Export Duty
-
చక్కెర ఉత్పత్తులపై 50 శాతం సుంకం.. కారణం తెలుసా..
ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో చెరకు నుంచి తీసే ఇథనాల్ ఉత్పత్తికి కీలకమైన మొలాసిస్‌పై ప్రభుత్వం 50 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ నిబంధనలు జనవరి 18 నుంచి అమలులోకి వచ్చాయి. దేశీయ డిస్టిలరీల కోసం మొలాసిస్‌ను అందుబాటులో ఉంచడం, పెట్రోల్, డీజిల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత సంవత్సరంలో పెట్రోల్‌లో 15 శాతం ఇథనాల్‌ను కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇథనాల్ మళ్లింపు లేకపోవడం వల్ల 2023-24 సీజన్లో (అక్టోబర్-సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి 37.3 మిలియన్ టన్నుల నుంచి 32.3-33 మిలియన్ టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం తలిపింది. ఇదీ చదవండి: రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే.. వియత్నాం, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ ఫిలిప్పీన్స్‌తో సహా ఇతర దేశాలకు భారతదేశం మొలాసిస్‌ను ఎగుమతి చేస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు మొలాసిస్‌ను ఎగుమతి చేస్తున్నాయి. -
ఆ ఒక్క రకం ఉల్లిపాయకే మినహాయింపు!
దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతులపై సుంకం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎగుమతుల సుంకం (export duty) నుంచి 'బెంగళూరు రోజ్' (Bangalore Rose) రకం ఉల్లికి కేంద్ర ప్రభుత్వం తాజాగా మినహాయింపునిచ్చింది. కొన్ని షరతులకు లోబడి 'బెంగళూరు రోజ్' ఉల్లికి ఎగుమతి సుంకం నుంచి మినహాయింపును మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగుమతిదారు ఎగుమతి చేయాల్సిన బెంగళూరు రోజ్ రకం ఉల్లి ఉత్పత్తులు, పరిమాణాన్ని ధ్రువీకరిస్తూ రాష్ట్ర ఉద్యాన కమిషనర్ నుంచి ఒక ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో వాటిని అదుపు చేయడానికి, దేశీయంగా లభ్యతను పెంచడానికి గత ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఉల్లిపాయలపై 40 శాతం ఎగమతి సుంకాన్ని విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉల్లి రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'బెంగళూరు రోజ్' రకం ఉల్లికి మాత్రం ఎగుమతి సుంకం మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
అత్యధిక రేటుకి ఉల్లిని కొంటాం: కేంద్రం
న్యూఢిల్లీ: టమాటా బాటలో ఉల్లి ధరలు పయనిస్తున్నాయి. ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉల్లిపై 40% ఎగమతి సుంకాన్ని విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై రైతులు నిరసనలకు దిగుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయలని క్వింటాల్‌కి రూ.2,410 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు. మరోవైపు ఉల్లిపాయలు దొరకకపోతే, ధరలు ఎక్కువుంటే ఒక రెండు నుంచి నాలుగు నెలలు తినకపోతే వచ్చే నష్టమేమీ లేదని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ ఎవరికైనా అంత ధర ఇచ్చి కొనే శక్తి లేకపోతే వారు రెండు నుంచి నాలుగు నెలలు మానేయచ్చు. దాని వల్ల ఏం నష్టం లేదు’ అని వ్యాఖ్యానించారు. రైతులు, వ్యాపారుల ధర్నాతో మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఉల్లిమార్కెట్ బోసిపోయింది. -
పెరుగుతున్న ఉల్లి ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా లభ్యతను పెంచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. ఉల్లిపై కేంద్రం ఎగుమతి సుంకం విధించడం ఇదే తొలిసారి. వంటల్లో ప్రధానంగా ఉపయోగించే ఉల్లి ధర ప్రస్తుతం (ఆగస్ట్ 19) ఢిల్లీలో కిలోకు రూ. 37కి చేరింది. 2023 డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు భారత్ నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతులు జరిగాయి. విలువ పరంగా చూస్తే వీటిని అత్యధికంగా దిగుమతి చేసుకున్న మొదటి మూడు దేశాలు బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ. రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యతను పెంచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించాలని నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం.. ఆగస్ట్ 19న దేశంలో ఉల్లి సగటు రిటైల్ ధర కిలోకు కనిష్టంగా రూ. 30గా ఉంది. ఇది గరిష్టంగా రూ. 63, కనిష్టంగా రూ. 10లుగా ఉంది. ఇదీ చదవండి: Revised I-T rules: ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా! -
భారీగా నష్టపోతున్న చక్కెర షేర్లు
ముంబై: కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగమతులపై 20 శాతం సుంకం విధించడంతో చక్కెర షేర్ల ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. శుక్రవారం నాటి మార్కెట్లో సుగర్ సెక్టార్ భారీగా నష్టాలను చవిచూస్తోంది. దాదాపు అన్ని చక్కెర షేర్లు 2 నుంచి 10 శాతం పడిపోయి..నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ హిందుస్తాన్ అయిదుశాతం, ఓధ్ సుగర్ 8 శాతం నష్టాలను మూట గట్టుకుంది. వీటితోపాటుగా శ్రీ రేణుకా సుగర్ 4శాతం, బలరాంపూర్ చినీ 3 శాతం, పొన్ని సుగర్స్ 10 శాతం నష్టాలతో ఇదే బాటలో నడుస్తున్నాయి. అయితే ఎగుమతులపై సుంకంతో దేశీయ ధరలకు చెక్ చెప్పే అవకాశం లేదని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశీయ ధరలపై ప్రభావం చూపదన్నారు శక్తి సుగర్స్ ఎండీ ఎం మణిక్కం.భారతదేశం నుంచి సాధారణంగా సుగర్ ఎగుమతులు పెద్దగా ఉండవని, మిగులు ఉన్నపుడు మాత్రమే ఎగుమతిచేస్తామని చెప్పారు. ప్రస్తుతం కేజీకి రూ. 40 వద్దనున్న చక్కెర ధరను అదుపుచేసేందుకు, దేశీయ సరఫరాల్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) నోటీఫై చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ధరలుపెరగడంతో ఎగుమతులు పరిమితం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ తరువాత ఇండియాది రెండవ స్థానం.