
గురుగ్రామ్: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రీజియన్ కార్యకలాపాలు ఈ ఏడాదే ప్రారంభించనుంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మ్యాక్స్ పీటర్సన్ ఈ విషయం వెల్లడించారు.
హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ రీజియన్‌లో మూడు జోన్‌లు ఉంటాయని, ప్రతి జోన్‌లో ముందుగా రెండు డేటా సెంటర్లతో ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. కంపెనీ తమ తొలి ఏడబ్ల్యూఎస్ రీజియన్‌ను 2016లో ముంబైలో ప్రారంభించింది.
ఇప్పటివరకూ స్థానిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై భారత్‌లో 3.71 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఏడబ్ల్యూఎస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పీటర్సన్ పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంశంపై పరిశోధనలకు కొత్త బ్యాచ్‌ను కూడా ఆయన ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment