fuel price hike
-
కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెట్రోల్ ధరలు పైపైకి
భారతదేశంలో ఇంధన (పెట్రోల్, డీజిల్) ధరలను తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ తరుణంలో పంజాబ్ ప్రభుత్వం షాకిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది. కొన్ని రోజులకు ముందు కర్ణాటక, గోవా రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదే బాటలో పంజాబ్ ప్రభుత్వం కూడా అడుగులు వేసింది.పెట్రోల్, డీజిల్‌పై వ్యాల్యూ యాడెడ్ ట్యాక్ (వ్యాట్) పెంచుతూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి పంజాబ్ క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్: విశేషాలుక్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెట్రోల్‌పై వ్యాట్‌ను లీటర్‌కు 61 పైసలు, డీజిల్‌పై 92 పైసలు పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాట్ని పెంచడం వల్ల డీజిల్‌పై రూ. 395 కోట్లు, పెట్రోల్‌పై రూ.150 కోట్ల ఆదాయం పెరుగుతుందని చీమా స్పష్టం చేశారు. -
ప్రపంచంలోనే పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించిన ఏకైక దేశం భారత్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. గడిచిన రెండేళ్లలో ప్రపంచంలోనే ఫ్యూయల్ ధరలు తగ్గిన దేశం ఏదైనా ఉందంటే అది మన దేశమేనని సూచించారు. ఇదంతా ప్రధాని మోదీ ఘనతేనని తెలిపారు. సీఎన్ఎన్-ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. ధరల కట్టడిలో ప్రధాని మోదీ పరిపాలన అద్భుతంగా ఉందన్నారు. దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు రోజుకు మూడు పూటల రేషన్ బియ్యం అందిస్తూనే మోదీ ఇంధన ధరల్ని తగ్గించగలిగారని పునరుద్ఘాటించారు. మోదీ నిర్ణయం..తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు అంతేకాదు రెండు ఏళ్లే కాలంలో ప్రపంచంలో ఇంధన ధరలు తగ్గిన దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉందని తెలిపారు. గత కొన్నేళ్లుగా డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ కొరత ఏర్పడిన సందర్భం ఒక్కటి కూడా లేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీ నవంబర్ 2021, మే 2022 సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. ఆ నిర్ణయం వల్ల పెట్రోల్ ధర 13 రూపాయలు, డీజిల్ ధర రూ.16 రూపాయలకు తగ్గింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను సైతం తగ్గించాయని అన్నారు. భారత్‌లో ధరలు స్థిరంగా వరల్డ్ వైడ్‌గా ధరలు పెరిగిపోతుంటే భారత్‌లో ధరలు నియంత్రణలో ఉన్నాయి. శ్రీలంక ధరలు 60-70 శాతం పెరిగాయి. పాకిస్తాన్లో ధరలు అదుపు లేకుండా పెరిగాయి. అమెరికా, పశ్చిమ యూరప్, కెనడాలలో 25 శాతం నుంచి 40 శాతం మధ్య పెరిగాయి. కానీ భారత్‌లో మాత్రం ధరలు తగ్గాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గుతాయా? రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గుర్తు చేశారు. తాను ఏ ప్రకటన చేసినా అది ఎన్నికల ఉల్లంఘనే అవుతుందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తన ప్రసంగాన్ని ముగించారు. -
Electric Vehicles Burst Incidents: మంటల్లో ఈవీ.. సమాధానాలేవీ...?
ఓ వైపు పెట్రోల్ రేట్ల మంట మరోవైపు కరోనాతో దెబ్బతిన్న వినియోగదారుల కొనుగోలు శక్తి...ఈ నేపధ్యంలోనే భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో పెను విప్లవం చోటు చేసుకుంటుంది. విద్యుత్, వాహనాల పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఈ మార్కెట్ 2021లో మూడు రెట్లు పెరగడం ఈ– వెహికల్ పరిశ్రమకు ఓ టర్నింగ్ పాయింట్‌గా కూడా నిలిచింది. ఈ– పరిశ్రమ 2022 సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఎన్నో రెట్ల వృద్ధిని సాధించింది. వినియోగదారులలో అవగాహన పెరగడంతో పాటుగా అమ్మకాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు భారత దేశంలో అమ్ముడవుతున్న ప్రతి 10స్కూటర్లలో ఒకటి ఈవీ స్కూటర్ అని రవ్నీత్ చెబుతూ, గత 12 నెలల కాలంలో ఈ రంగంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. నాణేనికి మరోవైపు...? ఇలా ఈవీల పట్ల దేశవ్యాప్తంగా పెరిగిన ఆసక్తి ఈ– పరిశ్రమకు నూతనోత్తేజం అందిస్తుంటే... మరోవైపు ఇటీవలి కాలంలో విద్యుత్ వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురై తగులబడిన సంఘటనలు జరిగాయి. ఇవి వినియోగదారులలో అనేక ఆందోళనలకూ సందేహాలకూ దారి తీశాయి. ఇది పరిశ్రమ వృద్ధికి ప్రతికూలంగానూ మారుతోందనే భయాందోళన వాహన పరిశ్రమలోనూ చోటు చేసుకుంది. ఈవీలలో ఎదురవుతున్న సమస్యలకు తక్షణమే తగిన పరిష్కారాలను కనుగొనకపోతే అది దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశముందనే ఆందోళనతో ఉత్పత్తిదారులు ఏకీభవిస్తున్నారు. బ్యాటరీ కీలకం... ఈవీ వాహన వృద్ధిలో బ్యాటరీ అభివృద్ధి అత్యంత కీలకం, వినియోగదారుల భద్రతను పరిగణలోకి తీసుకుని బ్యాటరీల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఈవీలకు గుండె లాంటి బ్యాటరీ ఒక్కటి బాగుంటే ఈవీ చాలా వరకూ బాగున్నట్లే. అయితే ఈవీలలో బ్యాటరీలు విఫలం కావడానికి ప్రధాన కారణం మన దేశ పరిస్ధితులకనుగుణంగా వాటిని ఓఈఎంలు డిజైన్ చేయకపోవడమేనని తాజాగా నిపుణులు విశ్లేషించారు. ఈవీ పరిశ్రమలో వేగవంతమైన వృద్ధిని చూసి తగిన అవగాహన లేని వారు కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నారు. ఇలాంటి వారు భారతీయ పరిస్థితులకనుగుణంగా డిజైనింగ్, టెస్టింగ్, వాలిడేషన్ చేయకపోవడం పెద్ద సమస్యగా మారింది. భారతీయ వాతావరణ పరిస్ధితులు దృష్టిలో పెట్టుకుని మెరుగైన ప్రమాణాలను ప్రతి ఓఈఎం నిర్ధేశించుకుంటే ఈ సమస్య ముగిసే అవకాశాలున్నాయని ఓ నిపుణుడు అభిప్రాయపడ్డారు.దేశంలో పెరిగే ఉష్ణోగ్రతలు ఈవీలు తగలబడటానికి కారణం కాదంటూ ఉష్ణోగ్రతలు పెరిగితే వాహన సామర్ధ్యం దెబ్బతింటుందన్నారు. అమ్మకాలపై మంటల ప్రభావం లేదు... ఇటీవలి కాలంలో ఈవీల పరంగా కొన్ని దురుదృష్టకర సంఘటనలు జరిగినా అమ్మకాల పరంగా క్షీణత ఏమీ లేదన్నారు. వాహనాల ఉత్పత్తిసంస్థ ఎథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఎస్ ఫోఖేలా. అయితే ఈ సమస్యలకు వెంటనే ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఎథర్ ఎనర్జీ ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్, టెస్టింగ్ పై తీవ్ర పరిశోధనలు చేసిందంటూ విభిన్న భారతీయ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తమ వాహనాలను డిజైన్ చేశామన్నారు రవ్నీత్. సేఫ్టీ అనేది తమ దగ్గర కేవలం చెక్‌బాక్స్ ఐటెమ్ కాదని అది తమకు అది అతి ప్రధానమైన ఎంపికన్నారు. తమ మొదటి వాహనం 2018లో విడుదల చేయడానికి ఐదేళ్ల ముందుగానే బ్యాటరీ ప్యాక్‌లను తాము నిర్మించామన్నారు. తమ స్కూటర్లను ఒక లక్ష కిలోమీటర్లకు పైగా పరీక్షించడం జరిగిందంటూ అత్యంత కఠినమైన ప్రమాణాలను తాము అంతర్గతంగా నిర్ధేశించుకున్నామన్నారు. తాము బ్యాటరీ ప్యాక్‌లను ఇతరుల వద్ద కొనుగోలు చేయమంటూ, తామే వాటిని ఫ్యాక్టరీలో తయారుచేస్తున్నామన్నారు. ఓ స్టార్టప్ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ త్వరలోనే 4వ తరపు బ్యాటరీ ప్యాక్ విడుదల చేయబోతున్నామని ప్యాక్ లెవల్లో 120 పరీక్షలు, వాహన స్ధాయిలో దాదాపు 800 పరీక్షలు చేస్తామని, ఇవి కాకుండా మరిన్ని పరీక్షలు కూడా చేస్తున్నామన్నారు. అని రవ్నీత్ అన్నారు. నాణ్యత పట్ల సరిగా శ్రద్ధ పెట్టకపోవడం, డిజైనింగ్ లోపాలు కూడా సమస్యకు కారణమవుతుందన్నారు. జాగ్రత్తగా ఎంచుకోవాలి... ఈవీలు తగలబడుతున్న కాలం, పెరుగుతున్న పెట్రో ధరల నేపథ్యంలో ఈవీలను ఎలా ఎంచుకోవాలనేది ప్రశ్నే అయినా కాస్త శ్రద్ధ పెడితే వీటిని ఎంచుకోవడం తేలికేనన్నారు రవ్నీత్. సవారీ చేసిన వెంటనే ఈవీలకు చార్జింగ్ పెట్టకూడదు, చార్జింగ్ పూర్తయిన వెంటనే ప్లగ్ తీసేయాలి లాంటి సూచనలన్నీ వాహన డిజైనింగ్ సరిగా లేని పరిస్థితుల్లోనే వస్తాయన్నారు. బ్యాటరీ ప్యాక్ ట్యాంపర్ చేయకుండా ఉండటం, నాణ్యమైన, అధీకృత చార్జర్లు వాడటం, వాహనాలు రెగ్యలర్‌గా సర్వీస్‌చేయించడం చేస్తే సమస్యలు రాకుండా పనిచేస్తాయని ఆయన సూచిస్తున్నారు. -
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
‘డైనమిక్’గా టీఎస్ఆర్టీసీ.. డీజిల్ ధర తగ్గితే బస్సు చార్జీలు తగ్గిస్తారా?
సాక్షి, హైదరాబాద్: డైనమిక్ ఫేర్ విధానం.. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు చార్జీలు పెంచుకోవడం ఎయిర్‌లైన్స్ సంస్థల్లో చూస్తుంటాం. పండుగల సమయాల్లో చార్జీలు రెట్టింపు చేసి వసూలు చేయటం ప్రైవేటు బస్సు ఆపరేటర్లకూ కొట్టినపిండే. ఇప్పుడు డీజిల్ ధరల విషయంలో ఆ తరహా విధానాన్ని అనుసరించే దిశలో టీఎస్ఆర్టీసీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే డీజిల్ సెస్ కొత్త చార్జీల పెంపు విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. టికెట్‌పై బస్సు కేటగిరీ వారీగా రూ.5, రూ.10 చొప్పున సెస్ విధించింది. ఇప్పుడు ఇందు లో ‘డైనమిక్’ విధానాన్ని తేవాలని భావిస్తోంది. డీజిల్ ధర భారీగా పెరిగినప్పుడల్లా ఈ సెస్‌నూ తదనుగుణంగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ ధర స్థిరంగా ఉంది. కొద్దిరోజుల క్రితం వారంలో మూడునాలుగు పర్యాయాలు పెరిగింది. మళ్లీ ఆ పరిస్థితి వస్తే డీజిల్ సెస్‌ను సవరించే లా ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. చదవండి👉 ఆల్‌నైన్ నెంబర్ @ రూ.4.49 లక్షలు సెస్‌ను ఎంత పెంచాలన్న విషయంలో నిర్ణ యం కూడా తీసుకునట్లు తెలుస్తోంది. నిజానికి ఆర్టీసీ కొనే బల్క్ డీజిల్ ధర రూ.119కి చేరింది. కొద్ది రోజుల్లోనే రిటైల్ ధర దానికి చేరువవుతుందన్న హెచ్చరికలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా డైనమిక్ ఫేర్ విధానంలో డిమాండ్ లేనప్పుడు టికె ట్ధర తగ్గించడం కూడా భాగమే. మరి డీజిల్ ధర లు తగ్గితే సెస్‌ను ఆర్టీసీ తగ్గిస్తుందేమో చూడాలి. చదవండి👉🏼 గుడ్‌న్యూస్.. సిటీబస్సు @ 24/7 -
పెట్రోల్ ధరలు చాలా తక్కువ పెంచాం: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు అతి తక్కువగా పెరిగాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రాలతో కేంద్రం సంబంధాలు సాగిస్తోందని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో చమురు ధరలు 30 శాతం మాత్రమే పెరిగాయని, 80 శాతం కాదని తెలిపారు. ‘దశాబ్దాలుగా బేసిక్ శాలరీలు పెరిగాయి. వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఉచిత పథకాలను అందిస్తోంది. కరోనా సంక్షోభం నుంచి మనం ఇంకా కోలుకోలేదు. దేశంలో 80 కోట్ల మందికి ఇప్పటికీ ఆహారం అందిస్తున్నాం. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య కారణంగా చమురు ధరలు బ్యారెల్‌కు 19.56 నుంచి 130 డాలర్లకు పెరిగాయి. కేంద్రం పెట్రోల్-డీజిల్‌పై రూ.32 ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తోంది. దీపావళికి ముందు ఎక్సైజ్ సుంకం తగ్గించాం. దీంతో చమురు ధరలు తగ్గాయి. (క్లిక్: ప్యాసింజర్ రైళ్ల రద్దు.. ఆలస్యం! కారణం ఏంటంటే..) ఇంధన ధరల తగ్గింపు విషయంలో కేంద్రం తన బాధ్యతను స్వీకరించింది. రాష్ట్రాలు కూడా తమ బాధ్యతను నిర్వర్తించాలి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు 0.2 శాతానికి మించిలేవు. నిబంధనలు ఒప్పుకుంటే ఎక్కువ శాతం ముడి చమురు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశ ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడబోమ’ని హర్దీప్ సింగ్ పూరి అన్నారు. (క్లిక్: ఢిల్లీకి సర్కార్‌కు బొగ్గు కష్టాలు.. 24 గంటల విద్యుత్ డౌటే!) -
ఇంధన ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..!
రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. కానీ భారత్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఉండడంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాగా గత 13 రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇంధన ధరల పెంపుతో సామాన్యులపై భారీ ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. కాగా పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. భారత్‌లోనే తక్కువ..! పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల చాలా తక్కువని అన్నారు. లోక్‌సభలో మంగళవారం హర్దీప్ సింగ్ పూరి ఇంధన ధరలపై మాట్లాడారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో పెరిగిన ఇంధన ధరలు కేవలం 1/10 వంతుగా ఉన్నాయని వెల్లడించారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి మధ్య కాలంలో పెట్రోల్ ధరలు.. అమెరికాలో 51 శాతం, కెనడాలో 52 శాతం, జర్మనీలో 55 శాతం, యుకేలో 55 శాతం, ఫ్రాన్స్‌లో 50 శాతం, స్పెయిన్‌లో 58 శాతం పెరిగాయని పేర్కొనారు.కాగా భారత్‌లో కేవలం 5 శాతం మాత్రమే ఇంధన ధరలు పెరిగాయని వెల్లడించారు. చదవండి: గత 4 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇళ్ల విక్రయాలు..! హైదరాబాద్‌లో ఎలా ఉందంటే..? -
భారత్‌కు రష్యా ఓపెన్ ఆఫర్, డిస్కౌంట్లో ఆయిల్ కొంటే తప్పేంటట!
రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తుంది. ఆ కొనుగోళ్లు అమెరికాతో పాటు పలు మిత్ర దేశాలకు మింగుడు పడడం లేదు. అందుకే తమని కాదని రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తే భారత్‌పై ఆంక్షలు విధిస్తామనే హెచ్చరికలు పంపుతుంది. ఈ నేపథ్యంలో రష్యా- భారత్‌ల మైత్రిపై ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్న అమెరికాకు భారత్ గట్టిగానే బదులిస్తున్నట్లు తెలుస్తోంది. 'డిస్కౌంట్‌కే ముడి చమురు ఇస్తామని రష్యా అంటుంది. దేశం కోసం రష్యా నుంచి చమరును కొనుగోలు చేస్తే తప్పేంటని' ప్రశ్నించారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. ఏప్రిల్ 1న జరిగిన 'ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్' కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేసింది. ఆ కార్యకలాపాలు కొనసాగుతాయి. పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అధ్యక్షతన మరింత చమురు ఉత్పత్తుల్ని సేకరించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారని' అన్నారు. చమురు ఉత్పత్తుల కొనుగోళ్లపై రష్యా డిస్కౌంట్లు అందిస్తుంది. ఈ ప్రోత్సహాకాలతో రష్యా నుంచి ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం రష్యా ఒక్కో బ్యారల్‌పై భారత్‌కు 35 డాలర్ల డిస్కౌంట్ ఇస్తుందని, యుద్ధానికి ముందే చమరు బ్యారెల్ కొనుగోళ్ల గురించి ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయినా “నేను నా జాతీయ ప్రయోజనాలకే మొదటి స్థానం ఇస్తాను. నా ఇంధన భద్రతకు మొదటి స్థానం ఇస్తాను. డిస్కౌంట్లో ముడి చమురు అందుబాటులో ఉంటే ఎందుకు కొనుగోలు చేయకూడదు. అలా చేస్తే తప్పేంటని అర్ధం వచ్చేలా కేంద్రం ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చదవండి: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్‌కు భారీ షాక్! -
పెట్రోల్,డీజిల్‌ను తెగ వాడేస్తున్నారు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మార్చి నెలలో ఇంధన విక్రయాలు కోవిడ్ ముందస్తు స్థాయికి చేరాయి. మహమ్మారి సంబంధిత పరిమితుల ఎత్తివేతతో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ధరలు పెరిగే అవకాశం ఉందని విక్రేతలు, వినియోగదార్లు ముందస్తుగా నిల్వ చేయడమూ ఇందుకు కారణం. డీలర్లు తక్కువ ధరకు ఇంధనాన్ని కొనుగోలు చేసి, సవరించిన అధిక ధరలకు విక్రయించడం ద్వారా త్వరగా డబ్బు సంపాదించాలని ఆశించారు. గడిచిన రెండేళ్లలో డీజిల్ విక్రయాలు అధికంగా నమోదైంది మార్చి నెలలోనే. అయిదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు 137 రోజులు స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు కాగానే ధరలు పెరుగుతాయన్న అంచనాతో మార్చి మొదటి రెండు వారాల్లో డీలర్లు, ప్రజలు పెట్రోల్, డీజిల్‌ను విరివిగా కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో వినియోగం పెట్రోల్ 17.3, డీజిల్ 22.3 శాతం అధికమైంది. ధరల సవరణ మార్చి 22 నుంచి మొదలైంది. ధరలు పెరగడం మొదలు కావడంతో వినియోగం తగ్గుముఖం పట్టింది. ఇవీ గణాంకాలు.. ప్రభుత్వ రంగ సంస్థలు మార్చి నెలలో 2.69 మిలియన్ టన్నుల పెట్రోల్‌ను విక్రయించాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.7 శాతం, 2019తో పోలిస్తే 14.2 శాతం అధికం. మొత్తం అమ్మకాల్లో ఈ సంస్థల వాటా ఏకంగా 90 శాతముంది. డీజిల్ విక్రయాలు 10.1 శాతం పెరిగి 7.05 మిలియన్ టన్నులుగా ఉంది. 2019 మార్చితో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. మార్చి 1–15 మధ్య అమ్మకాలు పెట్రోల్ 18 శాతం, డీజిల్ 23.7 శాతం దూసుకెళ్లాయి. 2020తో పోలిస్తే గత నెలలో జరిగిన విక్రయాలు పెట్రోల్ 38.6 శాతం, డీజిల్ 41.6 శాతం అధికం. ఇక విమానాల్లో వాడే ఇంధనం 9.8 శాతం దూసుకెళ్లి మార్చిలో 4,91,200 టన్నులకు చేరింది. కోవిడ్ ముందస్తు స్థాయితో పోలిస్తే 27.6 శాతం వెనుకబడి ఉంది. 2020 మార్చితో పోలిస్తే 7.5 శాతం ఎక్కువ కావడం విశేషం. ఎల్పీజీ అమ్మకాలు 12 శాతం అధికమై గత నెలలో 2.53 మిలియన్ టన్నులకు చేరింది. -
Sakshi Cartoon: ప్రస్తుతం పెట్రోల్ ధరలు తగ్గించే పథకం ఏదన్నా ఉంటే తప్ప ఏ పథకాల్ని..
ప్రస్తుతం పెట్రోల్ ధరలు తగ్గించే పథకం ఏదన్నా ఉంటే తప్ప ఏ పథకాల్ని ప్రజల్లోకి తీసుకుపోలేం! -
Sakshi Cartoon: ..కాస్త ఓపిక పట్టు చాలు!
..కాస్త ఓపిక పట్టు చాలు! -
అంతా తల్లకిందులు.. అగ్గువ ఏడ దొరుకుతది?
సాక్షి, హన్మకొండ: డీజిల్ టోకు లెక్కన కొనే ఆర్టీసీకి కొత్త చిక్కొచ్చిపడ్డది. ఆయిల్ కంపెనీలు బల్క్ విక్రయాల రేట్లు పెంచాయి. దీంతో తక్కువ ధరకు డీజిల్ అందించే ప్రైవేట్ బంకుల కోసం ఆర్టీసీ వేట ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కో డిపోలో వందకు పైగా బస్సులున్నాయి. టీఎస్ ఆర్టీసీ డిపోలోనే సొంతంగా డీజిల్ బంక్‌లు ఏర్పాటు చేసుకుంది. బయటి మార్కెట్లో బంకులకు సరఫరా చేసినట్లుగానే హోల్‌సేల్ ధరలకు ఆయిల్ కంపెనీలు ఆర్టీసీకి డీజిల్ అందించేవి. కానీ.. ఉన్నట్లుండి ఒక్కసారిగా బల్క్ డీజిల్ కొనుగోలు చేస్తున్న సంస్థలకు ఆయిల్ కంపెనీలు ధరలు అమాంతం పెంచాయి. బల్క్ ధర లీటర్‌కు రూ.96.50కి పెంచినట్లు సమాచారం. బయటి బంకుల్లో రిటైల్ ధర లీటర్‌కు రూ.94.14 ఉంది. మన దగ్గర ఇలా.. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 9 డిపోలున్నాయి. హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ డిపోల ఆధ్వర్యంలో రిటైల్ డీజిల్ బంకులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూడు డిపోల బస్సులు ఆర్టీసీ నిర్వహిస్తున్న రిటైల్ డీజిల్ బంకుల్లో ఇంధనాన్ని నింపుకుంటున్నాయి. మిగతా వరంగల్–1, వరంగల్–2, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, తొర్రూరు డిపోల బస్సుల్లో ఇంధనాన్ని నింపేందుకు ఈ డిపోల పరిధిలో బంకులను గుర్తించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆలస్యమైతే ఆర్టీసీపై భారం పడనుండడంతో వీలైనంత త్వరగా ప్రైవేట్ బంకులను ఎంపిక చేసే పనిలో కమిటీ ముందుకు సాగుతోంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ డివిజనల్ మేనేజర్ల ఆధ్వర్యంలో కమిటీ ప్రైవేటు బంకులను గుర్తించే పనిలో ఉంది. వరంగల్ రీజియన్‌లో 952 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఇందులో సంస్థ సొంత బస్సులు 584, అద్దె బస్సులు 368 ఉన్నాయి. (చదవండి: డబ్బు ఇవ్వలేదని.. జబ్బు అంటగట్టింది) 952 బస్సులకు ఆయా డిపోల్లోని సంస్థ సొంత బంకుల్లోనే డీజిల్ నింపేవారు. వరంగల్ రీజియన్‌లో దాదాపు రోజుకు 67,500 లీటర్ల డీజిల్ అవసరం. లీటర్‌కు రూ.2.36 మిగిలితే. 67,500 లీటర్లకు రూ.1,59,300 సంస్థకు ఆదా కానుంది. బల్క్ కొనుగోలుదారులకు ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడంతో సంస్థ సొంత బస్సులతోపాటు అద్దె బస్సులకు కూడా ప్రైవేట్ బంకులే దిక్కయ్యాయి. గతంలోనూ ఇదే పద్ధతి.. 2011–12 ఆర్థిక సంవత్సరం చివర్లో ఆయిల్ కంపెనీలు బల్క్ డీజిల్ ధరలు పెంచాయి. దీంతో ఆరు నెలలపాటు ప్రైవేటు డీజిల్ బంకుల్లో ఆర్టీసీ ఇంధనాన్ని నింపుకుంది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేట్ బంకుల వైపు ఆర్టీసీ చూస్తోంది. రిటైల్ ధరలోనూ కాస్త తగ్గించి ఆర్టీసీకి డీజిల్ అందించే బంకుల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రైవేటు బంకుల యజమానులను కలిసి మాట్లాడుతున్నారు. డివిజనల్ మేనేజర్, రీజినల్ అకౌంట్స్ ఆఫీసర్, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఎస్ఎస్ఐ, సంబంధిత డిపో మేనేజర్‌తో కూడిన కమిటీ ప్రైవేట్ డీజిల్ బంకులను ఎంపిక చేయనుంది. ఈ కమిటీ ఆయా డిపోల పరిధిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తుంది. వారం రోజుల్లోపు ప్రైవేట్ బంకులను ఖరారు చేసే పనిలో కమిటీ నిమగ్నమైంది. (చదవండి: ఇబ్రహీంపట్నంలో కాల్పుల ఘటన: ఇద్దరి మృతి) -
ఏవియేషన్ సెక్టార్‌కి భారీ షాక్ ! విమాన రంగం ఇప్పట్లో కోలుకునేనా ?
మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అయ్యింది ఏవియేషన్ సెక్టార్ పరిస్థితి. కరోనా ఎఫెక్ట్‌తో గత రెండేళ్లుగా నష్టాలతో కునారిళ్లుతున్న విమానయాన రంగం, ఈ బడ్జెట్లో తమకేమైనా ఉద్దీపనలు లభిస్తాయనే ఆశతోంది. కానీ ఏవియేషన్ సెక్టార్ ఆశలపై నీళ్లు కుమ్మరించింది కేంద్రం. అనూహ్యంగా ఏవియేషన్ ఫ్యూయల్ ధర 8.5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభించినా తర్వాత విమనా ప్రయాణాలపై ఆంక్షలు వచ్చాయి. మరోవైపు ప్రజలు సైతం ప్రయాణాలు మానుకున్నారు. దీంతో ఏవియేషన్ సెక్టార్లో డిమాండ్ తగ్గిపోయింది. దాదాపు అన్ని సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయి. ఈ సమయంలో విమానాల్లో ఉపయోగించే వైట్ పెట్రోలు ధరలను 8.5 శాతం పెంచడం విమానయాన సంస్థలను ఇరకాటంలో పెట్టింది. ఇప్పటికే డిమాండ్ తగ్గిపోయిన తరుణంలో టిక్కెట్ల రేట్లను పెంచాలా ? లేక పెరిగిన ఛార్జీలను భరించాలా ? అనేది ఆ సంస్థలకు కష్టంగా మారనుంది. గతేడాది మే నుంచి కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోయింది. కేవలం నాలుగు నెలల కాలంలోనే అంతర్జాతీయ చమురు ధరల వంకతో లీటరు పెట్రోలు, డీజిల్‌లపై సగటున రూ.25 వంతున పెంచింది. దీంతో కేంద్రంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కంటి తుడుపు చర్యగా 2021 నవంబరులో లీటరు పెట్రోలు, డీజిల్‌లపై రూ.5 ధర తగ్గించింది. తాజాగా రష్యా, ఉక్రెయిన్ వివాదం తెర మీదికి వచ్చాక.. మరోసారి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. దీనికి తగ్గట్టుగా సాధారణ ఫ్యూయల్ ధరలు పెంచే అవకాశం లేకపోవడంతో వైట్ పెట్రోల్ ధరలు పెంచింది. -
వాహనదారులకు బంపరాఫర్, ఫ్రీగా 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ పొందొచ్చు
దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు తలకు మించిన భారంగా మారింది. దీంతో వాహనదారులు ఇంధన వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోవెహికల్స్ వాహనదారుల్ని అట్రాక్ట్ చేసేందుకు ఆయా సంస్థలు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా హెచ్డీఎఫ్సీ, ఇండియన్ ఆయిల్ సంస్థలు సంయుక్తంగా ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ ఆఫర్‌ను వినియోగించుకున్న వాహనదారులు సంవత్సరానికి 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఉచితంగా పొందవచ్చు. అయితే ఇప్పుడు ఆ ఆఫర్ ఏంటో తెలుసుకుందాం? ►ఇండియన్ ఆయిల్ అవుట్లెట్లలో ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో పెట్రోల్, డీజిల్‌పై ఖర్చుచేస్తే అందులో 5శాతం ఫ్యూయల్ పాయింట్లుగా సంపాదించవచ్చు. తద్వారా సంవత్సరానికి 50లీటర్లను పెట్రోల్ లేదా డీజిల్‌ను ఉచితంగా పొందవచ్చు. ►మొదటి 6 నెలల్లో నెలకు గరిష్టంగా 250 ఫ్యూయల్ పాయింట్లు, కార్డ్ జారీ చేసిన 6 నెలల తర్వాత గరిష్టంగా 150 ఫ్యూయల్ పాయింట్లను సంపాదించవచ్చు. ►5శాతం కిరాణా, బిల్లు చెల్లింపులపై ఫ్యూయల్ పాయింట్లు లభిస్తాయి. ►ప్రతి కేటగిరీలో నెలకు గరిష్టంగా 100 ఫ్యూయల్ పాయింట్లను పొందవచ్చు. ►క్రెడిట్ కార్డ్‌తో ఇతర కొనుగోళ్లపై ఖర్చు చేసే ప్రతి రూ.150కి 1 ఫ్యూయల్ పాయింట్‌ని పొందవచ్చు ►ఈ ఆఫర్లో అదనంగా 'ఇండియన్ ఆయిల్ ఎక్స్ట్రా రివార్డ్స్ టీఎం' ప్రోగ్రామ్‌లో మెంబర్షిప్ పొందవచ్చు.ఇలా ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు వినియోగించడం ద్వారా వచ్చే రివార్డ్ పాయింట్స్ వాహనదారులు సంవత్సరానికి 50 లీటర్ల పెట్రోల్, లేదా డీజిల్‌ను ఉచితంగా పొందవచ్చు' అని ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ సంస్థలు తెలిపాయి. మరిన్ని వివరాల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను సందర్శించాల్సి ఉంటుంది. చదవండి: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..! -
పెట్రోల్ ధరల ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు
India's Retail Inflation Rose to 4.48 Per Cent in October 2021: పెట్రోలు ధరల ఎఫెక్ట్‌తో అక్టోబరులో నిత్యవసర వస్తువుల ధరలు భగ్గుమన్నాయి. గత ఆరునెలలుగా అదుపులోకి వస్తున ద్రవ్యోల్బణం అక్టోబరులో పెంచిన ధరలతో ఒక్కసారిగా గాడి తప్పింది. రాయిటర్స్ సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై రాయిటర్స్ వార్తా సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలతో నవంబరు 8, 9 తేదీల్లో సర్వే చేపట్టింది. అదేవిధంగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డేటాతో వాటిని క్రోడీకరించి సర్వే ఫలితాలను విడుదల చేసింది. కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతూ ద్రవ్యోల్బణం సెప్టెంబరు నాటికి తగ్గిపోతూ వచ్చింది 4.35 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత వచ్చే నెలల్లో ఇది మరింతగా తగ్గవచ్చనే అంచనాలు ఉన్న తరుణంలో అక్టోబరులో పెట్రోలు, డీజిల్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో అదుపులోకి వస్త్తున్న ద్రవ్యోల్బణం కాస్తా మరోసారి పైకి చేరుకుంది. అక్టోబరులో రిటైల్ ఇన్‌ఫ్లాషన్ (చిల్లర ద్రవ్యోబ్బణం) ఏకంగా 4.48 శాతానికి చేరుకుంది. అయితే రిజర్వ్‌బ్యాంక్ లెక్కల ప్రకారం ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్యన ఉంటే పర్వాలేదని చెబుతున్నాయి. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల భారం నిత్యవసర వస్తువుల ధరలపై నేరుగా ప్రభావం చూపించింది. ఫుడ్ ప్రైజ్ ఇండెక్స్ సెప్టెంబరులో 0.68 శాతం ఉండగా అక్టోబరు ఫ్యూయల్ ఛార్జీల పెంపుతో ఒక్కసారిగా 0.85 శాతానికి చేరుకుంది. ఇక ఫ్యూయల్ లైట్ కేటగిరిలో ద్రవ్యోల్బణం ఏకంగా 14.35 శాతానికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంకు లెక్కలను మించి మరీ ఫ్యూయల్లో ద్రవ్యోల్బణం పెరిగి పోవడంతో కేంద్రం దిగి వచ్చి లీటరు పెట్రోలుపై రూ.5 డీజిల్‌పై రూ,.10 వంతున ఛార్జీలు తగ్గించింది. -
పెట్రోలు ధరలకు పరిష్కారం.. సీఎన్జీ వైపు మారుతి చూపు
న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోలు ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే ఇండియాలో నంబర్ వన్ ఆటోమొబైల్ కంపెనీ మారుతి భిన్నమైన మార్గం ఎంచుకుంది. సీఎన్జీకే మొగ్గు సీఎన్జీ మోడళ్ల సంఖ్యను పెంచాలని వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకి నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సీఎన్జీ మోడళ్లకు గిరాకీ రావడంతో కంపెనీ సీఎన్జీ వైపు మళ్లింది. మరిన్ని మోడల్స్ త్వరలో కొత్తగా మరో నాలుగు మోడళ్లకు సీఎన్జీ శ్రేణిని విస్తరించనున్నట్టు సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. ‘ప్రస్తుతం ఎనిమిది మోడళ్లకు సీఎన్జీ వేరియంట్స్ ఉన్నాయి. భవిష్యత్‌లో మరిన్ని సీఎన్జీ మోడల్స్ అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం పెండింగ్‌లో 2.8 లక్షల యూనిట్లు ఉన్నాయి. ఇందులో 1.1 లక్షల యూనిట్లు సీఎన్జీ వేరియంట్లే. ఒక్కో కిలోమీటర్‌కు పెట్రోల్, డీజిల్ వాహనమైతే రూ.5 ఖర్చు అవుతోంది. అదే సీఎన్జీ అయితే రూ.1.7 మాత్రమే. దేశవ్యాప్తంగా 260 నగరాలు, పట్టణాల్లో 3,400 సీఎన్జీ స్టేషన్స్ ఉన్నాయి’ అని వివరించారు. -
బైకు కంటే విమానాలకే చీప్‌గా ఫ్యూయల్ ! మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
చమురు కంపెనీలకు కనికరం లేకుండా పోతుంది. గ్యాప్ లేకుండా పెట్రోలు ధరలను పెంచేస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర ఏకంగా రూ.113కి చేరుకుంది. ఇక రాజస్థాన్‌లోని బన్స్వారాలో అయితే లీటరు పెట్రోలు ఏకంగా రూ.117.21కి చేరుకుంది. పెట్రోలు ధరలు వరుసగా మూడూరోజు కూడా పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌లపై లీటరుకి 37 పైసల వంతున ధర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 113 కి చేరుకోగా డీజిల్ ధర రూ.106.22గా ఉంది. విమానమే నయం పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలతో బైకులు, కార్లను కొన్నాళ్లకు మూలనపడేయాలనే ఆలోచనలో కొందరు ఉండగా.. మరికొందరు తక్కువ ధరకే పెట్రోలు కావాలంటే విమానాలు కొనుక్కోవడం మేలంటూ సెటైర్లు వేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు సైతం ఈ వ్యంగాస్త్రాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. వాటికి పెట్రోల్ చీప్ బైకులు, కార్లు ఇలా సామాన్యులు ఉపయోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు చాలా చీప్‌గా లభిస్తుంది. తాజాగా పెరిగిన రేట్లతో ఢిల్లీలో సాధారణ పెట్రోలు లీటరు ధర రూ.108.64లు ఉండగా విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బో ఫ్యూయల్ (ఏటీఎఫ్)పెట్రోలు లీటరు ధర రూ.79.02లకే లభిస్తోంది. ముంబై విషయానికి వస్తే రెగ్యులర్ పెట్రోలు ధర రూ.114.47 ఉండగా విమానాలకు ఉపయోగించే లీటరు పెట్రోలు ధర రూ.77.37లకే లభిస్తోంది. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు ఇలా అన్ని నగరాల్లో ఇంచు మించు ఇదే వత్యాసం నెలకొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సామాన్యులు వినియోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు ధర కనీసం 30 శాతం తక్కువ ధరకే లభిస్తోంది. పన్నుల వల్లే మన పెట్రోలు అవసరాలన్నీ దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుని శుద్ధి చేసిన తర్వాత వచ్చిన పెట్రోలుకి రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్ కలుపుతారు. తర్వాత వచ్చిన ధరపై కేంద్రం 11 శాతం పన్ను విధిస్తోంది. అనంతరం రాష్ట్రాలు వ్యాట్‌ను విధిస్తున్నాయి. అత్యధికంగా గుజరాత్ రాష్ట్రం 30 శాతం వ్యాట్ని విధిస్తోంది. ఆ తర్వాత తమిళనాడు 29 శాతం వ్యాట్ విధిస్తోంది. దీంతో ఒక్కో రాష్ట్రంలో ఏటీఎఫ్ పెట్రోలు ధర ఒక్కో రకంగా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కేంద్రం విధిస్తున్న పన్ను 11 శాతమే ఉండటం. అందువల్ల ఏటీఎఫ్ పెట్రోలు తక్కువ ధరకే లభిస్తోంది. పెరిగిన పన్నులు ఇక రెగ్యులర్ పెట్రోలుకి సంబంధించి ముడి చమురు ధర, రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్లను మినహాయిస్తే లీటరు పెట్రోలు ధరలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 34 శాతంగా ఉంటోంది. ఈ మొత్తం కలపగా వచ్చిన ధరపై రాష్ట్రాలు వేర్వేరుగా వ్యాట్‌ను అమలు చేస్తున్నాయి. గరిష్టంగా రాజస్థాన్, మహారాష్ట్రలు దాదాపు 29 శాతం వ్యాట్‌ను విధిస్తున్నాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోలు దాదాపు రూ. 115 దగ్గరకు చేరుకుంది. రెగ్యులర్ పెట్రోలుకి రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ కనిష్టంగా 17 శాతం నుంచి 29 శాతం ఉండగా కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ పన్ను ఏకంగా 34 శాతం ఉంటోంది. అంతర్జాతీయ ధరలంటూ పన్నుల విధానం కారణంగా సామాన్యులపై పడుతున్న భారాన్ని ప్రభుత్వాలు నేర్పుగా అంతర్జాతీయ చమురు ధర మీదకు తోసేస్తున్నాయి. ముడి చమురు ధరల వల్లే ఈ సమస్య అన్నట్టుగా కలరింగ్ ఇస్తున్నాయి. ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోలు ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పట్టించుకోవడం లేదు. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: ఈ దేశంలో పెట్రోలు చాలా చీప్.. లీటరు రూ.1.50 మాత్రమే! -
ఇండిగో నష్టాలు తీవ్రతరం
న్యూఢిల్లీ: విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) నష్టాలు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మరింత పెరిగిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.1,194 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా.. అవి మరింత అధికమై రూ.1,435 కోట్లకు చేరాయి. ఈ సంస్థ నిర్వహణలో 219 విమానాలు ఉన్నాయి. మొత్తం ఆదాయం 91 శాతం వృద్ధితో రూ.5,798 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. వ్యయాలు 71 శాతం అధికమై రూ.7,234 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఆదాయంలో వృద్ధి ప్రోత్సాహకరంగా ఉంది. బ్యాలన్స్షీటును బలోపేతం చేసుకోవడంలో భాగంగా తిరిగి లాభాల్లోకి వచ్చేందుకు కృషి చేస్తాం’’ అని కంపెనీ సీఈవో రోనోజోయ్దత్తా తెలిపారు. ఏవియేషన్ ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. వీటి కారణంగా వ్యయాలు మరింత అధికమవుతాయన్నారు. -
లీటర్ పెట్రోల్ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్‌లు, ట్యాక్సీబైక్‌లు, జొమాటో, స్విగ్గీ తదితర యాప్ ఆధారిత సేవల చార్జీలపై పెట్రోల్, డీజిల్ ధరలు ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పటికే సర్ చార్జీలు, పీక్ అవర్స్ పేరిట ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న క్యాబ్‌లు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని సైతం ప్రయాణికులపైనే మోపుతున్నాయి. అన్ని రకాల క్యాబ్‌లు, బైక్‌ల సేవలపై తాజాగా 15 శాతానికి పైగా చార్జీలను పెంచేశారు. దీంతో సిటీజనుల ప్రయాణం మరింత భారంగా పరిణమించింది. మరోవైపు యాప్ ఆధారంగా ఆహార పదార్థాలు, వివిధ రకాల వస్తువులను అందజేసే యాప్ ఆధారిత సేవలపై సైతం చార్జీలను పెంచేశారు. చదవండి: స్విగ్గీ చేసింది.. ఆమెకు అండగా... ఆరోజులలో సెలవు! ప్రతి రోజు వేలాది మంది ఎంతో ఇష్టంగా ఆర్డర్ ఇచ్చే బిర్యానీలు, రకరకాల ఫుడ్ ఐటెమ్స్‌పై రవాణా సేవల రూపంలో ఇప్పుడు మరికొంత అదనంగా చెల్లించుకోవాల్సివస్తోంది. నిత్యావసర వస్తువులను, సేవలను అందజేసే యాప్ ప్లాట్‌ఫామ్స్ కూడా ఇప్పుడు తమ రేట్ కార్డులను సవరించాయి. ‘గతంలో ఒకటిన్నర కిలోమీటర్ దూరానికి రూ.20 మాత్రమే సర్వీసు చార్జీ తీసుకుంటే ఇప్పుడు కొన్ని యాప్ ప్లాట్‌ఫామ్స్ రూ.25 నుంచి రూ.30 వరకు చార్జీలు వేస్తున్నాయి’ అని వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ చార్జీల పెంపుతోనే సర్వీస్ చార్జీలు పెరిగాయని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. చదవండి: డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై ఊడిపడిన ఫ్యాన్.. హెల్మెట్ డాక్టర్స్! బైక్ బెంబేలు... ► సింగిల్ ప్యాసింజర్‌కు ఎంతో అనుకూలంగా ఉన్న బైక్ ట్యాక్సీలకు కూడా ఇప్పుడు రెక్కలొచ్చేశాయి. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి కొండాపూర్ వరకు గతంలో కేవలం రూ.21 నుంచి రూ.25 వరకు ఉన్న చార్జీ ఇప్పుడు రూ.35 దాటింది. పైగా రోజు రోజుకు ఈ చార్జీల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ► సికింద్రాబాద్ నుంచి హబ్సిగూడ వరకు గతంలో రూ.30 వరకు చార్జీ ఉండగా ఇప్పుడు కొన్ని బైక్ ట్యాక్సీల్లో రూ.50 వరకు పెరిగింది. మరోవైపు క్యాబ్‌లు, ఆటోలు సైతం ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. ► ఉప్పల్ నుంచి బంజారాహిల్స్ వరకు గతంలో రూ.275 ఉన్న క్యాబ్ చార్జీ ఇప్పుడు రూ.350 దాటింది. పీక్ అవర్స్‌లో ఈ చార్జీలు మరింత పెరుగుతున్నాయి. ► దీంతో పాటు సర్‌చార్జీల రూపంలో క్యాబ్ సంస్థలు మరింత భారం మోపుతున్నాయి. ‘పెట్రోల్ మోతతో సొంత బండి పక్కన పెట్టి ట్యాక్సీ బైక్‌పై వెళ్దామనుకుంటే ఇప్పుడు ఆ చార్జీలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి’ అని మల్కాజిగిరికి చెందిన ఫణీంద్ర విస్మయం వ్యక్తం చేశారు. సగటు జీవి విలవిల... ► రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సగటు జీవిని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.27, లీటర్ డీజిల్ రూ.105.46. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.952 దాటింది. ► ఏ రోజుకా రోజు పెరుగుతున్న ధరలతో జనం విలవిల్లాడుతున్నారు. పెరిగిన ఇంధన ధరలతో కూరగాయలు, అన్ని రకాల కిరాణా సరుకులు, నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ► కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ దృష్ట్యా గతంలో వివిధ రకాల వస్తుసేవల ధరలు పెరిగాయి. కరోనా తగ్గుముఖం పట్టి, ఆంక్షల సంకెళ్లు తొలగిపోయి కొద్దిగా ఊరట పొందుతున్న తరుణంలో సామాన్యుడి ముంగిట పేలిన పెట్రో బాంబు ఊపిరి తీసుకొనేందుకు అవకాశం లేకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
‘95 శాతం మంది భారతీయులకు పెట్రోల్ అవసరమే లేదు’
ఉత్తరప్రదేశ్: ఓ వైపు ప్రతిపక్షాలు, మేధావులు పెరుగుతున్న పెట్రో ధరల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా.. మరోవైపు అధికార పార్టీ నాయకులు అడ్డగోలు వ్యాఖ్యలు చేసి జనాలను మరంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటికో బండి అనే విధంగా మారాయి పరిస్థితులు. చిన్నాచితకా ఉద్యోగాలు చేసే వారు సైతం బండి కొంటున్నారు. గత పదేళ్లలలో దేశంలో టూ వీలర్, 4 వీలర్ వినియోగం బాగా పెరిగింది. దాంతో పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మినిస్టర్ దేశంలో దాదాపు 95 శాతం మంది ప్రజలకు అసలు పెట్రోల్‌తో పనే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఆవివరాలు.. (చదవండి: గెలిపిస్తే రూ.60కే లీటర్ పెట్రోల్: బీజేపీ) ఉత్తరప్రదేశ్‌కు చెందిన మినిస్టర్ ఉపేంద్ర తివారి.. జలౌన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ఇంధన ధరల గురించి ప్రశ్నించగా.. ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్షాలుకు వేరే పనేంలేక ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. 2014, అంతకు ముందుతో పోలిస్తే.. ఇప్పుడు మోదీ, యోగి హయాంలో జనాల తలసరి ఆదాయం బాగా పెరిగింది’’ అని తెలిపారు. ‘‘మన సమాజంలో 95 శాతం మందికి పెట్రోల్ అవసరమే లేదు. కేవలం కార్లు ఉన్న 5 శాతం మందికి మాత్రమే పెట్రోల్ ధరల గురించి ఆందోళన. దీనిపై ప్రతిపక్షాలు రాద్దంతం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే 100 కోట్ల కోవిడ్ టీకాలు పంపిణీ చేసింది. కరోనా బారిన పడ్డ వారికి ఉచిత వైద్యం అందిస్తుంది. దీని గురించి ఎవరు మాట్లాడరు’’ అన్నారు. (చదవండి: నిరసన గళం: ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సచివాలయానికి దీదీ) మినిస్టర్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ‘‘నీ దృష్టిలో కార్లు ఉన్నవారికే మాత్రమే పెట్రోల్ అవసరం ఉంటుందా.. ఇతర వాహనాలు వాడే వారు నీళ్లతో బళ్లు నడుపుతారా ఏంటి’’.. ‘‘వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు మాకు తగిన శాస్తి జరుగుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: మోదీకి చురక: పెట్రోల్ ధరలపై బావమరుదుల భగ్గు -
పండగనాడు వదల్లేదు.. మళ్లీ బాదేశారు
Petrol Prices : పండగ పబ్బం అనే తేడా లేకుండా చమురు కంపెనీలు ప్రజలపై భారం మోపుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చీమ చిటుక్కుమంటే చాలు ఆ ప్రభావం ఇక్కడి ప్రజలపై కనిపించేలా నిర్ణయాలు తీసుకుంటుంది. లీటరు పెట్రోలుపై 36 పైసలు, లీటరు డీజిల్‌పై 38 పైసల వంతున ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.109.33కి చేరుకోగా డీజిల్ ధర రూ.102.38 పైసలుగా నమోదు అయ్యింది. 15 రోజులు 13 సార్లు అక్టోబరు నెల వచ్చింది మొదలు పెట్రోలు ధర పిడుగులు సామాన్యుల నెత్తిపై పడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం సాకుగా చూపుతూ గడిచిన 15 రోజుల్లో 13 సార్లు పెట్రోలు ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో ఈ నెలలోనే దాదాపు లీటరు పెట్రోలు ధర ఐదు రూపాయలు, డీజిల్ ధర నాలుగు రూపాయల వరకు పెరిగినట్టయ్యింది. కేవలం అక్టోబరు 12, 13 తేదీల్లోనే పెట్రోలు ధరల పెంపు నుంచి సామాన్యులు తప్పించుకున్నారు. ఐదు నెలల్లో రూ.12 బెంగాల్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన ఐదు నెలల్లో చమురు కంపెనీలు పెట్రోలు ధరలు పెంచుతూ పోతున్నాయి. ఒక్క సెప్టెంబరు నెలలలోనే రెండు వారాల పాటు ఈ ధరాఘాతం నుంచి విముక్తి లభించింది. మిగిలిన ఐదు నెలల కాలంలో రోజు విడిచి రోజు లేదా వారానికి రెండు మూడు సార్లయినా ధరలు పెంచాయి చమురు కంపెనీలు. మొత్తంగా గడిచిన ఐదు నెలల్లో లీటరు పెట్రోలు ధర రూ.11.44 పెరగగా లీటరు డీజిల్ ధర రూ.9.14 పెరిగింది. -
ఈ చిన్న చిన్న చిట్కాలతో పెట్రోల్,డీజిల్‌ను ఆదా చేయండి
గత కొద్దిరోజులుగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వాటి ధర తగ్గొచ్చు..లేదంటే మరింత పెరగొచ్చు.అయితే వాటి ధరలు ఎలా ఉన్నా వాహనదారులు ఈ చిట్కాలు పాటించి పెట్రోల్- డీజిల్‌ను సేవ్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్పీడ్ డ్రైవింగ్ చేయకండి మీ మోటారు వాహనాల్ని స్పీడ్‌గా డ్రైవ్ చేయడం,బ్రేకులు వేయడంవల్ల పెట్రోల్ లేదంటే డీజిల్ త్వరగా అయిపోతుంది. అలా కాకుండా స్లోగా నడపడం వల్ల ఇంధనాన్ని సేవ చేసుకోవడమే కాదు. రాబోయే ప్రమాదల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. హైవేలు,నగరాల్లోని రహదారాల్లో డ్రైవింగ్ చేయడం వల్ల 33శాతం ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. మీ వేగాన్ని అదుపులో ఉంచుకోండి మీకారు ఇంధన వినియోగం ఏరోడైనమిక్స్, రహదారులు, ఇంజిన్ సామర్ధ్యం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కారు వేగం పెరిగే కొద్దీ ఎదురుగా వీచే గాలిసామర్ధ్యం పెరిగిపోతుంది. దీంతో ఇంధనం అయిపోతుంది. ఇటీవల ఆటోమొబైల్ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వాహనాన్ని నడిపే పద్దతిని బట్టి అది పనిచేసే సామర్థ్యం గణనీయంగా పడిపోతుందని తేలింది. కాబట్టి మీరు 50- 60 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేయడం ఉత్తమం. ఇంధన సామర్ధ్యం ఎక్కువగా ఉండాలి అది కారైనా కావొచ్చు, ద్విచక్రవాహనమైనా కావొచ్చు. అందులో ఇంధనం పూర్తి స్థాయిలో ఉండాలి. మనలో ఎక్కువమంది వాహనంలో తగినంత ఇంధన లేకపోయినా డ్రైవింగ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. మీ వాహనం పనితీరు మందగిస్తుంది. రెగ్యులర్ సర్వీసింగ్ అవసరం ఏదైనా వస్తువును వాడే కొద్ది దాని పనితీరు ఆగిపోతుంది. అలా కాకుండా దాని పనితీరు బాగుండాలంటే మరమ్మత్తులు అవసరం.వాహనాలు కూడా అంతే. సమయానికి వాహనాల్ని శుభ్రం చేయండి. ఇంజన్ , ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఆయిల్ చెకింగ్ తో పాటు వాహనం కండీషన్ బాగుండేలా చూసుకోవాలి. మీ కారు అద్దాల్ని క్లోజ్ చేయండి కారు అద్దాల్ని ఓపెన్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ప్రయాణంలో కారు అద్దాల్ని ఓపెన్ చేయడం ద్వారా..కారు లోపలికి ప్రవేశించి మీ కారు మరింత వేగంగా వెళ్లేందుకు సాయం చేస్తుంది.దీంతో 10శాతం ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ఏసీ వాడకం తగ్గించండి డ్రైవింగ్ సమయాల్లో కారు ఏసీ వినియోగాన్ని తగ్గించండి.ప్రయాణంలో ఏసీ వినియోగించడం వల్ల ఇంజన్‌పై లోడ్ పెరిగి ఇంధన వినియోగం పెరిగిపోతుంది. కాబట్టి ఏసీ వినియోగంపై పరిమితులు విధించండి. వాహనం టైర్లపై ఒత్తిడి పడకుండా చూడండి కొంతమంది వాహనదారులు తమ వాహనాల్ని ఇష్టానుసారంగా వినియోగిస్తుంటారు. అవసరం లేకుండా బ్రేకులు వేస్తూ వాహనంపై ఒత్తిడిపడేలా చేస్తుంటారు. అలా కాకుండా వాహనాన్ని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ బ్రేక్ వినియోగాన్ని తగ్గిస్తే 20శాతం వరకు ఆదాచేసుకోవచ్చు. ఇంజన్ వినియోగాన్ని తగ్గించండి ప్రయాణంలో వాహనం ఇంజన్ వినియోగం ఎక్కువగా ఉంటే ఇంధన వినియోగం పెరిగిపోతుంది. అదే ప్రయాణంలో ఏమాత్రం చిన్న గ్యాప్ వచ్చినా ఇంజన్ ను ఆపేయండి. ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఇంజన్ ను ఆపేయడం వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.ట్రాఫిక్‌లో 10శాతం కంటే ఎక్కువ సమయంలో ఇంజన్ ఆపేయడం ఉత్తమంది. దీని వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. -
పెరిగిన ఇంధన ధరలు, ప్రత్యామ్నాయంగా ప్రజల చూపు వాటి వైపు
సాక్షి, సిటీబ్యూరో: బెంబేలెత్తిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలతో నగరవాసులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. నెల రోజులుగా గ్రేటర్లో ఈ వాహనాల అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు జీవితకాల పన్నుతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా ప్రభుత్వం మినహాయించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కింద 2 లక్షల బైక్‌లకు ఈ మినహాయింపు వర్తించనుంది. అలాగే మరో 10 వేల వరకు కార్లు, 3 వేల ఆటోలు, తదితర రవాణా వాహనాలకు కూడా ఈ మినహాయింపును ఇచ్చారు. కొద్ది రోజుల క్రితంరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సైతంఈ అంశాన్ని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఇంధన ధరల మోతతో... కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతుండడంతో జనం దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లింది. గత నెల రోజులుగా సుమారు 5 వేలకు పైగా బైక్‌ల విక్రయాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కార్లు, ఆటోలు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు. బుకింగ్‌ల పట్ల మాత్రం ఆసక్తి చూపుతున్నట్లు నగరంలోని ఓ ఎలక్ట్రిక్ వాహనషోరూమ్ నిర్వాహకులు ఒకరు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపైన ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమల్లోకి తేవడానికి ముందు నుంచే నగరంలో వీటి అమ్మకాలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మరింత ఆదరణ పెరిగింది. స్పష్టత లేని 2 శాతం పన్ను... ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కింద కొన్ని వాహనాలకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. కానీ రవాణాశాఖ కొంతకాలంగా రెండో బండిపైన 2 శాతం అదనంగా పన్ను వసూలు చేస్తోంది. అంటే ఒకే వ్యక్తి తన పేరిట అప్పటికే ఒక వాహనం ఉండి మరో వాహనాన్ని కొత్తగా కొనుగోలు చేసినప్పుడు ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపును ఇచ్చినప్పటికీ రెండో వాహనం నిబంధనపైన మాత్రం రవాణాశాఖ స్పష్టతను ఇవ్వలేదు. దీంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కింద ఇప్పుడు మినహాయింపునిచ్చినా భవిష్యత్తులో అదనపు పన్నుల మోత తప్పకపోవచ్చేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. చార్జింగ్ కేంద్రాలు ఉంటే... ► ఒకసారి బైక్‌లు చార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ► ప్రస్తుతం నగరంలో విద్యుత్ చార్జింగ్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల వాహనదారులు ఇంటి వద్ద చార్జింగ్ చేసుకొని బయలుదేరుతున్నారు. కానీ నిర్ధేశిత దూరం కంటే ఎక్కువ వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చి మరోసారి చార్జింగ్ చేసుకోవలసి వస్తోంది. – చార్జింగ్ కేంద్రాల కొరత వల్లనే కార్లు, ఆటోలు, తదితర వాహనాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ► అన్ని ప్రధాన కూడళ్లు, బంకులు, సూపర్మార్కెట్లు, మాల్స్ తదితర కేంద్రాల్లో తప్పనిసరిగా చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని 2018లోనే రవాణాశాఖ సూచించింది. ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, కొన్ని ఆర్టీసీ బస్‌డిపోలు, తదితర చోట్ల మినహా చార్జింగ్ కేంద్రాలు లేవు. పైగా ఆర్టీసీ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రమే చార్జింగ్ సదుపాయం ఉంది. మిగతా చోట్ల సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ► ఈటో వంటి ఆటోరిక్షా సంస్థలు తమ వాహనాల అమ్మకాలు పెరిగితే విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను స్వయంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. -
పెట్రోల్ ధరలు: మోదీజీ.. ఈ మహిళ మొర ఆలకించేనా..?
పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా దేశ వ్యాప్తంగా వాహనదారులు తమదైన స్టైల్లో చేస్తున్న నిరసన కొనసాగుతుంది. పార్లమెంట్ వర్షాకాల నేపథ్యంలో పెరుగుతున్న చమురు ధరలు తగ్గించే విషయంపై ప్రధాని మోదీ ప్రసంగించాలని కోరుకుంటున్నారు. ఓవైపు పెట్రోల్ బంకుల్లో కార్లపైకెక్కి అర్ధనగ్నంగా దండాలు పెడుతుంటే,మహిళలు పెట్రోల్ బంకుల్లో తమ మొర ఆలకించాలంటూ మోదీ ఫ్లెక్సీకి దణ్ణాలు పెడుతున్నారు. నెటిజన్లు సైతం #ThankYouModiJiChallenge అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.ఈ నిరసనతో పెట్రో ధరలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా' అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మంగళవారం రోజు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొద్దిరోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరడగంతో.. దేశీయంగా పెట్రో ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఈ నెలలో ఈ ఇరవై రోజుల్లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఒక్క ఢిల్లీలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంవత్సరం పెట్రోల్ 63 పర్యాయాలు, డీజిల్ 61సార్లు పెరిగింది. మంగళవారం పెట్రోల్,డీజిల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది చదవండి: 'పెగసస్' చిచ్చు, సర్వీస్‌లను షట్ డౌన్ చేసిన అమెజాన్