slump
-
ఢిల్లీ రాజ్ అరెస్ట్, పతనమైన షేర్లు
భారత్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ అధ్యక్షుడు ఎస్ ఢిల్లీ రాజ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో భారత్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాదాపు 11శాతం పడిపోయింది. సంస్థ అధ్యక్షుడు రాజ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. గతంలో పనిచేసిన ఫస్ట్ లీజింగ్‌కు సంబంధించిన ఒక కేసులో ఈడీ ఫస్ట్ లీజింగ్ సంస్థ మాజీ సీఎప్ వో లు ఢిల్లీ రాజ్, శివరామ కృస్ణన్ లను సోమవారం అదుపులోకి తీసుకుంది. రూ. 500 కోట్లపై జరిగిన కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన వీరిద్దరిని కోర్టుకు హాజరు పర్చి అనంతరం ఈ నెల11 వరకు రిమాండ్ చేసింది. దీంతో భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. మంగళవారం నాటి మార్కెట్ ముగింపులో 9.67 శాతం క్షీణించిన షేరు ధర రూ.822.65 దగ్గర ముగిసింది. అయితే ఫస్ట్ లీజింగ్ కేసు విచారణ నేపథ్యంలో అతణ్ని అరెస్ట్ చేసిందని, ఆ విచారణకు తమ కంపెనీకి సంబంధం లేదని భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పేర్కొంది. 2008లో ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సమయంలో ఢిల్లీరాజ్ ప్రెసిడెంట్‌గా కంపెనీలో బాధ్యతలు చేపట్టినట్లు తెలిపింది. అయితే ఫస్ట్లీజింగ్ ఉద్యోగిగా తీసుకున్న రుణాలను ఢిల్లీరాజ్ తిరిగి చెల్లించివేసినట్లు వివరణ ఇచ్చింది. ఆయన కంపెనీని వీడిని ఆరు సంవత్సరాల తర్వాత 2012 , 2013 సంవత్సరంలో రుణాలు మంజూరుకు సంబంధించి ఐడీబీఐ బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, దర్యాప్తులో భాగంగా ఈడీ ఢిల్లీరాజ్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. ట్రెజరీ కార్యకలాపాలవరకే తన పాత్ర పరిమితం అయి ఉండేదనీ, ఢిల్లీ రాజ్ వివరణ ఇచ్చారు. ఫస్ట్ లీజింగ్ కు సంబంధించి ఇతర ఆర్థిక నివేదికపై సైన్ చేసే అధికారం తనకు లేదన్నారు. మరోపక్క భారత్ ఫైనాన్షియల్ షేరు రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ క్రెడిట్ స్యూజ్ డౌన్‌గ్రేడ్ చేసింది. రేటింగ్‌ను 'తటస్థ' (న్యూట్రల్) నుంచి అండర్ పెర్ఫార్మ్కు మార్చింది. సోమవారంనాటి ధర(రూ. 910) ప్రకారం ఈ షేరు వ్యయభరితంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. -
భారీగా నష్టపోతున్న చక్కెర షేర్లు
ముంబై: కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగమతులపై 20 శాతం సుంకం విధించడంతో చక్కెర షేర్ల ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. శుక్రవారం నాటి మార్కెట్లో సుగర్ సెక్టార్ భారీగా నష్టాలను చవిచూస్తోంది. దాదాపు అన్ని చక్కెర షేర్లు 2 నుంచి 10 శాతం పడిపోయి..నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ హిందుస్తాన్ అయిదుశాతం, ఓధ్ సుగర్ 8 శాతం నష్టాలను మూట గట్టుకుంది. వీటితోపాటుగా శ్రీ రేణుకా సుగర్ 4శాతం, బలరాంపూర్ చినీ 3 శాతం, పొన్ని సుగర్స్ 10 శాతం నష్టాలతో ఇదే బాటలో నడుస్తున్నాయి. అయితే ఎగుమతులపై సుంకంతో దేశీయ ధరలకు చెక్ చెప్పే అవకాశం లేదని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశీయ ధరలపై ప్రభావం చూపదన్నారు శక్తి సుగర్స్ ఎండీ ఎం మణిక్కం.భారతదేశం నుంచి సాధారణంగా సుగర్ ఎగుమతులు పెద్దగా ఉండవని, మిగులు ఉన్నపుడు మాత్రమే ఎగుమతిచేస్తామని చెప్పారు. ప్రస్తుతం కేజీకి రూ. 40 వద్దనున్న చక్కెర ధరను అదుపుచేసేందుకు, దేశీయ సరఫరాల్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) నోటీఫై చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ధరలుపెరగడంతో ఎగుమతులు పరిమితం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ తరువాత ఇండియాది రెండవ స్థానం. -
భారీ జరిమానాతో కుదేలైన షేర్లు
ముంబై: ఢిల్లీ సర్కార్ విధించిన భారీ జరిమానా నేపథ్యంలో ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అతి తక్కువ ధరలకే వైద్య సేవలు అందించడం లేదని ఆరోపిస్తూ ఫోర్టిస్ హెల్త్ కేర్ అనుబంధ సంస్థ పై 503 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించడంతో సోమవారం నాటి స్టాక్ మార్కెట్ లో నష్టాలను మూటగట్టుకుంది. ఈ మొత్తం సొమ్మును డిపాజిట్ చేయాలని హెల్త్ సర్వీసెస్ డైరెక్టరేట్ జనరల్ (డీహెచ్ ఎస్) ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు 5 శాతం నష్టాలను చవిచూసింది. భూ కేటాయింపుల సందర్భంగా చేసుకున్న లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఫోర్టిస్ ఆసుపత్రిపై ఆప్ సర్కార్ కన్నెర్ర చేసింది. 1984-07 సంవత్సరాలకు సంబంధించిన ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్సిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆర్జించిన అసహజ లాభాల్లో 503 కోట్ల రూపాయలను జమ చేయాలని డీహెచ్ఎస్ ఆదేశించింది. దీంతో బీఎస్ఈ ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు భారీగా నష్టపోయాయి. ముగింపులో కోలుకొని రూ 165 దగ్గర నిలదొక్కుకుంది. అయితే ఈ ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయనున్నట్టు ఫోర్టిస్ ప్రతినిధులు తెలిపారు. కాగా ఆర్థికంగా బలహీనమైన సెక్షన్ల రోగులకు సబ్సీడిపై చికిత్సను అందించడంలో విఫలమైనందుకు పలు ప్రయివేటు ఆసుపత్రులపై ఢిల్లీ సర్కార్ కొరడా ఝళిపించింది. పేదలకు అతి తక్కువ ధరలకు వైద్య సేవలను అందించాలన్న నిబంధనకు అంగీకరించి, తక్కువ ధరలకు విలువైన స్థలాలను పొంది, అనంతరం ఆ నిబంధనను తుంగలో తొక్కిన నగరంలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్, మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకంద్ హాస్పిటల్, ధర్మషీలా క్యాన్సర్ హాస్పిటల్, పుష్పవతి సింఘానియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లపై రూ.600 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. లీటరుపై రూ. 2 వరకు తగ్గనున్నాయని సమాచారం. అందుకోసం అయిల్ కంపెనీలు బుధవారం సమావేశకానున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఈ సమావేశంలో అయిల్ కంపెనీలు ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారల్ ధర రూ. 45 డాలర్లుకు చేరింది. ఈ నేపథ్యంలో అయిల్ ధరలు తగ్గించాలని సదరు కంపెనీలు నిర్ణయించాయి. అయితే వచ్చే నెల 7న దేశ రాజధాని హస్తిన అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయిల్ ధరలు తగ్గించాలని మోదీ ప్రభుత్వం భావిస్తుందని ప్రతిపక్షలు ఆరోపణలు చేస్తున్నాయి.