TRAI Data
-
జియో.. ఎయిర్టెల్ పోటాపోటీ
ఎయిర్టెల్ కంటే రిలయన్స్ జియో అక్టోబర్ 2024లో యాక్టివ్ యూజర్ల సంఖ్యను పెంచుకున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. అయితే ఇదే సమయంలో ఎయిర్టెల్ మాత్రం అధికంగా చెల్లింపులు చేసే 4జీ/ 5జీ యూజర్లను పెంచుకున్నట్లు పేర్కొంది.ఇప్పటివరకు ఉన్న మొత్తం యాక్టివ్ యూజర్ల విషయంలో జియోనే అధికంగా వినియోగదారులకు కలిగి ఉంది. ఇన్-యాక్టివ్ యూజర్ల తొలగింపు కారణంగా అక్టోబర్ నెలలో జియో సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు తెలిసింది. ఎయిర్టెల్ మాత్రం తన 4జీ/ 5జీ యూజర్ బేస్‌లో వృద్ధిని సాధించింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా 3జీ/ 4జీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. కాగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం స్వల్పంగా యూజర్లను పెంచుకుంది.ఇదీ చదవండి: పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. నెట్టింట చర్చజులైలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను 10–27 శాతం వరకు పెంచాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ప్రత్యర్థుల బాటను అనుసరించకపోగా.. సమీప భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపుదల ఉండబోదని బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి గతంలో స్పష్టం చేశారు. వినియోగదార్లను ఆకర్షించడానికి, మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు బీఎస్ఎన్ఎల్ ఇటీవల స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్, డైరెక్ట్–టు–డివైస్ తదితర సేవలను ప్రారంభించింది. -
జియోకు జై, వొడాఫోన్ ఐడియాకు బై..బై!
సాక్షి, ముంబై: టెలికం మేజర్ రిలయన్స్ జియో మరోసారి దుమ్ము రేపింది. కొత్త కస్టమర్లను సాధించడంలో జియో తన ఆధిక్యాన్ని నిరూపించుకుని టాప్‌లో నిలిచింది. మే నెలలో 31 లక్షలమంది మొబైల్ వినియోగదారులను తన ఖాతాలో జమ చేసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నెలవారీ సబ్‌స్క్రైబర్ డేటా నేడు (జూలై19) విడుదల చేసింది. రెగ్యులేటరీ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం, మేలో 31 లక్షల మంది వైర్లెస్ మొబైల్ వినియోగదారులను సొంతం చేసుకుంది రిలయన్స్ జియో. ఫలితంగా జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరుకుంది. అలాగే సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్టెల్ మే నెలలో 10.27 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. దీంతో ఎయిర్టెల్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. వొడాఫోన్ ఐడియా 7.59 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో సబ్‌స్క్రైబర్ బేస్ 25.84 కోట్లకు పడిపోయింది. -
వొడాఫోన్ ఐడియాకు గట్టి ఎదురుదెబ్బ!
మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు ఉంది వొడాఫోన్ ఐడియా పరిస్థితి. ఇప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ ఐడియా జూన్ 2021లో దాదాపు 43 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన తాజా టెలికామ్ చందాదారుల డేటా ప్రకారం.. రిలయన్స్ జియో ఈ నెలలో 54 లక్షల మందికి పైగా వినియోగదారులను చేర్చుకుంది. వొడాఫోన్ ఐడియా మేలో 40 లక్షలకు పైగా చందాదారులను కోల్పోతే జూన్ నెలలో 42,89,159 మంది వినియోగదారులను కోల్పోయింది. దీంతో వొడాఫోన్ ఐడియా మొత్తం కస్టమర్ల సంఖ్య 27.3 కోట్లకు పడిపోయింది. రిలయన్స్ జియో జూన్ నెలలో 54,66,556 వినియోగదారులను ఆన్ బోర్డు చేసుకుంది. మేలో ఈ సంఖ్య 35.54 లక్షలుగా ఉంది. ప్రస్తుతం రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య 43.6 కోట్లకు చేరింది. అలాగే, భారతి ఎయిర్టెల్ 38,12,530 చందాదారులను జోడించుకోవడంతో మొత్తం చందాదారుల సంఖ్య 35.2 కోట్లుగా ఉన్నారు. దేశం మొత్తం మీద టెలిఫోన్ చందాదారుల సంఖ్య జూన్ 2021 చివరినాటికి 120.2 కోట్లకు చేరుకుంది. గత నెలతో పోలిస్తే నెలవారీ వృద్ధి రేటు 0.34 శాతం. పట్టణ టెలిఫోన్ సబ్ స్క్రిప్షన్ పెరిగితే, కానీ గ్రామీణ సబ్ స్క్రిప్షన్ జూన్‌లో స్వల్పంగా తగ్గింది.(చదవండి: ఆస్తుల విక్రయానికి రోడ్‌మ్యాప్ విడుదల చేసిన కేంద్రం) ఇక మొత్తం బ్రాడ్ బ్యాండ్ చందాదారులలో ఐదు సర్వీస్ ప్రొవైడర్లు జూన్ చివరిలో 98.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నారు. "ఈ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 439.91 మిలియన్లు, భారతి ఎయిర్ టెల్ 197.10 మిలియన్లు, వొడాఫోన్ ఐడియా 121.42 మిలియన్లు, బిఎస్ఎన్ఎల్ 22.69 మిలియన్లు, అట్రియా కన్వర్జెన్స్ 1.91 మిలియన్ల చందాదారులను" కలిగి ఉన్నట్లు ట్రాయ్ తెలిపింది. -
డౌన్ లోడ్ స్పీడ్‌లో టాప్ అదే!
డౌన్ లోడ్ స్పీడులో రిలయన్స్ జియో మళ్లీ తన జోరు పెంచింది. జనవరి నెలలో నాలుగో స్థానానికి పడిపోయిన జియో, ఫిబ్రవరి నెలలో పైకి ఎగిసి, మరోసారి డౌన్ లోడ్ స్పీడులో మార్కెట్ లీడర్ గా నిలిచింది. ట్రాయ్స్ 'మై స్పీడ్ యాప్' ద్వారా సేకరించిన డేటా ప్రకారం 4జీ డౌన్ లోడ్ స్పీడులో జియో మార్కెట్ ను ఏలుతున్నట్టు వెల్లడైంది. కానీ అప్ లోడ్ స్పీడులో మాత్రం ఇతర కంపెనీల కంటే కొంత వెనుకంజలోనే ఉందట. 2017 ఫిబ్రవరిలో జియో నెట్ వర్క్ సగటు వేగం 17.427 ఎంబీపీఎస్ ఉన్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. జియో తర్వాతి స్థానంలో ఐడియా(12.216ఎంబీపీఎస్), ఎయిర్ టెల్(11.245ఎంబీపీఎస్), వొడాఫోన్(8.337ఎంబీపీఎస్) ఉన్నాయి. అయితే 2016 డిసెంబర్ లో నమోదుచేసిన 18.146ఎంబీపీఎస్ స్పీడ్ కంటే ప్రస్తుతమున్న జియో స్పీడు తక్కువేనని ట్రాయ్ తెలిపింది. ఐడియా సెల్యులార్ స్పీడ్ వరుసగా పైకి ఎగుస్తున్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. డిసెంబర్ నెలలో 5.943ఎంబీపీఎస్ గా ఉన్న ఐడియా సెల్యులార్ స్పీడ్, తర్వాతి నెలలో 10.301ఎంబీపీఎస్ గా, గత నెలలో 12.216ఎంబీపీఎస్ గా ఉన్నట్టు పేర్కొంది. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్, వొడాఫోన్ డౌన్ లోడ్ స్పీడ్లు మాత్రం జనవరి నుంచి తక్కువవుతున్నాయని డేటా వెల్లడించింది. చాలా వేగవంతంగా 4జీ అప్ లోడ్‌లో ఐడియా ముందంజలో ఉన్నట్టు ట్రాయ్ రిపోర్టు తెలిపింది.