హైదరాబాద్ : పెట్రోలు, డీజిల్ ధరలను చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి. లీటరు పెట్రోలుపై రూ. 35 పైసలు, డీజిల్‌పై 35 పైసల ధరను పెంచాయి. గురువారం పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్ లీటర్‌కు 7 పైసలు వరకు పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి ఆ వెంటనే మరోసారి ఇంధన ధరలను పెంచేశాయి. వారం వ్యవధిలోనే పెట్రోలు ధర దాదాపు రూపాయన్నర పెరిగింది. లీటరు పెట్రోలు ధర సెంచరీ క్రాస్ చేసేందుకు పరుగులు పెడుతోంది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.101.90.. డీజిల్ రూ.96.63 కి చేరుకుంది.
ధర తగ్గించండి - ఇక్రా
మరోవైపు డోమెస్టిక్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా ఇచ్చిన రిపోర్టులో పెట్రోలు, డీజిల్‌లపై సెస్ తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. ధరలు తగ్గడం వల్ల ఫ్యూయల్ వినియోగం పెరుగుతుందని... ప్రభుత్వ ఆదాయానికి ఢోకా ఉండదని సూచించింది.
చదవండి : ప్రభుత్వంపై చెల్లింపుల భారం..రూ.116.21 లక్షల కోట్లు
Comments
Please login to add a commentAdd a comment