న్యూఢిల్లీ: టమాటా బాటలో ఉల్లి ధరలు పయనిస్తున్నాయి. ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉల్లిపై 40% ఎగమతి సుంకాన్ని విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై రైతులు నిరసనలకు దిగుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయలని క్వింటాల్‌కి రూ.2,410 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు.
మరోవైపు ఉల్లిపాయలు దొరకకపోతే, ధరలు ఎక్కువుంటే ఒక రెండు నుంచి నాలుగు నెలలు తినకపోతే వచ్చే నష్టమేమీ లేదని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ ఎవరికైనా అంత ధర ఇచ్చి కొనే శక్తి లేకపోతే వారు రెండు నుంచి నాలుగు నెలలు మానేయచ్చు. దాని వల్ల ఏం నష్టం లేదు’ అని వ్యాఖ్యానించారు. రైతులు, వ్యాపారుల ధర్నాతో మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఉల్లిమార్కెట్ బోసిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment