ఇంధన ధరలు: 16 రోజుల్లో రూ.8 మేర పెంపు | Petrol Diesel Rates Hiked By Rs 8 In Continuous 16th Day | Sakshi
Sakshi News home page

16వ రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Published Mon, Jun 22 2020 8:13 AM | Last Updated on Mon, Jun 22 2020 8:26 AM

Petrol Diesel Rates Hiked By Rs 8 In Continuous 16th Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 16వ రోజు పెరిగాయి. సోమవారం పెట్రోల్‌పై 33 పైసలు, డీజిల్‌పై 55 పైసలను చమురు సంస్థలు పెంచాయి. దీంతో గత 16 రోజుల్లో పెట్రోల్‌పై రూ.8.36 పైసలు, డీజిల్‌పై రూ.8.82 పైసలు ధరలు పెరిగాయి. రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెంచిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పరిశీలిస్తే..

లీటర్‌ పెట్రోల్‌ ధర : 
చెన్నైలో 82.58 రూపాయలు
బెంగుళూరు 81.81 రూపాయలు
ఢిల్లీలో  79.23 రూపాయలు
కోల్‌కతా 80.95 రూపాయలు
ముంబైలో 86.04 రూపాయలు
హైదరాబాద్‌లో 82.25 రూపాయలు

లీటర్‌ డీజిల్‌ ధర :
చెన్నైలో 75.80 రూపాయలు
బెంగుళూరు 74.43 రూపాయలు
ఢిల్లీలో 78.27 రూపాయలు
కోల్‌కతాలో 73.61 రూపాయలు
ముంబైలో 76.69 రూపాయలు
హైదరాబాద్‌లో 7.49 రూపాయలకు చేరుకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement