ఎయిర్‌టెల్ కంటే రిలయన్స్ జియో అక్టోబర్ 2024లో యాక్టివ్ యూజర్ల సంఖ్యను పెంచుకున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. అయితే ఇదే సమయంలో ఎయిర్‌టెల్ మాత్రం అధికంగా చెల్లింపులు చేసే 4జీ/ 5జీ యూజర్లను పెంచుకున్నట్లు పేర్కొంది.
ఇప్పటివరకు ఉన్న మొత్తం యాక్టివ్ యూజర్ల విషయంలో జియోనే అధికంగా వినియోగదారులకు కలిగి ఉంది. ఇన్-యాక్టివ్ యూజర్ల తొలగింపు కారణంగా అక్టోబర్ నెలలో జియో సబ్‌స్క్రైబర్లను కోల్పోయినట్లు తెలిసింది. ఎయిర్‌టెల్ మాత్రం తన 4జీ/ 5జీ యూజర్ బేస్‌లో వృద్ధిని సాధించింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా 3జీ/ 4జీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. కాగా, బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం స్వల్పంగా యూజర్లను పెంచుకుంది.
ఇదీ చదవండి: పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. నెట్టింట చర్చ
జులైలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను 10–27 శాతం వరకు పెంచాయి. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యర్థుల బాటను అనుసరించకపోగా.. సమీప భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపుదల ఉండబోదని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ రాబర్ట్ రవి గతంలో స్పష్టం చేశారు. వినియోగదార్లను ఆకర్షించడానికి, మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్, డైరెక్ట్–టు–డివైస్ తదితర సేవలను ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment