layoff
-
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది మందికి నోటీసులు
అమెరికన్ దిగ్గజ విమాన తయారీ సంస్థ 'బోయింగ్'.. 438మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ సంస్థ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన విషయాన్ని వెల్లడించినప్పటికీ.. ఎట్టకేలకు లేఆఫ్ నోటీసులను జారీ చేసింది. యూఎస్‌లోని సియాటెల్ ప్రాంతంలో కంపెనీకి చెందిన 33వేల మంది ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.ఆర్ధిక పరమైన సమస్యలను రూపుమాపుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉత్పత్తిలో జరిగిన ఆలస్యాలను దృష్టిలో ఉంచుకుని బోయింగ్ 438 మందికి లేఆఫ్ నోటీసులు అందించింది. ఇందులో 218 మంది ఇంజనీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ (SPEEA) యూనిట్‌లోని సభ్యులు, మిగిలినవారు టెక్నీకల్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కంపెనీ తన ఉద్యోగులను తొలగించినప్పటికీ.. అర్హత కలిగిన వారికి మూడు నెలల వరకు కెరీర్ ట్రాన్సిషన్ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనున్నట్లు సమాచారం.సమ్మె ఎఫెక్ట్సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులు సమ్మె చేయడం వల్ల.. 737 మ్యాక్స్, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ గత నెలలోనే పేర్కొన్నారు. -
ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగాల కోతను ధ్రువపరుస్తూ జనరల్ మోటార్స్ ప్రకటన విడుదల చేసింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యుత్ వాహనాల వృద్ధి కొనసాగుతుండడంతో ఈ విభాగంలో అధికంగా పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది.‘భవిష్యత్తులో విద్యుత్ వాహనాలకు భారీ గిరాకీ ఏర్పడనుంది. వాటి తయారీ, అందులో వాడే సాఫ్ట్‌వేర్‌కు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదిలోపు కంపెనీ వ్యయాలను రెండు బిలియన్ డాలర్ల (రూ.16,884 కోట్లు) నుంచి నాలుగు బిలియన్ డాలర్లు(రూ.33,768 కోట్లు) వరకు తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఈ పోటీ మార్కెట్లో గెలవాలంటే వేగంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి. నిర్వహణ వ్యయాలను తగ్గించుకుని, సామర్థ్యాల వినియోగాన్ని పెంచుకోవాలి. ఖర్చుల తగ్గింపులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నాం’ అని కంపెనీ ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: ట్రంప్ ఎన్నికతో భారత్‌వైపు చూపుఆగస్టులో ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో సాఫ్ట్వేర్ విభాగంలో పనిచేసే 1,000 కంటే ఎక్కువ మంది సిబ్బందిని గతంలో జనరల్ మోటార్స్ తొలగించింది. సెప్టెంబర్‌లో కాన్సాస్ తయారీ కర్మాగారంలో దాదాపు 1,700 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. 2023లో దాదాపు 5,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
గూగుల్ హిస్టరీ ప్రింట్ తీసి.. జాబ్ నుంచి తీసేసిన కంపెనీ
కొందరు తమ తెలితక్కువ పనులతో ఉద్యోగాలు పోగొట్టుకుంటుంటారు. ఇలాగే యూకేలో ఉద్యోగి గూగుల్ హిస్టరీని ప్రింట్ తీసి మరీ అతన్ని ఉద్యోగం నుంచి తీసేసింది ఓ కంపెనీ. అతను గూగుల్‌లో వెతికింది అశ్లీల విషయాలు మాత్రం కాదు. మరి ఏం సెర్చ్ చేశాడు.. దీని వల్ల పడిన ఇబ్బందులేంటి అన్నది స్వయంగా అతడే ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.‘మిర్రర్స్’ నివేదిక ప్రకారం.. యూకేకి చెందిన జోస్ విలియమ్స్ అనే 26 ఏళ్ల యువకుడు ఓ కంపెనీలో కస్టమర్ సర్వీస్ అడ్మినిస్ట్రేటర్‌గా చేరాడు. పెద్దగా పనులేవీ అప్పగించకపోవడంతో అతడు ఆఫీస్ కంప్యూటర్లో "టర్కీ దంతాలు", "సైమన్ కోవెల్ బాచ్డ్ బొటాక్స్" వంటి అనవసర వాటి కోసం శోధించాడు. అతని ప్రవర్తనను గమనించిన బాస్ ఆఫీస్ కంప్యూటర్లో అతడు ఏమేం సెర్చ్ చేశాడన్నది మొత్తం 50 గంటల హిస్టరీని ప్రింట్ తీసి మందలించి ఉద్యోగంలోంచి తీసేశారు.దీని గురించి విలియమ్స్ టిక్‌టాక్ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో తాను చాలా ఇబ్బందులు పడ్డానని, మూడు కంపెనీలు జాబ్ రిజక్ట్ చేశాయని చెప్పుకొచ్చాడు. జాబ్ లేకపోవడంతో డబ్బులు లేక ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాన్నాడు. అయితే అతను టిక్‌టాక్ పెట్టిన ఈ వీడియోకు మాత్రం 450 పౌండ్లు (రూ.50 వేలు) దాకా డబ్బులు రావడం గమనార్హం. కంటెంట్ క్రియేషన్‌లో అభిరుచి ఉన్న విలియమ్స్ ప్రస్తుతం ఫుడ్ ఇండస్ట్రీలో సప్లయి చైన్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. -
ఈ టెక్ కంపెనీ మొదలెట్టేసింది.. 5,600 మంది తొలగింపు!
టెక్ దిగ్గజం సిస్కో చెప్పినట్టే ఉద్యోగుల తొలగింపులు మొదలెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 7 శాతం అంటే సుమారు 5,600 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతూ మరో రౌండ్ తొలగింపులను ప్రకటించింది.సిబ్బందిని తగ్గించే ప్రణాళికలను గత ఆగస్ట్ లోనే సిస్కో సూచించింది. అయితే ఏ వ్యక్తులు లేదా విభాగాలు ప్రభావితం అవుతాయో కంపెనీ పేర్కొనలేదు. స్పష్టత లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. తొలగింపుల గురించి ఉద్యోగులకు సెప్టెంబరు మధ్యలోనే సమాచారం అందింది.టెక్ క్రంచ్ నుండి వచ్చిన నివేదిక సిస్కోలో పని వాతావరణం అధ్వాన్నంగా ఉందని వెల్లడించింది. ఇక్కడి పని వాతావరణాన్ని చాలా మంది ఉద్యోగులు విషపూరితంగా అభివర్ణించారు. తొలగింపులు సిస్కో థ్రెట్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ రీసెర్చ్ డివిజన్ అయిన టాలోస్ సెక్యూరిటీపై ప్రభావం చూపాయని నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ఓ వైపు ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ కంపెనీ రికార్డ్‌స్థాయి లాభాల్లో కొనసాగుతోంది. సుమారు 54 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో 2024 "రికార్డులో రెండవ బలమైన సంవత్సరం" అని కంపెనీ నివేదించింది. లేఆఫ్ ప్రకటన వెలువడిన రోజునే ఈ ఆర్థిక నివేదిక విడుదలైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరిలోనూ సిస్కో 4,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
397 కంపెనీలు.. 1.3 లక్షల మంది బయటకు
2023 ప్రారంభంలో భారీ ఉద్యోగుల తొలగింపులతో కుదేలైన టెక్ పరిశ్రమ.. 2024లో కూడా కోలుకోవడం లేదు. సంస్థల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 130000 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయినట్లు 'లేఆఫ్స్.ఎఫ్‌వైఐ' (Layoffs.fyi) వెల్లడించింది.ఈ సంవత్సరం ఇప్పటి వరకు 397 కంపెనీలలో 130482 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇటీవలే సిస్కో కంపెనీ మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. 2024 ఫిబ్రవరిలో సుమారు 4000 మందిని సిస్కో.. ఈ సారి ఎంతమందిని ఉద్యోగులను తొలగిస్తుందనే విషయాన్ని నాల్గవ త్రైమాసిక ఫలితాలతో వెల్లడించే సమయంలోనే వెల్లడించనుంది.ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కూడా ఈ ఏడాదిలోనే ఏకంగా 15000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 15 శాతానికి పైనే అని తెలుస్తోంది. డెల్ టెక్నాలజీస్ కూడా ఈసారి దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది దాని మొత్తం వర్క్ ఫోర్స్‌లో దాదాపు 10 శాతం.మైక్రోసాఫ్ట్ గత రెండు నెలల్లో దాదాపు 1,000 మంది ఉద్యోగులను తగ్గించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ వెల్లడించనప్పటికీ కంపెనీ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు సోషల్ మీడియాల ద్వారా పేర్కొన్నారు. అదేవిధంగా, సాఫ్ట్వేర్ సంస్థ UKG దాని మొత్తం శ్రామిక శక్తిలో 14 శాతం లేదా 2,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా వివిధ సంస్థలు ఈ ఏడాది ప్రారంభం నుంచి సుమారు 1.3 లక్షల కంటే ఎక్కువమందిని తొలగించాయి. -
ఆ కంపెనీ టెకీలపై లేఆఫ్ పిడుగు! 12,500 మంది తొలగింపు
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ టెక్నాలజీస్ మళ్లీ భారీ సంఖ్యలో తొలగింపులను ప్రకటించింది. గత 15 నెలల్లో ఇది రెండవ రౌండ్ లేఆఫ్. కంపెనీ ఈసారి దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది దాని మొత్తం వర్క్ ఫోర్స్‌లో దాదాపు 10 శాతం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉద్దేశించిన విస్తృత పునర్వ్యవస్థీకరణలో ఈ తొలగింపులు భాగం. తమ కస్టమర్ సంస్థలకు ఏఐ ద్వారా మెరుగైన సేవలు అందించి మార్కెట్ వృద్ధిని పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.తొలగింపుల నిర్ణయాన్ని కంపెనీ గ్లోబల్ సేల్స్ అండ్ కస్టమర్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ బిల్ స్కానెల్, గ్లోబల్ ఛానెల్స్ ప్రెసిడెంట్ జాన్ బైర్న్ మెమో ద్వారా తెలియజేశారు. ఉద్యోగుల తొలగింపులు బాధాకరమే అయినప్పటికీ భవిష్యత్ వృద్ధి కోసం అనివార్యమైనట్లు పేర్కొన్నారు. తొలగింపుల గురించి ఉద్యోగులకు హెచ్ఆర్ ఎగ్జిట్ మీటింగ్‌ల ద్వారా తెలియజేశారు.కొందరికి వన్-ఆన్-వన్ మీటింగ్‌ల ద్వారా ఈ విషయం తెలిసింది. బాధిత ఉద్యోగులకు రెండు నెలల వేతనాలతో పాటు సంవత్సరానికి అదనంగా ఒక వారం, గరిష్టంగా 26 వారాల వరకు సీవెరన్స్ ప్యాకేజీలు అందిస్తున్నారు. అయితే ప్రోత్సాహకాలు, స్టాక్ ఆప్షన్లు కోల్పోవడంపై దీర్ఘకాలిక ఉద్యోగులలో అసంతృప్తి ఉంది. ఇటీవలి బడ్జెట్ తగ్గింపులు, రద్దైన ప్రాజెక్ట్‌లను గమనించిన కొంతమంది ఉద్యోగులు కోతలను ముందే ఊహించారు.డెల్ ఇప్పటికే 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 13,000 మంది ఉద్యోగులను తొలగించింది. రిమోట్-వర్క్ విధానాన్ని రద్దు చేస్తూ, గత సంవత్సరం ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు పిలవాలని కంపెనీ తీసుకున్న నిర్ణయం కూడా సిబ్బందిని తగ్గించడంలో భాగంగా తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుత తొలగింపులతో డెల్ వర్క్‌ఫోర్స్ 1.2 లక్షల నుంచి 1లక్ష దిగువకు తగ్గుతుందని అంచనా. -
ఎయిర్‌లైన్స్ విలీనం.. 700 మంది తొలగింపు!!
ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ త్వరలో కలిసిపోతున్నాయి. ఈ రెండు విమానయాన సంస్థల విలీనం వందలాది మంది ఉద్యోగాలపై మీదకు వచ్చింది. ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ రెండింటిలో కనీసం 700 మంది ఉద్యోగులను తొలగించబోతున్నారు. ఇద్దరు అధికారుల ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దీని అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.అయితే రిటైర్మెంట్కు చేరుకుంటున్న ఉద్యోగులు, నిర్ణీత కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు ఇందులో ఉండరని ఆ ఇద్దరు అధికారులు తెలిపారు. హెచ్‌టీ లైవ్ నివేదిక ప్రకారం.. సుమారు 18,000 మంది ఉద్యోగులున్న ఎయిర్ ఇండియా విస్తారాతో విలీనం కానుంది. ఇందుకోసం దాదాపు 6000 మంది విస్తారా ఉద్యోగులను విలీన యూనిట్లో చేయాల్సి ఉంటుంది.“అంతర్గత ఫిట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో తొలగింపుల ప్రకటన ఉంటుంది. స్థిర-కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు, త్వరలో పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు మినహా ఎయిర్ ఇండియా, విస్తారా రెండింటిలో దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది" ఒక అధికారి తెలిపారు.అదే సమయంలో పనితీరు ఆధారంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు మరో అధికారి తెలిపారు. "నాన్-ఫ్లైయింగ్ ఫంక్షన్లలోని ఉద్యోగులకు సంస్థాగత అవసరాలు, వ్యక్తిగత యోగ్యత ఆధారంగా ఉద్యోగాల కేటాయింపు ఉంటుంది" అని మూడో అధికారి చెప్పారు. -
యూఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో లేఆఫ్‌లు.. 2,200 మంది తొలగింపు
యూఎస్‌కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ‘యూకేజీ’ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఓ నివేదిక ప్రకారం కంపెనీ తన తాజా రౌండ్లో మొత్తం శ్రామికశక్తిలో దాదాపు 14% మందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్‌లతో 2,200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచానా వేస్తున్నారు.జూలై 4న సెలవు రోజు కావడంతో జూలై 3వ తేదీనే తొలగింపులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. యూకేజీ లేఆఫ్‌ల గురించి బిజినెస్ జర్నల్ నివేదించింది. ఫ్లోరిడాకు చెందిన ఈ సాఫ్ట్వేర్ కంపెనీ భారీ లేఆఫ్‌లతో తన శ్రామిక శక్తిని ఎలా తగ్గించుకుందో వివరించింది. కంపెనీ సీఈవో క్రిస్ టాడ్ ఈమెయిల్ ప్రకారం కంపెనీ తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తగ్గించిందని నివేదిక పేర్కొంది.అనేక దేశాలలో ఉనికిని కలిగి ఉన్న అతిపెద్ద సాఫ్ట్వేర్ డెవలపర్లలో ఒకటైన యూకేజీ మొత్తం 15,882 మంది ఉద్యోగులను కలిగి ఉందని పేర్కొంది. కీలకమైన వృద్ధి రంగాలపై దృష్టి సారించడం, దీర్ఘకాలిక వ్యూహం లక్ష్యంగా చేస్తున్న సంస్థాగత మార్పుల్లో భాగంగా తొలగింపులను ప్రారంభించినట్లు యూకేజీ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. కంపెనీ సీఈవో క్రిస్ టాడ్ తొలగింపులను వచ్చే వారం ప్రకటించాలనుకున్నారు. అయితే ఇంతలోపే వార్తలు బయటకు రావడంతో కంపెనీ తన చర్యలను వేగవంతం చేయాల్సి వచ్చిందంటున్నారు. ప్రస్తుత ఉద్యోగాల కోతలు యునైటెడ్ స్టేట్స్కే పరిమితం అవుతాయని క్రిస్ టాడ్ ధ్రువీకరించారు. -
స్టార్టప్ ట్రబుల్స్: ఈ బెంగళూరు కంపెనీలో 80% తొలగింపు
నిధుల లేమి భారతీయ స్టార్టప్ కంపెనీలను పట్టిపీడిస్తోంది. దీని ప్రభావం అందులో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులపై పడుతోంది. దీంతో గత్యంతరం లేని ఆయా కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో సగానికి సగం ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి.ఏకంగా 80 శాతం మంది తొలగింపుపట్టు నూలు ఉత్పత్తుల వ్యాపారం నిర్వహించే బెంగళూరుకు చెందిన రేషామండి అనే స్టార్టప్ సిరీస్ బీ ఫండింగ్ పొందడంలో విఫలమవడంతో ఏకంగా 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఏడాదిగా కంపెనీ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. గతేడాది జనవరిలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 500 ఉండగా అది ఈ సంవత్సరం చివరి నాటికి 100కు పడిపోయింది. వీరిలో దాదాపు 300 మంది ఉద్యోగులు తమ తుది బకాయిలు, జీతాల కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం.2020లో ఏర్పాటైన రేషామండి క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్స్, ఓమ్నివోర్, వెంచర్ క్యాటలిస్ట్స్ వంటి ఇన్వెస్టర్ల నుంచి 40 మిలియన్ డాలర్లకు పైగా ఈక్విటీ నిధులను సేకరించింది. వెంచర్ డెట్ ఇన్వెస్టర్లు, రుణదాతల నుంచి కంపెనీ దాదాపు రూ.300 కోట్ల రుణాన్ని పొందింది. దీని తరువాత ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. గతేడాది జూన్ నుంచి ఉద్యోగుల తొలగింపునకు దారితీసింది.10 వేల మందికి ఉద్వాసనఈ ఏడాది ఆరంభం నుంచి స్టార్టప్ లేఆఫ్స్ పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయి. పునర్నిర్మాణం, నిధులపై పరిమితులు, ఇతర కారణాలతో 2024లో ఇప్పటివరకూ భారతీయ స్టార్టప్‌లు 10,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఫ్లిప్‌కార్ట్, ఓలా, స్విగ్గీ, పేటీఎం తదితర టాప్ కంపెనీలు ఈ ఏడాది వివిధ విభాగాల్లో భారీగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి. ఆర్బీఐ నిషేధం తర్వాత పేటీఎంలో కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది 5,000 నుంచి 6,300 ఉద్యోగులను ఈ కంపెనీ తొలగించి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.మరోవైపు ఉద్యోగాల కోతలు, జీతాల జాప్యం వంటి పలు అంశాలతో బైజూస్ సతమతమవుతోంది. ఇక స్విగ్గీ దాదాపు 400 మంది ఉద్యోగులను తొలగించగా, భవీష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా 600 మందిని తొలగించనుంది. ఇదిలా ఉంటే చాలా స్టార్టప్‌లు సైలెంట్ లేఆఫ్స్ పాటించాయి. అయితే 2024లో లేఆఫ్స్ ఉన్నప్పటికీ, పరిశ్రమలు నెమ్మదిగా వృద్ధిని, రికవరీ సంకేతాలను చూపుతున్నాయని, ఈ ఏడాది నియామకాలు పెరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.మెరుగుపడుతున్న నిధుల సమీకరణ2024 ప్రథమార్ధంలో భారతీయ టెక్నాలజీ స్టార్టప్ లు 4.1 బిలియన్ డాలర్లు నిధులు సమీకరించాయి. 2023 ద్వితీయార్ధంతో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. కానీ అంతకు ముందు 2023 ప్రథమార్ధంతో పోలిస్తే ఇది ఇప్పటికీ 13 శాతం. అయినప్పటికీ టెక్ స్టార్టప్ ల్యాండ్ స్కేప్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నిధులు సమకూరుస్తున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. -
లేఆఫ్స్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ
పేటీఎం పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా ప్రకటించింది. లేఆఫ్స్ ఇచ్చిన ఉద్యోగులకు కొత్త కొలువులు వచ్చేలా కంపెనీ మద్దతు ఇస్తుందని చెప్పింది.కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ మే నెలలో సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికను ప్రారంభించారు. సంస్థ ఖర్చులు తగ్గించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. టెక్ కంపెనీకి ప్రధానంగా టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(సాంకేతిక సదుపాయాలు), ఉద్యోగుల వేతనాలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి చాలా కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇటీవల పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి సంస్థలో కొన్ని మార్పులు చేస్తున్నారు. మేనెలలో కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేశారు. అందులో భాగంగానే తాజాగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు కంపెనీ చెప్పింది. అయితే ఎంతమందిని ఉద్యోగాల్లోనుంచి తొలగించిందో మాత్రం తెలియజేయలేదు.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్‌ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్విజయ్శేఖర్ శర్మ మే 22న షేర్హోల్డర్లకు రాసిన లేఖలో..‘సంస్థ తన ప్రధాన వ్యాపారాలపై దృష్టి సారిస్తోంది. సంభావ్య తొలగింపులకు(పొటెన్షియల్ లేఆఫ్స్) సిద్ధమైంది. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పెట్టుబడుల కారణంగా ఉద్యోగుల ఖర్చులు గణనీయంగా పెరిగాయి’ అని పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగుల ఖర్చులను తగ్గించడం ద్వారా ఏటా రూ.400కోట్లు-రూ.500 కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
అరుదైన స్థానం దక్కించుకున్న హైదరాబాద్ కంపెనీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ జాబితాలో దేశంలోని పది కంపెనీలు చోటు సంపాదించాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీలతో ఈ జాబితా రూపొందించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన నెక్ట్స్‌వేవ్ కంపెనీ స్థానం దక్కించుకోవడం విశేషం.నెక్ట్స్‌వేవ్..ఏదో ఒకకోర్సు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరగానే సరిపోదు. నిత్యం కొత్త అంశాలు నేర్చుకుంటేనే ఉద్యోగంలో నిలదొక్కుకోగలం. ఆ దిశగా పని చేస్తోంది ‘నెక్ట్స్‌వేవ్’. ఐఐటీల్లో చదివిన హైదరాబాదీ యువకులు శశాంక్ రెడ్డి, రాహుల్, అనుపమ్ కొవిడ్ లాక్డౌన్ సమయంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ సంస్థను స్థాపించారు. కంటిన్యూయస్ కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రాం(సీసీబీపీ) పేరిట కాలేజీల నుంచి గ్యాడ్యుయేట్లుగా బయటకు వచ్చే విద్యార్థులకు కంపెనీల్లో అవసరమయ్యే ఐఓటీ, ఏఐ, ఫుల్‌స్టాక్ తదితర స్కిల్స్ నేర్పించడం దీని ఉద్దేశం.దేశంలో డిగ్రీ అయిపోయాక ఖాళీగా ఉంటున్న దాదాపు 60 శాతం మందిని నిపుణులుగా తీర్చిదిద్దాలనేది సంస్థ లక్ష్యం. ఇక్కడ శిక్షణ పొందిన వారు ప్రముఖ సంస్థల్లో కొలువు దక్కించుకొని, నైపుణ్యాలకు సానబట్టే వేదిక దొరికితే దూసుకెళ్తామని నిరూపించారు కూడా. దేశవ్యాప్తంగా మూడు వేల కాలేజీలకు చెందిన 2 లక్షల మంది విద్యార్థులు ఈ స్టార్టప్ కమ్యూనిటీలో భాగస్వాములయ్యారు. ఫ్రెషర్స్‌తో పాటు వివిధ కారణాల వల్ల కెరియర్లో గ్యాప్ వచ్చిన, వేరే రంగంలో పనిచేసిన వారికీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తమదేనని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. పనితీరుతో ఇన్వెస్టర్లనూ మెప్పించి.. గతంలో రూ.21 కోట్ల క్యాపిటల్‌ను సాధించారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే సాఫ్ట్వేర్ రంగంలో నిలదొక్కుకోవచ్చని చెబుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఉద్యోగాల కల్పనకు సహాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏడాదికి పది లక్షల మంది నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలుపుతున్నారు.ఐటీ పరిశ్రమలో లేఆఫ్స్.. ఇప్పుడేం చేయాలంటే..ఐటీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరుతో కొంతకాలంగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలోని సాఫ్ట్వేర్ల అప్డేషన్ అగిపోయింది. బ్యాంకింగ్ వెబ్సైట్లు, యాప్‌ల్లో కొత్త ఫీచర్లు అందించాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. దానికితోడు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. ఇవిచాలవన్నట్లు అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు నెలకొంటున్నాయి. దాంతో ఐటీ కంపెనీల లాభాలు భారీగా తగ్గుతున్నాయి. ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించి..తిరిగి పరిస్థితులు గాడినపడితే ఐటీ రంగం పుంజుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆలోపు కొత్తగా ఉద్యోగాలు కోసం చూస్తున్నవారు నిరాసక్తి చెందకుండా నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. -
ఆఫీస్‌కి రాకపోతే ఫైరింగే.. ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) రిటర్న్-టు-ఆఫీస్ పాలసీకి సంబంధించి తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పదేపదే రిమైండర్లు చేసినప్పటికీ కార్యాలయానికి తిరిగి రావాలనే ఆదేశాన్ని విస్మరించేవారు తొలగింపు సహా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసిందని ‘లైవ్‌మింట్’ కథనం పేర్కొంది."నిర్దేశాలను పాటించడంలో వైఫల్యం కంపెనీ విధానాల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనకు దారితీస్తుందని దయచేసి గమనించండి. తదనుగుణంగా మీపై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది తొలగింపునకు కూడా దారితీయవచ్చు" అని ఒక ఉద్యోగికి రాసిన లేఖలో కాగ్నెజెంట్ హెచ్చరించినట్లుగా నివేదిక పేర్కొంది.ఇన్ ఆఫీస్ వర్క్ ప్రాముఖ్యతను కాగ్నిజెంట్ ఇంతకు ముందే పునరుద్ఘాటించింది. ఆఫీస్ పాలసీని పాటించడంలో వైఫల్యాన్ని కంపెనీ పాలసీల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని, ఇది టర్మినేషన్‌కు సైతం దారితీసే అవకాశం ఉందని ఏప్రిల్ 15 నాటి లేఖలో కాగ్నిజెంట్ స్పష్టం చేసింది.భారత్‌లో కాగ్నిజెంట్ శ్రామిక శక్తి గణనీయంగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. దాని 347,700 మంది ఉద్యోగులలో సుమారు 2,54,000 మంది భారత్‌లోనే ఉన్నారు. కంపెనీ అతిపెద్ద ఉద్యోగుల స్థావరం భారత్ అని దీనిని బట్టీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానం భారత్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇన్ ఆఫీస్ వర్క్ తప్పనిసరి ఆదేశాలు అనేక కారణాల నుంచి వచ్చాయి. ఆవిష్కరణలు, జట్టు కృషి, బలమైన సంస్థాగత సంస్కృతిని వ్యక్తిగత సహకారం ప్రోత్సహిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రత్యేకించి సెన్సిటివ్ డేటా, కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లను నిర్వహించే పరిశ్రమలలో కార్యాచరణ, భద్రతాపరమైన అంశాలు కూడా కారణంగా ఉన్నాయి.టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro) వంటి కంపెనీలు కూడా గతంలో రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరి చేశాయి. అయితే, కొన్ని కంపెనీలు రిమోట్ పని సౌలభ్యానికి అలవాటుపడిన కొంతమంది ఉద్యోగుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. చాలా మంది ఉద్యోగులు రిమోట్ వర్క్ మెరుగైన పని-జీవిత సమతుల్యతను అందిస్తుందని, ప్రయాణ ఒత్తిడిని తగ్గిస్తుందని వాదించారు. అయితే కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఈ ఉద్యోగుల ప్రాధాన్యతలను వ్యాపార అవసరాలు, కార్యాచరణ సామర్థ్యాలతో సమతుల్యం చేస్తున్నాయి. -
మరో 600 జాబ్స్‌కి గండం!
Tesla Layoffs: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పని చేస్తున్న దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించిన టెస్లా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.టెస్లా సోమవారం ప్రభుత్వ ఏజెన్సీలకు ఇచ్చిన నోటీసు ప్రకారం, కాలిఫోర్నియాలో అదనంగా 601 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన గ్లోబల్ ఉద్యోగ కోతల్లో భాగంగా కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో 6,020 మందిని తొలగించనున్నట్లు గత నెలలో తెలిపింది.టెస్లా కార్ల విక్రయాలు ఇటీవల కాలంలో భారీగా పడిపోయాయి. మరోవైపు ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ భారీగా పెరిగింది. దీంతో టెస్లా కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది. త్వరలో అందుబాటు ధరలో కొత్త కార్లను తీసుకురానున్నట్లు టెస్లా తెలిపింది. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున తమ కంపెనీలను ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించింది. -
వందలాది ఉద్యోగుల తొలగింపు.. సారీ చెప్పిన సీఈవో
ఫిన్‌టెక్ కంపెనీ సింపుల్ (Simpl) వివిధ విభాగాల్లో వందలాది ఉద్యోగులను తొలగించింది. యూజర్ల చేరిక మందగించడం, నిర్వహణ వ్యయం పెరిగిపోవడం వంటి కారణాలతో 15 శాతం దాదాపు 100 మందిని కంపెనీ వదిలించుకుంది. కోతల ప్రభావం ఎక్కువగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్లో అత్యధిక జీతాలు అందుకునే ఉద్యోగులపై పడినట్లు తెలుస్తోంది.తాజా తొలగింపులకు ముందు, సింపుల్ దాదాపు 650 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇందులో ప్రధాన కార్యకలాపాలు, ఇంటర్న్లు, కాల్ సెంటర్ ఏజెంట్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌లో ఇవి వరుసగా రెండవ సంవత్సరం తొలగింపులు. 2023 మార్చిలో సింపుల్ దాదాపు 160-170 మంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ తొలగింపుల్లో కొంతమంది ఇటీవలే చేరిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిలో కొందరు ఉద్యోగంలో చేరి ఒకటి లేదా ఒకటిన్నర నెలలు మాత్రమే కావడం గమనార్హం.కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో నిత్యానంద్ శర్మ బుధవారం టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. లేఆఫ్‌ల నిర్ణయానికి విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరారు. అవుట్‌ప్లేస్‌మెంట్ సహాయంతో సహా ప్రభావితమైన వారికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. -
Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది. -
ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాలో లేఆఫ్‌లు అలజడి సృష్టిస్తున్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వరుసపెట్టి కంపెనీని వీడుతున్నారు. తాజాగా టాప్ హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ అల్లి అరేబాలో కంపెనీని వీడారు.అరేబాలో ఇక కంపెనీలో కనిపించరని, ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) చెప్పినట్లుగా మనీ కంట్రోల్ కథనం పేర్కొంది. నేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్‌కి రిపోర్టింగ్ చేసే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆమె అంతట ఆమె కంపెనీని వీడారా.. లేక ఉద్యోగాల కోతలో భాగంగా ఉద్వాసనకు గురయ్యారా అనేది స్పష్టంగా తెలియలేదు. దీనిపై అటు మస్క్ గానీ, అరేబాలో గానీ స్పందించలేదు.ఈ ఎలక్ట్రిక్-వెహికల్ మేకర్ కంపెనీ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను తగ్గిస్తోందని, సుమారు 20 శాతం సిబ్బంది తగ్గింపును లక్ష్యంగా చేసుకుందని బ్లూమ్‌బెర్గ్ గత నెలలో నివేదించింది. టెస్లాలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా పేరున్న నలుగురిలో ఒకరైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డ్రూ బాగ్లినోతో సహా మస్క్ టాప్ లెఫ్టినెంట్లలో కొందరు కూడా కొన్ని వారాల క్రితం రాజీనామా చేశారు.ఇటీవలి నెలల్లో వాహన విక్రయాలు క్షీణించడం ప్రారంభించినప్పటి నుండి ఖర్చుల కట్టడి, సిబ్బంది కోతపై ఎలాన్ మస్క్ దృష్టి పెట్టారు. టెస్లా ఛార్జింగ్ కనెక్టర్లను స్వీకరించే ప్రక్రియలో ఇతర ఆటోమేకర్లతో భాగస్వామ్యాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ సూపర్‌చార్జర్ టీమ్‌లో చాలా మందిని ఇప్పటికే తొలగించారు. అరేబాలో కంపెనీలో అత్యంత సీనియర్ మహిళా ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 2023 ఫిబ్రవరి నుంచి ఈ పదవిలో ఉన్నారు. అలాగే సుమారు ఆరేళ్లుగా టెస్లాలో పనిచేస్తున్నారు. -
గూగుల్‌లో మళ్లీ లే ఆఫ్స్.. ఎందుకో తెలుసా..
టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ ఫ్లట్టర్, డార్ట్, పైథాన్ టీమ్‌ల నుంచి ఉద్యోగులను తొలగించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. త్వరలో సంస్థ యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరుగనున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉద్యోగాలు కోల్పోయినవారు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో ఈ అంశాన్ని వైరల్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంతమందికి లేఆఫ్స్ ప్రకటించారో మాత్రం స్పష్టం కాలేదు.ఈ సందర్భంగా గూగుల్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఉద్యోగాలు కోల్పోయినవారు కంపెనీలోని ఇతర విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కంపెనీ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో తొలగింపు ప్రక్రియ అమలుచేసింది. కంపెనీ ఫైనాన్స్ విభాగంలో పనిచేసిన ఉద్యోగులను ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాల్లో పనిచేసేందుకు అనుమతిస్తున్నారు’ అని చెప్పారు.గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరాట్ లేఆఫ్స్‌కు సంబంధించి ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో స్పందిస్తూ.. కంపెనీ నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్ వంటి ప్రదేశాల్లో గూగుల్ ‘గ్రోత్ హబ్‌లను’ నిర్మిస్తుందని చెప్పారు. రాబోయే అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలన్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఎన్ని సిమ్‌కార్డులున్నాయో తెలుసుకోండిలా..జనవరిలోనూ వందల మంది ఉద్యోగులను ఇంజినీరింగ్, హార్డ్‌వేర్, అసిస్టెంట్ బృందాల్లో గూగుల్ తొలగించింది. కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాలను పెంచుకోవడంపై కంపెనీ దృష్టి సారిస్తుండడంతో ఇలా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుందని తెలిసింది. -
నాలుగు నెలలు కాకుండానే.. మార్కెటింగ్ టీమ్ మొత్తానికి మంగళం!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లా కంపెనీ వ్యాప్త తొలగింపులలో భాగంగా కొత్తగా ఏర్పడిన మార్కెటింగ్ బృందం మొత్తాన్ని తొలగించింది. సాంప్రదాయ ప్రకటనలకు భిన్నంగా కొన్ని నెలల కిందటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్ ఈ టీమ్‌ను ఏర్పాటు చేశారు. సీనియర్ మేనేజర్ అలెక్స్ ఇంగ్రామ్ పర్యవేక్షణలో యూఎస్‌లో 40 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేసిన "గ్రోత్ కంటెంట్" టీమ్ అంతటినీ తొలగించిట్లు తెలిసింది. గ్లోబల్ టీమ్‌కు నాయకత్వం వహించిన ఇంగ్రామ్, జార్జ్ మిల్బర్న్లను తొలగించినట్లు వారు తెలిపారు. అయితే ఐరోపాలో కంపెనీకి ఇప్పటికీ తక్కువ సంఖ్యలో మార్కెటింగ్ సిబ్బంది ఉన్నట్లు ఒకరు చెప్పారు.అలాగే కాలిఫోర్నియాలోని హౌథ్రోన్లో ఉన్న టెస్లా డిజైన్ స్టూడియో సిబ్బందిలో కూడా గణనీయమైన తొలగింపులు జరినట్లుగా తెలిసింది. కాగా బ్లూమ్‌బెర్గ్ నివేదికకు ఎలాన్ మస్క్ ప్రతిస్పందిస్తూ కంటెంట్ బృందం పని గురించి ‘ఎక్స్’ పోస్ట్‌లో "ప్రకటనలు చాలా సాధారణంగా ఉంటున్నాయి.. ఏదైనా కారుకైనా సరిపోవచ్చు" అంటూ రాసుకొచ్చారు. తొలగింపులకు గురైన గ్రోత్ టీమ్‌ను ఇంగ్రామ్ నాలుగు నెలల క్రితం నుంచే నిర్మించడం ప్రారంభించారు.టెస్లా గ్రోత్ టీమ్ తొలగింపు సంస్థలో అతిపెద్ద ఉద్యోగాల కోతను సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించనున్నట్లు ఎలాన్ మస్క్ గతవారం తెలిపారు. అయితే కంపెనీ సీఈవో 20 శాతం ఉద్యోగులను తొలగింపులకు ఆదేశించినట్లుగా బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. 20,000 మందిపైగా ఉద్యోగులను కంపెనీ తొలగించవచ్చు. -
ఉద్యోగులను తొలగించిన లిప్‌స్టిక్ కంపెనీ
పర్సనల్ కేర్, కాస్మొటిక్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే గుడ్ గ్లామ్ గ్రూప్ దాదాపు 150 మంది లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది చివర్లో ఐపీవోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ యూనికార్న్ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు తన మానవ వనరులను పునర్నిర్మించడంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 12-15 నెలల్లో వివిధ విభాగాలలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో లాభదాయకమైన కంపెనీగా ఉండాలనే దృఢమైన లక్ష్యానికి ఈ వ్యూహాత్మక చొరవ దోహదపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గుడ్ గ్లామ్ గ్రూప్ ఇటీవల పోప్గ్జో, ప్లిగ్సో, బేబీ చక్ర, మామ్స్కో, స్కూప్ఊప్, ట్వీక్ ఇండియా కంపెనీలను కొనుగోలు చేసింది. గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా మనన్ జైన్, గ్రూప్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఫౌండర్ ఇనిషియేటివ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కార్తీక్ రావు, బ్రాండ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా అంకితా భరద్వాజ్‌ని నియమించింది. ఇటీవలే గ్రూప్ కొత్త గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కమల్ లత్ నియామకాన్ని కూడా ప్రకటించింది. -
ప్రముఖ టెక్ కంపెనీలో తొలగింపులు, బదిలీలు
Google LayOff: ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఉద్యోగుల తొలగింపులు, బదిలీలు చేపట్టింది. ఈ విషయాన్నికంపెనీ ప్రతినిధి తెలిపారు. తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించలేదు. ప్రభావితమైన ఉద్యోగులలో కొంత మందిని భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కంపెనీ పెట్టుబడులు పెడుతున్న కేంద్రాలకు బదిలీ చేయనున్నారు. గూగుల్ తొలగింపులతో ఈ సంవత్సరం టెక్, మీడియా పరిశ్రమలో మరిన్ని తొలగింపులు కొనసాగవచ్చనే భయాలు నెలకొన్నాయి. 2023 ద్వితీయార్థం నుంచి 2024 వరకు తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి, ఉత్పత్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. లేఆఫ్‌లతో గూగుల్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలలోని అనేక మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ప్రభావితమైన ఫైనాన్స్ టీమ్‌లలో గూగుల్ ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాలు ఉన్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్లకు వృద్ధిని విస్తరింపజేస్తామని గూగుల్ ఫైనాన్స్ చీఫ్, రూత్ పోరాట్ సిబ్బందికి ఈ-మెయిల్ పంపారు. -
వందలాది ఉద్యోగులు ఇంటికి.. ఐటీ కంపెనీ నిర్ణయం
EXL Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎక్సెల్ సర్వీస్ (Exl Service) అనే ఐటీ సంస్థ ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐకి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా న్యూయార్క్ ఆధారిత ఐటీ సంస్థ ఎక్సెల్ సర్వీస్ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. వీరు కంపెనీ మొత్తం ఉద్యోగులలో 2 శాతం కంటే తక్కువే అని తెలుస్తోంది. కంపెనీ తాజా నిర్ణయం కారణంగా భారత్, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వీరిలో 400 మందిని పూర్తిగా ఇంటికి పంపిస్తుండగా మిగిలిన 400 మందికి కంపెనీలోని ఇతర విభాగాల్లో అవకాశం ఇవ్వనుంది. ఉద్యోగాల కోత ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్, భారత్‌లో డేటా అనలిటిక్స్, డిజిటల్ ఆపరేషన్స్‌లో పనిచేస్తున్న జూనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఎక్సెల్ సర్వీస్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 55 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో కంపెనీ సీఈవోగా ఉన్న రోహిత్ కపూర్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా పదోన్నతి పొందారు. అలాగే వికాస్ భల్లా, వివేక్ జెట్లీ అనే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డేటా, ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌తో కూడిన విస్తృత బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం తొలగిస్తున్న వారి స్థానంలో ఏఐ, డేటాలో అత్యంత పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తమ క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. -
సంచలనం.. 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు
Layoffs in Argentina: ప్రైవేట్ కంపెనీల్లో గత కొన్ని నెలలుగా లేఆఫ్‌ల గురించి వింటున్నాం. ముఖ్యంగా ఐటీ సంస్థలు లేఆఫ్‌ల పేరుతో వేలాది సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం సంచలంగా మారింది. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే నెలల్లో 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి దూకుడు వ్యూహాన్ని ప్రదర్శించారు. ఈ తొలగింపులు అర్జెంటీనాలోని 35 లక్షల మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పోలిస్తే తక్కవే అయినప్పటికీ కార్మిక సంఘాల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదరుకావచ్చిన భావిస్తున్నారు. అర్జెంటీనా దేశంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం మార్చి 31తో ముగియనుంది. గతేడాదే కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. అన్యాయమైన తొలగింపులను సహించబోమని యూనియన్ నాయకులు హెచ్చరించారు. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. BREAKING: Bloomberg reports that Argentina's President Javier Milei is planning to fire 70,000 government workers — The Spectator Index (@spectatorindex) March 27, 2024 -
180 ఉద్యోగాలను తొలగించిన ప్రముఖ విమానయాన సంస్థ
టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగాల తొలగొంపునకు పూనుకుంటున్నాయి. విమానయాన కంపెనీలు సైతం అదేబాటలో పయనమయ్యాయ. ఇటీవల ఎయిరిండియా కంపెనీ సంస్థలో 180 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గత కొన్ని వారాల్లో 180 మందికి పైగా నాన్-ఫ్లయింగ్ సిబ్బందికి ఎయిరిండియా లేఆఫ్ ఇచ్చింది. ఈ ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాలు, పునర్నైపుణ్య అవకాశాలను వినియోగించుకోలేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 జనవరిలో ఎయిరిండియా పగ్గాలు చేపట్టిన తర్వాత.. వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కొంతమంది సిబ్బందికి లేఆఫ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: గతేడాదితో పోలిస్తే అధికంగా విమానయానం.. ఎందరో తెలుసా.. -
ఏడు నిమిషాల్లో ఊడిన ఉద్యోగాలు
సాఫ్ట్వేర్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట నిత్యం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. కరోనా సమయంలో దాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని ఉద్యోగాలు తొలగించాయి. అంతర్జాతీయ యుద్ధ భయాలు, ఆర్థికమాంద్యం అంటూ ఇంకొన్ని ఉద్యోగాలు తొలగించారు. ప్రస్తుతం ఏఐ సాకు చెబుతూ మరికొంతమందిని ఇంటిబాట పట్టిస్తున్నారు. తాజాగా దిగ్గజ కంపెనీ అయిన ఐబీఎం మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేస్తున్న తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఐబీఎం చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జొనాథన్ అదాషేక్ ఇటీవల సమావేశం నిర్వహించి.. మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగాల్లో లేఆఫ్‌లు చేస్తున్నామని ప్రకటించినట్లు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. అయితే, కేవలం ఏడు నిమిషాల సమావేశంలో ఈ తొలగింపులపై ప్రకటన రావడంతో ఉద్యోగులు కంగు తిన్నారు. ఎంతమందిని తొలగించారన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. ఇదీ చదవండి: మానవ మెదడుతో ఏదీ సరితూగదు.. ఏఐని తలదన్నే ఉద్యోగాలివే.. ఐబీఎం కార్యకలాపాల్లో భవిష్యత్తులో కృతిమ మేధను భాగం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ నిర్ణయం తీసుకున్నారు. దాంతో రానున్న రోజుల్లో కొత్త నియామకాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీలో దాదాపు 30శాతం ఉద్యోగుల స్థానంలో ఏఐని తీసుకురానున్నామని చెప్పారు. -
ఐటీ పరిశ్రమకు భారీ షాక్.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్’
కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్లైన్లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో ఉద్యోగాలకు ఏఐ ఎసరుపెడుతుందని, మనిషి అవసరాన్ని తగ్గించేస్తుందన్న బెరుకు వ్యక్తమవుతోంది. ఏఐ ప్రపంచంలో గొప్ప అవకాశాలతోపాటు అనిశ్చితులూ మన కోసం ఎదురుచూస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో కొలువుల కోతపై ఆందోళన నెలకొంది. మనుషులు చేసే ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తుందనే భయాలు టెకీల్లో గుబులు రేపుతున్నాయి. ఏఐ టూల్స్‌తో ఐటీ పరిశ్రమలో సిబ్బంది అవసరాలను 70 శాతం తగ్గించవచ్చని హెచ్‌సీఎల్ మాజీ సీఈవో వినీత్‌నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందో చర్చించారు. ఈ సందర్భంగా ఆటోమేషన్తో మాస్ లేఆఫ్స్ తప్పదని ఆయన హెచ్చరించారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకునే బదులు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచాలని సూచించారు. చాట్‌జీపీటీ, జెమిని, కోపైలట్ వంటి ఏఐ టూల్స్ రాకతో లేటెస్ట్ టెక్నాలజీ టూల్స్‌తో సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళనల మధ్య హెచ్‌సీఎల్ మాజీ సీఈవో వినీత్ నాయర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరిచుకున్నాయి. ఏఐ టూల్స్ కారణంగా కంపెనీల హైరింగ్ అవసరాలు 70 శాతం తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదీ చదవండి: 2జీ, 3జీ, 4జీ, 5జీ.. తరాల్లో మతులబు ఐటీ ఉద్యోగులు చేపట్టే కోడింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్, ట్రబుల్ టికెట్స్ రెస్పాండింగ్ స్కిల్స్‌ను ఏఐ చేపడుతుందని చెప్పారు. ఆపై ఈ నైపుణ్యాలన్నీ వాడుకలో లేనివిగా మారతాయని, ఫలితంగా పెద్దసంఖ్యలో లేఆఫ్స్ చూస్తామని నాయర్ హెచ్చరించారు. అయితే ఏఐకి సూచనలు ఇవ్వాలంటే ఉద్యోగులు అవసరం. కాబట్టి ఆ దిశగా వారికి నైపుణ్యాలు నేర్పాలని తెలిపారు. భారత ఐటీ కంపెనీలకు ఏఐ అపార అవకాశాలు కల్పిస్తుందని వివరించారు.