పాప్‌కార్న్‌లోని చక్కెర, మసాలా స్థాయుల ఆధారంగా విభిన్న పన్ను స్లాబ్‌లను అమలు చేయడంపట్ల నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇటీవల రాజస్థాన్‌లోని జసల్మేర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశంలో జీఎస్టీను హేతుబద్దీకరించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా పాప్‌కార్న్(Popcorn)లోని చక్కెర, మసాలా స్థాయులను అనుసరించి విభిన్న రేట్లను నిర్దేశించారు.
సాల్ట్, మసాలాలతో కూడిన నాన్ బ్రాండెడ్ పాప్‌కార్న్‌పై 5 శాతం జీఎస్టీ, ప్రీ ప్యాకేజ్డ్, బ్రాండెడ్ పాప్‌కార్న్‌పై 12 శాతం, కారామెల్ పాప్‌కార్న్, చక్కెర కంటెంట్ ఉన్న పాప్‌కార్న్‌పై 18 శాతం జీఎస్టీను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రేట్లు వెంటనే అమలు చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఆదివారం పాప్‌కార్న్ కొనుగోలు చేసివారు వాటిపై జీఎస్టీ(GST) విధించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
Complexity is a bureaucrat’s delight and citizens’ nightmare. https://t.co/rQCj9w6UPw
— Prof. Krishnamurthy V Subramanian (@SubramanianKri) December 22, 2024
ఇదీ చదవండి: ‘గూగులీనెస్’ అంటే తెలుసా? సుందర్ పిచాయ్ వివరణ
అదనపు చక్కెర, మసాలాలతో కూడిన ఉత్పత్తులపై వేర్వేరుగా పన్ను విధిస్తున్నట్లు కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ఏదేమైనా ఈ నిర్ణయం వల్ల ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మద్దతుదారుల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. నెట్టింట ఈ వ్యవహారంపై తీవ్రంగానే చర్చ జరుగుతోంది. జీఎస్టీ హేతుబద్దీకరణ పేరుతో సాధారణ పౌరులపై పన్నుల రూపంలో భారీగా ఆర్థిక భారం మోపుతున్నట్లు విమర్శకులు వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment