Petrol consumption
-
పెట్రోల్‌కు పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్ విక్రయాలు జూలైలో గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 4 శాతం వరకు పెరిగాయి. 2.76 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జూలై మాసంలో మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం తగ్గగా, తదుపరి 15 రోజుల్లో గణనీయంగా పుంజుకుంది. అయితే నెలవారీగా (జూన్‌తో పోలి్చనప్పుడు) చూస్తే పెట్రోల్ అమ్మకాలు 4.6 శాతం తగ్గాయి. మరోవైపు డీజిల్ అమ్మకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా డీజిల్‌ను రవాణా రంగంలో వినియోగిస్తారు. కనుక, వర్షాల ప్రభావం వినియోగంపై పడినట్టు తెలుస్తోంది. డీజిల్ అమ్మకాలు 4.3 శాతం తగ్గి 6.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే పెట్రోలియం ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వర్షాల సమయంలో ఏటా డీజిల్ అమ్మకాలు తగ్గుతుండడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరగడం గమనించొచ్చు. ఇక ఈ ఏడాది జూన్ నెలలోని అమ్మకాలతో పోల్చి చూసినా, జూలైలో డీజిల్ విక్రయాలు (7.13 మిలియన్ టన్నులు) 13.7 శాతం తగ్గాయి. భారత్‌లో ఆయిల్ డిమాండ్ రోజువారీగా 0.2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున 2023లో ఉంటుందని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఓపెక్ అంచనాగా ఉంది. ఇక విమాన సేవలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) డిమాండ్ సైతం 10 శాతం పెరిగి జూలైలో 6,03,500 టన్నులుగా నమోదైంది. 2021 జూలైలో వినియోగంతో పోలిస్తే రెట్టింపు కాగా, కరోనా ముందు నాటి సంవత్సరం 2019 జూలైలో వినియోగంతో పోల్చి చూస్తే 2.9 శాతం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. జూలైలో వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చచూసినప్పుడు 1.7 శాతం తగ్గి 2.46 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ నెలతో పోల్చి చూస్తే కనుక 8 శాతం ఎల్పీజీ అమ్మకాలు పెరిగాయి. -
ఆవిరైపోతున్న పెట్రోల్
- పెరిగిన వినియోగం - ట్యాంక్ ఫుల్ చేస్తే ముప్పు - ఆయిల్ కంపెనీల హెచ్చరిక సాక్షి, సిటీ బ్యూరో: మహానగరంలో పెట్రోల్ వినియోగం పెరిగింది. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల్లోని ఇంధనం సగటున 20 శాతం ఆవిరైపోతోంది. దీంతో మైలేజీ తగ్గిపోయి వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. గత పక్షం రోజులుగా పెట్రోల్, డీజీల్ అమ్మకాలు పెరిగాయి. సాధరణంగా సెలవుల కారణంగా పెట్రో అమ్మకాలు అధికంగా ఉండే అవకాశాలు ఉండగా, తాజాగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాటిపై ప్రభావం చూపుతున్నాయి. మహానగరం పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా, ప్రతీ రోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే, వారం రోజులుగా 30 శాతం అధికంగా పెట్రోల్ అమ్మకాలు పెరిగాయని బంక్ నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంక్‌ల వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు ప్రదర్శిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని వాహనాల ట్యాంకుల్లో సగం మాత్రమే పెట్రోల్ నింపాలని, లేకపోతే ట్యాంక్ పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ట్యాంక్ నిండుగా నింపటం వల్ల ఐదు ట్యాంకులు పేలాయని పేర్కొంటున్నాయి. తగ్గిన సరఫరా.... ప్రధాన ఆయిల్ కంపెనీల నుంచి నగ రంలోని పెట్రోల్ బంకులకు ఇంధనం సరఫరా తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్రలో గల రెండు ఆయిల్ కంపెనీల టెర్మినల్స్‌లో పనులు సాగుతున్న కారణంగా డిమాండ్‌కు సరిపడా పెట్రోల్ సరఫరా కావడం లేదని పెట్రోల్ బంకుల డీలర్ల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. సాధారణంగా ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతిరోజు 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా నగరంలోని బంకులకు ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కొక్క ట్యాంకర్ 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే, సరఫరా తగ్గడంతోనగరంలో కొంత ఇంధనం కొరత కనిపిస్తోంది.