యాపిల్ ఐఫోన్ లవర్స్‌కి బంపరాఫర్. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్‌లను తక్కువ ధరకే అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు, ఇతర ఎక్ఛేంజ్ ఆఫర్‌లు అన్నీ కలుపుకుని రూ.30,000లోపే దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఐఫోన్ 12 సిరీస్ మార్కెట్ ధర రూ.49,900 ఉండగా రూ.40,999కే ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తుంది. ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా చేసే ఐఫోన్ కొనుగోలుపై 17 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇతర బ్యాంక్ ఆఫర్‌లు సైతం అందుబాటులో ఉండగా.. దీని ధర మరింత తగ్గనుంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, సిటీబ్యాంక్ క్రిడెట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ఈఎంఐలో ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. మీ వద్ద పాత ఫోన్ ఉంటే దానిని ఇచ్చేసి ఈ యాపిల్ ఫోన్‌ను ఎక్ఛేంజ్ కింద తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 12 అమ్మకాలు నిలిపివేత
ఈ ఏడాది సెప్టెంబరులో ఫ్రాన్స్ అధికారులు ఐఫోన్ 12 అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐఫోన్ 12 అనుమతించిన దానికంటే ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. అయితే, ఐఫోన్ 12 గ్లోబల్ రేడియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థలు ధృవీకరించాయని యాపిల్ తనను తాను సమర్థించుకుంది. టెక్ దిగ్గజం ఫ్రాన్స్‌లోని ఐఫోన్ 12 వినియోగదారుల కోసం ఫ్రెంచ్ రెగ్యులేటర్లు ప్రోటోకాల్‌కు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను కూడా విడుదల చేసింది.
అదే సమయంలో , ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ రేడియేషన్ ఎక్స్‌పోజర్ పరిమితులను ఉల్లంఘించినందున దేశంలో ఐఫోన్ 12 అమ్మకాలను నిలిపివేసింది. ఐఫోన్ 12 అక్కడ అమ్ముడవుతుందో లేదో తెలుసుకునేందుకు తమ ఏజెంట్లను యాపిల్ స్టోర్‌లకు పంపుతామని ఆ దేశ అధికారులు చెప్పారు. అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఫోన్ ఇప్పటికీ విక్రయిస్తున్నట్లు గుర్తించేతే ఇప్పటికే వినియోగదారులకు విక్రయించిన ఫోన్‌లను రీకాల్ చేస్తామని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment