ecommerce platform
-
త్వరలో ఈ–కామర్స్ ఎగుమతి హబ్‌లు
దేశంలో ఈ–కామర్స్ ఎగుమతి హబ్‌లను ఏర్పాటు చేసేందుకు డీహెచ్ఎల్, లెక్స్షిప్ సహా కొత్తగా అయిదు సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయిదింటిలో మూడు దరఖాస్తులను షార్‌లిస్ట్ చేసినట్లు, వీటిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు హబ్‌లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలో రాగలవని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని వివరించారు.కస్టమ్స్, సెక్యూరిటీ క్లియరెన్స్ మొదలైనవి వేగవంతం చేసేందుకు ఇందులో సదుపాయాలు ఉంటాయి. అలాగే నాణ్యత, సర్టిఫైయింగ్ ఏజెన్సీలు కూడా ఉంటాయి. హబ్‌లను నెలకొల్పిన సంస్థల స్పందనను బట్టి దేశవ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం సవివరంగా మార్గదర్శకాలను రూపొందిస్తుందని అధికారి పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అగ్రిగేటర్ సంస్థ షిప్‌రాకెట్, ఎయిర్‌కార్గో హ్యాండ్లింగ్ కంపెనీ కార్గో సర్వీస్ సెంటర్లను (సీఎస్సీ) ఇప్పటికే పైలట్ ప్రాతిపదికన ప్రభుత్వం ఎంపిక చేసింది.ఇదీ చదవండి: వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..2030 నాటికి ఈ–కామర్స్ ఎగుమతులు 100 బిలియన్ డాలర్లకు చేరవచ్చని, రాబోయే రోజుల్లో 200–250 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే, ప్రస్తుతం 800 బిలియన్ డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ఈ–కామర్స్ ఎగుమతులు 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ–కామర్స్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనాలో ఎక్స్పోర్ట్ హబ్‌లు గణనీయంగా ఉన్నాయి. -
ఈ కామర్స్ ఎగుమతులకు అడ్డంకులు..!
ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఎగుమతులకు భారీ అవకాశాలున్నాయని, ఈ దిశగా ఉన్న అడ్డంకులను తొలగించాలని ఈవై–అసోచామ్ నివేదిక సూచించింది. కస్టమ్స్ ప్రక్రియలను సులభంగా మార్చడం, పటిష్ఠ చెల్లింపుల యంత్రాంగం, ఈ-కామర్స్ సంస్థలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడం ద్వారా ఎగుమతులకు ప్రోత్సాహం అందించాలని తెలిపింది.ఎఫ్‌డీఐ మద్దతుతో నడిచే ఈ-కామర్స్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తుల ఇన్వెంటరీ (నిల్వ)కి అనుమతించాలని, అది భారత ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల అంతర్జాతీయ విక్రయాలకు మద్దతునిస్తుందని నివేదిక పేర్కొంది. 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో ఈ-కామర్స్ రూపంలో 200–300 బిలియన్ డాలర్లు సాధించాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం సాధించాలంటే ప్రస్తుత ఎగుమతులు 50–60 రెట్లు పెరగాల్సి ఉంటుందని ఈ నివేదిక గుర్తు చేసింది.ఇదీ చదవండి: భారత్‌లో ఐప్యాడ్ తయారీ..?2022–23లో ఈ–కామర్స్ వేదికల ద్వారా చేసే ఎగుమతులు 4–5 బిలియన్ డాలర్లు(రూ.41 వేలకోట్లు)గా ఉన్నాయి. ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో ఒక శాతంలోపే కావడం గమనార్హం. సంక్లిష్ట కస్టమ్స్ విధానాలు, స్వదేశానికి చెల్లింపుల పరంగా సవాళ్లు, నియంత్రిత విధానాలు ఈ-కామర్స్ ఎగుమతులకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. వీటిని సరళీకరించాని ఈవై అసోచామ్ నివేదిక సూచిస్తుంది. ఎగుమతులకు సంబంధించి విధానాల్లో మార్పులు అవసరమని తెలిపింది. ఈకామర్స్ ఎగుమతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను పెంచాలని పేర్కొంది. -
ఉద్యోగాలు పెరిగే రంగాలివే..జీఐ గ్రూప్ నివేదిక
రిటైల్, ఈ-కామర్స్ రంగంలో సమీప భవిష్యత్తులో ఎక్కువ ఉద్యోగాలు రాబోతున్నాయని జీఐ గ్రూప్ హోల్డింగ్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ రంగాల్లో ఫ్రెషర్లు, అనుభవజ్ఞులు పెద్దమొత్తంలో అవసరమవుతారని రిపోర్ట్ తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో రిటైల్ రంగంలో 8శాతం ఉద్యోగులు పెరిగారని నివేదించింది. 87శాతం 18-30 ఏళ్ల వయసు ఉన్నవారే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారని చెప్పింది.నివేదికలోని వివరాల ప్రకారం..ఈకామర్స్, రిటైల్ రంగాలు భారీగా అభివృద్ధి చెందుతున్నాయి. వస్తువులు, ఇతర సేవల డెలివరీని అందించే లాజిస్టిక్స్ రంగం దూసుకుపోతోంది. టైర్ 1 నగరాల్లోని చాలామంది కస్టమర్లు ఈకామర్స్, రిటైల్ ప్లాట్‌ఫామ్‌లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఆయా రంగాల్లో ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. 52% రిటైలర్లు ఈ ఏడాది ఫ్రెషర్లను నియమించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. 42% ఈ-కామర్స్ కంపెనీలు అనుభవజ్ఞులైన నిపుణుల కోసం చూస్తున్నాయి. 30% రిటైలర్లు మహిళా అభ్యర్థులను ఎంచుకుంటున్నారు. 2024 ప్రారంభంలో లాజిస్టిక్స్ రంగలో 10.2% ఉద్యోగాలు పెరిగాయి.ఇదీ చదవండి: స్లాట్లు, విదేశీ దైపాక్షిక హక్కులు కోల్పోయిన విమానసంస్థజీఐ గ్రూప్ హోల్డింగ్ ఇండియా కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా మాట్లాడుతూ..‘భారత్ ఆర్థిక వృద్ధిలో రిటైల్, ఈకామర్స్ రంగాల వాటా పెరిగింది. ఏటా భారత్ వర్క్‌ఫోర్స్‌లో చేరే దాదాపు 20 మిలియన్ల యువతలో అధికంగా రిటైల్, ఈకామర్స్ రంగాన్ని ఎంచుకుంటున్నారు. సప్లై చైన్ కార్యకలాపాలను నిర్వహించడంలో అర్హత కలిగిన అనుభవజ్ఞులకు డిమాండ్ ఉంది. కొన్ని కంపెనీలు నిర్దిష్ట ఉద్యోగస్థానాల కోసం మహిళలనే నియమించుకుంటున్నాయి. రిటైల్ రంగంలో రాణించాలంటే మార్కెటింగ్ నైపుణ్యాలు చాలా అవసరం. ఈ-కామర్స్ వ్యాపారం డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, కస్టమర్ ఎంగేజ్మెంట్ వంటి అంశాలపై ఆధారపడుతోంది. వీటిపై నైపుణ్యాలు కలిగిఉన్నవారికి సులువుగా కొలువు దొరుకుతోంది’ అని చెప్పారు. -
అమ్మకాల్లో ఆన్‌లైన్‌దే హవా..
కోల్‌కతా: కొద్దిరోజులపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను నిలువరించిన కోవిడ్–19 శకం ముగిసినప్పటికీ ఆన్లైన్ సర్విసులకు డిమాండ్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం నిలిచిపోవడంతో ఊపందుకున్న ఆన్లైన్ ట్రెండ్ తదుపరి దశలో మరింత ఊపందుకుంది. ప్రజలు తమ అవసరాల కోసం ఆఫ్‌లైన్ స్టోర్లకంటే ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. దీంతో ఆన్లైన్ అమ్మకాలు ఆఫ్‌లైన్ స్టోర్లను మించి నమోదవుతున్నట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థల తాజా నివేదిక పేర్కొంది. నీల్సన్ఐక్యూ, జీఎఫ్కే ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక వివరాలు చూద్దాం.. డోర్ డెలివరీ ఎఫెక్ట్ కరోనా తదుపరి లాక్డౌన్లు ఎత్తివేయడంతోపాటు.. అన్ని రకాల ఆంక్షలనూ ప్రభుత్వం తొలగించింది. అయినప్పటికీ వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు ఇటీవల జనంలోకి చొచ్చుకుపోయిన సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. దీంతో ఫిజికల్‌గా స్టోర్ల సందర్శనకంటే ఈకామర్స్వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కాలంలో జోరందుకున్న డోర్ డెలివరీ వ్యవస్థ రానురాను బహుముఖాలుగా విస్తరించింది. ఫలితంగా నిత్యావసరాలు మొదలు విచక్షణ ప్రకారం కొనుగోళ్లు చేపట్టే వస్తువుల విషయంలోనూ ఆన్‌లైన్‌కే ఓటు వేస్తున్నారు. భారీ వృద్ధి బాటలో లాక్డౌన్ రోజుల్లో కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్ తదితర నిత్యావసరాల కోసం కాంటాక్ట్‌లెస్ డోర్ డెలివరీలకు అలవాటుపడిన ప్రజలు తదుపరి కాలంలో టీవీ సెట్ల దగ్గర్నుంచి ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు తదితర వినిమయ వస్తువులను సైతం ఈ కామర్స్ సైట్ల ద్వారా కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ లాక్డౌన్ రోజులకుమించి కనిపిస్తోంది. ప్రధానంగా మెట్రో నగర ప్రాంతాలలో ఈకామర్స్ ద్వారా కొనుగోళ్లు భారీగా ఎగశాయి. ఇంటినుంచే కొనుగోలు చేయగలగడం, డోర్‌డెలివరీ సౌకర్యం, విభిన్న ప్రొడక్టుల అందుబాటు తదితర సానుకూలతలు కీలకపాత్రను పోషిస్తున్నాయి. ఫ్రాస్ట్ఫ్రీ ఫ్రిజ్‌లు, 55 అంగుళాలకుమించిన టీవీలు వంటి ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు 2023లో రెట్టింపయ్యాయి. కాగా, గతేడాదిలో ఎఫ్ఎంసీజీ విభాగ అమ్మకాలు అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే ఊపందుకున్నాయి. -
18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్
17 ఏళ్ల వయసులోనే చదువుకు గుడ్‌బై చెప్పాడు. అయితేనేం కేవలం 19 ఏళ్లకే లక్షాధికారిగా మారిపోయాడు. టిక్‌టాక్, యూట్యూబ్ వీడియోల ద్వారా ఏంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాడు హెడెన్ బౌల్స్. లంబోర్ఘినీ కారు, టెక్నికల్ రిటైర్ మెంట్.. లగ్జరీ టూర్లు.. అటు లక్షల మంది ఫాలోయర్లు.. ఇటు లక్షలాది సబ్స్క్రైబర్లు.. ఇదంతా ఎలా సాధ్యం.. తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీలోకి పోదాం రండి! అమెరికాకు చెందిన హెడెన్ బౌల్స్ చిన్నవయసులోనే ఇ-కామర్స్పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి చదువుకు స్వస్తి పలికాడు. ఈకామ్సీజన్ (EcommSeason) అనే ప్లాట్పారమ్తో వ్యాపారవేత్తగా అవతరించాడు. ఆన్లైన్లో డబ్బు సంపాదించడం ఎలా అనే కోర్సులను అందిస్తుంది. ఇది దీనికి చార్జ్ 575 డాలర్లు అంటే సుమారు 47 వేల రూపాయలు. కేవలం రెండేళ్లలోనే తన కలను సాకారం చేసుకున్నాడు. 22 ఏళ్లకే మిలియన్ల డాలర్లను ఆర్జిస్తున్నాడు. అంతేకాదు దీనిద్వారా వచ్చిన సొమ్మును రియల్ ఎస్టేట్‌లో పెట్టి హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. బౌల్స్ 18 ఏళ్ల వయస్సులోనే విలాసవంతమైన లంబోర్ఘినిని సొంతం చేసుకోవడం విశేషం. తన విజయానికి గల కారణాలను టిక్‌టిక్ యూట్యూబ్ వీడియోల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటాడు. దీంతో అతనికి మరింత ఆదరణ పెరిగింది. టిక్‌టాక్‌లో దాదాపు 107,000మంది అనుచరులు, యూట్యూబ్‌లో 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. గత సంవత్సరం కేవలం ఇ-కామర్స్ నుండి 15 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాడు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా మరో 1.5 మిలియన్ల డాలర్లు ఆర్జించాడు. ఇంకా పని చేయాలని ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడుల లాభాలతో తాను "టెక్నికల్ రిటైర్డ్"గా భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ వెంచర్ల నుండి వచ్చే ఆదాయం చాలు జీవితాంతం హ్యాపీగా ఉంటా అంటున్నాడు. అందుకే ఇపుడు బాలి తదితర పలు టూరిస్ట్ ప్లేస్‌లను సందర్శిస్తూ లగ్జరీగా లైఫ్‌ను గడిపేస్తున్నాడు. పర్యటనల ఫుటేజ్‌తో, ఫోటోలతో సోషల్ మీడియాను ముంచెత్తుతూ తన సక్సెస్ సీక్రెట్లను ఫాలోయర్లతో పంచుకుంటున్నాడు. అంతేకాదు జీవితంలో పైకి రావాలని భావిస్తున్న వారికి కీలక సలహాలు కూడా అందిస్తున్నాడు. మీరు సోషల్‌మీడియా స్టార్ కావాలనుకుంటే.. ఏం చేయాలో ఆలోచించుకుని ముందుకు సాగాలని సలహా ఇస్తాడు. డెడికేషన్, సింగిల్ ఫోకస్... సంపద అంటే.. రాబడి, ఖర్చుల నిష్పత్తి అంటాడు బౌల్స్. అంతేకాదు విజయవంతమైన వ్యక్తులు వారు సంపాదించిన దానిలో 20 శాతం మాత్రమే ఖర్చుపెడతారని మీరు కూడా అలా చేయగలిగితే, ఆ పొదుపును పెట్టుబడిగా పెట్టి రెట్టింపు ఆదాయాన్ని సాధించవచ్చు అంటాడు. ఫోకస్ ఎపుడూ సింగిల్ గానే ఉండాల, ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ డెడికేషన్ ఉండాలని పిలుపునిస్తున్నాడు. -
ఇది కదా ఆఫర్లు .. ఫ్లిప్‌కార్ట్ బంపర్ సేల్.. వీటిపై 80 శాతం డిస్కౌంట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. హోలీ సందర్భంగా బిగ్ బచత్ ధమాల్ సేల్‌తో ముందుకు వచ్చింది. మార్చి 3 నుంచి మార్చి 5 వరకు జరిగే ఈ ప్రత్యేక సేల్‌లో 1000 కి పైగా కంపెనీలకు చెందిన లక్షప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు తెలిపింది. మొబైల్స్, ల్యాప్ ట్యాప్స్, ట్యాబ్లెట్స్, దుస్తులు, టీవీలుపై ఆకర్షణీమైన తగ్గింపుతో వినియోగదారులకు స్పెషల్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం తెలిపింది. ఇక పలు రిపోర్ట్‌ల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ ఫర్నీచర్,మ్యాట్రెసెస్, షూర్యాక్స్,వార్డ్రోబ్, పోర్టబుల్ ల్యాప్‌ట్యాప్ స్టాండ్స్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తుంది. ఇక కస్టమర్లు బెడ్రూమ్, లివింగ్ రూమ్ పర్నిచర్పై 70 శాతం డిస్కౌంట్, ప్రీమియం ప్రొడక్ట్‌లపై 60 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు. హోమ్ అప్లయెన్సెస్‌పై 75 శాతం, టీవీలపై 60 శాతం, సమ్మర్ సీజన్ సందర్భంగా ఎయిర్ కండీషనర్లపై 55 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ప్లిప్‌కార్ట్ బిగ్ బచత్ సేల్‌లో ల్యాప్‌ట్యాప్స్‌పై 45 శాతం డిస్కౌంట్ అందిస్తుండగా..యాపిల్, శాంసంగ్, పోకో, రియల్ మీ వంటి ఫోన్లపై డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. వీటితో పాటు ఫుడ్, టాయిస్, బ్యూటీ ప్రొడక్ట్స్, స్పోర్ట్స్ ఐటమ్స్, హోమ్ డెకోర్, ఫర్నీషింగ్, కిచెన్ టూల్స్‌తో పాటు ఇతర హోం ప్రొడక్ట్స్‌పై ప్రమోషనల్ ఆఫర్స్, బ్యాంక్స్, ఫిన్ టెక్ కంపెనీలు ఇచ్చే ఆఫర్స్ అందుబాటులోకి ఉన్నాయి. -
సెబీ మాదిరిగా..ఈ - కామర్స్‌కు ప్రత్యేక వ్యవస్థ ఉండాలి..సీఏఐటీ డిమాండ్
న్యూఢిల్లీ: పటిష్ట ఈ–కామర్స్ విధానాన్ని రూపొందించడంతోపాటు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సెబీ, ఆర్బీఐ మాదిరిగా ఈ–కామర్స్ వ్యాపార నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల రక్షణ చట్టం కింద ప్రభుత్వం ఈ–కామర్స్ నిబంధనలను ప్రకటించడంతోపాటు ఎఫ్‌డీఐ రిటైల్ పాలసీ–2018 ప్రెస్ నోట్–2 స్థానంలో కొత్త ప్రెస్ నోట్‌ను విడుదల చేయాలని అన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సరళీకృతం చేయడం, హేతుబద్ధీకరించడంతోపాటు జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించాలని సీఏఐటీ కోరింది. -
అమెజాన్‌లో ఏం జరుగుతోంది? భారత్‌లో మరో బిజినెస్ మూసివేత!
దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల్లో రెసిషన్ భయాలు వెంటాడుతున్న తరుణంలో భారత్‌లో ఏ మాత్రం లాభసాటి లేని బిజినెస్‌లను షట్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలోనే అమెజాన్ తన ఫుడ్ డెలివరీ,ఎడ్యుకేషన్ సర్వీస్‌ను మూసిసేంది. తాజాగా మరో బిజినెస్‌కు స్వస్తి పలికినట్లు సమాచారం. అమెజాన్ దేశీయంగా డిస్ట్రిబ్యూషన్ సేవల్ని అందిస్తుంది. డిస్ట్రిబ్యూషన్ యూనిట్ కంపెనీల నుండి వినియోగదారులకు, రీటైలర్లకు సంబంధిత ప్రొడక్ట్‌లను డెలివరీ చేస్తుంది. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో డిస్టిబ్యూషన్ సర్వీస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. కంపెనీ ఇప్పుడు ప్రధాన వ్యాపారాలపై మరింత దృష్టి పెడుతుందని పేర్కొంది. అమెజాన్ అకాడమీ టూ అమెజాన్ ఫుడ్ అమెజాన్ ఇండియా తన వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్ష ప్రక్రియలో భాగంగా ఫుడ్ డెలివరీ సర్వీసుల్ని నిలిపివేసింది. వారం రోజుల ముందు ఎడ్ టెక్ సర్వీస్, అమెజాన్ అకాడమీని సైతం షట్ డౌన్ చేసింది. ముఖ్యంగా కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో బైజూస్, అన్ అకాడమీ, వేదాంతు’లు భారీ లాభాల్లో గడిస్తున్న సమయంలో అమెజాన్ అకాడమీని ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్ -
‘ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు భారీ షాక్’
దేశీయ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు షాకిచ్చింది. ‘క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ)’ ఆప్షన్ ఎంచుకున్న కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. దీంతో ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్, వెబ్సైట్ల నుంచి బుక్ చేసిన కొనుగోలు దారులపై ఈ అదనపు ఛార్జీల భారం పడనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం సంబంధిత ప్రొడక్ట్‌లపై డెలివరీ ఛార్జీలను వసూలు చేసేది. ఏదైనా రూ.500 లోపు వస్తువుల్ని ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ నుంచి బుక్ చేసుకుంటే వాటిపై రూ.40 డెలివరీ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. రూ.500 మించిన ప్రొడక్ట్ ధరపై ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని ప్లిప్‌కార్ట్ తన వెబ్ సైట్లో పేర్కొంది. కానీ ఇప్పుడు డెలివరీ ఛార్జీలను ఎత్తివేసింది. వాటికి బదులు సీఓడీ సౌకర్యం కావాలనుకున్న కస్టమర్ల నుంచి మినిమం ఛార్జీ రూ.5 వసూలు చేస్తుంది. చదవండి👉 నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, అమెజాన్‌కు భారీ ఫైన్! పెరిగిపోతున్న నెట్‌లాస్ ఆర్ధిక సంవత్సరం 2021-2022లో ప్లిప్‌కార్ట్ వృద్ధి రేటు రూ.10,659 కోట్లుగా ఉంది. అదే సమయంలో గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే మార్చి 2022 ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి నెట్ లాస్ రూ.4,362 కోట్లుగా ఉంది. అయితే ఆ నష్టాలకు కారణం పెరిగిపోతున్న రవాణా , మార్కెటింగ్, లీగల్ ఎక్సెపెన్సెస్ అని ప్లిప్‌కార్ట్ ప్రతినిధులు తెలిపారు. చదవండి👉 అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్ -
'నో కాస్ట్' ఈఎంఐ కిరికిరి, అసలు రహస్యం ఇది!
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రీటైల్, ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తుంటాయి. ఈ సందర్భంగా పలు ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లతో పాటు, నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్నిఅందిస్తుంటాయి. అయితే ఈ నోకాస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి? ఈ నోకాస్ట్ ఈఎంఐ వల్ల కొనుగోలు దారులకు లబ్ధి చేకూరుతుందా? దాని వెనుక ఏదైనా మతలబు దాగి ఉందా? ఏడాదిలో జరిగే ఫెస్టివల్స్ సీజన్లో సంస్థలు ప్రొడక్ట్‌ల అమ్మకాలు జరిగేలా నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. అందుకే కొనుగోలు దారులు గృహోపకరణాలు, వెహికల్స్, గాడ్జెట్స్‌ను ఫెస్టివల్ సీజన్లో కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతుంటారు. ఈ కొనుగోలు ముందు ఈ నోకాస్ట్ ఈఎంఐ గురించి తెలుసుకోవాలని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. నో కాస్ట్ ఈఎంఐ అంటే ముందుగా నో కాస్ట్ ఈఎంఐ అంటే? నోకాస్ట్ ఈఎంఐ కింద ఓ వస్తువును ఎంత ధర పెట్టి కొనుగోలు చేస్తామో.. ఆ మొత్తాన్ని నెలనెలా కొద్ది మొత్తాన్ని చెల్లించాలి. ఆ మొత్తానికే సంస్థలు ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయవు. ఇలా నెలవారీ చెల్లించే ఈఎంఐలపై ఎలాంటి వడ్డీని విధించకపోవడాన్ని నోకాస్ట్ ఈఎంఐ అంటారు. నోకాస్ట్ ఈఎంఐ కిరికిరి ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి అప్పుడే మార్కెట్లో విడుదలైన 5జీ ఫోన్‌ను నో కాస్ట్ ఈఎంఐ కింద రూ.30వేలకు కొనుగోలు చేస్తాడు. ఆమొత్తాన్ని 10 నెలల టెన్యూర్ కాలానికి ఒక్కో నెల 3వేలు చెల్లించి.. ఈఎంఐని క్లియర్ చేస్తాడు. వడ్డీ లేదని తెగ సంబర పడిపోతుంటాడు. కానీ ఈ నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లో జరిగేది అదికాదు. రమేష్ ఫోన్ ధర వాస్తవానికి రూ.27వేలు ఉంటుంది. సంస్థలు అదనంగా మరో రూ.3వేలు జత చేసి.. ఫోన్ ధర రూ.30వేలు ఉందని, మీకు డిస్కౌంట్లో జీరోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఊదర గొట్టేస్తుంటాయి. మరో రకమైన వసూలు మరో రకంగా చెప్పాలంటే అదే రమేష్ కొన్న 5జీ ఫోన్ వాస్తవ ధర రూ.30 వేలు ఉంటుంది. కానీ ఫోన్ తయారీ సంస్థలు జీరో కాస్ట్ ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంటాయి. ఆ ప్రాసెసింగ్ ఫీజు ఏంటో తెలుసా? మీకు అందించే ఈఎంఐ కింద సంస్థలు వసూలు చేసే వడ్డీ. తస్మాత్ జాగ్రత్త కాబట్టి, కొనుగోలు దారులు నోకాస్ట్ ఈఎంఐలో ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటే.. తప్పని సరిగా నియమ నిబంధనల గురించి తెలుసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. చదవండి👉 ఈపీఎఫ్ అకౌంట్లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా? -
అమెజాన్‌లో విశాఖ వాసుల సూపర్ షాపింగ్
విశాఖపట్నం: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (అమెజాన్ జీఐఎఫ్ 2022) విశాఖ వాసులు అదరగొట్టారు. హైఎండ్ గేమింగ్, బిజినెస్ ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్, కెమెరాలు, వైర్లెస్ ఇయర్ ఫోన్లు, వైర్, వైర్లెస్ స్పీకర్లు, బ్లూటూత్ స్పీకర్లు, సౌండ్బార్లను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. రూ.10–20వేల శ్రేణిలోని స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్ పరంగా మంచి పనితీరు చూపించిన పట్టణాల్లో విశాఖపట్నం కూడా ఉన్నట్టు అమెజాన్ ఇండియా ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి జీఐఎఫ్ను అమెజాన్ నిర్వహిస్తోంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై ఆకర్షణీయమైన డీల్స్, ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కంప్యూటింగ్ డైరెక్టర్ అక్షయ్ అహుజా మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని కస్టమర్ల నుంచి మంచి స్పందన అందుకుంటున్నాం. ఈ అద్భుత స్పందనకు గాను వారికి మా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుంచి కస్టమర్లు టెక్నాలజీ ఉత్పత్తులు అయిన ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఆడియో ఎక్విప్మెంట్లు కొనుగోలు చేస్తున్నారు. నెలరోజుల పాటు జరిగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఇదే డిమాండ్ కొనుసాగుతుందని భావిస్తున్నాం’’అని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవలు, త్వరలో ప్రారంభం!
గురుగ్రామ్: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రీజియన్ కార్యకలాపాలు ఈ ఏడాదే ప్రారంభించనుంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మ్యాక్స్ పీటర్సన్ ఈ విషయం వెల్లడించారు. హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ రీజియన్‌లో మూడు జోన్లు ఉంటాయని, ప్రతి జోన్లో ముందుగా రెండు డేటా సెంటర్లతో ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. కంపెనీ తమ తొలి ఏడబ్ల్యూఎస్ రీజియన్‌ను 2016లో ముంబైలో ప్రారంభించింది. ఇప్పటివరకూ స్థానిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై భారత్‌లో 3.71 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఏడబ్ల్యూఎస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పీటర్సన్ పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంశంపై పరిశోధనలకు కొత్త బ్యాచ్‌ను కూడా ఆయన ప్రకటించారు. -
నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, ఫ్లిప్‌కార్ట్‌పై సీసీపీఏ ఆగ్రహం!
న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌పై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ.లక్ష జరిమానా విధించింది. వినియోగ హక్కులను ఉల్లంఘనలకు పాల్పడుతూ,తన ప్లాట్‌ఫారమ్‌లో నాసిరకం ప్రెజర్ కుక్కర్లను విక్రయించడానికి అనుమతించినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖేర్ వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో విక్రయించిన మొత్తం 598 ప్రెజర్ కుక్కర్ల వినియోగదారుల పేర్లనూ నోటిఫై చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. విక్రయించిన ప్రెజర్ కుక్కర్లను రీకాల్ చేసి వినియోగదారులకు డబ్బును రీయింబర్స్ (తిరిగి చెల్లింపులు) చేయాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఈ అంశంపై స్థాయీ నివేదికను 45 రోజుల లోపు సమర్పించాలని కూడా ఇ– కామర్స్ దిగ్గజాన్ని అథారిటీ ఆదేశించింది. తీవ్ర ప్రమాదాల నుంచి వినియోగదారులను రక్షించడానికి, వినియోగదారు ప్రయోజనాలే ప్రధాన ధ్యేయంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రెజర్ కుక్కర్లపై ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత గుర్తును ఉపయోగించడాన్ని ప్రభుత్వం 2021 ఫిబ్రవరి నుంచి తప్పనిసరి చేసింది. అన్ని వంటింటి ప్రెజర్ కుక్కర్లు ‘ఐఎస్ 2347:2017’ ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. ప్రెజర్ కుక్కర్లను ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో విక్రయించినా వీటికి సంబంధించి అత్యధిక భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. సీసీపీఏ ప్రకారం, ఫ్లిప్‌కార్ట్ తన ’వినియోగ నిబంధనల’లో ప్రెజర్ కుక్కర్లకు సంబంధించి ప్రతి ఇన్వాయిస్పై ’ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆధారితం’ అని పేర్కొంది. వివిధ పంపిణీ ప్రయోజనాల కోసం విక్రేతలను ’బంగారం, వెండి, కాంస్య’గా గుర్తించింది. అమ్మకాల విషయంలో ఫ్లిప్‌కార్ట్ పోషించిన పాత్రను ఇది సూచిస్తుంది. తన ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఇటువంటి ప్రెజర్ కుక్కర్లను విక్రయించడం ద్వారా రూ. 1,84,263 ఫీజును సంపాదించినట్లు ఫ్లిప్‌కార్ట్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు విక్రయించడం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు, ఇందుకు సంబంధించి బాధ్యత నుండి ఫ్లిప్‌కార్ట్ తప్పించుకోలేదు. విస్తృత అవగాహనా కార్యక్రమాలు.. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించి దేశ వ్యాప్తంగా విస్తృత అవగాహనా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖేర్ వెల్లడించారు. ఆమె తెలిపిన ముఖ్యాంశాలు... ► ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని ఉత్పత్తులకు సంబంధించి ప్రమాణాలను ఉల్లంఘించే నకిలీ వస్తువుల విక్రయాలను నిరోధించడం సీసీపీఏ దేశవ్యాప్త ప్రచార లక్ష్యం. ► ఈ ప్రచారంలో ముఖ్యంగా హెల్మెట్లు, ప్రెజర్ కుక్కర్లు, వంట గ్యాస్ సిలిండర్లపై దృష్టి సారిస్తోంది. ► అటువంటి ఉత్పత్తుల తయారీ లేదా విక్రయాలకు సంబంధించిన అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపి తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు లేఖ రాసింది. ► ప్రచారంలో భాగంగా ప్రామాణికంగా లేని పలు హెల్మెట్లు, ప్రెజర్ కుక్కర్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీలపై చర్యలకు శ్రీకారం చుట్టారు. ► నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదుల్లో దాదాపు 38% ఇ–కామర్స్‌కు సంబంధించినవి. ఇందులో లోపభూయిష్ట ఉత్పత్తి డెలివరీ, చెల్లింపుల వాపసులో వైఫల్యం, ఉత్పత్తి డెలివరీలో జాప్యం వంటి అంశాలు ఉన్నాయి. -
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్‌పై 300కి పైగా సహకార సంఘాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్కెట్‌ప్లేస్ (ఆన్లైన్ క్రయ, విక్రయ వేదిక/ఈ కామర్స్) ‘జెమ్’ పోర్టల్‌లో 300 వరకు కోఆపరేటివ్ సొసైటీలు (సహకార సంఘాలు) నమోదైనట్టు కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జెమ్ పోర్టల్‌లో సంస్థల నమోదు ప్రక్రియను మంత్రి వర్చువల్‌గా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అమూల్, ఇఫ్కో, క్రిబ్కో, నాఫెడ్, సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంకు తదితర సంస్థలు కొనుగోలుదారులుగా జెమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయని చెబుతూ.. విక్రేతలుగానూ నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. కోఆపరేటివ్ సొసైటీలు సైతం జెమ్ ద్వారా తమకు కావాల్సిన వస్తు, సేవలను కొనుగోలు చేసుకునేందుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది జూన్‌లో అనుమతించింది. అంతకుముందు ఈ అవకాశం లేదు. తొలిదశలో రూ.100 కోట్ల టర్నోవర్/డిపాజిట్లు ఉన్న సొసైటీలను అనుమతించారు. దీంతో 589 సంస్థలకు అర్హత ఉందని గుర్తించగా, 300కు పైన ఇప్పటివరకు నమోదు చేసుకున్నాయి. మంత్రి ప్రారంభంతో.. మొదటి రోజే సుమారు రూ.25 కోట్ల విలువైన ఆర్డర్లు నమోదైనట్టు అంచనా. దేశవ్యాప్తంగా 8.5 లక్షల సహకార సంఘాలు ఉంటే, వీటి పరిధిలో 29 కోట్ల మంది భాగస్వాములుగా ఉన్నారు. జెమ్‌పై కోఆపరేటివ్‌ల నమోదు అర్హతలను మరింత సరళీకరించనున్నట్టు మంత్రి అమిత్‌షా తెలిపారు. కాగా, సహకార సంఘాల్లో సంస్కరణలు అవసరమని మంత్రి అమిత్‌షా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. -
అమెజాన్ చరిత్రలో తొలిసారి..లక్షమంది ఉద్యోగులపై వేటు!
ప్రపంచ దేశాల్ని పట్టిపీడిస్తున్న ఆర్ధిక మాంధ్యం కారణంగా దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా లక్షలాది మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ చరిత్రలో తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు లక్షమంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ వార్షిక ఫలితాల నేపథ్యంలో ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ ఒల్సావ్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెజాన్‌లో ఉన్న మొత్తం సిబ్బందిలో 15లక్షమంది ఉద్యోగుల్లో లక్షమందిని విధుల నుంచి తొలగించాం. వారిలో ఫుల్‌ఫిల్ మెంట్ సెంటర్, డిస్టిబ్యూషన్ నెట్ వర్క్ ఉద్యోగులపై వేటు వేశారు. సిబ్బందిని తగ్గించడం, నియమించుకోవడం తగ్గిస్తే మంచిదని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. గతేడాది అమెజాన్ 27వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. అదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్లో తమ కార్యకలాపాల్ని ముమ్మరం చేసేందుకు క్యూ1లో అనేక మంది ఉద్యోగుల్ని నియమించింది. ఉద్యోగుల విషయంలో సంస్థ పారదర్శకంగా ఉన్నట్లు చెప్పిన బ్రియాన్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కంపెనీ 14వేల మందిని హయర్ చేసుకున్నట్లు వెల్లడించారు. -
ఐఫోన్ పై అదిరిపోయే ఆఫర్, రూ.23వేల వరకు భారీ డిస్కౌంట్!!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపరాఫర్. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఫ్లిప్ కార్ట్ సేల్‌లో ఐఫోన్ 12,ఐఫోన్ 12మినీ, ఐఫోన్ ఎస్ తో పాటు పలు మోడళ్ల ఐఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను అందిస్తున్నాయి. ఇక ఐఫోన్-13పై రూ.23వేల భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్-13 డిస్కౌంట్ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్-13 128జీబీ వేరియంట్ ధర రూ.74,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.84,900, 512జీబీ వేరియంట్ ధర రూ.1,04,900గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ సేల్ లో డిస్కౌంట్ తో పాటు కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ను ఎక్ఛేంజ్ చేస్తే రూ.18,500 వరకు ఆఫర్ పొందవచ్చు.ఈ ఎక్ఛేంజ్ ఆఫర్లో కొనుగోలు దారులు ఫోన్ పనితీరు, మోడల్ నంబర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ ఎక్ఛేంజ్ ధరను నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలి. డిస్కౌంట్,ఎక్ఛేంజ్ ఆఫర్ తర్వాత ఐఫోన్13 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56400, 128జీబీ ఫోన్ ధర రూ.66400, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.86400కే సొంతం చేసుకోవచ్చు.అంతేకాదు ఫ్లిప్‌కార్ట్,యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లుపై 5శాతం రివార్డ్, నెలకు రూ.2560 ప్రారంభ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తుంది. -
అందరికీ ఆమోదయోగ్యంగా ఈ కామర్స్ పాలసీ: గోయల్
దుబాయి: ప్రతిపాదిత ఈకామర్స్ విధానం పటిష్టంగా, ప్రతి భారతీయుని ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. భాగస్వాముల ప్రయోజనాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ముసాయిదా ఈ కామర్స్ నిబంధనలపై అభిప్రాయాలను తాను ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. ముసాయిదా నిబంధనలపై అంతర్గత మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు అవసరం లేదన్నారు. డీపీఐఐటీ, కార్పొరేట్ శాఖ, నీతి ఆయోగ్ కొన్ని నిబంధనల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. దుబాయిలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచి్చన సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. -
ఈ–కామర్స్ కంపెనీలు, దోపిడీ ధరల్ని ప్రోత్సహిస్తున్నాయి
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించాయంటూ ఈ–కామర్స్ కంపెనీల మీద వర్తకులు, వాణిజ్య సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ లిఖిత పూర్వకంగా లోక్‌సభకు వెల్లడించారు. ‘మార్కెట్‌ప్లేస్ ఆధారిత ఈ–కామర్స్ కంపెనీలు సంక్లిష్ట యాజమాన్య పద్ధతులను అవలంభిస్తున్నాయి. నియంత్రిత, ప్రాధాన్యత గల విక్రేతల ద్వారా సరుకు నిల్వ చేసుకుని అమ్మకాలను సాగిస్తున్నాయి. భారీ తగ్గింపులు, దోపిడీ ధర, ప్రత్యేక ఒప్పందాలను ప్రోత్సహిస్తున్నాయి’ అంటూ ఫిర్యాదులు వచ్చాయని మంత్రి తెలిపారు. -
నెలకు లక్షల ఆర్డర్లు, 4 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఈకామర్స్ సంస్థ
న్యూఢిల్లీ: బీ2బీ ఈ–కామర్స్ సంస్థ ఉడాన్.. గడిచిన 12–18 నెలల్లో టెక్నాలజీ, సరఫరా వ్యవస్థతో పాటు ఇతరత్రా విభాగాలపై రూ. 4,000 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. వార్షిక ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 100 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఉడాన్ కార్యకలాపాలు ప్రారంభమై అయిదేళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ సిబ్బందికి పంపిన అంతర్గత మెయిల్లో సహ వ్యవస్థాపకులు ఆమోద్ మాలవీయ, సుజీత్ కుమార్, వైభవ్ గుప్తా ఈ విషయాలు తెలిపారు. లక్షల మంది చిన్న వ్యాపారుల సమస్యలు తీర్చేందుకు ఏర్పాటైన తమ సంస్థ.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యాపార వ్యూహాలకు పదును పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వారు వివరించారు. కేవలం ఈ–కామర్స్‌కే పరిమితం కాకుండా దేశీయంగా అతి పెద్ద కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా ఎదగనున్నట్లు పేర్కొన్నారు. 2016లో ఏర్పాటైన ఉడాన్ ప్లాట్‌ఫాంలో 30 లక్షల మంది పైగా యూజర్లు, 30,000 మంది పైగా విక్రేతలు ఉన్నారు. రోజూ 1.5–1.75 లక్షల ఆర్డర్లు, నెలకు 45 లక్షల పైచిలుకు ఆర్డర్లు డెలివరీ చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఇన్వెస్టర్ల నుంచి 280 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,048 కోట్లు) అందుకుంది. దాదాపు 3 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఇప్పటిదాకా సుమారు 1.15 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. చదవండి: కరోనాతో తగ్గేదే లే, వేల కోట్లు వసూలైన ట్యాక్స్ -
అమెరికన్ కంపెనీలపై వివక్ష
న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్ కంపెనీలకు సంబంధించి భారత్ పాటిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ (డీఎస్టీ) విధానం.. అమెరికన్ కంపెనీల పట్ల వివక్షాపూరితంగా ఉంటోందని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (యూఎస్టీఆర్) వ్యాఖ్యానించింది. ఇది అంతర్జాతీయ పన్ను విధానాలకు విరుద్ధమని ఆక్షేపించింది. డీఎస్‌టీపై చేపట్టిన విచారణ నివేదికలో యూఎస్టీఆర్ ఈ విషయాలు తెలిపింది. భారతీయ కంపెనీలకు మినహాయింపునిస్తూ, కేవలం విదేశీ సంస్థలనే టార్గెట్ చేస్తున్న భారత డీఎస్టీ విధానం పూర్తిగా వివక్షాపూరితమైనదిగా తేటతెల్లమవుతోందని పేర్కొంది. ‘‘దీనివల్ల స్థానికంగా కార్యాలయాలు లేని అమెరికన్ సంస్థల డిజిటల్ సర్వీసులపై పన్నులు విధిస్తుండగా.. అవే సర్వీసులు అందించే భారతీయ ప్రొవైడర్లకు మాత్రం మినహాయింపు ఉంటోంది. ఇది పూర్తిగా వివక్షాపూరితమైనదని స్పష్టమవుతోంది’’ అని యూఎస్టీఆర్ నివేదికలో పేర్కొంది. విదేశీ సంస్థలను విడిగా చూడటమే డీఎస్టీ ప్రధానోద్దేశమని ఒక ప్రభుత్వ అధికారి కూడా స్పష్టం చేసినట్లు వివరించింది. డిజిటల్ సర్వీసుల రంగంలో అమెరికన్ కంపెనీలు ప్రపంచంలోనే అగ్రగాములుగా ఉన్న నేపథ్యంలో వాటిపై డీఎస్టీ భారం గణనీయంగానే ఉంటోందని తెలిపింది. దీని పరిధిలోకి వచ్చే 119 కంపెనీలను విశ్లేషించగా.. వీటిలో 86 సంస్థలు (దాదాపు 72 శాతం) అమెరికాకు చెందినవే ఉన్నాయని యూఎస్టీఆర్ వివరించింది. అస్పష్టత.. డీఎస్టీలోని కొన్ని అంశాలు అంతర్జాతీయ ట్యాక్సేషన్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని, కొన్ని విషయాల్లో స్పష్టత కొరవడిందని యూఎస్టీఆర్ తెలిపింది. దీనివల్ల పన్ను వర్తించే సర్వీసులు, ఏ సంస్థలు దీని పరిధిలోకి వస్తాయి వంటి అంశాలపై కంపెనీల్లో గందరగోళం నెలకొందని వివరించింది. వీటిని పరిష్కరించేందుకు భారత్ అధికారికంగా ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని యూఎస్టీఆర్ తెలిపింది. అందరూ సమానమే: భారత్ కాగా, యూఎస్టీఆర్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. భారత్‌లో స్థానికంగా ఉండని విదేశీ ఈ–కామర్స్ ఆపరేటర్లు ఎవరికైనా దీన్ని వర్తింపచేస్తున్నామని స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సముచిత పోటీని ప్రోత్సహించేందుకు, భారత మార్కెట్లో డిజిటల్ కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారాలపై పన్నులు విధించేందుకు ప్రభుత్వానికి ఉండే అధికారాల పరిధికి లోబడే డీఎస్టీ అమలు చేస్తున్నట్లు వివరించింది. -
ఫ్లిప్‌కార్ట్ నష్టం రూ. 3,150 కోట్లు
ముంబై, సాక్షి: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గత ఆర్థిక సంవత్సర(2019-20) ఫలితాలు ప్రకటించింది. గ్లోబల్ రిటైల్ కంపెనీ వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ గతేడాది రూ. 12 శాతం అధికంగా రూ. 34,610 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ కాలంలో నష్టాలను సైతం 18 శాతంమేర తగ్గించుకోగలిగింది. రూ. 3,150 కోట్లకు పరిమితం చేసుకోగలిగింది. అంతక్రితం ఏడాదిలో రూ. 4,455 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ అందించిన వివరాల ప్రకారం ఫ్లిప్‌కార్డ్ ప్రయివేట్ లిమిటెడ్(సింగపూర్)కు గతేడాది రూ. 4,455 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేసింది. కాగా.. గతేడాది మొత్తం వ్యయాలు రూ. 37,760 కోట్లకు చేరాయి. వీటిలో ఉద్యోగుల(బెనిఫిట్) వ్యయాలు రూ. 246 కోట్ల నుంచిరూ. 309 కోట్లకు పెరిగాయి. 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను వాల్‌మార్ట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇతర ప్రాంతాలకూ సెప్టెంబర్‌లో టోకు విక్రయాలకుగాను ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ పేరుతో డిజిటల్ బీటూబీ ప్లాట్‌ఫామ్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టింది. తద్వారా స్థానిక కిరాణా, చిన్న, మధ్యతరహా దుకాణదారులకు రిటైలర్లతో కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పించింది. అంతేకాకుండా వీటి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్‌ను డిజిటైజ్ చేసేందుకు అవకాశం ఏర్పడినట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్రధానంగా ఫుట్‌వేర్, దుస్తులు తదితర ఫ్యాషన్ రిటైలర్లకు అనుగుణంగా హోల్‌సేల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తెలియజేసింది. తొలి దశలో గురుగ్రామ్, ఢిల్లీ, బెంగళూరులలో ఏర్పాటు చేయగా.. ఇకపై మరో 20 పట్టణాలకూ సర్వీసులను విస్తరించనున్నట్లు వెల్లడించింది. ప్రాథమిక దశలో రెండు నెలల్లో 300 మంది వ్యూహాత్మక భాగస్వాములు, 2 లక్షల ప్రొడక్టుల లిస్టింగ్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది జులైలో వాల్‌మార్ట్‌కు దేశీయంగా గల బెస్ట్‌ప్రైస్ హోల్‌సేల్ స్టోర్లతోసహా ఇతర బిజినెస్‌లనూ ఫ్లిప్‌కార్ట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తద్వారా దిగ్గజ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెజాన్ తదితరాలతో ఎదురవుతున్న పోటీలో నెగ్గుకు వచ్చేందుకు సన్నద్ధమైనట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
త్వరలో ప్రభుత్వం నుంచి దేశీ అమెజాన్
న్యూఢిల్లీ, సాక్షి: ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త! త్వరలో దేశీయంగా అమెజాన్ తరహా ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ ఆవిర్భవించనుంది. ఇందుకు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే నడుం బిగించడం విశేషం! ఇందుకు వీలుగా నిపుణులతో కూడిన ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. త్వరలో ఈ కమిటీ విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వెరసి ప్రభుత్వమే దేశీ ఈకామర్స్ బిజినెస్‌కు తెరతీయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. తద్వారా ఈకామర్స్ రంగంలో జరుగుతున్న కొన్ని అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్నళ్లుగా దేశంలో ఈకామర్స్ బిజినెస్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ వస్తోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన కోవిడ్-19 దీనికి జత కలిసింది. దీంతో దేశీయంగా పండుగల సీజన్ అయిన గత నెల రోజుల్లోనే ఈకామర్స్ ద్వారా రూ. 61,000 కోట్లకుపైగా(8.3 బిలియన్ డాలర్లు) బిజినెస్ జరగడం గమనార్హం! అయితే ఆన్లైన్ అమ్మకాలలో కొన్న అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని సీరియస్‌గా పరిగణిస్తున్న ప్రభుత్వం లోపాలకు చెక్ పెట్టేందుకు వీలుగా దేశీ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కఠిన నిబంధనలను రూపొందించేందుకు వీలుగా స్టీరింగ్ కమిటీని సైతం ఎంపిక చేసినట్లు తెలియజేశారు. కమిటీ ఇలా డిజిటల్ కామర్స్‌కు చెందిన ఓపెన్ నెట్వర్క్(ఓఎన్డీసీ) విధానాలకు వీలుగా కేంద్ర వాణిజ్య శాఖ 11 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తద్వారా ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధికి విధానాలు రూపొందించనుంది. ఇందుకు అనుగుణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల తరహా తుది స్టోర్ఫ్రంట్ తదితర మౌలిక సదుపాయాలను ఓఎన్డీసీ సమకూర్చనుంది. ఈ విషయాలపై వాణిజ్య శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మండలి ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో ప్రభుత్వ రంగానికి చెందిన పలు విభాగాల నుంచి ప్రతినిధులను ఎంపిక చేసింది. డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. కమిటీలో ఈమార్కెట్, ఎంఎస్ఎంఈ, నితి ఆయోగ్, ఎన్పీసీఐ, ఎన్ఎస్డీఎల్ అధికారులతోపాటు.. జాతీయ ట్రేడర్ల సమాఖ్య, దేశీ రిటైలర్ల అసోసియేషన్ నుంచి ప్రతినిధులకు చోటు కల్పించింది. ఎందుకంటే? పలు అవకతవకలకు చోటున్న ఈకామర్స్ రంగంలో సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వివిధ ప్లాట్‌ఫామ్స్ వృద్ధి చెందేందుకు వీలు కల్పించడం, కొనుగోలుదారులకు రక్షణ కల్పించడం తదితరాలకు తెరతీయాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా కొత్త విధివిధానాలతో ఈకామర్స్ బిజినెస్‌ను పటిష్ట పరచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి సొంత ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొత్త విధానాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. అంతేకాకుండా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈకామర్స్ సంస్థలు అవలంబిస్తున్న విధానాలపై కొద్ది నెలలుగా దేశీ రిటైల్ రంగ సంస్థలు ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రాండ్లతో భాగస్వామ్యం, భారీ డిస్కౌంట్లు, ఇన్వెంటరీ, లాజిస్టిక్స్ నిర్వహణ తదితర అంశాలపైనా ప్రభుత్వం దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. -
30 రోజుల్లో రూ. 61,000 కోట్ల అమ్మకాలు
ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఈకామర్స్ కంపెనీలకు మాత్రం జోష్‌నిస్తోంది. ఆన్లైన్ ద్వారా ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య నెల రోజుల కాలంలో ఏకంగా 8.3 బిలియన్ డాలర్ల(రూ. 61,000 కోట్లకుపైగా) విలువైన బిజినెస్ జరిగింది. దేశీయంగా పండుగల సీజన్‌గా పేర్కొనే ఈ కాలంలో ఆన్లైన్ అమ్మకాలు ఏకంగా 65 శాతం జంప్‌చేశాయి. గతేడాది ఇదే కాలంలో స్థూలంగా 5 బిలియన్ డాలర్ల(రూ. 37,000 కోట్లు) అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ విడుదల చేసిన నివేదిక వివరాలివి. నిజానికి 7 బిలియన్ డాలర్ల అమ్మకాలను అంచనా వేసినట్లు రెడ్‌సీర్ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ నివేదిక వివరాలు ఇలా ఉన్నాయ్... 88 శాతం వృద్ధి గతేడాదితో పోలిస్తే ఆన్లైన్ కస్టమర్లలో ఈ ఏడాది 88 శాతం వృద్ధి నమోదైంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి నమోదైన 4 కోట్లమంది వినియోగదారుల కారణంగా అధిక వృద్ధి సాధ్యమైంది. కాగా.. అమ్మకాలలో ప్రధానంగా మొబైల్ ఫోన్ల హవా కనిపించింది. అయితే చిన్న పట్టణాల నుంచి పెరిగిన కొనుగోలుదారుల నేపథ్యంలో ఒక్కో కస్టమర్‌పై సగటు ట్రేడ్ విలువ అంటే జీఎంవీ రూ. 7,450 నుంచి రూ. 6,600కు తగ్గింది. అంచనాల ప్రకారం మొత్తం అమ్మకాలలో 66 శాతం వాటాను ఫ్లిప్‌కార్ట్ సొంతం చేసుకుంది. తాజా పండుగల అమ్మకాల ప్రకారం దేశీయంగా ఈకామర్స్ విభాగానికి అత్యంత ప్రాధాన్యత కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే బిగ్ బిలియన్ డేస్ విక్రయాలలో ఫ్లిప్‌కార్ట్ ఈసారి 40 శాతం వృద్ధిని సాధించింది. ఇదేవిధంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల నుంచీ కస్టమర్లను ఆకట్టుకుంది. రూ. కోటికిపైగా సుమారు 600 మంది అమ్మకందారులు రూ.కోటికిపైగా విలువైన విక్రయాలు సాధించగా.. 6387 పిన్‌కోడ్స్ నుంచి సెల్లర్స్‌కు ఆర్డర్లు లభించినట్లు అమెజాన్ వెల్లడించింది. ఇక 6,500 మంది విక్రేతలు రూ. 10 లక్షలకుపైగా విలువైన అమ్మకాలను సాధించినట్లు తెలియజేసింది. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్డర్లు అధికంగా లభించినట్లు పేర్కొంది. కారణాలివీ భారత్, చైనాల మధ్య సరిహద్దు వద్ద వివాదాల నేపథ్యంలోనూ ఈకామర్స్ కంపెనీలు గరిష్ట స్థాయిలో వస్తువులను అందుబాటులో ఉంచడం అమ్మకాల వృద్ధికి దోహదపడినట్లు రెడ్‌సీర్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా బ్రాండ్లు, ఫైనాన్సింగ్ ఒప్పందాలు దీనికి జత కలసినట్లు తెలియజేసింది. మెట్రో నగరాల నుంచి ద్వితీయ స్థాయి పట్టణాలకు పెరిగిన ఉద్యోగుల వలస, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు వంటి అంశాలు ఆన్లైన్ అమ్మకాలకు దోహదపడినట్లు అభిప్రాయపడింది. కొనుగోలుదారులు అటు ఖరీదైన లేదా ఇటు కారుచౌక వస్తువులకంటే అందుబాటు ధరల ఐటమ్స్‌కే మొగ్గు చూపినట్లు వివరించింది. -
ఆన్లైన్ షాపింగ్ ప్రియులకూ రాజధాని ఢిల్లీయే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ... ఆన్లైన్ షాపింగ్ ప్రియులకూ రాజధానిగా వర్ధిల్లుతోంది. తమ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై షాపింగ్ చేస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం) నుంచే ఉంటున్నారని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఆ తర్వాత బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ ఉన్నట్టు ‘ఫ్లిప్ట్రెండ్స్ 2016’ నివేదిక రూపంలో తెలిపింది. వెల్లూర్, తిరుపతి, బళ్లారి, జోర్హట్, కొట్టాయమ్ ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్యా పరంగా టైర్–3 పట్టణాల్లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 2016లో ఆన్లైన్ షాపింగ్ చేసిన వారిలో 60 శాతం మంది పురుషులేనట. ఎలక్ట్రానిక్ వస్తువులు, పర్సనల్ ఆడియో, పాదరక్షలు, లైఫ్‌స్టయిల్ ఉత్పత్తులను వీరు ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇక 2016లో ఎలక్ట్రానిక్ యాక్ససరీలు, మొబైల్స్, మహిళల వస్త్రాలు, పురుషుల పాదరక్షలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఎక్కువ శాతం అమ్మకాలు జరిగాయి. 50 శాతం లావాదేవీలు ఖరీదైన ఫోన్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్‌కు సంబంధించినవేనని... నోకాస్ట్ ఈఎంఐ, పాత వస్తువులతో మార్పిడి ఇందుకు వీలు కల్పించాయని ఫ్లిప్‌కార్ట్ వివరించింది. విద్యుత్‌ను ఆదా చేసే బల్బ్‌లు, వాల్ స్టిక్కర్లు, సెల్ఫీ స్టిక్స్, ప్రింటర్ఇంక్, స్లిమ్మింగ్ బెల్ట్‌లు, కండోమ్‌లు, ప్రొటీన్ సప్లిమెంట్లు, మస్సాజర్, బీపీ మెషిన్లు, హుక్కా మెషిన్లు, హుక్కా ఫ్లావర్ల అమ్మకాలు కూడా జరిగాయని తెలిపింది.