టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. చాలా కంపెనీలు మోసపూరిత మెసేజ్‌లు, కాల్స్ చేస్తూ టెలికాం వినియోగదారులను టార్గెట్ చేస్తున్నాయి. ఈ వ్యావహారంపై అవగాహనలేనివారు స్కామర్ల చేతికిచిక్కి ఆర్థికంగా, మనసికంగా బలవుతున్నారు. ఈ మోసాలను కట్టడి చేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మెసేజ్ సేవల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మోసపూరిత విధానాల నుంచి వినియోగదారులను రక్షించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని టెల్కోలను ఆదేశించింది. సరైన గుర్తింపులేని సర్వీస్ ప్రొవైడర్ల ప్రసారాలను నిలిపేస్తామని ప్రకటించింది.
ఇదీ చదవండి: వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్!
అయాచిత స్పామ్ కాల్స్, మెసేజ్‌ల కట్టడికి ట్రాయ్ గత కొద్ది కాలంగా కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మెసేజ్‌లు, కాల్స్ చేస్తున్నవారి సమాచారం తెలియని యూఆర్‌ఎల్‌లు, ఓటీటీ లింక్‌లను లేదా కాల్ బ్యాక్ నంబర్‌లను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిలిపేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఆయా విభాగాల్లోని సర్వీస్ ప్రొవైడర్లు ప్రసారాలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం పంపినవారి నుంచి మెసేజ్ గ్రహీతల వరకు అన్నింటినీ ట్రేస్ (గుర్తించడానికి) చేయడానికి నవంబర్ నుంచి తగిన చర్యలు తీసుకోవాలని ట్రాయ్ నిర్దేశించింది. పారదర్శకతలేని టెలిమార్కెటర్ చైన్ నుంచి వచ్చే సందేశాల ప్రసారం నిలిపివేతకు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment