‘గూగులీనెస్’ అనే పదాన్ని చాలా కాలంగా గూగుల్ ఉద్యోగులు ఉపయోగిస్తున్నారు. మళ్లీ గూగుల్‌లో లేఆఫ్స్ ఉంటాయని ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ పదం మరోసారి వైరల్‌గా మారింది. ఉద్యోగులు గూగుల్ సంస్కృతి, విలువలకు సరిపోతారా లేదా అని తనిఖీ చేయడంలో ఈ పదం ఉపయోగపడుతుందని సంస్థలో ఉన్నతాధికారులు నమ్ముతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల జరిగిన కంపెనీ వైడ్ ఫోరమ్ సమావేశంలో ఈ పదానికి సంబంధించి మరింత స్పష్టతను ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆరు కీలక అంశాలపై గూగులీనెస్ ఆధారపడి ఉంటుందని చెప్పారు.
మిషన్ ఫస్ట్: గూగుల్ మిషన్‌కు, ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తులో ఆయా ప్రాజెక్ట్‌ల్లో భారీ లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. ఫ్యూచర్ విజన్ కోసం పని చేయాలి.
అందరికీ ఉపయోగపడే వాటిపై దృష్టి: ప్రజల జీవితాలను నిజంగా మెరుగుపరిచే ఉత్పత్తులను సృష్టించాలి. అందరికీ ఉపయోగపడే వాటిపై ఉద్యోగులు దృష్టి సారించాలి.
ధైర్యంగా, బాధ్యతాయుతంగా ఉండడం: ఏ పని చేస్తున్నప్పుడైనాసరే మీరు చేస్తున్నది బలంగా నమ్మి ధైర్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వచ్చే ఫలితాలకు సైతం బాధ్యత తీసుకునేటప్పుడు సాహసోపేతమైన ఆలోచనలను ప్రోత్సహించవచ్చు.
వనరులను సద్వినియోగం చేసుకోవడం: మనం చేయాలనుకుంటున్న పనులకు అన్ని సందర్భాల్లోనూ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. చాలా వనరులు అవసరం అవ్వొచ్చు. కానీ పరిమిత వనరులను సద్వినియోగం చేసుకుని మెరుగైనా ఫలితాలు రాబట్టేలా పని చేయాలి.
వేగంగా.. సరదాగా..: చేసేపనిని నిర్దేశించిన కాలంలో పూర్తి చేయాలి. దాంతోపాటు భారంగా కాకుండా, సరదాగా పని చేయాలి.
టీమ్ గూగుల్: టీమ్ వర్క్ చాలా ముఖ్యం. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.
ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..
10 శాతం మందికి లేఆఫ్స్..
కొంతకాలంగా ఎలాంటి తొలగింపులు లేకుండా నిశ్చలంగా ఉన్న గూగుల్ కంపెనీ మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్దమైంది. ఈ ప్రభావం మేనేజర్ స్థాయి ఉద్యోగులు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ల మీద పడనుంది. గూగుల్ రానున్న రోజుల్లో 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవలే వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో నెలకొన్న పోటీని ఎదుర్కోవడానికి, ఓపెన్ఏఐ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment