పెట్రో పెంపు... మోదీ సర్కార్ గిఫ్ట్: కాంగ్రెస్ | Fuel price hike Modi govt's anniversary 'gift': Congress | Sakshi
Sakshi News home page

పెట్రో పెంపు... మోదీ సర్కార్ గిఫ్ట్: కాంగ్రెస్

Published Fri, May 15 2015 9:44 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

Fuel price hike Modi govt's anniversary 'gift': Congress

న్యూఢిల్లీ: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు నరేంద్ర మోదీ సర్కారు వార్షిక బహుమతి అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఏడాది కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా ఎన్డీఏ సర్కారు ఈ కానుక ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్పీఎన్ సింగ్ ఎద్దేవా చేశారు.

5 రోజులకొకసారి పెట్రోల్ ధరలు పెంచడంతో పాటు నాలుగు పర్యాయాలు కస్టమ్స్, ఎక్సైజ్ సుంకం పెంచిందని దీని ద్వారా 90 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చాయని కాంగ్రెస్ పార్టీ సమాచార విభాగం అధ్యక్షుడు రణదీప్ సుర్జీవాలా తెలిపారు. పెంచిన కస్టమ్స్,  ఎక్సైజ్ సుంకం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

పెట్రోలుపై లీటరుకు రూ. 3.13, డీజిల్పై లీటరుకు రూ. 2.71చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement