జెఫ్‌బెజోస్ అమెజాన్ పుట్టినిల్లును అమ్మేందుకు సిద్ధమయ్యారు. 1994లో జెఫ్ బెజోస్, ఆయన మాజీ భార్య మెకంజీ స్కాట్‌లు కలిసి అమెరికాలోని సియోటెల్‌లో ఒకే అంతస్తులో మూడు పడకగదుల ఇంటిని అద్దెకు తీసుకున్నారు. దాన్ని కార్యాలయంగా మార్చారు.
అక్కడే అమెజాన్ సంస్థ పురుడు పోసుకుంది. ఆన్‌లైన్‌లో పుస్తకాలు అమ్మేలా ఓ వేదికగా ప్రారంభమై ఇప్పుడు 1.6 ట్రిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలో ఐదవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది.
కాలిఫోర్నియాలోని సన్నీవేల్‌లో ఉన్న జాన్ వైన్‌రైట్ అనే ఆస్ట్రేలియన్ ఐటీ ఉద్యోగికి అమెజాన్ ‘ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అండ్ క్రియేటివ్ అనాలజీస్: కంప్యూటర్ మోడల్స్ ఆఫ్ ది ఫండమెంటల్ మెకానిజమ్స్ ఆఫ్ థాట్’ అనే మొదటి పుస్తకాన్ని అమ్మింది. అనతికాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దాని ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను 1.6 ట్రిలియన్‌లని అంచనా
ఇలా ఎన్నో మైలురాళ్లను తనఖాతాలో వేసుకున్న జెఫ్‌బెజోస్ అమెజాన్ పుట్టినిల్లును అమ్మేందుకు సిద్ధమయ్యారు. 1,540-చదరపు అడుగుల (143-చదరపు మీటర్ల) ఇంటి ప్రస్తుతం ధర 2.3 మిలియన్లగా ఉంది. ఇప్పుడు ఆ ఇంటిని అమ్మేందుకు జెఫ్‌బెజోస్ సిద్ధమవ్వగా.. దాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగులో దారులు ఎగబడుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment