ఇబ్బందికర కాల్స్, నమోదుకాని టెలిమార్కెటర్లపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఉక్కుపాదం మోపుతోంది. ట్రాయ్ ఆదేశాలతో 2.75 లక్షల ఫోన్ నంబర్లను టెలికాం సంస్థలు డిస్‌కనెక్ట్ చేశాయి. నమోదుకాని 50 టెలిమార్కెటింగ్ కంపెనీలకు చెందిన టెలికాం సేవలను బ్లాక్ చేసినట్లు ట్రాయ్ వెల్లడించింది.
ఈ చర్యలు స్పామ్ కాల్స్‌ను తగ్గించడంలో, కస్టమర్లకు ఉపశమనం కలిగించడంలో గణనీయ ప్రభావాన్ని చూపుతాయని ట్రాయ్ భావిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్ వల్ల 2024 ప్రథమార్థంలో నమోదుకాని టెలిమార్కెటర్లపై 7.9 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని ట్రాయ్ తెలిపింది. ఇబ్బందికర కాల్స్‌ను కట్టడి చేసేందుకు ట్రాయ్ 2024 ఆగస్ట్ 13న అన్ని యాక్సెస్ ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలను జారీ చేసింది. టెలికాలం వనరులను దుర్వినియోగం చేస్తున్న నమోదుకాని టెలిమార్కెటర్ల నుంచి ప్రమోషనల్ వాయిస్ కాల్స్‌ను తక్షణమే నిలిపివేయాలని, రెండేళ్ల వరకు డిస్‌కనెక్షన్ లేదా బ్లాక్ లిస్టులో పెట్టాలని యాక్సెస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఇబ్బంది కలిగించే కాల్స్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా..50కి మించిన కాల్స్ లేదా ఎస్‌ఎంఎస్‌లు పంపే నిర్దిష్ట నంబర్‌కు గ్రేడ్స్ ప్రకారం అధిక టారిఫ్‌ను ప్రవేశపెట్టాలని ట్రాయ్ ఇటీవలే తన చర్చా పత్రం ద్వారా టెలికాం కంపెనీలకు సూచించింది.
ఇదీ చదవండి: బెంగళూరు - హైదరాబాద్ టిక్కెట్ రూ.99కే!
Comments
Please login to add a commentAdd a comment