తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. లీటరుపై రూ. 2 వరకు తగ్గనున్నాయని సమాచారం. అందుకోసం అయిల్ కంపెనీలు బుధవారం సమావేశకానున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఈ సమావేశంలో అయిల్ కంపెనీలు ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారల్ ధర రూ. 45 డాలర్లుకు చేరింది.
ఈ నేపథ్యంలో అయిల్ ధరలు తగ్గించాలని సదరు కంపెనీలు నిర్ణయించాయి. అయితే వచ్చే నెల 7న దేశ రాజధాని హస్తిన అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయిల్ ధరలు తగ్గించాలని మోదీ ప్రభుత్వం భావిస్తుందని ప్రతిపక్షలు ఆరోపణలు చేస్తున్నాయి.