
ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాలతో ప్రపంచ వ్యాప్తంగా చిన్న చితకా కంపెనీల నుంచి టెక్ దిగ్గజ సంస్థల వరకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు వైపు మొగ్గుచూపుతున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గతేడాది నవంబర్ నెలలో 18 వేల మందిని, ఈ ఏడాది మార్చిలో 9,000 మందిని తొలగించింది.
అయితే ఇటీవల రెండో సారి ఉద్యోగుల తొలగింపులు జరిగాయి. లేఆఫ్స్‌పై ప్రకటన చేసి నెల రోజులు అవుతున్నా తాము ఉద్యోగాలు కోల్పోయామని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అలా ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోయిన వారిలో అమెజాన్ హెచ్ ఒకరు. 8 ఏళ్ల పాటు హెచ్‌ఆర్‌గా పనిచేసిన ఓ మహిళా ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ అమెజాన్ మెయిల్ చేసింది.
ఆ మెయిల్‌పై బాధిత మహిళా ఉద్యోగి లింక్డిన్ పోస్ట్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడే లంచ్ చేసిన్ తర్వాత సిస్టమ్ ఆన్ చేశా. కానీ యాక్సెస్ కోల్పోయా. తిండి తిప్పలు మానేసి పని చేసే ఉద్యోగులకు ముందస్తు సమాచారం లేకుండా తొలగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాబు కోల్పోయాక చాలా షాక్‌కి గురైనట్లు లింక్డిన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment