Ecommerce
-
ఈ–కామర్స్ దూకుడు
ఈ–కామర్స్(e-commerce) రంగం ఆకాశమే హద్దుగా విస్తరించనుంది. వచ్చే పదేళ్లలో ఇది 2035 నాటికి నాలుగు రెట్లు పెరిగి 550 బిలియన్ డాలర్లకు (రూ.47.30 లక్షల కోట్లు) చేరుకుంటుందని అనరాక్, ఈటీ రిటైల్ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2024 చివరికి ఇది 125 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. ఏటా 15 శాతం కాంపౌండెడ్ వృద్ధిని చూడనుందని అంచనా వేసింది.ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం విస్తరణ, డిజిటల్ చెల్లింపుల సదుపాయాలు, యువతరం, టెక్నాలజీ తెలిసిన జనాభా ఈ–కామర్స్ వృద్ధికి కీలకంగా పనిచేస్తాయని తెలిపింది. ప్రభుత్వ కార్యక్రమమైన డిజిటల్ ఇండియాతోపాటు లాజిస్టిక్స్, సరఫరా నెట్వర్క్ సదుపాయాల విస్తరణ ఈ వృద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్టు వివరించింది. మెట్రోలతోపాటు చిన్న పట్టణాల్లోనూ పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు ఈ–కామర్స్ సంస్థలు ప్రయత్నం చేస్తున్నట్టు అనరాక్ సీఈవో, ఎండీ అనుజ్ కేజ్రీవాల్ తెలిపారు. మొత్తానికి భారత రిటైల్ మార్కెట్ పరిమాణం 2035 నాటికి 2500 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, 2019 నాటితో పోల్చి చూస్తే మూడు రెట్లు వృద్ధి చెందనుందని చెప్పారు. ఖర్చు చేసే ఆదాయంలో పెరుగుదల, పట్టణీకరణ, పెరుగుతున్న మధ్యతరగతి వర్గీయులు.. ఇవన్నీ రిటైల్ మార్కెట్ విస్తరణకు దోహదం చేసేవిగా ఈ నివేదిక తెలిపింది. 5 స్టార్టప్స్‌లో ఫ్లిప్‌కార్ట్ వెంచర్స్ పెట్టుబడులుఫ్లిప్కార్ట్ లీప్ ఎహెడ్ (ఎఫ్ఎల్ఏ) ప్రోగ్రాంలో భాగంగా మూడో విడత కోసం అయిదు స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ వెంచర్స్ వెల్లడించింది. వీటిలో ఎక్స్పోర్టెల్, ఫ్యాక్టర్స్డాట్ఏఐ, ఎక్స్పర్టియాడాట్ఏఐ, భారత్ కృషి సేవా, వీసా2ఫ్లై ఉన్నాయి. ప్రారంభ దశలో ఉన్న ఈ అంకుర సంస్థలకు ఎఫ్ఎల్ఏ కింద 5,00,000 డాలర్ల వరకు ఈక్విటీ పెట్టుబడులు, మెంటార్íÙప్ లభిస్తాయి. బిజినెస్ మోడల్, వృద్ధి అవకాశాలు, విజన్ తదితర అంశాల ప్రాతిపదికన అంకుర సంస్థలు ఎంపికవుతాయి.ఇదీ చదవండి: ద్వితీయార్ధంలో ఎకానమీ జోరు ఫ్లిప్‌కార్ట్ వెంచర్స్ ఇప్పటివరకు డీప్ టెక్, ఫిన్‌టెక్, హెల్త్ టెక్, జనరేటివ్ ఏఐ తదితర విభాగాల్లో 20 పైచిలుకు స్టార్టప్‌లకు తోడ్పాటునిచ్చింది. ఎక్స్పోర్టెల్ సీమాంతర ఈ–కామర్స్ లాజిస్టిక్స్ సేవల రంగానికి సంబంధించిన అంకుర సంస్థ. ఫ్యాక్టర్స్డాట్ఏఐ అనేది ఏఐ ఆధారిత మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం. ఎక్స్పర్టియాడాట్ఏఐ అనేది ఏజెంటిక్ ఏఐ రిక్రూటింగ్ ప్లాట్‌ఫాం కాగా, భారత్ కృషి సేవా సంస్థ అగ్రిటెక్ స్టార్టప్‌గా, వీసా2ఫ్లై ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫాంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
న్యూ ఇయర్ వేడుకల కోసం భారతీయుల అరాచకం.. ఏం చేశారంటే?
ఢిల్లీ : కొత్త ఏడాది 2025 సందర్భంగా ఆన్లైన్ అమ్మకాలు సరికొత్త రికార్డ్‌లు నమోదు చేశాయి. డిసెంబర్ 31 రోజున ద్రాక్ష నుంచి కండోమ్స్ వరకు.. చిప్స్ ప్యాకెట్ల నుండి హ్యాండ్కఫ్ల వరకు కస్టమర్లు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారని ఫాస్ట్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్‌తో పాటు ఫాస్ట్ డెలివరీ స్టార్టప్‌లు ఆన్లైన్ అమ్మకాల రిపోర్ట్‌ను విడుదల చేశాయి. తమ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌లు మంగళవారం సాయంత్రం 8 గంటల వరకు చిప్స్, కోక్, నామ్కీన్లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు బ్లింకిట్ సహ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాత్రి 8 గంటల వరకు 2.3 లక్షల ప్యాకెట్ల ఆలూ భుజియా, 6,834 ఐస్ క్యూబ్‌ల ప్యాకెట్లను కస్టమర్లకు అందించినట్లు వెల్లడించారు. 39 శాతం చాక్లెట్ ఫ్లేవర్ కండోమ్ విక్రయించగా.. స్ట్రాబెర్రీ 31 శాతం, బబుల్గమ్ 19 శాతం అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. 1,22,356 packs of condoms45,531 bottles of mineral water22,322 Partysmart2,434 Eno..are enroute right now! Prep for after party? 😅— Albinder Dhindsa (@albinder) December 31, 2024 నిన్న కస్టమర్లు ద్రాక్ష పండ్లను ఎక్కువ మొత్తంలో ఆర్డర్ పెట్టడంపై దిండా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఈరోజు ద్రాక్ష పండుకు ఇంత క్రేజ్ ఏంటి? ఉదయం నుండి ప్లాట్‌ఫారమ్‌లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువులలో ఇదొకటి!’అని ట్వీట్లో పేర్కొన్నారు.అదే సమయంలో మంగళవారం సాయంత్రం 7:30ల వరకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నిమిషానికి 853 చిప్స్ ప్యాకెట్లను, బ్లైండ్ఫోల్డ్స్, హ్యాండ్కఫ్లను డెలివరీ చేసింది. 7:41కి ఐస్ క్యూబ్స్ ఊహించని స్థాయిలో ఆర్డర్లు వచ్చాయని, కేవలం నిమిషం వ్యవధిలో 119 కిలోలు ఐస్ క్యూబ్స్‌ను డెలివరీ చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కోఫౌండర్ ఫణి కిషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిగ్‌బాస్కెట్‌లో కూల్‌డ్రింగ్స్ ఆర్డర్లు 552 శాతానికి చేరుకున్నాయి. డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్ల అమ్మకాలు 325 శాతం, పచ్చిక కార్పెట్, మాక్ టెయిల్ విక్రయాలు 200 శాతం పెరిగాయి.https://t.co/ookPgwMqg3 pic.twitter.com/oUViC73eGS— Albinder Dhindsa (@albinder) December 31, 2024 న్యూఇయర్‌లో జరిగిన ఆన్లైన్ అమ్మకాలతో కోవిడ్-19 రాకతో వినియోగదారుల అభిరుచి మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్విక్ కామర్స్ సంస్థల రాకతో సంప్రదాయ ఆఫ్‌లైన్ షాపుల్లో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టింది. నిమిషాల్లో డెలివరీతో బిజినెస్ స్ట్రాటజీ మెట్రో నగరాలను దాటి టైర్-2, టైర్-3 నగరాలకు పాకింది. ఫలితంగా వినియోగదారులు ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లో కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్ పెట్టుకుంటున్నట్లు తాజాగా, క్విక్ కామర్స్ డెలివరీ రిపోర్ట్‌లతో తేలింది. -
త్వరలో ఈ–కామర్స్ ఎగుమతి హబ్‌లు
దేశంలో ఈ–కామర్స్ ఎగుమతి హబ్‌లను ఏర్పాటు చేసేందుకు డీహెచ్ఎల్, లెక్స్షిప్ సహా కొత్తగా అయిదు సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయిదింటిలో మూడు దరఖాస్తులను షార్‌లిస్ట్ చేసినట్లు, వీటిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు హబ్‌లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలో రాగలవని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని వివరించారు.కస్టమ్స్, సెక్యూరిటీ క్లియరెన్స్ మొదలైనవి వేగవంతం చేసేందుకు ఇందులో సదుపాయాలు ఉంటాయి. అలాగే నాణ్యత, సర్టిఫైయింగ్ ఏజెన్సీలు కూడా ఉంటాయి. హబ్‌లను నెలకొల్పిన సంస్థల స్పందనను బట్టి దేశవ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం సవివరంగా మార్గదర్శకాలను రూపొందిస్తుందని అధికారి పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అగ్రిగేటర్ సంస్థ షిప్‌రాకెట్, ఎయిర్‌కార్గో హ్యాండ్లింగ్ కంపెనీ కార్గో సర్వీస్ సెంటర్లను (సీఎస్సీ) ఇప్పటికే పైలట్ ప్రాతిపదికన ప్రభుత్వం ఎంపిక చేసింది.ఇదీ చదవండి: వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..2030 నాటికి ఈ–కామర్స్ ఎగుమతులు 100 బిలియన్ డాలర్లకు చేరవచ్చని, రాబోయే రోజుల్లో 200–250 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే, ప్రస్తుతం 800 బిలియన్ డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ఈ–కామర్స్ ఎగుమతులు 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ–కామర్స్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనాలో ఎక్స్పోర్ట్ హబ్‌లు గణనీయంగా ఉన్నాయి. -
కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!
క్విక్ కామర్స్ ప్రముఖ ఎఫ్ఎంసీజీలకు కిక్కెక్కిస్తోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీల మొత్తం ఆన్లైన్ అమ్మకాల్లో క్విక్‌కామర్స్ విక్రయాలు రెండు రెట్లు పెరిగినట్టు డెలాయిట్, ఫిక్కీ సంయుక్త నివేదిక వెల్లడించింది. పట్టణ వినియోగదారులకు క్విక్‌కామర్స్ ప్రాధాన్య ఛానల్‌గా మారుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దీంతో ఎఫ్ఎంసీజీ ఆన్లైన్ విక్రయాల్లో క్విక్ కామర్స్ విభాగం వాటా 35 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..18 శాతానికి పైగా వినియోగదారులు ఆహారం, పానీయాలను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. 2021 నుంచి 2023 నాటికి క్విక్ కామర్స్ మార్కెట్ 230% పెరిగింది. మరుసటి రోజు డెలివరీ చేసే సంప్రదాయ ఆన్లైన్ గ్రోసరీ సంస్థల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ సంస్థలు కొల్లగొడుతున్నాయి. రానున్న రోజుల్లో క్విక్ కామర్స్ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈ–కామర్స్‌ను ప్రధాన ఛానల్‌గా మారుస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల వాటా 17 శాతానికి చేరింది. సంపన్న వినియోగదారులు ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. గొప్ప సౌకర్యం, విస్తృత ఉత్పత్తుల శ్రేణి, పోటీతో కూడిన ధరలు ఆకర్షిస్తున్నాయిఇదీ చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరంఫుడ్, బెవరేజెస్..ఫుడ్, బెవరేజెస్ కోసం సంప్రదాయ ఈ–కామర్స్ ఛానళ్ల కంటే క్విక్ కామర్స్ సంస్థల్లో ఆర్డర్ చేసేందుకే కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి తక్షణ అవసరాల కోసం ఉద్దేశించినవిగా డెలాయిట్, ఫిక్కీ నివేదిక పేర్కొంది. అదే సౌందర్య, గృహ ఉత్పత్తులు తక్షణ అవసరమైనవి కావకపోవడంతో, వీటిని ఈ–కామర్స్ వేదికలపై ఆర్డర్ చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు వెల్లడించింది. చిన్న కుటుంబాలు, భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు కావడం క్విక్ కామర్స్‌కు డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. -
‘పది కోట్లమంది ప్రయోజనాలు కాపాడుతాం’
ఆన్లైన్ వ్యాపారానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది చిరు వ్యాపారుల ప్రయోజనాలు కాపాడతామన్నారు. ‘యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్’ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.‘దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 10 కోట్ల చిరు వ్యాపారుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ కామర్స్ కంపెనీల పోటీకి ఇప్పటికే అమెరికాలో చిన్న వ్యాపారులు కనుమరుగయ్యారు. భారత్‌లోనూ ఈ ప్రమాదం ఉంది. కానీ కేంద్రం స్పందించి చర్యలు తీసుకుంటోంది. 14 కోట్ల మంది భారతీయ రైతులు, వారి కుటుంబాలు, తమ పిల్లల భవిష్యత్తు కోసం, 140 కోట్ల భారతీయుల ఆంకాక్షలు నెరవేర్చడానికి యూఎస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కీలక ఖనిజాల విషయంలో ఇరు దేశాలకు ఆందోళనలు ఉన్నాయి. ఈ విభాగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా చర్యలు చేపడుతున్నాం’ అని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: రెండేళ్లలో రూ.ఆరు వేలకోట్లకు..ఆన్లైన్ వ్యాపార ధోరణిపై మంత్రి ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ-కామర్స్ సంస్థలు పుట్టుకురావడం గొప్ప విషయంగా భావించకూడదన్నారు. ఆ సంస్థలు ధరల విషయంలో పోటీ పడేందుకు విభిన్న మార్గాలు అనుసరిస్తున్నారని చెప్పారు. దాంతో రిటైల్ వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటున్నారని వివరించారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించి త్వరలో కొత్త పాలసీ తీసువస్తుందని స్పష్టం చేశారు. -
ఈ కామర్స్ ఎగుమతులకు అడ్డంకులు..!
ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఎగుమతులకు భారీ అవకాశాలున్నాయని, ఈ దిశగా ఉన్న అడ్డంకులను తొలగించాలని ఈవై–అసోచామ్ నివేదిక సూచించింది. కస్టమ్స్ ప్రక్రియలను సులభంగా మార్చడం, పటిష్ఠ చెల్లింపుల యంత్రాంగం, ఈ-కామర్స్ సంస్థలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడం ద్వారా ఎగుమతులకు ప్రోత్సాహం అందించాలని తెలిపింది.ఎఫ్‌డీఐ మద్దతుతో నడిచే ఈ-కామర్స్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తుల ఇన్వెంటరీ (నిల్వ)కి అనుమతించాలని, అది భారత ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల అంతర్జాతీయ విక్రయాలకు మద్దతునిస్తుందని నివేదిక పేర్కొంది. 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో ఈ-కామర్స్ రూపంలో 200–300 బిలియన్ డాలర్లు సాధించాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం సాధించాలంటే ప్రస్తుత ఎగుమతులు 50–60 రెట్లు పెరగాల్సి ఉంటుందని ఈ నివేదిక గుర్తు చేసింది.ఇదీ చదవండి: భారత్‌లో ఐప్యాడ్ తయారీ..?2022–23లో ఈ–కామర్స్ వేదికల ద్వారా చేసే ఎగుమతులు 4–5 బిలియన్ డాలర్లు(రూ.41 వేలకోట్లు)గా ఉన్నాయి. ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో ఒక శాతంలోపే కావడం గమనార్హం. సంక్లిష్ట కస్టమ్స్ విధానాలు, స్వదేశానికి చెల్లింపుల పరంగా సవాళ్లు, నియంత్రిత విధానాలు ఈ-కామర్స్ ఎగుమతులకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. వీటిని సరళీకరించాని ఈవై అసోచామ్ నివేదిక సూచిస్తుంది. ఎగుమతులకు సంబంధించి విధానాల్లో మార్పులు అవసరమని తెలిపింది. ఈకామర్స్ ఎగుమతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను పెంచాలని పేర్కొంది. -
ఆన్లైన్లో ఎయిర్ ప్రైయర్ బుక్ చేస్తే బల్లిని డెలివరీ చేశారేంటి!
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇన్నిరోజులు ఫుడ్ ఆర్డర్ పెడితే ఇటుక బిళ్లలు రావడం, ఫోన్ ఆర్డర్ పెడితే ధర్మకోల్ షీట్లు రావడం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అదే ఆన్లైన్లో ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెడితే బల్లులు ప్రత్యక్షమవుతున్నాయి.దక్షిణ అమెరికాకు చెందిన సోఫియా సెరానో అనే మహిళ ఎయిర్ ప్రైయర్ను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ రానే వచ్చింది. వెంటన్ ఎయిర్ ఫ్రైయర్ ఎలా ఉందోనని పరిశీలించేందుకు పార్శిల్ తెరిచి చూసింది. అంతే పార్శిల్ లోపల ఉన్న బల్లిని చూసి వణికిపోయింది. వెంటనే తనకు ఎదురైన చేదు అనుభవంపై స్పందించింది.అమెజాన్ పంపిన పార్శిల్ లోపల ఉన్న బల్లి ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను అమెజాన్‌లో ఎయిర్ ఫ్రైయర్ కోసం ఆర్డర్ పెట్టా. కానీ పార్శిల్లో బల్లి వచ్చింది. ఇది అమెజాన్ సంస్థ తప్పా లేదంటే కొరియర్ సంస్థది తప్పా అనేది తెలియదు’అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌పై అమెజాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. Pedimos una air fryer por Amazon y nos llegó con un acompañante 🙄 no sé si fue culpa de Amazon o la transportadora … buenos días! pic.twitter.com/BgYDi4qUev— Sofia Serrano (@sofiaserrano97) July 18, 2024కాగా, అమెజాన్ పంపిన పార్శిల్లో బల్లి ఉండడంపై పలువురు నెటిజన్లు పలు జాగ్రత్తలు చెబుతున్నారు. ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేసిన వస్తువు పార్శిల్ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేసే సమయంలో వీడియో తీయడం మంచిది. అలా వీడియో తీయడం వల్ల మీరు పెట్టిన ఆర్డర్ ఒకటైతే..మీకు వచ్చిన వస్తువు మరొకటి అయినప్పుడు.. సదరు ఈకామర్స్ సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు, తగిన నష్ట పరిహారం పొందేందుకు సులభతరం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. -
మరో బిజినెస్‌లోకి అదానీ గ్రూప్.. గూగుల్, అంబానీకి చెక్ పెట్టేనా?
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఊహించని విధంగా వృద్ది సాధిస్తోన్న ఈ-కామర్స్,పేమెంట్స్ విభాగంలో అడుగుపెట్టనుంది. దీంతో అదే రంగంలో మార్కెట్‌ను శాసిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్, మరో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి గట్టి పోటీ ఇవ్వనుందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఇప్పటికే అందుకు కావాల్సిన లైసెన్స్ కోసం అప్లయి చేసినట్లు సమాచారం. ఆ లైసెన్స్ యూపీఐ వంటి చెల్లింపులతో పాటు, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు పలు బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ చర్చలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..తన సేవలు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా అదానీ గ్రూప్ ప్రభుత్వ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) చర్చలు జరుపుతోంది.చర్చలు సఫలమైందే అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ వన్ యాప్‌లో ఓఎన్డీసీ వినియోగదారులకు సేవలు అందుతాయి. ఓఎన్డీసీలో ఏదైనా కొనుగోలు చేసిన యూజర్లు అదానీ వన్ ద్వారా పలు ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ఈ యాప్ యూజర్లకు హోటల్, ఫ్లైట్ రిజర్వేషన్‌తో సహా ఇతర ట్రావెల్ సంబంధిత సేవల్ని వినియోగించడం ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు -
ఈ-కామర్స్ రంగంపై గూగుల్ కన్ను.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ పెట్టుబడులు
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ భారత్ ఈ-కామర్స్ రంగంపై కన్నేసింది. దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 350 మిలియన్ డాలర్ల విలువైన మైనారిటీ వాటాను కొనుగోలు చేయనుందని సమాచారం. ఫ్లిప్‌కార్ట్ విలువ 37 బిలియన్ డాలర్లు.అయితే ఈ కొనుగోలుపై గూగుల్,ఫ్లిప్‌కార్ట్ స్పందించలేదు. కానీ వాటా కొనుగోలుపై రెగ్యులరేటరీ నుంచి ఆ రెండు సంస్థలు అనుమతులు తీసుకున్నాయంటూ జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.గూగుల్ తన పెట్టుబడితో ఫ్లిప్‌కార్ట్ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు, దేశ వ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించేందుకు, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో సహాయపడతాయి అని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.రీసెర్చ్ సంస్థ రెడ్ సీర్ అంచనాల ప్రకారం.. భారతదేశ ఈ-కామర్స్ మార్కెట్ 2023లో 60-65 బిలియన్ల నుండి 2030 నాటికి 200-230 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఈ తరుణంలో బడాబడా కంపెనీలు భారత్ ఈ-కామర్స్ రంగంపై దృష్టి సారించాయి. తమ సేవల్ని విస్తరించనున్నాయి. బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు, తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా లభ్యంతో ఈకామర్స్ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఫలితంగా 800 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు, బ్లింకిట్, మీషో, నైకా వంటి ఇతర సెగ్మెంట్లోని ఈ-కామర్స్ సంస్థల వ్యాపారం జోరుగా సాగుతోంది. -
అమెజాన్ సేల్‌లో ఆఫర్ల జాతర.. 95 శాతం వరకు డిస్కౌంట్
కొనుగోలు దారులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లపై 95 శాతం, బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌పై 95శాతం, ఇయర్ఫోన్లపై 95శాతం, నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌పై 95 శాతం డిస్కౌంట్ పొందవచ్చారు.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024తో ప్రారంభమైన ఈ సేల్‌లో అన్నీ రకాల ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు రూ.15,000, రూ.25,000 సెగ్మెంట్ ధరల్లో ఉన్న ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను కొనుగోలు దారులు సొంతం చేసుకోవచ్చంటూ అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.మే 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై మే 7 వరకు కొనసాగుతున్న ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ శాంసంగ్, షావోమీ, వన్‌ప్లస్‌తో పాటు ఇతర ఫోన్లపై తగ్గింపు ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కొనుగోలు దారులకు కల్పిస్తుంది. ఈ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, లార్జ్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్లుతో వస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.మీరు ఐసీసీఐ, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు.దీంతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, కూపన్లు వినియోగించుకోవచ్చని అమెజాన్ వెల్లడించింది. -
‘టాటా కంపెనీ ..ఇలా చేస్తుందనుకోలేదు’.. తస్మాత్ జాగ్రత్త!
ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్‌తో కొనుగోలు దారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ల్యాప్ ట్యాప్ ఆర్డర్ పెడితే ఇటు రాయి పంపండం. ఖరీదైన షూ కొనుగోలు చేస్తే చెప్పులు డెలివరీ చేయడం లాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. దీంతో చేసేది లేక కస్టమర్లు సదరు ఈకామర్స్ కంపెనీని డబ్బుల్ని రిఫండ్ చేయమని కోరడం, లేదంటే ప్రొడక్ట్ ఎచ్ఛేంజ్ చేయమని కోరుతుంటుంటాం. ఓ యూజర్ టాటా క్లిక్ లగ్జరీ కంపెనీ నుంచి స్నీకర్లను ఆర్డర్ పెడితే.. చెప్పుల్ని అందుకున్నాడు. దీంతో తాను ఖరీదైన షూ ఆర్డర్ పెడితే చెప్పులు ఎలా పంపిస్తారు? అని ప్రశ్నించాడు. తాను చెల్లించిన డబ్బుల్ని రిఫండ్ చేయమని కోరాడు. అందుకు టాటాక్లిక్ లగ్జరీ ప్రతినిధులు చేసిన తప్పుకు చింతిస్తున్నాం. కానీ డబ్బుల్ని రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. దీంతో చేసేది లేక బాధితుడు ఎక్స్. కామ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశారు. పైగా కంపెనీ గురించి సోషల్ మీడియాలో బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదంటూ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. Tata Cliq Luxury is out here defrauding customers of their hard-earned money. I've lost my money, but pls save yourselves from being scammed. I ordered New Balance sneakers, they sent a pair of slippers, now refusing to refund money saying quality check failed @TATACLiQLuxury pic.twitter.com/6ktajmB8r7 — Ripper (@Ace_Of_Pace) March 7, 2024 ఖరీదైన షూ బదులు చెప్పులు వినియోగదారుడు టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ.22,999 ఖరీదైన ‘న్యూ బ్యాలెన్స్ 9060 గ్రే & బ్లూ స్నీకర్స్’ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అతను మాత్రం ఊహించని విధంగా స్టైలిష్ షూస్ బదులు సాధారణ స్లిప్పర్లను అందుకున్నాడు.ఎక్ఛేంజ్ చేయమని ఫిర్యాదు చేసినప్పటికీ టాటా క్లిక్ లగ్జరీ రిఫండ్ చేసేందుకు ఒప్పుకోలేదని, టాటా కంపెనీ ఇలా చేస్తుందను కోలేదని వాపోయాడు. తస్మాత్ జాగ్రత్త ‘టాటా క్లిక్ లగ్జరీ కస్టమర్లను మోసం చేస్తోంది. నేను నా డబ్బును పోగొట్టుకున్నాను. దయచేసి మీరు ఇలాంటి స్కామ్‌ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నేను కొత్త బ్యాలెన్స్ స్నీకర్లను ఆర్డర్ చేసాను. వారు ఒక జత చెప్పులు పంపారు. నాణ్యతలో రాజీపడమని, కావాలంటే తనిఖీ చేయమని చెప్పింది. డబ్బు రిఫండ్ చేసేందుకు నిరాకరించారు.’ అని వినియోగదారు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. Your disappointment with our products and services hurts us the most, and we deeply apologize for the hassle it has caused you. We request you to share the order details via the below DM link, so we can check and provide further assistance. ^AB (1/2) — TATA CLiQ Luxury (@TATACLiQLuxury) March 7, 2024 దీంతో ‘మా ఉత్పత్తులు, సేవల పట్ల అసంతృప్తిగా ఉండడం మమ్మల్ని బాధిస్తుంది. మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. ఆర్డర్ వివరాల్ని పంపినట్లైతే త్వరలోనే మీకు న్యాయం చేస్తామనంటూ టాటా క్లిక్ లగర్జీ అధికారికంగా తెలిపింది. -
దిగ్గజ సంస్థలో చీలిక.. కోఫౌండర్ కొత్త కంపెనీ..!
ఈ-కామర్స్ వ్యాపారంలో ఫ్లిప్‌కార్ట్ అగ్రగామిగా దూసుకెళ్తోంది. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ గతంలోనే ఫ్లిప్‌కార్ట్‌లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ పూర్తిగా వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కంపెనీను విడిచి బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త కంపెనీ పెడుతున్నట్లు బిన్నీ ఇప్పటికే చెప్పారు. జనవరి 2024 ప్రారంభంలో ఆయన తన కొత్త కంపెనీ ‘ఆప్‌డోర్’ OppDoorను ప్రకటించారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ కంపెనీల అభివృద్ధి, విస్తరణకు ఎండ్ టూ ఎండ్ సోల్యూషన్స్‌ను అందించనుందని తెలిసింది. ‘ఆప్‌డోర్’ మొదట యూఎస్, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, సింగపూర్, జపాన్ , ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ-కామర్స్ కంపెనీలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: బిన్నీ బన్సల్ కూడా.. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫౌండర్లు ఇద్దరూ అవుట్! ఫ్లిప్‌కార్ట్ మరో కోఫౌండర్ సచిన్ బన్సాల్ నవీ అనే ఫిన్‌టెక్ వెంచర్ ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల కిందటే ఫ్లిప్‌కార్ట్‌ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత 16 సంవత్సరాలుగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల బిన్నీ బన్సల్ గర్వాన్ని వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కంపెనీ బలమైన స్థానంలో ఉందన్నారు. -
అమ్మకానికి అమెజాన్ పుట్టినిల్లు.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం!
జెఫ్‌బెజోస్ అమెజాన్ పుట్టినిల్లును అమ్మేందుకు సిద్ధమయ్యారు. 1994లో జెఫ్ బెజోస్, ఆయన మాజీ భార్య మెకంజీ స్కాట్లు కలిసి అమెరికాలోని సియోటెల్‌లో ఒకే అంతస్తులో మూడు పడకగదుల ఇంటిని అద్దెకు తీసుకున్నారు. దాన్ని కార్యాలయంగా మార్చారు. అక్కడే అమెజాన్ సంస్థ పురుడు పోసుకుంది. ఆన్లైన్లో పుస్తకాలు అమ్మేలా ఓ వేదికగా ప్రారంభమై ఇప్పుడు 1.6 ట్రిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలో ఐదవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. కాలిఫోర్నియాలోని సన్నీవేల్లో ఉన్న జాన్ వైన్‌రైట్ అనే ఆస్ట్రేలియన్ ఐటీ ఉద్యోగికి అమెజాన్ ‘ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అండ్ క్రియేటివ్ అనాలజీస్: కంప్యూటర్ మోడల్స్ ఆఫ్ ది ఫండమెంటల్ మెకానిజమ్స్ ఆఫ్ థాట్’ అనే మొదటి పుస్తకాన్ని అమ్మింది. అనతికాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దాని ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ను 1.6 ట్రిలియన్లని అంచనా ఇలా ఎన్నో మైలురాళ్లను తనఖాతాలో వేసుకున్న జెఫ్‌బెజోస్ అమెజాన్ పుట్టినిల్లును అమ్మేందుకు సిద్ధమయ్యారు. 1,540-చదరపు అడుగుల (143-చదరపు మీటర్ల) ఇంటి ప్రస్తుతం ధర 2.3 మిలియన్లగా ఉంది. ఇప్పుడు ఆ ఇంటిని అమ్మేందుకు జెఫ్‌బెజోస్ సిద్ధమవ్వగా.. దాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగులో దారులు ఎగబడుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
ఉడాన్‌లో కీలక పరిణామం..ఇంటర్ గ్లోబ్ సీఈఓగా ఆదిత్య పాండే
ప్రముఖ బీ2బీ ఈకామర్స్ కంపెనీ ఉడాన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆదిత్య పాండే ఆ సంస్థకు రాజీనామా చేశారు. తాజాగా పాండే ఏవియేషన్ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ సీఈఓ నియమితులయ్యారు. మార్చి 1, 2024 నుండి విధులు నిర్వహించనున్నారు. గతంలో ఇండిగోలో పనిచేసిన అనుభవం కారణంగా ఇంటర్‌గ్లోబ్ యాజమాన్యం సీఈఓగా కీలక బాధ్యతలు అప్పగించింది. వ్యూహాత్మక వ్యాపారం, కార్పొరేట్ సిబ్బంది విధులను పర్యవేక్షించడం, బలోపేతం చేయడం వంటి బాధ్యతలు చూసుకోనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పాండే ప్రొడక్టివీటీ, ప్రాఫిట్ వంటి విభాగాల్లో దృష్టిసారిస్తూ వివిధ కంపెనీలలో వ్యాపార వ్యూహం, ఆర్ధిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. గతంలో పాండే దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఉడాన్‌లో చేరారు. తాజాగా ఉడాన్ నుంచి ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ సీఈఓగా పదోన్నతి సాధించారు. ఇక,ఉడాన్‌లో పాండే స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనే విషయం వెలుగులోకి రావాల్సి ఉండగా.. బదులుగా ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అదనపు ఫైనాన్స్ బాధ్యతలను అప్పగించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
‘ఆన్లైన్ షాపింగ్ చేయొద్దనేది ఇందుకే’..కళ్లు బైర్లు కమ్మేలా
ఆన్లైన్లో ల్యాప్‌ట్యాప్ కొనుగోలు చేసిన ఓ వినియోగదారుడికి ఫ్లిప్‌కార్ట్ ఝలక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యూజర్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.1.13 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేశాడు. బదులుగా ఫ్లిప్‌కార్ట్ తనకు పాత, డొక్కు ల్యాప్‌ట్యాప్‌ను పంపిందని వాపోయాడు. ఇలాంటి చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నప్పుడే ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే బయపడాల్సి వస్తుందని అంటున్నాడు. ‘రిపబ్లిక్ డే సేల్‌లో లక్షకు పై ధరలో ఫ్లిప్‌కార్ట్‌లో ఆసుస్ ల్యాప్‌టాప్‌ని ఆర్డర్ చేశాను. కానీ ఫ్లిప్‌కార్ట్ నాకు పాత ల్యాప్‌ట్యాప్‌ను పంపింది. అందుకే ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ నుండి ఆర్డర్ చేసిన ప్రొడక్ట్‌లను నమ్మకండి అంటూ బాధితుడు సౌరో ముఖర్జీ వీడియోను ఎక్స్.కామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌరౌ ముఖర్జీ జనవరి 13న రూ.1.13లక్షలు విలువ చేసే ల్యాప్‌ట్యాప్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. మరుసటి రోజే ల్యాప్‌ట్యాప్ చేతికి వచ్చింది. వెంటనే సౌరౌ తాను పార్శిల్‌ను ఓపెన్ చేస్తానని, వీడియో తీయాలని సదరు డెలివరీ బాయ్‌ను కోరాడు. చెప్పినట్లుగానే డెలివరీ బాయ్ పార్శిల్‌ను వీడియో తీస్తుంటే ముఖర్జీ దానిని ఓపెన్ చేసి చూస్తాడు. పార్శిల్ ఓపెన్ చేసిన అతనికి కళ్లు బైర్లు కమ్మేలా.. తాను ఖరీదైన ల్యాప్‌ట్యాప్ బుక్ చేస్తే..మట్టికొట్టుకుపోయిన పాత ల్యాప్‌ట్యాప్ వచ్చినట్లు గుర్తిస్తాడు. ల్యాప్‌ట్యాప్ ఓపెన్ చేసి నేను బ్లాక్ ల్యాప్‌టాప్‌ని ఆర్డర్ పెట్టాను’ అని ముఖర్జీ వీడియోలో చెబుతుంటే పక్కనే ఉన్న డెలివరీ ఏజెంట్ మాటకలుపుతూ ఇది ఉపయోగించిన ల్యాప్ట్యాప్లా ఉందని అని అంటున్న సంభాషణలు స్పష్టంగా వినపడుతున్నాయి. I ordered a brand new Asus Laptop from Flipkart in this Republic Day sale and I received some old discarded laptop. Never trust products ordered from online platforms. @flipkartsupport @Flipkart #flipkartscam pic.twitter.com/EMEBBhnh2V — Souro Mukherjee (Gutenberg) (@souro9737) January 14, 2024 ఇక ల్యాప్‌ట్యాప్ పార్శిల్ ఓపెన్ చేసిన అనంతరం ఆన్లైన్లో మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే ఇలా వీడియోలు తీసుకోవడం మంచిదని, నకిలి పార్శిళ్ల నుంచి సురక్షితంగా ఉంచేలా అవి మనల్ని కాపాడుతాయని అని అన్నాడు. ఇక తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులకు ఎక్స్.కామ్‌లో ట్యాగ్ చేశాడు. కొత్త ల్యాప్‌ట్యాప్‌ను కొనుగోలు చేసే పాత ల్యాప్‌ట్యాప్‌ను పంపారని మెసేజ్ చేయగా.. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. సంబంధిత వివరాల్ని పంపమని మెసేజ్ చేసింది. -
లాభాలు లేక చేతులెత్తేసిన అమెజాన్.. మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కొత్త ఏడాది 2024లో చేతులెత్తేసింది. ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగుల్ని తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ పేరెంట్ కంపెనీ వీడియో లైవ్ స్ట్రీమ్ సర్వీసులు అందించే ‘ట్విచ్’ ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..అమెజాన్ ట్విచ్‌లో 35 శాతంతో 500 మంది ఉద్యోగల తొలగింపులపై నిర్ణయం తీసుకుంది. వీడియో లైవ్ స్ట్రీమ్ సేవలు మరింత ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ సైతం ట్విచ్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగులు ఒక్కొక్కరిగా సంస్థను వదిలి వెళ్లిన తర్వాత తెరపైకి రావడం చర్చాంశనీయంగా మారింది. ఒక్కొక్కరిగా గత ఏడాదిలో ట్విచ్‌లో టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు ఆ సంస్థకు గుడ్‌బై చెప్పారు. వారిలో ట్విచ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, చీఫ్ కస్టమర్ ఆఫీసర్, చీఫ్ కంటెంట్ ఆఫీసర్‌తో పాటు గతంలో అమెజాన్ యాడ్స్ యూనిట్లో పనిచేసిన చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ సైతం ట్విచ్‌కు రాజీనామా చేశారు. తాజాగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. కారణం అదే డిసెంబర్లో ట్విచ్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ క్లాన్సీ దక్షిణ కొరియాలో కంపెనీ కార్యకలాపాలను నిలిపివేస్తుందని, పెరిగిపోతున్న ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పెట్టుబడులు ఎక్కువ పెట్టడం.. తిరిగి రాబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఉద్యోగుల్ని తొలగించింది.ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ‘‘ట్విచ్ నెలకు 1.8 బిలియన్ గంటల ప్రత్యక్ష వీడియో కంటెంట్‌కు సపోర్ట్ చేసేలా భారీ స్థాయిలో వెబ్సైట్లను నిర్వహించడం చాలా ఖరీదైనవని అన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అమెజాన్ 2014లో వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు అందించే ట్విచ్‌ను 970 మిలియన్ డాలర్లను వెచ్చించి ఆ సంస్థను కొనుగులో చేసింది. ఈ కొనుగోలు జరిగిన తొమ్మిదేళ్లకు ట్విచ్‌తో పాటు లాభదాయకంగా లేదని ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఏమాత్రం లాభం లేని ట్విచ్‌లో నష్టాల్ని తగ్గించుకునేందుకు అమెజాన్ గత ఏడాది రెండు సార్లు 400 మందిని తొలగించింది. తాజాగా మరో 500 మందిని ఇంటికి పంపింది. అమెజాన్‌లో 27 వేల మంది ఉద్యోగులు ఆన్లైన్ రిటైల్ దిగ్గజం 2022లో ప్రపంచ వ్యాప్తంగా 27వేల మందికి ఫైర్ చేసిన విషయం తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు బంపరాఫర్!
వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. ఫ్లిప్‌కార్ట్ తర్వలో ఈ ఏడాది తన తొలి ప్రత్యేక సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14 నుంచి జనవరి 19 వరకు కొనసాగనుంది. ఇక ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12, పిక్సెల్ 7ఏ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 5జీ, పిక్సెల్ 8, వివో టీ2 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో, వివో టీ2ఎక్స్, పోకో ఎక్స్ 5, రియల్ మీ 11, రెడ్మీ 12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్ 15పై డిస్కౌంట్ ఇస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.79,900 నుండి ఉండగా ఫ్లిప్‌కార్ట్ రూ.72,999కే అమ్ముతుంది. విజయ్ సేల్స్ ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 70,900కి అమ్ముతుంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు పొందవచ్చు. తద్వారా దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై కూడా వరుసగా 75 శాతం, 65 శాతం తగ్గింపు ఉండనుంది. ఈ డిస్కౌంట్లపై ఫ్లిప్‌కార్ట్ మరిన్ని వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. -
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో డిస్కౌంటే డిస్కౌంట్లు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారత్‌లో రిపబ్లిక్‌డేని పురస్కరించుకొని గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Great Republic day Sale)ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రతి ఏడాది రిపబ్లిక్ డేకి కొన్ని రోజుల ముందు ప్రారంభమయ్యే సేల్‌లో భాగంగా అమెజాన్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆడియో ప్రొడక్ట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా అనేక రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్‌లో కస్టమర్లు అర్హులైన బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం ఎప్పుడనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే గతేడాది ఈ సేల్ జనవరి 15న ప్రారంభమైంది. ఈ ఏడాది సైతం సేల్ అప్పుడే ప్రారంభమవుతుందని యూజర్లు భావిస్తున్నారు. 50 వేల వరకు డిస్కౌంట్ రాబోయే సేల్‌లో అమెజాన్ స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 5జీ స్మార్ట్ఫోన్లు ప్రారంభ ధర రూ. 9,999కే అమ్ముతుండగా.. పలు ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై రూ.50వేల వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. 75 శాతం.. 65 శాతం డిస్కౌంట్ అదేవిధంగా, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు 75 శాతం వరకు, స్మార్ట్ టీవీలు, ఇతర ఉపకరణాలను 65 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లతో పాటు, ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు అని అమెజాన్ తెలిపింది. -
రూ.2800 కోట్లు సమీకరించినా ఉద్యోగుల తొలగింపు.. కారణం ఇదేనా..
ఈ-కామర్స్ యునికార్న్ ఉడాన్ రూ.2800 కోట్ల మూలధనాన్ని సమీకరించిన తర్వాత తాజాగా 150 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ఉడాన్ తన సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి, తాజా నిధులతో ఇతర సంస్థలతో తమ భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రణాళిక వేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు కంపెనీలోని ఎఫ్ఎంసీజీ బృందం దేశవ్యాప్తంగా పనిచేసేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కానీ ప్రస్తుతం క్లస్టర్ వారీగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు కంపెనీ ఒక నివేదికలో తెలిపింది. కొన్ని సంవత్సరాలుగా స్థిరమైన వ్యాపారాన్ని నిర్మించడానికి భారీగా పెట్టుబడులు పెట్టామని, వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడానికి, స్థిరంగా వృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే అందులో భాగంగా కంపెనీ ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కంపెనీ తాజాగా నవంబర్‌లో రూ.990 కోట్లమేర కన్వర్టబుల్ నోట్లను సేకరించిన తర్వాత ఉడాన్ 10 శాతం ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. కంపెనీ కార్యకలాపాల్లో వస్తున్న మార్పుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2800 కోట్లమేర నిధులు సమీకరించింది. గతేడాది జూన్ నుంచి నవంబర్ వరకు 500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. ఇదిలా ఉండగా 2025లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)గా స్టాక్మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉడాన్‌ను 2016లో ముగ్గురు ఐఐటీ పూర్వ విద్యార్థులు అమోద్ మాల్వియా, సుజీత్ కుమార్, వైభవ్ గుప్తా స్థాపించారు. వీరు గతంలో ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేశారు. -
ఉడాన్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: బీటూబీ ఈకామర్స్ సంస్థ(ప్లాట్‌ఫామ్) ఉడాన్ తాజాగా 34 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,822 కోట్లు) సమీకరించింది. సిరీస్–ఈ ఫండింగ్‌లో భాగంగా ఎంఅండ్‌జీ పీఎల్సీ అధ్యక్షతన పలు పీఈ సంస్థలు పెట్టుబడులను సమకూర్చాయి. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, డీఎస్టీ గ్లోబల్ సైతం నిధులు సమకూర్చాయి. బిజినెస్ నిర్వహణకు అవసరమైన పూర్తిస్థాయి పెట్టుబడులను సమకూర్చుకోవడంతో రానున్న 12–18 నెలల్లో లాభాల్లోకి ప్రవేశించే లక్ష్యంతో సాగుతున్నట్లు ఈ సందర్భంగా ఉడాన్ తెలియజేసింది. ప్రస్తుత రుణాలను ఈక్విటీగా మార్పు చేయడంతోపాటు.. తాజా ఈక్విటీ జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టినట్లు వెల్లడించింది. వెరసి బ్యాలన్స్‌షీట్ పటిష్టంకానున్నట్లు పేర్కొంది. కస్టమర్ సేవలు, మార్కెట్ విస్తరణ, వెండార్ భాగస్వామ్యాలు, సరఫరా చైన్, క్రెడిట్ తదితరాలపై నిధులను వెచ్చించనున్నట్లు వివరించింది. -
కొనుగోలు దారులకు బంపరాఫర్, ఫ్లిప్‌కార్ట్‌లో 80 శాతం భారీ డిస్కౌంట్‌కే..
ప్రముఖ దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త ఏడాదిని పురస్కరించుకుని డిసెంబర్ 9 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ప్రారంభించింది. డిసెంబర్ 9న ప్రారంభమై డిసెంబర్ 16 వరకు కొనసాగే సేల్‌లో 80 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇయర్ ఎండ్ సేల్స్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, సహా పలు కేటగిరీల్లోని ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్ హెచ్డీఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఇన్స్టంట్ డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు పొందవచ్చు. ఐఫోన్14 రిటైల్ ధర రూ.69,900 ఉండగా.. ఈ సేల్ ద్వారా రూ.55,000కే కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. మోటోరోలా ఎడ్జ్ 40 పైనా ఫ్లిప్‌కార్ట్ రాయితీ అందిస్తోంది. రూ.34,999 ధర వద్ద విడుదలైన ఈ ఫోన్ రూ.25,499కే లభిస్తుంది. ఇన్ఫీనిక్స్ హాట్ 30ఐ ను రూ.7,149కే కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్2 ధర రూ.39,999 కాగా.. తాజా సేల్‌లో రూ.34,999కే కొనుగోలు చేయవచ్చు. -
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కి బంపరాఫర్!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కి బంపరాఫర్. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లను తక్కువ ధరకే అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఇతర ఎక్ఛేంజ్ ఆఫర్లు అన్నీ కలుపుకుని రూ.30,000లోపే దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఐఫోన్ 12 సిరీస్ మార్కెట్ ధర రూ.49,900 ఉండగా రూ.40,999కే ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తుంది. ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా చేసే ఐఫోన్ కొనుగోలుపై 17 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇతర బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉండగా.. దీని ధర మరింత తగ్గనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, సిటీబ్యాంక్ క్రిడెట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ఈఎంఐలో ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. మీ వద్ద పాత ఫోన్ ఉంటే దానిని ఇచ్చేసి ఈ యాపిల్ ఫోన్‌ను ఎక్ఛేంజ్ కింద తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 అమ్మకాలు నిలిపివేత ఈ ఏడాది సెప్టెంబరులో ఫ్రాన్స్ అధికారులు ఐఫోన్ 12 అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐఫోన్ 12 అనుమతించిన దానికంటే ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. అయితే, ఐఫోన్ 12 గ్లోబల్ రేడియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థలు ధృవీకరించాయని యాపిల్ తనను తాను సమర్థించుకుంది. టెక్ దిగ్గజం ఫ్రాన్స్‌లోని ఐఫోన్ 12 వినియోగదారుల కోసం ఫ్రెంచ్ రెగ్యులేటర్లు ప్రోటోకాల్‌కు అనుగుణంగా సాఫ్ట్వేర్ అప్డేట్ను కూడా విడుదల చేసింది. అదే సమయంలో , ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ రేడియేషన్ ఎక్స్పోజర్ పరిమితులను ఉల్లంఘించినందున దేశంలో ఐఫోన్ 12 అమ్మకాలను నిలిపివేసింది. ఐఫోన్ 12 అక్కడ అమ్ముడవుతుందో లేదో తెలుసుకునేందుకు తమ ఏజెంట్లను యాపిల్ స్టోర్లకు పంపుతామని ఆ దేశ అధికారులు చెప్పారు. అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఫోన్ ఇప్పటికీ విక్రయిస్తున్నట్లు గుర్తించేతే ఇప్పటికే వినియోగదారులకు విక్రయించిన ఫోన్లను రీకాల్ చేస్తామని వారు తెలిపారు. -
కొనుగోలు దారులకు బంపరాఫర్.. ఈ ప్రొడక్ట్‌లపై 85 శాతం డిస్కౌంట్!
న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థలు, ఆఫ్‌లైన్ దుకాణాలు అమ్మకాలు పెంచుకునేందుకు మరో విడత డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ ఫ్రైడే (నవంబర్ 24), సైబర్ మండే (నవంబర్ 27) సందర్భంగా మంచి డీల్స్‌ను ప్రకటిస్తుండడం కనిపిస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా దాదాపు అన్ని ఈ కామర్స్ సంస్థలు, ప్రముఖ బ్రాండ్లు, రిటైలర్లు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మరోసారి అదే విధమైన వాతావరణం నెలకొంది. పాశ్చాత్యదేశాల్లో క్రిస్మస్, బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. అదే విధమైన సంస్కృతి క్రమంగా మన దేశంలోనూ విస్తరిస్తోంది. టాటా గ్రూప్‌లో భాగమైన ఈ కామర్స్ సంస్థ టాటా క్లిక్, టాటా క్లిక్ లగ్జరీ, టాటా క్లిక్ ప్యాలెట్ బ్లాక్ ఫ్రైడే సందర్భంగా భారీ ఆఫర్లతో డీల్స్‌ను ప్రకటించాయి. ‘థ్యాంక్స్ గాడ్, ఇట్స్ బ్లాక్ ఫ్రైడే’ అనే ట్యాగ్‌లైన్ వేశాయి. వస్త్రాలు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు, ఆభరణాలు, వాచ్‌లపై ఆఫర్లు తీసుకొచ్చాయి. టాటా క్లిక్, టాటా క్లిక్ లగ్జరీ నవంబర్ 22 నుంచి 27 వరకు ఈ సేల్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. టాటా క్లిక్ ప్యాలెట్ అయితే ఈ నెల 17 నుంచి 27 వరకు సేల్స్‌ను చేపట్టింది. ‘‘బ్లాక్ ఫ్రైడే సేల్ అన్నది ఎంతో ఆసక్తికరమైన కార్యక్రమం. వినియోగదారులు ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఆఫర్లు అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లపై అందిస్తున్నాం’’అని టాటా క్లిక్ సీఈవో గోపాల్ ఆస్థానా తెలిపారు. పండుగల అమ్మకాలు క్రిస్మస్, నూతన సంవత్సరం వరకూ కొనసాగుతాయని టాటా క్లిక్ అంచనా వేస్తోంది. హ్యూగో బాస్, జిమ్మీ చూ తదితర బ్రాండ్లపై 85 శాతం వరకు తగ్గింపును టాటా క్లిక్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ సైతం.. అమెజాన్ బ్యూటీ సైతం బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే సందర్భంగా డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు ‘ద బ్యూటీ సేల్’ను నిర్వహిస్తోంది. అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులపై 60 శాతం వరకు, లగ్జరీ బ్యూటీ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. 300 బ్రాండ్లపై 8,000 డీల్స్‌ను ప్రకటించింది. ప్రతి రోజూ రాత్రి 8పీఎం డీల్స్ పేరుతో అర్థరాత్రి వరకు ప్రత్యేక ఆఫర్లను ఇస్తోంది. ‘‘చర్మ, శిరోజాల సంరక్షణపై గడిచిన్న కొన్నేళ్లలో భారత వినియోగదారుల్లో ఎంతో అవగాహన పెరుగుతుండడం గమనించాం. దీంతో ప్రీమియం ఉత్పత్తుల కోసం చేసే ఖర్చు పెరిగింది’’అని అమెజాన్ ఇండియా సౌందర్య ఉత్పత్తుల విభాగం డైరెక్టర్ జెబా ఖాన్ తెలిపారు. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు, ఫర్నిచర్‌పై 75 శాతం వరకు తగ్గింపుతో కూడిన టాప్ డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి సైతం ప్రకటించారు. -
షాపింగ్ వైపే భారతీయుల చూపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ వేదికలు విస్తరించినప్పటికీ రిటైల్ స్టోర్లకు వెళ్లడం భారతీయులకు అత్యంత ప్రజాదరణ పొందిన షాపింగ్ విధానంగా నిలిచింది. ఇన్–స్టోర్ షాపింగ్ జనాదరణ పొందడానికి ప్రధాన కారణం ఉత్పత్తిని ముట్టుకోవడం, అనుభూతి చెందగల అవకాశం ఉండడమే. ఉత్పత్తుల ఖచ్చితమైన ప్రామాణికత, నాణ్యత కారణంగా ఆఫ్‌లైన్ షాపింగ్‌ను దాదాపు 54 శాతం మంది ఇష్టపడుతున్నారని డిజిటల్ రుణ సంస్థ నౌగ్రోత్ సర్వేలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25కుపైగా నగరాల్లో సుమారు 3,000 మంది వర్తకులు, కొనుగోలుదార్లు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. కుటుంబంతో షాపింగ్.. హోమ్ డెలివరీని వినియోగదార్లు కోరుకుంటున్నారు. ఇంటికి సరుకులు పంపాల్సిందిగా కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారని 60 శాతం విక్రేతలు తెలిపారు. దాదాపు సగం మంది తమ స్థానిక స్టోర్లకు విధేయులుగా ఉన్నారు. ఒక కుటుంబంలోని అనేక తరాలు తరచుగా ఒకే రిటైలర్ నుండి షాపింగ్ చేయడం వల్ల విశ్వాసం, పరిచయానికి దారి తీస్తోంది. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి స్థానిక రిటైలర్ నుండి 35 శాతం మంది భారతీయులు షాపింగ్ చేస్తున్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది కస్టమర్లు రిటైల్ స్టోర్‌లో కుటుంబ షాపింగ్ అనుభవాన్ని విలువైనదిగా భావిస్తున్నారు. పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో స్టోర్లకు వినియోగదార్లు అధికంగా వస్తున్నారు. ఫ్లాష్ సేల్స్ సమయంలో.. భారతీయ కొనుగోలుదార్లలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఆన్లైన్ విక్రయ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా షాపింగ్ చేస్తున్నారు. 26 ఏళ్లలోపు ఉన్న జెన్–జీ కస్టమర్లలో 14 శాతం మంది పూర్తిగా ఆన్‌లైన్‌ను ఎంచుకుంటున్నారు. 43–58 మధ్య వయసున్న జెన్–ఎక్స్ వినియోగదార్లలో కేవలం 5 శాతం, 27–42 మధ్య వయసున్న మిల్లేనియల్స్లో 11 శాతం మంది ఆన్లైన్ వేదికగా షాపింగ్ చేస్తున్నారు. ఫ్లాష్ సేల్స్, ఈ–కామర్స్ కంపెనీల ద్వారా అధిక తగ్గింపులను అందించే సమయాల్లో ఆన్లైన్లో ఎక్కువ విక్రయాలు నమోదవుతున్నాయి. ఫ్లాష్ సేల్స్ సమయంలో మాత్రమే ఆన్లైన్ షాపింగ్‌ను 35 శాతం మంది ఇష్టపడుతున్నారు. ఈ–కామర్స్‌తో ముప్పు లేదు.. తమ కార్యకలాపాలకు ఈ–కామర్స్‌తో ఎటువంటి ముప్పు లేదని 80 శాతంపైగా వర్తకులు ధీమా వ్యక్తం చేశారు. ఆన్లైన్ విక్రయ వేదికలు తమ అమ్మకాలపై ప్రభావం చూపాయని 18 శాతం మంది వెల్లడించారు. భారత్‌లో ఎఫ్ఎంసీజీ, రిటైల్ అమ్మకాల్లో ఆఫ్‌లైన్ వాటా ఏకంగా 97 శాతం ఉంది. ఫుడ్, బెవరేజ్ విభాగంలో 95 శాతం, కంజ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ విక్రయాల్లో ఆఫ్‌లైన్ 93 శాతం కైవసం చేసుకుంది. దాదాపు 60 శాతం మంది రిటైలర్లు భవిష్యత్తులో డిజిటల్ టూల్స్ సహాయంతో రిటైల్ స్టోర్లపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. 70 శాతం మంది రిటైలర్లు తమ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి కొత్త ఔట్లెట్లను తెరవాలని యోచిస్తున్నారు. -
ఈకామ్ రుణాలు ఆపేయండి
ముంబై: ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డు సాధనాల కింద రుణాల మంజూరు, వితరణ నిలిపివేయాలంటూ బజాజ్ ఫైనాన్స్‌ను ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ రుణాల మార్గదర్శకాలను పాటించకపోవడమే ఇందుకు కారణం. సదరు లోపాలను సంతృప్తికరమైన విధంగా బజాజ్ ఫైనాన్స్ సరిచేసుకున్నాక ఆంక్షలను పునఃసమీక్షిస్తామని పేర్కొంది. -
అమ్మ, నాన్న కోసమే.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్ అయ్యారు. జెఫ్‌బెజోస్ 1994లో అమెరికాలోని న్యూయార్క్ నగరం సియాటెల్‌కు చెందిన ఓ గ్యారేజీలో అమెజాన్ సంస్థను ప్రారంభించారు. ‘ఇంతై.. ఇంతింతై.. వటుడింతై’ అన్నట్లుగా ఆ సంస్థ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరిగా బెజోస్‌ను నిలబెట్టింది. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ఫ్లోరిడా మయామికి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమెజాన్.కామ్ ఆఫీస్ మొత్తం చూసేందుకు మీకు ఎక్కువ సమయం పట్టదు అంటూ సియోటెల్ గ్యారేజీలో అమెజాన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో తీసుకున్న వీడియోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Jeff Bezos (@jeffbezos) ఆప్పట్లో అమెజాన్‌ను స్థాపించిన సమయంలో తన ఆఫీస్ ఎలా ఉందో చూడండి అంటూ బెజోస్ తన ఆఫీస్‌ను చూపిస్తుండగా.. ఆ వీడియో తీస్తున్న బెజోస్ తండ్రి ఉత్సాహపరుస్తున్నట్లు వాళ్లిద్దరి మధ్య జరుగుతున్న సంభాణల్ని మనం వినొచ్చు. అయితే బెజోస్ హైస్కూల్ విద్యార్ధిగా ఉన్న సమయంలో నివసించిన మయామి ప్రాంతానికి తన తల్లిదండ్రుల కోసమే సియోటెల్ని వదిలి వెళ్లిపోతున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజన్ కార్యకలాపాలు ఎక్కువగా ఫ్లోరిడా కేప్ కెనావెరల్ నుంచి కొనసాగుతున్నాయి. ఆ స్పేస్ పనులు దగ్గరుండి చూసుకునేందుకు వీలు కలుగుతున్నట్లు వెల్లడించారు. బిలియనీర్ బంకర్లోని జెఫ్ బెజోస్ ఇంటి ప్రత్యేకతలు ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న జెఫ్‌బెజోస్ ఫ్లోరిడాలోని బిలియనీర్ బంకర్ ద్వీపంలో తన 68 మిలియన్ల విలువైన ఎస్టేట్‌కు పక్కనే ఉన్న భవనాన్ని 79 మిలియన్లు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు తర్వాత సియోటెల్ నుంచి ఫ్లోరిడాకు వెళుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2000లో నిర్మించిన 19,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఖరీదైన ఇల్లు, ఏడు బెడ్రూమ్లు, 14 బాత్రూమ్లు, ఒక కొలను, థియేటర్, లైబ్రరీ, ఒక వైన్ సెల్లార్,మెయిడ్స్ క్వార్టర్స్ మరియు ఆరు గ్యారేజ్ స్థలాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో బిలియనీర్ బంకర్ ద్వీపంలో మరో ప్రాంతంలో కొనుగోలు చేసిన 9,259 చదరపు అడుగుల మాన్స్‌లో కేవలం మూడు బెడ్రూమ్లు, మూడు బాత్రూమ్లు ఉన్నాయి. చదవండి👉 చంద్రుడి మీదకు మనుషులు.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు జాక్ పాట్! -
ఉద్యోగం నుంచి తొలగించింది.. మళ్లీ చేరొచ్చంటూ 4 సార్లు ఆఫర్, రిజెక్ట్ చేసిన ఉద్యోగి!
ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ చరిత్రలోనే తొలిసారి ఈ ఏడాది ప్రారంభంలో 18,000 మందిని ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అ తర్వాత సైతం పలు రౌండ్లలో సిబ్బందిని ఇంటికి సాగనంపింది. అయితే, వారిలో కొంతమందిని తిరిగి మళ్లీ విధుల్లోకి తీసుకుంది. అలా ఓ ఉద్యోగిని తొలగించిన అమెజాన్ తిరిగి తీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి విఫలైమంది. అమెజాన్‌లో మళ్లీ చేరడాన్ని ససేమిరా అన్నాడు. ఇప్పుడు ఇదే అంశం దిగ్గజ టెక్ కంపెనీల్లో హాట్ టాపిగ్గా మారింది. ఆర్ధిక అనిశ్చితి, సంస్థ పునర్నిర్మాణం, కాస్ట్ కటింగ్, పలు జాతీయ అంతర్జాతీయ సమస్యల కారణంగా అనేక చిన్న చిన్న స్టార్టప్‌ల నుంచి దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు ఈకామర్స్ సేలవందించే అమెజాన్ సైతం వర్క్ ఫోర్స్‌ని తగ్గించుకోక తప్పలేదు. మెల్లిమెల్లిగా పరిస్థితులు చక్కబడుతుండడం, మార్కెట్లో డిమాండ్ పెరిగిపోవడం, కొత్త ప్రాజెక్ట్‌లు క్యూ కట్టడంతో పలు కంపెనీలు తొలగించిన ఉద్యోగుల్ని మళ్లీ తిరిగి విధుల్లోకి (Re Hiring) తీసుకుంటున్నాయి. సాధారణంగా ‘మీ సేవలు చాలు ఇక వెళ్లిపోండి’ అంటూ తొలగించి.. మళ్లీ రీజాయిన్ చేయించుకుంటామని రెడ్ కార్పెట్ పరిస్తే.. ఆర్ధిక అనిశ్చితితో ఎవరైనా సరే సంస్థ ఇచ్చిన ఆఫర్ వైపు మొగ్గు చూపుతారు. కానీ, బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేసిన ఈ మాజీ అమెజాన్ ఉద్యోగి అలా కాదు. నీ సంస్థ వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ జనవరిలో కంపెనీ తనకి పింక్ స్లిప్ ఇచ్చింది. ఆ తర్వాత అతని స్కిల్స్ చూసి ముచ్చట పడి.. తిరిగి వెనక్కి తీసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. సదరు ఉద్యోగి మాత్రం ‘నీవ్వు వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ’ నాలుగు సార్లు కంపెనీ ఇచ్చిన ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. ఎందుకని? ప్రశ్నిస్తే అమెజాన్‌లో పని చేసే సమయంలో తాను ఎలాంటి సంతృప్తి చెందలేదని సమాధానం ఇచ్చారు. అందుకు కారణాల్ని వివరించారు. మేనేజర్ మాటలు పచ్చి అబద్ధం ఈ ఏడాది జనవరిలో సదరు ఉద్యోగిని అమెజాన్ ఫైర్ చేసింది. అందుకు గానూ రెండు నెలల వేతనం ఇస్తామని మెయిల్ పంపింది. అంతవరకు బాగున్నా.. ఆ మెయిల్లో తన మేనేజర్..‘మీ పనితీరు అమోఘం. మిగిలిన సభ్యులతో పోలిస్తే మీలో ఉన్న స్కిల్స్ అద్భుతం.. ఉద్యోగ భద్రత గురించి మీరేం ఆలోచించొద్దు’ అంటూ కొన్ని హామీలు ఇవ్వడం షాక్ గురి చేసింది. ఎందుకంటే? అది నిజం కాదని తర్వాత తేలింది. సంస్థ (అమెజాన్) లేఆఫ్స్‌పై మేనేజర్ల అభిప్రాయాలు తీసుకోవడం లేదు కాబట్టి. తొలగింపుకు రెండు నెలల ముందు తొలగింపులకు రెండు నెలల ముందు, ఉద్యోగులు తమ పని, ప్రాజెక్ట్‌లను డాక్యుమెంట్ చేయమని అమెజాన్ కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే, మేనేజర్లు ‘నేను చేసిన పనిలో మార్పులు చేయడం, నా పేరుకు బదులు వారి పేరు ఎంట్రీ చేయడం, అసలు తాను చేసిన ప్రాజెక్ట్‌లో ఏమాత్రం సంబంధం లేని వారు కూడా.. ఆ ప్రాజెక్ట్‌లో తామే కీరోల్ పోషించామని చెప్పుకోవడం, ఆ పనికి నాకు సంబంధం లేదని తప్పుగా ప్రచారం చేశారని’ వాపోయారు సంస్థే గుర్తించలేదు ఆ తర్వాత కొద్ది కాలానికి తొలగించిన ఉద్యోగులకు అమెజాన్ ఇతర సంస్థల్లో అవకాశాలు కల్పించింది. తిరిగి సంస్థలోకి తీసుకుంది. అందులో లేఆఫ్స్ గురైన ఈ మాజీ ఉద్యోగి కూడా ఉన్నాడు. ‘నా మేనేజర్ ఎప్పుడూ నీ మంచి కోరే వాడిని అని ఎప్పుడూ చెబుతుండే వారు. కానీ అది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇది నాకు చెంప దెబ్బలాంటిది’ అని పేర్కొన్నారు. చివరిగా.. అమెజాన్‌లో ఉద్యోగం కోల్పోయినా.. ఇతర సంస్థల్లో ఉన్నత ఉద్యోగం సంపాదించే టాలెంట్ నాలో ఉంది. సంస్థే అది గుర్తించలేదు. నాలుగు సార్లు కంపెనీలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ నేనే అమెజాన్‌లో చేరలేదంటూ తన సోషల్ మీడియా పోస్ట్‌ని ముగించాడు. చదవండి👉 మెటాలో ఊడిన ఉద్యోగం.. ఆనందంలో తేలిపోయిన మేనేజర్ -
ఫ్లిప్‌కార్ట్ నష్టాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం భారీగా పెరిగి రూ. 4,891 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,371 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం స్టాండెలోన్ నష్టాలు సైతం 44 శాతం పెరిగి రూ. 4,839 కోట్లను దాటాయి. అంతక్రితం రూ. 3,362 కోట్ల నష్టం ప్రకటించింది. కాగా.. కన్సాలిడేటెడ్ ఆదాయం 9 శాతంపైగా ఎగసి రూ. 56,013 కోట్లకు చేరింది. 2021–22లో మొత్తం ఆదాయం రూ. 51,176 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు రూ. 60,858 కోట్లకు చేరాయి. -
‘బిగ్ దసరా సేల్’లో అదిరిపోయే ఆఫర్లు
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో భారీ సేల్కు సిద్ధమైంది. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ‘బిగ్ దసరా సేల్’ పేరుతో ఈ నెల 22 నుంచి 29 వరకు ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా ఆయా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లపై షాపింగ్ చేసిన కస్టమర్లకు పది శాతం డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు పది శాతం ఈ నెల 21 నుంచి డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇక,సూపర్ కాయిన్ల ద్వారా ఐదు శాతం అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చునని తెలిపింది. దసరా సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, హోం అప్లయెన్సెస్, దుస్తులపై ఆఫర్లు అందచేస్తున్న ఫ్లిప్ కార్ట్ .. పలు కంపెనీలకు చెందిన అన్నీ రకాల స్మార్ట్ఫోన్లపై ఆఫర్లను అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఐఫోన్ 14తోపాటు పలు స్మార్ట్ ఫోన్లపై త్వరలో ఆఫర్లు ప్రకటించనున్నది. కాగా, ఫ్లిప్‌కార్ట్ కొద్ది రోజుల క్రితం బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో కొనుగోలు దారులకు ఆఫర్లను అందించిన విషయం తెలిసిందే. -
‘ఇంట్లోనే కూర్చోండి’.. ఉద్యోగులకు అమెజాన్ హెచ్చరిక!
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీని అతిక్రమించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సమస్య తీవ్రతను బట్టి లేఆఫ్స్ ప్రకటిస్తామని చెప్పినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెజాన్ ఇటీవల సంస్థలో రిటర్న్ టూ ఆఫీస్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు సార్లు ఆఫీస్ రావాల్సిందేనని పట్టు బట్టింది. అయితే, సుదీర్ఘ కాలంలో ఇంటి వద్ద నుంచే పనిచేసిన సిబ్బంది ఆఫీస్‌కు వచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యం, వారానికి 3 రోజులు కూడా ఆఫీస్‌కి రాకపోతే ఎలా? అని ప్రశ్నించింది. పైగా ఆఫీస్‌కి వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగుల్ని తొలగించే వెసులుబాటును మేనేజర్లకు కల్పించింది. తొలగింపులపై ఇంటర్నల్‌గా వర్క్ ఫోర్స్‌కి సమాచారం అందించే పోర్టల్ నోటీసుల్లో పేర్కొన్నట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి. ఆ నోటీసుల్లో రిటర్న్ టూ ఆఫీస్, ఆఫీస్ అవసరాలకు అనుగుణంగా లేని ఉద్యోగులతో మూడు దశల్లో వ్యవహరించాల్సిన తీరును పొందుపరిచింది. మొదటి దశలో, మేనేజర్లు వారానికి మూడు సార్లు ఆఫీస్‌కు వచ్చే అవసరాన్ని పాటించని ఉద్యోగులతో వ్యక్తిగతంగా మాట్లాడి భవిష్యత్ కార్యచరణను రూపొందించాలి. మొదటి దశలో సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని బట్టి 1 నుంచి 2 వారాల పాటు ఆఫీస్‌కి వచ్చేలా చూడాలి. అప్పటికి నిరాకరిస్తే, మేనేజర్ మరో సమావేశాన్ని నిర్వహించాలి. ఆపై సదరు వాళ్లనే వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు తిరిగి ఆఫీస్‌కి వచ్చేలా ప్లాన్ చేయడం తప్పని సరి. రెండో దశలో సరైన కారణం లేకుండా వర్క్ ఫ్రం హోమ్ నుంచి విధులు నిర్వహిస్తూ వర్క్ కొనసాగడం క్రమశిక్షణా చర్యలకు దారి తీస్తుందని వార్నింగ్ ఇవ్వాలి. చివరిగా కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగికి వ్రాతపూర్వక హెచ్చరిక లేదా ఫైర్ చేస్తూ హెచ్ఆర్ విభాగానికి తోడ్పాటు నందించేలా చూడాలని మేనేజర్లకు సూచించింది. చదవండి👉‘ఇదే మా సంస్థ గొప్పతనం’.. ఒక్క ఫోటోతో అబాసుపాలైన దిగ్గజ కంపెనీ సీఈవో -
ఆన్లైన్ షాపింగ్‌లో డబ్బులు పోయాయా? ఇవి పాటిస్తే మేలు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆన్లైన్లోని వివిధ ప్లాట్ఫామ్ల్లో ధర బేరీజు వేసి ఎక్కడకొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త యాప్‌లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది. అయితే, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది డబ్బులు నష్టపోతుంటారు. మరి వీటిని అరికట్టడానికి కొన్ని సులువైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. బయోమెట్రిక్ ఉత్తమం.. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాలి. దీనికి బదులు బయోమెట్రిక్స్, ఇ-సిగ్నేచర్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. 2. రెండంచెల ధ్రువీకరణ.. ఆన్లైన్లో షాపింగ్‌లో చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ విధానాన్ని పాటించాలి. కేవలం ఒక్క పాస్వర్డ్తోనే కాకుండా బయోమెట్రిక్, ఓటీపీ, మెయిల్, ఎస్ఎంఎస్, మొబైల్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అనుసరించాలి. 3. రిమోట్ యాక్సెస్‌తో నష్టం.. మన కంప్యూటర్ లేదా ఫోన్‌ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్ యాక్సెస్ ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్లైన్ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. మీ పాస్వర్డ్లు, ఇతర వివరాలన్నీ సులువుగా కనుగొంటారు. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. 4. ఓటీపీని అసలు షేర్ చేయొద్దు.. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్ దగ్గర నమ్మకాన్ని సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ తెలుసుకుంటారు. అందువల్ల ఫోన్లోగానీ, ఆన్‌లైన్‌లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి. (లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!) 5. పబ్లిక్ వైఫైతో జాగ్రత్త.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్/ ఓపెన్ వైఫైని వాడకపోవడమే మంచిది. పబ్లిక్ వైఫై ద్వారా మీరు చేస్తున్న లావాదేవీలను కొందరు ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం సొంత నెట్వర్క్, సొంత డివైజ్‌నే వాడాలి. ఆన్లైన్ షాపింగ్, లావాదేవీలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవద్దు. -
13 బిలియన్ డాలర్ల దీపావళి పండుగ..చిన్న సంస్థలకు మరింత లాభసాటిగా
ముంబై: దేశీ చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఈసారి దీపావళి పండుగ మరింత లాభసాటిగా ఉండనుంది. ఈ–కామర్స్ ద్వారా 13 బిలియన్ డాలర్ల మేర వ్యాపారాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని ఎంఎస్ఎంఈలు మరింత ఎక్కువగా ఆర్డర్లు దక్కించుకుంటున్నాయి. టెక్ ఆధారిత లాజిస్టిక్స్ సంస్థ షిప్‌రాకెట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొత్తం ఆర్డర్లలో 10–15 శాతం ఆర్డర్లు తొలిసారిగా ఆన్లైన్లో కొనుగోలు చేసే వారి నుంచే ఉండనున్నాయి. పండుగ అమ్మకాల్లో ఢిల్లీ ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) 28 శాతం వాటాతో అగ్రస్థానంలో, 13 శాతం వాటాతో ముంబై, 7 శాతం వాటాతో బెంగళూరు ఆ తర్వాత స్థానాల్లో ఉంటాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ షాపింగ్ వినియోగం పెరిగింది. షిప్రాకెట్కి వచ్చే ఆర్డర్లలో 56 శాతం వాటా మెట్రోయేతర నగరాల నుంచే ఉంటోంది. ఎగుమతులు అప్.. పండుగ సీజన్లో ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువగా కృత్రిమ జ్యుయలరీ, సౌందర్య సంరక్షణ, దుస్తులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, పుస్తకాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, హోమ్ ఫర్నిషింగ్స్ మొదలైనవి వీటిలో ఉంటున్నాయి. అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, యూఏఈలో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్ పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ అదనంగా మూడు గిడ్డంగులను సమకూర్చుకుంది. ఆర్డర్లను సత్వరం ప్రాసెస్ చేసేందుకు సిబ్బంది సంఖ్యను 50 శాతం మేర పెంచుకుంది. -
పోటెత్తుతున్న యూజర్లు.. ఆ సేవల్ని రద్దు చేసిన ‘ఫ్లిప్ కార్ట్’!
ప్రముఖ దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యవసర వస్తువుల డెలివరీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ తరుణంలో మంగళవారం (అక్టోబర్10)న ఫ్లిప్‌కార్ట్ పోర్టల్‌కు యూజర్లు పోటెత్తారు. దీంతో ఫ్లిప్‌కార్ట్ సైట్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ సైట్లో నిత్యవసర వస్తువుల్ని బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన యూజర్లకు ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ సెగ్మెంట్లో చిన్న బ్యానర్‌ను డిస్ప్లే కనిపించింది. రేపటి నుంచి సరుకుల్ని బుక్ చేసుకోండనేది ఆ బ్యానర్ సారాంశం. ఫిర్యాదుల వెల్లువ అసలే పండగ సీజన్, పైగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది. ఈ సమయంలో గ్రోసరీ షాపింగ్ చేసే సమయంలో సమస్య తలెత్తుతుందంటూ కొనుగోలు దారులు ఫ్లిప్ కార్ట్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. సేవలు పున:ప్రారంభం అప్పుడే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభమైన మొదటి రెండు రోజులు ఊహించని విధంగా ఆర్డర్లు వచ్చాయి. అన్నీ కేటగిరీల్లో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని అందించడమే మా లక్క్ష్యం. అయితే, కొత్త ఆర్డర్లను అక్టోబర్ 11 మిడ్ నైట్ 12 గంటల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రూ.90వేల కోట్ల ఆన్లైన్ అమ్మకాలు పండగ సీజన్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు ఆన్ లైన్ విక్రయాలు ఎంత మేర జరిగే అవకాశం ఉందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ ఓ నివేదికను విడుదల చేసింది. ‘రెడ్‌సీర్ సస్టట్రాటజీ కన్సల్టెంట్స్’ రిపోర్ట్ ప్రకారం.. ఆన్లైన్ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 నుంచి 20 శాతం మేర పెరిగి రూ.90 వేల కోట్లు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది రూ.76,000 కోట్ల ఆన్లైన్ విక్రయాలు జరిగాయి. -
బై..బై అమెరికా, స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు
ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో భారతీయులు సైతం ఉన్నారు. లేఆఫ్స్‌తో కొత్త ఉద్యోగం దొరక్కపోవడంతో తిరిగి భారత్‌కు వస్తున్నారు. మాద్యం, వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో వినియోగారులు కొనుగోలు విషయాల్లోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఫలితంగా చాలా కంపెనీలు తమ వ్యయాలను నియంత్రించకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే మెటా, గూగుల్, అమెజాన్ , మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇతర సంస్థలు సైతం ఇంకా ఫైర్ చేస్తూనే ఉన్నాయి. అమెజాన్‌లో 18,000 మంది తొలగింపు జనవరిలో అమెజాన్ 18,000 మందిని తొలగించింది. ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అనేక కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అసలే ఉద్యోగం పోగొట్టుకుని బాధపడుతున్న వారికి ఇప్పుడు హెచ్1బీ వీసా రూపంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త ఉద్యోగం దొరక్కపోవడంతో అమెరికన్ ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం.. అగ్రరాజ్యంలో ఉండేందుకు వీలు లేకపోవడంతో లేఆఫ్స్‌కు గురైన అమెజాన్ మాజీ ఉద్యోగులు తిరిగి భారత్‌కు వస్తున్నారు. వేల సంఖ్యలో రిజెక్షన్లు ఈ నేపథ్యంలో లేఆఫ్స్ తరువాత తాను ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని అమెజాన్ మాజీ ఉద్యోగి లింక్డిన్లో పోస్ట్‌లో వివరించారు. అమెరికా కేంద్రంగా అమెజాన్ ప్రధాన కార్యాలయంలో డెవలప్మెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించే వారు. అయితే, సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగం పోయింది. అనంతరం రెండు నెలల పాటు కొత్త ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాల్లో అన్నీ విఫలమయ్యాయి. ఈ సమయంలో తాను అనేక ఇంటర్వ్యూలకు హాజరయ్యానని, కానీ వేలాది తిరస్కరణలను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. మళ్లీ అమెరికా వెళ్తా.. సాయం చేయరూ 'మీలో చాలా మందికి తెలిసినట్లుగా, గత కొన్ని నెలలు నాకు పరిస్థితులు అత్యంత కఠినంగా ఉన్నాయి. అమెజాన్‌లో ఉద్యోగం కోల్పోయిన తర్వాత, సామూహిక తొలగింపుల మధ్య, నేను వెయ్యికి పైగా ఉద్యగాలకు అప్లయ్ చేసుకున్నాను. దాదాపు అందరూ రిజెక్ట్ చేశారు. ఇంటర్వ్యూలు కాల్స్ రాకపోవడం, ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసినా నా ప్లేస్‌లో వేరే వారిని తీసుకోవడం, రిక్రూటర్లు మరోసారి ఇంటర్వ్యూలు చేయడం, వాటి గురించి సమాచారం లేకపోవడంతో అనే తిరస్కరణలు ఎదురయ్యాయి. నాకు హెచ్-1బీ వీసా ఉన్నందున నెల రోజుల క్రితం కఠిన పరిస్థితుల మధ్య భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చిందని వాపోయారు. ఉద్యోగం లేదు. పొదుపు చేసిన డబ్బూ ఉంది. అప్పూ ఉంది. అందుకే పొదుపు చేసిన డబ్బు ఖర్చు చేయకూడదనే ఉద్దేశంతో తిరిగి భారత్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అమెరికాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తనకు సాయం చేయాల్సిందిగా తన సన్నిహితులను కోరారు. చదవండి👉🏻 ఎలాన్ మస్క్ హత్యకు గురవుతారేమో -
నో వర్క్ ఫ్రమ్ హోం.. లేదంటే ఇంటికెళ్లిపోండి!
అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ మరోమారు ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంటి నుండి పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్ రావాల్సిందేనని ఆదేశించారు. అయితే, సీఈవో నిర్ణయంపై అసంతృప్తిలో ఉన్న సిబ్బంది ఉద్యోగాలకు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోవచ్చంటూ ఇంటర్నల్‌గా జరిగిన సమావేశంలో ఆండీ జెస్సీ పునరుద్ఘాటిస్తూ చెప్పడంతో ఉత్కంఠతకు దారి తీసింది. ఈ ఏడాది ప్రారంభంలో, అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాల్సిందేనని అన్నారు. ఈ నిర్ణయానికి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌కి తిరిగి రావాలని, సహోద్యోగులతో కలిసి పని చేయాలని భావించగా..మరికొందరు జర్నీ, ఇతర ఖర్చుల్ని దృష్టిలో ఉంచుకుని ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. అసంతృప్తిలో ఉన్న ఉద్యోగులు కంపెనీ తీసుకున్న నియమాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవసరం అయితే, మూకుమమ్మడిగా విధులు నిర్వహించకుండా నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. అమెజాన్ కంపెనీలో ఈ అసమ్మతి పర్వం కొనసాగుతుండగా.. ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు రాజీనామాకు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు కంపెనీ తీసుకున్న నిర్ణయం విషయంలో మరోమారు ఆలోచిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఎటు దారి తీస్తుందోనని అమెజాన్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ వాటా అప్
న్యూఢిల్లీ: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాను యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ఇందుకు 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,500 కోట్లు) వెచి్చంచినట్లు తెలుస్తోంది. 35 బిలియన్ డాలర్ల విలువలో 4 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇంతక్రితం 2021లో 37.6 బిలియన్ డాలర్ల విలువలో ఫ్లిప్‌కార్ట్ నిధుల సమీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే టైగర్ గ్లోబల్ వాటాను కొనుగోలు చేసినట్లు వాల్‌మార్ట్ ప్రతినిధి ధ్రువీకరించినప్పటికీ డీల్ విలువను వెల్లడించకపోవడం గమనార్హం! ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ తొలి దశ(2009)లో 9 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తదుపరి 2017కల్లా 1.2 బిలియన్ డాలర్లకు పెట్టుబడులను పెంచుకోవడం ద్వారా అతిపెద్ద వాటాదారు సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించింది. 2018లో వాల్‌మార్ట్‌కు అత్యధిక వాటాను విక్రయించినప్పటికీ తిరిగి 2021లో ఇన్వెస్ట్ చేసింది. కాగా.. యాక్సెల్ పార్టనర్స్ సైతం 35 కోట్ల డాలర్లకు 1 శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. -
ఏం జరుగుతోంది? ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాని కొనుగోలు చేసిన వాల్‌మార్ట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న టైగర్ గ్లోబల్ వాటాల్ని వాల్‌మార్ట్ 1.4 బిలియన్ డాలర్ల (రూ.11.5 వేల కోట్ల)కు కొనుగోలు చేసింది. ఈ భారీ కొనుగోళ్లను వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదించింది. తాజా నిర్ణయంతో 2021లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్,యూఎస్ రిటైలర్ వాల్‌మార్ట్, ఇతర పెట్టుబడిదారులకు తన వాటాలను విక్రయించిన తర్వాత ఈ-కామర్స్ సంస్థ విలువ దాదాపు 38 బిలియన్ల నుండి 35 బిలియన్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు యాక్సెల్, టైగర్ గ్లోబల్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌కు ఆర్ధికంగా మద్దతిస్తున్నాయి. అయితే ఈ రెండు సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లోని తమ వాటాల్ని వాల్‌మార్ట్‌కు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నాయని ఈ ఏడాది ప్రారంభంలో ఎకనామిక్స్ టైమ్స్ (ఈటీ) రిపోర్ట్‌ను వెలుగులోకి తెచ్చింది.ఈటీ నివేదిక ప్రకారం టైగర్ గ్లోబల్ కంపెనీలో దాదాపు 4% (1.4 బిలియన్ డాలర్ల )వాటాను కలిగి ఉంది. 2018లో 16 బిలియన్ డాలర్లు వెచ్చించి వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేసింది. -
పాకిస్తాన్లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో
చైనా అపర కుబేరుడు, అలీబాబా వ్యవస్తాపకుడు జాక్‌మా పాకిస్తాన్లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఇంగ్లీష్ మీడియా సంస్థ ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. పాక్‌లో జాక్‌మా అడుగు పెట్టినట్లు బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ (boi) మాజీ ఛైర్మన్ ముహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ చెప్పినట్లు పాక్ మీడియా సంస్థ వెల్లడించింది. జాక్‌మా పాక్‌కు రాకముందు జూన్ 27న నేపాల్ రాజధాని ఖాట్మండూ తర్వాత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలలో పర్యటించారు. ఇలా వరుస పర్యటనలతో మా ప్రపంచ దేశాల్లో చర్చాంశనీయంగా మారారు. నేపాల్, బంగ్లాదేశ్‌లలో పర్యటనలలో ఈ చైనా అపర కుబేరుడితో పాటు మరో ఏడుగురు వ్యాపార వేత్తలు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వారిలో ఐదుగురు చైనా పౌరులు, ఒకరు యూరప్ దేశమైన డెన్మార్క్‌కు చెందిన డానిష్ వ్యక్తి, మరొకరు అమెరికా దేశస్తుడు ఉన్నట్లు తెలిపాయి. తాజాగా, స్విర్జర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే విమానయాన సంస్థ జెట్ ఏవియేషన్ ప్రైవేట్ ఫ్లైట్ వీపీ-సీఎంఏలో పాకిస్తాన్‌కు చేరుకున్నారు. జూన్ 29న లాహోర్‌లో అడుగు పెట్టిన జాక్‌మా 24 గంటల పాటు అక్కడే ఓ ప్రైవేట్ ప్రాంతంలో గడిపారు. అనంతరం, అదే విమానంలో ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లారు. మీడియాలో అనేక ఊహాగానాలు జాక్‌మా,అతని బృందం పాకిస్తాన్లో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు పర్యటించినట్లు అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఇందులో భాగంగా బిజినెస్ చేసేందుకు అనువైన ప్రాంతాల గురించి ఆరాతీయడంతో పాటు, ఆ దేశంలో వ్యాపార వేత్తలతో భేటీ, వివిధ వాణిజ్య ఛాంబర్ల అధికారులతో మంతనాలు జరిపినట్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, నిర్దిష్ట వ్యాపార ఒప్పందాలు,సమావేశాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. ఆయన వ్యక్తిగతమే జాక్‌మా పర్యటన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని బోవోఐ మాజీ ఛైర్మన్ ముహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ ట్వీట్ చేశారు. మా’ పర్యటన చైనా రాయబార కార్యాలయ అధికారులకు కూడా తెలియదని ట్వీట్లో పేర్కొన్నారు. చైనాపై విమర్శలు చేసి ఈ-కామర్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రముఖ వాణిజ్య వేత్తగా జాక్‌మా సుపరిచితులు. అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020లో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో చైనా రెగ్యులేటరీ సిస్టంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో చైనా అధికారులు జాక్‌మాను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆయన కంపెనీలపై చైనా దర్యాప్తు సంస్థలు వరుసగా దాడులు చేశాయి. ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ప్రభుత్వ ఆగ్రహంతో అలీబాబా, యాంట్ గ్రూప్ తీవ్రంగా నష్టపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 2021 చివర్లో జాక్‌మా చైనాను వీడారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏడాది పాటు బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన చైనా బిలియనీర్ ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ దేశాల్లో అప్పుడప్పుడు కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు వరుస ప్రపంచ దేశాల పర్యటనలతో జాక్‌మా భవిష్యత్‌లో ఏం చేయనున్నారోనని ప్రపంచ దేశాల వ్యాపార వేత్తలు, దేశాది నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి : ఎవరీ లలితాజీ.. సర్ఫ్ ఎక్సెల్ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు? -
షాపింగ్ లవర్స్‌కు అమెజాన్ బంపరాఫర్.. కేవలం రెండు రోజులే!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రత్యేక సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. కేవలం రెండ్రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో కొనుగోలు దారులు వారికి కావాల్సిన వస్తువుల్ని డిస్కౌంట్ ధరలో పొందవచ్చని అమెజాన్ తెలిపింది. ఎక్స్‌క్లూజివ్‌గా స్మార్ట్‌ఫోన్స్,ల్యాప్‌ట్యాప్స్,ఎలక్ట్రానిక్స్,హోమ్అప్లయెన్సెస్పై అందిస్తుంది అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ తేదీ వివరాలు భారత్‌లో అమెజాన్ రెండు రోజుల పాటు ఈ సేల్‌ను నిర్వహించనుంది. జులై 12ఏమ్ నుంచి ప్రారంభమై..జులై 16 వరకు కొనసాగుతుంది.ప్రత్యేక అమ్మకాల్లో కొనుగోలు దారులు డిస్కౌంట్స్, సేవింగ్స్, కొత్తగా మార్కెట్లో విడుదలైన ప్రొడక్ట్‌లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్‌లో బ్యాంక్ ఆఫర్లు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదే కార్డ్‌లపై ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అదనంగా, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్‌పై 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీకు ప్రయాణాలంటే ఇష్టమైతే..ట్రావెల్స్ బుకింగ్స్‌లో ఈ కార్డ్ వినియోగంతో అన్లిమిటెడ్ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు బిల్లు చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. వీటిపై 50 శాతం డిస్కౌంట్ వన్‌ప్లస్, ఐక్యూ, రియల్మీ నార్జో, శాంసంగ్, మోటరోలా,బోట్,సోనీ ఇలా 400 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులపై తగ్గింపును అందిస్తుంది. విక్రయ సమయంలో కొనుగోలుదారులు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు మొదలైన వాటిపై తగ్గింపును పొందుతారు. అదనంగా, స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్ప్లేలు, ఫైర్ టీవీ ఉత్పత్తులపై 55శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. చదవండి👉 ఎలాన్ మస్క్‌కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు? -
24న స్టార్టప్‌ల ‘డీ2సీ అన్లాక్డ్’ సమావేశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మర్చంట్ ఫస్ట్ చెకవుట్ నెట్వర్క్ సంస్థ సింపుల్, టీ–హబ్ సంయుక్తంగా జూన్ 24న హైదరాబాద్‌లో కమ్యూనిటీ ఆధారిత స్టార్టప్ వ్యవస్థాపకుల సమావేశం డీ2సీ అన్లాక్డ్ను నిర్వహించనున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ఎడిషన్లు నిర్వహించగా ఇది పదోది. ఇందులో డీ2సీ సంస్థల వ్యవస్థాపకులు.. బ్రాండ్లకు గుర్తింపు, డిజిటల్ మార్కెటింగ్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి, సింపుల్ సహ వ్యవస్థాపకులు నిత్యా శర్మతో పాటు హైదరాబాదీ బ్రాండ్లయిన స్కిపీ ఐసాపాప్స్ సహ వ్యవస్థాపకులు రవి కాబ్రా, గేర్ హెడ్ మోటర్స్ వ్యవస్థాపకుడు నిఖిల్ గుండా, పిప్స్ సీఈవో ప్రశాంత్ గౌరిరాజు తదితరు పాల్గొంటారు. డీ2సీ బ్రాండ్లను నిర్మించడం, అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశ్రమలోని తోటి వారితో సమావేశమయ్యేందుకు కూడా ఇది ఉపయోగకరంగా ఉండగలదని నిత్యా శర్మ తెలిపారు. -
ఈ–కామర్స్ విధానంపై చర్చలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ విధానాన్ని రూపొందించడంపై అంతర్–మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. పరిశ్రమ సమ్మిళిత వృద్ధి సాధించడానికి అనువైన పరిస్థితులను కల్పించే వ్యూహాల రూపకల్పన అనేది ఈ విధానం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరించడం, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం, సరఫరా వ్యవస్థలను సమగ్రపర్చడం, ఈ–కామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను పెంచడం తదితర అంశాలపై అంతర్–మంత్రిత్వ శాఖలు దృష్టి పెడుతున్నాయని సింగ్ వివరించారు. అటు జాతీయ రిటైల్ వాణిజ్య విధానంపై కూడా డీపీఐఐటీ కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. భౌతిక రిటైల్ రంగం వృద్ధిని ప్రోత్సహించేందుకు, క్రమబద్ధీకరించేందుకు ఉపయోగపడే మార్గదర్శకాలను ఇందులో పొందుపర్చనున్నారు. -
అమెజాన్ ఉద్యోగుల తొలగింపుల్లో ఊహించని ట్విస్ట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగుల తొలగింపుల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆస్థిర ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో అమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతుంది. అయితే, వేలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేస్తున్న అమెజాన్..ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకుంటుంది. ఈ ఏడాది అమెజాన్ 18,000 మంది సిబ్బందిని ఫైర్ చేసింది. వారిలో అమెజాన్ ప్రాడక్ట్ మేనేజర్ పైజ్ సిప్రియాని ఒకరు. సంస్థలో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరిన నాలుగు నెలలకే సిప్రియాని తొలగిస్తున్నట్లు అమెజాన్ యాజమాన్యం మెయిల్ పెట్టింది. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురైంది. ‘ఇది అత్యంత కఠినమైన సమయం. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు నేను సర్ధి చెప్పుకుంటున్నా. కానీ ఇంకా బాధగానే ఉంది. ఎందుకంటే? అమెజాన్‌లో నా కెరియర్ ప్రారంభమైంది ఇప్పుడే. అంతలోనే ఉద్యోగం పోగొట్టుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నా. సంస్థలో చాలా విలువైన క్షణాల్ని గడిపాను. అత్యద్భుతమైన సహచర ఉద్యోగుల్ని పొందాను. అందుకు తోడ్పడిన యాజమాన్యానికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్రమంలో పైజ్ సిప్రియాని మరోసారి లింక్డిన్లో తన జాబ్ గురించి అప్డేట్ చేశారు. విచిత్రంగా అమెజాన్‌లో పోగొట్టుకున్న జాబ్‌ను తిరిగి పొందగలిగాను. సంతోషంగా ఉంది. జనవరిలో సోషల్ మీడియా ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ విధులు నిర్వహిస్తుండగా అమెజాన్ పింక్ స్లిప్ ఇచ్చిందని గుర్తు చేశారు. అనూహ్యంగా మళ్లీ ఇప్పుడే అదే విభాగంలో, ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్‌గా రీజాయిన్ అయ్యాను అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 9,000 మంది ఉద్యోగుల తొలగింపు తాజాగా, ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థలో విధులు నిర్వహిస్తున్న మొత్తం 9,000 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు సీఈవో యాండీ జెస్సీ ప్రకటించారు. వారిలో 500 మంది భారతీయ ఉద్యోగులు సైతం ఉన్నారు. చదవండి👉 చంద్రుడి మీదకు మనుషులు.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు జాక్ పాట్! -
Amazon Layoffs 2023: తిండి తిప్పలు మానేసి పనిచేస్తే.. అమెజాన్ మాజీ హెచ్ఆర్ ఉద్యోగి ఆవేదన!
ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాలతో ప్రపంచ వ్యాప్తంగా చిన్న చితకా కంపెనీల నుంచి టెక్ దిగ్గజ సంస్థల వరకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు వైపు మొగ్గుచూపుతున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గతేడాది నవంబర్ నెలలో 18 వేల మందిని, ఈ ఏడాది మార్చిలో 9,000 మందిని తొలగించింది. అయితే ఇటీవల రెండో సారి ఉద్యోగుల తొలగింపులు జరిగాయి. లేఆఫ్స్‌పై ప్రకటన చేసి నెల రోజులు అవుతున్నా తాము ఉద్యోగాలు కోల్పోయామని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అలా ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోయిన వారిలో అమెజాన్ హెచ్ ఒకరు. 8 ఏళ్ల పాటు హెచ్ఆర్గా పనిచేసిన ఓ మహిళా ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ అమెజాన్ మెయిల్ చేసింది. ఆ మెయిల్‌పై బాధిత మహిళా ఉద్యోగి లింక్డిన్ పోస్ట్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడే లంచ్ చేసిన్ తర్వాత సిస్టమ్ ఆన్ చేశా. కానీ యాక్సెస్ కోల్పోయా. తిండి తిప్పలు మానేసి పని చేసే ఉద్యోగులకు ముందస్తు సమాచారం లేకుండా తొలగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాబు కోల్పోయాక చాలా షాక్‌కి గురైనట్లు లింక్డిన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. -
ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్!
మే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో బట్టలు, స్మార్ట్ ఫోన్లు ఇతర గృహోపరకరణాలు కొనుగోలు చేయాలని అనుకున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ దేశీయ ఈ - కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొనుగోలు దారులకు అదిరిపోయే సేల్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. మే 5 నుంచి మే 10 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్స్ ఆరు రోజుల పాటు జరిగే ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్‌లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్స్, బై వన్ గెట్ వన్ ఆఫర్లను పొందవచ్చు. అదే సమయంలో నిర్వహించే క్రేజీ డీల్స్, బెస్ట్ ప్రైస్ వంటి డీల్స్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. 80శాతం వరకు డిస్కౌంట్స్ ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం, గ్రూమింగ్, స్టైలిష్ ప్రొడక్ట్‌లపై ఆఫర్లు, మైక్రో ఎస్డీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్, హార్డ్ డ్రైవ్‌లపై 60 శాతం డిస్కౌంట్, టీవీలు, ఉపకరణాలపై 75 శాతం, రిఫ్రిజిరేటర్లు,వాషింగ్ మెషీన్లపై 55 శాతం, గృహోపకరణాలపై 70 శాతం డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు.ప్లిప్‌కార్ట్ సొంతం ప్రొడక్టులైన ఫ్యాషన్, బ్యూటీ,ఫుడ్, స్పోర్ట్స్ ప్రొడక్ట్, హోమ్, కిచెన్‌లో వినియోగించే వస్తువులపై 80శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ పాలసీ ఈ సేల్ మే 5న ప్రారంభమై మే 10న ముగుస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు మే 4న డీల్స్‌లో కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు 5శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ. 20వేల విలువైన సూపర్‌కాయిన్స్, రివార్డ్‌ల కంటే నాలుగు రెట్లు సంపాదించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ పాలసీలో వస్తువులు కొనుగోలు చేసి తర్వాత డబ్బులు చెల్లించే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చదవండి👉 మే 1 నుంచి అమల్లోకి రానున్న ఫోన్ కాల్స్ నిబంధనలు! -
బంపరాఫర్ : రూ.23వేల ఫోన్ రూ.10వేలకే సొంతం చేసుకోండిలా!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో సరికొత్త సేల్‌తో ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు జరిగే ఈ సేల్‌లో వైడ్ రేజ్ స్మార్ట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫోన్లపై 40 శాతం భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ సేల్‌లో ఇటీవలే విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ23పై బంపరాఫర్ ప్రకటించింది. రూ.10వేల కంటే ధరకే కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. (క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) తగ్గిన 5జీ శాంసంగ్ గెలాక్సీ ఏ23 ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ 6జీబీ ర్యామ్ అండ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ అసలు ధర రూ.23,990కే ఉండగా సేల్‌లో 27 శాతం డిస్కౌంట్‌తో రూ.17499కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ.5వేల వరకు ట్రాన్సాక్షన్ చేస్తే రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం డిస్కౌంట్ తో పాటు ఇతర ఆఫర్లు కలుపుకుంటే రూ.16499కే సొంతం చేసుకోవచ్చు. చదవండి👉 అమెజాన్‌లో ఆఫర్లు.. ఈ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్! శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఎక్ఛేంజ్ ఆఫర్ పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద రూ.16300 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం మీరు వినియోగిస్తున్న ఫోన్ పనితీరు బాగుంటే శాంసంగ్ గెలాక్సీ ఏ23ని ఎక్ఛేంజ్ ఆఫర్, ఇతర బ్యాంక్ ఆఫర్లతో రూ.10వేలకే కొనుగోలు చేసే వెసలు బాటు కల్పించింది అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ ఏ23లో 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్- వీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 16జీబీ ర్యామ్, ఫోటోగ్రఫీ కోసం అల్ట్రా వైడ్, డెప్త్, మ్యాక్రోలెన్సెస్లతో 50 ఎంపీ క్వాడ్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇదీ చదవండి: పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్వీడియో -
అమెజాన్‌లో ఆగని ఆఫర్లు.. ఈ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్!
Amazon Blockbuster Value Days Sale: మీరు ఓ కంపెనీకి చెందిన బ్రాండెడ్ టీవీ కొనాలనుకుంటున్నారు? అయితే ఆ టీవీ డిస్కౌంట్‌కే వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అందుకోసం ఏయే ఈ - కామర్స్ సంస్థలు టీవీలపై డిస్కౌంట్లు ఇస్తున్నాయోనని అని ఎదురు చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ‘బ్లాక్‌బ్లస్టర్ వ్యాల్యూ డేస్’ సేల్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు ప్రత్యేకంగా సేల్ నిర్వహించ నుంది. ఈ సేల్‌లో పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అంతేకాదు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై జరిపే కొనుగోళ్లు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 10 శాతం ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ సైతం అందిస్తుంది. (పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్ వీడియో) ఇక ఈ ప్రత్యేకమైన సేల్‌లో 32 అంగుళాల స్మార్ట్ టీవీలపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ‘4కే, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ’ టీవీలపై 60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఏడాది పాటు నో - కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. (క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) వన్ ప్లస్, ఎల్జీ, సోనీతో పాటు ఇతర టీవీ ఉత్పత్తులపై 70శాతం డిస్కౌంట్‌కే సొంతం చేసుకోవచ్చు. వన్ ప్లస్, రెడ్మీ, శాంసంగ్‌తో పాటు ఇతర గేమింగ్ డివైజ్‌లపై 25శాతం, గేమ్ టైటిల్స్‌పై 50 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు. అమెజాన్ ఉత్పత్తులైన ప్లే స్టేషన్ డివైజ్‌లపై 70 శాతం తగ్గింపుకే సొంతం చేసుకోవచ్చు. ఫోన్లపై డిస్కౌంట్లు బ్యాంక్ ఆఫర్లతో పాటు ధరల విభాగాలలో ప్రసిద్ధ మోడళ్లపై తగ్గింపు ధరలకే అమెజాన్ విక్రయిస్తుంది. విక్రయ సమయంలో, ఫ్యాషన్, గృహోపకరణాలు, కిచెన్‌లో వినియోగించే వస్తువులు ఇలా ఇతర విభాగాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉండనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే! -
ఫ్రీ డెలివరీ రోజులు పోయాయి! కస్టమర్లను ఆకట్టుకోవడానికే అదంతా!
ప్రస్తుతం జనం ఆన్లైన్ షాపింగ్‌కు బాగా అలవాటు పడ్డారు. దుస్తుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా అన్నీ ఆన్లైన్లోనే కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫ్రీ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. అయితే ఆ ఫ్రీ డెలివరీ రోజులు పోయాయి. (గూగుల్‌పే యూజర్లకు సర్ప్రైజ్.. ఫ్రీగా సిబిల్ స్కోర్) ఈ కామర్స్ సంస్థల్లో వాస్తవానికి ఉచిత షిప్పింగ్ వంటివి ఏవీ ఉండవు. ఓ వైపు ఉచిత డెలివరీ అంటూ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు డెలివరీ చార్జీలు రాబట్టుకోవడానికి ఈ-కామర్స్ సంస్థలు ఎత్తులు వేస్తున్నాయి. త్వరగా ఉత్పత్తుల డెలివరీ కోసం అదనపు చార్జీలు, ఉచిత డెలివరీ కావాలంటే కనీస కొనుగోలు మొత్తం అధికంగా పెంచడం వంటివి చేస్తున్నాయి. (కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!) ఈ కామర్స్ సంస్థల్లో ఫ్రీ డెలివరీ రోజులు పోయాయని కేంబ్రిడ్జ్ రీటైల్ అడ్వైజర్స్ మేనేజింగ్ పార్టనర్ కెన్ మోరిస్ తెలిపారు. ఉత్పత్తి ద్రవ్యోల్బణం, విపరీతమైన షిప్పింగ్ ఖర్చులు ఈ-కామర్స్ సంస్థలకు ఇబ్బందిగా పరిణమించాయని, మాంద్యం ప్రభావంతో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) -
అబ్బా ..ఇది కదా ఆఫర్ అంటే, ఐఫోన్ 14ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఐఫోన్ 14 ఫోన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128 జీబీ ఐఫోన్ 14 ధర రూ.71,999గా ఉంది. అయితే అదే ఫోన్‌ను ఎక్ఛేంజ్, బ్యాంక్ డిస్కౌంట్‌తో తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం దొరికింది. ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.30 వేల వరకు ఎక్ఛేంజ్ ఆఫర్లు అందిస్తుంది. ఈ ఎక్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే మీరు వినియోగిస్తున్న ఫోన్ కండీషన్ బాగుండాలి. పనితీరు ఆధారంగా ఎక్ఛేంజ్ ఆఫర్ ఎంత మొత్తం ఇవ్వాలనేది ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం ఇస్తుంది. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే మరో రూ.4వేల వరకు తగ్గుతుంది. ఐఫోన్ 14 ఫీచర్లు ఐఫోన్ 14 ఫీచర్ల విషయానికి వస్తే ఈ హాట్ డివైజ్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్, ప్రైమరీ 12ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సర్, సెకండరీ 12ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో పాటు వీడియో రికార్డింగ్ కోసం డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిఉంది. 16 కోర్ ఎన్పీయూ, 5 కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌తో కూడిన ఏ15 బయోనిక్ చిప్‌ను కలిగిఉంది. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ ఐఓఎస్ 16 వెర్షన్‌పై రన్ అవుతుంది. చదవండి👉‘నో సిమ్ కార్డ్ ట్రేస్’.. ఐఫోన్ 15 సిరీస్‌పై ఆసక్తికర కథనాలు -
ఎగుమతుల లక్ష్యం.. 2 ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: ఎగుమతులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించింది. అంతేకాకుండా ఈకామర్స్ ఎగుమతులకు ప్రోత్సాహకాలను అందించాలని కూడా ప్రతిపాదించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రవేశపెట్టిన ఎఫ్టీపీ 2023 ప్రకారం రాయితీల జమానా నుండి ప్రోత్సాహకాల దిశగా మారేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఎగుమతిదారులు, రాష్ట్రాలు, జిల్లాలు, భారతీయ మిషన్ల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించనున్నారు. లావాదేవీల వ్యయాన్ని తగ్గించడం, మరిన్ని ఎగుమతి హబ్‌లను అభివృద్ధి చేయడం కూడా తాజా పాలసీలో భాగం. డైనమిక్ పాలసీ... గతంలో అయిదేళ్లకోసారి ప్రకటించే ఎఫ్‌టీపీల మాదిరిగా కాకుండా ఈసారి ప్రభుత్వం డైనమిక్ అలాగే పరిస్థితులకు అనుగుణంగా స్పందించే పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీకి గడువు ముగింపు అంటూ ఏదీ ఉండదు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా పాలసీని సవరిస్తారు. ‘ఈ పాలసీకి గడువు తేదీ ఏదీ లేదు, కాలానుగుణంగా మార్పులు చేయడం జరుగుతుంది’ అని పాలసీ ఆవిష్కరణ అనంతరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీటీఎఫ్‌టీ) సంతోష్ సారంగి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు మరిన్ని ప్రాంతాలకు భారీగా విస్తరించే విధంగా వాణిజ్య శాఖ చర్యలు చేపడుతుందని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రంగాల వారీగా లేదంటే దేశాల వారీగా దృష్టి పెడతామన్నారు. వచ్చే 4–5 నెలల్లో విదేశాల్లోని భారతీయ మిషన్లతో కలిసి వాణిజ్య శాఖ ఈ దిశగా చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు. ‘2030 నాటికి 2 ట్రలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవాలనేది మా లక్ష్యం. దీన్ని సాధిస్తామన్న నమ్మకం ఉంది. అయితే వస్తు ఎగుమతులు, సేవల ఎగుమతులను అధిగమించాలని మేము భావించడం లేదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. శుక్రవారంతో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి వస్తు, సేవల ఎగుమతులు 765 బిలియన్ డాలర్లను అధిగమించనున్నాయని డీజీఎఫ్టీ తెలిపారు. 2021–22లో ఈ మొత్తం ఎగుమతుల విలువ 676 బిలియన్ డాలర్లుగా నమోదైంది. రూపాయికి గ్లోబల్ హోదా... అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలని ఎఫ్టీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే, విదేశీ వాణిజ్య లావాదేవీలకు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశీ కరెన్సీలో సెటిల్మెంట్లకు ఎగుమతి ప్రయోజనాలను కల్పించనున్నారు. ‘కరెన్సీపరమైన సంక్షోభాలు, లేదంటే డాలర్లకు కొరత ఉన్న దేశాలతో రూపాయిల్లో వాణిజ్య లావాదేవీలు నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ పేర్కొన్నారు. కాగా, యంత్రపరికరాల ఎగుమతి ప్రోత్సాహక (ఈపీసీజీ) స్కీమ్ అలాగే ముందస్తు అనుమతులకు ప్రతిగా ఎగుమతి బాధ్యతలను (ఈఓ) నెరవేర్చడంలో విఫలమైన ఎగుమతిదారులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కోసం క్షమాబిక్ష స్కీమ్‌ను కూడా తాజా ఎఫ్టీపీలో పొందుపరిచారు. దీని ప్రకారం ఈఓల విషయంలో డిఫాల్ట్ అయిన పెండింగ్ కేసులన్నింటినీ క్రమబద్దీకరిస్తారు. దీనికోసం మినహాయింపు పొందికస్టమ్స్ సుంకాలను, అలాగే 100% వడ్డీతో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆచరణాత్మక పాలసీ.. ఎఫ్టీపీ 2023ని కార్పొరేట్ వర్గాలు స్వాగతించాయి. ప్రపంచ వాణిజ్యంలో భారత వాటాను పెంచేలా ఆచరణాత్మక, సానుకూలమైన పాలసీగా పరిశ్రమ చాంబర్లు, ఎగుమతిదారులు దీన్ని అభివర్ణించారు. 2 ట్రిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతి లక్ష్యాన్ని సాధించేలా అనేక వినూత్న చర్యలను పాలసీలో ప్రకటించారని భారతీయ పరిశ్రమల సమాఖ్య డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ కొత్త పాలసీ అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటాను భారీగా పెంచేందుకు దోహదం చేస్తుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ వ్యాఖ్యానించారు. పాలసీలో ఇతర చర్యలు... ► జిల్లాలను ఎగుమతి హబ్‌లుగా చేసేందుకు రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో కలిసి పనిచేయడంపై కూడా ఎఫ్టీపీ 2023 దృష్టిపెట్టింది. ► యూఏవీ/డ్రోన్స్, క్రయోజనిక్ ట్యాంక్స్, ప్ర త్యేక రసాయనాల వంటి ద్వంద్వ వినియోగ హై ఎండ్ ఉత్పత్తులు, టెక్నాలజీల ఎగుమతుల కోసం సరళమైన పాలసీలపై దృష్టిసారిస్తారు. ► ఈకామర్స్ ఎగుమతులకు ఎగుమతి ప్రయోజనాలను ప్రత్యేకంగా అందించాలని పాలసీ నిర్దేశించింది. కొరియర్ ద్వారా ఎగుమతుల విలువ పరిమితిని రెంట్టింపు చేస్తూ, ఒక్కో కన్సైన్మెంట్ను రూ.10 లక్షలకు చేర్చనున్నారు. కాగా, ఈకామర్స్ అగ్రిగేటర్లకు స్టాకింగ్, కస్టమ్స్ అనుమతులు, రిటర్న్‌ల ప్రక్రియను సులభతం చేసేందుకు గిడ్డంగి సదుపాయంతో కూడిన ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2030 నాటికి ఈకామర్స్ ఎగుమతులు 200–300 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతాయని అంచనా. ► అన్ని రకాల బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ), వర్టికల్ సాగు యంత్రాలు, మురుగునీటి శుద్ధి, రీసైక్లింగ్, వర్షపు నీటి ఫిల్లర్లు, గ్రీన్ హైడ్రోజన్‌లను పర్యావరణహిత టెక్నాలజీ ఉత్త్పత్తుల్లోకి చేర్చారు. తద్వారా ఈపీసీజీ స్కీమ్ ప్రకారం వీటిపై ఎగుమతి పరమైన నియంత్రణలు తగ్గుతాయి. -
ఫ్లిప్‌కార్ట్‌లో మరో అదిరిపోయే సేల్!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో ప్రత్యేక సేల్‌తో ముందుకు వచ్చింది. మార్చి 24 నుంచి మార్చి 30 వరకు జరిగే ఈ సేల్‌లో అన్నీ రకాల స్మార్ట్ పోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను డిస్కౌంట్లకే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో బ్యాంకులు సైతం కొన్ని ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సమయంలో 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 13ను రూ. 61,999కే విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ.69,900గా ఉంది. అదే వేరియంట్లో ఐఫోన్ 14పై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,000 తగ్గింపు ఆఫర్ ఉండగా..రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు. ఇటీవల విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 256జీబీ స్టోరేజ్ రూ. 79,999 అమ్మకానికి ఉండగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డ్‌ని ఉపయోగించి రూ. 74,999ని పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సమయంలో 5జీ రెడ్మీ నోట్ 12 ప్రో రూ. 24,999 అమ్ముతుంది. ఇదే ఫోన్‌పై హెచ్డీఎఫ్సీ కార్డులను వినియోగిస్తే రూ. 2,000 తగ్గింపు ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వివో వి27 అసలు ధర రూ. 32,999 వద్ద ఉండగా..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,500 తగ్గింపు ఆఫర్‌తో రూ. 30,499 కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లపై సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. -
ఉద్యోగులకు బంపరాఫర్!
ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో సగటున ఉద్యోగుల జీతాలు 10.2 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ- కామర్స్, ప్రొఫెషనల్ సర్వీస్, ఐటీ విభాగాల్లో ఈ వేతనాల పెంపు ఉండనున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. ‘ఫ్యూచర్ ఆఫ్ పే 2023’ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జీతాలు 10.2 శాతం పెరగనున్నట్లు తెలిపింది. గత ఏడాది పెరిగిన సగటు ఉద్యోగుల శాలరీలు 10.4 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2022లో కంటే.. 2023లో జీత భత్యాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బ్లూ కాలర్ ఉద్యోగాలైన మైనింగ్, ఎలక్ట్రసిటీ జనరేషన్, పవర్ పాంట్ల్ ఆపరేషన్స్, ఆయిల్ ఫీల్డ్ వర్క్, రీసైక్లింగ్, డ్రైవింగ్ వంటి ఉద్యోగుల జీతాలు తగ్గే అవకాశం ఉన్నట్లు నివేదించింది. జీతాలు పెరిగే రంగాలు ఇవే దేశంలో మొత్తం మూడు రంగాల్లో ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నట్లు ఫ్యూచర్ ఆఫ్ పే 2023 రిపోర్ట్ హైలెట్ చేసింది. వాటిలో ఈ-కామర్స్ విభాగంలో 12.5శాతం, ప్రొఫెషనల్ సర్వీసులైన అకౌంటెంట్స్, డాక్టర్స్, న్యాయవాదులుగా పనిచేసే వారికి 11.9శాతం పెరగ్గా.. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల జీతాలు 10.8 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. -
అమెజాన్ ఉద్యోగులకు భారీ షాక్.. 9వేల మంది తొలగింపు
ఉద్యోగులకు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ షాకివ్వనుంది. రానున్న వారాల్లో సుమారు 9 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. వారిలో ఏడబ్ల్యూఎస్, అమెజాన్ అడ్వటైజింగ్, ట్విచ్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక లేఆఫ్స్‌పై అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపారు. ఆ మెయిల్స్‌లో తొలగింపుల నిర్ణయం కష్టంతో కూడుకున్నది. కానీ సంస్థ దీర్ఘకాలిక విజయాలు సాధించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. 18వేల మంది ఉద్యోగుల తొలగింపు గత ఏడాది నవంబర్ నెలలో అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తొలిసారి ఉద్యోగుల తొలగింపులపై కీలక ప్రకటన చేశారు. అమెజాన్ People eXperience and Technology (PXT)కి చెందిన ఉద్యోగుల్ని స్వచ్ఛందంగా తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా ఈ ఏడాది జనవరిలో 18వేల మందిని ఫైర్ చేసింది. వారి అమెజాన్ స్టోర్, పీఎక్స్‌టీ ఉద్యోగులు ఉన్నారు. ఇక తాజాగా మరో 9 వేల మందిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడం ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. మెటాలో 10 వేల మంది ఉద్యోగులు ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాల కారణంగా మెటా 10 వేల మంది సిబ్బందికి పింక్ స్లిప్‌లు జారీ చేస్తున్నట్లు ప్రకటించగా.. తొలిసారి 11వేల మందిని ఫైర్ చేసిన విషయం తెలిసిందే. -
డీమార్ట్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో రిటైల్ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 590 కోట్లకు చేరింది. డీమార్ట్ స్టోర్ల కంపెనీ గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 553 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మరింత అధికంగా 26 శాతం ఎగసి రూ. 11,569 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 8,494 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ కాలంలో ఈకామర్స్ బిజినెస్(డీమార్ట్ రెడీ)ను మరో 4 నగరాలకు విస్తరించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ నెవిల్లే నోరోనా పేర్కొన్నారు. వెరసి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 నగరాలలో సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. అనుబంధ సంస్థ రిఫ్లెక్ట్ హెల్త్‌కేర్ అండ్ రిటైల్ ద్వారా షాప్ ఇన్ షాప్కింద పరిశీలనాత్మకంగా ఒక స్టోర్ లో ఫార్మసీని ప్రారంభించినట్లు వెల్లడించారు. డి సెంబర్కల్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా దేశవ్యాప్తంగా 306 డీమార్ట్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో డీమార్ట్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 3,680 వద్ద ముగిసింది. -
అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. ఈసారి ఎంతమంది అంటే?
ఆర్ధిక మాద్యం భయాల కారణంగా ఆదాయం తగ్గిపోతుండడంతో ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 18వేలమందిని ఫైర్ చేస్తున్నట్లు ప్రకటించిన అమెజాన్ తాజాగా మరో 1200 అంత కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం.. ఖర్చుల్ని తగ్గించుకుంటున్న అమెజాన్ వరుస లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో యూకేకి చెందిన ఆ సంస్థ మూడు వేర్ హౌస్‌లను షట్ డౌన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా 1200మంది ఉద్యోగులపై వేటు పడనుంది. వేర్ హౌస్‌లను ఎందుకు షట్‌డౌన్ చేస్తుందనే అంశంపై స్పష్టత లేనప్పటికి వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు, కస్టమర్లకు మెరుగైన సేవలందించే క్రమంలో కొన్ని వేర్‌హౌస్‌ల మూసివేత, మరికొన్నింటిలో విస్తరణ చేపడతామని, అవసరమైన చోట న్యూ సైట్స్‌ను ఓపెన్ చేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అంతేకాదు తొలగిస్తున్న ఉద్యోగులు ఉపాధి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని,లేఆఫ్స్ ఉద్యోగులు అమెజాన్ సంస్థకు చెందిన ఇతర సర్వీసుల్లో లేదా సైట్లలో పని చేసే అవకాశాన్ని పొందుతారని కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు. రాబోయే మూడేళ్లలో అమెజాన్ ఫిల్ఫుల్ సెంటర్లను ప్రారంభించాలని వెల్లడించారు. తద్వారా 2,500మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. -
ఫ్లిప్‌కార్ట్ నుంచి విడివడ్డ ఫోన్‌పే
న్యూఢిల్లీ: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్‌పే విడివడింది. ఇకపై రెండు సంస్థలూ వేర్వేరుగా కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి. ఈ రెండింటికీ యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మాతృ సంస్థకాగా.. ఫోన్‌పేను 2016లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కొనుగోలు చేసింది. తాజా లావాదేవీలో భాగంగా వాల్‌మార్ట్ ఆధ్వర్యంలోని ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సింగపూర్, ఫోన్‌పే సింగపూర్ వాటాదారులు ఫోన్‌పే ఇండియాలో ప్రత్యక్షంగా షేర్లను కొనుగోలు చేసినట్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. వెరసి ఫోన్‌పే భారత కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన ఈ ప్రాసెస్ తాజాగా పూర్తయినట్లు వెల్లడించింది. రెండు బిజినెస్ గ్రూపులలోనూ వాల్‌మార్ట్ మెజారిటీ వాటాదారుగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. ఒక్కో కంపెనీ 40 కోట్ల యూజర్ బేస్ ద్వారా దేశీ దిగ్గజాలుగా ఎదిగినట్లు ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫోన్‌పే స్వస్థలాన్ని(డొమిసైల్) సింగపూర్ నుంచి భారత్‌కు మార్పు చేసుకున్నట్లు తెలియజేశారు. -
ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. న్యూఇయర్‌కు వెల్కమ్ చెబుతూ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 21 వరకు ఫ్లిప్‌కార్ట్ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లకే అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫోన్లతో పాటు ఇతర డివైజ్‌లను డిస్కౌంట్లకే దక్కించుకోవచ్చు. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో ప్లస్ మెంబర్షిప్ సభ్యులు ఒకరోజు ముందు నుంచి అంటే డిసెంబర్ 15 నుంచి వారికి నచ్చిన ప్రొడక్ట్‌కు కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ విక్రయాల్లో అర్హులైన కష్టమర్లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కొద్ది రోజుల క్రితం ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహించింది. ఆ సేల్ మిస్సైన వాళ్లు ఈ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ పాల్గొనవచ్చు. స్మార్ట్ ఫోన్లతో పాటు, డిస్కౌంట్ ధరలో ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్, మానిటర్లు, ప్రింటర్లు సహా ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకూ డిస్కౌంట్స్, టీవీలు, గృహోపకరణాలపై 75 శాతం వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఈకామర్స్ దిగ్గజం వెల్లడించింది. -
మెటావర్స్‌లో అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్
ఫ్లిప్‌కార్ట్ మరో అడుగు ముందుకు వేసింది. ఈ కామర్స్ మార్కెట్లో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ ఫ్లిప్‌వెర్స్ అనే మెటావర్స్ వర్చువల్ షాపింగ్ ఫ్లాట్ ఫామ్‌ను ప్రారంభిస్తున్నట్లు (ఇవాళే) ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఈ డీఏఓ (eDAO)తో చేతులు కలిపింది. ప్రస్తుతం, ఈ ఫ్లిప్‌వెర్స్ ప్రారంభ దశలో ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్వర్స్తో ఏం చేయొచ్చు ఈ మెటావర్స్ ప్రాజెక్ట్ ఇ-కామర్స్ ప్రపంచాన్ని మార్చబోతున్నట్లు తెలుస్తోంది. కొనుగోలు దారుల్ని ఆకర్షించేలా వారికి కొత్త షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. మరో మాటలో చెప్పాలంటే, ఉదాహరణకు యూట్యూబ్‌లో ‘ఫిల్మీమోజీ’ అనే తెలుగు వీడియోస్‌ను చూసే ఉంటారు. ఐఫోన్లో మెమోజీ అనే ఫీచర్‌ను ఉపయోగించి ఇందులో పాత్రలను రూపొందించారు. వీటితో మనుషుల పోలిన అవతారాలను సృష్టించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ కూడా అంతే. ఈ ఫ్లిప్వెర్స్లో మీకు నచ్చిన ప్రొడక్ట్‌ను అలా తయారు చేసి డిస్ప్లేలో పెడుతుంది. మెటావర్స్ సాయంతో డిస్ప్లేలో ఉన్న ప్రొడక్ట్‌ను సెలక్ట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు. కొనుగోలు దారుల్ని ఆకర్షిస్తుంది ఫ్లిప్‌వెర్స్ ఈవెంట్ లాంచ్‌లో ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ..తాము ముందే చెప్పినట్లుగా ..ఫ్లిప్వర్స్ చాలా ప్రత్యేకం. మెటావర్స్ అవతార్ల రూపంలో వర్చువల్ రియాలిటీతో వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. అలాగే, వర్చువల్ షాపింగ్ ద్వారా కొనుగోలు దారులకు నచ్చిన ప్రొడక్ట్‌ను చెక్ చేసుకునే సదుపాయం కల్పిస్తుందని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవలు, త్వరలో ప్రారంభం!
గురుగ్రామ్: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రీజియన్ కార్యకలాపాలు ఈ ఏడాదే ప్రారంభించనుంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మ్యాక్స్ పీటర్సన్ ఈ విషయం వెల్లడించారు. హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ రీజియన్‌లో మూడు జోన్లు ఉంటాయని, ప్రతి జోన్లో ముందుగా రెండు డేటా సెంటర్లతో ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. కంపెనీ తమ తొలి ఏడబ్ల్యూఎస్ రీజియన్‌ను 2016లో ముంబైలో ప్రారంభించింది. ఇప్పటివరకూ స్థానిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై భారత్‌లో 3.71 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఏడబ్ల్యూఎస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పీటర్సన్ పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంశంపై పరిశోధనలకు కొత్త బ్యాచ్‌ను కూడా ఆయన ప్రకటించారు. -
రిలయన్స్‌తో జతకట్టిన ప్రభుత్వరంగ ఈ కామర్స్ సేవల సంస్థ ఎంఎస్టీసీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఈ కామర్స్ సేవల సంస్థ ఎంఎస్టీసీ.. ప్రైవేటు సంస్థలకు సైతం తన సేవలను విస్తరించాలని భావిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా పవర్, వేదాంత, ఎల్అండ్టీతో టైఅప్ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవాళ్లతోనే ఉంటుందని, వీటిని ఎదుర్కొనేందుకు చురుకైన మార్గాలను అన్వేషించాల్సి ఉంటుందని పేర్కొంది. సమీప భవిష్యత్తులో డిజిటల్‌కు మారిపోవడం కీలకంగా ఉంటుందని, సంస్థ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ఎంఎస్టీసీ చైర్మన్, ఎండీ సురీందర్ కుమార్ గుప్తా 2021–22 వార్షిక నివేదికలో తెలి పారు. దేశంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థగా అవతరించామని, మరిన్ని విభాగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు చెప్పారు. -
కొనుగోలు దారులకు బంపరాఫర్, 75శాతం డిస్కౌంట్‌తో మరో సేల్!
కొనుగోలు దారులకు బంపరాఫర్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పోటీ పడి వినియోగదారులకు డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో పాటు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నాయి. అమెజాన్ ఆగస్ట్ 6న నుంచి గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 10 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈసేల్‌లో శాంసంగ్, రియల్మీ, షావోమీతో పాటు ఇతర సంస్థలకు చెందిన టీవీలపై టెలివిజన్, హోం అప్లయన్సెస్‌పై 75శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు చెప్పింది. కండీషనర్ల(షాంపూలు)పై 55శాతం వరకు డిస్కౌంట్, మైక్రోవేవ్లపై 55శాతం, ఎయిర్ కండీషనర్లపై 55శాతం, వేరబుల్స్ అంటే స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ రింగ్స్, స్మార్ట్ గ్లాస్లపై 10శాతం నుంచి 70శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదే సమయంలో యాపిల్, వివో,ఒప్పో, మోటరోలాతో పాటు ఇతర బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చని అన్నారు. క్రేజీ డీల్స్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో 'క్రేజీ డీల్స్' పేరుతో 12ఏఎం, 8ఏఎం, 4పీఎంలలో ప్రత్యేకంగా అమ్మకాలు నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 'రష్ అవర్స్' 2ఏఎంలో కొనుగోలు చేసిన ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్లు అందించనుంది. -
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు భారీ షాక్!
యూజర్లకు ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ షాకివ్వనుంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ఫ్యూయల్ కాస్ట్ పెరగడం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో పాటు వేర్ హౌస్ షార్టేజ్ వంటి కారణాల్ని చూపిస్తూ కొన్ని దేశాల్లో అమెజాన్ ప్రైమ్ ధరల్ని 43శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అమెజాన్ ప్రైమ్ ధరలు భారీగా పెరగనున్నాయి. పలు నివేదికల ప్రకారం.. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ధరల్ని పలు దేశాల్లో భారీగా పెరగనున్నాయి. పెరగనున్న దేశాల్లో భారత్ లేకపోవడంపై యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఏడాది కాలం పాటు పెరగనున్న సబ్ స్క్రిప్షన్ ధరలు ఒక్కసారి చూస్తే ఫ్రాన్స్‌లో 43శాతం, ఇటలీలో 49.90శాతం, స్పెయిన్‌లో 39శాతం, యూకేలో 95శాతం, జర్మనీ లో 89.90 శాతం వరకు ఉండనున్నాయి. భారత్‌లో ఎప్పుడు పెరిగాయంటే ఇతర దేశాల్లో అమెజాన్ దాని సబ్ స్క్రిప్షన్ ధరల్ని పెంచినా భారత్‌లో మాత్రం పెంచలేదు. చివరిసారిగా మనదేశంలో గతేడాది అక్టోబర్‌లో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభ దర రూ.129 నుంచి రూ.179కి పెంచింది. మూడు నెలల సబ్స్క్రిప్షన్ రూ.459, ఏడాదికి రూ.1499కి చేసింది. -
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు బంపరాఫర్!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు శుభవార్త. జులై 23 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ►అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్న ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లైన 5జీ ఐక్యూఓఓ జెడ్6, 5జీ ఐక్యూఓఓ నియో6, ఐక్యూఓఓ జెడ్6 ప్రోలపై రూ.10వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ►ఐక్యూఓఓ జెడ్6 ఫోన్ ధర రూ.14,999 ఉండగా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై అదనంగా కూపన్ బెన్ఫిట్స్, ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు పలు స్మార్ట్ ఫోన్ మోడళ్లపై ఎక్ఛేంజ్ ఆఫర్లను దక్కించుకోవచ్చు. ►ఐక్యూఓఓ జెడ్6 ఫోన్ 6జీబీ ర్యామ్ ప్లస్ 128జీ స్టోరేజ్ ఫోన్‌ను 19శాతం డిస్కౌంట్‌తో రూ.16,999కే పొందవచ్చు. ►ఐక్యూఓఓ జెడ్6 ప్రో లెజియన్ స్కై 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ పై 14శాతం డిస్కౌంట్‌తో ధర రూ.23999కే కొనుగోలు చేయోచ్చు. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌పై రూ.3వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ►అదే విధంగా ఐక్యూఓఓ నియో6..6జీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌పై 14శాతం డిస్కౌంట్ పొందవచ్చు. రూ.5వేల డిస్కౌంట్‌తో రూ.29,900కే పొందవచ్చు. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్‌పై రూ.3000 డిస్కౌంట్, రూ.11,950 వరకు ఎక్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఐక్యూఓఓతో పాటు ఇంకా ఐక్యూఓఓతో పాటు అదనంగా రెడ్మీ 9సిరీస్, రెడ్మీ నోట్ 10 సిరీస్‌లోని రెడ్మీ నోట్ 10టీ, నోట్ 10ప్రో, రెడ్మీ నోట్ 10ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రెడ్మీ నోట్ 10ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, శాంసంగ గెలాక్సీ ఎం52లపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. -
ఈ–కామర్స్ రంగంలోకి హోండా ఇండియా పవర్!
న్యూఢిల్లీ: హోండా ఇండియా పవర్ ప్రోడక్ట్స్ (హెచ్‌ఐపీపీ) తాజాగా ఈ–కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. జనరేటర్లు, వాటర్ పంప్‌లు, టిల్లర్లు, బ్రష్ కటర్లు, లాన్ మోవర్లు వంటి అయిదు రకాల ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించనున్నట్లు సంస్థ చైర్మన్, ఎండీ తకహిరో యుడా తెలిపారు. తమ కంపెనీ డీలర్ షిప్‌లకు రాలేని కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు డిజిటల్ బాట పట్టినట్లు ఆయన వివరించారు. ‘ప్రస్తుతం మాకు దేశవ్యాప్తంగా 600 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో కస్టమర్లకు.. సమీప అవుట్లెట్లు 50 కిలోమీటర్ల పైగా దూరంలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఉత్పత్తులను ఎంచుకునేందుకు, చెల్లింపులు జరిపేందుకు మా వెబ్సైట్ ఉపయోగపడుతుంది. ప్రీ–డెలివరీ ఇన్స్పెక్షన్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ తదితర కార్యకలాపాలను మా డీలర్లు చూసుకుంటారు‘ అని తకహిరో వివరించారు. ఆన్లైన్లో కొత్త కస్టమర్ల రాకతో డీలర్లకు కూడా ఆదాయం పెంచుకోవడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆన్లైన్ విభాగాన్ని అయిదు ఉత్పత్తులకు పరిమితం చేస్తున్నామని తకహిరో వివరించారు. ఆన్లైన్లో తొలి ఏడాది 1,000 యూనిట్ల విక్రయాలను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. -
ఉద్యోగులకు బంపరాఫర్,ఫుల్ శాలరీ ఇస్తాం..365 రోజులు సెలవులు తీసుకోండి!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ స్టార్టప్ 'మీ షో' ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల కోసం కొత్త లీవ్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉద్యోగులు 365 రోజుల సెలవులు తీసుకోవచ్చు. అంతేకాదు తీసుకున్న సెలవులకు ఫుల్ శాలరీ ఇస్తామని ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ పట్ల ఉద్యోగులు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఆయా స్టార్టప్‌లు నష్టాల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. కానీ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మీషో మాత్రం ఉద్యోగుల సంరక్షణే ధ్యేయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. 'మీ కేర్' పేరుతో కొత్త లీవ్ పాలసీని అమలు చేసింది. ఈ ఫుల్ లీవ్ పాలసీలో అర్హులైన ఉద్యోగులకు తీసుకున్న సెలవులకు ఫుల్ శాలరీ ఇస్తున్నట్లు తెలిపింది. ఫుల్ శాలరీ మీ షోలో పనిచేస్తున్న ఉద్యోగి అనారోగ్యానికి గురై దీర్ఘ కాలిక సెలవు తీసుకోవచ్చు.సెలవు తీసుకుంటే ఫుల్ శాలరీ ఇవ్వడంతో పాటు అదనంగా ఆర్ధిక సాయం, ఇన్స్యూరెన్స్, ఇతర మెడికల్ అలెవన్స్లను అందిస్తుంది. అదే ఉద్యోగి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే..సదరు ఉద్యోగికి మూడు నెలల పాటు జీతంలో 25శాతం చెల్లిస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కాకుండా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల సెలవు పెడితే మాత్రం శాలరీ పే చేయమని స్పష్టం చేసింది. మా లక్ష్యం అదే మీషోలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా కొత్త లీవ్ పాలసీని అందుబాటులోకి తెచ్చాం. ఉద్యోగి, లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే వారి సంరక్షణ కోసం సెలవులు తీసుకునేందుకు వెనకాడకూడదు'అని మీషో చీఫ్ రిసోర్స్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే తాము తెచ్చిన ఈ పాలసీ ఎక్కువ మంది ఉద్యోగులు ఉపయోగించుకోకపోవచ్చు. కానీ ఈ పాలసీ ప్రభావం సంస్థపై చూపుతుందని అన్నారు. చదవండి👉 అతిపెద్ద సోషల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘మీ షో యాప్’ తెర వెనుక కథ!! -
అమెజాన్ సమ్మర్ సేల్ వచ్చేసింది! అస్సలు మిస్సవ్వద్దు! 75శాతం భారీ డిస్కౌంట్లు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అదిరిపోయే ఆఫర్లతో ముందుకు వచ్చింది. 'అమెజాన్ సమ్మర్ సేల్-2022' పేరిట మే4 నుంచి మే7వరకు నిర్వహించే సేల్‌లో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్‌పై 75శాతం, డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పలు బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్‌లను వినియోగించడం ద్వారా అదనంగా మరికొన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది నేటి నుంచి అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ సందర్భంగా కొనుగోలు దారులు స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్, గృహోపకరణాలు, దుస్తులు, హెడ్‌ఫోన్స్,ఇయర్ ఫోన్స్ బ్రాండ్స్ బోట్, సోనీ, స్కల్ క్యాండీ,జేబీఎల్, రియల్మీ, నాయిస్, వన్ ప్లస్‌తో పాటు ఉత్పత్తులను భారీ డిస్కౌంట్‌కే అందిస్తుంది. కార్డ్‌లపై ఆఫర్లు ఎలా ఉన్నాయ్ అమెజాన్ సంస్థ ఈసేల్ సందర్భంగా పలు బ్యాంక్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొనుగోలు దారులు ఈ సేల్‌లో ఐసీఐసీఐ, కొటాక్, ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లను వినియోగిస్తే అదనంగా 10శాతం డిస్కౌంట్, జీరో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కొత్త యూజర్లు తొలిసారి కొనుగోళ్లపై 10శాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తుంది. 60ప్రొడక్ట్‌లు అందులో.. ఈ సేల్‌లో అమెజాన్ 60రకాల ప్రొడక్ట్‌లను అందుబాటులో ఉంచింది. దుస్తులు, షూస్, బ్యాగ్స్, కిచెన్ అప్లయెన్సెస్, హోమ్ అప్లయెన్సెస్ తో పాటు ఇటీవల విడులైన 5జీ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 10ఆర్ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ బెన్ఫిట్స్ అమెజాన్ ప్రైమ్ యూజర్లకు అమెజాన్ బంపరాఫర్ ప్రకటించింది. ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్లు 1000 ఆఫర్లు ఉన్నాయని, ఎక్స్ క్లూజివ్గా ఈ ఆఫర్లు అమెజాన్ ప్రైమ్ మెంబర్లు వినియోగించుకోవచ్చని, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్స్‌పై రివార్డ్‌లను దక్కించుకోవచ్చని ఈకామర్స్ దిగ్గజం ప్రకటించింది. అమెజాన్ సమ్మర్ సేల్ ఆఫర్స్ ఎక్స్‌క్లూజీవ్‌గా అమెజాన్ నిర్వహిస్తున్న ఈ అమ్మకాల్లో స్మార్ట్ ఫోన్లు,యాక్ససరీస్, ల్యాప్ ట్యాప్స్ పై 40శాతం భారీ డిస్కౌంట్‌తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు. ఫ్యాషన్ యాక్ససరీస్,దుస్తులు,గృహోపకరణాలపై మరిన్ని అఫర్లు ఉన్నాయి. ఇక హెడ్‌ఫోన్స్,ఇయర్ ఫోన్స్‌పై 70శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది. చదవండి👉భావన.. పక్కా పల్లెటూరి పిల్ల జీతం రూ.40 లక్షలు -
మరో ప్రముఖ ఈ కామర్స్ సంస్థను కొనుగోలు చేసిన ఫ్లిప్‌కార్ట్!
న్యూఢిల్లీ: గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ గ్రూప్ ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఏఎన్ఎస్ కామర్స్‌ను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. తద్వారా దేశీయంగా ఆన్లైన్ రిటైల్ ఎకోసిస్టమ్‌ను పటిష్ట పరచనున్నట్లు తెలియజేసింది. అయితే ఏఎన్ఎస్ కామర్స్ ఇకపైన కూడా స్వతంత్ర ఈకామర్స్ సొల్యూషన్స్ ప్లాట్‌ఫామ్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది.అంతేకాకుండా ప్రస్తుత యాజమాన్యమే కంపెనీ నిర్వహణను కొనసాగించనున్నట్లు తెలియజేసింది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. -
1.5 లక్షల మొబైల్ రిటైలర్ల భవిష్యత్తు అయోమయం
కోల్‌కతా: ఈ కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న గుత్తాధిపత్య ధోరణలు, అనైతిక విధానాలతో దేశవ్యాప్తంగా 1.5 లక్షల స్మార్ట్ ఫోన్ రిటైల్ దుకాణాదారుల భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టు అఖిల భారత మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఏఐఎంఆర్ఏ) పేర్కొంది. ఈ పరిస్థితుల్లో రిటైలర్లు నిలదొక్కుకోవడం కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఈ కామర్స్ సంస్థల అనైతిక ధోరణులకు చెక్ పెట్టాలని కోరింది. చిన్న రిటైలర్లు నిలదొక్కుకోవడం కష్టం ‘‘ఆన్లైన్ విక్రయ సంస్థలు అనుసరిస్తున్న అనైతిక, వివక్షాపూరిత, గుత్తాధిపత్య వ్యాపార విధానాల వల్ల పరిస్థితి ఎంతో దిగజారింది. కొన్ని రిటైల్ షాపులు మూతపడ్డాయి. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. టెక్నాలజీ దన్నుతో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అనుసరిస్తున్న అనైతిక, గుత్తాధిపత్య విధానాలతో పోటీపడలేకపోతున్న 1,50,000 రిటైలర్లను ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం’’ అని ఏఐఎంఆర్ఏ పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ బజోరియా తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి రెండు రోజుల పాటు వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో కార్యాచరణపై ప్రణాళిక రూపొందించుకుంటామని తెలిపారు. ‘‘38 బిలియన్ డాలర్ల (రూ.2.85 లక్షల కోట్లు)తో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న మొబైల్ ఫోన్ మార్కెట్. కొన్ని అంతర్జాతీయ మొబైల్ ఫోన్ కంపెనీలు 2021లో భారత్‌కు అత్యధికంగా ఫోన్లను ఎగుమతి చేశాయి. దేశ స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ వాటా 50 శాతంగా ఉంది’’అని బజోరియా చెప్పారు. చిన్న మొబైల్ రిటైలర్లకు జీఎస్టీ ఇబ్బందికరంగా ఉన్నట్టు పేర్కొన్నారు. పెద్ద రిటైలర్లు నిబంధనలను ఉల్లంఘిస్తూ, చిన్న రిటైలర్లకు ముప్పుగా పరిణమించే వాతావరణం దేశంలో నెలకొందన్నారు. -
ఈ-కామర్స్‌కు ఆర్బీఐ పెద్దపీట! ఆన్లైన్ చెల్లింపులపై కీలక నిర్ణయం!
ముంబై: ఎగుమతులు–దిగుమతులు (ఎగ్జిమ్), ఇందుకు సంబంధించి చెల్లింపుల పరిష్కార ప్రక్రియలో ఈ–కామర్స్‌కు పెద్దపీట వేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారిస్తోంది. ఈ దిశలో ఆయా అంశాలను సరళీకరించి, హేతుబద్ధీకరించడంపై కీలక చర్య తీసుకుంది. ఇందుకు వీలుగా ప్రస్తుత నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ముసాయిదా మార్గదర్శకాల పత్రాన్ని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది. ‘‘ఎగుమతి, దిగుమతులకు సంబంధించి చిన్న స్థాయి చెల్లింపుల ప్రక్రియను ఈ కామర్స్ ద్వారా సులభతరం చేయడానికి తీసుకువస్తున్న ఆన్లైన్ ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ ఫెసిలిటేటర్స్’ అనే శీర్షికన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బ్యాంకులు, ఇతర సంబంధిత వర్గాల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ప్రాతిపదిక, సమగ్ర సమీక్ష అనంతరం తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆర్బీఐ ప్రకటన సూచించింది. పరిమితులు ఇలా... 3,000 డాలర్లకు మించని విలువైన వస్తువులు, డిజిటల్ ఉత్పత్తులను ఆన్లైన్లో దిగుమతి చేసుకోవడానికి ఈ కామర్స్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది. ఎగుమతుల విషయంలో ఈ విలువ 15,000 డాలర్ల వరకూ ఉంది. ప్రస్తుతం వస్తువులు, సేవల ఎగుమతులు, అలాగే వస్తువులు, సాఫ్ట్వేర్ల దిగుమతికి సంబంధించి చెల్లింపు ప్ర క్రియ నిర్వహించడానికి బ్యాంకింగ్‌కు అనుమతి ఉంది. దీనిప్రకారం ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే సర్వీ స్ ప్రొవైడర్లతో (ఓపీజీఎస్‌పీలు) స్టాండింగ్ కాంట్రాక్ట్‌లోకి ప్రవేశించడం ద్వారా దిగుమతి, ఎగు మతి సంబంధిత రెమిటెన్స్‌ల ప్రాసెసింగ్, సెటిల్మెంట్ సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. -
ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర..అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్?!
న్యూఢిల్లీ: పుష్కలంగా నిధులు ఉన్న కొన్ని బహుళ జాతి (ఎంఎన్సీ) ఈ–కామర్స్ కంపెనీలు యధేచ్ఛగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) మార్గదర్శకాలను ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నాయని దేశీ ట్రేడర్ల అసోసియేషన్ సీఏఐటీ ఆరోపించింది. ఇలాంటివి జరగకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ–కామర్స్ విధానంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఈ మేరకు శ్వేతపత్రం విడుదల చేసింది. సాధారణంగా సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ (ఎస్‌బీఆర్‌టీ), బీ2బీ క్యాష్ అండ్ క్యారీలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. అయితే, దేశీ రిటైలర్ల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో మల్టీ బ్రాండ్ రిటైల్ (ఎంబీఆర్‌టీ)లో మాత్రం 51 శాతం వరకూ కొన్ని షరతులు, ప్రభుత్వ అనుమతులకు లోబడి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని కేంద్రం మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్న సంస్థలు, కిరాణాలకు సాంకేతికంగా తోడ్పడే ఉద్దేశంతో ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసేందుకు మాత్రం ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఈ విధానంలో సదరు మార్కెట్‌ప్లేస్ సంస్థ .. తన ప్లాట్‌ఫామ్‌పై ఏ విక్రేత ఉత్పత్తులను నిల్వ ఉంచుకోవడానికి గానీ నియంత్రించడానికి గానీ అనుమతి ఉండదు. అలా చేస్తే మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ కిందికి వస్తుంది. ఈ నిబంధనలను, కొన్ని బడా ఈ–కామర్స్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని సీఏఐటీ ఆరోపించింది. విక్రేతలను లేదా నిల్వలను ప్రభావితం చేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని, తద్వారా దర్యాప్తు ఏజెన్సీల నిఘా నుంచి తప్పించుకుంటున్నాయని పేర్కొంది. ఇది ఎఫ్‌డీఐ పాలసీ ఉల్లంఘన మాత్రమే కాదని, పోటీని దెబ్బతీసే ప్రయత్నం కూడా అని సీఏఐటీ వివరించింది. ‘ఇలాంటి పరిస్థితుల్లో చట్టాలను తూచా తప్పకుంటా అమలు చేయడం చాలా ముఖ్యం. లేకపోతే దేశీ తయారీ సంస్థలు, ట్రేడర్లు, విక్రేతలు, స్టార్టప్‌లు మొదలైన వాటన్నింటికి సమాన అవకాశాలు కల్పించాలన్న ఈ–కామర్స్ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది‘ అని ఆందోళన వ్యక్తం చేసింది. వినియోగదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యం: కేంద్రం ఆన్లైన్ వ్యాపార లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి బడా ఈ–కామర్స్ సంస్థల గుత్తాధిపత్యం నెలకొనే పరిస్థితి ఉండకూడదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు. వినియోగదారులతో పాటు చిన్న రిటైలర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా కొత్త విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. వినియోగదారుల వ్యవహారాల విభాగం, పరిశ్రమలు.. అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కలిసి ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) పేరిట ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి ప్రత్యేక సిస్టమ్‌ను రూపొందిస్తున్నాయని ఆయన తెలిపారు. మార్కెట్‌ప్లేస్ ప్లాట్‌ఫామ్‌లలో సెర్చి ఫలితాలు ఏ ఒక్కసంస్థ పక్షానో లేకుండా, తటస్థంగా ఉండేలా చూసేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. తద్వారా సెర్చి ఫలితాలు ఏ ప్రాతిపదికన డిస్ప్లే అవుతున్నాయో వినియోగదారులకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. -
దెబ్బ అదుర్స్ కదూ!! చైనాకు చుక్కలు చూపిస్తూ..దూసుకెళ్తున్న భారత్!
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వరుస కీలక నిర్ణయాలు భారత్‌కు వరంగా మారుతున్నాయి. మన దేశంలో చైనా ప్రొడక్ట్‌లపై కేంద్రం నిషేదం విధిస్తున్న విషయం తెలిసిందే. ఆ నిషేధంతో దేశీయ ఉత్పత్తులకు భారీ ఎత్తున డిమాండ్ పెరిగి చైనాకు చుక్కలు చూపిస్తుంది. భారత్‌లో ఈ-కామర్స్ రంగం నుంచి వచ్చే ఆదాయం చైనాకు తగ్గి.. భారత్ ఆదాయం పెరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రాగన్ కంట్రీలో ఈ-కామర్స్ రంగం నుంచి వచ్చే ఆదాయం 2.8ట్రిలియన్లు..ఆ ఆదాయం మనదేశ జీడీపీకి సమానంగా ఉంది. అయితే కేంద్రం చైనా ఉత్పత్తుల్ని బ్యాన్ చేయడంతో భారత్‌లో ఈకామర్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. చైనా ఆదాయానికి పోటాపోటీగా దేశీయంగా ఈకామర్స్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలో ఈకామర్స్ ను ఉపయోగించే జాబితాలో 150మిలియన్ల మంది కొత్త వినియోగదారులు వచ్చి చేరారు. ఈ సందర్భంగా.."చైనా ఇ-కామర్స్ ఆదాయాలు ఒక సంవత్సరంలో 2.8ట్రిలియన్ల అమ్మకాలు జరపడం ద్వారా చైనా ప్రపంచంలోని మిగిలిన దేశాల కంటే ముందంజలో ఉంది. ఇదే సమయంలో భారత్‌లో ఈకామర్స్ రంగం ఊపందుకోవడం సంతోషకరమైన విషయమేనని సిఐఐ నిర్వహించిన ఈకామర్స్ కాన్క్లేవ్లో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ ఐటీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపాంకర్ చక్రవర్తి మాట్లాడుతూ..గత నెలలో 150మిలియన్ల మంది వినియోగదారులు ఈకామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగించుకున్నారు. 50శాతం ఇంటర్నెట్ వినియోగదారులు ఆన్లైన్లో షాపింగ్ చేయడం ప్రారంభించారు. ఆన్‌లైన్‌పై అవగాహన పెరడగంతో ఈ కామర్స్ సంస్థలలో పెట్టుబడులు పెరిగాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కామర్స్ కంటెంట్, వాణిజ్య పరంగా, ఆన్లైన్ ఆఫ్‌లైన్ పరంగా మార్కెట్ ఇంటిగ్రేషన్‌ను తీసుకువచ్చిందని టాటా క్లిక్ బ్యూటీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ధర్మరాజన్ చెప్పారు. మాల్స్‌లో డిజిటల్ అడాప్టేషన్ భారీగా ఉంది. మాల్స్‌లో కూడా 50శాతం మంది కస్టమర్లు డిజిటల్ అడాప్టేషన్ల ద్వారా వెళ్తున్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లను జోడించడం ఒకదానికొకటి అనుబంధంగా మారిందని బెనర్జీ చెప్పారు. తద్వారా భారత్‌లో ఈకామర్స్ రంగం మరింత వృద్ది సాధించేందుకు తోడ్పడుతుందని తెలిపారు. చదవండి: ముఖేష్ అంబానీ ముందు చూపు.. సన్మీనాలో వందల కోట్ల పెట్టుబడులు!! -
ఫ్లిప్‌కార్ట్ కొత్త ఆఫర్: మీ పాత ఫోన్ అమ్మండి..కొత్త ఫోన్ కొనుగోలు చేయండి!!
దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు సువార్ణావకాశం కల్పించింది. సేల్ బ్యాక్ ప్రోగ్రామ్ ద్వారా పాత ఫోన్ అమ్మి కొత్త ఫోన్‌ను కొనుగోలు లేదా ఇతర కొత్త ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది. వాలంటైన్స్ డే సందర్భంగా సేల్ బ్యాక్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ యంత్ర అనే రీకామర్స్ సంస్థను కొనుగోలు చేసింది.ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఆ సంస్థ సాయంతో యూజర్లనుంచి పాత ఫోన్లను కలెక్ట్ చేస్తుంది. ఇందులో యూజర్లు చేయాల్సిందల్లా ఒక్కటే పాత ఫోన్ అమ్మాలనుకుంటే యంత్ర వెబ్ సైట్లోకి వెళ్లి ఫోన్లకు సంబంధించిన పలు ప్రశ్నలు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానాల అనంతరం 48గంటల్లో ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటికే వచ్చి ఫోన్‌ను కలెక్ట్ చేసుకుంటారు. ఫోన్‌ను ఎగ్జిక్యూటివ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కస్టమర్‌కు ఫ్లిప్‌కార్ట్ ఈవోచర్ను పంపిస్తుంది. ఆ ఈవోచర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఫోన్ తీసుకోవచ్చు. లేదా ఇతర ప్రొడక్ట్స్ ఏవైనా కొనుగోలు చేయొచ్చు. దేశవ్యాప్తంగా 1700 పిన్‌కోడ్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేయనుంది. ప్రస్తుతానికి స్మార్ట్ఫోన్లను ఏ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ అయినా సరే.. దేశంలో ఎక్కడున్నా సరే.. తమ ఫోన్‌ను అమ్ముకునే చాన్స్‌ను ఫ్లిప్‌కార్ట్ లో అమ్మే అవకాశం కల్పిస్తుంది. త్వరలోనే ఇతర వస్తువులను కూడా కస్టమర్లు అమ్ముకునే సౌకర్యాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పించనుంది. -
మీ కంపెనీ సర్వీస్ చెత్తగా ఉంది,లక్షన్నర ఫోన్ ఆర్డర్ ఇస్తే శానిటైజర్ ఇచ్చారు!!
ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకలు, అట్టముక్కలు రావడం సర్వ సాధారణమయ్యాయి. తాజాగా ఓ మహిళ తనకెంతో ఇష్టమైన ఐఫోన్ బుక్ చేసింది. అయితే ఐఫోన్ బుక్ చేసిన ఆమెకు అనూహ్యంగా శానిటైజర్ డబ్బా డెలివరీ అయ్యింది. దీంతో కంగుతిన్న బాధితురాలు లక్షన్నర ఫోన్ ఆర్డర్ ఇస్తే శానిటైజర్ డబ్బా వచ్చింది! ఏం చేసుకోను అంటూ ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. లండన్ కు చెందిన 32 ఏళ్ల ఖవ్లా లఫాహిల్ గతేడాది యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 13 మ్యాక్స్‌ప్రో ను బుక్ చేసింది. యూకేలో ఆ ఫోన్ ధర 2,031 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం(సుమారు రూ.1,51,713.67) బుక్ చేసిన కొన్నిరోజల తర్వాత తన ఇంటికి వచ్చిన ఐఫోన్ పార్శిల్ ఓపెన్ చేసి చూడగా అందులో శానిటైజర్ ఉండడంతో అవాక్కు అవ్వడం ఆమె వంతైంది. అంతే ఐఫోన్‌కు బదులు శానిటైజర్ రావడంతో ఆగ్రహానికి గురైంది.మీ కంపెనీ సర్వీస్ చెత్తగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగివచ్చిన యాజమాన్యం బాధితురాలికి క్షమాపణలు చెప్పింది. త్వరలోనే ఐఫోన్ 13 మ్యాక్స్ ప్రోను అందిస్తామని సదరు డెలివరీ సంస్థ నిర్వాహకులు హామీ ఇచ్చారు. -
ప్లిప్ కార్ట్‌లో స్మార్ట్ఫోన్లే కాదు..మెడిసిన్ కూడా కొనుగోలు చేయొచ్చు
ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ తాజాగా హెల్త్‌కేర్ రంగంలోకి ప్రవేశించింది. ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ సర్వీసులు ఆవిష్కరించింది. ఈ క్రమంలో కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఆన్లైన్ ఫార్మసీ సేవల సంస్థ సస్తాసుందర్ మార్కెట్‌ప్లేస్ లిమిటెడ్‌లో (ఎస్ఎంఎల్) మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ ఎంతన్నది వెల్లడి కాలేదు. ఈ సంస్థ ఆన్లైన్ ఫార్మసీ, డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం సస్తాసుందర్‌డాట్‌కామ్‌ను నిర్వహిస్తోంది. నాణ్యమైన వైద్య సేవలను చౌకగా అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ తోడ్పడగలదని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ–ఫార్మసీతో మొదలుపెట్టి ఈ–డయాగ్నోస్టిక్స్, ఈ–కన్సల్టేషన్ వంటి కొత్త హెల్త్‌కేర్ సర్వీసులు క్రమంగా అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ కార్యకలాపాలను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ వీర్ యాదవ్ పర్యవేక్షిస్తారు. తమకు దేశవ్యాప్తంగా ఉన్న కార్యకలాపాలు, సాంకేతిక సామర్థ్యాలు..హెల్త్–టెక్నాలజీ రంగంలో వినియోగదారులకు సర్వీసులు అందించడంలో సస్తాసుందర్‌కు ఉన్న అనుభవం ఫ్లిప్‌కార్ట్ హెల్త్+కు తోడ్పడగలవని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ మరింతగా పెరిగిందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి అయ్యర్ తెలిపారు. చౌకగా హెల్త్‌కేర్‌కు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో సస్తాసుందర్‌డాట్‌కామ్ ద్వారా ఈ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2013లో ప్రారంభం.. బీఎల్ మిట్టల్, రవి కాంత్ శర్మ 2013లో సస్తాసుందర్‌ను ప్రారంభించారు. దీనికి 490 పైచిలుకు ఫార్మసీల నెట్వర్క్ ఉంది. జపాన్‌కు చెందిన దిగ్గజాలు మిత్సుబిషి కార్పొరేషన్, రోటో ఫార్మా మొదలైనవి ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. ప్రస్తుతం సస్తాసుందర్ వెంచర్స్ అనుబంధ సంస్థ ఎస్‌హెచ్‌బీఎల్ (సస్తాసుందర్ హెల్త్‌బడ్డీ) .. ఎస్‌ఎంఎల్‌లో తనకున్న వాటాలు విక్రయిస్తోంది. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎస్ఎంఎల్ స్టాండెలోన్ టర్నోవరు రూ. 2.58 కోట్లుగాను, నికర విలువ రూ. 4.17 కోట్లుగాను నమోదయ్యాయి. కస్టమర్లకు సులభతరంగా, సౌకర్యవంతంగా నిఖార్సయిన ఔషధాలు, వైద్యపరీక్షలు తదితర సర్వీసులు అందించేందుకు వినూత్న ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నామని సంస్థ వ్యవస్థాపకులు బీఎల్ మిట్టల్, రవి కాంత్ శర్మ తెలిపారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డెలివరీ స్టేషన్, ఎక్కడంటే.. -
ఈ కామర్స్‌తో చేనేతకు చేదోడు
ఖైరతాబాద్: ఈ కామర్స్ ద్వారా చేనేత ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు పరిశ్రమలు, ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. టెస్కో ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులకు కొత్తదనం తీసుకువస్తున్నామని చెప్పారు. శనివారం చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పీపుల్స్‌ప్లాజా వేదికగా వారంపాటు ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. స్టాళ్లలోని వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీతాంబరం, ఆర్మూర్ చీరల పునరుద్ధరణ, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఈ గోల్కొండ వెబ్‌సైట్‌తోపాటు చేనేత ఫ్యాషన్ షోను మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. 31 మంది చేనేత కళాకారులను సత్కరించి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను అందజేశారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత చేనేత, జౌళి శాఖ బడ్జెట్‌ను రూ.70 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ నేతన్నలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, కళలలకు వైభవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ కాటన్, సిల్క్ చీరలు, నారాయణపేట కాటన్, వరంగల్ జరీలు, కరీంనగర్ బెడ్షీట్లు తెలంగాణ కళాకారుల అత్యున్నత నైపుణ్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అద్భుత చేనేత కళాకారులను గుర్తించి సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయస్థాయి చేనేత ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కళాకారులు కూడా తమ ఉత్పత్తులను ఇక్కడ విక్రయించుకునే వెసులుబాటు కల్పించిందని చెప్పారు. 25,319 మందికి చేనేతమిత్ర చేనేతమిత్ర పథకం ద్వారా 25,319 మంది చేనేత, అనుబంధ కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటివరకు రూ.13 కోట్ల 34 లక్షలు జమ చేసినట్లు కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికుల రుణమాఫీ పథకం ద్వారా 2010 నుంచి 2017 వరకు తీసుకున్న రుణాలపై రూ.28 కోట్ల 96 లక్షల మేర మాఫీ చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చామన్నారు. అందరం బాధ్యతగా ముందుకొచ్చి చేనేత రంగాన్ని బతికించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఈ–కామర్స్ కంపెనీలు, దోపిడీ ధరల్ని ప్రోత్సహిస్తున్నాయి
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించాయంటూ ఈ–కామర్స్ కంపెనీల మీద వర్తకులు, వాణిజ్య సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ లిఖిత పూర్వకంగా లోక్‌సభకు వెల్లడించారు. ‘మార్కెట్‌ప్లేస్ ఆధారిత ఈ–కామర్స్ కంపెనీలు సంక్లిష్ట యాజమాన్య పద్ధతులను అవలంభిస్తున్నాయి. నియంత్రిత, ప్రాధాన్యత గల విక్రేతల ద్వారా సరుకు నిల్వ చేసుకుని అమ్మకాలను సాగిస్తున్నాయి. భారీ తగ్గింపులు, దోపిడీ ధర, ప్రత్యేక ఒప్పందాలను ప్రోత్సహిస్తున్నాయి’ అంటూ ఫిర్యాదులు వచ్చాయని మంత్రి తెలిపారు. -
వినియోగదారులకు ప్రతికూలంగా ఈ-కామర్స్ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వినియోగదారుల హక్కుల పరిరక్షణ (ఈ–కామర్స్) నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలు.. పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. వీటిలో చాలా ప్రతిపాదనలు అస్పష్టంగా ఉన్నందున అనుకోని విధంగా వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫ్లాష్ సేల్ కాన్సెప్టు మొదలైన వాటికి తగిన నిర్వచనం ఇవ్వాలని, వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు సంబంధించి ప్రస్తుత చట్టాలకు లోబడి ఈ–కామర్స్ సంస్థలు పనిచేసేలా చూడాలని కోరింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తాము పూర్తి మద్దతునిస్తామని, అయితే ఈ–కామర్స్ వ్యాపారంపరంగా ప్రతిపాదిత సవరణల్లో పలు అంశాలు అస్పష్టంగా ఉండటం ఆందోళనకరమని ఐఏఎంఏఐ తెలిపింది. కొన్ని సవరణల వల్ల ఆన్లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారాలకు సమాన అవకాశాలు దక్కకుండా పోతాయని పేర్కొంది. అలాగే ఈ–కామర్స్ కంపెనీలపై ఆంక్షలు మరింతగా పెరుగుతాయని, మరిన్ని నిబంధనలను పాటించాల్సిన భారం గణనీయంగా పెరుగుతుందని ఐఏఎంఏఐ అభిప్రాయపడింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు తన అభిప్రాయాలను తెలియజేసింది. ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలపై మోసపూరిత ఫ్లాష్ సేల్స్‌ను, తప్పుగా ఉత్పత్తులు, సేవలను అంటగట్టే విధానాలకు అడ్డుకట్ట వేసే దిశగా జూన్ 21న కేంద్రం ఈ–కామర్స్ నిబంధనల ముసాయిదాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగస్టు 5 దాకా పరిశ్రమవర్గాలు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఇప్పటికే ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర పరిశ్రమ వర్గాలు తమ ఆందోళనలను ప్రభుత్వానికి తెలియజేశాయి. చదవండి : వ్యాక్సిన్ వేయించుకోండి, లేదంటే ఇకపై బస్సు ప్రయాణం కష్టమే -
ఈకామర్స్ ఫ్లాష్‌సేల్స్, కేంద్రానికి నాస్కామ్ సిఫార్సులు
న్యూఢిల్లీ: ఆన్లైన్ కంపెనీల కార్యకలాపాలకు అనుగుణంగానే వాటి బాధ్యతలను కూడా క్రమబద్ధీకరించాలని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే వినియోగదారులకు సకాలంలో రీఫండ్ అందేలా చూసేంత వరకు మాతమ్రే వాటి బాధ్యతలను పరిమితం చేయాలని పేర్కొంది. ఈ–కామర్స్ సంస్థల నిబంధనల ముసాయిదాకు సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలపై నాస్కామ్ ఈ మేరకు తన అభిప్రాయాలు తెలియజేసింది. మోసపూరిత ఫ్లాష్ సేల్స్, ఉత్పత్తులు.. సర్వీసులను మోసపూరితంగా విక్రయించడం వంటి వాటిని నిషేధించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం జూన్ 21 ఈ నిబంధనలను ప్రతిపాదించింది. వీటిపై పరిశ్రమ వర్గాలు, ప్రజలు అభిప్రాయాలు తెలియజేయడానికి జూలై 6 ఆఖరు తేదీ అయినప్పటికీ ఆగస్టు 5 దాకా పొడిగించింది. వీటిపైనే నాస్కామ్ తాజాగా తమ అభిప్రాయాలు తెలియజేసింది. ప్రతిపాదిత నిబంధనల్లోని కొన్ని అంశాలు వినియోగదారుల రక్షణ చట్టం 2019 పరిధిలోకి కాకుండా కాంపిటీషన్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం పరిధిలోకి వచ్చే విధంగా ఉన్నాయని పేర్కొంది. కొన్ని కార్యకలాపాలను నిషేధించడం కాకుండా వినియోగదారుల హక్కులు కాపాడేందుకు అవసరమైతే సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) విచారణ జరిపేలా.. అనుచిత వాణిజ్య విధానాలకు సంబంధించి సూచనప్రాయంగా ఒక జాబితాలాంటిది పొందుపర్చవచ్చని నాస్కామ్ తెలిపింది. -
ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి, కారణం ఇదేనా
ముంబై: దేశీయంగా ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు జున్‌లో 5.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది జూన్‌లో నమోదైన 6.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే 22 శాతం క్షీణించాయి. అయితే, సీక్వెన్షియల్‌గా ఈ ఏడాది మే నెలలో వచ్చిన 4 బిలియన్ డాలర్లతో పోలిస్తే 33 శాతం పెరిగాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమ లాబీ గ్రూప్ ఐవీసీఏ రూపొందించిన నెలవారీ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మరోవైపు, గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే మాత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో పీఈ/వీసీ పెట్టుబడులు 45 శాతం పెరిగి 26.9 బిలియన్ డాలర్లకు చేరాయి. ‘దేశీయంగా పీఈ/వీసీ పెట్టుబడుల కార్యకలాపాలు 2021 ప్రథమార్ధంలో రికార్డు స్థాయిలో పెరిగాయి. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరగనుంది. ప్రథమార్ధం, రెండో త్రైమాసికంలో పీఈ/వీసీ పెట్టుబడులు గరిష్ట స్థాయిలో వచ్చాయి‘ అని ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. భారీ డీల్స్ (100 మిలియన్ డాలర్ల పైబడినవి), మధ్య స్థాయి డీల్స్ (20–100 మిలియన్ డాలర్ల దాకా)పై ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ,ఈ–కామర్స్ ఫేవరెట్స్.. రంగాలవారీగా చూస్తే టెక్నాలజీ, ఈ–కామర్స్, ఆర్థిక సేవలు, ఫార్మా, విద్య, మీడియా.. వినోద రంగాల్లో పెట్టుబడుల ధోరణి సానుకూలంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆయా రంగాలు కోవిడ్ వల్ల పుంజుకోవడమో లేదా మహమ్మారి ప్రభావాల నుంచి వేగంగా కోలుకోవడమో ఇందుకు కారణం కావచ్చని వివరించింది. అటు ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, రిటైల్, కన్జూమర్ ఉత్పత్తుల విభాగాల్లో పీఈ/వీసీ పెట్టుబడులు కాస్త తగ్గినట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో అత్యధికంగా 3.6 బిలియన్ డాలర్ల విలువ చేసే 12 ఒప్పందాలు కుదిరాయి. గతేడాది జూన్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 4.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సహా 6.1 బిలియన్ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు 11 నమోదయ్యాయి. కొను గోళ్లకు సంబంధించి 1.9 బిలియన్ డాలర్ల విలువ చేసే అయిదు డీల్స్ కుదిరాయి. చదవండి: క్రెడిట్ కార్డ్ వినియోగం,పెట్రో ధరలపై ఆఫర్లు డిస్కౌంట్లు -
ఐఐఎంల్లో ఈ–కామర్స్, స్టార్టప్స్ ఆఫర్స్!
ఈ–కామర్స్, స్టార్టప్స్.. గత కొంత కాలంగా నియామకాల్లో ముందంజలో నిలుస్తున్న రంగాలు. ముఖ్యంగా ఐఐఎంల్లో ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్‌లో ఇది మరింతగా స్పష్టమైంది. ఐఐఎంల్లో 2021లో పీజీపీఎం కోర్సులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు ఇటీవల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ముగిశాయి. వీరికి ఈ–కామర్స్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు భారీ సంఖ్యలో ఆఫర్లు ఇచ్చాయి. కోవిడ్ కారణంగా గత ఏడాది ఈ రంగాల్లోని సంస్థల ఆఫర్లు తగ్గాయి. ఈ సంవత్సరం మాత్రం మార్కెట్లు పుంజుకోవడంతో ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. అన్ని ఐఐఎంల్లోనూ అదే ట్రెండ్ ► తొలి తరం ఐఐఎంలు మొదలు నూతన ఐఐఎంల వరకూ.. దాదాపు అన్ని ఐఐఎం క్యాంపస్‌లలోనూ ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. ఆయా ఐఐఎంల్లో కనిష్టంగా పది శాతం.. గరిష్టంగా 80 శాతం మేరకు ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్లు పెరగాయి. ► ఐఐఎం–ఇండోర్‌లో.. ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్స్‌లో గరిష్టంగా 80 శాతం మేర పెరుగుదల కనిపించింది. ఐఐఎం–బెంగళూరులో 53 శాతం; ఐఐఎం–లక్నోలో 24.5 శాతం; ఐఐఎం–కోజికోడ్‌లో 25 శాతం; ఐఐఎం–అహ్మదాబాద్‌లో 10 శాతం వృద్ధి నమోదైంది. ► తెలుగు రాష్ట్రాల్లోని ఐఐఎం–విశాఖపట్నంలోనూ ఈ–కామర్స్ ఆఫర్లు గతేడాది కంటే పది శాతం మేరకు పెరిగి.. మొత్తం 120 మంది విద్యార్థుల్లో.. దాదాపు 30 మందికి ఈ–కామర్స్ సంస్థల్లో ఆఫర్లు లభించాయి. (ఇక్కడ చదవండి: కాస్త శ్రద్ధ పెడితే కేంద్ర కొలువు మీ సొంతం!) ఈ–కామర్స్ దిగ్గజాల హవా ఈ–కామర్స్ దిగ్గజాలుగా పేరొందిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం, ఫోన్‌పే, రేజర్‌పే సంస్థలు ఆఫర్స్ ఇవ్వడంలో ముందంజలో నిలిచాయి. ఈ రంగంలో లభించిన మొత్తం ఆఫర్లలో యాభై శాతం ఈ సంస్థల నుంచే ఉండటం విశేషం. అంతేకాకుండా వేతనాలు కూడా సగటున రూ.12లక్షల నుంచి రూ.30లక్షల వరకు అందించాయి. గతేడాది కంటే 30శాతం అదనంగా ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటామని ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ సంస్థ.. అందుకు తగినట్లుగానే క్యాంపస్ డ్రైవ్స్‌లో భారీగా నియామకాలు చేపట్టింది. అదే విధంగా అమెజాన్, పేటీఎం కూడా ఈ ఏడాది టెక్, మేనేజ్మెంట్ ప్రొఫైల్స్‌లో భారీగా నియామకాలు చేపడతామని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఈ సంస్థలు ఫ్రెషర్స్ నియామకాలకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. స్టార్టప్స్ హవా గత రెండేళ్లుగా వెనుకంజలో ఉన్న స్టార్టప్ కంపెనీల ఆఫర్లు ఈసారి భారీగా పెరిగాయి. ప్రధానంగా ఎడ్టెక్, ఫిన్‌టెక్ సంస్థలు ముందంజలో నిలిచాయి. బ్లాక్‌బర్గ్, ఇంటర్వ్యూబిట్, టర్టిల్‌మింట్ వంటి సంస్థలు స్టార్టప్ ఆఫర్స్ భారీగా ఇచ్చాయి. ఐఐఎంల విద్యార్థులు కూడా ఈ స్టార్టప్ ఆఫర్స్‌కు ఆమోదం తెలపడం విశేషం. దీనికి స్టార్టప్ సంస్థల్లో చేరితే తమ కెరీర్ ప్రగతికి పునాదులు వేసుకోవచ్చనే భావనే ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా తమ నైపుణ్యాలను నేరుగా వ్యక్తీకరించి, ఆచరణలో పెట్టే అవకాశం స్టార్టప్ సంస్థల్లోనే ఎక్కువగా ఉంటుందనే అభి ప్రాయంతోనే విద్యార్థులు ఈ ఆఫర్స్‌కు అంగీకరించారని ఆయా ఐఐఎంల క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫండింగ్ పెరగడమే కారణమా! స్టార్టప్ సంస్థలు భారీ సంఖ్యలో ఆఫర్లు ఇవ్వడానికి వాటికి గతేడాది ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి ఫండింగ్ రావడం మరో కారణం అనే వాదన వినిపిస్తోంది. హెక్స్జన్ సంస్థ సర్వే ప్రకారం–గతేడాది భారత్‌లోని స్టార్టప్ సంస్థలు దాదాపు నాలుగు వందల మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకున్నాయి. వీటిలో యాభై శాతానికి పైగా టెక్ స్టార్టప్స్, ఎడ్టెక్ స్టార్టప్స్ ఉన్నాయని సదరు సర్వే పేర్కొంది. అంతేకాకుండా ప్రముఖ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కో నివేదిక ప్రకారం–2020లో జాతీయ స్థాయిలో ఏడు వేలకు పైగా స్టార్టప్ సంస్థలకు పది బిలియన్ డాలర్ల నిధులను వెంచర్ క్యాపిటలిస్ట్‌లు సమకూర్చారు. వీటిలో మూడొంతులు.. ఫిన్‌టెక్, ఈ–కామర్స్ అనుబంధ టెక్ స్టార్టప్‌లే ఉన్నాయి. ఇలా భారీగా నిధులు సమకూర్చు కున్న స్టార్టప్‌లు.. వ్యాపార ఉన్నతికి, విస్తరణకు అవసరమైన మానవ వనరుల కోసం క్యాంపస్ డ్రైవ్స్ బాట పట్టాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కీలకమైన ప్రొఫైల్స్ ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు కీలక విభాగాల్లో అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. డిజైన్ నుంచి మార్కెటింగ్ వరకు పలు ముఖ్య విభాగాల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే హోదాల్లో ఆఫర్లు ఇచ్చాయి. ప్రస్తుత డిజిటలైజేషన్, ఆన్లైన్ కార్యకలాపాల్లో పెరుగుదలే దీనికి ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. అంతేకాకుండా వ్యాపార విస్తరణ వ్యూహాలు సమర్థవంతంగా రూపొందించే నైపుణ్యాలున్న అభ్యర్థులకు ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ ప్రస్తుతం ఈ–కామర్స్ లావాదేవీలు విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ వ్యాపారాలను మరింత వ్యూహాత్మకంగా విస్తరించాలనే ఉద్దేశంతో కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అను గుణంగా సేవలందించడం, కస్టమర్స్ మెచ్చే ప్రొడక్ట్‌లను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకోసం మార్కెటింగ్, డేటాఅనలిటిక్స్ విభాగాల్లో నియా మకాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. స్టార్టప్ సంస్థల్లో.. ఈ ప్రొఫైల్స్ స్టార్టప్ సంస్థలు ప్రధానంగా ప్రొడక్ట్ డిజైన్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్‌లో ఎక్కువగా నియామకాలు చేపట్టాయి. దీనికి కారణం.. సదరు స్టార్టప్ సంస్థలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రొడక్ట్‌లు రూపొందించి.. వాటికి మార్కెట్లో ఆదరణ లభించేలా వ్యవహరిస్తున్నాయి. మేనేజ్మెంట్ విద్యార్థులకు ఈ నైపుణ్యాలుంటాయనే ఉద్దేశంతో బి–స్కూల్స్‌లో ప్లేస్‌మెంట్స్ చేపట్టాయి. ఈ స్కిల్స్ ఉంటేనే ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు.. అభ్యర్థుల్లోని కోర్ నైపుణ్యాలే కాకుండా.. వ్యాపా రాభివృద్ధికి దోహదపడే స్కిల్స్‌కూ ప్రాధాన్యం ఇచ్చాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, కొలాబరేషన్, ఇన్నోవేషన్ నైపుణ్యాలున్న విద్యార్థులకు ఎక్కువగా ఆఫర్స్ ఇచ్చాయి. ఎలాంటి సమస్యలైనా ఇట్టే పరిష్కరించి.. వ్యాపార కార్యకలాపాలకు అవరోధం కలగకుండా వ్యవహరించొచ్చనే ఉద్దేశమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. మిగతా సెక్టార్స్ సంగతి ప్రస్తుత పరిస్థితుల్లో బీఎఫ్ఎస్ఐ, ఎడ్యుకేషన్ సెగ్మెంట్స్‌లో టెక్ ఆధారిత సేవలు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. గతేడాది ఈ టెక్ స్టార్టప్‌లే నిధుల సమీకరణలో ముందంజలో నిలిచాయి. దాంతో ఫిన్‌టెక్, ఎడ్టెక్ వంటి టెక్ స్టార్టప్స్‌లో ఆఫర్లు పెరిగాయి. మరోవైపు ఎప్పటి మాదిరిగానే కన్సల్టింగ్ సంస్థలు, బీఎఫ్ఎస్ఐ సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడంలో ముందు వరుసలో నిలిచాయి. అదే విధంగా మాన్యుఫ్యాక్చరింగ్ విభాగంలోనూ నియామకాలు ఆశాజనకంగానే కనిపించాయి. వీటిలోనూ అధిక శాతం జాబ్ ప్రొఫైల్స్ డేటా అనాలిసిస్, బిగ్ డేటా, మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగాల్లోనే లభించాయి. సానుకూల సంకేతాలు ► ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈకామర్స్, స్టార్టప్ సంస్థలు.. టైర్–2,టైర్–3ల్లోనూ క్యాంపస్ నియామకాలు చేపట్టేందుకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. ప్రధానంగా మెట్రో నగరాల్లోని ఇన్స్టిట్యూట్లలో ఈ రిక్రూట్మెంట్స్ ఉండొచ్చంటున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, సీఆర్ఎం, డిజిటల్ మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలకు టైర్–2, టైర్–3 ఇన్‌స్టిట్యూట్‌లవైపు చూసే అవకాశాలు న్నాయని ఆయా క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ► మొత్తంగా చూస్తే గతేడాది కోవిడ్ కారణంగా కొంత వెనుకంజలో ఉన్న బి–స్కూల్స్ ప్లేస్‌మెంట్స్.. తిరిగి పుంజుకోవడంతో మేనేజ్మెంట్ విద్యార్థులకు భవిష్యత్తు ఆశాజనకం అనే భావన ఏర్పడుతోంది. మేనేజ్మెంట్ కోర్సుల విద్యార్థులు రానున్న రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐఐఎం ప్లేస్‌మెంట్స్ ముఖ్యాంశాలు ► 2021లో ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్స్‌లో భారీగా పెరుగుదల. ► సగటున రూ. 12 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ప్యాకేజీ లభిస్తున్న వైనం. ► మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, సీఆర్ఎం విభాగాల్లో నియామకాలు. ► స్టార్టప్ ఆఫర్స్‌లో టెక్ స్టార్టప్స్ హవా. ► రానున్న రోజుల్లో ఇతర బి–స్కూల్స్‌లోనూ నియామకాలు ఆశాజనకంగా ఉంటాయంటున్న నిపుణులు. డిజిటలైజేషనే ప్రధాన కారణం ఈ–కామర్స్ సంస్థలు భారీగా నియామకాలు చేపట్టడానికి ప్రధాన కారణం డిజిటలైజేషనే అని చెప్పొచ్చు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వినియోగదారులు డిజిటల్ కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ–కామర్స్ మార్కెట్ విస్తృతమవుతోంది. దానికి అనుగుణంగా సంస్థలు నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం అన్వేషిస్తున్నాయి. – ప్రొఫెసర్ యు.దినేశ్ కుమార్, చైర్ పర్సన్, సీడీఎస్, ఐఐఎం–బెంగళూరు -
ఎస్బీఐ : యోనో బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘యోనో సూపర్ సేవింగ్ డేస్’ పేరుతో స్పెషల్ షాపింగ్ కార్నివాల్‌ను ప్రకటించింది. తన బ్యాంకింగ్, లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫాం యోనో యాప్ ద్వారా షాపింగ్ చేసిన కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ అందించనుంది. ఇందుకోసం అమెజాన్, ఓయో, పెప్పర్ఫ్రై, శాంసంగ్, యాత్రతో సహా 100కి పైగా ఇ-కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు మంగళవారం ఎస్బీఐ ప్రకటించింది. యోనో సూపర్ సేవింగ్ డేస్ అమ్మకం ఫిబ్రవరి 4న ప్రారంభమై ఫిబ్రవరి 7వరకు కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ, అమెజాన్‌తో ఆన్లైన్ షాపింగ్, ఇతర ప్రముఖ విభాగాలలో యోనో సూపర్ సేవింగ్ డేస్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఓయో హోటల్ బుకింగ్‌పై 50 శాతం తగ్గింపు, యాత్రా.కామ్ ద్వారా ఫ్లైట్ బుకింగ్‌పై 10శాతం తగ్గింపు, శాంసంగ్ మొబైల్స్, టాబ్లెట్లు గడియారాలపై 15శాతం తగ్గింపుతో పాటు ఇతర ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు పెప్పర్ఫ్రై ఫర్నిచర్ కొనుగోలు చేస్తే 7 శాతం మినహాయింపు లభించనుంది. అమెజాన్‌లో ఎంపిక చేసిన వస్తువులపై షాపింగ్‌పై 20 శాతం క్యాష్‌బ్యాక్ లభ్యం. ఈ కొత్త ఏడాదిలో తమ వినియోగదారులకు మరింత సంతోషాన్ని అందించేందుకు యోనో సూపర్ సేవింగ్ డేస్ ప్రకటించడం ఆనందంగా ఉందని ఎస్బీఐ ఎండీ (రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు. బ్యాంకింగ్, జీవనశైలి అవసరాల దృష్ట్యా అదనపు షాపింగ్ అవసరాలను తీర్చే క్రమంలో మెగా షాపింగ్ ఈవెంట్ ఒక ప్రత్యేక అడుగు అని ఆయన అన్నారు. Save the dates! YONO Super Saving Days brings exclusive discounts on top brands like Amazon, Samsung, Yatra, OYO & Pepperfry. Stay tuned!#SuperSavingDays #YONOSBI #YONO pic.twitter.com/DCA02P60kW — State Bank of India (@TheOfficialSBI) February 1, 2021