commerce minister
-
వృద్ధి తిరిగి ట్రాక్‌లోకి వస్తుంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎన్నో అనిశి్చతులు నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తిరిగి గాడిన పడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో విధాన నిర్ణయాలు, వృద్ధికి సంబంధించి చర్యలు, మౌలిక వసతులపై ఖర్చు చేయడం సహజంగానే తగ్గుతాయి. ప్రస్తుత త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో పండుగల వ్యయాలకుతోడు, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి పుంజుకోవడం, మౌలిక వసతులపై వ్యయాలు సాధారణ స్థితికి చేరుకున్నట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. వచ్చే మార్చి చివరికి తిరిగి ట్రాక్‌లోకి వస్తాం’’అని టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన సదస్సులో భాగంగా మంత్రి గోయల్ చెప్పారు. తయారీ, మైనింగ్ రంగాల్లో బలహీన పనితీరుతో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి 5.4 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఇది ఆందోళన కలిగిస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు గోయల్‌పై విధంగా బదులిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వృద్ధి 8.1 శాతంగా ఉండడం గమనించొచ్చు. చివరిగా 2022 అక్టోబర్–డిసెంబర్ కాలంలో జీడీపీ 4.3 శాతం కనిష్ట వృద్ధి రేటును నమోదు చేసింది. అయినా వేగవంతమే.. ఇప్పటికీ ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గోయల్ చెప్పారు. ఆధునిక టెక్నాలజీలు, ఆవిష్కరణలు దేశ వృద్ధి రేటును నడిపిస్తాయన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.6 శాతమే కావడం గమనార్హం. ప్రతిపక్ష పారీ్టలు చేస్తున్న తప్పుడు, ప్రతికూల ప్రచారం దేశ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోలేవన్నారు. ‘‘వక్ఫ్ బిల్లు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుల ఆమోదానికి కట్టుబడి ఉన్నాం. ఇవి నిర్మాణాత్మక మార్పులు. దేశానికి మంచి చేసే వీటి విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం’’అని చెప్పారు. -
ఎకానమీకి అమెజాన్ చేసిందేమీ లేదు
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారం కొనసాగించడానికే అమెజాన్ తాజా పెట్టుబడులు చేస్తుందని, ఇందులో సంబరపడాల్సిందేమీ లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెజాన్ తన పెట్టుబడులతో భారత్‌లోని సేవల రంగానికి, ఆర్థిక వ్యవస్థకు చేసిందేమీ లేదన్నారు. పనిలో పనిగా ఈ–కామర్స్ పరిశ్రమ లక్షలాది రిటైలర్ల ఉపాధిని దెబ్బతీస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అమెజాన్ చేసిన ప్రకటన పట్ల సంతోషించాల్సిందేమీ లేదన్నారు. భారత వ్యాపారంలో నష్టాలను పూడ్చుకోవడానికే తాజా పెట్టుబడులను తీసుకొస్తున్నట్టు వ్యాఖ్యానించారు. కొల్లగొట్టే ధరల విధానాన్ని ఈ నష్టాలు సూచిస్తున్నాయంటూ.. ఇది భారత్‌కు ఎంత మాత్రం మేలు చేయబోదని, చిన్న వర్తకులను దెబ్బతీస్తుందన్నారు. ‘ఉపాధి అవకాశాలు, వినియోగదారుల సంక్షేమంపై ఈ–కామర్స్ రంగం చూపించే నికర ప్రభావం’ పేరుతో ఓ నివేదికను మంత్రి బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. దేశంలో చిన్న రిటైలర్ల ఉపాధిని దెబ్బతీసే ఈ–కామర్స్ కంపెనీల వ్యాపార నమూనాను మంత్రి ప్రశ్నించారు.ఈ–రిటైలర్లతో 1.58 కోట్ల ఉద్యోగాలు ఆన్లైన్ వర్తకులు దేశంలో 1.58 కోట్ల మందికి ఉపాధి కల్పించినట్టు మంత్రి గోయల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇందులో 35 లక్షల మంది మహిళలు ఉన్నట్టు, 17.6 లక్షల రిటైల్ సంస్థలు ఈ –కామర్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ నివేదికను పహలే ఇండియా ఫౌండేషన్ (పీఐఎఫ్) విడుదల చేసింది. భారత్‌లో ఉపాధి కల్పన పరంగా, కస్టమర్ల సంక్షేమం పరంగా (మెరుగైన అనుభవం) ఈ–కామర్స్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ–కామర్స్ తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తున్నట్టు వెల్లడించింది. టైర్–3 పట్టణాల్లోని వినియోగదారులు నెలవారీగా రూ.5,000కు పైనే ఆన్లైన్ షాపింగ్‌పై ఖర్చు చేస్తున్నట్టు వివరించింది. ఉపాధిపై ఈ–కామర్స్ రంగం చూపిస్తున్న ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 2,062 మంది ఆన్లైన్ వర్తకులు, 2,031 ఆఫ్‌లైన్ వర్తకులు, 8,209 మంది వినియోగదారుల అభిప్రాయాలను పీఐఎఫ్ తెలుసుకుంది. -
India-US CEO Forum: ఫార్మా బంధం బలోపేతం
న్యూఢిల్లీ: ఫార్మా, సెమీకండక్టర్లు, కీలక లోహాలు, వర్ధమాన టెక్నాలజీలు తదితర అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. అలాగే, పర్యవరణ అనుకూల సాంకేతికతలను కలిసి అభివృద్ధి చేయడం, క్రిటికల్ టెక్నాలజీల్లో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై చర్చించాయి. భారత్–అమెరికా సీఈవో ఫోరం వర్చువల్ భేటీలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచి్చనట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫోరం సభ్యులు సూచించిన సిఫార్సుల అమలుపై దృష్టి పెట్టాలని సీఈవో ఫోరంనకు రైమండో సూచించారు. అలాగే ఫోరంలో అమెరికాకు చెందిన దిగ్గజాలు హనీవెల్, ఫైజర్, కిండ్రిల్, వయాశాట్ చేరికను ప్రకటించారు. సెమీకండక్టర్ సరఫా వ్యవస్థ, ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ వంటి వేదికల ద్వారా పరిశ్రమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని గోయల్ పేర్కొన్నారు. 2014లో ఫోరంను పునరుద్ధరించిన తర్వాత నుంచి ఇది ఎనిమిదో సమావేశం. వచ్చే ఏడాది తొలినాళ్లలో తదుపరి భేటీ నిర్వహించనున్నారు. భారత్, అమెరికా దిగ్గజ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు సభ్యులుగా ఉన్న ఈ ఫోరంనకు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, లాక్‌హీడ్ మారి్టన్ ప్రెసిడెంట్ జేమ్స్ టైస్లెట్ సారథ్యం వహిస్తున్నారు. -
‘జెమ్’పై రూ.2 లక్షల కోట్ల కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అయిన ‘జెమ్’పై వస్తు, సేవల కొనుగోళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించాయి. వివిధ శాఖలు, విభాగాల నుంచి కొనుగోళ్ల కార్యకలాపాలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో (ఎక్స్) పేర్కొన్నారు. జెమ్‌ను కేంద్ర సర్కారు 2016 ఆగస్ట్ 9న ప్రారంభించడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విభాగాల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జెమ్‌పై కొనుగోళ్ల విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనుగోళ్ల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెమ్‌పై 62 లక్షల విక్రేతలు, సరీ్వస్ ప్రొవైడర్లు నమోదై ఉన్నారు. 63,000 ప్రభుత్వ కొనుగోళ్ల విభాగాలు కూడా నమోదై ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పారా మిలటరీ దళాలు కొనుగోలుదారుల జాబితాలో ఉన్నాయి. స్టేషనరీ నుంచి వాహనాలు, కంప్యూటర్, ఫర్నిచర్ వరకు అన్ని రకాల విక్రేతలు దీనిపై నమోదై ఉన్నారు. సేవల విభాగంలో రవాణా, లాజిస్టిక్స్, వ్యర్థాల నిర్వహణ, వెబ్‌కాస్టింగ్‌కు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. మొత్తం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థల వాటా 83 శాతంగా ఉన్నట్టు వాణిజ్య శాఖ తెలిపింది. మొత్తం 312 రకాల సేవలు, 11,800 ఉత్పత్తులు జెమ్‌పై విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. జెమ్ ఆరంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.5.93 లక్షల కోట్ల కొనుగోళ్లు జరిగాయి. -
రూపాయి-దిర్హామ్ వాణిజ్యం విస్తరణ:పెట్టుబడులకు అపార అవకాశాలు
భారత్-యూఏఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూపీ-దిర్హామ్ రూపంలో మరింత విస్తరించు కునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇది ద్వైపాక్షిక వాణిజ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. రెండు దేశాలూ యూఏఈ నుంచి భారత్‌కు తక్కువ వ్యయానికే నిధులు పంపుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు. 11వ భారత్–యూఏఈ ఉన్నత స్థాయి టాస్‌్కఫోర్స్ సమావేశం కోసం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గురువారం నుంచి యూఏఈలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయన వెంట అధికారుల బృందం కూడా ఉంది. ‘‘ఆర్బీఐ, యూ ఏఈ సెంట్రల్ బ్యాంక్‌తో ఇప్పుడే చర్చలు పూర్త య్యాయి. పరిశ్రమ, బ్యాంకర్లతో కలసి రూపీ–దిర్హా మ్ వాణిజ్యాన్ని మరింత వేగంగా, పెద్ద మొత్తంలో అమలు చేయాలని నిర్ణయించాం’’అని మీడియా ప్ర తినిధులకు పీయూష్ గోయల్ చెప్పారు. దేశీ కరెన్సీల రూపంలో వాణిజ్యం నిర్వహించుకోవడం వల్ల మొత్తం వాణిజ్యంపై 5% ఆదా చేసుకోవచ్చన్నారు. పెట్టుబడులకు అపార అవకాశాలు ఆహార, పారిశ్రామిక పార్క్‌లు భారత్‌లో ఏర్పాటు చేయడంపైనా ఇరువైపులా చర్చలు జరిగినట్టు మంత్రి గోయల్ చెప్పారు. యూఏఈ ఇన్వెస్టర్లు భారత్‌లో ఆర్థిక సేవలు, శుద్ధ ఇంధనాలు, మౌలిక రంగం, విద్య, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. భారత్‌లో విమానయాన రంగం యూఏఈ పెట్టుబడిదారులకు నమ్మకమైనదిగా మారినట్టు చెప్పారు. రవాణా, పర్యాటక రంగాలకు భారత్ సర్కారు ప్రోత్సాహాన్నిస్తున్నట్టు పేర్కొన్నారు. రానున్న రజుల్లో తయారీ, సేవల రంగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, సంబంధాలకు ఇప్పుడు చంద్రుడు కూడా హద్దు కాదని అభివర్ణించారు. ఆవిష్కరణలతో పాటు, పెట్రోలియం, పెట్రోలియం కెమికల్ రంగాల్లో అప్‌స్ట్రీమ్ (అన్వేషణ, ఉత్పత్తి), డౌన్‌స్ట్రీమ్ (మార్కెటింగ్, విక్రయాలు) పట్ల రెండు దేశాల్లో ఆసక్తి ఉన్నట్టు ప్రకటించారు. భారత్-యూఏఈ గతేడాది మేలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అమలు చేయడం గమనార్హం. 2021-22లో ద్వైపాక్షిక వాణిజ్య 72.9 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2022–23లో అది 84.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఏఐ ఎతిహాద్‌తో ఎన్పీసీఐ ఒప్పందం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)కు చెందిన అంతర్జాతీయ విభాగం ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్, గురువారం యూఐఈకి చెందిన ఏఐ ఎతిహాద్ పేమెంట్స్‌తో ఒప్పందం చేసుకుంది. వాణిజ్య మంత్రి గోయల్ సమక్షంలో ఇది కుదిరింది. దీంతో రెండు దేశాల్లోని వారు తక్కువ వ్యయానికే రియల్ టైమ్ (అప్పటికప్పుడు) సీమాంతర చెల్లింపులు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. దేశీ లావాదేవీలు నిర్వహించుకున్నంత సులభంగా సీమాంతర లావాదేవీలు చేసుకోవచ్చని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది. నగదు పంపిస్తున్నప్పుడు రెండు దేశాల కరెన్సీ విలువ, చార్జీల వివరాలు కనిపిస్తాయి. దీంతో పారదర్శకత పెరగనుంది. గ్లోబల్ కార్డ్‌ల అవసరం లేకుండా డొమెస్టిక్ కార్డులను వినియోగించి నగదు పంపించుకోవచ్చు. ఈ ఒప్పందంతో ఎన్పీసీఐ ఉత్పత్తి అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), యూఏఈకి చెందిన ఇన్స్టంట్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ (ఐపీపీ) మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. దీంతో యూపీఐ లావాదేవీ మాదిరే సులభంగా నిర్వహించుకోవచ్చు. అలాగే, భారత్‌కు చెందిన రూపే స్విచ్, యూఏఈ స్విచ్ మధ్య కూడా అనుసంధాన ఏర్పడుతుంది. దీంతో కార్డుల నుంచి కూడా నగదు పంపుకోవడం సాధ్యపడుతుంది. ఈ ఒప్పందం యూఏఈలో ఉపాధి పొందుతున్న 35 లక్షల భారతీయులకు (ప్రవాసులు) ప్రయోజనం చేకూర్చనుంది. -
నాణ్యతతోనే ఉన్నత స్థానానికి
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అత్యుత్తమ నాణ్యతా ఉత్పత్తులు, సేవలు సాయపడతాయని కేంద్ర వాణిజ్య, ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రమాణాలు అనేవి పటిష్టమైన వ్యవస్థకు మద్దతుగా నిలవాలన్నారు. వీటిని భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల తర్వాతే అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వర్క్‌షాప్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశ వాణిజ్యం, ఎగుమతులకు ప్రమాణాలు అనేవి మూలస్తంభంగా పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సామర్థ్యం జాతీయ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయన్నారు. సుస్థిరత, నకిలీ ఉత్పత్తుల కట్టడి, ఎంఎస్ఎంఈలకు మద్దతు, స్టార్టప్‌లు మరింత పోటీనిచ్చేందుకు వీలుగా.. ప్రమాణాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత బీఐఎస్ సాంకేతిక కమిటీ సభ్యులపై ఉందన్నారు. భారతీయ ప్రమాణాలు ఆధునిక టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఉండేలా చూడాలని కోరారు. అప్పుడే ప్రపంచానికి తయారీ కేంద్రంగా, స్వావలంబన భారత్‌గా మారాలన్న స్వప్నం సాకారమవుతుందన్నారు. బీఐఎస్‌లో 400 స్టాండింగ్ కమిటీలు భారత ప్రమాణాల రూపకల్పన బాధ్యతను చూస్తుంటాయి. -
ల్యాబ్ డైమండ్లతో ఉపాధికి ఊతం
జైపూర్: ల్యాబ్‌లలో తయారు చేసే వజ్రాలు (ఎల్జీడీ) కృత్రిమమైనవి కావని, వాటికి కూడా ప్రస్తు తం సహజ వజ్రాలుగా ఆమోదయోగ్యత పెరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇలాంటి సానుకూల పరిణామాలు పరిశ్రమ వృద్ధికి దోహదపడగలవని, దీనితో ఉపాధి కల్పనకు కూడా ఊతం లభించగలదని ఆయన చెప్పారు. ఎల్జీడీల తయారీలో సౌర, పవన విద్యుత్ వంటి వనరులను వినియోగించడం వల్ల ఇది పర్యావరణానికి కూడా అనుకూలమైనదని మంత్రి తెలిపారు. జూన్ 22న అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 7.5 క్యారట్ల ఎల్జీడీని అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు బహూకరించడం ల్యాబ్ డైమండ్లకు పెరుగుతున్న ఆమోదయోగ్యతకు నిదర్శనం. ఎల్జీడీల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎల్జీ డీ సీడ్స్‌పై 5% కస్టమ్స్ సుంకాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, దేశీ యంగా ఎల్జీడీ యంత్రాలు, సీడ్స్, తయారీ విధానాన్ని రూపొందించడంపై పరిశోధనలు చేసేందుకు ఐఐటీ–మద్రాస్‌కు రీసెర్చ్ గ్రాంట్ ప్రకటించింది. 2025 నాటికి ఎల్జీడీ ఆభరణాల మార్కెట్ 5 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. 2021 –22లో కట్, పాలిష్డ్ ఎల్జీడీల ఎగుమతులు 1.35 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది ఏప్రిల్–డిసెంబర్ వ్యవధిలో 1.4 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. -
అత్యధిక రేటుకి ఉల్లిని కొంటాం: కేంద్రం
న్యూఢిల్లీ: టమాటా బాటలో ఉల్లి ధరలు పయనిస్తున్నాయి. ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉల్లిపై 40% ఎగమతి సుంకాన్ని విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై రైతులు నిరసనలకు దిగుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయలని క్వింటాల్‌కి రూ.2,410 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు. మరోవైపు ఉల్లిపాయలు దొరకకపోతే, ధరలు ఎక్కువుంటే ఒక రెండు నుంచి నాలుగు నెలలు తినకపోతే వచ్చే నష్టమేమీ లేదని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ ఎవరికైనా అంత ధర ఇచ్చి కొనే శక్తి లేకపోతే వారు రెండు నుంచి నాలుగు నెలలు మానేయచ్చు. దాని వల్ల ఏం నష్టం లేదు’ అని వ్యాఖ్యానించారు. రైతులు, వ్యాపారుల ధర్నాతో మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఉల్లిమార్కెట్ బోసిపోయింది. -
అందరికీ ఆమోదయోగ్యంగా ఈ కామర్స్ పాలసీ: గోయల్
దుబాయి: ప్రతిపాదిత ఈకామర్స్ విధానం పటిష్టంగా, ప్రతి భారతీయుని ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. భాగస్వాముల ప్రయోజనాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ముసాయిదా ఈ కామర్స్ నిబంధనలపై అభిప్రాయాలను తాను ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. ముసాయిదా నిబంధనలపై అంతర్గత మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు అవసరం లేదన్నారు. డీపీఐఐటీ, కార్పొరేట్ శాఖ, నీతి ఆయోగ్ కొన్ని నిబంధనల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. దుబాయిలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచి్చన సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. -
స్పెషల్ ఎకనామిక్ జోన్, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక జోన్ల (ఎస్ఈజడ్) నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎగుమతులు భారీగా 41.5 శాతం పెరిగాయి. విలువలో ఇది 2.15 లక్షల కోట్లు. ఔషధాలు, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశం మొత్తం ఎగుమతుల్లో నాల్గవ వంతు ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి జరుగుతుండడం గమనార్హం. 2019–20లో ఎస్ఈజడ్ల నుంచి జరిగిన మొత్తం ఎగుమతుల విలువ రూ.7.97 లక్షల కోట్లు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువ 2020–21లో 7.56 లక్షల కోట్లకు తగ్గింది. జోన్ల పరిస్థితి ఇదీ... దేశంలో మొత్తం 427 జోన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర ఉంది. అయితే జూన్ 30వ తేదీ నాటికి వీటిలో 267 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2021 జూన్ 30వ తేదీ నాటికి ప్రత్యేక జోన్లపై రూ.6.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగింది. వీటిలో దాదాపు 24.47 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. జోన్ల నుంచి ఎగుమతుల భారీ పెరుగుదలకు వాణిజ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి– ఈపీసీఈఎస్ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. మండలికి భవనేశ్ సేథ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. దేశం ఎగుమతులు ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు దేశం లక్ష్యం. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశ ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా ఉన్నాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య ఎగుమతులు 74.5 శాతం పెరిగి 130.82 బిలియన్ డాలర్లకు చేరాయి. మరో ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టు–మార్చి 2022) 269.44 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. అంటే నెలకు సగటును 33.68 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాల్సి ఉంది. కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో 2020 మార్చి నుంచి వరుసగా ఆరు నెలలు ఆగస్టు వరకూ ఎగుమతులు క్షీణతను చూశాయి. అయితే సెప్టెంబర్‌లో వృద్ధిబాటలోకి వచ్చినా, మళ్లీ మరుసటి రెండు నెలలూ (అక్టోబర్–నవంబర్) క్షీణతలోకి జారిపోయాయి. తిరిగి 2020 డిసెంబర్లో స్వల్పంగా 0.14 శాతం వృద్ధి నమోదయ్యింది. అప్పటి నుంచీ వృద్ధి బాటలోనే ఎగుమతులు పయనిస్తున్నాయి. 2020–21 ఏప్రిల్ నుంచి మార్చి వరకూ చూస్తే, ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో ఈ విలువ 313.36 బిలియన్ డాలర్లు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, మరింత పెరగనున్న ఇళ్ల కొనుగోళ్లు -
రక్షణ రంగంలో 100% ఎఫ్‌డీఐలకు ఓకే!
రక్షణ రంగంలో నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ప్రతిపాదిస్తూ వచ్చిన కేబినెట్ నోట్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పరిమితి 26 శాతం మాత్రమే. యూపీఏ హయాంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఏకే ఆంటోనీ.. ఇలా రక్షణరంగంలో నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మల్టీబ్రాండ్ రీటైల్లో ఎఫ్‌డీఐలను అనుమతించేది లేదని మొదటిరోజే చెప్పిన నిర్మల.. ఇప్పుడు రక్షణ రంగానికి మాత్రం ఆ సూత్రం వర్తింపజేయలేదు. -
నిర్మల ముందు పెను సవాళ్లు!
బంగారం దిగుమతులపై నియంత్రణలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లపై మ్యాట్ విధింపు, ఉత్పాదక రంగంలో గణనీయంగా పడిపోయిన ఉత్పత్తి, కార్మిక చట్టాలు, భూసేకరణలో సమస్యలు ... ఇలా అనేకానేక సమస్యలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందు కొలువుదీరాయి. వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌కు ఆ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ సమస్యలన్నింటినీ తెలిపారు. దేశ వాణిజ్య, పారిశ్రామిక రంగాల పరిస్థితిని క్షుణ్ణంగా వివరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ), వాణిజ్య శాఖ కార్యదర్శులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధానంగా, ఉత్పాదక రంగంలో వృద్ధి ఆగిపోవడం, అరాచకంగా ఉన్న కార్మిక చట్టాలు, అనుమతులు పొందడంలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల గురించి డీఐపీపీ కార్యదర్శి అమితాబ్ కాంత్ మాట్లాడారు. పారిశ్రామిక లైసెన్సులు ఇవ్వడంలో ఆలస్యం తదితర విషయాల గురించి కూడా ఆయన వివరించారు.