ముంబై: కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగమతులపై 20 శాతం సుంకం విధించడంతో చక్కెర షేర్ల ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. శుక్రవారం నాటి మార్కెట్లో సుగర్ సెక్టార్ భారీగా నష్టాలను చవిచూస్తోంది. దాదాపు అన్ని చక్కెర షేర్లు 2 నుంచి 10 శాతం పడిపోయి..నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ హిందుస్తాన్ అయిదుశాతం, ఓధ్ సుగర్ 8 శాతం నష్టాలను మూట గట్టుకుంది. వీటితోపాటుగా శ్రీ రేణుకా సుగర్ 4శాతం, బలరాంపూర్ చినీ 3 శాతం, పొన్ని సుగర్స్ 10 శాతం నష్టాలతో ఇదే బాటలో నడుస్తున్నాయి.
అయితే ఎగుమతులపై సుంకంతో దేశీయ ధరలకు చెక్ చెప్పే అవకాశం లేదని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశీయ ధరలపై ప్రభావం చూపదన్నారు శక్తి సుగర్స్ ఎండీ ఎం మణిక్కం.భారతదేశం నుంచి సాధారణంగా సుగర్ ఎగుమతులు పెద్దగా ఉండవని, మిగులు ఉన్నపుడు మాత్రమే ఎగుమతిచేస్తామని చెప్పారు.
ప్రస్తుతం కేజీకి రూ. 40 వద్దనున్న చక్కెర ధరను అదుపుచేసేందుకు, దేశీయ సరఫరాల్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) నోటీఫై చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ధరలుపెరగడంతో ఎగుమతులు పరిమితం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ తరువాత ఇండియాది రెండవ స్థానం.
భారీగా నష్టపోతున్న చక్కెర షేర్లు
Published Fri, Jun 17 2016 12:21 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM
Advertisement