
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేసే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం ’వ్యాపారపరమైన అవాంఛిత కమ్యూనికేషన్ (యూసీసీ) డిటెక్ట్’ విధానాన్ని అభివృద్ధి చేయడం, అమలు చేయడానికి సంబంధించి మార్చి 27న టెల్కోలతో సమావేశం కానుంది.
(ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?)
డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్‌టీ) ప్లాట్‌ఫాంపై అవాంఛిత సందేశాలను టెల్కోలు గుర్తించడం, వాటిని పంపే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం, కృత్రిమ మేథ ఆధారిత యాంటీ–ఫిషింగ్ సిస్టమ్‌ను వినియోగించడం తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. సాంకేతిక సొల్యూషన్స్, నియంత్రణ, ఆదేశాలు, నిశిత పర్యవేక్షణ వంటి బహుముఖ వ్యూహాలతో అవాంఛిత కాల్స్, మెసేజీల సమస్యను పరిష్కరించే దిశగా టెల్కోలతో సమావేశం ఉండనున్నట్లు ట్రాయ్ పేర్కొంది. (మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment