Oil companies
-
ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!
చమురు రంగ పీఎస్‌యూ దిగ్గజాలకు వరుసగా ఐదో త్రైమాసికంలోనూ జరిమానాలు తప్పలేదు. నిబంధనల ప్రకారం సంస్థల్లో స్వతంత్ర, మహిళా డైరెక్టర్ల నియామకం చేపట్టకపోవడంతో ఈ చర్యకు పూనుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.జరిమానా విధించిన కంపెనీల జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్), ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ ఉన్నాయి. లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఆయా కంపెనీల బోర్డుల్లో అవసరమైనమేర స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను ఎంపిక చేసుకోకపోవడంతో జరిమానాల వడ్డింపు కొనసాగింది.ఇదీ చదవండి: ఫెడ్‌వైపు ఇన్వెస్టర్ల చూపుఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్–జూన్)లోనూ స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను తగిన సంఖ్యలో నిమమించుకోవడం వల్ల జరిమానాలు తప్పలేదు. గత కొద్దికాలంగా ఈ తంతు కొనసాగుతోంది. ఆయా కంపెనీలు పెనాల్టీ చెల్లిస్తున్నా తీరుమార్చుకోకపోవడం కొంత ఆందోళన కలిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ గరిష్టంగా రూ.5,36,900, కనిష్టంగా రూ.2,41,900 మధ్య జరిమానాలు విధించాయి. -
ఆయిల్ కంపెనీలకు చేదువార్త
న్యూఢిల్లీ: ఆయిల్ కంపెనీలను బడ్జెట్ నిరాశపరిచింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచి్చన రికార్డు లాభాల (దాదాపు రూ.81,000 కోట్లు) కారణంగా గత ఆర్థిక సంవత్సరం ప్రకటించిన రూ. 30,000 కోట్ల మూలధన మద్దతును ఆర్థికమంత్రి రద్దు చేశారు.నిజానికి ఈ మద్దతును రూ.15,000 కోట్లకు తగ్గించాలని 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్, తాజా బడ్జెట్లో ఈ మద్దతును పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.వ్యూహాత్మక నిల్వలకు రూ.5,000 కోట్లు ఇక సరఫరాల్లో అంతరాయాలను నిరోధించడానికి కర్ణాటకలోని మంగళూరు అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్మించిన వ్యూహాత్మక భూగర్భ నిల్వల క్షేత్రాలను నింపడానికి వీలుగా ముడి చమురును కొనుగోలు చేయడానికి రూ. 5,000 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు. షేర్లు డీలా... తాజా నిర్ణయం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఐఓసీ షేర్ ధర క్రితం ముగింపుతో పోలి్చతే 2 శాతం నష్టపోయి రూ.166 వద్ద ముగిసింది. బీపీసీఎల్ షేర్ ధర 1 శాతం తగ్గి రూ.306 వద్ద ముగిసింది. హెచ్‌పీసీఎల్ షేరు ధర స్వల్ప నష్టంతో 347 వద్ద స్థిరపడింది.క్రూజ్ పర్యాటకానికి ప్రోత్సాహంవిదేశీ షిప్పింగ్ కంపెనీలపై సులభతర పన్ను దేశీ క్రూజ్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ షిప్పింగ్ కంపెనీలకు సులభతర పన్నుల విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. క్రూజ్ పర్యాటకంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ చర్య తీసుకున్నారు. సముద్ర జలాలపై నడిచే పర్యాటక ఓడలను క్రూజ్‌లుగా చెబుతారు. దేశంలో క్రూజ్ పర్యాటకానికి భారీ అవకాశాలున్నట్టు మంత్రి చెప్పారు.ఈ విభాగంలో భారత షిప్పింగ్ పరిశ్రమ వాటాను పెంచేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు యాజమాన్యం, లీజింగ్ పరంగా సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. క్రూజ్ పర్యాటకానికి భారత్‌ను ఆర్షణీయ కేంద్రంగా మారుస్తామని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామని చెప్పారు. ‘‘క్రూజ్ షిప్పింగ్‌ల నిర్వహణలో పాలు పంచుకునే ప్రవాసులకు ఊహాత్మకమైన పన్ను విధానం ప్రతిపాదిస్తున్నాం. విదేశీ కంపెనీ, నాన్ రెసిడెంట్ షిప్ ఆపరేటర్ రెండూ ఒకే హోల్డింగ్ కంపెనీ కింద ఉంటే లీజ్ రెంటల్ రూపంలో ఆర్జించే ఆదాయంపై పన్ను మినహాయింపును కలి్పస్తున్నాం’’అని వివరించారు. ఈ దిశగా సెక్షన్ 44బీబీసీని ప్రతిపాదించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి సవరణలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఎన్పీఎస్పై మరింత పన్ను ప్రయోజనంనూతన పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కేంద్ర సర్కారు జాతీయ పింఛను పథకంలో (ఎన్పీఎస్) పెట్టుబడులకు ప్రోత్సాహకాన్ని పెంచింది. ఉద్యోగి తరఫున ప్రైవేటు సంస్థలు జమ చేసే ఎన్పీఎస్ వాటాపై పన్ను మినహాయింపు పరిమితిని 14 శాతం చేసింది. ఉద్యోగి మూల వేతనం, కరువు భత్యంలో (గరిష్ట పరిమితి రూ.లక్ష) 10 శాతం జమలపైనే ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇది 14 శాతంగానే ఉండగా.. ప్రైవేటు రంగ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాన్ని పెంచారు. ఆదాయపన్ను చట్టంలోని పాత పన్ను వ్యవస్థలో ఉద్యోగి తరఫున సంస్థలు చేసే ఎన్పీఎస్ జమలపై పన్ను మినహాయింపు 10 శాతంగానే కొనసాగుతుంది. ఉదాహరణకు పార్థసారథి మూలవేతనం, కరవు భత్యం రూ.1,00,000 ఉందనుకుంటే.. తాజా మార్పుతో ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఏడాదికి రూ.48వేల మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్పీఎస్ ఖాతా తెరిచేందుకు ‘ఎన్పీఎస్ వాత్సల్య’ ప్లాన్‌ను కూడా ప్రకటించారు. ఈకామర్స్ ఎగుమతులకు దన్నుహబ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఈకామర్స్ రంగం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ విధానం(పీపీపీ)లో వీలు కలి్పంచనుంది. అవాంతరాలులేని నియంత్రణ, లాజిస్టిక్ మార్గదర్శకాల ద్వారా ఒకే గొడుగుకింద వాణిజ్యం, ఎగుమతి సంబంధ సరీ్వసులకు ఇవి తెరతీయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వెరసి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్ఎంఈలు), సంప్రదాయ చేనేత, హస్తకళలు తదితర శ్రామికులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు.ప్రస్తుతం ఈకామర్స్ విభాగం ద్వారా దేశీ ఎగుమతులు కేవలం 5 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. చైనా నుంచి వార్షికంగా 300 బిలియన్ డాలర్లు ఎగుమతులు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో 50–100 బిలియన్ డాలర్లకు దేశీ ఎగుమతులను పెంచేందుకు అవకాశముంది. బడ్జెట్ ప్రతిపాదిత కేంద్రా(హబ్)ల ద్వారా తొలుత చిన్న తయారీదారులు ఈకామర్స్ సంస్థలు(అగ్రిగేటర్ల)కు ఉత్పత్తులను విక్రయిస్తారు.తదుపరి ఇతర మార్కెట్లలో అగ్రిగేటర్లు వీటిని విక్రయిస్తాయి. ప్రధానంగా ఆభరణాలు(జ్యువెలరీ), దుస్తులు, హస్తకళలు తదితరాలకు భారీ అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాటలో ఆర్బీఐసహా సంబంధిత శాఖలతో వాణిజ్య శాఖ విభాగం డీజీఎఫ్టీ కలసి పనిచేస్తోంది. ఫలితంగా ఈ హబ్‌లకు ఎగుమతులు క్లియరెన్స్‌లను కలి్పస్తారు. అంతేకాకుండా వేర్‌హౌసింగ్, కస్టమ్స్ క్లియరెన్స్, రిటర్నుల ప్రాసెసింగ్, లేబిలింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్లను వీటికి జత చేస్తారు.డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 50,000 కోట్లు ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రూ. 50,000 కోట్లు సమీకరించవచ్చని తాజా బడ్జెట్ అంచనా వేసింది. మధ్యంతర బడ్జెట్లోనూ ఇదేస్థాయిలో ప్రభుత్వం అంచనాలు ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వ కంపెనీల(సీపీఎస్ఈలు) నుంచి రూ. 56,260 కోట్ల డివిడెండ్ లభించవచ్చని భావిస్తోంది.మధ్యంతర బడ్జెట్లో వేసిన అంచనాలు రూ. 48,000 కోట్లకంటే అధికంకావడం గమనార్హం! మరోవైపు ఆర్బీఐ, పీఎస్‌యూ బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ. 2,32,874 కోట్ల డివిడెండ్ అందుకునే చాన్స్ ఉన్నట్లు బడ్జెట్ ఊహిస్తోంది. ఇందుకు ప్రధానంగా ఆర్బీఐ నుంచి రూ. 2.11 లక్షల కోట్ల అనూహ్య డివిడెండ్ లభించడం ప్రభావం చూపింది. మధ్యంతర బడ్జెట్ ఈ పద్దుకింద రూ. 1.02 లక్షల కోట్లు మాత్రమే అంచనా వేసింది.దివాలా వ్యవహారాల్లో ఇక మరింత పారదర్శకతఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు దివాలా కోడ్ (ఐబీసీ) పక్రియను మరింత మెరుగుపరచడంపై బడ్జెట్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, వాటాదారులకు సంబంధించి మెరుగైన పర్యవేక్షణ సాధన లక్ష్యంగా ‘ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్’ను ఆవిష్కరిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 2016 నుంచి అమల్లోకి వచ్చిన దివాలా కోడ్ పటిష్టత కోసం తగిన మార్పులను తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కోడ్‌ను ఇప్పటి వరకూ ఆరు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఐబీసీ 1,000 కంటే ఎక్కువ కంపెనీల దివాల అంశాలను పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు నేరుగా రూ. 3.3 లక్షల కోట్ల రికవరీ జరిగిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న ప్రధాన బెంచ్సహా 15 నగరాల్లో ఎన్సీఎల్టీ బెంచ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఢిల్లీ, చెన్నైలలో బెంచ్‌లను కలిగి ఉంది. రికవరీని వేగవంతం చేసేందుకు మరిన్ని ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. టెలికం పరికరాల దిగుమతులకు చెక్10 శాతం నుంచి 15 శాతానికి సుంకాల పెంపు దేశీయంగా టెలికం గేర్ తయారీకి దన్నుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో దిగుమతి సుంకాల పెంపునకు తెరతీశారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీఏ)లుగా వ్యవహరించే మదర్‌బోర్డులపై 5 శాతం పెంపును ప్రతిపాదించారు. వెరసి టెలికం పీసీబీఏలపై బేసిక్ కస్టమ్ డ్యూటీ ప్రస్తుత 10 శాతం నుంచి 15 శాతానికి పెరగనుంది.అయితే కమ్యూనికేషన్ పరికరాల తయారీలో వినియోగించే కీలక 25 మినరల్స్‌పై డ్యూటీని పూర్తిస్థాయిలో మినహాయించింది. వీటిలో అణువిద్యుత్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, టెలికం రంగాలలో వినియోగించే లిథియం, కాపర్, కోబాల్ట్ తదితరాలున్నాయి.రూ.50 లక్షలు మించితేనే రిటర్నుల పునః మదింపుపన్ను చెల్లింపుదారులకు సంబంధించి కొన్ని సానుకూల చర్యలకు బడ్జెట్లో చోటు లభించింది. ఎగవేసిన పన్ను ఆదాయం రూ.50లక్షలకు మించి ఉన్నప్పుడే.. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన మూడు నుంచి ఐదేళ్లలోపు తిరిగి మదింపు చేయవచ్చని ప్రకటించారు. సోదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన పదేళ్ల వరకు అవకాశం ఉండగా, దీన్ని ఆరేళ్లకు తగ్గించారు.పన్నుల విషయంలో అనిశి్చత, వివాదాలను ఈ చర్యలు తగ్గిస్తాయని మంత్రి చెప్పారు. ఎలాంటి కేసుల్లోనూ ఐదేళ్ల తర్వాత సంబంధిత పన్ను రిటర్నులను తిరిగి మదించకుండా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామని ప్రకటించారు. పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా ‘వివాద్ సే విశ్వాస్ పథకం 2.0’ను తీసుకొస్తామన్నారు. సమతౌల్యత సాధన..ప్రజాదరణ, విధాన చర్యల మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రభుత్వం ప్రయతి్నంచింది. రైతులకు ద్రవ్య మద్దతు, వ్యక్తిగత ఆదాయపు పన్నులో అధిక మినహాయింపు పరిమితులు, పెరిగిన ప్రామాణిక తగ్గింపులు వంటి కార్యక్రమాలు ఖర్చు చేయదగ్గ అధిక ఆదాయాన్ని అందిస్తాయి. ఇది వ్యయాలను పెంచడానికి దారి తీస్తుంది. – కుమార్ రాజగోపాలన్, సీఈవో, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.కీలక పురోగతి..ఊహించినట్లుగా 2024 యూనియన్ బడ్జెట్ సౌర, పునరుత్పాదక ఇంధన రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఒక కోటి రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఒక ముఖ్యమైన పురోగతిగా నిలుస్తుంది. కస్టమ్ డ్యూటీ మినహాయింపు జాబితా నుండి సోలార్ గ్లాస్, గ్లాస్, కాపర్ వైర్ కనెక్టర్లను తొలగించడం వివేకవంతమైన చర్య. అభివృద్ధి చెందుతున్న దేశీయ పరిశ్రమకు మద్దతుగా ఈ నిర్ణయం కీలకం. – విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అద్భుతమైనది ఏమీ లేదు..ఆతిథ్య రంగానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట చర్యలు లేకపోవడం నిరాశ కలిగించింది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఈ రంగం వృద్ధిని వేగవంతం చేయడానికి బడ్జెట్లో అద్భుతమైనది ఏమీ లేదు. – ప్రదీప్ శెట్టి, ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అసోసియేషన్స్వ్యవసాయానికి దన్నువ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచినందున ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే వ్యవసాయంలో ఉత్పాదకతను పెంపొందించడంపై కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యతను స్వాగతిస్తున్నాము. ఉత్పాదకతను మెరుగుపరచడం, వాతావరణాన్ని తట్టుకునే పంటలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి ప్రతిపాదిత సమగ్ర సమీక్ష భారతీయ వ్యవసాయం వాతావరణ ప్రభావాన్ని తట్టుకోగలదని నిర్ధారించడానికి ఒక ప్రేరణనిస్తుంది. – అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్.వృద్ధి ఆధారితంఅభివృద్ధి ఆధారిత బడ్జెట్. ఇది స్వల్పకాలిక డిమాండ్ ఉద్దీపన, ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూ మధ్యకాలిక వృద్ధి ఆవశ్యకతలపై దృష్టి సారించింది. ఉద్యోగాల కల్పన, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ అందరినీ కలుపుకొని ఉంది. – అనీశ్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీ.సాహసోపేతందీర్ఘకాలిక ఆర్థిక వివేకాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించిన సాహసోపేత బడ్జెట్ ఇది. దేశంలో తయారీ, ఎంఎస్ఎంఈల పటిష్ట పాత్ర ద్వారా ఉద్యోగ కల్పన యొక్క సుదీర్ఘ, మరింత స్థిర మార్గంపై దృష్టి పెడుతుంది. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.మౌలిక రంగ పురోగతి లక్ష్యంవివిధ ముఖ్య ప్రాజెక్టులు, కేటాయింపుల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిస్సందేహంగా సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక ఏకీకరణపై దృష్టి సారించి పరివర్తనాత్మకంగా, ముందుకు చూసేదిగా బడ్జెట్ ఉంది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ఇంధన భద్రతపై బలమైన దృష్టిని కలిగి ఉంది. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.ఉపాధి కల్పనకు ఊతంబడ్జెట్లో పురోగామి ప్రతిపాదనలు చేశారు. దీనితో ఉత్తరాంధ్రలో కనీసం 2,00,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. వివిధ రంగాల అభివృద్ధికి గణనీయంగా అవకాశాలు కలి్పంచడం ద్వారా దేశీయంగా ఉపాధి కల్పన ముఖచిత్రాన్ని మార్చే విధంగా బడ్జెట్ ఉంది. – గేదెల శీనుబాబు, సీఈవో, పల్సస్ గ్రూప్ -
మరో గుడ్ న్యూస్: భారీగా తగ్గిన గ్యాస్ ధర
Commercial LPG cylinder price cut కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్రం ఇప్పుడు మరో శుభవార్త అందించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు)కీలక నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం వంటగ్యాస్ డొమెస్టిక్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించిన నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లను తగ్గించాయి.కొత్త ధరలు నేటి నుండి అమలులో ఉంటాయి. (పాక్ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు) అనేక రాష్ట్రాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరను సుమారు రూ.158 తగ్గించాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ విక్రయ ధర రూ. 1,522.50 అవుతుంది. అదే విధంగా ముంబైలో గతంలో రూ.1640.50 ఉండగా ఇప్పుడు రూ.1482గా ఉందినుంది. అలాగే చెన్నైలో రూ.1852.50కి బదులుగా రూ.1695కే అందించనున్నారు. వాణిజ్య, గృహ LPG (ద్రవీకృత పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను ప్రతి నెల మొదటి రోజున సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో 7 రూపాయలు పెరిగిన వాణిజ్య LPG సిలిండర్ల ధర ఆగస్టులో రూ. 99.75 మేర తగ్గిన సంగతి తెలిసిందే. ( LPG Price Cut: మహిళలకు రూ. వేల కోట్ల రక్షాబంధన్ గిఫ్ట్) కాగా రక్షా బంధన్ సందర్భంగా, దేశంలోని మహిళలకు బహుమతిగా కేంద్ర ప్రభుత్వం దేశీయ ఎల్పిజి ధరను రూ.200 తగ్గించింది. అలాగే ఉజ్వల స్కీమ్ కింద అందించే రూ.200 సబ్సిడీకి అదనంగా రూ.200తో మొత్తంగా రూ. 400 తక్కువకే సిలిండర్ లభిస్తోంది. -
టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా దేశీయంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థలు విమాన ఇంధన (ఏటీఎఫ్) రేటును ఏకంగా 8.5 శాతం పెంచాయి. అటు వాణిజ్య వంట గ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 100 మేర తగ్గించాయి. తాజా మార్పులతో ఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 7,728 పెరిగి రూ. 98,508కి చేరింది. దీంతో వరుసగా రెండో నెలా విమాన ఇంధనం రేటు పెరిగినట్లయింది. జూలై 1నే ఇది 1.65శాతం మేర (కిలోలీటరుకు రూ. 1,477) పెరిగింది. అంతకు ముందు ఆయిల్ కంపెనీలు నాలుగు సార్లు తగ్గించాయి. కొత్త రేట్లు మంగళవారంనుంచి అమల్లోకి వచ్చాయి. పెంపు తర్వాత, న్యూఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటర్‌కు రూ.7,728 పెరిగి రూ.98,508.26కి చేరుకుంది. ముంబైలో కిలోలీటర్‌కు రూ.84,854.74 నుంచి రూ.92,124.13కి పెరిగింది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ మెట్రోలలో (రూపాయిలు/కేఎల్) ఏటీఎఫ్ ధరలు న్యూఢిల్లీ - 98,508.26 కోల్‌కతా - 1,07,383.08 ముంబై - 92,124.13 చెన్నై- 1,02,391.64 ఇంటర్నేషనల్ రన్లో డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ మెట్రోలలో ఏటీఎఫ్ ధరలు (డాలర్లు/కిలో) ఢిల్లీ-902.62 కోల్‌కతా-941.09 ముంబై-900.73 చెన్నై- 897.83 ఇక 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 100 తగ్గి రూ. 1,680కి లభించనుంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ రేటు యథాతథంగా రూ. 1,103 (14.2 కేజీల సిలిండర్) ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. -
ఆయిల్ కంపెనీలకు ఇక మీదట లాభాలే.. మరి డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గేనా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ఆర్జిస్తాయని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. గతేడాది ఇవి భారీ నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చము రు ధరలు బ్యారెల్‌కు 78.8 డాలర్లకు క్షీణించడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరం నష్టాలను.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోగలవని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ ధరలను ఒకే స్థాయిలో కొసాగిస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ, దేశీయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సవరించకపోవడంతో అవి నష్టాల పాలయ్యాయి. చమురు ధరలు గణనీయంగా తగ్గిన తర్వాత నుంచి తిరిగి అవి లాభాలను చూస్తున్నాయి. 5 శాతం పెరగొచ్చు గడిచిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం డిమాండ్ 10 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం మేర పెరగొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతేకాదు మధ్య కాలానికి సైతం దేశంలో పెట్రోల్ డిమాండ్ 5–6 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. భారత్ జీడీపీ వచ్చే కొన్నేళ్లపాటు 6–7 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వ్యయాలను పెంచుతూ ఉండడం, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం పెట్రోల్ వినియోగానికి సానుకూలంగా పేర్కొంది. ‘‘స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 2023–24లో మోస్తరు స్థాయికి దిగొస్తాయి. అయినప్పటికీ స్థూల మార్జిన్లు సగటు స్థాయిలకు ఎగువనే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. మోస్తరు స్థాయిలో ధరలు చమురు ధరలు 2022–23 గరిష్టాల నుంచి చూసుకుంటే మోస్తరు స్థాయిలో, ఎగువవైపే కొనసాగొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. దీనివల్ల చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు మంచి నగదు ప్రవాహాలు సమకూరతాయని పేర్కొంది. భారత నూతన గ్యాస్ ధరల విధానం వల్ల ఈ సంస్థలకు నగదు ప్రవాహాల్లో ఉన్న అస్థిరతలు తగ్గుతాయని తెలిపింది. ఉత్పత్తికి సంబంధించి ఈ సంస్థలకు అధిక మూలధన నిధులు అవసరం కొనసాగుతుందని అంచనా వేసింది. దేశ చమురు ఉత్పత్తి 2022–23లో 1.7 శాతం తగ్గినట్టు వివరించింది. ఓఎన్జీసీ ఉత్పత్తి 1 శాతం తగ్గగా, ఆయిల్ ఇండియా ఉత్పత్తి 5 శాతం పెరిగినట్టు తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉండడం, దేశీయంగా ఉత్పత్తి స్థిరంగా ఉండడంతో 2023–24లోనూ చమురు దిగుమతులు అధికంగానే ఉంటాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. -
బండపై మళ్లీ రూ.50
సాక్షి, హైదరాబాద్: పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య ప్రజానీకంపై మరో బాదుడు. ఎనిమిది నెలల విరామం తరువాత చమురు సంస్థలు మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి. 14.2 కిలోల గృహావసర సిలిండర్‌పై రూ. 50 పెంచగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్‌పై రూ. 350.50 పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో గృహావసరాల సిలిండర్ రేటు రూ.1,105 నుంచి రూ.1,155కి చేరింది. కాగా, గ్యాస్ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో రెండేళ్లుగా వినియోగదారులకు నగదు బదిలీ నిలిచిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 1.16 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 68.74 లక్షలు కాగా, డబుల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు 48 లక్షలు. ఇవి కాకుండా దీపం కనెక్షన్లు 19.72 లక్షలు, ఉజ్వల కనెక్షన్లు 11.46 లక్షలు, సీఎస్ఆర్ కింద 7.30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులను బట్టి సిలిండర్ల వినియోగంలో తేడాలున్నా... సాధారణ కుటుంబానికి సగటున నెలకు ఒక సిలిండర్ అవసరమవుతుంది. గ్రామాల్లో కొంత తక్కువ వినియోగం ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రతి నెలా కోటి సిలిండర్లకు పైగా రీఫిల్ కోసం వస్తాయనుకున్నా... నెలకు అదనపు భారం రూ. 50 కోట్లకుపైనే ఉంటుందని చమురు కంపెనీల వర్గాలు తెలిపాయి. హోటల్ తిండి భారమే.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు ఎకాఎకిన రూ. 350.50 పెంచేశాయి. దీంతో హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే ఈ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.1,973 నుంచి రూ. 2,323.50కి చేరినట్లయింది. ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో సిలిండర్ ధర మరింత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో హోటళ్లలో టిఫిన్లు, భోజనాల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. మహిళలను వంచించిన కేంద్రం: మంత్రి గంగుల కమలాకర్ గ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం మహిళలను మరోసారి వంచించింది. వారం రోజుల్లో మహిళా దినోత్సవం రానున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం దేశ మహిళలకు గ్యాస్ ధరలను పెంచి కానుకగా ఇచ్చింది. అదానీ నష్టాలను పూడ్చుకునేలా సామాన్యుల నుంచి గ్యాస్ ధరల రూపంలో వసూలు చేస్తోంది. అధ్వానపు విధానాలతో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమైన కేంద్రం.. ఏమాత్రం మానవత్వం ఉన్నా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. -
ఆయిల్ కంపెనీలకు ఉపశమనం.. రూ.30,000 కోట్లు కేటాయింపు
ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 10 నెలలుగా పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను సవరించకుండా నష్టపోయిన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ కోసం రూ.30,000 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. అంతర్జాతీయంగా ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, 2021 ఏప్రిల్ 6 నుంచి ఈ సంస్థలు ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. బ్యారెల్ చమురు ధర 116 డాలర్లకు వెళ్లిన సమయంలో వాటికి ఎక్కువ నష్టం వచ్చింది. ఆ తర్వాత చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్‌పై లాభం వస్తుండగా, డీజిల్‌పై ఇప్పటికీ నష్టపోతున్నాయి. 2022–23లో ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు ఉమ్మడిగా రూ.21,200 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. పైగా వీటికి రెండేళ్లుగా ఎల్పీజీ సబ్సిడీ చెల్లింపులు కూడా చేయలేదు. దీంతో రూ.50,000 కోట్లను ఇవ్వాలని అవి కోరగా, ప్రభుత్వం రూ.30,000 కోట్లను కేటాయించింది. చదవండి: ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు! -
చమురు కంపెనీలకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్ల అనూహ్య పెరుగుదల వల్ల దేశీ చమురు ఉత్పత్తి కంపెనీలు ఆర్జిస్తున్న భారీ లాభాలపై (విండ్‌ఫాల్ ట్యాక్స్) పన్నును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఎత్తివేయవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. చమురు ధరలు మోస్తరు స్థాయికి చేరుకోనుండడాన్ని ఇందుకు అనుకూలంగా ప్రస్తావించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి విండ్‌ఫాల్ పన్నును కేంద్ర సర్కారు అమల్లోకి తీసుకురావడం గమనార్హం. దేశీయంగా ఉత్పత్తి చేసి విక్రయించే, ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌లపై దీన్ని విధించింది. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగిపోవడంతో ఉత్పత్తి కంపెనీలకు ఒక్కసారిగా అనూహ్య లాభాలు వచ్చిపడ్డాయి. ఈ ప్రయోజనాన్ని కొంత వరకు పన్నుల రూపంలో ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వెనక్కి తీసుకునే ప్రయతాన్ని ప్రభుత్వం చేసింది. దేశ చమురు వినియోగంలో 15 శాతం స్థానికంగా ఉత్పత్తి అవుతున్నదే ఉంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దశాబ్ద గరిష్టాలకు చేరడం తెలిసిందే. ఈ ఏడాది చివరికి బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 85 డాలర్ల వద్ద స్థిరపడుతుందని ఫిచ్ అంచనా వేసింది. ధరలు తగ్గడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు పుంజుకుంటాయని, 2022లో నష్టాలను అవి కొంత వరకు భర్తీ చేసుకుంటాయని ఫిచ్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. రిఫైనింగ్ మార్జిన్లు మధ్య స్థాయికి చేరుకుంటాయని, చమురు మార్కెటింగ్ కంపెనీల క్రెడిట్ అంశాలు మెరుగుపడతాయని పేర్కొంది. -
కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్
సాక్షి, పంజగుట్ట: వాణిజ్య అవసరాల కోసం వాడే ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. సిలిండర్లపై ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇచ్చే రాయితీని దేశ వ్యాప్తంగా పూర్తిగా ఎత్తివేశారని, ఈ విషయం వినియోగదారులు గ్రహించి సహకరించాలని తెలంగాణ ఎల్పీజీ డి్రస్టిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వ్యాప్తంగా నెలకు 8 నుంచి 9 లక్షల వాణిజ్య సిలిండర్లు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి గతంలో వినియోగదారున్ని బట్టి 100 నుంచి 200 వరకు డిస్కౌంట్ లభించేదని దాన్ని పూర్తిగా ఎత్తేశారని తెలిపారు. ఎల్పీజీ ప్రమాదాలు ఇటీవల బాగా జరుగుతున్నాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పే సేఫ్టీ ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు. ప్రమాదం జరిగితే రూ.40 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని, ఇది రావాలంటే డిస్ట్రిబ్యూటర్ వద్ద రిజిస్ట్రేషన్ ఉండాలన్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ శ్రీచరణ్, అశోక్, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
చమురు సంస్థలకు వేల కోట్ల నష్టం, ధరలు పెంచకపోవడం వల్లే?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మరోసారి నష్టాలు ప్రకటించే అవకాశమున్నట్లు బ్రోకింగ్ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఉమ్మడిగా రూ. 21,270 కోట్ల నష్టాలు నమోదుకావచ్చని పేర్కొంది. వెరసి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలు ప్రకటించనున్నట్లు తెలియజేసింది. చమురు పీఎస్‌యూలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఉమ్మడిగా ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 18,480 కోట్ల నష్టాలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్, దేశీ ఎల్పీజీ విక్రయాలలో మార్కెటింగ్ మార్జిన్లు క్షీణించడం ప్రభావం చూపింది. ఈ బాటలో క్యూ2లోనూ మార్కెటింగ్ మార్జిన్లు బలహీనపడటంతో లాభదాయకత క్షీణించనున్నట్లు తాజా నివేదికలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలియజేసింది. ఇతర వివరాలిలా.. నవంబర్‌లో చమురు పీఎస్‌యూలు ఈ నెలఖారు లేదా వచ్చే నెల(నవంబర్)లో క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. క్యూ1లో రికార్డు రిఫైనింగ్ మార్జిన్లు సాధించినప్పటికీ పెట్రోల్, డీజిల్ రోజువారీ విక్రయ ధరలను సవరించకపోవడంతో లాభాలు ఆవిరయ్యాయి. నష్టాలు నమోదయ్యాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి వ్యయాలు, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం తగ్గిపోవడంతో మార్జిన్లు క్షీణించాయి. ఈ పరిస్థితి మూడు చమురు పీఎస్‌యూలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇది క్యూ2లోనూ కొనసాగడంతో ఆర్థిక పనితీరు మరింత నీరసించనుంది. త్రైమాసికవారీగా స్థూల రిఫైనింగ్ మార్జిన్ల(జీఆర్ఎం)లో బ్యారల్‌కు 5.6–15.9 డాలర్లమేర కోత పడనుంది. అయితే బ్లెండెడ్ రిటైల్ ఇంధన నష్టాలు తగ్గడంతో కొంతమేర కంపెనీలకు మేలు జరగనుంది. క్యూ1లో నమోదైన రూ. 14.4తో పోలిస్తే క్యూ2లో ఇవి రూ. 9.8కు పరిమితమయ్యే వీలుంది. ఇబిటా నష్టాలు మొత్తంగా క్యూ2లో చమురు పీఎస్‌యూల నిర్వహణ(ఇబిటా) నష్టాలు రూ. 14,700 కోట్లకు చేరనున్నాయి. నికర నష్టాలు మరింత అధికంగా రూ. 21,270 కోట్లను తాకవచ్చు. గత ఆరు నెలలుగా కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టకపోవడం గమనార్హం! 2017లో రోజువారీ ధరల సవరణను అమల్లోకి తీసుకువచ్చాక ఆరు నెలలపాటు నిలిపివేయడం ఇదే ప్రథమం! ఇదే సమయంలో ముడిచమురు ధరలు పుంజుకోవడం, డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. ఇక వంటగ్యాస్ ధరలను సైతం వ్యయాలకు అనుగుణంగా పెంచకపోవడం ప్రస్తావించ దగ్గ విషయం. కంపెనీలవారీగా... నివేదిక ప్రకారం క్యూలో ఐవోసీ రూ. 6,300 కోట్ల నష్టాలు నమోదు చేసే వీలుంది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,900 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ. 8,100 కోట్ల నష్టాలు ప్రకటించవచ్చు. వెరసి తొలిసారి మూడు పీఎస్‌యూలు వరుస త్రైమాసికాలలో నష్టాలు ప్రకటించడం ద్వారా రికార్డ్ నెలకొల్పనున్నాయి. క్యూ1లోనూ ఐవోసీ రూ. 1,995 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ. 10,197 కోట్లు(సరికొత్త రికార్డ్), బీపీసీఎల్ రూ. 6,291 కోట్లు చొప్పున నష్టాలు ప్రకటించాయి. దేశీయంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు అనుగుణంగా రోజువారీ ఇంధన ధరల సవరణను చేపట్టే సంగతి తెలిసిందే. -
చమురు ఉత్పత్తికి ఒపెక్ కోత, దేశంలో మళ్లీ పెట్రో ధరల మంట?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ విక్రయాలపై లాభాలు కళ్లచూద్దామన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు దేశంలో ఆరు నెలలుగా ఒకే స్థాయిలో ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాలతో ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు రోజువారీ రేట్ల సవరణను నిలిపివేశాయి. చమురు ఉత్పత్తికి కోత పెట్టాలని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో రేట్ల సవరణ కూడా ఇప్పట్లో చేపట్టే అవకాశాల్లేవని తెలుస్తోంది. చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో చమురును ఉత్పత్తి చేస్తున్న దేశాల కూటమి ఒపెక్ రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించుకోవాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థకు ఓపెక్ తాజా నిర్ణయం ప్రతికూలం కానుంది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను సవరించకపోవడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో డీజిల్ మినహా పెట్రోల్, గ్యాస్‌పై అవి ఎదుర్కొంటున్న నష్టాలు సున్నా స్థాయికి చేరాయి. లీటర్ డీజిల్‌పై నష్టం రూ.5కు తగ్గింది. కానీ, తాజా పరిణామంతో తిరిగి ఆయిల్ కంపెనీలకు నష్టాలు పెరిగిపోనున్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా చమురుపై నష్టాలను పెంచనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నష్టాల బాట.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న కేంద్ర సర్కారు లక్ష్యానికి అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను సవరించకపోవడంతో ఆయిల్ కంపెనీల నష్టాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా జూన్ త్రైమాసికంలో మూడు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఉమ్మడిగా రూ.18,480 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. భారత్ దిగుమతి చేసుకునే బ్యారెల్ ముడి చమురు ధర సెప్టెంబర్ 27 నాటికి 84.75 డాలర్లకు తగ్గగా, అక్టోబర్ 5 నాటికి తిరిగి 92.17 డాలర్లకు పెరిగిపోయింది. చమురు ధరల క్షీణత ఇలానే కొనసాగితే, ఏప్రిల్ నుంచి ఎదుర్కొన్న నష్టాల భారం నుంచి గట్టెక్కొచ్చన్న చమురు కంపెనీల ఆశలు తాజా పరిణామంతో చెదిరిపోయాయి. 2021 నవంబర్ 4 నుంచి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం గమనార్హం. మార్చి 22 తర్వాత తిరిగి ఇవి రేట్లను సవరించాయి. ఫలితంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 మేర పెరిగింది. తిరిగి ఏప్రిల్ 7 నుంచి రేట్ల సవరణ నిలిచిపోయింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 చొప్పున ఉంది. -
ఆయిల్ కంపెనీలకు కేంద్రం శుభవార్త, పెట్రోల్..డీజిల్ రేట్లు తగ్గేనా?
నష్టపోతున్న ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థకు కేంద్రం పాక్షికంగా సహాయం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం ఇంధన రీటైలర్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో పాటు ఇతర కంపెనీలకు రూ.20వేల కోట్లు పరిహారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు దేశ వ్యాప్తంగా 90శాతం కంటే ఎక్కుగానే ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం ప్రభుత్వ ఆయిల్ సంస్థలపై పడింది. దీంతో ఏప్రిల్ - జూన్ వార్షిక ఫలితాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రతి లీటర్ పెట్రోల్ పై రూ.10, లీటర్ డీజిల్‌పై రూ.14 నష్టంతో మొత్తం రూ.1992.52 కోట్ల నష్టాల్ని మూటగట్టుకుంది. ఆ నష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఇంధనాలపై పన్ను తగ్గింపులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేసింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం చమురు సబ్సిడీని 58 బిలియన్ రూపాయిలు కేటాయించగా, ఎరువుల సబ్సిడీపై 1.05 ట్రిలియన్ రూపాయలు అందించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. అదే సమయంలో అమెరికాలో ఇంధన తయారీ సామర్ధ్యం తగ్గడం, ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యా నుంచి ఎగుమతులు తగ్గాయి. 85శాతం కంటే ఎక్కువగా దిగుమతి చేసుకున్న చమురు రిఫైనింగ్-కమ్-ఫ్యూయల్ రిటైలింగ్ కంపెనీలు అంతర్జాతీయ ధరలకే ఉత్పత్తి చేయడంలో బెంచ్ మార్క్‌ను క్రాస్ చేశాయి. ఈ తరుణంలో ఈ ఆగస్ట్ నెలలో చమురు కంపెనీలకు ధరల పెంపు లేదా ప్రభుత్వ పరిహారం ద్వారా నిరంతర నష్టాలను పూడ్చేందుకు కొంత జోక్యం అవసరం అని భారత పెట్రోలియం చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు ఊతం ఇచ్చేలా పెట్రోలియం శాఖ ఆర్ధిక సాయం కింద కేంద్రాన్ని 280 బిలియన్ డాలర్లు (రూ.28వేల కోట్లు) అడిగినట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది. పెట్రోలియం శాఖ అభ్యర్ధనపై ఆర్ధిక శాఖ 200బిలియన్ల (రూ.20వేల కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆ రెండు కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇంధన రీటైల్ సంస్థలకు ఆర్ధిక సాయం అందనున్నట్లు వెలుగులోకి వచ్చిన పలు కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
గ్యాస్ సిలిండర్ సామాన్యులకు గుదిబండలా మారుతోంది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర మరోసారి పెరిగింది. గ్యాస్ బండ ధరను రూ. 3.50 పెంచాయి చమురు సంస్థలు. అలాగే వాణిజ్య సిలిండర్ ధరను రూ. 8 వంతున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి దాటింది. పెరిగిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోలు ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా గోరుచుట్టపై రోకలిపోటులా వరుసగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ పోతోంది కేంద్రం. ఈ ఏడాది మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 50 పెంచాయి. ఆ తర్వాత మే 7 మరోసారి రూ. 50వంతున ధరను పెంచాయి. ఈసారి కొంచెం కనికరించి ఈ పెంపు కేవలం రూ.3.50లకు పరిమితం చేశాయి. ఇక ఏడాది కాలంగా కమర్షియల్ సిలిండర్ ధరలయితే అడ్డు అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. చదవండి: ‘మోదీగారు.. వంటగ్యాస్ ధర తగ్గించండి’ -
పెట్రోల్ 118 నాటౌట్.. డీజిల్ 104 నాటౌట్
సామాన్యులపై కనీస కనికరం చూపకుండా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి చమురు కంపెనీలు. తాజాగా లీటరు, పెట్రోలు, డీజిల్‌లపై 80 పైసల వంతున ధరను పెంచాయి. వీటికి డీలర్ కమిషన్, వ్యాట్ తదితర అంతా కలిపితే లీటరు పెట్రోలు ధర 91 పైసలు, డీజిల్ ధర 87 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 118.59కి పెరగగా లీటరు డీజిల్ ధర రూ.104.62కి చేరుకుంది. రూ.10కి పైగా ఉదయం ఆరు గంటలు అయ్యిందంటే చాలు పెట్రోలు రేట్లు ఎప్పుడు పెంచుదామా అన్నట్టుగా చూస్తున్నాయి చమురు కంపెనీలు. గడిచిన పదిహేను రోజుల వ్యవధిలో కేవలం రెండంటే రెండే రోజులు గ్యాప్ ఇచ్చి పదమూడు సార్లు ధరలను సవరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సవరణల కారణంగా లీటరు పెట్రోలు ధర గత రెండు వారాల్లోనే రూ.10.39 పెరగగా డీజిల్ ధర రూ. 10.57లు పెరిగింది. ఉపశమనం లేదు అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ రేట్లను సవరిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికలు పెట్రోలు రేట్లకు సంబంధం లేదని కేంద్ర మంత్రులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. 2022 మార్చి 21న అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 111.83 డాలర్లుగా ఉండగా ఏప్రిల్ 5న 109.41 డాలర్ల వద్ద ఉంది. ఐనప్పటికీ ధరల పెంపు నుంచి సామాన్యులకు ఉపశమనం లభించడం లేదు. ఎన్నికలుంటేనే 2021 మేలో బెంగాల్ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి పెట్రోలు వాతలు మొదలయ్యాయి. ఈ పరంపర 2021 నవంబరు 4 వరకు కొనసాగింది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలు, డీజిల్ ధర వంద దాటేసింది. దీంతో ప్రజా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్రం లీటరు పెట్రోలు, డీజిల్ ధరలను రూ.5 వంతున తగ్గించింది. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి. నాటౌట్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం 2021 నవంబరు 4 నుంచి 2022 మార్చి 22 వరకు దాదాపు 137 రోజుల పాటు పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచలేదు. ఇక మార్చి 22న మొదలైన చమురు సంస్థల బాదుడు నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ దెబ్బకు లీటరు పెట్రోలు 118 నాటౌట్, డీజిల్ 104 నాటౌట్ బ్యాటింగ్ అన్నట్టుగా పరిస్థితి మారింది. -
ఎనిమిది రోజుల్లో ఏడోసారి.. పెరుగుతూనే ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయ ధరల పేరు చెప్పి చమురు కంపెనీలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. వరుసగా ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాయి. 2022 మార్చి 29న లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసల వంతున ధరను పెంచాయి. తాజాగా సవరణలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 113.61కి చేరుకోగా డీజిల్ ధర రూ.99.83ని టచ్ చేసింది. రేపోమాపో డీజిల్ ధర హైదరాబాద్‌లో వంద రూపాయలను క్రాస్ చేయడం ఖాయమనే పరిస్థితి నెలకొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 2021 నవంబరు రెండో వారం నుంచి 2022 మార్చి మూడో వారం వరకు పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచలేదు. అప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇక ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఓ దశలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 139 డాలర్లకు చేరుకున్నా.. ప్రభుత్వం మిన్నకుండిపోయింది. పెరిగిన ముడి చమురు ధర భారాన్ని బల్క్ డీజిల్‌పైకి మోపి సర్థుబాటు చేసింది. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి పెట్రో బాదుడు మొదలైంది. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఏకంగా ఏడు సార్లు పెట్రోలు , డీజిల్ ధరలను పెంచింది. పెట్రోలుపై ప్రతీ రోజు సగటున 90 పైసల వంతున ఏడు సార్లు పెంచడంతో కేవలం వారం రోజుల వ్యవధిలో లీటరు పెట్రోలు ధర రూ.6.30 వంతున పెరిగింది. చైనాలో లాక్డౌన్ నేపథ్యంలో గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతోంది. వారం క్రితం బ్యారెల్ ధర 120 డాలర్లు ఉండగా చైనా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం 108 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఐనప్పటికీ గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు చమురు సంస్థలు పెట్రోలు ధరలు పెంచుతూ పోతున్నాయి. -
మరోసారి పెరిగిన ఇంధన ధరలు..! 3 రోజుల్లోనే రూ. 2 పైగా బాదుడు..! కొత్త ధరలు ఇవే..
Fuel Rates Today: రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బ్యారెట్ క్రూడాయిల్ ధరలు 140 డాలర్లకు చేరుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన కేంద్రం..ఇప్పుడు ధరల పెంపుకు చమురు సంస్థలు సిద్ధమయ్యాయి. రెండు రోజుల పాటు వరుసగా పెంచిన చమురు సంస్థలు, ధరల పెంపుకు ఒక్కరోజు బ్రేక్ గ్యాప్ ఇచ్చి మరోసారి బాదుడు షురూ చేశాయి. దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్ 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.112.51, డీజిల్ రూ.96.70గా ఉన్నాయి. చెన్నైలో 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71, కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.34 (84 పైసలు), డీజిల్ రూ.91.42 (80 పైసలు)కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.76, డీజిల్ ధర రూ. 98.74 గా ఉంది. దేశంలో గతేడాది నవంబర్ 4వ తేదీ తర్వాత మొదటిసారిగా మార్చి 22న పెట్రోల్, డీజిల్ ధరలు అధికమయ్యాయి. మార్చి 23న కూడా చమురు కంపెనీలు ధరలు పెంచాయి. తాజా పెంపుతో మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2.40 పైగా పెరిగాయి. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..! -
వీరి రూటు.. సపరేటు
-
రష్యా డిస్కౌంట్! పెట్రోల్ ధరలు అదుపులో ?
ప్రస్తుతం రష్యా– ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వివాదాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా ముడిచమురు, పసిడి తదితర కమోడిటీల ధరలు మండుతున్నాయి. దీంతో ఇప్పటికే ద్రవ్యోల్బణ సెగతో సమస్యలు ఎదుర్కొంటున్న భారత్‌సహా పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనిక దళాలను మోహరించడం ప్రారంభించాక ఊపందుకున్న ముడిచమురు ధరలు నిలకడగా పెరుగుతూ వచ్చాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ ముందురోజు 139 డాలర్లను దాటగా.. ప్రస్తుతం 132 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోపక్క ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం చరిత్రలోనే తొలిసారి 77 వద్ద ముగిసింది. దీంతో దేశీ దిగుమతులు బిల్లు తడిసిమోపెడు కానుంది. అయితే రష్యా తాజాగా 25–27 శాతం డిస్కౌంట్ ధరలో భారత్‌కు ముడిచమురు అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలు చూద్దాం.. మూడో ర్యాంకులో ప్రపంచ దేశాలలో భారత్ చమురు దిగుమతులకు మూడో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఒమన్, దుబాయ్, బ్రెంట్ చమురును 75:25 నిష్పత్తిలో కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి నామమాత్ర స్థాయిలోనే (మొత్తం దిగుమతుల్లో దాదాపు ఒక శాతం) చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే బ్రెంట్ ధరలు తాజాగా 14ఏళ్ల గరిష్టానికి చేరడంతో రష్యా 25–27 శాతం డిస్కౌంట్ ధరలో చమురు సరఫరాకు ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది డిసెంబర్లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ దేశీ పర్యటనకు వచ్చిన సందర్భంలో పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), రష్యా ప్రభుత్వ ఇంధన దిగ్గజం రాస్‌నెఫ్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. అత్యంత భారీ స్థాయిలో ఇండియాకు చమురు సరఫరాలు చేయగల రాస్‌నెఫ్ట్.. 2022 చివరికల్లా 2 మిలియన్ టన్నులమేర సరఫరా చేసేందుకు అంగీకరించింది. స్విఫ్ట్ ఎఫెక్ట్... రష్యా చమురు సరఫరాలకుగాను చెల్లింపుల విషయంలో ఇప్పటికింకా స్పష్టతలేనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో భారత్ ఆచితూచి వ్యవహరించవలసి ఉన్నట్లు తెలియజేశాయి. అయితే రష్యా బ్యారల్‌కు 11.6 డాలర్ల డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పశ్చిమ దేశాలు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి పలు రష్యన్ బ్యాంకులను నిషేధించిన కారణంగా రిజర్వ్ బ్యాంక్‌సహా బ్యాంకింగ్ వర్గాలు ప్రత్యామ్నాయ చెల్లింపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రుపీ–రూబుల్ వాణిజ్య ఖాతాను యాక్టివేట్ చేయడం ఒక ఆప్షన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2020–21లో ఒపెక్ దేశాల నుంచి ఇండియా 196.5 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది చివరికల్లా క్రూడ్ ధరలు బ్యారల్‌కు 185 డాలర్లకు చేరవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం. -
అనుకున్నట్టే అయ్యింది .. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు..
Oil Companies Hike LPG Price: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతా భయపడుతున్నట్టే జరిగింది. ధరల పెంపు నిర్ణయాన్ని ముందుగా చమురు కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతూ సోమవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి చమురు కంపెనీలు. 19 కేజీల సిలిండర్ ధరపై రూ. 105లు , 5 కేజీల సిలిండర్‌పై రూ. 27 వంతున ధర పెంచాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్ ధర రూ. 569గా ఉంది. పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని వివిధ నగరాల వారీగా 19 కేజీలు సిలిండర్ల ధరను పరిశీలిస్తే చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్‌కతా రూ.2089లు, హైదరాబాద్‌లో రూ.1904లుగా నమోదు అవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధరలు పెంచే సాహాసం చమురు కంపెనీలు చేయలేదు. దీంతో వీటి ధరల్లో ఎటువంటి మార్పులేదు. అయితే త్వరలోనే డొమెస్టిక్ సిలిండర్లకు ధరల వాత తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో కొట్టుమిట్టాడుతున్న చిరు వ్యాపారులకు, స్ట్రీట్‌ఫుడ్ వెండర్స్‌కి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు అశనిపాతంగా మారింది. కోవిడ్ కారణంగా వచ్చిన నష్టాల భర్తీకి గతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. దీంతో తమ ఆదాయానికి గండి పడుతుందనే ఆవేదన చిరు వ్యాపారుల నుంచి వచ్చింది. ఇప్పుడు ఒకేసారి ఒక్కో సిలిండర్‌పై రూ. 105 వంతున ధరల పెంచాయి చమురు కంపెనీలు -
గుడ్‌న్యూస్! గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
నూతన సంవత్సరం తొలి రోజున రెస్టారెంట్లు, చిరు వ్యాపారులకు సంతోషం కలిగించే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గతేడాది మేలో బెంగాల్‌తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసింది మొదలు వరుసగా పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ పోయింది కేంద్రం. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసింది. ఆరు నెలల వ్యవధిలో దాదాపు రూ. 400లకు వరకు ధరను పెంచింది. చివరి సారిగా 2021 డిసెంబరు 1న రూ.100 వంతున సిలిండర్ ధర పెంచింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు పట్ల నలువైపుల నుంచి విమర్శలు వచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. ఆయిల కంపెనీలకు ధరల తగ్గింపుపై ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. కానీ కీలకమైన యూపీ ఎన్నికలు సమీపించడంతో తొలిసారిగా గ్యాస్ ధరల నుంచి ఉపశమనం కలిగించే దిశగా ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 వంతున తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2004కి చేరుకోగా కోల్‌కతాలో రూ.2,074, చెన్నైలో రూ.2134, ముంబైలో రూ.1951కి చేరుకుంది. -
వ్యాపారులకు షాక్! ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెంపు
ఓవైపు పెట్రోలు ధరలపై తగ్గింపు ప్రకటించిన చమురు సంస్థలు మరో వైపు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి. సరిగ్గా నెల రోజులు కూడా గడవకముందే మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచేశాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.100 వంతున చమురు కంపెనీలు ధర పెంచాయి. బుధవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తున్నట్టు ఏఎన్ఐలో కథనం ప్రచురితమైంది. దీనిపై చమురు కంపెనీలు ఇంకా నోరు విప్పలేదు. ఇంతకు ముందు నవంబరు 1న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.266 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర సగటున రూ.2000లకు అటుఇటుగా నమోదు అవుతోంది. సరిగ్గా నెల రోజుల వ్యవధి ఇచ్చి ఈసారి సిలిండర్ ధరను వంద రూపాయలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా సగటున సిలిండర్ ధర రూ.2100కి చేరుకుంది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు చిరు వ్యాపారులు, హోటళ్లు, స్ట్రీట్‌ఫుడ్ వెండర్లకు భారంగా మారింది. ఇప్పుడిప్పుడు ఆర్థిక పరిస్థితి కుదురుకుంటుందని భావించేలోగా వరుసగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. వ్యాపారంపై వస్తున్న అరకొర సంపాదన పెరుగుతున్న ధరలకే సరిపోతుందంటూ వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1905 ఉండగా పెరిగిన ధరలతో రూ.2005కి చేరుకుంది. చదవండి:భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధరలు -
‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లపై ఆయిల్ కంపెనీల దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) చార్జింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ మూడు కలసి రానున్న 3–5 ఏళ్లలో 22,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి.. 2070 నాటికి నెట్ జీరో (కాలుష్యం విడుదల పరంగా తటస్థ స్థితికి)కు చేరుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చమురు కంపెనీలు ఈ ప్రణాళికలతో ఉన్నాయి. ఇందులో ఒక్క ఐవోసీనే 10,000 పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ సదుపాయాలను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 7,000 స్టేషన్లలో ఈవీ చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్టు బీపీసీఎల్ ప్రకటించింది. హెచ్‌పీసీఎల్ 5,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది కాలంలోనే ఐవోసీ 2,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుందని.. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ చెరో 1,000 స్టేషన్లను ప్రారంభిస్తాయని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి మంగళవారం ప్రకటించారు. ఇటీవలే జరిగిన కాప్26 సదస్సులో భాగంగా నెట్‌జీరో లక్ష్యాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం తెలిసిందే. -
వరుసగా ఏడో రోజు పెంపు.. రూ. 120 దిశగా పెట్రోలు రేటు
పెట్రోలు ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో వరుసగా ఏడో రోజు కూడా పెట్రోలు ధరలు భగ్గుమన్నాయి. మరోసారి లీటరు పెట్రోలుపై 35 పైసల వంతున ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈసారి పెంపు నుంచి డీజిల్‌కి మినహాయింపు ఇచ్చాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ 114.47 కి చేరుకుంది. ఈ ఏడాదిలో రూ.27 పెట్రోలు ధరలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ ఏడాది జనవరి 1న లీటరు పెట్రోలు ధర రూ. 87.06 ఉండగా... ఇప్పుడు ఏకంగా రూ.114.37కి చేరుకుంది. జనవరి నుంచి మార్చి వరకు పెట్రోలు రేట్లు పెంచుకుంటూ పోయిన చమురు సంస్థలు బెంగాల్ ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్‌లో ధరల పెంపుకు విరామం ఇచ్చాయి. ఆ తర్వాత మే నుంచి జూన్ వరకు తాజాగా అక్టోబరులో ఎడాపెడా రేట్లు పెంచుతూ వస్తున్నాయి. -
ఈ దేశంలో పెట్రోలు చాలా చీప్.. లీటరు రూ.1.50 మాత్రమే!
Most Expensive and Cheapest Petrol and Diesel Prices Countries: పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల పేరుతో ఆయిల్ కంపెనీలు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న భారంతో పెట్రోలు, డీజిల్ రేట్లు లీటరకు వంద రూపాయలు ఎప్పుడో దాటేశాయి. కాన్నీ కొన్ని దేశాల్లో అగ్గిపెట్టె కంటే పెట్రోలు చాలా చీప్. మరి కొన్ని చోట్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే సామాన్యులు మోయలేని దశకు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా.. ఇంకా తమ ధరల దాహం తీరలేదన్నట్టుగా ఆయిల్ కంపెనీలు సంకేతాలు పంపుతున్నాయి. కానీ ఈ దేశంలో అగ్గిపెట్టె కొన్నంత ఈజీగా లీటరు పెట్రోలును కొనేయెచ్చు. ఆ దేశం పేరే వెనుజువెలా. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఈ లాటిన్ కంట్రీలో చమురు నిక్షేపాలు పుష్కలం. అమెరికా ఆయిల్ సరఫరాలు తీర్చడంలో ఈ దేశానిదే ముఖ్య పాత్ర. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలాడుతున్నా పెట్రోలు కష్టాలయితే ఆ దేశాన్ని చుట్టుముట్టలేదు. వెనుజువెలాలో లీటరు పెట్రోలు ధర 0.02 డాలర్లు మన కరెన్సీలో అక్షరాల కేవలం రూపాయిన్నర (రూ.1.50) మాత్రమే. చమురు నిల్వలు ఎక్కువగా ఉండటంతో ఈ దేశం అత్యంత చవగ్గా తమ పౌరులకు పెట్రోలు, డీజిల్ అందిస్తోంది. ఇక్కడయితే ఇంతే వెనుజువెలా తర్వాత పెట్రోలు అతి తక్కువ ధరకే అందిస్తున్న దేశంగా ఇరాన్ నిలిచింది. ఇక్కడ లీటరు పెట్రోలు ధర 0.06 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.4.51గా ఉంది. ఆ తర్వాత అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న సిరియాలో 0.23 డాలర్లు (రూ.17)గా పెట్రోలు ధర ఉంది. వీటి తర్వాత అంగోలా, అల్జేరియా, కువైట్, నైజీరియా, తుర్క్మెనిస్తాన్, ఖజకిస్తాన్, ఇథియోపియా దేశాల్లో 0.50 డాలర్ల లోపే అంటే రూ.40లోపే లీటరు పెట్రోలు వస్తోంది. అక్కడ మోత మోగుతోంది పెట్రోలు ధరలు చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటి స్థానం హంగ్కాంగ్ది. చైనాలో అంతర్భాగం అయినప్పటికీ పెట్రోలు విషయంలో ఇక్కడ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల హాంగ్‌కాంగ్‌లో లీటరు పెట్రోలు ధర 2.56 డాలర్లుగా నమోదు అవుతోంది. అంటే మన కరెన్సీలో లీటరు పెట్రోలు ధర రూ.192ల దగ్గరగా ఉంది. హాంగ్‌కాంగ్ తర్వాత స్థానంలో నెదర్లాండ్స్ 2.18 డాలర్లు (రూ.163), సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ 2.14 డాలర్లు (రూ.160)గా ఉన్నాయి. వీటి తర్వాత నార్వే, ఇజ్రాయిల్, డెన్మార్క్, మోనాకో, గ్రీస్, ఫిన్లాండ్, ఐస్లాండ్లలో లీటరు పెట్రోలు కొనాలంటే మన కరెన్సీలో రూ. 150కి పైగానే చెల్లించాలి. ఏడాదిన్నరలో రూ.36 పెరుగుదల కరోనా సమయంలో డిమాండ్, సప్లై మధ్య తేడాలు రావడంతో పెట్రోలు ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. దీని మధ్య సమతూకం పేరుతో ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం విధించింది. అప్పటి నుంచి మన దగ్గర ఎడాపెడా పెట్రోలు, డీజిల్ ధరలకు అదుపు లేకుండా పోయింది. 2020 మేలో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 75 దగ్గర ఉండగా ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.111లుగా ఉంది. దాదాపు ఏడాదిన్నర కాలంలో లీటరు పెట్రోలు ధర కనివినీ ఎరుగని రీతిలో పెరిగింది. మరీ ఈ వైరుధ్యం ఏంటో ? అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అంటూ కేంద్రం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 2014లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 109 డాలర్లుగా నమోదు అయ్యింది. అప్పుడు లీటరు పెట్రోలు ధర నికరంగా రూ. 71లుగా ఉంది. 2021 అక్టోబరులో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్లుగా ఉంది. కానీ ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ. 111 దగ్గర నమోదు అవుతోంది. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి : మళ్లీ పెంపుతో రికార్డు స్థాయికి ధరలు -
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
Petrol Diesel Prices Today: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు. ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్ ధరలు 15 సార్లు ఎగబాకాయి. తాజాగా దసరా తెల్లారి శనివారం లీటర్ పెట్రోల్ 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో ఇవాళ(అక్టోబర్ 16, శనివారం) లీటర్ డీజిల్ ధర రూ. 102.80, లీటర్ పెట్రోల్ ధర రూ.109.73కు చేరుకుంది. ఇక ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.105.49పై.లతో గరిష్టానికి చేరుకోగా, ముంబైలో రూ.111.43పై., డీజీల్ ధర ఢిల్లీలో డీజీల్ లీటర్ ధర. రూ.94.22పై., ముంబైలో రూ.102.15పై.కు చేరుకుంది. చెన్నైలో పెట్రోల్ ధర102.70పైసలుగా, డీజీల్ రూ. 98.59పైసలుగా ఉంది. అక్టోబర్ 12, 13 తేదీల్లో పెట్రో రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులకు మళ్లీ హ్యాట్రిక్ రోజుల పెంపు కంగారుపుట్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. చదవండి: గ్యాస్ సిలిండర్ పేలుళ్లు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సురక్షితం