
ఉద్యోగులకు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ షాకివ్వనుంది. రానున్న వారాల్లో సుమారు 9 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. వారిలో ఏడబ్ల్యూఎస్, అమెజాన్ అడ్వటైజింగ్, ట్విచ్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఇక లేఆఫ్స్‌పై అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపారు. ఆ మెయిల్స్‌లో తొలగింపుల నిర్ణయం కష్టంతో కూడుకున్నది. కానీ సంస్థ దీర్ఘకాలిక విజయాలు సాధించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
18వేల మంది ఉద్యోగుల తొలగింపు
గత ఏడాది నవంబర్ నెలలో అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తొలిసారి ఉద్యోగుల తొలగింపులపై కీలక ప్రకటన చేశారు. అమెజాన్ People eXperience and Technology (PXT)కి చెందిన ఉద్యోగుల్ని స్వచ్ఛందంగా తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా ఈ ఏడాది జనవరిలో 18వేల మందిని ఫైర్ చేసింది. వారి అమెజాన్ స్టోర్, పీఎక్స్‌టీ ఉద్యోగులు ఉన్నారు. ఇక తాజాగా మరో 9 వేల మందిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడం ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.
మెటాలో 10 వేల మంది ఉద్యోగులు
ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాల కారణంగా మెటా 10 వేల మంది సిబ్బందికి పింక్ స్లిప్‌లు జారీ చేస్తున్నట్లు ప్రకటించగా.. తొలిసారి 11వేల మందిని ఫైర్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment