భారతదేశంలో ఇంధన (పెట్రోల్, డీజిల్) ధరలను తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ తరుణంలో పంజాబ్ ప్రభుత్వం షాకిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది. కొన్ని రోజులకు ముందు కర్ణాటక, గోవా రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదే బాటలో పంజాబ్ ప్రభుత్వం కూడా అడుగులు వేసింది.
పెట్రోల్, డీజిల్‌పై వ్యాల్యూ యాడెడ్ ట్యాక్ (వ్యాట్) పెంచుతూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి పంజాబ్ క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్: విశేషాలు
క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెట్రోల్‌పై వ్యాట్‌ను లీటర్‌కు 61 పైసలు, డీజిల్‌పై 92 పైసలు పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాట్‌ని పెంచడం వల్ల డీజిల్‌పై రూ. 395 కోట్లు, పెట్రోల్‌పై రూ.150 కోట్ల ఆదాయం పెరుగుతుందని చీమా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment