అందరికీ ఆమోదయోగ్యంగా ఈ కామర్స్‌ పాలసీ: గోయల్‌ | Government Working On A Robust E-Commerce Policy | Sakshi
Sakshi News home page

అందరికీ ఆమోదయోగ్యంగా ఈ కామర్స్‌ పాలసీ: గోయల్‌

Published Mon, Oct 4 2021 12:11 AM | Last Updated on Mon, Oct 4 2021 12:11 AM

Government Working On A Robust E-Commerce Policy - Sakshi

దుబాయి: ప్రతిపాదిత ఈకామర్స్‌ విధానం పటిష్టంగా, ప్రతి భారతీయుని ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ హామీ ఇచ్చారు. భాగస్వాముల ప్రయోజనాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ముసాయిదా ఈ కామర్స్‌ నిబంధనలపై అభిప్రాయాలను తాను ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. ముసాయిదా నిబంధనలపై అంతర్గత మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు అవసరం లేదన్నారు. డీపీఐఐటీ, కార్పొరేట్‌ శాఖ, నీతి ఆయోగ్‌ కొన్ని నిబంధనల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. దుబాయిలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచి్చన సందర్భంగా మంత్రి గోయల్‌ మాట్లాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement