డౌన్ లోడ్ స్పీడ్లో టాప్ అదే!
డౌన్ లోడ్ స్పీడ్లో టాప్ అదే!
Published Mon, Mar 6 2017 5:47 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
డౌన్ లోడ్ స్పీడులో రిలయన్స్ జియో మళ్లీ తన జోరు పెంచింది. జనవరి నెలలో నాలుగో స్థానానికి పడిపోయిన జియో, ఫిబ్రవరి నెలలో పైకి ఎగిసి, మరోసారి డౌన్ లోడ్ స్పీడులో మార్కెట్ లీడర్ గా నిలిచింది. ట్రాయ్స్ 'మై స్పీడ్ యాప్' ద్వారా సేకరించిన డేటా ప్రకారం 4జీ డౌన్ లోడ్ స్పీడులో జియో మార్కెట్ ను ఏలుతున్నట్టు వెల్లడైంది. కానీ అప్ లోడ్ స్పీడులో మాత్రం ఇతర కంపెనీల కంటే కొంత వెనుకంజలోనే ఉందట. 2017 ఫిబ్రవరిలో జియో నెట్ వర్క్ సగటు వేగం 17.427 ఎంబీపీఎస్ ఉన్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. జియో తర్వాతి స్థానంలో ఐడియా(12.216ఎంబీపీఎస్), ఎయిర్ టెల్(11.245ఎంబీపీఎస్), వొడాఫోన్(8.337ఎంబీపీఎస్) ఉన్నాయి.
అయితే 2016 డిసెంబర్ లో నమోదుచేసిన 18.146ఎంబీపీఎస్ స్పీడ్ కంటే ప్రస్తుతమున్న జియో స్పీడు తక్కువేనని ట్రాయ్ తెలిపింది. ఐడియా సెల్యులార్ స్పీడ్ వరుసగా పైకి ఎగుస్తున్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. డిసెంబర్ నెలలో 5.943ఎంబీపీఎస్ గా ఉన్న ఐడియా సెల్యులార్ స్పీడ్, తర్వాతి నెలలో 10.301ఎంబీపీఎస్ గా, గత నెలలో 12.216ఎంబీపీఎస్ గా ఉన్నట్టు పేర్కొంది. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్, వొడాఫోన్ డౌన్ లోడ్ స్పీడ్లు మాత్రం జనవరి నుంచి తక్కువవుతున్నాయని డేటా వెల్లడించింది. చాలా వేగవంతంగా 4జీ అప్ లోడ్లో ఐడియా ముందంజలో ఉన్నట్టు ట్రాయ్ రిపోర్టు తెలిపింది.
Advertisement
Advertisement