randeep surjewala
-
హర్యానాలో కాంగ్రెస్ హవా.. వారిద్దరిలో సీఎం ఎవరు?
ఢిల్లీ: హర్యానా, జమ్ము కశ్మీర్‌కు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్ నేడు విడుదలయ్యాయి. ఈ క్రమంలో పలు సర్వే సంస్థలు హర్యానాలో కాంగ్రెస్‌కు అధికారం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. హర్యానాలో 90 నియోజకవర్గాలకు గానూ 55కి పైగా స్థానాల్లో హస్తం పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం ఎవరు అనే చర్చ మొదలైంది.హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి స్థానం ఎవరిది? అనే చర్చ రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. ప్రధానంగా పార్టీలో సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ సీఎం ఎవరు అనే అంశం పార్టీ హైకమాండ్ నిర్ణయింస్తుందని తెలిపారు. కుమారి సెల్జాకు సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశముందా? అని ప్రశ్నించగా.. మనది ప్రజాస్వామ్యం. సీఎం పదవి కోసం ఎవరైనా ఆసక్తి చూపవచ్చు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో..హర్యానాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని భావిస్తున్నాం. ప్రస్తుత బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. అవినీతి పెరిగిపోయింది. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రజలందరూ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. #ElectionsWithNDTV #HaryanaElections #BhupinderHooda pic.twitter.com/wF7Z7WMnqn— NDTV (@ndtv) October 5, 2024 -
దిగ్విజయ్–కమల్నాథ్లది జై– వీరూ బంధం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ల పాత్రపై మరోసారి చర్చ మొదలైంది. దిగ్విజయ్, కమల్‌నాథ్‌ల మధ్య రాజకీయ సమీకరణాలను.. బ్లాక్ బస్టర్ ‘షోలే’ చిత్రంలోని ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్లు పోషించిన జై, వీరూ పాత్రల మధ్య బంధంతో కాంగ్రెస్ పార్టీ పోల్చింది. రాష్ట్రంలో టిక్కెట్ల కేటాయింపులో ఇద్దరు నేతల మధ్య విభేదాల వార్తలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా శనివారం పైవ్యాఖ్యలు చేశారు. ‘షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్‌ల మధ్య విలన్ గబ్బర్ సింగ్ ఎలా గొడవ పెట్టలేకపోయాడో.. రాష్ట్రంలో గబ్బర్ సింగ్ వంటి బీజేపీ కూడా మధ్య విభేదాలను సృష్టించలేకపోయింది’ అంటూ వ్యాఖ్యానించారు. -
మధ్యప్రదేశ్ ఇన్చార్జిగా సూర్జేవాలా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ గురువారం సంస్థాగతంగా కీలక మార్పులను ప్రకటించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్‌కు పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్చార్జిగా రణదీప్ సూర్జేవాలాను నియమించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్‌కు అప్పగించింది. గుజరాత్ జనరల్ సెక్రటరీ ఇన్చార్జిగా ముకుల్ వాస్నిక్‌ను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారని ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పార్టీ కర్ణాటక ఇన్చార్జిగా ఉన్న సూర్జేవాలా మధ్యప్రదేశ్ బాధ్యతలు అదనంగా నిర్వహిస్తారు. సూర్జేవాలాను మధ్యప్రదేశ్ సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా ఇటీవలే పార్టీ నియమించింది. అజయ్ రాయ్ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేశారు. దళిత నేత, యూపీ పార్టీ చీఫ్ బ్రిజ్‌లాల్ ఖబ్రి స్థానంలో రాయ్ తక్షణమే నూతన బాధ్యతలు చేపడతారని పార్టీ ప్రకటన పేర్కొంది. -
కర్ణాటక సీఎంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: సూర్జేవాలా
సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో అధికార బీజేపీకి షాకిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ తరఫున సీఎం ఎవరు? అన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. కర్ణాటక సీఎం రేసులో మాజీ సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ పరిశీలకుడు రణ్‌దీప్ సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయి. నేడో, రేపో నిర్ణయం తీసుకుంటాం. మరో 48-72 గంటల్లో కర్ణాటకలో కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేస్తాం. కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం తేదీ కూడా తప్పు. దీనిపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | Delibrations are currently underway by party president Mallikarjun Kharge. Whenever Congress makes a decision we will inform you. In the next 48-72 hours, we will have a new cabinet in Karnataka: Randeep Surjewala, Karnataka in-charge, Congress pic.twitter.com/fas1Bpu3J3 — ANI (@ANI) May 17, 2023 ఇదిలా ఉండగా.. కర్ణాటకలో సిద్దరామయ్య అనుచరులు, మద్దతుదారులు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అంటూ నినాదాలు చేస్తున్నారు. సిద్దరామయ్య పోస్టర్లకు పాలాభిషేకం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #WATCH | Supporters of Congress leader Siddaramaiah pour milk on his poster and chant slogans for him outside his residence in Bengaluru, even as the suspense over #KarnatakaCMRace continues. pic.twitter.com/HQG0gzsb1G — ANI (@ANI) May 17, 2023 ఇది కూడా చదవండి: ముహూర్తం ఫిక్స్.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరంటే? -
కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన బీజేపీ
-
బాయ్‌ఫ్రెండ్‌ని మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు!
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీకి గుడ్ బై చెప్పి ఆర్జేడితో జత కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నితీష్ పై కైలాష్ విజయ వర్గీయ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు కైలాష్ విజయవర్గీయ మాట్లాడుతూ..."తాను కొన్నాళ్లు విదేశాల్లో ఉన్నానని అక్కడ మహిళలు చాలా ఈజీగా బాయ్ప్రెండ్ని మార్చేస్తుంటారని, అచ్చం అలాగే నితీష్ కుమార్ కూడా పార్టీలు మార్చేస్తుంటాడు. ఎప్పుడూ ఎవరి చేయి పట్టుకుంటాడో, ఎవరి చేయి వదిలేస్తాడో ఎవరికి తెలియదు." అని మండిపడ్డారు. ఐతే కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా.. బీజేపీ కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ చేసిన సంచలన వ్యాఖ్యల వీడియోని ట్విట్టర్లో షేర్ చేస్తూ...ఆయనకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో చెప్పకనే చెప్పారు అంటూ విమర్శించారు. भाजपा के राष्ट्रीय महासचिव द्वारा नारी सम्मान का नया नमूना 👇 pic.twitter.com/DEGr5ojM5r — Randeep Singh Surjewala (@rssurjewala) August 18, 2022 (చదవండి: బీజేపీ నాయకులకు సరైన సమయంలో బదులిస్తా) -
ధరలపై మూడంచెల పోరు
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. ‘ధరాభారం లేని భారత్’పేరిట మూడంచెల పోరుకు దిగుతామని ప్రకటించింది. ‘‘తొలి దశలో కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్యులు మార్చి 31న తమ ఇళ్ల బయట ఆందోళనలు చేస్తారు. ఎల్పీజీ సిలిండర్లకు పూలదండలు వేసి చెవిటి బీజేపీ ప్రభుత్వానికి వినపడేలా డప్పులు, గంటలు మోగిస్తూ నిరసన తెలుపుతారు. తర్వాత మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 దాకా దేశవ్యాప్త ర్యాలీలు, ఆందోళనలుంటాయి. ఏప్రిల్ 2 నుంచి 4 దాకా స్వచ్ఛంద సంస్థలు, మత, సామాజిక సంస్థలు, సంక్షేమ సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ధర్నాలుంటాయి. ఏప్రిల్ 7న అన్ని రాష్ట్రాల పార్టీ ప్రధాన కార్యాలయాల్లో ‘ధరాభారం లేని భారత్’ధర్నాలు చేపడతాం’’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. మోదీ సర్కారు దేశ ప్రజలను వంచించిందని ఆయన మండిపడ్డారు. ‘‘ఐదు రాష్ట్రాల్లో ఓట్ల కోసం నాలుగు నెలలకు పైగా పెట్రో, ఎల్పీజీ, సీఎన్జీ తదితరాల ధరలను పెంచలేదు. అవి పూర్తవుతూనే వాటి ధరలను రోజూ ఎడాపెడా పెంచుతూ సామాన్యుని నడ్డి విరుస్తోంది. జనాన్ని పిండి ఖజానా నింపుకునే సూత్రం పాటిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు సమావేశమై పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో చర్చించిన మీదట దీనిపై భారీ ఉద్యమానికి నిర్ణయించాం’’అని వివరించారు. నిస్సిగ్గు దోపిడీ ఆగాల్సిందే: రాహుల్ ప్రజలను నిస్సిగ్గుగా దోచుకుంటున్న కేంద్రానికి ముకుతాడు వేయాల్సిందేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. జనం అష్టకష్టాలు పడుతుంటే రాజు బేపర్వాగా తన ప్రాసాదాన్ని అలంకరించుకుంటున్నారంటూ ప్రధాని మోదీనుద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో తేదీలు మారుతున్నా సమస్యలు మాత్రం యథాతథమంటూ సుర్జేవాలా ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ ఓవైపు జనాన్ని బాదుతూ, మరోవైపు ప్రమాణ స్వీకారాలు జరుపుకుంటోంది. పెట్రోల్, డీజిల్‌కు భారత్‌లో రోజుకో కొత్త రేటు. ఐదు రోజుల్లో నాలుగు దాడులు’’అని ధరల పెంపునుద్దేశించి విమర్శలు సంధించారు. -
కొత్త రూపుతో తిరిగొస్తాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది. ఫలితాలు తమ అంచనాలకు భిన్నంగా వచ్చాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతిని ధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. అంతమాత్రాన ధైర్యం కోల్పోలేదని, పోరాడి విజయం సాధిస్తామని చెప్పారు. ఫలితాల అనంతరం గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫలితాలతో నిరాశ చెందినా కుంగిపోలేదని చెప్పారు. ‘‘ఓటమి కారణాలపై ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఒక పార్టీగా కాంగ్రెస్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. సరికొత్త వ్యూహాలతో తిరిగొస్తుంది. గెలిచేదాకా పోరాడుతూనే ఉంటుంది. ఆ క్రమంలో నిత్యం జనం పక్షానే నిలుస్తుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి ప్రజా సమస్యలపై అంతే బాధ్యతతో గొంతెత్తుతుం ది’’ అని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కుల, మతవాదాలకు తావివ్వకుండా చూసేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ చేసినా బీజేపీ చేసిన విపరీతమైన భావోద్వేగ ప్రచారం ముందు విద్య, వైద్యం, ఆరోగ్యం, నిరుద్యోగం వంటి నిజమైన సమస్యలు పక్కకు పోయాయని ఆరోపించారు. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాల్లో మెరుగైన ఫలితాలు ఆశించినట్టు సుర్జేవాలా చెప్పారు. కానీ పంజాబ్‌లో ప్రభు త్వ వ్యతిరేకతను అధిగమించలేకపోయామన్నారు. ‘‘యూపీలో పార్టీకి నూతన జవసత్వాలు కల్పించగలిగినా ప్రజల్లో తమ పట్ల ఉన్న సానుకూలతను ఓట్లుగా మార్చుకోలేకపోయాం. ఉత్తరాఖండ్, గోవాల్లో బాగా పోరాడినా విజయం సాధించలేకపోయాం’’ అని చెప్పారు. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాటం సాగిస్తాం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ప్రజల తరపున నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి ప్రియాంకా గాంధీ వాద్రా చెప్పారు. యూపీలో విజయం కోసం తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగానో శ్రమించారని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారని, వాటి పరిష్కారం కోసం ఉద్యమించారని తెలిపారు. అయినప్పటికీ తమ శ్రమను ఓట్లుగా మరల్చుకోలేకపోయామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పు శిరోధార్యం అని ఉద్ఘాటించారు. యూపీ అభివృద్ధి కోసం తమ వంతు పోరాటం సాగిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. -
కర్ణాటక సంకీర్ణం అందుకే కూలిందా ?
న్యూఢిల్లీ: 2019లో కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగించారని కాంగ్రెస్ నేతలు మంగళవారం బీజేపీని విమర్శించారు. పెగసస్ స్పైవేర్ లిస్టులో అప్పటి ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్యల కార్యదర్శులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బీజేపీపై విరుచుకుపడ్డారు. పెగసస్‌ను వినియోగించుకొని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రిగా కొనసాగే హక్కు అమిత్‌షాకు లేదని వ్యాఖ్యానించారు. -
20 లక్షల భూమిని 2.5 కోట్లకు అమ్మేశారు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర ట్రస్టు కొనుగోలు చేసిన భూమి విషయంలో అక్రమాలు జరిగాయని, ఇదొక పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరింది. నిజాలను వెలికితీసేందుకు కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. శ్రీరాముడి పేరిట దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును బీజేపీ నేతలు లూటీ చేస్తున్నారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆదివారం మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధానమంత్రితోపాటు సుప్రీంకోర్టు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేత ఒకరు అయోధ్యలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొంత భూమిని రూ.20 లక్షలకు కొనుగోలు చేశారని, అదే భూమిని ఇటీవల రామమందిర ట్రస్టుకు ఏకంగా రూ.2.5 కోట్లకు విక్రయించారని చెప్పారు. కేవలం 79 రోజుల్లో 1,250 శాతం లాభం ఆర్జించారని ఆరోపించారు. 2 కోట్లకు భూమిని కొని నిమిషాల్లోనే రూ. 18.5 కోట్లకు రామమందిర ట్రస్టుకు అమ్మారని ఇదివరకే తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిది రెండో ఉదంతం. అక్రమార్కులను కఠినంగా శిక్షించాలి సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతోందని రణదీప్ సూర్జేవాలా గుర్తుచేశారు. ట్రస్టును ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టుకు, న్యాయమూర్తులకు, ప్రధానమంత్రికి బాధ్యత లేదా? అని నిలదీశారు. ట్రస్టు ఆర్థిక లావాదేవీలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో ఆడిట్ నిర్వహించాలని, అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. భూకుంభకోణంపై ప్రధాని మోదీ తీసుకోబోయే చర్యల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. చదవండి: ఈ భూమిపై మాకింత చోటేది? -
11 మందిపై ఆ ట్యాగ్ వేయాల్సిందే: రణ్‌దీప్ సుర్జేవాలా
న్యూఢిల్లీ: కోవిడ్ టూల్‌కిట్ వివాదానికి ఇప్పట్లో ముగింపు పడేలా లేదు. 11 మంది కేంద్ర మంత్రులపై బూటకపు మీడియా ట్యాగ్ వేయాలని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్‌ను డిమాండ్ చేశారు. టూల్‌కిట్ పేరిట బీజేపీ నేతలు తప్పుడు మీడియా పోస్టులు పెడుతున్నారని ట్విట్టర్‌కు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రస్తావించకుండా “టూల్ కిట్.. సత్యం నిర్భయంగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పెట్టిన పోస్టులు బూటకపువి అంటూ ట్విట్టర్ ఆయన ఖాతాపై “మ్యానిపులేటెడ్ మీడియా” అనే ట్యాగ్ పెట్టింది. అంటే మసిపూసి మారేడు కాయ పద్ధతిలో తయారు చేసిన మీడియా పెడుతున్నారని దాని సారాంశం. కాగా కేంద్ర ప్రభుత్వం ఆ ట్యాగ్ తొలగించమని ట్విట్టర్‌ని డిమాండ్ చేసింది. దర్యాప్తు సంస్థలు ఆ విషయం పరిశీలిస్తున్నాయి కనుక తొందరపడి అలాంటి ట్యాగ్లు పెట్టడం సరికాదన్న రీతిలో కేంద్ర ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌కు లేఖ రాసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సుర్జేవాలా ఒక్క సంబిత్ పాత్ర కాకుండా కేంద్రంలోని 11 మంది మంత్రులపై ఆ ట్యాగ్ వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వారు కూడా పాత్ర తరహాలోనే నకిలీ మీడియా, పోర్జరీ డాక్యుమెంట్లు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆ 11మంది కేంద్ర మంత్రుల పేర్లును కూడా వెల్లడించారు సుర్జేవాలా. వారిలో గిరిరాజ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, రమేశ్ పోక్రియాల్, డాక్టర్ హర్ష్ వర్ధన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, గజేంద్రసింగ్ షెఖావత్ ఉన్నారు. అందరినీ ఒకేలా చూడాలని సుర్జేవాలా ట్విట్టర్‌ను కోరారు.రు. కేంద్రమంత్రులు అసత్యపు మాటలు తమ ట్విట్టర్ ఖాతాలో పెడితే ప్రజలు నమ్మే ప్రమాదముందని సుర్జేవాలా ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: ‘టూల్‌కిట్’ కేసులో ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసు -
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకో టీవీ ఛానల్
న్యూఢిల్లీ: రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ.. తాము త్వరలో ప్రారంభించనున్న డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్ ‘ఐఎన్‌సీ టీవీ’కి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ నెల 24న పార్టీ చానెల్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ చానెల్ ద్వారా తమ పార్టీ సమాచారాన్ని నేరుగా ప్రజలకు తెలియ జేయవచ్చని భావిస్తోంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు గొంతుకను వినిపించే తమ చానెల్‌ను పంచాయతీ రాజ్ రోజున విడుదల చేస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలాలు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. అందులో రోజూ దాదాపు 8 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలిపారు. మొదటగా ఆంగ్లం, హిందీ భాషల్లో చానెల్ ప్రసారమవుతుందని, అనంతరం స్థానిక భాషల్లో కూడా అందు బాటులోకి తెస్తామన్నారు. చదవండి: ఇంటి పక్కన కిరాణా దుకాణాదారుడే కింగ్ -
రైతు మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు
చంఢీగడ్: వ్యవసాయ చట్టాల రద్దు కోసం చేస్తున్న ఉద్యమంలో పాల్గొన్న రైతు గుండెపోటుతో మరణించగా.. అతడి మృతదేహాన్ని ఎలుకలు పీక్కు తిన్నాయి. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచిన శవాన్ని ఎలుకలు కొరికి తినడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీనిపై కుటుంబసభ్యులతోపాటు రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన హరియాణా రాష్ట్రం సోనిపట్ జిల్లాలో చోటుచేసుకుంది. సోనిపట్ జిల్లాలోని బయాన్‌పూర్ గ్రామానికి చెందిన రైతు రాజేందర్ (72). దేశవ్యాప్తంగా సాగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొంటున్నాడు. అయితే బుధవారం ఆయన గుండెపోటుకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. దీంతో సానిపట్లోని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో రాజేందర్ మృతదేహం భద్రపర్చారు. గురువారం వచ్చిచూసేసరికి మృతదేహంపై గాట్లు.. గాయాలు ఉన్నాయి. దీనిపై కుటుంబసభ్యులు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలుకలు మృతదేహాన్ని కొరకడంతో గాట్లు పడ్డాయని వైద్యాధికారులు గుర్తించారు. అయితే ఆస్పత్రిలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వైద్యాధికారులు తెలిపారు. హరియాణా బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీదీప్ సూర్జేవాలా స్పందించారు. ఈ ఘటనపై ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 73 साल में ऐसा दर्दनाक मंजर शायद कभी ना देखा हो ! शहीद किसान के शव को चूहे कुतर जाएँ और भाजपा सरकारें तमाशबीन बनी रहें। शर्म से डूब क्यों नही मार गए भाजपाई !#FarmersProtests pic.twitter.com/7jE9yaNYfz — Randeep Singh Surjewala (@rssurjewala) February 19, 2021 -
తదుపరి అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ: పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి(సీడబ్ల్యూసీ) అప్పగించిన అధికారం మేరకే అధినేత్రి సోనియాగాంధీ సంస్థాగత మార్పులను చేపట్టారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. పార్టీ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించేందుకే ఆమె ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారని వివరించింది. తాజా మార్పులపై కొందరు నేతల ప్రకటనలపై కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలెవరూ ఎటువంటి ప్రకటనా చేయలేదని, వ్యాఖ్యానించలేదని అన్నారు. సోనియా చేపట్టిన సంస్థాగత మార్పులపై రాహుల్ గాంధీ ముద్ర ఉందా అని అడగ్గా..రాహుల్ గాంధీని ఏఐసీసీ ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఎన్నుకుందనీ, 2019 ఎన్నికల ఫలితాలకు బాధ్యతవహిస్తూ ఆయన వైదొలిగారని గుర్తు చేశారు. కోట్లాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు సీడబ్ల్యూసీ కూడా సోనియా, రాహుల్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించాయన్నారు. మరోవైపు, క్రమం తప్పకుండా జరిగే మెడికల్ చెకప్ కోసం శనివారం ఉదయం కొడుకు రాహుల్ గాంధీతో కలిసి సోనియాగాంధీ అమెరికా వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
రాజధర్మాన్ని పాటించాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటే దేశ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి రన్‌దీప్ సుర్జీవాలా తెలిపారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టి పెట్టాలని కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక సమస్యలపై చర్చలు జరిపేటప్పుడు ప్రజలకు వివరించడం రాజధర్మమని పేర్కొన్నారు. చైనాతో విదేశాంగశాఖ జరిపిన చర్చల విషయాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. చర్చల తర్వాత కూడా ఇప్పటికీ డ్రాగన్ దూకుడుగా వ్యవహరిస్తుండడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని మండిపడ్డారు. అయితే చర్చలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, కానీ ఆ చర్చల సారాంశాన్ని స్సష్టంగా ప్రజల ముందుంచాలనేదే తమ ఏకైక డిమాండ్ అని రన్‌దీప్ సుర్జీవాలా పేర్కొన్నారు. కాగా ఇటివల షాంఘై సహకార సంస్థ( ఎస్ఓసీ) మంత్రుల స్థాయి సమావేశంలో సరిహద్దు అంశాన్ని రాజ్‌నాథ్‌సింగ్ లేవనెత్తారు. అనంతరం చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మధ్య దాదాపు రెండు గంటల పాటు భేటీ జరిగింది. కేంద్ర ప్రభుత్వం చైనాతో జరుపుతున్న చర్చల నేపథ్యంలో కాంగ్రెస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. (చదవండి: దురాక్రమణ దుస్సాహసం) -
కాంగ్రెస్ నేత సుర్జేవాలాపై పోలీసులకు ఫిర్యాదు
జైపూర్/ఢిల్లీ: రసవత్తరంగా సాగుతున్న రాజస్తాన్ రాజకీయాల్లో ఆడియో టేపుల వ్యవహారం మరింత కాకపుట్టించింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ కుట్రలు పన్నారని కాంగ్రెస్ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)నకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి ఫిర్యాదు మేరకు ఎస్ఓజీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఫేక్ ఆడియో టేపులతో రాజకీయంగా తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నిస్తున్నారని రాజస్తాన్ బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ భరద్వాజ్ అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీఫ్ విప్ మహేష్ జోషి, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, రాజస్తాన్ పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్, సీఎం వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న లోకేష్ శర్మలను భరద్వాజ్ ఫిర్యాదులో నిందితులలుగా పేర్కొన్నారు. ఫేక్ ఆడియో కాల్స్ సృష్టించి బీజేపీని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. 8 సివిల్ లైన్స్‌లోని సీఎం అశోక్ గహ్లోత్ నివాసంలో ఓఎస్డీ లోకేష్ శర్మ ఆధ్వర్యంలో ఇవన్నీ జరగుతున్నాయని ఆరోపించారు. (చదవండి: ‘105 మంది ఎమ్మెల్యేల్లో కొందరు టచ్‌లో ఉన్నారు’) నిందితులపై చర్యలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని భరద్వాజ్ కోరారు. కాగా, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆడియో టేపుల సంభాషణలు శుక్రవారం చదివి వినిపించారు. పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించారని ఆరోపించారు. దాంతోపాటు ‘రాష్ట్రాల్లోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్న ప్రధాని మోదీ.. ఈ సారి సరైన రాష్ట్రాన్ని ఎంచుకోలేదు’అని సుర్జేవాలా వ్యాఖ్యానించారు. (రసవత్తరంగా రాజస్తాన్ డ్రామా) -
‘ద్వేషం, ప్రతీకారానికి నిదర్శనం’
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాను ఆగస్ట్ 1లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం ప్రియాంక గాంధీకి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ చర్యపై కాంగ్రెస్ విరుచుకుపడింది. మోదీ ద్వేష, ప్రతీకార రాజకీయాలకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ‘ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ భయపడదు. మోదీ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఉంటాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత ద్వేషం, పగ ఉన్నాయో దేశం మొత్తానికి తెలుసు. వారు ఇప్పుడు అని హద్దులు దాటారు. ప్రియాంక గాంధీని బంగళా ఖాళీ చేయమంటూ నోటీసులు పంపి ప్రధాని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ ఆందోళనను వెల్లడించారు. కానీ ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ భయపడదు’ అంటూ ఆయన ఓ వీడియో మెసేజ్‌ను షేర్ చేశారు. (షాకింగ్ వీడియో: కళ్లు మూసుకోండి అంటూ..) ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేయాలని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆమెకు రాసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. 35, లోడీ ఎస్టేట్స్ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆగస్ట్ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. ప్రియాంక గాంధీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. -
‘లాక్డౌన్ తర్వాతి ప్లాన్ రూపొందించాలి’
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు కరోనాపై పోరు, లాక్డౌన్ అనంతర పరిస్థితులపై తగు ప్రణాళికతో ప్రధాని మోదీ ముందుకు రావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశ ప్రజలకు ప్రధాని స్పష్టమైన అవగాహన కల్పించాలని కోరింది. కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ..‘మరోసారి లాక్డౌన్ పెడతారా? ఈ లాక్ డౌన్ ఎంతకాలానికి ముగుస్తుంది? ఈ విషయాలపై ప్రధాని మోదీ 130 కోట్ల దేశ ప్రజలకు స్పష్టతనివ్వాలి’ అని కోరారు. వలస కార్మికులందరినీ రైళ్లలో ఆహారం అందించి ఉచితంగా సొంతూళ్లకు చేర్చాలని కోరారు. -
కాంగ్రెస్ నేత మృతి, కుటుంబానికి రాహుల్ పరామర్శ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత షంషేర్ సింగ్ సుర్జేవాలా(87) కన్నుమూశారు. అనారోగ్యంతో గతకొంత కాలంగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం మృతి చెందినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా తండ్రి అయిన షంషేర్ సింగ్.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆ రాష్ట్ర మంత్రిగా ఆయన సేవలు అందించారు. హర్యానా రైతు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన షంషేర్ సుర్జేవాలా రైతుల హక్కుల కోసం పోరాటం చేశారు. ఇవాళ మధ్యాహ్నం హర్యానాలోని నర్వాణాలో షంషేర్ సుర్జేవాలా అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఆయన మృతి విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సుర్జేవాలా కుటుంబాన్ని పరామర్శించారు. -
ప్రియాంక ఫోన్ హ్యాక్ చేశారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఫోన్ హ్యాక్‌కు గురైందని ఆ పార్టీ ఆరోపించింది. ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ వల్ల ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 1400 మంది ఫోన్లు హ్యాక్‌కు గురైనట్లు వాట్సాప్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని యూజర్లకు తెలిపేందుకు వాట్సాప్ ప్రత్యేక సందేశాలను బాధితులకు పంపింది. ఇలాంటి సందేశం ప్రియాంకాగాంధీ ఫోన్‌కు కూడా వచ్చినట్లు కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆదివారం స్పష్టంచేశారు. అయితే, పెగాసస్ వల్లనే హ్యాక్ అయినట్లు ఆ వాట్సాప్ సందేశం పేర్కొనలేదని చెప్పారు. ఈ హ్యాక్‌ను ప్రభుత్వమే చేయించిందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం కుట్రపూరిత మౌనాన్ని అవలంబిస్తోందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రభుత్వానికి ముందే చెప్పాం: వాట్సాప్ ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ భారత్‌కు చెందిన 121 మందిని టార్గెట్ చేసుకుందని సెప్టెంబర్‌లోనే ప్రభుత్వాన్ని హెచ్చరించామని వాట్సాప్ సంస్థ చెబుతోంది. అయితే, దీనిపై వాట్సాప్ తమకు పూర్తి సమాచారం ఇవ్వలేదని ఐటీ శాఖ పేర్కొంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రెండు పార్లమెంటరీ కమిటీలు ఫోన్ హ్యాకింగ్‌పై సమావేశాలు జరపనున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని హోంశాఖ కార్యదర్శి ద్వారా తెలుసుకోనున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన ఘటనలు చింతించదగ్గవని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. 15న జరగనున్న భేటీలో కశ్మీర్‌తో పాటు వాట్సాప్ అంశాన్ని కూడా చర్చిస్తామని తెలిపారు. -
ప్రియాంక ఫోన్ హ్యాక్ చేశారు
-
రాహుల్‌కు గుజరాత్ కోర్టు సమన్లు
అహ్మదాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలాకు గుజరాత్‌లోని ఓ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. 2016 నవంబర్‌లో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు(ఏడీసీబీ) రూ.750 కోట్ల విలువైన రద్దయిన నోట్లను కొత్త నోట్లతో మార్చి భారీ కుంభకోణానికి పాల్పడిందని వీరు తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆ బ్యాంకు చైర్మన్ అజయ్‌పటేల్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు మే 27వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ వారిద్దరికీ సోమవారం సమన్లు జారీ చేశారు. ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన ఐదు రోజుల్లోనే ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరైన బీజేపీ చీఫ్ అమిత్‌షాకు చెందిన రూ.745 కోట్ల మేర పాత నోట్లను కొత్తవాటితో మార్పిడి చేసిందని ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త తెలిపిన సమాచారం మేరకు రాహుల్ గాంధీ.. ‘కేవలం ఐదు రోజుల్లోనే రూ.750 కోట్ల పాతనోట్లను కొత్తనోట్లతో మార్పిడి చేసి, ప్రథమ బహుమతి గెలుచుకున్నందుకు కంగ్రాట్స్ అమిత్ షా జీ, డైరెక్టర్, అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్..’అంటూ ట్విట్టర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
‘అమితాబ్ కాదు.. విలన్ అవుతారు’
న్యూఢిల్లీ : అమేథీ ప్రజల ఆశీర్వాదంతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓడించినా.. రాజకీయ ప్రత్యర్థిగా ఎప్పటికీ ఆమెను గౌరవిస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. అమేథీ సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్‌లో కూడా పోటీ చేయడం ఇక్కడి ప్రజలను అవమానించడమంటూ స్మృతి ఇరానీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలపై స్పందించిన రణ్‌దీప్ సుర్జేవాలా గురువారం మాట్లాడుతూ.. ఆమె(స్మృతి) అమితాబ్ బచ్చన్‌ను కాపీ కొట్టాలని చూస్తున్నారు గానీ ఆఖరికి ఓ విలన్లా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. స్మృతి సిద్ధంగా ఉన్నారు.. ‘స్మృతి ఇరానీ ఇలా మాట్లాడటం వెనుక ఆమెకున్న ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆఖరికి ఓ విలన్లా మిగిలిపోతారు. అమేథీ ప్రజల ఆశీర్వాదంతో ఆమెను ఓడించి తీరతాం. వరుసగా మూడో పరాజయానికి స్మృతి సిద్ధంగా ఉన్నారు. రాహుల్ చేతిలో ఓడిపోతే ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చి ఎంపీని చేయగలరు. కాబట్టి చింతించాల్సిందేమీ లేదు గానీ.. స్మృతి తన మొత్తం జీవిత కాలంలో పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేరనే విషయాన్ని గమనించాలి’ అంటూ రణ్‌దీప్ చురకలు అంటించారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీకి పోటీగా బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన స్మృతి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందకు ఆమె సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాహుల్ అమేథీతో పాటుగా కేరళలోని వయనాడ్‌లో కూడా పోటీ చేస్తుండటంతో స్మృతి ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తానేమో అమేథీ ప్రజల ఆశీర్వాదం కోసం వస్తే.. రాహుల్ మాత్రం తనను దీవించిన ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ స్మృతి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
‘సర్జికల్స్’పై అతి వద్దు
ఛండీగఢ్: రెండేళ్ల క్రితం కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేసిన సర్జికల్ దాడులు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఉడీ దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ మెరుపు దాడులపై తొలినాళ్లలో సంబరాలు చేసుకోవడం సహజమేనని, కానీ అదే పనిగా ఆ విజయాన్ని ప్రచారం చేయడం తగదని మాజీ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా అన్నారు. 2016, సెప్టెంబర్ 29న సర్జికల్ దాడులు జరిగిన సమయంలో హూడా నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్నారు. ఛండీగఢ్‌లో శుక్రవారం ప్రారంభమైన మిలిటరీ సాహిత్య వేడుకలో ‘సీమాంతర ఆపరేషన్లు, సర్జికల్ దాడుల పాత్ర’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. మిలిటరీ చర్యల్ని రాజకీయం చేయడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. సర్జికల్ దాడుల ఆపరేషన్‌ను రహస్యంగా చేస్తే బాగుండేదని ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు. ఉగ్రవాదుల ఆవాసాల్ని కకావికలం చేయడమే కాకుండా వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడం కూడా ఈ ఆపరేషన్ వ్యూహాత్మక లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు దిగే ముందు శుత్రు మూకలపై వాటి ప్రభావం దీర్ఘకాలం కొనసాగేలా చూసుకోవాలని సూచించారు. పంజాబ్ గవర్నర్ వీపీ బాద్నోర్, పలువురు మాజీ ఆర్మీ కమాండర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మీని సొంత ఆస్తిలా భావించారు: కాంగ్రెస్ డీఎస్ హూడా నిజమైన సైనికుడిలా మాట్లాడారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కితాబిచ్చారు. సర్జికల్ దాడుల్ని మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారన్నారు. ‘ మిస్టర్ 36( 36 రఫేల్ విమానాల కొనుగోళ్లనుద్దేశిస్తూ) మిలిటరీని నిస్సిగ్గుగా తన సొంత ఆస్తిలా వాడుకున్నారు. రఫేల్ ఒప్పందంతో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్ల లబ్ధి చేకూర్చారు’ అని ట్వీట్ చేశారు. సర్జికల్ దాడులపై ఛాతీ చరుస్తూ మోదీ చేసిన చిల్లర రాజకీయాల్ని హూడా బట్టబయలు చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలపై రాజీపడి ప్రధాని దేశం ముందు దోషిగా నిలబడ్డారని పేర్కొన్నారు. -
‘మోదీ బండారం బట్టబయలు’
సాక్షి, న్యూఢిల్లీ: సర్జికల్ దాడులపై లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) డీఎస్ హుడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలచుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించింది. సర్జికల్ దాడులను రాజకీయంగా వాడుకున్నారని, అతిగా ప్రచారం చేశారని హుడా వ్యాఖ్యానించారు. 2016, సెప్టెంబర్ 29న భారత భద్రతా బలగాలు సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోని తీవ్రవాద తండాలపై ఆకస్మిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. సర్జికల్ దాడులు జరిగినప్పుడు ఆర్మీ నార్త్ కమాండ్ చీఫ్‌గా ఆయన ఉన్నారు. కాగా, ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో హుడా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హుడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన నిజమైన సైనికుడిలా మాట్లాడారని ప్రశంసించారు. సర్జికల్ దాడులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్న వారు ఏమాత్రం సిగ్గుపడటం లేదని పరోక్షంగా ప్రధాని మోదీని విమర్శించారు. ‘ నిజమైన సైనికుడిలా మాట్లాడారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. మన సైన్యాన్ని సొంత ఆస్తిలా వాడుకునేందుకు మిస్టర్ 36 మాత్రం ఏమాత్రం సిగ్గుపడటం లేదు. సర్జికల్ దాడులను ఆయన రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. రఫేల్ ఒప్పందంలో అక్రమాలకు పాల్పడి అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్లు లబ్ది చేకూర్చార’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. Spoken like a true soldier General. India is so proud of you. Mr 36 has absolutely no shame in using our military as a personal asset. He used the surgical strikes for political capital and the Rafale deal to increase Anil Ambani’s real capital by 30,000 Cr. #SurgicalStrike https://t.co/IotXWBsIih — Rahul Gandhi (@RahulGandhi) 8 December 2018 సర్జికల్ దాడులను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న ప్రధాని మోదీ బండారాన్ని బయటపెట్టినందుకు కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జెవాలా కూడా హుడాకు ధన్యవాదాలు తెలిపారు. సైనికుల త్యాగాలను రాజకీయాల కోసం వాడుకోవడం తగదన్నారు. దేశ భద్రతను ప్రమాదంలో పడేసిన మోదీ దోషి అని ట్వీట్ చేశారు. తన స్వార్థం కోసం వ్యూహాత్మక ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. Thank you Lt.Gen.Hooda for exposing the petty politicisation by PM Modi! No one can use the valour & sacrifice of our brave soldiers to score cheap political points Modiji is squarely guilty of compromising National Security & Strategic Interests by unwarranted chest thumping! pic.twitter.com/VjrUxS3alC — Randeep Singh Surjewala (@rssurjewala) 8 December 2018 -
కేసీఆర్ డ్రైవరైతే.. ఆ నలుగురే ప్యాసెంజర్లు..!
సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఆ ఐదుగురు చేతుల్లో బందీ అయిందని ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సూర్జేవాలా విమర్శించారు. టీఆర్ఎస్ కారులో సీఎం కేసీఆర్ డ్రైవరైతే, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్ ప్యాసెంజర్లనీ, కారులో వారికి తప్ప మిగతా ఎవరికీ చోటు లేదని ఎద్దేవా చేశారు. తన నియంతృత్వ పాలనతో కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని, రాష్ట్రాన్ని లూటీ చేసిందని ధ్వజమెత్తారు. అవినీతిలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉందని, కేసీఆర్ కింగ్ ఆఫ్ కరప్షన్ అని దుయ్యబట్టారు. శని వారం ఇక్కడ గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్, పీసీసీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనావైఫల్యాలపై 24 అంశాలతో కూడిన చార్జిషీట్ విడుదల చేశారు. కమీషన్ల కోసం సాగునీటి ప్రాజెక్టుల అంచనాలను ఇష్టారీతిన పెంచారని, మియాపూర్‌లో 796 ఎకరాల ప్రభుత్వభూమిని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని, ఎలాంటి టెండర్లు లేకుండా రూ.300 కోట్లతో పోలీసు వాహనాలు కొనుగోలు చేశారని సూర్జేవాలా ఆరోపించారు. 50 ఎకరాల రిజర్వ్ అటవీ భూములను టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావుకు అప్పనంగా కట్టబెట్టారని, మిషన్ భగీరథ పైపుల కొనుగోలులోనూ అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ అవినీతిపై పీపుల్స్ కమిషన్ వేసి, దోషులుగా ఎవరు తేలినా, వారు ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, అధికారి, ఎవరైనా కటకటాల వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలు బీజేపీ ముసుగులేనని, వారికి బీజేపీతో రహస్య మిత్రత్వం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ చార్జిషీట్లోని ముఖ్యాంశాలివీ.. - ఉద్యమంలో 1,200 మందికిపైగా బలిదానం చేసుకుంటే, కేవలం 400 మందికే సాయం చేశారు. - టీఆర్ఎస్ పాలనలో 4,511 మంది ఆత్మహత్య చేసుకున్నా, ఒక్కరినీ కేసీఆర్ పరామర్శించలేదు. రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వడ్డీలకే సరిపోయింది. - కోటి ఎకరాలకు నీళ్లిస్తామని ఒక్క ఎకరాకు కూడా అదనంగా ఇవ్వలేదు. ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ చేయడంతో జాతీయహోదా కోల్పోవాల్సి వచ్చింది. - వందరోజుల్లో నిజాం షుగర్స్ పునరుద్ధరిస్తామన్న మాటను నిలబెట్టుకోలేదు. - ఇంటికో ఉద్యోగమని చెప్పి తన కుటుంబంలోని ఐదుగురికి పదవులు ఇప్పించుకున్నారు. - లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 22,588 ఉద్యోగ నియామకాలు చేపట్టారు. - దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీనిచ్చి కేవలం 4,939 కుటుంబాలకే భూపంపిణీ చేశారు. - మైనార్టీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లని చెప్పి వాటి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. - కేసీఆర్ కేబినెట్లో మహిళలకు ప్రాతినిధ్యంలేదు. - మిగులు రాష్ట్రాన్ని టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో రూ.1.80 లక్షల కోట్ల అప్పుల పాలుచేసింది. - ఆరోగ్య శాఖలో అంబులెన్స్‌ల కొనుగోలు, ఇసుక వేలంలో అవినీతి జరిగింది. వాటర్‌గ్రిడ్, పోలీసు వాహనాల కొనుగోలు, మిషన్ కాకతీయ, ఆర్ అండ్ బీ టెండర్లలో అక్రమాలు జరిగాయి. -
‘కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్’ను సాగనంపుతాం
సాక్షి, హైదరాబాద్: ‘ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఎన్నో ఉద్యమాలూ, పోరాటాలూ చేశారు. వారి ఆత్మబలిదానాలను చూసి చలించిన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ, ప్రజల కలలు సాకారం కాకపోగా ఇక్కడ కుటుంబ పాలన నడుస్తోంది. కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సాగనంపుతాం’అని ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. త్వరలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా మీకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీతో పొత్తుపై ఏమంటారు? సూర్జేవాలా: ఈ కూటమిలో ఒక్క టీడీపీనే కాదు, అనేక పార్టీలున్నాయి. కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు మాతో కలసి వచ్చిన పార్టీల్లో టీడీపీ కూడా ఒకటి. తెలంగాణకు సరికొత్త దిశానిర్దేశం చేయడానికి, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి, రైతుల సాగునీటి వెతలు తీర్చడానికి, ఆత్మహత్యలకు చరమగీతం పాడటానికి, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి కూటమి బాటలు వేస్తుందని విశ్వసిస్తున్నాం. ఏపీలోనూ టీడీపీతో పొత్తు కొనసాగుతుందా? సూర్జేవాలా: ఏపీలో తెలుగుదేశంతో పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల బరిలో తీవ్రంగా పోరాడుతున్నాం. ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకుంటే తెలంగాణ కల సాకారమైంది. కానీ, అమరుల ఆకా>ంక్షలు నెరవేరలేదు. ప్రజల కలలు తీరలేదు. వాటిని నెరవేర్చేందుకే సరికొత్త తెలంగాణ సాధనలో భాగంగా మేం కూటమికి నేతృత్వం వహిస్తున్నాం. 2018లో మీరు అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తారా? సూర్జేవాలా: కాంగ్రెస్ పార్టీలో అనేకమంది సీనియర్ నేతలు ఉన్నారు. తెలంగాణలో మా విజయం తరువాత ఈ విషయంపై పార్టీలోని నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కానీ, కేసీఆర్ దళితుడిని సీఎం చేసి తాను కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమవుతానని చెప్పారు. అంతే తప్ప, నిమిషంపాటు కూడా ఇతరులకు అధికారమివ్వలేదు. గతంలో మీకు ఎంఐఎంతో కలసి పనిచేసిన చరిత్ర ఉంది కదా? సూర్జేవాలా: తెలంగాణలో కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇద్దరూ బీజేపీ ముసుగులే. బీజేపీని ఒకరు ముందుండి, మరొకరు వెనకుండి నడిపిస్తున్నారు. వీరిలో ఎవరికి ఓటేసినా అది బీజేపీకి వేసినట్లే అవుతుంది. -
బోఫోర్స్ కేసులో కాంగ్రెస్‌కు ఊరట
-
సీబీఐ ‘బోఫోర్స్’ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: బోఫోర్స్ శతఘ్నల కొనుగోలు కుంభకోణం కేసులో 2005 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన అదే తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాది, బీజేపీ నేత అజయ్ అగర్వాల్ పిటిషన్ వేశారనీ, ఆ పిటిషన్లో∙సీబీఐ కక్షిదారుగా చేరొచ్చని కోర్టు సూచించింది. హిందుజా సోదరులు సహా బోఫోర్స్ కేసులోని నిందితులందర్నీ నిర్దోషులుగా విడుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు 2005లో తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో కేసువేసింది. సాధారణంగా హైకోర్టులో తీర్పు వెలువడిన తర్వాత 90 రోజుల్లోనే ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సి ఉంటుంది. అయితే సీబీఐ 13 ఏళ్ల తీవ్ర జాప్యం తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిందనీ, ఈ ఆలస్యానికి సరైన కారణం కూడా చెప్పలేకపోయిందంటూ కోర్టు సీబీఐ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ తీవ్ర జాప్యానికి సీబీఐ తెలిపిన కారణాలతో మేం సంతృప్తి చెందడం లేదు. ఇదే కేసుకు సంబంధించి అజయ్ అగర్వాల్ పిటిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉంది. ఆ పిటిషన్లోనే సీబీఐ కూడా కక్షిదారుగా చేరి వాదనలు వినిపించవచ్చు. విచారణను పునఃప్రారంభించేందుకు అనుమతి కోరవచ్చు’ అని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హేమంత్ గుప్తాలు సభ్యులుగా గల ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు నాటి యూపీఏ ప్రభుత్వాలు తమకు అనుమతివ్వక పోవడం కారణంగానే 13 ఏళ్ల ఆలస్యమైందని సీబీఐ వాదించింది. -
‘వారిద్దరు కలియుగ కైకేయిలాంటి వారు’
న్యూఢిల్లీ : బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండు కలియుగ కైకేయిలాంటి వారు. కేవలం ఎలక్షన్ల ముందు మాత్రమే వారికి శ్రీరాముడు గుర్తుకు వస్తాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాన్‌దీప్ సుర్జేవాలా మండిపడ్డారు. ఇందుకు కారణం రెండు రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘ఆర్ఎస్ఎస్, బీజేపీ రెండు కూడా అయెధ్యలో రామ మందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నాయని.. దీన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించలేరం’టూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సుర్జేవాలా స్పందిస్తూ.. ‘సత్య యుగంలో కైకేయి కేవలం 14 సంవత్సరాలు మాత్రమే రామున్ని రాజ్య బహిష్కరణ చేసింది. కానీ నేటి కలియుగ కైకేయి అయిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మాత్రం 30 ఏళ్ల పాటు రామున్ని బహిష్కరించారు. ఎన్నికలకు నాలుగ నెలల ముందు మాత్రమే వారికి శ్రీరాముడు గుర్తుకు వస్తాడు. ఎన్నికలయిపోగానే రామున్ని వదిలేస్తారు. వీరంతా కేవలం వానాకాలంలో మాత్రమే అరిచే కప్పల వంటి వారు. కేవలం బెకబెకమంటారు తప్ప చేతల్లో ఏం ఉండదం’టూ విమర్శించారు. అంతేకాక ప్రస్తుతం రామజన్మభూమి - బాబ్రీ మసీద్ వివాదం సుప్రీంకోర్ట్‌లో పెండింగ్‌లో ఉంది. కోర్టు ఏలాంటి తీర్పు వెలువరించిన దాన్ని అందరూ పాటించాలి అని తెలిపారు. -
‘మహాకూటమి మీడియా కల్పన మాత్రమే’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ఎన్డీయేను గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మాత్రం భిన్నంగా స్పందించారు. మహాకూటమి అనేది కేవలం మీడియా సృష్టి మాత్రమేనని... ఒంటరిగానే బీజేపీని ఎదుర్కోగల సామర్థ్యం తమ పార్టీకి ఉందంటూ వ్యాఖ్యానించారు. కాగా నరేంద్ర ప్రభుత్వం అసమర్థత వల్లే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారు బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుండగా.. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే వీరికి లోన్లు మంజూరయ్యాయంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇండియా టుడే ప్రతినిధితో మాట్లాడిన రణ్‌దీప్ సూర్జేవాలా.. వివిధ అంశాలపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల గురించి స్పష్టత ఇచ్చారు. మోదీజీ వీటికి సమాధానం చెప్పాలి.. రఘురాం రాజన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ... ‘2014కు ముందు ఎన్పీఏ(నాన్ పర్ఫార్మింగ్ అస్సెట్) విలువ 2.80 లక్షల కోట్ల రూపాయాలు. కానీ నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఆ విలువ 12 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. కేవలం నాలుగేళ్లలో ఇది ఎలా సాధ్యమైందో మోదీజీ సమాధానం చెప్పాలి. అదే విధంగా గతేడాది వెలుగులోకి వచ్చిన బ్యాంకు మోసాల విలువ లక్ష కోట్ల రూపాయలు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎన్డీయే ప్రభుత్వమేనని’ రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఇంధన ధర విషయంలో తామేమీ చేయలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఎక్సైజ్ సైజ్ సుంకాన్ని తగ్గించిందని పేర్కొంటూ... మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడంలేదని ప్రశ్నించారు. అవన్నీ బోగస్ కేసులు.. మోదీ ప్రభుత్వం అవినీతికి చిరునామాగా మారిందని విమర్శిస్తున్న కాంగ్రెస్.. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బెయిలు పైన బయట ఉన్నారు కదా అన్న ప్రశ్నకు బదులుగా.. అవన్నీ బోగస్ కేసులని, వారిద్దరికి క్లీన్చిట్ లభిస్తుందని రణ్‌దీప్ పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమని నైతికంగా దెబ్బతీసేందుకే బీజేపీ ఈ విషయాలను హైలెట్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కుల రాజకీయాలకు అనుకూలమా.!? కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ డీఎన్ఏ కలిగి ఉందనడంలో తన ఉద్దేశాన్ని తెలుపుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. అదే విధంగా అగ్రవర్ణాలకు చెందిన పేదల బాగోగులను కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే బ్రాహ్మణులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉండాలన్నాను. అందులో తప్పేముందంటూ రణ్‌దీప్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ శివభక్తుడు.. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శివభక్తుడని, ఆయనకు పరమత సహనం మెండుగా ఉందని రణ్‌దీప్ వ్యాఖ్యానించారు. బీజేపీలాగా హిందూ మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకునే కుటిల బుద్ధి తమ నాయకుడికి లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ.. ఆరెస్సెస్‌ను ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చడాన్ని సమర్థిస్తూ.. బీజేపీని నడిపించే ఆరెస్సెస్ భావజాలం భారత్‌కు ఎప్పటికైనా ప్రమాదకరమైందేనని వ్యాఖ్యానించారు. -
మోదీ ప్రసంగమంతా డొల్లే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం అసలు విషయం లేకుండానే డొల్లగా సాగిందని కాంగ్రెస్ విమర్శించింది. మోదీ ఈసారైనా నిజాలు మాట్లాడి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ.. ‘దేశ ప్రజలకు ఉపయోగపడే ఒక్క విషయాన్నీ మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. ప్రజలు బీజేపీ చెబుతున్న బూటకపు అచ్ఛేదిన్(మంచి రోజులు)తో విసిగిపోయారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపే సచ్చే దిన్(నిజమైన రోజులు) కోసం వారు ఎదురుచూస్తున్నారు’ అని విమర్శించారు. 2013లో ఛత్తీస్‌గఢ్‌లో ఎర్రకోట తరహాలో ఏర్పాటు చేసిన నిర్మాణం నుంచి మోదీ ప్రసంగిస్తూ.. ప్రభుత్వ అవినీతి, చైనా, పాకిస్తాన్ల చొరబాట్లు, రూపాయి పతనం, నిరుద్యోగిత తదితర అంశాల్లో చర్చకు రావాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సవాలు విసిరారని సూర్జేవాలా గుర్తుచేశారు. అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఇదే అంశాలపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. -
‘56 అంగుళాల ఛాతి ఎప్పుడు చూపిస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనాతో ఉన్న డోక్లాం సమస్యను చర్చించకపోడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ పదో శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం అయ్యారు. ఇరునేతల మధ్య సమావేశంలో జాతీయ సమస్య అయిన డోక్లాం గురించి ప్రధాని చర్చింకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తీవ్రంగా తప్పుపట్టారు. రణ్‌దీప్ సూర్జేవాలా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జాతీయ సరిహద్దు సమస్య అయిన డోక్లాంపై చైనాతో ఎందుకు చర్చించలేదు. సరిహద్దులో చైనా దురాక్రమణను ఎందుకు ప్రశ్నించలేకపోయారు. 56 అంగుళాల ఛాతి, ఎర్రటి కళ్లు, ధైర్యంతో ప్రత్యర్ధిని ఎప్పుడు హెచ్చరిస్తారు. ఆ సమయం కోసం 132 కోట్ల మంది భారతీయులు ఎంతో ఆత్రుతగాఎదురుచూస్తున్నారు. డోక్లాంలో చైనా తన బలగాలను పటిష్టం చేస్తోందని ఇటీవల అమెరికా కాంగ్రెస్ కమిటీ పేర్కొంది. భారత సరిహద్దు భద్రతకు ముప్పు ఉందని అమెరికా ఇదివరకే ప్రకటించింది. అయినా ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇంత వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. మోదీ గతంలో పలుమార్లు చైనా పర్యటనకు వెళ్లారు. కానీ భారత సరిహద్దులో చైనా చేస్తున్న దుశ్చర్యను మాత్రం ఖండించలేదు. భూటాన్‌తో చైనాకు ఏలాంటి దౌత్యపరమైన సంబంధాలు లేవు. అయినా కూడా భారత్ ప్రమేయం లేకుండా చైనా డోక్లాం అంశంపై భూటాన్‌తో చర్చలు జరిపింది’ అని వెల్లడించారు. -
సోనియా లక్ష్యంగా ‘అగస్టా’ కుట్ర
న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని ఇరికించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇందులోభాగంగా సోనియాకు వ్యతిరేకంగా తప్పుడు నేరాంగీకార వాంగ్మూలం ఇవ్వాలని ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిచెల్‌ను విచారణ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని వెల్లడించింది. ప్రతిపక్ష నేతలను వేధించేందుకు ప్రధాని మోదీ విచారణ సంస్థలను వాడుకుంటున్నారంది. ఈ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు తప్పుడు ఆధారాల సృష్టికి సాక్షాత్తూ ప్రధానమంత్రి పూనుకోవడం భారత దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నడూ సంభవించలేదు’ అని మండిపడ్డారు. ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా ఉన్న క్రిస్టియన్ మిచెల్‌ను దుబాయ్ పోలీసులు రెండ్రోజుల క్రితం అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే. శిక్ష నుంచి తప్పించుకునేందుకు సోని యాకు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని మిచెల్‌ను విచారణ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని అతని లాయర్ ఆరోపించారు. -
మోదీ ఇమేజ్ పెంచుకునేందుకే వీడియో విడుదల చేశారు
-
‘బీజేపీ దిగజారుడుతనానికి సాక్ష్యం ఈ వీడియో’
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ నరేంద్ర మోదీ తన ఇమేజ్ను పెంచుకునేందుకే సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో విడుదల చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన ఘనత భారత సైనికులకు ఇవ్వకుండా బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. రాజకీయంగా లాభపడేందుకే సైనికులకు చెందాల్సిన ఘనత మోదీకి కట్టబెట్టడం వారి అధికార దాహానికి నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈవిధంగానే సిగ్గు లేకుండా సైనికుల త్యాగాన్ని తమ ఖాతాలో వేసుకుని ఓట్లు సంపాదించాలని చూసిందని విమర్శించారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే... మోదీ ప్రభుత్వ వైఫల్యాలు బయట పడినపుడు, అమిత్ షా వ్యూహాలు ఫలించని సమయాల్లో ఇటువంటి దిగజారుడు చర్యలకు పాల్పడటం వారికి అలవాటేనంటూ సుర్జేవాలా విమర్శించారు. మెదీ ప్రభుత్వం అసమర్థత వల్లే 146 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. 1600 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, 79 ఉగ్రదాడులు జరగడం ప్రభుత్వ వైఫల్యం కాక మరేమిటని ప్రశ్నించారు. శత్రువుల దాడులను ఎదుర్కొనేందుకు అధునాతన పరికరాలు కొనుగోలు చేసేందుకు నిధులు అందించలేని మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ గురించి చెప్పుకోవడం సిగ్గుచేటాన్నరు. మాజీ ప్రధానులు అటల్‌బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్‌లు భద్రతా ప్రమాణాల దృష్ట్యా సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టారు కానీ తమ గొప్పను ప్రదర్శిచుకోవడానికి వాటిని ఉపయోగించుకోలేదన్నారు. మోదీ, బీజేపీ చేస్తోన్న రాజకీయాలకు బలికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన హెచ్చరించారు. కాగా, ఉడీ ఘటనకు ప్రతీకారంగా పాక్ అక్రమిత కశ్మీర్‌లోని(పీఓకే) ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో నిజమైనదేనని సర్జికల్ స్ట్రైక్స్‌కు ఇంచార్జ్‌గా వ్యవహరించిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా నిర్ధారించారు. -
ఫేస్బుక్ వార్!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా లీకేజ్ వివాదం భారత్‌కూ పాకింది. కోట్లాది ఫేస్బుక్ వినియోగదారుల వివరాలను పలు దేశాల్లో రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాల రూపకల్పనకు అక్రమంగా వినియోగించిన సంస్థ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ)’తో భారత్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధం ఉందన్న వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ తదితర పార్టీలు తమ క్లయింట్లేనంటూ ఆ సంస్థ భారతీయ భాగస్వామి ఓబీఐ (ఒవలెనొ బిజినెస్ ఇంటలిజెన్స్) తన వెబ్సైట్లో ప్రకటించడం సంచలనం రేకెత్తించింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. సీఏతో అంటకాగింది, సంబంధాలు కొనసాగిస్తోంది మీరంటే.. మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించారు. సోషల్‌మీడియాలో రాహుల్ విస్తృతి వెనుక ఉన్నది ‘సీఏ’నేనని, ఓటర్లను ఆకర్షించేందుకు ఆ సంస్థ సేవలను కాంగ్రెస్ వాడుకుంటోందని బీజేపీ నేత, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మరోవైపు, బిహార్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ ఈ సంస్థ సేవలను వినియోగించుకుందంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందుకు ఉద్దేశించిన ‘బ్రెగ్జిట్’ ఉద్యమంలో ‘సీఏ’ పాత్రపై వివాదం చెలరేగి, పలు దేశాల్లో దర్యాప్తులు కొనసాగుతున్న వేళ.. భారత్‌నూ ఈ అంశం కుదిపేయడం రానున్న రోజుల్లో సోషల్ మీడియా ప్రభావాన్ని కళ్లకు కడుతోంది. కాంగ్రెస్ జవాబివ్వాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతిలో కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకున్న సంబంధమేంటో రాహుల్ గాంధీ చెప్పాలని రవిశంకర్ డిమాండ్ చేశారు. ‘ఈ డేటా విశ్లేషణ సంస్థ సెక్స్, అనైతిక మార్గాలు, అసత్యపు వార్తల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేస్తుందని నిరూపితమైంది. ఇలాంటి సంస్థతో కాంగ్రెస్ కలిసి పనిచేస్తోంది’ అని ఆయన ఆరోపించారు. ‘2019 ఎన్నికల ప్రచారంలో మోదీపై కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం అంటూ మీడియాలోని ఓ వర్గం ప్రచారం చేస్తుంటే ఏమో అనుకున్నాం. అది ఇదేనా. సీఏ సంస్థ అమ్మాయిలను ఎరగా వేసి, డబ్బులు ఆశజూపి రాజకీయ నాయకులను ఉచ్చులోకి దించుతుంది, ఫేస్బుక్ డేటాను చోరీ చేస్తుంది. ఇదేనా కాంగ్రెస్ చేయాలనుకున్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సంస్థ డేటా విశ్లేషణ వివరాల ద్వారానే ఓటర్లను ఆకర్షిస్తోందా?’ అని ప్రశ్నించారు. ఫేస్బుక్కూ వార్నింగ్ ఫేస్బుక్ వినియోగిస్తున్న 20 కోట్ల మంది భారతీయ వినియోగదారుల వివరాలను దుర్వినియోగం చేసినట్లు తెలిస్తే.. ఫేస్బుక్ సంస్థపై కఠిన చర్యలు తప్పవని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాలు కూడా ఎన్నికల విధానాన్ని అనైతిక పద్ధతుల్లో ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. భారత ప్రభుత్వం మీడియా, భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తుందని, సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకోవటం తప్పుకాదన్న మంత్రి.. దీన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఊరుకోబోమన్నారు. ‘దేశ ప్రయోజనాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయమిది. భారత ప్రజాస్వామ్య విధానాన్ని ప్రభావితం చేసే ఏ అంశాన్నైనా సీరియస్‌గా తీసుకుంటాం. అవసరమైతే.. జుకర్‌బర్గ్‌ను భారత్‌కు రప్పించి విచారిస్తాం’ అని ఆయన అన్నారు. బీజేపీతోనే సంబంధాలు బీజేపీయే ఈ సంస్థతో సంబంధాలు పెట్టుకుందని.. అనవసరంగా తమపై ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. బిహార్, గుజరాత్ ఎన్నికల సమయంలో ఈ సంస్థ సేవలను బీజేపీ వినియోగించుకుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. పార్టీకి గానీ, రాహుల్‌కు గానీ సీఏ సంస్థతో సంబంధాల్లేవన్నారు. ఇతర సమస్యలనుంచి దేశం దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు. ‘అవాస్తవాలను ప్రచారం చేయటంలో దిట్ట అయిన బీజేపీ నేడు మరో అసత్యాన్ని తెరపైకి తెచ్చింది. అబద్ధపు ప్రెస్ కాన్ఫరెన్స్, అసత్యాల ఎజెండా, అనైతిక వ్యూహం, అసత్య ప్రకటనలు బీజేపీ, న్యాయంలేని న్యాయశాఖ మంత్రి దినచర్యలో భాగమయ్యాయి’ అని సుర్జేవాలా విమర్శించారు. బిహార్ ఎన్డీయే నేత కుమారుడే సీఏ భారతీయ సంస్థ ఓవిలేనో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ)ను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. యూఎస్, యూకేల్లో విచారణలు ఐదుకోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల వివరాలను తస్కరించడంపై అమెరికా, బ్రిటన్ సహా పలు యూరోపియన్ దేశాలు విచారణకు ఆదేశించాయి. తమ ముందు విచారణకు హాజరవ్వాలంటూ ఇప్పటికే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆదేశించాయి. అమెరికాలో ఈ కేసును ఆ దేశ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) విచారిస్తోంది. విచారణకు తమ ముందు హాజరవ్వాలని అమెరికన్ కాంగ్రెస్ జుకర్‌బర్గ్‌కు నోటీసులు పంపింది. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ 2016 ఎన్నికల్లో ట్రంప్ తరపున ప్రచార బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించింది. చిత్తశుద్ధితో చేస్తున్నాం: ఫేస్బుక్ ఫేస్బుక్ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని.. అందువల్ల ఈ సంస్థపై 40వేల డాలర్ల (దాదాపు రూ. 26 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్టు ఓ కథనంలో పేర్కొంది. తాజా వార్తల నేపథ్యంలో ఫేస్బుక్ షేర్లు బుధవారం మరో 2.6 శాతం పడిపోయాయి. కాగా, ఓ రాజకీయ కన్సల్టెన్సీ తమ వినియోగదారుల డేటా చోరీ చేయటంపై ఆందోళనలో ఉన్నట్లు ఫేస్బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘మేం మోసపోయామని అర్థమైంది. మా పాలసీలకు అనుగుణంగా వినియోగదారుల భద్రతను కాపాడేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. జుకర్‌బర్గ్ సహా మిగిలిన ఉన్నతాధికారులంతా రాత్రింబవళ్లు ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఫేస్బుక్ పేర్కొంది. ‘డిలీట్ ఫేస్బుక్’ ఉద్యమం వ్యక్తిగత డేటా లీకేజీ ఘటన అనంతరం.. ఫేస్బుక్ అకౌంట్‌ను తొలగించాలంటూ వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ పేర్కొన్నారు. ‘డిలీట్ ఫేస్బుక్.. ఇదే సరైన సమయం’ అని బ్రయాన్ ఆక్టన్ పేర్కొన్నారు. అటు డిలీట్ ఫేస్బుక్ ప్రచారం మిగిలిన సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. పలు మీడియా సంస్థలు కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాలిఫోర్నియాకు చెందిన వాట్సాప్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ 2009లో వాట్సాప్ సేవలను ప్రారంభించింది. 2014లో ఫేస్బుక్ సంస్థ 19 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.2 లక్షల కోట్లు)కు ఈ సంస్థను కొనుగోలు చేసింది. కాగా, గతేడాది సెప్టెంబర్‌లోనే బ్రయాన్ ఫేస్‌బుక్‌ను వదిలి కొత్త సంస్థలో చేరారు. ఫేస్బుక్ డేటాతో ఏం చేస్తారు? స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారిలో దాదాపు ప్రతీ ఒక్కరు ఫేస్బుక్ అకౌంట్ ఉన్నవారే. తమ వ్యక్తిగత, వృత్తిగత వివరాలను అందులో పొందుపర్చినవారే. రాజకీయం, సామాజికం, సాహిత్యం సహా దాదాపు అన్ని సమకాలీన అంశాలు, ఘటనలపై తమ అభిప్రాయాలను పంచుకున్నవారే. ఫేస్బుక్ వినియోగదారుల వివరాలతో కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఏం చేసింది? ఆ వివరాలను ఎందుకు, ఎలా వినియోగించింది? దాంతో తమకేం నష్టం?.. ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు ఎన్నో వినియోగదారులను వేధిస్తున్నాయి. అలెగ్జాండర్ నిక్స్ సీఏ చేసే పనేంటి? స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లాబొరేటరీస్ (ఎస్సీఎల్) అనే సంస్థ బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తోంది. దీనికి అనుబంధంగా కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ) అనే సంస్థ ఉంది. ఇది క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా డేటా విశ్లేషణలో సహకరిస్తుంది. ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకుని తమ క్లయింట్ల ఎన్నికల ప్రచారానికి వ్యూహాలను సీఏ రూపొందిస్తుంది. ఏ పార్టీకి అనుకూలంగా ఓటర్లు ఉన్నారనే అంతర్గత సమాచారం, వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా క్లయింట్ల వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఎన్నికల్లో గెలిచేందుకు అసత్యవార్తలను ఫేస్బుక్లో ప్రచారం చేయటం, మాజీ గూఢచారులతో వ్యూహాలు రూపొందించటం కూడా సీఏ పనే. అవసరమైతే ప్రత్యర్థి అభ్యర్థులపై హానీట్రాప్ (అమ్మాయిలను ఎరగావేయటం)కూ వెనుకాడరని ఈ సంస్థపై ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. సీఏ సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ బీబీసీ ఛానెల్ 4 ‘స్టింగ్ ఆపరేషన్’లో అడ్డంగా దొరికిపోవడం ద్వారానే ఈ డొంకంతా కదిలింది. అమెరికా ఎన్నికలు, బ్రెగ్జిట్తోపాటు, బ్రిటన్, ఇజ్రాయిల్‌లలో రాజకీయ నేతల తెరవెనక సమాచార సేకరణ కోసం మాజీ గూఢచారుల సేవలను వినియోగించుకున్నామని కూడా నిక్స్ వెల్లడించాడు. యాప్‌లతో కొట్టేస్తారు.. ఫేస్బుక్లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఈ సంస్థ సేకరించి అధ్యయనం చేస్తుంది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ అనే కంపెనీ ‘పర్సనాలిటీ క్విజ్’ అనే యాప్‌ను రూపొందించింది. దీన్ని దాదాపు 3 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ను తెరిచేందుకు ఫేస్‌బుక్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు.. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులతోపాటు వారి ఫేస్బుక్ మిత్రుల (మొత్తం సంఖ్య కోట్లలోనే) వివరాలు, వారి ఇష్టాయిష్టాలను ఈ సంస్థ తెలుసుకోగలిగింది. ఇలా అక్రమంగా సేకరించిన సమాచారంతో సీఏ ‘సైకలాజికల్ ప్రొఫైల్స్’ను సృష్టించి విశ్లేషిస్తుంది. ఏం చేస్తే ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చు? వ్యతిరేకతనుంచి గట్టెక్కేందుకు ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయాలి? అనే వివరాలనూ ఈ సంస్థ సూచిస్తుంది. ట్రంప్ వెనకా, బ్రెగ్జిట్ ముందూ.. సీఏనే! ఒక్కో అమెరికా ఓటర్ నాడిని, మానసిక స్థితిని తెలుసుకోవటం కోసమే.. 2016 అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో సీఏ పనిచేసిందని స్పష్టమైంది. తద్వారా ట్రంప్ అనుకూల ఎన్నికల ప్రచార వ్యూహాలు సిద్ధం చేసింది. అటు, బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్ ఓటర్లనూ ప్రభావితం చేయడంపై బ్రిటన్ విచారణ జరుపుతోంది. భారత్‌లో ఇప్పటికే పునాదులు భారత్‌లోని ఒవిలెనో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ) గ్రూపు.. సీఏ మాతృ సంస్థ అయిన ఎస్సీఎల్తో 2010 నుంచి కలిసి పనిచేస్తుంది. 2014 ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు కోసం ఈ సంస్థ బీజేపీ, కాంగ్రెస్‌లను సంప్రదించినా డీల్ కుదరలేదని సమాచారం. 2019 ఎన్నికల కోసం ప్రస్తుతం ఈ రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. భారత్‌లోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమ క్లయింట్లేనని ఓబీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. 2016లో ఓ ప్రాంతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా గ్రూపు ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడలేదు’ అని ఒబీఐ హెడ్ అమ్రిష్ త్యాగి (జేడీయూ మాజీ రాజ్యసభ సభ్యుడు కేసీ త్యాగి కుమారుడు) పేర్కొన్నారు. 2010 బిహార్ ఎన్నికల్లో.. 2010 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ‘లోతైన ఎన్నికల విశ్లేషణ’ జరిపినట్టు ఓబీఐ పేర్కొంది. ఈ కాంట్రాక్ట్‌లో భాగంగా వివిధ పార్టీల వైపు ఆసక్తి చూపే ఓటర్లను గుర్తించామని తెలిపింది. తమ సంస్థ పనిచేసిన సీట్లలో 90 శాతానికి పైగా స్థానాల్లో తమ క్లయింట్ విజయం సాధించినట్టు ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. అత్యధిక యువ ఓటర్లున్న భారత్‌లో యువత వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనుంది. 2019 ఎన్నికల్లో దేశంలోని 13.30 కోట్ల మంది ఓటర్లు తొలిసారి పోలింగ్ బూత్‌లకు రానున్న నేపథ్యంలో వారి నాడిని పసిగట్టేందుకు సామాజిక మాధ్యమాలే కీలకం కానున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మోదీ 'నీరవ్' కాకూడదు
న్యూఢిల్లీ : బ్యాంకుల్లో వెలుగు చూస్తున్న కుంభకోణాలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వంపై మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో రూ.54,317 కోట్ల బ్యాంకు కుంభకోణాలు జరిగాయని, ఈ విషయంపై నరేంద్రమోదీ గొంతు విప్పాలని డిమాండ్ చేసింది. నీరవ్(సైలెంట్) మోదీ నుంచి ప్రధాని బయటికి రావాలని భారత్ డిమాండ్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. అంటే ప్రధాని మోదీ నీరవ్(సైలెంట్) మోదీ కాకూడదని, సైలెంట్ మోదీ నుంచి బోల్ మోదీలాగా మారాలన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో మోసగాడి కొత్త మంత్రం పారిపోవడం, ఎగిరిపోవడమేనని చెప్పారు. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన సమాచారంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ముంబైలోనే రూ.19,317 కోట్ల మోసాలు, స్కాంలు చోటు చేసుకున్నాయని తెలిపారు. 2015లో రూ.5,560.66 కోట్లు, 2016లో రూ.4,273.87 కోట్లు, 2017లో ఉరూ.9,838.66 కోట్లు కుంభకోణాలు జరిగాయని సుర్జేవాలా చెప్పారు. ఈ స్కామ్‌లు, మోసాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 189 మంది తప్పించుకున్నారని ఆరోపించారు. మోదీ, ఫడ్నవీస్ ప్రభుత్వాలు దోపిడీలకు వన్-వే టిక్కెట్ లాంటివని చెప్పారు. ఈ ఆరోపణలు బీజేపీ ఖండిస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే ఈ మోసాలు జరిగినట్టు ఆరోపణలను తిప్పికొడుతోంది. -
అబ్కీ బార్.. సెన్సార్షిప్ సర్కార్ : వైరల్ వీడియో ఊస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో దుమ్మురేపుతోన్న ‘మోదీ, రాహుల్ మిమిక్రీ’ వీడియోను టీవీలో ప్రసారం చేయకపోవడంపై వివాదం రాజుకుంది. ఆఖరికి కామెడీ షోలపైనా నెన్సార్షిప్ విధిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయింది. అబ్కీ బార్ సెన్సార్షిప్ సర్కార్ : ‘ఇది నిషేధాజ్క్షల ప్రభుత్వం. పౌరులు ఏం తినాలో, ఎలాంటి దుస్తులు ధరించాలో, ఏమేమి చూడాలో.. ఆఖరికి ఎవరిని పెళ్లాడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయింస్తుంది. ఇక ఏం ఆలోచించాలన్నది కూడా వారి నిర్దేశాన్ని బట్టే జరగాలా!’’ అని సుర్జేవాలా రాసుకొచ్చిన సుర్జేవాలా.. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నినాదమైన ‘అబ్కీ బార్ మోదీ సర్కార్’ నినాదాన్ని ఎద్దేవా చేస్తూ ‘అబ్కీ బార్ సెన్సార్షిప్ సర్కార్’ అని శీర్షిక ఇచ్చారు. కమెడియన్ శ్యాం రంగీలా వీడియో వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏమిటా వీడియో? : మిమిక్రీ ఆర్టిస్టుగా ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంపాదించిన యువ కమెడియన్ శ్యాం రంగీలా.. ‘ది గ్రేట్ ఇండియన్ లాఫర్ చాలెంజ్’ అనే రియాలిటీ కోసం ఇటీవల ఆడిషన్ ఇచ్చాడు. స్టార్ టీవీలో ప్రసారం అవుతోన్న ఆ షోలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీలను అనుకరిస్తూ శ్యాం మిమిక్రీ చేశాడు. ఆ ఆడిషన్ తాలూకు వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే సదరు వీడియోను టీవీలో ప్రసారం చేయబోమని చానెల్ నిర్వాహకులు ప్రకటించడంతో వివాదం మొదలైంది. మోదీని ఇమిటేట్ చెయ్యొద్దన్నారు : స్టాండప్ కమెడియన్ శ్యాం రంగీలా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ లాఫర్ చాలెంజ్- రియాలిటీ షో కోసం నేను ఇచ్చిన ఆడిషన్‌ను టీవీలో ప్రసారం చేయబోమని నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. తొలుత మోదీని ఇమిటేట్ చెయ్యొద్దని, ఆ తర్వాత రాహుల్‌ని కూడా అనుకరించొద్దని అన్నారు. చానెల్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నందునే వీడియోను ప్రసారం చేయడంలేదన్నారు’’ అని ‘ది వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మోదీ, రాహుల్‌ను అనుకరిస్తూ రంగీలా మిమిక్రీ వీడియో -
అబ్కీ బార్.. సెన్సార్షిప్ సర్కార్ : వైరల్ వీడియో ఊస్ట్
-
నోట్ల రద్దు పెద్ద స్కామ్: కాంగ్రెస్
-
నోట్ల రద్దు పెద్ద స్కామ్: కాంగ్రెస్
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు దేశ రాజకీయ చరిత్రలో పెద్ద స్కామ్ అని కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆరోపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 8 వరకు జరిగిన ఆర్ఎస్ఎస్, బీజేపీ ఖాతాల లావాదేవీల వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఇటీవల భారీ మొత్తంలో పట్టుబడిన నగదు బీజేపీదేనని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా ఆరోపించారు. ఘజియాబాద్ లో రూ. 3 కోట్లతో దొరికిన ఇద్దరు వ్యక్తులను విడిపించేందుకు బీజేపీ నాయకుడు అశోక్ మోంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారని చెప్పారు. తాను అమిత్ షా తరపున వచ్చానని, పట్టుబడ్డిన డబ్బు బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం నుంచి లక్నో బీజేపీ ఆఫీసుకు చేరాల్సివుందని మోంగా చెప్పినట్టు సూర్జివాలా తెలిపారు. ఛాయ్ కూడా డిజిటల్ పేమెంట్ ద్వారా కొనుక్కోవాలని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ కార్యాలయానికి పెద్ద మొత్తంలో నగదు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. మీకు నగదు లావాదేవీలు వర్తించవా అని అడిగారు. -
'స్మృతి ఇరానీ... ఈగో పక్కనపెట్టు'
న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ కారణమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. స్మృతి అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా ధ్వజమెత్తారు. అహం తగ్గించుకుని, తన శాఖపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. 'అధికారంలో ఉన్నవారికి అహం పనికిరాదు. పాలకులకు ఈగో పెద్ద శత్రువు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడం మానేసి తన శాఖపై దృష్టి పెట్టాలని స్మృతి ఇరానీని సవియనంగా కోరుతున్నామ'ని రణదీప్ సూర్జివాలా పేర్కొన్నారు. ఇరాని బాగా చదువుకున్నారని, అయితే అన్ని యూనివర్సిటీల నుంచి ఆమె పట్టాలు ఎలా సాధించారో తెలియడం లేదని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది, స్మృతి ఇరానీ మధ్య ట్విటర్ లో మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. -
మీ వల్లే మాల్యా స్వేచ్ఛగా పారిపోయాడు!
న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసి.. ప్రస్తుతం విదేశాల్లో తిష్టవేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యవహారంలో నరేంద్రమోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు ముందుగానే ఉప్పందించి, అనుమతించడం వల్లే విజయ్ మల్యా దర్జాగా దేశం నుంచి పారిపోయి, బ్రిటన్‌లో నివాసముంటున్నాడని కాంగ్రెస్ పార్టీ నేత రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో దావానలాన్ని అణచడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. దేశంలోనే అతిపెద్ద పర్యావరణ విపత్తు అయిన ఈ కార్చిచ్చును ఆర్పడంలో మోదీ సర్కార్ సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. -
అమెరికా వెళ్లిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అమెరికా వెళ్లారు. రెగ్యులర్ వైద్య పరీక్షల కోసం ఆమె అమెరికా వెళ్లారని, వారం రోజుల్లో తిరిగొస్తారని కాంగ్రెస్ పార్టీ సోమవారం వెల్లడించింది. 'రెగ్యులర్, రొటీన్ చెకప్ కోసమే సోనియా గాంధీ అమెరికా వెళ్లారు. వారం రోజుల్లో తిరిగొస్తారు' అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా తెలిపారు. 68 ఏళ్ల సోనియా రెండు నెలల క్రితమే అమెరికాకు వెళ్లాల్సివుందని, బిహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆమె వెళ్లలేకపోయారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బిహార్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అమెరికా వెళ్లారని తెలిపాయి. -
'షారూఖ్ ను ఎందుకు ప్రశ్నించారు?'
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ పాలనలో పెరిగిపోతున్న మత అసహనంపై మాట్లాడినందుకే బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) టార్గెట్ చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఆర్ఎస్పీఎల్) షేర్లను మారిషస్‌కు చెందిన జై మెహతా కంపెనీకి అమ్మడంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో షారూఖ్ ను మంగళవారం ఈడీ ప్రశ్నించింది. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా ట్విటర్ లో స్పందించారు. 'దీపావళి రోజున షారూఖ్ ను ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ప్రశ్నించారా లేక మనసులో ఉన్నది ఆయన మాట్లాడారని టార్గెట్ చేశారా? ప్రభుత్వ ప్రతీకారం చర్యలకు ఈడీ కొత్త ఆయుధంగా మారిందా?' అని ఆయన ప్రశ్నించారు. దేశంలో సీనియర్ మోస్ట్ సీఎం అయిన హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పట్ల కూడా ఈడీ అనుచితంగా ప్రవర్తించిందని ఆరోపించారు. వీరభద్ర సింగ్ కుమార్తె వివాహం జరిగిన మరుసటి రోజే ఆయన నివాసంలో ఈడీ సోదాలు చేసిందని గుర్తు చేశారు. Shah Rukh questioned by ED on Diwali. Is it for Forex violation or for speaking from his heart? Is ED the new Revenge Settlement Authority? — Randeep S Surjewala (@rssurjewala) November 11, 2015 -
శత్రుఘ్నతో కాంగ్రెస్ కీలక నేత భేటీ
న్యూఢిల్లీ: బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శత్రుఘ్నసిన్హాను కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. బాలీవుడ్ షాట్‌గన్ శత్రుఘ్నసిన్హా గత కొన్నాళ్లుగా బీజేపీకి దూరం జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సుర్జేవాలా సోమవారం శత్రుఘ్న నివాసానికి ఆయనతో భేటీ అయ్యారు. వీరి భేటీ అనంతరం సుర్జేవాలా స్పందిస్తూ.. తమది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ అని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని పేర్కొన్నారు. 'శత్రుఘ్నసిన్హా అంటే నాకు ఎంతో గౌరవం. ప్రతి వ్యక్తిగత అనుబంధాన్ని రాజకీయ కోణంలో చూడరాదు. దీనిని మీడియా మిత్రులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా' అని సుర్జేవాలా ట్విట్టర్లో పేర్కొన్నారు. చిత్రరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శత్రుఘ్నసిన్హా బీహార్ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. అయినప్పటికీ ఆయన ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారంలో పాలుపంచుకోవడం లేదు. ఇందుకు కారణాలు తెలియజేస్తూ.. తాను పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నట్టు ట్విట్టర్లో తెలిపారు. -
'మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపాలి'
న్యూఢిల్లీ: దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆలస్యంగా స్పందించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. మాటలు కట్టిపెట్టి పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించింది. మోదీ మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారని ఎద్దేవా చేసింది. ఆయన దేశానికి ప్రధానమంత్రి అన్న సంగతి మర్చిపోతున్నారని విమర్శించింది. 125 కోట్ల మందిని కాపాడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది. దాద్రి ఘటన జరిగిన తర్వాత యూపీ సీఎంతో ప్రధాని మాట్లాడారా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా పశ్నించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, సంజీవ్ బల్యాన్, బీజేపీ నాయకులు సంగీత్ సోమ్ తదితరులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్పిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు. -
'టైగర్ మెమన్ ను తీసుకొస్తేనే...'
న్యూఢిల్లీ: ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ కు సుప్రీంకోర్టు ఉరి శిక్ష ఖరారు చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. మెమన్ ఉరిశిక్ష విధించడంతో బాంబు పేలుళ్ల బాధితులకు పాక్షిక న్యాయం జరిగిందని పేర్కొంది. పాకిస్థాన్ కు పారిపోయిన యాకూబ్ సోదరుడు టైగర్ మెమన్ ను ప్రభుత్వం వెనక్కు తీసుకొచ్చినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా వ్యాఖ్యానించారు. తనకు విధించిన ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలని యాకూబ్ మెమన్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. -
'లలిత్ గేట్' ఆధారాలన్నీ బయటపెట్టాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ... బీజేపీ మంత్రి కుటుంబ సభ్యుడొకరికి ఉద్యోగం ఇవ్వజూపారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుజ్రీవాలా డిమాండ్ చేశారు. 'లలిత్ గేట్'లో ఆధారాలన్నీ ప్రజల ముందు పెట్టాలన్నారు. లలిత్ మోదీ ఏవిధంగా విదేశాలకు పారిపోయారో, ఆయనకు ఎవరెవరూ సహకరించారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాజాగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని లలిత్ మోదీ వివాదంలోకి లాగారు. -
దావూద్ ఇబ్రహీంకు సహాయం చేస్తారా?
న్యూఢిల్లీ: అభ్యర్థిస్తే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సహాయం చేస్తారా అని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. వాంటెడ్ జాబితాలో ఉన్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీకి మానవతా దృక్పథంతోనే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేశారని బీజేపీ వెనకేసుకురావడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. మోడీకి మోదీ సాయం చేస్తున్నట్టుగా కనబడుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుజ్రీవాలా ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లలిత్ మోడీ సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. పలువురు బీజేపీ నాయకులతోనూ లలిత్ కు సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఇటీవలే గుజరాత్ లో రూ.1000 కోట్ల అక్రమ బెట్టింగ్ రాకెట్ వెలుగు చూసిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. మానవతా కోణంలో లలిత్ మోడీకి సహాయం చేశామని బీజేపీ సమర్థించుకోవడాన్ని తప్పుపట్టారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు దేశం విడిచి పారిపోయేందుకు సహకరించడమే మోదీ ప్రభుత్వ విధానం అన్నట్టుగా కమలనాథులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
పెట్రో పెంపు... మోదీ సర్కార్ గిఫ్ట్: కాంగ్రెస్
న్యూఢిల్లీ: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు నరేంద్ర మోదీ సర్కారు వార్షిక బహుమతి అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఏడాది కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా ఎన్డీఏ సర్కారు ఈ కానుక ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్పీఎన్ సింగ్ ఎద్దేవా చేశారు. 5 రోజులకొకసారి పెట్రోల్ ధరలు పెంచడంతో పాటు నాలుగు పర్యాయాలు కస్టమ్స్, ఎక్సైజ్ సుంకం పెంచిందని దీని ద్వారా 90 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చాయని కాంగ్రెస్ పార్టీ సమాచార విభాగం అధ్యక్షుడు రణదీప్ సుర్జీవాలా తెలిపారు. పెంచిన కస్టమ్స్, ఎక్సైజ్ సుంకం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోలుపై లీటరుకు రూ. 3.13, డీజిల్‌పై లీటరుకు రూ. 2.71చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. -
గవర్నర్లను కొనసాగించాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: తమ హయాంలో నియమించిన గవర్నర్లను ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందన్న నమ్మకాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది. తాము నియమించిన గవర్నర్లను రాజీనామా చేయమని కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ సంకీర్ణ సర్కారు కోరబోదని కాంగ్రెస్ భావిస్తోంది. గవర్నర్ పదవి రాజ్యాంబద్దమైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుజ్రీవాలా తెలిపారు. రాజ్యాంగ పదవుల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొత్త ప్రభుత్వం గౌరవించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను రాజీనామా చేయాలని కాంగ్రెస్ కోరతుందా అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. అయితే పలువురు గవర్నర్లను మోడీ సర్కారు తొలగించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. -
మోడీ, కేజ్రీవాల్ అవకాశవాదులు: కాంగ్రెస్
వారణాసి: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్.. వారణాసికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ విమర్శించింది. వారిద్దరూ పచ్చి అవకాశవాదులని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుజ్రీవాలా దుయ్యబట్టారు. తమ అభ్యర్థి అజయ్ రాయ్ స్థానికంగా ప్రజాదరణ ఉన్న నాయకుడని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రసంగంలోని ఒక లైనును పట్టుకుని ఆయనపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కాగా అజయ్ రాయ్‌కు నిశ్శబద్దంగా స్థానికులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని మరో కాంగ్రెస్ నేత మీమ్ అఫ్జల్ అన్నారు. -
నేతలకు ఎంపీలపై కంట్రోల్ లేదు: నారాయణసామి
న్యూఢిల్లీ: ‘‘రాజకీయ పార్టీల నేతలకు వారి ఎంపీలపై ఎలాంటి కంట్రోలు లేదు.. సమావేశాలు జరుగుతుంటే సభామధ్యంలోకి దూసుకొస్తారు.. నినాదాలు చేస్తారు.. సభ జరగకుండా అడ్డుకుంటారు..’’ అంటూ కేంద్రమంత్రి నారాయణ సామి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ అంశంపై కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు లోక్‌సభలో గందరగోళం సృష్టించడంతో సభ వాయిదా పడింది. ఆ వెంటనే బయటకు వచ్చిన నారాయణ సామి పార్లమెంట్ ముందు విలేకరులతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. మీ పార్టీ ఎంపీలే సభలో నినాదాలు చేశారు కదా.. అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మామూలుగా నా అభిప్రాయం చెప్పా..’’ అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలుపుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ధీమా వ్యక్తం చేశారు.