న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం భారీగా పెరిగి రూ. 4,891 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,371 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది.
బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం స్టాండెలోన్ నష్టాలు సైతం 44 శాతం పెరిగి రూ. 4,839 కోట్లను దాటాయి. అంతక్రితం రూ. 3,362 కోట్ల నష్టం ప్రకటించింది. కాగా.. కన్సాలిడేటెడ్ ఆదాయం 9 శాతంపైగా ఎగసి రూ. 56,013 కోట్లకు చేరింది. 2021–22లో మొత్తం ఆదాయం రూ. 51,176 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు రూ. 60,858 కోట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment