
ప్రముఖ దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త ఏడాదిని పురస్కరించుకుని డిసెంబర్ 9 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ప్రారంభించింది. డిసెంబర్ 9న ప్రారంభమై డిసెంబర్ 16 వరకు కొనసాగే సేల్‌లో 80 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
ఇయర్ ఎండ్ సేల్స్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, సహా పలు కేటగిరీల్లోని ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్ హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌లు పొందవచ్చు.
ఐఫోన్14 రిటైల్ ధర రూ.69,900 ఉండగా.. ఈ సేల్ ద్వారా రూ.55,000కే కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. మోటోరోలా ఎడ్జ్ 40 పైనా ఫ్లిప్‌కార్ట్ రాయితీ అందిస్తోంది. రూ.34,999 ధర వద్ద విడుదలైన ఈ ఫోన్ రూ.25,499కే లభిస్తుంది. ఇన్ఫీనిక్స్ హాట్ 30ఐ ను రూ.7,149కే కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్2 ధర రూ.39,999 కాగా.. తాజా సేల్‌లో రూ.34,999కే కొనుగోలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment