న్యూఢిల్లీ: డేటాను ఉపయోగించని కస్టమర్లకు వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ సర్వీసుల కోసం విడిగా ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని టెల్కోలకు నియంత్రణ సంస్థ ట్రాయ్ సూచించింది. 365 రోజుల వేలిడిటీకి మించకుండా కనీసం ఒక స్పెషల్ టారిఫ్ వోచర్‌ను అందించాలంటూ ఈ మేరకు టారిఫ్ నిబంధనలను సవరించింది.
ఇదీ చదవండి: మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడం ఎలా?
ట్రాయ్ సూచనల ప్రకారం కస్టమర్లు తాము వినియోగించుకునే సర్వీసులకు మాత్రమే చెల్లించే వీలు ఉంటుంది. ఇంటి వద్ద బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లున్న కుటుంబాలు, సీనియర్ సిటిజన్లకు పెద్దగా డేటా రీఛార్జ్ ప్లాన్ల అవసరం ఉండదనే వాదనలున్నాయి. అలాంటి యూజర్లు సాధారణ కస్టమర్ల మాదిరిగా అధికంగా డబ్బు వెచ్చించి రీఛార్జ్ చేసుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని ట్రాయ్ భావిస్తుంది. దాంతో డేటాను ఉపయోగించని కస్టమర్లకు వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ సర్వీసుల కోసం ప్రత్యేకంగా ప్లాన్‌ను తీసుకురావాలనే సూచనలు చేసింది. దీనిపై తుది నిర్ణయం మాత్రం టెల్కోలే తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment