ఆవిరైపోతున్న పెట్రోల్ | Increase the useage of petrol | Sakshi
Sakshi News home page

ఆవిరైపోతున్న పెట్రోల్

Published Fri, May 29 2015 1:30 AM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM

ఆవిరైపోతున్న పెట్రోల్ - Sakshi

ఆవిరైపోతున్న పెట్రోల్

- పెరిగిన వినియోగం
- ట్యాంక్ ఫుల్ చేస్తే ముప్పు 

- ఆయిల్ కంపెనీల హెచ్చరిక
సాక్షి, సిటీ బ్యూరో:
మహానగరంలో పెట్రోల్ వినియోగం పెరిగింది. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల్లోని ఇంధనం సగటున 20 శాతం ఆవిరైపోతోంది. దీంతో మైలేజీ తగ్గిపోయి వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. గత పక్షం రోజులుగా పెట్రోల్, డీజీల్ అమ్మకాలు పెరిగాయి. సాధరణంగా సెలవుల కారణంగా పెట్రో అమ్మకాలు అధికంగా ఉండే అవకాశాలు ఉండగా, తాజాగా  పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాటిపై ప్రభావం చూపుతున్నాయి.

మహానగరం పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460  పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా, ప్రతీ రోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి.   అయితే, వారం రోజులుగా 30 శాతం అధికంగా పెట్రోల్ అమ్మకాలు పెరిగాయని బంక్ నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంక్‌ల వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు ప్రదర్శిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని వాహనాల ట్యాంకుల్లో సగం మాత్రమే పెట్రోల్ నింపాలని, లేకపోతే ట్యాంక్ పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ట్యాంక్ నిండుగా నింపటం వల్ల ఐదు ట్యాంకులు పేలాయని పేర్కొంటున్నాయి.

తగ్గిన సరఫరా....
ప్రధాన ఆయిల్ కంపెనీల నుంచి నగ రంలోని పెట్రోల్ బంకులకు ఇంధనం సరఫరా తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్రలో గల రెండు ఆయిల్ కంపెనీల టెర్మినల్స్‌లో పనులు సాగుతున్న కారణంగా డిమాండ్‌కు సరిపడా పెట్రోల్ సరఫరా కావడం లేదని పెట్రోల్ బంకుల డీలర్ల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. సాధారణంగా ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతిరోజు 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా నగరంలోని బంకులకు ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కొక్క ట్యాంకర్ 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే, సరఫరా తగ్గడంతోనగరంలో కొంత ఇంధనం కొరత కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement