తనకు ఇష్టం ఉండదని, అనసర రాద్ధాంతం చేయడం తనకు నచ్చదన్నారు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను, అనుభవాలను సోషల్ మీడియాలో అభిమానులతో తరచూ షేర్ చేసుకుంటూ సోషల్ మీడియా్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ టైటిట్ కొట్టేసిన బిగ్ బి.. మేధావులు, రచయితలు తమ ప్రతిష్ఠాత్మక అవార్డులను వెనక్కి ఇచ్చేయడంపై మాత్రం స్పందించడానికి నిరాకరించారు కాగా కల్బుర్గి దారుణహత్య, దేశంలో పెరుగుతున్న మత ఘర్షణలు, అసహనానికి నిరసనగా చాలామంది రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను, సినీ దర్శకులు తమ ప్రతిష్ఠాత్మక అవార్డులను వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించారు. అటు ఈ వ్యవహారంపై భిన్న స్వరాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.