ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు బంపరాఫర్‌! | Flipkart Republic Day Sale 2024 Announced, Check Interesting Offers And Discounts Inside - Sakshi
Sakshi News home page

Flipkart Republic Day Sale 2024: ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు బంపరాఫర్‌!

Published Tue, Jan 9 2024 6:20 PM | Last Updated on Tue, Jan 9 2024 7:08 PM

Flipkart Republic Day Sale 2024 Announced - Sakshi

వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌ శుభవార్త చెప్పింది. ఫ్లిప్‌కార్ట్‌ తర్వలో ఈ ఏడాది తన తొలి ప్రత్యేక సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ జనవరి 14 నుంచి జనవరి 19 వరకు కొనసాగనుంది. 

ఇక ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్‌15, ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 12, పిక్సెల్‌ 7ఏ, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ 5జీ, మోటరోలా ఎడ్జ్‌ 40 నియో, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 22 5జీ, పిక్సెల్‌ 8, వివో టీ2 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో, వివో టీ2ఎక్స్‌, పోకో ఎక్స్‌ 5, రియల్‌ మీ 11, రెడ్‌మీ 12, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 34 5జీ ఫోన్‌లపై డిస్కౌంట్‌లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఐఫోన్ 15పై డిస్కౌంట్‌ ఇస్తుంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ.79,900 నుండి ఉండగా ఫ్లిప్‌కార్ట్‌ రూ.72,999కే అమ్ముతుంది. విజయ్ సేల్స్ ఐఫోన్ 15 సిరీస్‌ 128జీబీ ఇంట్రర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 70,900కి అమ్ముతుంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు పొందవచ్చు. తద్వారా దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఫోన్‌లతో పాటు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై కూడా వరుసగా 75 శాతం, 65 శాతం తగ్గింపు ఉండనుంది. ఈ డిస్కౌంట్‌లపై ఫ్లిప్‌కార్ట్‌ మరిన్ని వివరాల్ని వెల్లడించాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement